Home Movies / Albums Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Baahubali 1: The Begining (2015)
చిత్రం: బాహుబలి (2015)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ
దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాత: సోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
విడుదల తేది: 10.07.2015చిత్రం: బాహుబలి (2015)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: మోహన భోగరాజు, రేవంత్

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా...
కొరుక్కుపో నీ తనివి తీరా తీరా...
తొణక్క బెణక్క వయసు తెరల్ని తీయ్ రా తీయ్ రా
ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చేయ్ రా చేయ్ రా

మనోహరి... మనోహరి...
తేనిలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా
మాటలన్ని మత్తు గున్నవే
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి
వెంటపడితే వింతగున్నదే
ఒళ్ళంతా తుల్లింత ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా...
కొరుక్కుపో నీ తనివి తీరా తీరా...

చేప కన్నుల్లోని కైపులు నీకిచ్చెయ్నా
నాటు కోడవల్లాంటి నడుమే రాసిచ్చెయ్నా
నీ కండల కొండలపైన కైదండలు వేసేయన
నాపై యెద సంపదనే ఇక నీ శయ్యగ చేసేయన
సుఖించగా రా...

ఆఁ... మనోహరి... మనోహరి…
పువ్వులన్నీ చుట్టూ ముట్టి తేనేజల్లుతుంటే
కొట్టుకుంది గుండె తుమ్మె దై
ఒళ్ళంతా తుల్లింత ఈ వింత కవ్వింత లేలా బాల

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా...
కొరుక్కుపో నీ తనివి తీరా తీరా...చిత్రం: బాహుబలి (2015)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: కార్తిక్, దామిని

పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడ నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా

వేయి జన్మాల ఆరాటమై
వేచి వున్నానే నీ ముందరా
చేయి నీ చేతిలో చేరగా
రెక్క విప్పిందె నా తొందరా

పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా

మాయగా నీ సోయగాలాలు వేసి
నన్నిలా లాగింది నువ్వే ... హలా!

కబురులతో... కాలాన్ని ...
కరిగించే వ్రతమేనా?
హత్తుకుపో నను ఊపిరి ఆగేలా

బాహు బంధాల పొత్తిళ్ళలో
విచ్చుకున్నావే ఓ మల్లికా
కోడె కౌగిళ్ళ ఒత్తిళ్ళలో
పురి విప్పింది నా కోరికా

పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా

కానలో నువు నేను ఒక మేను కాగా
కోనలో ప్రతి కొమ్మ మురిసేనుగా

మరుక్షణమే ఎదురైనా
మరణము కూడా పరవశమే
సాంతము నే నీ సొంతము అయ్యాకా

చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో
చిందులేసింది సిరి వెన్నెలా
ప్రేమ ఊరేటి నీ కళ్ళలో
రేయి కరిగింది తెలి మంచులా

పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో
పచ్చిప్రాయాలనే పంచుకుంటానురా
జంట కట్టేసిన తుంటరోడ నీతో
కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరాచిత్రం: బాహుబలి (2015)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, శివశక్తి దత్తా
గానం: రమ్యా బెహ్రా, దీపు

హు నన హూన్నన హూన్నన హూన్నన నచ్చానా
హు నన హూన్నన హూన్నన హూన్నన అంతగానా
అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా
అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా

ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీరా

అలసినా … సొలసినా …
ఒడిలో నిన్ను లాలించనా
అడుగునై నడుపనా
నీ జంట పయనించనా
పడి పడి తల పడి వడి వడి త్వర పడి
వస్తున్నా ఎదేమైనా
సిగముడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని
జటాఝూటంలా
ఢీకొని సవాలని
తెగించి నీవైపు దూసుకొస్తున్నా

ఉత్ క్రమ అసమ శౌర్యథామ
ప్రోద్గమ తవ భీతిర్మా …
ఉత్ క్రమ అసమ శౌర్యథామ
ప్రోద్గమ తవ భీతిర్మా …

నిలవనా ఎదగరా
నిను రమ్మంది నా తొందరా
కదలికే కదనమై
గగనానికెదురీదరా

విజిత రిపు రుధిర ధార
కలిత అసిధర కఠోర
కుల కుధర తులిత గంభీరా
జయ విరాట్వీరా
విలయ గగన తల భీకరా
గర్జత్ ధారాధర
హృదయ రస కాసారా
విజిత మధు పారావారా
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి

భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి

భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి

భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి

భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి

ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీరా


(భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి)

ధీవర …
ధీవర …
ప్రసర శౌర్య ధార
దరికి చేరరార
ఉత్సర
సుందర
స్థిర గంభీరా
చెలి నీదేరా …చిత్రం: బాహుబలి (2015)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: సూర్య యామిని

మమతల తల్లి
ఒడి బాహుబలి
లాలన తేలి
శతధావఱలి
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్ధలి
మాహిష్మతి వరక్షాత్రకులి
జిత శాత్రవ బాహుబలి
సాహస విక్రమ ధీశాలి
రణతంత్ర కళాకుశలి
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్ధలి
వేచిందా ఖండించే ఖడ్గం
తోసిందా ఛేదించే బాణమ్
చెదరంది ఆ దృఢసంకల్పం
తానే సేనై తోచే
తల్లే తన గురువు దైవం
కల్ల తోనే సహవాసం
ధ్యేయం అందరి సంక్షేమం
రాజ్యం రాజు తానే ఓ...ఓ...
శాసన సమం
శివగామి వచనం
సదసద్రణరంగం ఇరణమ్
జననీ హృదయం
ఎదలో ఒక పాల్కడలి
మథనమ్ జరిగే స్ధలిచిత్రం: బాహుబలి (2015)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: సూర్య యామిని

నిప్పులే శ్వాసగా
గుండెలో ఆశగా
తరతరాల ఎదురు చూపులో
ఆవిరైన నీ కన్నీళ్ళు
ఆనవాళ్ళు ఈ సంకెళ్ళూ
రాజ్యమా ... ఉలికిపడు
మాహిష్మతీ సామ్రాజ్యం
అస్వాదం అజేయం
ఆ సూర్య చంద్ర తారామ్
వర్ధకామ్
అభివర్ధకామ్

దుర్భేధ్యమ్ దుర్నిరిక్షమ్
సర్వ శత్రు భయంకరమ్
అశ్వత్ చ్ఛతురంగ సైన్యమ్
విజయదామ్ దిగ్విజయదాo
ఏకద్దుర దిగమ దుర్గే
పతతే యస్య వీక్షణమ్
అస్య శీర్షమ్ ఖడ్గ చ్ఛిన్హమ్
పతతామ్ రణభూతలే
మాహిష్మతీ గగన సీమే
విరాజభేద్ నిరంతరమ్

అశ్వద్వయ ఆదిత్యాన్విత
స్వర్ణ సింహాసన ధ్వజమ్Most Recent

Default