చిత్రం: పదండి ముందుకు (1962) సంగీతం: ఎస్.పి.కోదండపాణి సాహిత్యం: శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, జగ్గయ్య గానం: ఎ.పి.కోమల,ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, శిష్ట్లా జానకి, పులపాక సుశీల, మహమ్మద్ రఫీ నటీనటులు: జగ్గయ్య, జమున, గుమ్మడి, జి.వరలక్ష్మి, ఘట్టమనేని కృష్ణ, హేమలత దర్శకత్వం: వి.మధుసూధనరావు నిర్మాత: తుమ్మల కృష్ణమూర్తి విడుదల తేది: 26.01.1962
ఎల్వీ ప్రసాద్ తీయబోయిన కొడుకులు కోడళ్ళు సినిమా ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘట్టమనేని కృష్ణని ఈ సినిమాలో చిన్న పాత్రకు తీసుకున్నారు. అనంతరకాలంలో సూపర్ స్టార్ అయిన కృష్ణకు తొలి చిత్రం ఇదే
Search Box
చిత్రం: మంచివాడు (1974) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, కాంచన దర్శకత్వం: వి.మధుసూదనరావు నిర్మాత: టి.గోవిందరాజన్ విడుదల తేది: 21.02.1974
Songs List:
ఆకలుండదు పాట సాహిత్యం
చిత్రం: మంచివాడు (1974) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల ఆకలుండదు – దాహముండదు నిన్ను చూస్తుంటే వేరే ఆశ వుండదు ధ్యాస వుండదు నువ్వు తోడుంటే మల్లెలుండవు - వెన్నెలుండదు నీ నవ్వే లేకుంటే మనసువుండదు—మమతవుండదు నీ మనిషిని కాకుంటె వయసులో యీ పోరు వుండదు నీ వలపే లేకుంటే వలపు యింత వెచ్చగుండదు నీ ఒడిలో కాకుంటే పొద్దు గడచేపోతుంది - నీ నడక చూస్తుంటే ఆ నడక తడబడిపోతుంది - నీ చూపుపడుతుంటే ఆకుమడుపులు అందిస్తు నువ్వు వగలు పోతుంటె ఎంత యెరుపో అంత వలపని - నే నాశపడుతుంటె తేనెకన్న తీపికలదని - నీ పెదవే తెలిపింది దానికన్న తియ్యనై నది నీ ఎదలో దాగుంది మొదటి రేయికి తుదేలేదని నీ ముద్దే కొసరింది పొద్ధుచాలని ముద్దులన్ని నీ వద్ధేదాచింది ఆ ముద్రే మిగిలింది
చిట్టి పాపలు కథలువింటూ పాట సాహిత్యం
చిత్రం: మంచివాడు (1974) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల చిట్టి పాపలు కథలువింటూ నిదురపోతారు నిదురపోతూ కమ్మకమ్మని కలలు కంటారు కథలుచెప్పే అమ్మనాన్నలు నిదురపోలేరు చెప్పలేని కథల వ్యధతో మేలుకుంటారు చిట్టిరాణి పెద్దదైతే ఎలావుంటుందో రాణి కన్నిట తగినరాజు ఎక్కడున్నాడో పెళ్ళిచేసి మెట్టినింటికి ఎటుల పంపాలో అని కలలుకంటూ కలతపడుతూ మేలుకుంటారు
మాపటికొస్తావా పాట సాహిత్యం
చిత్రం: మంచివాడు (1974) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: పి.సుశీల మాపటికొస్తావా మరి రేపటికొస్తావా మాపటికొస్తే యిస్తానోయ్ యిస్తానోయ్ మల్లెపూల చెండు లిస్తానోయ్ రేపటికొస్తే మొక్కజొన్న కండె లిస్తానోయ్ ఇది పూలతోటకే వెలుగిస్తాది అది మెట్టచేనుకే సిరులిస్తాది ఇది వాసన చూస్తేనే మత్తెక్కిస్తాది అది చెప్పలేని రుచులిస్తాది కొత్తరుచులిస్తాది హైరా మామా - మనసైనా మామా తమాషాగ రమ్మంటె తళుక్కుమంటావేమో ఎగతాళికి నేనంటే ఎంటపడతావేమో నాచుట్టు రక్కెస ముళ్ళున్నాయ్ కోడెతాచు కోరలున్నాయ్ వాటిని తెలుసుకొని - వైనం చూసుకొని చివరికి ననుచేరుకుంటే జాజులు మోజులు నీకేనోయ్ నవ్వులు పువ్వులు నీకేనోయ్
అమ్మాయే పుడుతుంది పాట సాహిత్యం
చిత్రం: మంచివాడు (1974) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల అమ్మాయే పుడుతుంది - అచ్చం అమ్మలాగే వుంటుంది అబ్బాయే పుడతాడు - అచ్చం నాన్నలాగే వుంటాడు కోటేరులాంటి ముక్కు కోలకళ్లు...లేత కొబ్బరంటి చెక్కిళ్లు చిలిపి నవ్వులు ఆ నవ్వుల్లో వస్తాయి. చిన్ని నొక్కులు ఆ నొక్కులే తెస్తాయి—మనకెన్నో సిరులు దోబూచులాడు కళ్లు_దొంగ చూపులు తియ్య తియ్యని మాటలు - తెలివితేటలు ఆ మాటలకే పడతారు కన్నెపిల్లలు ఈ అత్తగారికప్పుడు ఎందరమ్మా కోడళ్లు నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు ఉహు—మీలాంటి పిల్లాణ్ణి కంటాను నేను ఇద్దర్నీ కంటె వద్దన్నదెవరు ఆ ఇద్దరు అబ్బాయిలైతేనొ
