Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sanghavi"
Parasuram (2002)



చిత్రం: పరశురాం (2002)
సంగీతం: యం.యం.శ్రీలేఖ 
నటీనటులు: శ్రీహరి, సంఘవి 
దర్శకత్వం: మోహన గాంధీ 
నిర్మాత: ప్రియాంక 
విడుదల తేది: 07.03.2002



Songs List:



జారిందమ్మ జారిందమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: పరశురాం  (2002)
సంగీతం: యం. యం. శ్రీలేఖ 
సాహిత్యం: మహేష్ 
గానం: ఉన్నికృష్ణన్ , సుజాత మోహన్ 

జారిందమ్మ జారిందమ్మ
జారిందమ్మ జారిందమ్మ జారుపైటా...
బాగుందమ్మ బాగుందమ్మ
బాగుందమ్మ బాగుందమ్మ ఆరుబయటా...

నీ ముద్దు ముత్యం జారే
పగడం జారే పరువం జారెనే
నీ ముందే సరదా తీరే
సరసాలూరే అందమంత జాలువారి

జారిందమ్మ

జారిందమ్మ జారిందమ్మ
జారిందమ్మ జారిందమ్మ జారుపైటా...
బాగుందమ్మ బాగుందమ్మ
బాగుందమ్మ బాగుందమ్మ ఆరుబయటా...

హహ..హహ..

జారింది కొప్పు చూసుకోవమ్మా
జారిన పూవు అందుకోవయ్యా
నువ్వెంత ఆపినా వద్దంటు చెప్పిన
నీ ఒంపులు నా చూపులు జారే
చెజారి పోకు చందమామయ్యొ
నేజారు నాకు సందె పొద్దమ్మొ
తబ్బిబ్బు అయిందో
తడబాటు కలిగిందో
నీ వైపే నా అడుగులు సాగే

చేయి వేస్తెజారుతుందీ
వెన్ను పులుము కుంటివేమో
కన్నె మనసు జారుతుందీ
వెన్ను మలుపు కుంటివేమో
చేయే జారిందో కాలే జారిందో
పరాచికాలా కలలో తేలి

జారిందమ్మ

జారిందమ్మ జారిందమ్మ
జారిందమ్మ జారిందమ్మ జారుపైటా...
బాగుందమ్మ బాగుందమ్మ
బాగుందమ్మ బాగుందమ్మ ఆరుబయటా...

హహ..హహ

సూదంటురాయి వొళ్ళు నీదమ్మో
నిన్నంటు కుంటె వదిలి పోనయ్యో
ఉవ్విళ్లు ఊరించే పూవంటి పెదవుల్లో
ఎ తేనె రసాలు ఉన్నాయో
పల్లున్న వెండి పళ్లెమిదిలే
ఒక్కొక్క పండు వొలుచుకుంటాలే
మాటల్లొ దింపేసి కమ్మంగా ముద్దిస్తే
నా భర్తా చలనుకుంటాలే
గాలి మాటలేల పిల్లా
గుండె తలుపు తీస్తెకాదా
తాలమేది వేయలేదు
పట్టిచూడు తెరిచే ఉంది
సొమ్మే ఇస్తావో సోకే ఇస్తావో
కుమారి సిగ్గు తెరలే తీసి

జారిందమ్మ

జారిందమ్మ జారిందమ్మ
జారిందమ్మ జారిందమ్మ జారుపైటా...
బాగుందమ్మ బాగుందమ్మ
బాగుందమ్మ బాగుందమ్మ ఆరుబయటా...

నీ ముద్దు ముత్యం జారేణ
పగడం జారే పరువం జారెనే
నీ ముందే సరదా తీరే
సరసాలూరే అందమంత జాలువారి జారిందమ్మ

Palli Balakrishna Thursday, December 15, 2022
Vooriki Monagadu (1995)



చిత్రం: ఊరికి మొనగాడు (1995)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, స్వర్ణలత jr., అప్పాచి 
నటీనటులు: శ్రీకాంత్, సంఘవి
దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణ రావు
నిర్మాత: ఎం. విజయ్
విడుదల తేది: 01.12.1995



Songs List:



ఎవరి ఇంటి కోడి పెట్టవో పాట సాహిత్యం

 
చిత్రం: ఊరికి మొనగాడు (1995)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువనచంద్ర 
గానం: మనో, స్వర్ణలత jr.

ఎవరి ఇంటి కోడి పెట్టవో 




ప్రతి మాట ఒక పాటై పాట సాహిత్యం

 
చిత్రం: ఊరికి మొనగాడు (1995)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువనచంద్ర 
గానం: మనో, స్వర్ణలత jr.

