Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vakeel Saab (2021)


 


చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతి హాసన్, అంజలి, నివేత థామస్, అనన్య నగళ్ళ,  ప్రకాష్ రాజ్
దర్శకత్వం: వేణు శ్రీరామ్
నిర్మాత: దిల్ రాజు, బోనీ కపూర్
విడుదల తేది: 09.04.2021


Songs List:




మగువా మగువా మేల్ వెర్సన్ పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్





మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా

అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయట
అలుపని రవ్వంత అననే అనవంట
వెలుగులు పూస్తావు వెళ్లే దారంత

సా గమపమాగసా గమపమాగసా
గమపమాగ గమపమాగ గమనిపామస
గమపమాగసా  గమపమాగసా
గమపమాగ గమపమాగ గమనిపామస

మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా

చరణం:
నీ కాటుక కనులు విప్పారకపోతే 
ఈ భూమికి తెలవారదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే 
ఏమనుగడ కొనసాగదుగా

ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా
అంతులేని నీ శ్రమా అంచనాలకందునా
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా 
నీవులేని జగతిలో దీపమే వెలుగునా

నీదగు లాలనలో ప్రియమగు పాలనలో 
ప్రతి ఒక మగవాడు పసివాడేగా
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా 
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా

సా గమపమాగసా గమపమాగసా
గమపమాగ గమపమాగ గమనిపామస
గమపమాగసా  గమపమాగసా
గమపమాగ గమపమాగ గమనిపామస

మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా




సత్యమేవ జయతే పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్
ర్యాప్: పృధ్వీ చంద్ర





జన జనజన జనగణమున
కలగలిసిన జనం మనిషిరా
మన మన మన మనతరపున
నిలబడగల నిజం మనిషిరా

నిశి ముసిరిన కలలను తన వెలుగుతో
గెలిపించు ఘనుడురా
పడి నలిగిన బతుకులకొక
బలమగు భుజమివ్వగలడురా

వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే
ఇతనిలా ఓ గళం మన వెన్నుదన్నై పోరాడితే

సత్యమేవ జయతే సత్యమేవ జయతే
సత్యమేవ జయతే సత్యమేవ జయతే

జనజన జన జనగణమున
కలగలిసిన జనం మనిషిరా
మన మన మన మనతరపున
నిలబడగల నిజం మనిషిరా

నిశి ముసిరిన కలలను తన వెలుగుతో
గెలిపించు ఘనుడురా
పడి నలిగిన బతుకులకొక
బలమగు భుజమివ్వగలడురా

గుండెతో స్పందిస్తాడు
అండగా చెయ్యందిస్తాడు

ఇలా చెంప జారెడి ఆఖరి అశ్రువునాపెడివరకు
అనునిత్యం బలహీనులందరి ఉమ్మడి గొంతుగ
పోరాటమే తన కర్తవ్యం

వకాల్తా పుచ్చుకుని వాదించే ఈ వకీలు
పేదోళ్ళ పక్కనుండి కట్టిస్తాడు బాకీలు
బెత్తంలా చుర్రుమని కక్కిస్తాడు నిజాలు
మొత్తంగా న్యాయానికి పెట్టిస్తాడు దండాలు

ఇట్టాంటి ఒక్కడుంటే అంతే చాలంతే
గొంతెత్తి ప్రశించాడో అంతా నిశ్చింతే
ఇట్టాంటి అన్యాయాలు తలెత్తవంతే
నోరెత్తే మోసగాళ్ళ పత్తా గల్లంతే

సత్యమేవ జయతే సత్యమేవ జయతే
సత్యమేవజయతే సత్యమేవ జయతే
సత్యమేవ జయతే





కంటిపాప కంటిపాప పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అర్మాన్ మాలిక్, దీపు, థమన్, గీతా మాధురి, సాహితి, శృతి రంజని, హారిక నారాయణ్, శ్రీనిధి, యమ్. ఎల్. గాయత్రి, నారాయణ నయ్యర్, శృతి యమ్. ఎల్





కంటి పాప కంటి పాప చెప్పనైన లేదే
నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా
కాలి మువ్వ కాలి మువ్వ సవ్వడైన లేదే
నువ్విన్నిన్నాల్లుగా వెంట తిరుగుతున్నా

నీ రాక ఏరువాక నీ చూపే ప్రేమ లేఖ
నీలో నువ్వాగిపొక కలిశావే కాంతి రేఖ
అంతులేని ప్రేమనువ్వై ఇంత దూరం వచ్చినాక
అందమైన భారమంత నాకు పంచినాక