చూస్తా బాగా చూస్తా పాట సాహిత్యం
చిత్రం: మంచివాడు (1974) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల చూస్తా బాగా చూస్తా చేయిచూస్తా - చూసి చెబుతా ముందు వెనక యేముందో - యెక్కడుందో యెవరికెవరి కెంతుందో చూచి చెబుతా కోట్లు కోట్లుగా గడించి కూడబెట్టకు వజ్రాలుగా బంగారుగా మార్చి దాచకు రాజ్యాంగమందు నేడు రాహువున్నాడు. రాత్రిరాత్రి కొచ్చి మొత్తం మింగిపోతాడు. ఏ ఎన్ ఆర్, ఎన్ టి ఆర్ ఏలుతారన్నాను వాణిశ్రీ సావిత్రికి వారసని చెప్పాను జగ్గయ్య, జయలలిత, శోభన్ బాబు, కృష్ణకి పద్మనాభం, రమాప్రభ, రాజబాబుకి దసరాబుల్లోడికి ప్రేమనగర్ నాయుడికి ఆత్రేయ, ఆదుర్తి మహదేవన్ అందరికి ఆనాడు చెప్పింది ఈనాడు జరుగుతూంది ఈనాడు చెప్పేది రేపు జరుగబోతుంది వేలవేల యెకరాలకు గోలుమాలు తాతల యెస్టేటుకైన చెప్పాలి టాటాలు దిగమింగే నాయకులకు దిన గండాలు పన్నెగ వేసే పెద్దలకు వెలక్కాయలు. తాతయ్య పేరులో మనవళ్ళు పెరిగారు మనవళు దోచింది మునిమనవళ డిగారు అడుగునున్న వాళ్ళింక అణిగి మణిగి వుండరు ఆడోళ్ళే ఇకమీదట అందలాన వుంటారు మగవాళ్ళ ఆటకట్టి మరమ్మత్తు చేస్తారు. చిట్టి నిర్మల చేతిలో సేటు రాత రాశాడు. సంభాషణ: ఓ పండిట్ జీ మేరా హాత్ భీ దేఖియేనా దేకుతా దేరుతా అందుకే ఈనాడు చెప్పేది రేపు జరగబోతుంది ఏమోలే అనుకుంటే మీ ఖర్మలేపొండి ॥చూసా॥
ఈ రేయి కవ్వించింది పాట సాహిత్యం
చిత్రం: మంచివాడు (1974) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల ఈ రేయి కవ్వించింది నా మేను పులకించింది రా నీలో దాచుకొ నా పరువాలే పంచుకో చిలిపి మనసు నా మాట వినదు దోరవయసు ఇకఊరుకోదు మనసుమాటే విందాములే వయసు ఆటే ఆడేములే రా లోకం మరచిపో లే ముద్దులలో మురిసిపో నిండు వలపుల నీ కౌగిలింత ఉండిపోని జీవితమంతా కెంపు సొంపుల చెంపలు నావే మధువులూరే అధరాలు నావే రా…నాలో నిండిపో నా ఆశలనే పంచుకో పాలవెన్నెల కురిసేటివేళ మల్లె పానుపు పిలిచేటివేళ తనువులొకటై పెనవేసుకో కన్నులొకటై కథలల్లుకోనీ రా…ఎద పై వాలిపో నా ఒడిలోనే సోలిపో
అబ్బాయే పుట్టాడు పాట సాహిత్యం
చిత్రం: మంచివాడు (1974) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల అబ్బాయే పుట్టాడు - అచ్చం నాన్నలాగేవున్నాడు - దోబూచులాడు కళ్ళు ఇంకలేవని తీయ్య తీయన్ని బంధాలు తీరెనని తల్లిగా ననుచేసి తాను తప్పుకున్నాడు ఆ కన్నతండ్రి పోలికతో కడుపుకోసి పోయాడు
పెట్టి పుట్టిన దానవమ్మా పాట సాహిత్యం
చిత్రం: మంచివాడు (1974) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల, ఘంటసాల పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు - నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు ఎందరో నీలాంటి పాపలు పుట్టివుంటారు అందులో ఎందరమ్మా పండుగలకు నోచుకుంటారు - వుండి చూచుకుంటారు కన్నవాళ్ళు చేసుకున్న పూజాఫలమో నువ్వే జన్మలోనో దాచుకున్న పూర్వపుణ్యమో నూరు పండుగ లీలాగే చేసుకుంటావు కొందరేమో పండుగల్లె వచ్చిపోతారు నూరేళ్ళు నిండిపోతారు ఉన్నవాళ్లు లేనివాళ్ళను భేదాలు మనకెగాని మట్టిలోన లేవమ్మా ఆ మట్టిలోనే పుట్టి గిట్టే తోబుట్టులకు కన్నీటి బొట్టు కానుకిస్తే చాలమ్మా చాలమ్మా
Manchivadu (1974)
చిత్రం: మల్లె మొగ్గలు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి నటీనటులు: రాజేష్, సాగరిక దర్శకత్వం: వి.మధుసూధనరావు నిర్మాత: రామోజీ రావు విడుదల తేది: 28.03.1986