ప్రతి మాట ఒక పాటై 




అమ్మనీ అమ్మనీ పాట సాహిత్యం

 
చిత్రం: ఊరికి మొనగాడు (1995)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువనచంద్ర 
గానం: మనో, స్వర్ణలత jr.

అమ్మనీ అమ్మనీ 




ప్రియతమా ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: ఊరికి మొనగాడు (1995)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువనచంద్ర 
గానం: అప్పాచి, స్వర్ణలత jr.

ప్రియతమా ప్రియతమా 



నువ్వొస్తే పండగొచ్చే పాట సాహిత్యం

 
చిత్రం: ఊరికి మొనగాడు (1995)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువనచంద్ర 
గానం: మనో, స్వర్ణలత jr.

నువ్వొస్తే పండగొచ్చే

Palli Balakrishna Tuesday, March 12, 2019
Tata Manavadu (1996)


చిత్రం: తాత మనవడు (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం:
గానం:
నటీనటులు: వినోద్ కుమార్, కృష్ణంరాజు, శారద
దర్శకత్వం: కె.సదాశివరవు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 1996

Palli Balakrishna Friday, March 1, 2019
Sindhooram (1997)



చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నటీనటులు: రవితేజ, బ్రహ్మాజీ, భానుచందర్, సంఘవి
నిర్మాత, దర్శకత్వం: కృష్ణవంశీ
విడుదల తేది: 06.07.1997



Songs List:



ఏడు మల్లెలెత్తు సుకుమారికి పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ప్రదీప్, సత్యం 

ఏడు మల్లెలెత్తు సుకుమారికి 




హాయ్ రే హాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని
సాహిత్యం: చంద్రబోస్
గానం:  శ్రీనివాస చక్రవర్తి  (శ్రీ  కొమ్మినేని) 

హాయ్ రే హాయ్




ఓ చెలి అనార్కలి పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: సురేష్ పీటర్

ఓ చెలి అనార్కలి 




ఓ లెలే ఓ లెలే పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: వాసుదేవన్, శ్రీనివాస చక్రవర్తి  (శ్రీ  కొమ్మినేని) 

ఓ లెలే ఓ లెలే



ఊరికే ఉండదే పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కె.యస్.చిత్ర 

ఊరికే ఉండదే



అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా

శాంతి కపోతపు కుత్తుక తెంచి
తెచ్చిన బహుమానం… ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగ దిద్దిన
ప్రజలను చూడమ్మా… ఓ పవిత్ర భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల
స్వేచ్ఛను చూద్దామా… దాన్నే స్వరాజ్యమందామా

కులాల కోసం… గుంపులు కడుతూ
మతాల కోసం… మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి… తగువుకి లేస్తారే
జనాలు తలలర్పిస్తారే

సమూహ క్షేమం పట్టని… స్వార్థపు ఇరుకుతనంలో
ముడుచుకు పోతూ… మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరే… తెలిసి భుజం కలిపి రారే

అలాంటి జనాల తరఫున
ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో
సాగించే సమరం… ఈ చిచ్చుల సిందూరం

జవాబు చెప్పే బాధ్యత మరచిన
జనాల భారతమా… ఓ అనాథ భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా

అన్యాయాన్ని సహించని శౌర్యం
దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూరమృగంలా
దాక్కుని ఉండాలా… వెలుగుని తప్పుకు తిరగాలా

శతృవుతో పోరాడే సైన్యం
శాంతిని కాపాడే కర్త్యవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో
కవాతు చెయ్యాలా… అన్నల చేతిలొ చావాలా

తనలో ధైర్యం అడవికి ఇచ్చి
తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ
సంఘం శిలలా నిలుచుంటే

నడిచే శవాల సిగలో తురుమిన
నెత్తుటి మందారం… ఈ సంధ్యా సిందూరం
వేకువ వైపా, చీకటిలోకా… ఎటు నడిపేనమ్మా
గతి తోచని భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని
స్వతంత్రమందామా… స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని
స్వరాజ్యమందామా… దానికి సలాము చేద్దామా

తన తలరాతను తానే
రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని… తన అవినీతిని
తన ప్రతినిధులుగ ఎన్నుకుని

ప్రజాస్వామ్యమని తలిచే జాతిని
ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని
నడిపిస్తుందట, ఆహాహా ఆవేశం

ఆ హక్కేదో తనకే ఉందని
శాసిస్తుండట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రమున
సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా
విశాల భారతమా… ఓ విషాద భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా

శాంతి కపోతపు కుత్తుక తెంచి
తెచ్చిన బహుమానం… ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగ దిద్దిన
ప్రజలను చూడమ్మా… ఓ పవిత్ర భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల
స్వేచ్ఛను చూద్దామా… దాన్నే స్వరాజ్యమందామా

Palli Balakrishna Wednesday, February 13, 2019
Pelli Sambandham (2000)


చిత్రం: పెళ్లి సంబంధం (2000)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, స్వర్ణలత
నటీనటులు: సుమంత్, సాక్షిశివానంద్, సంఘవి
దర్శకత్వం & నిర్మాత: కె.రాఘవేంద్రరావు
విడుదల తేది: 28.07.2000

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే
హ ఉరుమై అది నిన్నే మరల ఆడిగాడే
వేళగాని వేళల్లోన వీలుచుసి నాడే
చోటుగాని చోటులోన ఆటలాడినాడే

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే

ఎల్లుండిచ్చే కౌగిల్లో మెల్లంగా రేపే ఇచ్చే
రేపే ఇచ్చే వత్తిల్లో మొత్తంగా ఈరోజిచ్చే
ఈ రోజిచ్చే  అందాలు ఈ పూటే అందించాల
ఈ పోటెత్తేవిరహాలు ఈ నిమిషం ఆపేయాల
ఆలస్యం అయ్యిందంటే ఆగలేనమ్మా
అవకాశం పోయిందంటే మళ్ళీ రాదమ్మ
నీ మోహం పెరిగిపోతే చూడలేనయ్య
వ్యామోహం తీరేకొద్ది తోడుకోవయ్య
నిప్పులాంటి వంపులాడి వప్పుకుంది నేడే
నీళ్లు నువ్వు చల్లిపోతే తగ్గుతుంది వేడే

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే

నీకే గాని కొట్టందే నాకన్ను ఎందుకంట
నిన్నే గాని చుట్టంది నా చీర ఎందుకంట
నువ్వే గాని లాగందే ఈ కొంగు ఎందుకంట
నీతోగానీ జారంది నా కాలు ఎందుకంట
ఏనాడో వచ్చెనమ్మా గోకులాష్టమి
ఈ నాడే వచ్చిందమ్మ సోకులాష్టమి
ఏడాదికొక్కసారి నాగ పంచమి
నా ఈడు కెన్నిసార్లు భోగ పంచమి
పోకిరోడు దుకినాడే పిల్ల పిట్ట గోడే
చిన్నవాడు చేరినాడు చీర చెట్టు నీడే

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే
హ ఉరుమై అది నిన్నే మరల ఆడిగాడే
వేళగాని వేళల్లోన వీలుచుసి నాడే
చోటుగాని చోటులోన ఆటలాడినాడే

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే

Palli Balakrishna Sunday, March 25, 2018
Maanikyam (1999)



చిత్రం: మాణిక్యం (1999)
సంగీతం: యస్.ఏ రాజ్ కుమార్
నటీనటులు: శ్రీకాంత్ , దేవయాని, సంఘవి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాతలు: యన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్
విడుదల తేది: 12.02.1999



Songs List:



కొండపల్లి మన్నుతో పాట సాహిత్యం

 
చిత్రం: మాణిక్యం (1999)
సంగీతం: యస్.ఏ రాజ్ కుమార్
సాహిత్యం: శివ గణేష్
గానం: యస్.పి.బాలు

పల్లవి:
కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతో 
కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతో 
మలచిన బొమ్మరా ఇది
ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది
ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది

తందాన తాన తననన తందాన తాన (2)

చరణం: 1
కోటేరంటి ముక్కే చేశా కోన సీమ మన్నుతో
పట్టువంటి చెక్కిలి చేశా పట్టిసీమ మన్నుతో
గుస గుస చెవులు చేశా గుంటూరు మన్నుతో
తేనెలూరు పెదవి చేశా తణుకు చెరుకు మన్నుతో
కులుకు మబ్బు  కురులుకేమో కృష్ణవేణి మన్నండి
శంఖమంటి మెడకు మాత్రం శంకవరం మన్నండి
అందాలమ్మ నుదురు తీర్చు మన్నే ఇలను లేదండి
చందమామ మన్నే తెచ్చి నుదురు తీర్చా చూడండి
ఎదురు దీనికేదండి

కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతో 
మలచిన బొమ్మరా ఇది
ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది

చరణం: 2
కూచిపూడి మన్నే తెచ్చా కులుకులమ్మ చేతికి
పాలకొల్లు మన్నెతెచ్చా పైట చాటు సొగసుకి
నందికొండ మన్నే తెచ్చా నాజూకైనా నాభికి
నాగుల్లంక మన్నే తెచ్చా నాగమల్లి నడుముకి
కాళహస్తి వీధుల్లోన మన్నెతెచ్చా కాళ్ళకి
గోలుకొండ కోటలోని మన్నే తెచ్చా గోళ్ళకి
ఊరూరు మన్నే తెచ్చి రూపమిచ్చా ఒంటికి
నా ఊపిరేపోసి జీవమిచ్చా కంటికి
జీవమిచ్చా కన్నెకి

కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతో 
మలచిన బొమ్మరా ఇది
ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది
ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది

తందాన తాన తననన తందాన తాన (4)




చింగు చా చింగు చా పాట సాహిత్యం

 
చిత్రం: మాణిక్యం (1999)
సంగీతం: యస్.ఏ రాజ్ కుమార్
సాహిత్యం: కె.వెంకట శివయ్య 
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత

చింగు చా చింగు చా 



చల్ చల్ గుర్రం పాట సాహిత్యం

 
చిత్రం: మాణిక్యం (1999)
సంగీతం: యస్.ఏ రాజ్ కుమార్
సాహిత్యం: సామవేదం శర్మ 
గానం: చిత్ర 

చల్ చల్ గుర్రం 




జాం జాం జాం పాట సాహిత్యం

 
చిత్రం: మాణిక్యం (1999)
సంగీతం: యస్.ఏ రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు 

జాం జాం జాం



వయ్యరమ్మ ఊరించకే పాట సాహిత్యం

 
చిత్రం: మాణిక్యం (1999)
సంగీతం: యస్.ఏ రాజ్ కుమార్
సాహిత్యం: శివ గణేష్
గానం: యస్.పి.బాలు 

వయ్యరమ్మ ఊరించకే

Palli Balakrishna Wednesday, November 29, 2017
Sandade Sandadi (2002)


చిత్రం: సందడే సందడి (2002)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: సుజాత మోహన్ టిప్పు
నటీనటులు: జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శివాజి, ఊర్వశి, రాశి, సంఘవి, సోనాలి జోషి, సోనీ రాజ్, స్వప్న మాధురి
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాతలు: ఆదిత్య రామ్
విడుదల తేది: 13.12.2002

I am in Love... (3)
I am in Love... (3)

ఔనా ఔనా ప్రేమలోన అపుడే పడ్డాన
ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎప్పుడైనా
ఇన్నాళ్లుగ ఎదలో దాగిన రూపం ఎదురై కనపడగా
ఔనా ఔనా ప్రేమలోన అపుడే పడ్డాన
ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎప్పుడైనా

అంతా నువ్వే కావా ఆనందం నవ్వై రావా
నీ సొంతమై చేరుకున్నాగా
ఎదలో వెళుతువున్నా నువ్వెల్లే దారుల్లోన
నీ నీడనై నేనున్నా
నువ్వే నవ్వంగానే నే దోసిలి పడుతూ ఉన్నా
ముత్యాలే అందుకున్నా
నీ చెక్కిలి నొక్కుల్లోన నే చిక్కుకు పోతూవున్నా
నీ చెంతకి చేరుకున్నా
హృదయమా అంతే లేని హాయిలోకి పయణమా
ప్రియతమా అంటుపట్టనివ్వదమ్మ ప్రేమ మహిమ

ఔనా ఔనా ప్రేమలోన అపుడే పడ్డాన
ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎప్పుడైనా

కనురెప్పల్లో దూరి నా కలగా నువ్వే చేరి
నా లోకమే నువ్వుగ మారి
పువ్వుల పరిమళమంత నీ జాడనే అందిస్తుంటే
నీ జంటనే చేరాలి
నాలుగు దిక్కుల్లోన నీ చిత్రాలే చూడాలి
నా గుండెల్లో నువ్వుండాలి
నా ఊపిరిలో గాలి నీ పేరే జపియించాలి
నీ కోసమే బ్రతకాలి
చిటికెలో నీ చేతుల్లో బందించావే మనసుని
చిలిపిగా నీ మాయల్లో ముంచేశావే నా మదిని

ఔనా ఔనా ప్రేమలోన అపుడే పడ్డాన
ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎప్పుడైనా
ఇన్నాళ్లుగ ఎదలో దాగిన రూపం ఎదురై కనపడగా

I am in Love... (3)
I am in Love... (3)


Palli Balakrishna Thursday, October 19, 2017

Most Recent

Default