మొదలేగా కొత్త కొత్త కథలు
మొదలేగా కొత్త కొత్త కలలు
ఇకపైన నువ్వు నేను బదులు
మనమన్న కొత్త మాట మొదలు

కంటి పాప కంటి పాప చెప్పనైన లేదే
నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా

సాప మాప మాప మాగ సామగారిస (2)

సుధతి సుమలోచని సుమనోహర హాసిని
రమణీ ప్రియ భాషిని కరుణగుణ బాసిని
మనసైన వాడిని మనువాడిన ఆమని
బదులీయ్యవే చెలి నువ్వు పొందిన ప్రేమని
పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా

సాప మాప మాప మాగ సామగారిస (2)

ఎదలో ఏకాంతము ఏమైందో ఏమిటో
ఇదిగో నీ రాకతో వెళిపోయింది ఎటో
నాలో మరో నన్ను చూశా నీకు స్నేహితున్ని చేశా
కాలం కాగితాలపై జంట పేర్లుగా నిన్ను నన్ను రాశా
ఆకాశం గొడుగు నీడ పుడమేగా పూల మేడ
ఏ చూపులు వాలకుండ ప్రేమే మన కోట గోడ
నాకు నువ్వై నీకు నేనై ఏ క్షణాన్ని వదలకుండ
గురుతు లెన్నో పెంచుకుందాం గుండె చోటు నిండా

మొదలేగా కొత్త కొత్త కథలు
మొదలేగా కొత్త కొత్త కలలు
ఇకపైన నువ్వు నేను బదులు
మనమన్న కొత్త మాట మొదలు

మొదలేగా కొత్త కొత్త కథలు
మొదలేగా కొత్త కొత్త కలలు
ఇకపైన నువ్వు నేను బదులు
మనమన్న కొత్త మాట మొదలు





కదులు కదులు పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శ్రీకృష్ణ , వేదాల హేమచంద్ర





కదులు కదులు కదులు
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు

కాలం తన కళ్ళు తెరిచి గాలిస్తున్నది నీలో
కాళిక ఏమైందని ఉగ్రజ్వాలిక ఏమైందని
దెబ్బకొడితే పులిని నేను ఆడదాన్ననుకున్నా
తోక తొక్కితే నాగు తనను ఆడదనుకుంటుందా

ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ

కదులు కదులు కదులు
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు

గాజుతో గాయాలు చెయ్
చున్నీనే ఉరి తాడు చెయ్ 
రంగులు పెట్టే గోళ్ళునే గుచ్చే బాకులు చెయ్
పిరికితనం ఆవహించి పరిగెత్తే నీ కాళ్ళతో
రెండు తొడల మధ్య తన్ని
నరకం పరిచయం చెయ్

నీ శరీరమే నీకూ ఆయుధ కర్మాగారం
బతుకు సమర భూమిలో నీకు నీవే సైన్యం 
సైన్యం సైన్యం

ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ

కదులు కదులు కదులు
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు





మగువా మగువా ఫీమేల్ వెర్సన్ పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మోహన భోగరాజు





మగువా మగువా 
నీ మనసుకు లేదా ఏ విలువా

ఆకాశం తాకే నీ ఆక్రదనాలు
మనసారా వినువారేవారు
నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు
సవరించే మనవారేవారు
కళా మారుతున్న జీవితం కలతలోకి జారేన
కలలుగన్న కనులకు నీటిచెమ్మ తగిలేనా
వెళుతురైన ప్రతిదినం చుపుతోంద వేదన
అందమైన బతుకున అలజడి చెలరేగెనా

ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం
చీకటి ముసిరిందే చిటికలోనే
తీరదు నీ శోకం మారదు ఈ లోకం
తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా

మగువా మగువ
నీ మనసుకు లేదా ఏ విలువ
మగువ మగువ
నీ తలరాతలో చిరునవ్వులు కలవా

అలుసుగా చూస్తారు లోకువ చేస్తారు
అనాది కాలంగా అబలవే నువ్వు
నిందలు వేస్తారు నిను వెలివేస్తారు
ఆడదిగా నువ్వు పొరబడి పుట్టవు

మగువ మగువ
నీ మనసుకు లేదా ఏ విలువ
మగువ మగువ
నీ తలరాతలో చిరునవ్వులు కలవా

No comments

Most Recent

Default