Songs List:
ఆంగికం భువనం యస్య వాచికం పాట సాహిత్యం
చిత్రం: మల్లె మొగ్గలు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి ఆంగికం భువనం యస్య వాచికం
ఏరుపక్క మా వూరమ్మా వూరుపక్క పాట సాహిత్యం
చిత్రం: మల్లె మొగ్గలు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు ఏరుపక్క మా వూరమ్మా వూరుపక్క
మందార మల్లికి శృంగార పూజలు పాట సాహిత్యం
చిత్రం: మల్లె మొగ్గలు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: వేటూరి గానం: యస్.జానకి, యస్.పి.బాలు మందార మల్లికి శృంగార పూజలు
పూర్వజన్మ సంగమం అపూర్వ ప్రేమ పాట సాహిత్యం
చిత్రం: మల్లె మొగ్గలు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: వేటూరి గానం: యస్.జానకి, యస్.పి.బాలు పూర్వజన్మ సంగమం అపూర్వ ప్రేమ
వెన్నెలా వెన్నెలా ఈ రేయి పాట సాహిత్యం
చిత్రం: మల్లె మొగ్గలు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు వెన్నెలా వెన్నెలా వెన్నెలా ఈ రేయి
యాడికే నీ పరుగు యెర్రి గంగమ్మా పాట సాహిత్యం
చిత్రం: మల్లె మొగ్గలు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు యాడికే నీ పరుగు యెర్రి గంగమ్మా
ఓ యబ్బలాలో పాట సాహిత్యం
చిత్రం: మల్లె మొగ్గలు (1986) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: వేటూరి గానం: యస్.జానకి ఓ యబ్బలాలో
Malle Moggalu (1986)
చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి, దాశరథి, ఆరుద్ర, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి) నటీనటులు: నాగేశ్వరరావు, వాణిశ్రీ, జయసుధ దర్శకత్వం: వి.మధుసూధనరావు నిర్మాత: నిడమర్తి పద్మాక్షి, యన్.పుష్పా భట్ విడుదల తేది: 14.04.1978 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు: 1.యమగోల (1977) 2. మల్లెపువ్వు (1978) 3. విచిత్ర జీవితం (1978) 4. విజయ (1979) 5. బొమ్మాబొరుసే జీవితం (1979) 6. చెయ్యెత్తి జై కొట్టు (1979) 7. జూదగాడు (1979) 8. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 9. మంగళ గౌరి (1980) ఈ తొమ్మిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )
Songs List:
నా కోసం .... ఆనందం పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: దాశరథి గానం: పి.సుశీల, యస్.పి.బాలు నా కోసం .... ఆనందం నీ కోసం .... అనురాగం మదిలో నిండిపోనీ విరిసే వయసుంది ... పిలిచే వలపుందీ విడరాని బంధం మనది నా కోసం .... ఆనందం నీ కోసం అనురాగం మదిలో నిండిపోనీ విరిసే వయసుంది పిలిచే వలపుందీ విడరాని బంధం మనది మురిపించే గాలి విరబూసే పూలు ఆటాడే కురులు వేటాడే కనులు మురిపించే గాలి నిరబూసే పూలు ఆటాడే కురులు వేటాడే కనులు నీ కౌగిట నేనుండే నీ సందిట నేనుంటే పొగమంచు పరదాలో మన మొకటె పోకుంటే తీరాలి మనలోని ఆశ కలిసిన హృదయాల కదలిన అధరాల పొంగింది మన ప్రేమ మధువు చెలి చూపుల సెగలో నులివెచ్చగ ఉంది బిగి కౌగిలిలోనే సొగసంతా ఉంది.... సిరి మల్లెల పొదరింట కలిసెనులే మన జంట నీలాల గగనాల మేఘాల పెనవేసుకోవాలి మనము కీలకిల నవ్వులతో వలపుల పువ్వులతో ముద్దాడు కోవాలి మనము ముద్దాడు
