-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Mohana Bhogaraju"



పాట: మల్లె రాజా (2023)
సంగీతం: దేసి రూట్స్ (Desi Routz)
రచన: రేలారే ప్రసాద్ 
గానం: మోహన భోగరాజు 
ఆర్టిస్ట్స్: మోహన భోగరాజు 
కొరియోగ్రాఫర్: సాయి ఆకుల  (Dhee)
విడుదల: 31.05.2023


మల్లె రాజా పాట సాహిత్యం

 

పాట: మల్లె రాజా (2023)
సంగీతం: దేసి రూట్స్ (Desi Routz)
రచన: రేలారే ప్రసాద్ 
గానం: మోహన భోగరాజు 

ఎన్నెలోచ్చి మల్లెలోన దాగినట్టు 
ఈ పడుచుపిల్ల కొప్పులోన రాసినట్టు 
నీ మాట విన్న మల్లెలన్ని విరిసినట్టు 
ఈ చిన్నదాని చూపులనే లాగినట్టు 

మల్లె రాజా… 
మల్లె రాజా మత్తుమందు ఏదో చల్లినావు
మల్లె రాజా మస్తు  గమ్మత్తేదోజేసినావు
మల్లె రాజా అల్లరేదోజేసి మరిగినావు 
మల్లె రాజా మాయజేసి నన్ను గుంజినావు 

చెట్టుమీద కోయిలమ్మ వాలినట్టు 
ఈ చెట్టుకింద నీవు పాట పాడినట్టు 
అరె చెట్టుమీద కోయిలమ్మ వాలినట్టు 
ఈ చెట్టుకింద నీవు పాట పాడినట్టు 
గట్టుకింద లేడిపిల్ల దుంకినట్టు
ఆ గట్టుకింద ఈటిల్ల ఆడినట్టు 

మల్లె రాజా… 
మల్లె రాజా మత్తుమందు ఏదో చల్లినావు
మల్లె రాజా మస్తు గమ్మత్తేదోజేసినావు
మల్లె రాజా అల్లరేదోజేసి మరిగినావు 
మల్లె రాజా మాయజేసి నన్ను గుంజినావు 

ఊరంచు బాటల్లో ఎగసినట్టు 
నాకోసమే నువ్వు ఎదురు చూసినట్టు 
ఊరంచు బాటల్లో ఎగసినట్టు 
నాకోసమే నువ్వు ఎదురు చూసినట్టు 
నాకాలకి పట్టెలు తెచ్చినట్టు గా పట్టేలకే అందమొచ్చినట్టు

మల్లె రాజా… 
మల్లె రాజా మత్తుమందు ఏదో చల్లినావు
మల్లె రాజా మస్తు గమ్మత్తేదోజేసినావు
మల్లె రాజా అల్లరేదోజేసి మరిగినావు 
మల్లె రాజా మాయజేసి నన్ను గుంజినావు 

సెలకల్లో కైకలకి ఓయినట్టు
నువ్వు దుక్కుదున్ను ఎడ్లుగట్టి వచ్చినట్టు 
సెలకల్లో కైకలకి ఓయినట్టు
నువ్వు దుక్కుదున్ను ఎడ్లుగట్టి వచ్చినట్టు 
వానసినుకులొక్కసారి కురిసినట్టు 
గా మట్టివాసనోలె ప్రేమ పరిసినట్టు 

మల్లె రాజా… 
మల్లె రాజా మత్తుమందు ఏదో చల్లినావు
మల్లె రాజా మస్తు గమ్మత్తేదోజేసినావు
మల్లె రాజా అల్లరేదోజేసి మరిగినావు 
మల్లె రాజా మాయజేసి నన్ను గుంజినావు 

Palli Balakrishna Tuesday, June 6, 2023





పాట: బుల్లెట్ బండి (2021)
సంగీతం: SK బాజీ
సాహిత్యం: లక్ష్మణ్
గానం: మోహన భోగరాజు


బుల్లెట్ బండి సాహిత్యం

 
పాట: బుల్లెట్ బండి (2021)
సంగీతం: SK బాజీ
సాహిత్యం: లక్ష్మణ్
గానం: మోహన భోగరాజు

నే పట్టుచీరనే గట్టుకున్నా
గట్టుకున్నుల్లో గట్టుకున్నా
టిక్కీ బొట్టే పెట్టుకున్నా
పెట్టుకున్నుల్లో పెట్టుకున్నా
నడుముకి వడ్డాణం జుట్టుకున్నా
జుట్టుకునుల్లో జుట్టుకున్నా
దిష్ట సుక్కనే దిద్దుకున్నా
దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా
పెళ్ళికూతురు ముస్తాబురో
నువ్వు యేడంగా వస్తావురో
చెయ్యి నీ చేతికిస్తానురో
అడుగు నీ అడుగులేస్తానురో
నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా
ఇట్టే వస్తారా నీ వెంటా
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని
అందాల దునియానే సూపిత్తప్పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని
అందాల దునియానే సూపిత్తప్పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని

చెరువు కట్టపొంటి చేమంతివనం
బంతివనం, చేమంతివనం
చేమంతులు దెంపి దండ అల్లుకున్నా
అల్లుకున్నుల్లో ఆల్లుకున్నా
మా ఊరు వాగంచున మల్లేవనం
మల్లేవనములో మల్లేవనం
మా మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా
నింపుకున్నుల్లో నింపుకున్నా
నువ్వు నన్నేలుకున్నావురో
దండ మెళోన యేస్తానురో
నేను నీ ఏలువట్టుకోని
మల్లె జల్లోన ఎడతనురో
మంచి మర్యాదలు తెలిసినదాన్ని
మట్టి మనుషుల్లోనా వెరిగినదాన్ని
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని
అందాల దునియానే సూపిత్తప్పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని
బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని
అందాల దునియానే సూపిత్తప్పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని

నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో
పిల్లనయ్యో, ఆడపిల్లనయ్యో
మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో
ప్రేమనయ్యో,నేను ప్రేమనయ్యో
ఏడు గడపలల్లో ఒక్కదాన్ని రయ్యో
దాన్నిరయ్యో, ఒక్కదాన్ని రయ్యో
మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో
ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో
పండు ఎన్నల్లో ఎత్తుకొని
ఎన్న ముద్దలు పెట్టుకొని
ఎన్ని మారాలు జేస్తు ఉన్నా
నన్ను గారాలు జేసుకొని
చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను
నీ చేతికిస్తరా నన్నేరా నేను
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని
అందాల దునియానే సూపిత్తప్పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని
అందాల దునియానే సూపిత్తప్పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని

నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంకా
వెట్టినంకుల్లో  వెట్టినంకా
సిరిసంపద సంబురం గల్గునింకా
గలునింకులో గలునింకా
నిన్ను గన్నోల్లే కన్నోల్లు అనుకుంటా
అనుకుంటుల్లో అనుకుంటా
నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా
పంచుకుంటుల్లో పంచుకుంటా
సుక్క పొద్దుకే నిద్రలేసి, సుక్కలా ముగ్గులాకిట్లేసి
సుక్కలే నిన్ను నన్ను చూసి
మురిసిపోయేలా నీతో కలిసి
నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా
నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగాని
అందాల దునియానే సూపిత్తప్పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని
అందాల దునియానే సూపిత్తప్పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని

Palli Balakrishna Monday, July 26, 2021

Most Recent

Default