-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non-Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: సుబ్రహ్మణ్య పురం (2018)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
గానం: అనురాగ్ కులకర్ణి, నూతన మోహన్
నటీనటులు: సుమంత్, ఇషా రెబ్బ
దర్శకత్వం: సంతోష్ జగర్లపూడి
నిర్మాతలు: ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డి
విడుదల తేది: 07.12.2018

ఈరోజిలా  ఈరోజిలా
ఏరోజు లేనంత హాయే ఇలా
ఈ రోజులా ప్రతి రోజిలా
కావాలి అంటోంది నా మనసిలా
నీ చూపు బాణాలు ప్రాణాలు తీస్తుంటే
నీ నవ్వు ఊపిరిని పోస్తోందిలే

అలలే లే లే లే ఆకాశమే తాకెనులే
అలలా దూకేలే నీవల్లే కలలే
అలలే లే లే లే ఆనందమే పొంగెనులే
అల్లరి చేసేలే నీవల్లే కనులే

ఈరోజిలా ఈరోజిలా
ఏరోజు లేనంత హాయే ఇలా
ఈ రోజులా ప్రతి రోజిలా
కావాలి అంటోంది నా మనసిలా

నాలోని ప్రేమంతా నీ పైన దూకేలా
ఓ వర్షపాతంలా మారిందిలా
నా ముందు దారంతా నీతోటి నిండేలా
ఓ పూలతోటై మారి చూస్తూ ఉందిలా
ఇన్నాళ్లు నాకునేనా ఇపుడేమో నువ్వయ్యాన
నా  చిన్ని గుండెలోన నువ్వే వాలగా

అలలే లే లే లే ఆకాశమే తాకెనులే
అలలా దూకేలే నీవల్లే కలలే
అలలే లే లే లే ఆనందమే పొంగెనులే
అల్లరి చేసేలే నీ వల్లే కనులే

ఈరోజిలా  ఈరోజిలా
ఏరోజు లేనంత హాయే ఇలా
ఈ రోజులా ప్రతి రోజిలా
కావాలి అంటోంది నా మనసిలా

నా మనసు నాతోనే ఉండేది ఇన్నాళ్లు
ఉండుండి నీతోనే వచ్చిందిలే
నీ ప్రేమ మైకంలో కమ్మింది కాబోలు
కాబట్టి దూరాలన్ని చెరిపేసిందిలే హో
నేనేమో నేను కాదు ఈ చిత్రం కలేం కాదు
నువు నాలో సగం కాదు పూర్తిగ నిండిపో

అలలే లే లే లే ఆకాశమే తాకెనులే
అలలా దూకేలే నీవల్లే కలలే
అలలే లే లే లే ఆనందమే పొంగెనులే
అల్లరి చేసేలే నీ వల్లే కనులే

ఈరోజిలా  ఈరోజిలా
ఏరోజు లేనంత హాయే ఇలా
ఈ రోజులా ప్రతి రోజిలా
కావాలి అంటోంది నా మనసిలా

No comments

Most Recent

Default