బంగినపల్లి మామిడిపండు పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల, యస్.పి.బాలు ఒలె ఒలె ఒలె బంగినపల్లి మామిడిపండు మంగినపూడి మల్లె చెండు కాపు కొచ్చింది అరెరె కన్ను కొట్టింది ఓ రబ్బడి సిబ్బయ్య ఇది పుట్టిందే నా కోసం ఎందరు కాదన్నా ఎగరేసుకుపోతా ఇది పందెం ఒలె ఒలె ఒలె సందకాడ సందమామ సందుచూసి మేనమామ తొంగి చూసాడు అరెరె.... దోచుకున్నాడు తొంగి చూశాడు అమ్మమ్మో దోచుకున్నాడు. ఓ.... రబ్బడి సిబ్బయ్య ఈడు పుట్టిందే నా కోసం ఎందరు కాదన్నా ....ఎగరేసుకు పోతేనే అందం ఎన్నాళ్ళీ పస్తులుంటే చిచ్చు కొడతాడు కొడుతుంది రెప్పచాటు చూపుతోనే రెచ్చగొడుతుంది అల్లాడి పోతుంటే.... ఇల్లేడి పిస్తుందదమ్మో అల్లాడి పోతుంటే.... ఇల్లేడి పిస్తుందమ్మో ఓ....రబ్బడి సిబ్బయ్య ఇది పుట్టిందే నా కోసం ఎందరు కాదన్నా ఎగరేసుకు పోతా ఇది పందెం ఒలే ఒలే ఒలె సందకాడ చందమామ సందుచూసి మేనమామ తొంగి చూసాడు అమ్మమ్మో దోచుకున్నాడు ముద్దంటే పొద్దువాల నివ్వమంటుంది పొద్దువాలి పోగానే నిద్దరంటుంది అందాలు పక్కేసి ఆరాట పెడుతుందమ్మో ఓ రబ్బడి సిబ్బయ్య ఇది పుట్టిందే నా కోసం ఎందరు కాదన్నా ఎగరేసుకుపోతా ఇది పందెం పూతరేకు కోక మడత విప్పమంటాడు పూల పల్లకి ఎక్కమంటూ పోరు పెడతాడు కల్లోకి వస్తుంటాడు కాటేసి పోతుంటాడు. ఓ రబ్బడి సిబ్బయ్య ఈడు పుట్టిందే నాకోసం ఎందరు కాదన్నా ఎగరేసుకు పోతేనే అందం ఒలే ఒలే ఒలె బంగినపలి మామిడిపండు మంగినపూడీ మల్లెచెండు కాపుకొచ్చింది అరెరె..... కన్నుకొట్టింది సందకాడ చందమామ సందుచూసి మేనమామ తొంగి చూసాడు అమ్మో దోచుకున్నాడు తొంగి చూసాడు అమ్మమ్మో దోచుకున్నాడు
అల్లి బిల్లి చిట్టిపాప పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర గానం: పి.సుశీల & కోరస్ అల్లి బిల్లి చిట్టిపాప మన మందర మొకటే చిట్టిపాప ఆడుతు పాడుతు చదవాలి ఆ చదువే సంపద కావాలి ఆవుల రంగులు వేరైనా పాలది ఒకటే రంగు పూవుల రంగులు వేరైనా పూజ మాత్రం ఒకటే ఎన్నో పేరులు ఉన్నా దేముడు మాత్రం ఒకడే ఆ సత్యం తెలియాలి సఖ్యత కలపాలి గాలి నేల నీరు నిప్పు ఆకాశం అయిదు కలసి రూపొందెను ఈ భూగోళం ఎన్నో జీవులు ఉన్నా మానవ జన్మే మిన్నా ఆ.... మనిషిగ బ్రతకాలి మంచిని పెంచాలి సూర్యుని కిరణాలెంతో వేడిగా ఉంటాయి సంద్రపు నీళ్ళు ఎండకు ఆవిరి అవుతాయి ఆవిరి మబ్బులు కాగా వానలు కురియును బాగా ఆ ఎండలు ఉంటేనే వానలు పడతాయి వానలు పడితేనే చేనులు పండేది. ఆహా....!
ఓ... చంద్రమా... పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల ఓ.... చంద్రమా .... ఒకనాటి ప్రియతమా ఈ పేద కలువ నీకు గురుతేనా తెలుపుమా .... నీవు నాకు చేసిన బాస నీటి మీద రాసిన రాత తాళి కట్టిన కలువ కన్నా తళుకు లొలికే తారమిన్నా రోజూ మారే రూపం నీది మోజు పడిన పాపం నాది కలలే మార్చి కలలే చెరిపి మనువు మార్చి మంటలు రేపి మచ్చ పడిన మనసు నీది చిచ్చు రేగిన మనసు నాది కట్టగలవు మెడకో తాడు కన్నె వలపుకే ఉరితాడు
గుమ్మాడమ్మా గుమ్ముడి పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి గానం: పి.సుశీల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి) గుమ్మాడమ్మా గుమ్ముడి గోకుల మంతా సందాడి వన్నెల కృష్ణుని చిన్నెలు వింటే మనసులు నాట్యం చేసేనమ్మ అల్లరి వాడమ్మా వన్నెల కృష్ణుడు చిన్నెలు వింటే మనసులు నాట్యం చేసేనమ్మా ఆల్లరి వాడమ్మా.... సంజవేళ స్నానం చేసి నీళ్ళు తెస్తుంటే మరుమల్లె పూల తోటలోన ఒంటిగ వస్తుంటే నా వెనక వచ్చాడు నా కళ్ళు మూసాడు ఒళ్ళంతా తడిమాడు ఒంపులే వెతికాడు నును సిగ్గు మొగ్గలు మీటి తొలి వయసు వాకిలి దాటి చుక్కల క్రింద పచ్చిక మీద పానుపువేసి రమ్మన్నాడే తుంటరి వాడమ్మా ఆరుబయట ఆదమరచి నిద్దరపోతుంటే నా జారు పైట చల్ల గాలికి జారిపోతుంటే నీడల్లే వచ్చాడు నిద్దట్లో లేపాడు సద్దయిన కాకుండా ముద్దివ్వ మన్నాడు గాలిలాగ చుట్టేసాడు పైటలాగి వాటేసాడు ॥గుమ్మాడమా తెల్లారేక తెలిసిందమ్మా నలిగిన పక్క నవ్విందమ్మా కొంటె వాడమ్మా
ఇన్నాళ్ళ ఈ మూగ బాధ పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర జీవితం (1979) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు ఇన్నాళ్ళ ఈ మూగ బాధ ఈనాటితో మాసిపోనీ నీ నుదుట తిలకమ్ము దిద్ది నిత్య కల్యాణిగా చూసుకోని ఎన్నేళ్ళు వేచింది మనసు కన్నీరు కాగింది బ్రతుకు ఈ నాటి ఏకాంత సమయం ఏ రేయి లేనంత మధురం చెలియా ఈ మౌన వేళ నన్ను అల వోలె చెలరేగి పోనీ ఎవరైన ఎ వేళననైనా మన జాడ గమనించరారు జగమేలు పరమాత్ముడైనా మన జంట విడదీయ రాడు (దు) నీ కళ్ళలో నేను దాగి నిన్ను నా గుండెలో దాచుకోనీ కావాలి ఎన్నెన్నో కనులు నిన్ను కరువారగా చూసుకోను కావాలి ఎంతెంతో కాలం తీపి కలలన్నీ పండించుకోను రగిలే ఈ హాయిలో నా నన్ను బ్రతుకంత జీవించిపోనీ
Vichitra Jeevitham (1979)
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె.వి.రాఘవులు నటీనటులు: కృష్ణంరాజు, శారద, జయసుధ దర్శకత్వం: వి.మధుసుదనరావు నిర్మాత: జి.సత్యనారాయణరాజు విడుదల తేది: 11.01.1980
Songs List:
శంభో హరహర పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు శంభో హరహర.... భోళాశంకర వినరా వినరా జంగం దేవర శివశివ శంకర....యివరం సెప్పర బస్తీ బాబులకు... అరెరెరెరే .... నీ భక్తుడంటే.... ఈ సత్తెమంటే ఎట్టాంటోడో తెలిసేందుకు..... రైతంటే బైతనుకుంటే... నీ బతుకు భజగోవిందే తెలివంటె నీదనుకుంటే.... నీ తెలివి తెల్లారినట్టే పనికి రాని మనిషి .... ఒక్కడైన లేడు ఆ మనిషి పనికి నువ్వు ఖరీదు కట్టలేవు డబ్బు కట్టే గోనిసంచి గొప్ప కాదురో.... ॥శివ శివ ॥ సత్తెమంటే సల్లగాలి.... సత్తెమంటే అగ్గినిప్పు మంచోళ్ళ ప్రాణం సతైం.... మనసున్న మనిషే సత్తెం ముతక కట్టినోడు .... మొద్దు ఎదవకాడు సద్ది తిన్నవోడు.... సచ్చు సవటకాడు నిద్దరోయె బెబ్బులి మేక కాదురో .... ॥శివ శివ ॥ పట్నంలో సదువులు సదివి.... పట్టాలు పొందిన బాబులు సూశారు కండబలము .... సూత్తారా బుద్ది బలము మాయ సేయలేదు ....మంత్రమేమి కాదు గుప్పెట్లో యిసక సెప్పుకోండి ఎంత....? ఎంత... ? ఎంత ....? ఎంత....? తెలీలా .... గుప్పెడంత యిసకంటే గుప్పెడేనులో.... ॥శివ శివ ॥
నిన్నా మొన్నటి చిన్నారివే పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు నిన్నా మొన్నటి చిన్నారివే చిన్నారి పలుకుల చెల్లెమ్మవే ఈ పెళ్ళి చూపుతో ఈ చీర కట్టుతో ఎంత ఎదిగినావే........ పెళ్ళీడు వచ్చింది అమ్మాయి పిల్లాడ్ని చూడరా నీ చెల్లికి అని పెద్దోళ్ళు పదిసార్లు అన్నారని ఉబలాటపడ్డాను చూద్దామని ఈ ముస్తాబులో ....ఆ నగుమోములో చూశాను చెల్లీ.... మన తల్లిని.... ఒకరికి ఒకరం.... ఇక ఎవరికి ఎవరం ఓర్వనిదైనా..... తప్పని దూరం ఏ ఆడపిల్లా.... కాదీడపిల్ల ఏనాటికైనా ....అది ఆడపిల్ల చేశానమ్మా..... నే చేయగలది ఈ ఇంటి పేరింక ఆ ఇంట నిలపాలి
మేకారే మేకా .... పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు , యస్.పి.శైలజ మేకారే మేకా .... హే.... మేకా తోకారే తోకా... హే.... తోకా మిల మిలలాడే కన్నులతో మిస మిసలాడే వన్నెలతో చుర చురలాడే చూపులతో కొర కొరలాడే కోర్కెలతో బిలబిల కిలకిల గలగల గలగల అమ్మాయిలూ చకచక టకటక లుకలుక లుకలుక అబ్బాయిలూ ఒకరిని ఒకరు ఒరుసుకొని ముందూ వెనకా వెనకా ముందూ ముందూ వెనకా వెనకా ముందు ముందుగ వెళుతుంటె .... పెట పెటలాడే పదహారేళ్ళు చిమ చిమలాడే యిరవై యేళ్ళు చెకుముకి రాళ్ళు ఈ కుర్రాళ్ళు బరిలో దూకే పందెం కోళ్ళు కిస్ మిస్ కిస్ మిస్ కిస్ మిస్ కిస్ మిస్ పిట్టల్లాడు కుంవా కుంవా కుంవా కుంవా గువ్వల్లాగా ఒకరిని ఒకరు తరుముకొని పగలూ రేయీ రేయీ పగలూ పరుగులు తీసూ ఉరకలు వేసు పడుతూ లేసుంటే....
గీతా .... ఓ గీతా .... పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆరుద్ర గానం: కె. జె. ఏసుదాసు, వాణీ జయరామ్ గీతా .... ఓ గీతా .... డార్లింగ్.... మై డార్లింగ్ .... మనసార నీతో మాటాడుకోనీ రాజా....ఓ రాజా.... డార్లింగ్.... మై డార్లింగ్ .... మనసార నీతో మాటాడుకోనీ పర దేశంలో.... ఆవేశంలో ప్రేమించిన మనకనుమతి .... బహుమతి.... ఈ దేశంలో... సంతోషంతో మనవాడినచో అనుబంధం ఆనందం ... వెచ్చని వలపుల ముచ్చట తీరును అనురాగ బంధం ముడివేసుకోనీ చిరునవ్వులతో పులకింతలతో వికసించిన మధువనం యవ్వనం .. ఈ భంగిమలో నీ పొంగులతో మురిపించే బిగికౌగిలి జిలిబిలి.... ఊహలే రేగితే మోహమే ఆగుణా ఒడిలోన నన్ను ఒదిగొదిగిపోనీ
నీవు నా పక్కనుంటే హాయి పాట సాహిత్యం
చిత్రం: శివమెత్తిన సత్యం (1980) సంగీతం: జె. వి. రాఘవులు సాహిత్యం: ఆరుద్ర గానం: కె. జె. ఏసుదాసు, వాణీ జయరామ్ నీవు నా పక్కనుంటే హాయి నీవు లేకుంటే చీకటి రేయి నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో కిరణాలు మెరిశాయి నీవు నా పక్కనుంటే హాయి నీవు లేకుంటే చీకటి రేయి నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో కిరణాలు మెరిశాయి కొండలలో కోనలలో ఏకాంత వేళ గుండెలలో రేగింది సరసాల లీల కొండలలో కోనలలో ఏకాంత వేళ గుండెలలో రేగింది సరసాల లీల అనురాగ శిఖరాన అందాల తోట ఆ చోట కోనేట సయ్యాటలాడాలి కొనగోట మీటిన మాణిక్యవీణ కొసరే మమతల తొలకరి వాన కొనగోట మీటిన మాణిక్యవీణ కొసరే మమతల తొలకరి వాన కన్ను సైగల కౌగిలింతల సన్న జాజితాని ఎన్నమారులు నిన్ను చూసినా దేవరంభ ఠీవి మువ్వల రవళి మోహన మురళీ మధురం మధురం మానసకేళీ
Sivamettina Sathyam (1980)
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All) గానం: యస్.పి.బాలు, పి.సుశీల నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, చంద్రమోహన్, బేబీ వరలక్ష్మి దర్శకత్వం: వి.మధుసూదనరావు నిర్మాతలు: టి.గోవింద రాజన్, టి.యం.కిట్టు విడుదల తేది: 15.06.1979
Songs List:
హేయ్ లల్లీ పప్పీ పాట సాహిత్యం
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు హేయ్ లల్లీ పప్పీ లల్లీ మళ్లీ రారండీ పువ్వులు ఉన్నవి పూజకు కావు - లవ్వూ గివ్వూ అనకండీ తేనె తేనెకూ తేడా ఏమిటో - తేనెటీగకు తెలుసు - ఈ తేనెటీగకు తెలుసు తేటికి వుంది వయసూ తేనెకు వుంది సొగసూ తెరవకండి మనసూ .... మనసు గినసు అంటే నాకు అసలే అలుసు రోజు రోజుకో రోజా పువ్వుతో - మోజు తీర్చుకోవాలి నీ మోజు తీరిపోవాలి నిన్న అనుభవం నిన్నే రేపటి సంగతి రేపే మరచిపొండి నేడే - రేపటికంఠా మీరూ నేనూ వేరే వేరే ॥హేయ్॥ అందమన్నది బంధంకారాదు అనుబంధం కారాదు అది ఎవ్వరి సొంతం కాదు కొత్తదన్నది నేడే — పాతై పోతే రోతే ఎందుకింక సొంతం – రోజూమారే దేవునిసృష్టే నాకూ యిష్టం ॥హేయ్॥
చిత్రా చిత్రాల బొమ్మా పాట సాహిత్యం
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల చిత్రా చిత్రాల బొమ్మా - పుత్తడీ పోతబొమ్మా మొత్తా మొత్తంగ వచ్చి_చిత్తాన్నే దోచెనమ్మా పైలా పచ్చీసు బొమ్మా - పరదేశీ ఆటబొమ్మా ముచ్చల్లే వచ్చి వచ్చి - మచ్చేదో చల్లెనమ్మా ॥చిత్రా॥ టేకు మానల్లే చక్కంగా వుంటాడు ఆకు తేలల్లె చల్లంగా వస్తాడు సోకంతా సూపుల్లో సూపుతాడు. ఆ సూపులతో ఒళ్ళంతా పాకుతాడు పువ్వు తీగల్లే నాజూగా వుంటుంది బొండు మల్లల్లె నిండుగా నవ్వుతుంది నవ్వుల్లో చాణాలు రువ్వుకుంది అబ్బ రువ్వుతూ ప్రాణాలు తోడుతుంది వాడిబాకల్లే గుచ్చుతుంది గుండెలో లేడి పిలలై గెంతుతుంది ఇంతలో.... దీపమల్లె వెలుగుతుంది దీవిలో తెర చాపలాగ ఎగురుతుంది నావలో అలలు అలలుగా వూగుతాడు మనసులో కలలు కలలుగా వస్తాడు కళ్ళలో కడలిలా వుంటాడు లోతులో చలమలాగ వూరుతాడు చెలిమిలో
వేస్తాను పొడుపు కధ పాట సాహిత్యం
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల వేస్తాను పొడుపు కధ వేస్తాను చూస్తాను విప్పుకో చూస్తాను. మనం వేసుకున్న పొడుపు కథ ఈ రాత్రి అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రి వచ్చాక వచ్చారు. వచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళి మల్లి వచ్చారు. మళ్ళీ వెళ్తే వస్తారా....? ఎవరు వారు...? ఎవరు వారు. తెలియలా .... ? ఊహుఁ.... పళ్ళు పగడాల చక్రాలపచ్చనీ తేరునెక్కి సూర్యుడంటి వీరుడొస్తే దారంతా నెత్తురంట. ఏమిటంట....? ఏమిటబ్బా.... తెలీలా....? తెలియలా....? ఆకు వక్క సున్నం పుట్టినిల్లు మెట్టినిల్లు ఒక్కటైనది పుట్టిన ప్రతి జీవికి తప్పకున్నది కాయైనా పండై నా తీయనై నది గాయమైనా మందైనా తానై నది ఏమిటది...? తెలీలా...? తెలీలా .... ప్రేమ.... నేలమీద నిలిచేవి రెండుకాళ్ళు నింగిలోన నిలిచేవి రెండు కాళ్లు మధ్యలో నడిచేవి ఎన్నోకాళ్లు ఏమిటది ....? ఏంటది....? ఇది తెలీలా ... తెలీలా.... నాకు తెలియదు.
ఎందుదాగినావురా పాట సాహిత్యం
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల ఎందుదాగినావురా నందకిశోరా నవనీతచోరా ఎందెందు వెదుకుదురా ఎటులా కనుగొందురా మన్ను తినాబోయావో పొన్న చెట్టు నెక్కావో వెన్న దొంగిలించి ఏ వెలది యింట పొంచావో ఆ రాధ నిన్ను ఎక్కడ దాచిందో పెట్టెలో పెట్టిందో బుట్టలో దాచిందో పైటకొంగులో నిన్ను ముడివేసుకున్నదో ఎక్కడని వెతికేది ఇక్కడ — అక్కడ ఎక్కడ — మరెక్కడ .... భామా, సత్యభామా చెప్పమ్మా నేను రుక్మిణిని కాను రాధను కాను గోపికను కాను నీ భర్త నెత్తుకుపోను నీడగా దొరికినా — లీలగా మెరిసినా కనబడితే చాలు నాకు కనక వర్షాలు ఎక్కడని వెతికేది ఇక్కడ — అక్కడ ఎక్కడ - మరెక్కడ
ఈ కోవెల నీకై వెలిసిందీ పాట సాహిత్యం
చిత్రం: అండమాన్ అమ్మాయి (1979) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల, యస్.పి.బాలు ఈ కోవెల నీకై వెలిసిందీ - ఈ వాకిలి నీకై తెరిచుందీ రా దేవి తరలిరా - నా దేవి తరలిరా .... ఈ కోవెల నీకై వెలిసిందీ ఈ వాకిలి నీకై తెరిచుందీ రా స్వామి తరలిరా - నా స్వామీ తరలిరా దేవతల గుడిలో లేకున్నా - దీపం పెడుతూ వున్నాను తిరునాళ్ళెపుడో రాక తప్పదని - తేరును సిద్ధం చేశాను దేవుడు వస్తాడని రోజూ—పువ్వులు ఏరితెస్తున్నాను రేపటికోసం చీకటి మూసిన తూరుపులాగా వున్నాను ॥ఈ కోవెల॥ మాసినవెచ్చని కన్నీరు - వేసెను చెంపల ముగ్గులను మాయని తీయని మక్కువల చూసెను ఎనిమిది దిక్కులను దిక్కులన్నీ ఏకమై నా కొక్కదిక్కై నిలిచినవి మక్కువలన్నీ ముడుపులు కట్టి మొక్కులుగానే మిగిలినవి ॥ఈ కోవెల ॥ నీరువచ్చె - ఏరువచ్చె ఎరుదాటి ఓడవచ్చె ఓడ నడిపే తోడు దొరికె వడ్డుచేరే రోజువచ్చె ఓడచేరే రేవు వచ్చె... నీడచూపే దేవుడొచ్చె రేవులోకి చేరేలోగా_దేవుడే అడ్డువేసే....
Andaman Ammayi (1979)
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కొసరాజు, డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల, బి. వసంత, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు నటీనటులు: రామారావు, అంజలీ దేవి, కాంచన దర్శకత్వం: వి. మధుసూదనరావు నిర్మాత: డి.వెంకటపతిరెడ్డి విడుదల తేది: 14.10.1966
Songs List:
చక్కని చల్లని యిల్లు పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి. సుశీల చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు మమతల కలలకు పందిళ్ళు చక్కని చల్లని యిల్లు, చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు మమతల కలలకు పందిళ్ళు చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు చరణం:1 అమ్మా, నాన్నా కట్టినవి అమ్మా, నాన్నా కట్టినవి అల్లరి పిల్లలు పుట్టినవీ.. అహహహ అల్లరి పిల్లలు పుట్టినవి ముద్దుల ముద్దలు పెట్టినవి ముల్లోకాలకు స్వర్గమిదీ..ఈ.. అహహహా.. అహహహా...అహహహా చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు చరణం: 2 మనసు పెరిగితే ఒకటౌతాము వయసు పెరిగితే వేరౌతాము మనసు పెరిగితే ఒకటౌతాము వయసు పెరిగితే వేరౌతాము పెరిగే మీరు తరిగే మేము ప్రేమనిక్కడే చవి చూద్దాము అహహహా.. అహహహా...అహహహా చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు మమతల కలలకు పందిళ్ళు చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు అహహహా.. అహహహా...అహహహా
నీలమోహనా.. రారా పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: దేవులపల్లి గానం: పి. సుశీల పల్లవి: నీలమోహనా.. రారా నిన్ను పిలిచె నెమలి నెరజాణ నీలమోహనా.. రారా నిన్ను పిలిచె నెమలి నెరజాణ నీలమోహనా.. రారా జారువలపు జడివాన కురిసెరా.. జాజిలత మేను తడిసెరా జారువలపు జడివాన కురిసెరా.. జాజిలత మేను తడిసెరా లతలాగే నా మనసు తడిసెరా.. నీలమోహనా.. రారా రారా..రారా.. చరణం: 1 ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి? ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి? అతడేనేమో అనుకున్నానే.. అంత దవుల శ్రావణ మేఘములగనీ అతడేనేమో అనుకున్నానే.. అంత దవుల శ్రావణ మేఘములగనీ ప్రతిమబ్బు ప్రభువైతే... ప్రతికొమ్మ మురళైతే ఏలాగె ఆ... ఏలాగె మతిమాలి.... ఏడే నీ వనమాలి? హ హా హా.. హా హా.. నీలమోహనా.. రారా.. నిన్ను పిలిచె నెమలి నెరజాణ నీలమోహనా.. రారా.. రా రా రా... చరణం: 2 ఆ... సారెకు దాగెదవేమి? నీ రూపము దాచి దాచి ఊరించుటకా స్వామీ? సారెకు దాగెదవేమి..? నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా కృషా కృష్ణా కృష్ణా... సారెకు దాగెదవేమి..? చరణం: 3 అటు... అటు... ఇటు... ఇటు... ఆ పొగడకొమ్మవైపు ఈ మొగలి గుబురువైపు కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా... నీలిమేఘమాకాశము విడిచి... నేల నడుస్తుందా ? కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా... నీలిమేఘమాకాశము విడిచి... నేల నడుస్తుందా ? నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా? నవ్వే పెదవులకూ మువ్వల మురళుందా? పెదవి నందితే పేద వెదుళ్ళు కదిలి పాడుతాయా? నడిచే మబ్బులకు నవ్వే పెదవులు నవ్వే పెదవులకు మువ్వల వేణువులు మువ్వల వేణువులు... మువ్వల వేణువులు
పెరుగుతుంది హృదయం పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల పెరుగుతుంది హృదయం
మదిలోని నా స్వామి పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు అతనిని కనినంత అందెలు పలికే అతనిని కనినంత అందెలు పలికే అందెలు రవళించ డెందము పలికే నాలో శతకోటి భావాలు పలికే మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు మనసెరిగిన వాడు మమతల నెలరేడు వలపుల దీపాలని నిలిపిన చెలికాడు మనసెరిగిన వాడు మమతల నెలరేడు వలపుల దీపాలు నిలిపిన చెలికాడు ఇన్నాళ్లకు తానే నన్నేలినాడు మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు అతడే నాపాలి అభినవ వనమాలి ఆతని నయనాలు అందిన నయనాలు అతడే నాపాలి అభినవ వనమాలి ఆతని నయనాలు అందిన గగనాలు ఆతని పాదాలు నా పారిజాతాలు మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు.
నీలాల కన్నులతో పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని చూసేవెందుకని
ముసుగు తీయవోయి పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.బి.శ్రీనివాస్ ముసుగు తీయవోయి
తళుకు బెళుకు చీరదాన పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: పిఠాపురం, స్వర్ణలత తళుకు బెళుకు చీరదాన
చక్కని చల్లని యిల్లు (Female Version) పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి. సుశీల చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు






