-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "S. Janaki"
Magaadu (1990) Telugu Songs Lyrics Album Cover

Magaadu (1990) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Magaadu (1990)
Music : Raj-Koti
Director : K. Madhu
Producer : Babu Ganesh
Actors : Rajasekhar, Murali Mohan
Actresses : Jeevitha, Lissy
Release Date : 09 August 1990

Aaru Aaru Ruthuvulaku Song Lyrics in Telugu – Magaadu (1990)

'Aaru Aaru Ruthuvulaku' song from Magaadu (1990) movie is composed by Raj-Koti and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Magaadu (1990)
Music : Raj-Koti
Lyricist : Veturi
చిత్రం: మగాడు (1990) సంగీతం: రాజ్ కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు ఆరు ఆరు ఋతువులకు

Dekho Sarejahase Acha Song Lyrics in Telugu – Magaadu (1990)

'Dekho Sarejahase Acha' song from Magaadu (1990) movie is composed by Raj-Koti and sung by S. Janaki.

SONG INFORMATION
Movie : Magaadu (1990)
Music : Raj-Koti
Lyricist : Sirivennela
Singers : S. Janaki
చిత్రం: మగాడు (1990) సంగీతం: రాజ్ కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.జానకి దేఖో సారేజహసే అచ్చా

Palli Balakrishna Saturday, May 23, 2026
Abhinandana (1988) Telugu Songs Lyrics Album Cover

Abhinandana (1988) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Abhinandana (1988)
Music : Ilaiyaraaja
Actors : Karthik Muthuraman
Actress : Shobana
Supporting Cast : Sarath Babu, Rajya Lakshmi, J. V. Somayajulu
Director : Ashok Kumar
Producer : R. V. Ramana Murthy
Release Date : 10 March 1988

Ade Neevu Song Lyrics in Telugu – Abhinandana (1988)

'Ade Neevu' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Abhinandana (1988)
Music : Ilaiyaraaja
Lyricist : Acharya Aatreya
చిత్రం: అభినందన (1988) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పల్లవి: ఆ హా హా హా.... ఆ ఆ ఆ.... ఆ.... అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా కధైనా... కలైనా... కనులలో చూడనా అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా... చరణం: 1 కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము కొండా కోన గుండెల్లో ఎండా వానలైనాము గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము అదే స్నేహము అదే మోహమూ అదే స్నేహము అదే మోహమూ.. ఆది అంతము ఏదీ లేని గానము  అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా కధైనా... కలైనా... కనులలో చూడనా చరణం: 2 నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావూ... నిన్న రేపు సందెల్లో నేడై ఉందామన్నావు కన్నీరైన ప్రేమల్లో పన్నీరవుదామన్నావు అదే బాసగా... అదే ఆశ గా... అదే బాసగా... అదే ఆశ గా... ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడను  అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా కధైనా... కలైనా... కనులలో చూడనా అదే నీవు అదే నేను.. అదే గీతం పాడనా

Chukkalanti Song Lyrics in Telugu – Abhinandana (1988)

'Chukkalanti' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. Janaki.

SONG INFORMATION
Movie : Abhinandana (1988)
Music : Ilaiyaraaja
Lyricist : Acharya Aatreya
Singers : S. Janaki
చిత్రం: అభినందన (1988) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్. జానకి పల్లవి:  ఊ..ఊ..ఊ..ఊ..ఊ..  ఊ..ఊ..ఊ...  చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి  చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి  ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు  ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు  చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి  చరణం: 1 ఈ పిల్లకు మనసైంది... ఆ కళ్ళకు తెలిసింది..  ఆ పిల్లాడు వలచింది... ఈ బుగ్గకు సిగ్గైంది..  కళ్యాణం ..వైభోగం.. నేడో రేపో ఖాయం అన్నారు..  మేళాలు.. తాళాలు.. బాణసంచా కలలే కన్నారు...  పెళ్ళికి మాకేం ఇస్తారు....  కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు ...  కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు  ఊరంతా ఊరేగిస్తారు  చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి  ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు  ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు  చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి  చరణం: 2 కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సర్తు ఎక్కిస్తారు ...  కొత్త బట్టలు కుట్టిస్తారు గుర్రం సర్తు ఎక్కిస్తారు  ఊరంతా ఊరేగిస్తారు  చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి  ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు  ఇద్దరొద్ధికైనారు ముద్దు ముద్దుగున్నారు  చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి

Chukkalanti (Sad) Song Lyrics in Telugu – Abhinandana (1988)

'Chukkalanti (Sad)' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. Janaki.

SONG INFORMATION
Movie : Abhinandana (1988)
Music : Ilaiyaraaja
Lyricist : Acharya Aatreya
Singers : S. Janaki
చిత్రం: అభినందన (1988) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్. జానకి పల్లవి: చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరొద్దికైనారు ముద్దు ముద్దుగున్నారు ఇద్దరొద్దికైనారు ముద్దు ముద్దుగున్నారు చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి చరణం: 1 ఒక బంధువు వచ్చాడు తానొంటరినన్నాడు ఆ బంధం వేసాడు సంబంధం చేసాడు ఆ పిల్ల అతనికి అనుకోకుండా ఇల్లాలయ్యింది అనుకోకుండా ఇల్లాలయ్యింది ఇన్నాళ్ళు ప్రేమించిన పిల్లాడేమో పిచ్చాడయ్యాడు పిల్లాడేమో పిచ్చాడయ్యాడు

Eduta Neeve Song Lyrics in Telugu – Abhinandana (1988)

'Eduta Neeve' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Abhinandana (1988)
Music : Ilaiyaraaja
Lyricist : Acharya Aatreya
చిత్రం: అభినందన (1988) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పల్లవి: ఎదుటా నీవే యదలోనా నీవే ఎదుటా నీవే యదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుటా నీవే యదలోనా నీవే చరణం: 1 మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చి వాడ్ని కానీదు అహహా ఓహొహో ఊఁహుఁహుఁహూఁహూ... ఎదుటా నీవే యదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుటా నీవే యదలోనా నీవే చరణం: 2 కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా ప్రేమకింత బలముందా అహహా ఓహొహో ఊఁహుఁహుఁహూఁహూ... ఎదుటా నీవే యదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుటా నీవే యదలోనా నీవే

Manchu Kurise Song Lyrics in Telugu – Abhinandana (1988)

'Manchu Kurise' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam, S. Janaki.

SONG INFORMATION
Movie : Abhinandana (1988)
Music : Ilaiyaraaja
Lyricist : Acharya Aatreya
చిత్రం: అభినందన (1988) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి  పల్లవి:  మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో  మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో  ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో  ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో  మంచు కురిసే వేళలో  చరణం: 1 నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో  నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో  జలకమాడి పులకరించే సంబరంలో  జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో  జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో  ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో.. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో  మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో  ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో  ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో  మంచు కురిసే వేళలో…  చరణం: 2 మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో  మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో  మన్మధునితో జన్మ వైరం చాటినపుడో  ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో  ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో.. మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో.. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో  మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో  ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో  ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో  మంచు కురిసే వేళలో…

Prema Entha Song Lyrics in Telugu – Abhinandana (1988)

'Prema Entha' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Abhinandana (1988)
Music : Ilaiyaraaja
Lyricist : Acharya Aatreya
చిత్రం: అభినందన (1988) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పల్లవి:  ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం  ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం  చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం  చరణం: 1 ప్రేమించుటేనా నా దోషము  పూజించుటేనా నా పాపము  ఎన్నాళ్ళని ఈ యదలో ముల్లు  కన్నీరుగ ఈ కరిగే కళ్ళు  నాలోని నీ రూపము నా జీవనాధారము  అది ఆరాలి పోవాలి ప్రాణం  ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం  చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం  ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం  చరణం: 2 నేనోర్వలేను ఈ తేజము  ఆర్పేయరాదా ఈ దీపము  ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి  మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము  అపుడాగాలి ఈ మూగ గానం  ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం  చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం  ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

Premaledani Song Lyrics in Telugu – Abhinandana (1988)

'Premaledani' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Abhinandana (1988)
Music : Ilaiyaraaja
Lyricist : Acharya Aatreya
చిత్రం: అభినందన (1988) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పల్లవి: లాలల లలాలాల ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు ... ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు లాలల లలాలాల చరణం: 1 మనసు మాసిపోతే మనిషే కాదని కఠికరాయికైనా కన్నీరుందని వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ మోడువారి నీడ తోడు లేకుంటినీ ప్రేమ లేదని లలలాలలాలలా చరణం: 2 గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని గుండె పగులుపోవు వరకు నన్ను పాడని ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ  ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు లాలలాల ల లల లాలలాల లా లాలలాల ల లల లాలలాల లా

Rangulalo Kalavo Song Lyrics in Telugu – Abhinandana (1988)

'Rangulalo Kalavo' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Abhinandana (1988)
Music : Ilaiyaraaja
Lyricist : Acharya Aatreya
చిత్రం: అభినందన (1988) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి పల్లవి: రంగులలో కలవో యద పొంగులలో కళవో రంగులలో కలవో యద పొంగులలో కళవో నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఊయలవో రంగులలో కలవో యద పొంగులలో కళవో చరణం: 1 కాశ్మీర నందన సుందరివో.. కాశ్మీర నందన సుందరివో కైలాస మందిర లాస్యానివో ఆమని పూచే యామినివో.. ఆమని పూచే యామినివో మధుని బాణమో.. మదుమాస గానమో నవ పరిమళాల పారిజాత సుమమో రంగులలో కలనై.. యద పొంగులలో కళనై నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహలా ఊగించనా రంగులలో కలనై చరణం: 2 ముంతాజు అందాల తానివో.. ముంతాజు అందాల తానివో షాజాను అనురాగ సౌధానివో లైలా కన్నుల ప్రేయసివో.. లైలా కన్నుల ప్రేయసివో ప్రణయ దీపమో నా విరహ తాపమో నా చిత్రకళా చిత్ర చైత్ర రథమో రంగులలో కలనై యద పొంగులలో కళనై నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహలా ఊరించనా రంగులలో కలనై యద పొంగులలో కళనై

Palli Balakrishna Tuesday, April 30, 2019
Jagadeka Veerudu Athiloka Sundari (1990) Telugu Songs Lyrics Album Cover

Jagadeka Veerudu Athiloka Sundari (1990) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Jagadeka Veerudu Athiloka Sundari (1990)
Music : Ilaiyaraaja
Actors : Chiranjeevi
Actress : Sridevi
Supporting Cast : Amrish Puri
Director : K. Raghavendra Rao
Producer : C. Ashwini Dutt
Release Date : 09 May 1990

Yamaho Nee Song Lyrics in Telugu – Jagadeka Veerudu Athiloka Sundari (1990)

'Yamaho Nee' song from Jagadeka Veerudu Athiloka Sundari (1990) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Jagadeka Veerudu Athiloka Sundari (1990)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం ఫోజుల్లో నేను యముడంతవాణ్ణి మొజుల్లో నీకు మొగుడంటివాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం నల్లని కాటుక పెట్టి, గాజులు పెట్టి, గజ్జ కట్టి గుట్టుగా సెంటే కొట్టి, ఒడ్డాణాలే ఒంటీకి పెట్టి తెల్లని చీర కట్టి, మల్లెలు చుట్టి, కొప్పున పెట్టీ పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింట దీపమెట్టి, చీకు చింత పక్కనెట్టి నిన్ను నాలో దాచి పెట్టి నన్ను నీకు దోచి పెట్టి పెట్టు పోతా వద్దే చిట్టెంకీ చెయ్యి పట్టిన్నాడే కూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళమ్మి నువు పుట్టింది నాకోసమమ్మి ఇక నీ సొగసు నా వయసు పెనుకునే ప్రేమలలో యమహో... నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం పట్టె మంచమేసి పెట్టి, పాలుబెట్టి, పండు బెట్టి పక్క మీద పూలుగొట్టి, పక్క పక్కలొళ్ళో పెట్టి ఆకులో వక్కబెట్టి, సున్నాలెట్టి, చిలక చుట్టి ముద్దుగా నోట్లో బెట్టి, పరువాలన్నీ పండార బెట్టి చీర గుట్టు సారెబెట్టి సిగ్గులన్ని ఆరబెట్టి కళ్ళలోన ఒత్తులెట్టి కౌగిలింత మాటుబెట్టి ఒట్టే పెట్టి వచ్చేసాక మామా నిన్ను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమ చెట్టెయ్యి సందె సీకట్లోన నన్ను కట్టేయ్యి కౌగిలింతల్లోన ఇక ఆ గొడవ ఈ చొరవ ఆగవులే అలజడిలో యమహో... నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం ఫోజుల్లో నేను యముడంతవాణ్ణి మొజుల్లో నీకు మొగుడంటివాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం

Abbanee Song Lyrics in Telugu – Jagadeka Veerudu Athiloka Sundari (1990)

'Abbanee' song from Jagadeka Veerudu Athiloka Sundari (1990) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Jagadeka Veerudu Athiloka Sundari (1990)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర అబ్బానీ తియ్యాని దెబ్బా ఎంత కమ్మగా ఉందిరోయబ్బా అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బానీ తియ్యాని దెబ్బా ఎంత కమ్మగా ఉందిరోయబ్బా వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారేవా పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా?? అబ్బానీ తియ్యాని దెబ్బా ఎంత కమ్మగా ఉందిరోయబ్బా అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ చిట పట నడుముల ఊపులో ఒక ఇరుసున వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక ఎద నస పదనిస కలవుగా కాదంటునే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా... సొగసు కోస్తా... వయసు నిలబడు కౌగిట అబ్బానీ తియ్యాని దెబ్బా ఎంత కమ్మగా ఉందిరోయబ్బా అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా?? వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారేవా అబ్బానీ తియ్యాని దెబ్బా ఎంత కమ్మగా ఉందిరోయబ్బా అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అడగక అడిగినదేమిటో లిపి చిలిపిగా ముదిరిన కవితగా అది విని అదిమిన షోకులో పురి విడిచిన నెమలికి సవతిగా నిన్నే నావి పెదవులూ అవి నేడైనాయి మధువులూ రెండున్నాయి తనువులూ అవి రేపవ్వాలి మనువులూ వస్తా, వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట అబ్బానీ తియ్యాని దెబ్బా ఎంత కమ్మగా ఉందిరోయబ్బా అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా?? వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారేవా అబ్బానీ తియ్యాని దెబ్బా ఎంత కమ్మగా ఉందిరోయబ్బా అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

Priyatama Song Lyrics in Telugu – Jagadeka Veerudu Athiloka Sundari (1990)

'Priyatama' song from Jagadeka Veerudu Athiloka Sundari (1990) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Jagadeka Veerudu Athiloka Sundari (1990)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా నను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బందమా పలుకలేని భావమా మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా... ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా నను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిళింత ప్రాణమా... ప్రియతమా ప్రియతమా ప్రియతమా... ప్రియతమా నను పలకరించు ప్రణయమా నింగి వీణకేమో నేల పాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ తెలిసి పారిజాత పువ్వు పచ్చి మల్లెమొగ్గ వలపే తెలిపే నాలో విరిసి మచ్చలెన్నో ఉన్న చందమామ కన్న నరుడే వరుడై నాలో మెరిసే తారలమ్మ కన్నా చీరకట్టుకున్న పడుచు తనమే నాలో మురిసె మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో రాయి లాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో అడుగే పడక గడువే గడిచీ పిలిచే ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా నను చేరుకున్న హృదయమా ప్రాణవాయువేదో వేణువూది పోయే శృతిలో జతిలో నిన్నేకలిపి దేవగానమంతా ఎంకిపాటలాయే మనసు మమత అన్నీ కలిసి వెన్నెలల్లే వచ్చీ వేద మంత్రమాయె బహుశా మనసా వాచా వలచి మేనకల్లే వచ్చీ జానకల్లే మారే కులము గుణము అన్నీ కుదిరి నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో జగమే అణువై యుగమే క్షణమై మిగిలే ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా నను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బందమా పలుకలేని భావమా కనులలోని కావ్యమా కౌగిళింత ప్రాణమా... ప్రియతమా, ప్రియతమా, ప్రియతమా... ప్రియతమా... నను పలకరించు ప్రణయమా అతిధిలా... నను చేరుకున్న హృదయమా

Mana Bharathamlo Song Lyrics in Telugu – Jagadeka Veerudu Athiloka Sundari (1990)

'Mana Bharathamlo' song from Jagadeka Veerudu Athiloka Sundari (1990) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Jagadeka Veerudu Athiloka Sundari (1990)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా ఆ రాజు గాధే ఈ రాజు పాట నాపేరే రాజు ఎన్ పేర్ దా రాజు మేరా నాం రాజు మై నేమ్ ఈజ్ రాజు మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా భాయి యో ఔర్ బెహ్ నో ఈ కొండ వీడు వైభవాన్నీ చూసి కన్ను కుట్టిన శత్రు రాజు ధూమ కేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు హా అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపు దాడి చేశాడు విజయుడై వచ్చినాడురా తన ప్రజలంతా మెచ్చినారురా దుర్గమునే ఏలినాడురా ఆ స్వర్గమునే దించినాడురా అక్షితలే చల్లినారు రమణులంతా అహా హారతులే భక్తిమీర పట్టినారురా సింహాసనమెక్కి తాను విష్ణుమూర్తిలా అహ శిరులెన్నో చెలువు మీద చిలికినాడురా ఏ రాజు ఎవరైనా మా రాజువింక నువ్వంటా నీ మనసే మా కోట మీ మాట మాకు పూబాట రాజాధి రాజా మార్తాండ తేజ నాపేరే రాజు మై నేమ్ ఈజ్ రాజు మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా ఆ రాజు గాధే ఈ రాజు పాట నాపేరే రాజు ఎన్ పేర్ దా రాజు మేరా నాం రాజు మై నేమ్ ఈజ్ రాజు రాజు రాజు... అందాల ఆ రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు పెద్ద రాణి నాట్యంలో మయూరి తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం చిన్న రాణి సంగీతంలో దిట్ట సరిగమల పుట్ట పద పద సాస సరి గరి సాపద పద పద సాస సగరిగ సరి గస పద దరి రిగ గస సప గరిస దప గారిస కళలే పోషించినాడురా తను కావ్యాలే రాసినాడురా శిలలే తెప్పించినాడురా ఘన శిల్పాలే మలచినాడురా చెరువులెన్నో తవ్వించి కరువుమాపి అహ అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా కులమతాల రక్కసిని రూపుమాపి అహ రామ రాజ్యమన్న పేరు తెచ్చినాడురా నీలాంటి రాజుంటే ఆ దేవుడింక ఎందుకంట చల్లనైన నీ చూపే మాకున్న పండు ఎన్నెలంట రాజాధి రాజా మార్తాండ తేజా నా పేరే రాజు మేరా నాం రాజు మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా ఆ రాజు గాథే ఈ రాజు పాట మమ నామ రాజు ఎన్ పేర్ దా రాజు ఎండ వేరే రాజు నన్న హెసరే రాజు నా పేరే రాజు

Andalalo Song Lyrics in Telugu – Jagadeka Veerudu Athiloka Sundari (1990)

'Andalalo' song from Jagadeka Veerudu Athiloka Sundari (1990) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Jagadeka Veerudu Athiloka Sundari (1990)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి లాలాల లా లలా లలా లలా లాలాల ల లలా లలా లలా లాలాల లా లలా లలా ఉహు హు హు హుహు హుహు అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వూ నవ్వూ పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో తారల్లారా రారే విహారమే అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడీ వరించెలే సరాలతో మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా తళా తళా గళాన తటిల్లతా హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వురు పలికెనులే ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వూ నవ్వూ పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో తారల్లారా రారే విహారమే అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా విహారినై ఇవాళే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం

Dhinakkuta Song Lyrics in Telugu – Jagadeka Veerudu Athiloka Sundari (1990)

'Dhinakkuta' song from Jagadeka Veerudu Athiloka Sundari (1990) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Jagadeka Veerudu Athiloka Sundari (1990)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర దినక్కుతా కసక్కురో ఝనక్కుతా ఢమక్కురో తళుక్కుతార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా దినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో తళుక్కుతార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా దినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో కసక్కు లయలు హొయలు చూశా కసెక్కి వలపు వలలే వేశా గుబుక్కు ఎదలో కథలే దాచా గుటుక్కు మనక గుబులే దోచా మజా చేస్తే మరోటంట మరోటిస్తే మగాణ్ణంట సరే అంటే అతుక్కుంటా సరాగంలో ఇరుక్కుంటా చుంబురున్నై నారదున్నై చుంబ మీద పంబ రేపి పాడుతుంటే మీరు గోవిందే గోవింద గోవింద కమాన్ కమాన్ పాడండయ్యా పబం పప్పా పబం పప్పా పబం పప్పా పబం పప్పా పబం పం పాబం పపం పం పాబం పబం పం పాబా పాబా బాబాబం దినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో తళుక్కుతార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా దినక్కుతా... కసక్కురో ఝనక్కుతా... చమక్కురో వయస్సు ఒడిలో సుడినే చూశా వరించి సుడిలో పడవే వేశా నటించే నరుడా ఘనుడా మెచ్చా నమస్తే నడుమే నటిగా ఇచ్చా ఉడాయిస్తే ఉడుక్కుంటా లడాయిస్తే హోయ్ ఉతుక్కుంటా సఖి అంటే సరే అంటా చెలి అంటే గురు అంటా బ్రేకు డాన్సు షేకు డాన్సు మిక్సు చేసి స్టెప్సు వేసి ట్రిక్స్ చేస్తే మీరు గోవిందా కమాన్ కమాన్ డాన్స్ ఐ సే ఆడండ్రా దినక్కుతా దినక్కుతా దినక్కుతా దినక్కుతా దినక్కు తార దినక్కు తార దినక్కు తార తారా తారారా దినక్కుతా... కసక్కురో ఝనక్కుతా... చమక్కురో తళుక్కుతార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా దినక్కుతా... కసక్కురో ఝనక్కుతా... చమక్కురోయ్

Jai Chiranjeeva Song Lyrics in Telugu – Jagadeka Veerudu Athiloka Sundari (1990)

'Jai Chiranjeeva' song from Jagadeka Veerudu Athiloka Sundari (1990) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Sailaja.

SONG INFORMATION
Movie : Jagadeka Veerudu Athiloka Sundari (1990)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
Singers : S. P. Sailaja
చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. శైలజ ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ... జై చిరంజీవా... జగదేక వీరా... జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా దీవించ రావయ్య వాయు సంచారా రక్షించవేలయ్య శ్రీరామ దూత జై చిరంజీవా... చరణం: 1 వీరాంజనేయా శూరాంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయా జై చిరంజీవా... ఆరోగ్యదాతా అభయ ప్రదాతా... ఆరోగ్యదాతా అభయ ప్రదాతా ఉన్మాద భయ జాడ్య పీడా నివారా సంజీవి గిరివాహా... సానీరిసాహా... సంజీవి గిరివాహ సానీరిసాహొ జై చిరంజీవా... జగదేక వీరా... జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా

Palli Balakrishna Thursday, March 22, 2018
Sitaara (1984) Telugu Songs Lyrics Album Cover

Sitaara (1984) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Sitaara (1984)
Music : Ilaiyaraaja
Director : Vamsy
Actors : Suman
Actresses : Bhanupriya
Release Date : 12 April 1984

Omkaara Panjara Sukhee Song Lyrics in Telugu – Sitaara (1984)

'Omkaara Panjara Sukhee' song from Sitaara (1984) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja.

SONG INFORMATION
Movie : Sitaara (1984)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: సితార (1984) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం గౌరీం అర్జున మంత్రం అపురూపం (2) శృంగారానికీ మణిదీపం (2) అర్జున మంత్రం అపురూపం మదన జనకుడికి ఆహ్లాదం మా జనకుడికిది అవరోధం (2) మనో వేగమున మరో లోకమున మనోరథములిటు పరుగిడగా (20 సుభద్రార్జునలమూ మేమే సుభద్రార్జునలమూ (2) ఆఆ...ఆఆఆ..ఆఆఅ..ఆఆఆఅ.. సరి నిరిస.. తాత్ తరికిట తాత్ తరికిట తద మదప.. తాత్ తరికిట తాత్ తరికిట నిరిస తాత్ తరికిట రిమగ తాత్ తరికిట గపమ గపమ మగనిస తాత్ తరికిట తాత్ తరికిట నెలవంకల్లో ఉంచి నవ్వూ.. ఇలవంక రావేమి నువ్వూ .. హహ..హహ..అహ్హహ్హ.. హహ..హహ..అహ్హహ్హ.. నెలవంకల్లో ఉంచి నవ్వూ.. ఇలవంక రావేమి నువ్వూ .. గుండెతోటలో గుత్తులేసిన మొక్కజొన్న పాలకంకి చుక్క ముగ్గులా నింగి ముంగిటా నక్కి ఉన్న బాలఎంకి మక్కువైన పిల్ల ఎంకి హా మక్కువైన పిల్ల ఎంకి నా ఎంకి హే.. హే.. ఏహే.. నెలవంకల్లో ఉంచి నవ్వూ.. అహ ఇలవంక రావేమి నువ్వు .. నెలవంకల్లో ఉంచి నవ్వూ.. అహ ఇలవంక రావేమి నువ్వూ .. తేట తేట నీరు వోసి తేటు లలగ పూలు కోసి తేట తేట నీరు వోసి తేటు లలగ పూలు కోసి చిగురాకుల నీ వ్రేళుళు చిదిమినంత చిగురులాయె చిగురాకుల నీ వ్రేళుళు చిదిమినంత చిగురులాయె ఓ అరాళ కుంతలా శకుంతలా మదనుని పదవులు పెదవులు మరి ఒక మారిటు సొకగ గపనిద పాపప పాపప నిసమగ సాసస సాసస ప్రణయపరీరంభవేళ చుంబనమై నను తాకగ గపనిద పాపప పాపప నిసమగ సాసస సాసస రావే ఇటు రావే .. ఊహూ.. ఊఊహుహు.. సురతమో అది నవరస భరితమో ఆఅ..ఆఅ.. సురతమో అది నవరస భరితమో రతి మదనుల భరతమో మరి భరతుని ఉదయమో

Jilibili Palukulu Song Lyrics in Telugu – Sitaara (1984)

'Jilibili Palukulu' song from Sitaara (1984) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Sitaara (1984)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: సితార (1984) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి అ హ హ హ హ... జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఏ మైనా ఓ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీ కైనా నాకైనా తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా హరివిల్లు రంగుల్లో అందాలే చిలికిన చిలకవు, ఉలకవు పలకవు ఓ మైనా ఏ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా ఉరుములలో అలికిడిలా వినిపించే ఈమైనా మెరుపులలో నిలకడగా కనిపించే ఈమైనా ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ వినువీధి వీణంలో రాగంలా ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఏ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆమైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా

Kinnerasaani Vachindammaa Song Lyrics in Telugu – Sitaara (1984)

'Kinnerasaani Vachindammaa' song from Sitaara (1984) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja.

SONG INFORMATION
Movie : Sitaara (1984)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: సితార (1984) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి.. శైలజ తననననన తననననన తననననన తననననన తననననన తననననన తననననన తననననన చమకు చమకు జింజిన్న జింజిన్న చమకు చమకు జిన్న జిన్న జిన్న కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి జమకు జమకు జింజిన్న జింజిన్న జమకు జమకు జిన్న జిన్న జిన్న కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరులతేనె చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చని చేల తనననన పావడగట్టి తనననన పచ్చని చేలా పావడగట్టి కొండమల్లెలే కొప్పునబెట్టీ వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి చరణం: 1 ఎండల కన్నే సోకని రాణి పల్లెకు రాణి పల్లవపాణి కోటను విడిచి పేటను విడిచి కోటను విడిచి పేటను విడిచి కనులా గంగా పొంగే వేళ నదిలా తానే సాగే వేళ రాగాల రాదారి పూదారి అవుతుంటే ఆ రాగాల రాదారి పూదారి అవుతుంటే కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి చరణం: 2 మాగాణమ్మ చీరలు నేసె మలిసందెమ్మ కుంకుమపూసె మువ్వులబొమ్మ ముద్దులగుమ్మ మువ్వులబొమ్మ ముద్దులగుమ్మ గడప దాటి నడిచే వేళ అదుపే విడిచి ఎగిరే వేళ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే... ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చని చేలా తనననన పావడగట్టి తనననన ఓయ్ పచ్చని చేలా పావడగట్టి అ కొండమల్లెలే కొప్పునబెట్టీ వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని

Kukukoo Kukukoo Song Lyrics in Telugu – Sitaara (1984)

'Kukukoo Kukukoo' song from Sitaara (1984) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Sitaara (1984)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: సితార (1984) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం కు కు కు కు కు కు కు కు కు కు కు కు కోకిల రావె కు కు కు కు కు కు కోకిల రావె రాణివాసము నీకు ఎందుకో కో కో రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో చరణం: 1 రంగుల లోకం పిలిచే వేళ రాగం నీలో పలికే వేళ విరుల తెరలే తెరచి రావే బిడియం విడిచి నడచి రావే నా పాటల తోటకు రావె ఈ పల్లవి పల్లకిలో నా పాటల తోటకు రావె ఈ పల్లవి పల్లకిలో స్వరమై రావే విరి పొదల ఎదలకు చరణం: 2 సూర్యుడు నిన్నే చూడాలంట చంద్రుడు నీతో ఆడాలంట బురుజు బిరుదు విడిచి రావే గడప తలుపు దాటి రావే నువు ఏలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో నువు ఏలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో లయగా రావే ప్రియ హృదయ జతులకు

Nee Gaanam Song Lyrics in Telugu – Sitaara (1984)

'Nee Gaanam' song from Sitaara (1984) movie is composed by Ilaiyaraaja and sung by S. Janaki.

SONG INFORMATION
Movie : Sitaara (1984)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
Singers : S. Janaki
చిత్రం: సితార (1984) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్. జానకి నీ గానం మృదు మధురం పావనం నీ గానం మృదు మధురం పావనం నాట్యము గానము నాకు నవ జీవనం నాదమే పాదమై నడచు బృందావనం నీ గానం మృదు మధురం పావనం

Vennello Godari Andam Song Lyrics in Telugu – Sitaara (1984)

'Vennello Godari Andam' song from Sitaara (1984) movie is composed by Ilaiyaraaja and sung by S. Janaki.

SONG INFORMATION
Movie : Sitaara (1984)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
Singers : S. Janaki
చిత్రం: సితార (1984) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్. జానకి అ... అ... అ... అ... అ... వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేద నా గుండెలో చలినిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌనగీతం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం జీవిత వాహిని అలలై ఆ... ఆ... ఆ... ఆ... ఆ... జీవిత వాహిని అలలై ఊహకు ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో ఎడబాటే ఒక పాటై పూలదీవిలో సుమవీణ మోగునా వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి... ఆ... ఆ... ఆ... ఆ కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని చిదిమి చిదిమి వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే నాకు లేదు మమకారం మనసు మీద అధికారం నాకు లేదు మమకారం మనసు మీద అధికారం ఆశలు మాసిన వేసవిలో ఆవేదనలో రేగిన ఆలాపన సాగే మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కరిగే మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో... తిరిగే... సుడులై ఎగసే ముగిసే కథనేనా ఎగసే ముగిసే కథనేనా

Palli Balakrishna Sunday, August 20, 2017
Sakhi (2000) Telugu Songs Lyrics Album Cover

Sakhi (2000) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Sakhi (2000)
Music : A. R. Rahman
Director : Mani Ratnam
Producer : Mani Ratnam
Actors : R. Madhavan
Actresses : Shalini
Release Date : 4 April 2000

Kailove Chedugudu Song Lyrics in Telugu – Sakhi (2000)

'Kailove Chedugudu' song from Sakhi (2000) movie is composed by A. R. Rahman and sung by Naveen, S. P. B. Charan and A. R. Rahman.

SONG INFORMATION
Movie : Sakhi (2000)
Music : A. R. Rahman
Lyricist : Veturi
చిత్రం: సఖి (2000) సంగీతం: ఏ ఆర్. రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బి.చరణ్, నవీన్, ఏ ఆర్. రెహమాన్ కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు(4)  అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే  నను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే  తొలిగా పాడే ఆ పల్లవి ఔనేలే  దరికే వస్తే లేనంటావే  నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ ఓహో పడుచు పాట నెమరువేస్తే ఎదలో వేడే పెంచే  పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే  కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు (4)  చరణం: 1  నీళ్లోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్  వేదిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందోయ్  నేనొచ్చి తాకానో ముల్లల్లే పొడిచేనోయ్  తానొచ్చి తాకిందో పువ్వల్లె అయ్యేనోయ్  కన్నీరే పన్నీరై ఉందామే రావేమే  నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే  నీ అందం నీ చందం నీకన్నా ఎవరులే  నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ ఓహో పడుచు పాట నెమరువేస్తే ఎదలో వేడే పెంచే  పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే  కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు (4)  చరణం: 2  ఉద్దేశ్యం తెలిసాక ఆయుష్షే పోలేదు  సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు  నా గాధ ఏదైనా ఊరించే నీ తోడు  ఎంతైనా నా మోహం నీదమ్మ ఏనాడూ  కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే  చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే  నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రణయమా నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ ఓహో పడుచు పాట నెమరువేస్తే ఎదలో వేడే పెంచే  పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే  కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు (4) 

Snehithuda Song Lyrics in Telugu – Sakhi (2000)

'Snehithuda' song from Sakhi (2000) movie is composed by A. R. Rahman and sung by Sadhana Sargam and Srinivas.

SONG INFORMATION
Movie : Sakhi (2000)
Music : A. R. Rahman
Lyricist : Veturi
చిత్రం: సఖి (2000) సంగీతం: ఏ ఆర్. రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: శ్రీనివాస్, సాధన సర్గం నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో  గాలల్లే తేలిపోతానోయ్ ఇలా డోలలుగేనో  ఆనందాలర్ధరాత్రి అందాల గుర్తుల్లో  నిన్ను వలపించా  మనం చెదిరి విలపించా  కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే  స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా  ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకూ వెలిగే వేదం  వాంఛలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చరణం: 1  చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్ మనసే మధువోయ్ పువ్వు కోసే భక్తుడల్లె మెత్తగా  నేను నిద్రపోతే లేతగోళ్ళు గిల్లవోయ్ సందెల్లో తోడువోయ్ ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు సేయవలెగా ఇద్దరమొకటై కన్నెరైతే తుడిచేవేలందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా  నిన్న మునిమపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో గాలల్లే తేలిపోతానో ఇలా డోలలూగేనో ఆనందాలర్ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించ మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే చరణం: 2  శాంతించాలి పగలింటి పనికే శాంతించాలి పగలింటి పనికే నీ సొంతానికి తెచ్చేదింక పడకే వాలే పొద్దూ వలపే వుల్లెన్ చొక్కా ఆరబోసే వయసే నీటి చెమ్మ చెక్కలైన నాకు వరసే ఉప్పు మూటే అమ్మైనా ఉన్నట్టుండి తేస్త ఎత్తేసి విసిరేస్త కొంగుల్లో నిన్నే దాచేస్తా వాలాక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా  ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకూ వెలిగే వేదం  వాంఛలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా 

Yede Yedeydey Song Lyrics in Telugu – Sakhi (2000)

'Yede Yedeydey' song from Sakhi (2000) movie is composed by A. R. Rahman and sung by Sujatha Mohan, Subha and Vaishali.

SONG INFORMATION
Movie : Sakhi (2000)
Music : A. R. Rahman
Lyricist : Veturi
చిత్రం: సఖి (2000) సంగీతం: ఏ ఆర్. రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: సుజాత మోహన్, సుభ, వైశాలి పల్లవి: యేడే యేడేడే వయ్యారి వరుడు యేడే వాడేడే నీ తిమ్మిరొంచే ఘనుడు (2) చంద్రుడున్న ఎన్నెలింట ఇంద్రుడొచ్చి బంతులేస్తే లాగి బంతి మల్లి తన్నే వరుడేనా ఔనా చందనాల బొట్టందాలు సరదా సరదా నడకాందాలు పట్టు పంచెకట్టే వరుడేనా ఔనా యేడే యేడేడే వయ్యారి వరుడు యేడే వాడేడే నీ తిమ్మిరొంచే ఘనుడు (2) చరణం: 1 తళుకుతార వెన్నెల పాలేరై పారంగా సంజ కన్ను మైకాలేలింక ఆ ఆఆ ఆ ఆ ఆఆ ముద్దుగుమ్మ ఇక్కడ లేదమ్మా చూడండోయ్ ముద్దుపోడుపులెట్ట చెప్పండోయ్ ముస్సలోల్లె చెప్పి వెల్లండోయి చెప్పి వెల్లండోయ్ ఎలాగో ఎలాగో ఎలాగో కన్నెపిల్ల ఎంతో జానమ్మ ఇక చాలమ్మ పడకటింట పాటాలేలమ్మ యేడే యేడేడే వయ్యారి వరుడు యేడే ఇతడేనా నీ తిమ్మిరొంచే ఘనుడు చంద్రుడున్న ఎన్నెలింట ఇంద్రుడొచ్చే బంతులేస్తే లాగి బంతి మల్లి తన్నే మరుడేనా ఔనా మల్లు పంచ కట్టుకొచ్చి జాతి విప్పకొమ్మ పట్టి మల్లి రమ్మన్నా నీ మొగుడతడే అవునా చరణం: 2 కమ్మగా చిరకాలం వర్ధిల్లు కళ్యాణం కళ్యాణం పూతిగట్టు కళ్యాణం కళ్యాణం కళ్యాణం పూన్నాగట్టు కళ్యాణం కళ్యాణం కళ్యాణం పులకింతక్క కళ్యాణం కళ్యాణం కళ్యాణం పులకింత కళ్యాణం పులకింత కళ్యాణం పసిడి తాళి భామకెందుకు ఎందుకు మూడుముళ్ళ ముచ్చట్లేందుకు ఆ ఆఆ ఆ తొలిమాటేసే హక్కు ముడికి తొలిమాటేసే హక్కు ముడికి అరెరే అనుబందాలే రెండో ముడికి ఊరోల్లడిగే మూడో ముడికి మురిసే మనసే మెరిసే ముడులే పసిడి తాళి భామకెందుకు ఎందుకు మూడుముళ్ళ ముచ్చట్లెందుకు యేడే యేడేడే వయ్యారి వరుడు యేడే ఇతడేనా నీ తిమ్మిరొంచే ఘనుడు (2)

September Maasam Song Lyrics in Telugu – Sakhi (2000)

'September Maasam' song from Sakhi (2000) movie is composed by A. R. Rahman and sung by S. Janaki and Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Sakhi (2000)
Music : A. R. Rahman
Lyricist : Veturi
చిత్రం: సఖి (2000) సంగీతం: ఏ ఆర్. రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: ఎస్.జానకి, శంకర్ మహదేవన్ పల్లవి:  బాధ తీరునది శాంతి పోవునది బాధ తీరునది శాంతి పోవునది సెప్టెంబర్ మాసం... సెప్టెంబర్ మాసం  పాత బాధలు తలెత్తనివ్వం సెప్టెంబర్ మాసం... సెప్టెంబర్ మాసం  పాత బాధలు తలెత్తనివ్వం అక్టోబర్ మాసం... అక్టోబర్ మాసం...  కొత్త బాధలు తలెత్తుకున్నాం  బాధ తీరేదెపుడో... ప్రేమ పుట్టిననాడే  శాంతి పోయేదెపుడో.. కళ్యాణం పూర్తైన నాడే  సెప్టెంబర్ మాసం... సెప్టెంబర్ మాసం  పాత బాధలు తలెత్తనివ్వం అక్టోబర్ మాసం... అక్టోబర్ మాసం...  కొత్త బాధలు తలెత్తుకున్నాం  బాధ తీరేదెపుడో... ప్రేమ పుట్టిననాడే  శాంతి పోయేదెపుడో.. కళ్యాణం పూర్తైన నాడే... చరణం: 1  ఏయ్ పిల్లా కౌగిళ్ళ లోపట ఇరుకు పసందు కళ్యానమయ్యాక వేపంత చేదు ఏం కధ  చెలిమి పండమ్మ కన్నె ప్రేమ చేదు పిండేను కళ్యాణం ప్రేమ ఏం కాదా..  కన్నె ప్రేమకు మత్తు కళ్ళంట కళ్యాణ ప్రేమకు నాల్గు కళ్ళంట పిల్లా  చిరు ముక్కు ఎరుపెక్కె కోపాల అందాలు రసిక రసిక కావ్యం  కళ్యానమయ్యాక చిరు బుర్రు తాపాలు ఏం ఏం ఏం బాధల్  మా ఆడాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది  మీరే లేని లోకమందు దిక్కులన్ని ఇక మావేగా  సెప్టెంబర్ మాసం... సెప్టెంబర్ మాసం  అక్టోబర్ మాసం... అక్టోబర్ మాసం...  చరణం: 2  హా తెలిసెన్ కౌగిలి అన్నది కంఠ మాల కళ్యానమన్నది కాలికి సంకెల ఏం చేస్తాం  హా కళ్యానమెపుడు నెట్టేసి పారెయ్యి నూరేళ్ళ వరకు డ్యూయెట్లు పాడెయ్యి ఓ గుమ్మా...  కౌగిళ్ళ బంధాల ముచ్చట్లు అచ్చట్లు కళ్యానమయ్యాక కరువగులే బావా  విరహాలు లేకుండా ప్రణయంలో సుఖమేది అదే అదే ప్రేమ  ఒక చోట చిర కాలం మరు చోట చిరు కాలం ఉందామా భామ  మా మగాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది...  మీరే లేని లోకమందు దిక్కులన్ని ఇక మావేగా సెప్టెంబర్ మాసం... సెప్టెంబర్ మాసం  పాత బాధలు తలెత్తనివ్వం అక్టోబర్ మాసం... అక్టోబర్ మాసం...  కొత్త బాధలు తలెత్తుకున్నాం  బాధ తీరేదెపుడో... ప్రేమ పుట్టిననాడే  శాంతి పోయేదెపుడో.. కళ్యాణం పూర్తైన నాడే...

Alai Pongeraa Song Lyrics in Telugu – Sakhi (2000)

'Alai Pongeraa' song from Sakhi (2000) movie is composed by A. R. Rahman and sung by Kalyani Menon, Harini and Kalpana.

SONG INFORMATION
Movie : Sakhi (2000)
Music : A. R. Rahman
Lyricist : Veturi
చిత్రం: సఖి (2000) సంగీతం: ఏ ఆర్. రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: హరిణి, కళ్యాణి మీనన్, కల్పన పల్లవి:  అలై పొంగెరా కన్నా  మానసమలై పొంగెరా  ఆనంద మోహన వేణు గానమున ఆలాపనే కన్నా..  మానసమలై పొంగెరా  నీ నవరస మోహన వేణుగానమది  అలై పొంగెరా కన్నా...  నిలబడి వింటూనే చిత్తరువైనాను  కాలమాగినది రా దొరా ప్రాయమున యమున  మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా..  చరణం: 1  కనుల వెన్నెల పట్ట పగల్ పాల్ చిలుకగా  కలువ రేకుల మంచు ముత్యాలు వెలిగే  కన్నె మోమున కనుబొమ్మలటు పొంగే  కాదిలి వేణుగానం కాదడ పలికే కాదిలి వేణుగానం కాదడ పలికే కన్నె వయసు కళలొలికే వేళలో  కన్నె సొగసు ఒక విధమై ఒరిగెలే  అనంతమనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా  నిశాంత మహీచ శకుంతమరందమెడారి గళాన వర్షించవా  ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన  వరించి కౌగిళ్ళు బిగించవా  సుగంధ వనాన సుఖాల క్షణాన  వరించి కౌగిళ్ళు బిగించవా  కడలికి అలలకు కధకళి కలలిడు  శశికిరణము వలె చలించవా  చిగురు సొగసులను తలిరుటాకులకు రవికిరణాలే రచించవా  కవిత మదిని రగిలె ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో  కవిత మదిని రగిలె ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగ  అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా  నీ ఆనందమోహన వేణుగానమున ఆలాపనే కన్నా.... కన్నా ....

Kalalai Poyenu Song Lyrics in Telugu – Sakhi (2000)

'Kalalai Poyenu' song from Sakhi (2000) movie is composed by A. R. Rahman and sung by Swarnalatha.

SONG INFORMATION
Movie : Sakhi (2000)
Music : A. R. Rahman
Lyricist : Veturi
Singers : Swarnalatha
చిత్రం: సఖి (2000) సంగీతం: ఏ ఆర్. రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: స్వర్ణలత ప్రేమలే నేరమా ప్రియా ప్రియా... వలపు విరహమా ఓ నా ప్రియా... మనసు మమత ఆకాశమా  ఒక తారై మెరిసిన నీవెక్కడో కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు మదికే అతిధిగ రానేలనో సెలవైనా అడగక పోనేలనో  ఎదురు చూపుకు నిదరేది ఊగెను ఉసురే కన్నీరై  మనసు అడిగిన మనిషెక్కడో నా పిలుపే అందని దూరాలలో  కలలై పోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు  చరణం: 1  అనురాగానికి స్వరమేది సాగర ఘోషకు పెదవేది అనురాగానికి స్వరమేది సాగర ఘోషకు పెదవేది ఎవరికి వారే ఎదురుపడి వ్యధలు రగులు ఎడబాటులలో  చివరికి దారే మెలికపడి నిను చేరగ నేనే శిలనైతిని  ఎండమావిలో నావనులే ఈ నిట్టుర్పే నా తెరచాపలే  కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు  చరణం: 2  వెన్నెల మండిన వేదనలో కలువ పువ్వులా కలతపడి వెన్నెల మండిన వేదనలో కలువ పువ్వులా కలతపడి చేసిన బాసలు కలలైపోతే బతుకే మాయగ మిగులునని  నీకై వెతికా కౌగిలిని నీడగ మారిన వలపులతో  అలిసి ఉన్నాను ఆశలతో నను ఓదార్చే నీ పిలుపెన్నడో  కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు  కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు 

Pachhadanamey Song Lyrics in Telugu – Sakhi (2000)

'Pachhadanamey' song from Sakhi (2000) movie is composed by A. R. Rahman and sung by Hariharan and Clinton Cerejo.

SONG INFORMATION
Movie : Sakhi (2000)
Music : A. R. Rahman
Lyricist : Veturi
చిత్రం: సఖి (2000) సంగీతం: ఏ ఆర్. రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: హరిహరన్, క్లింటన్ సీరిజో సఖియా....చెలియా...  కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు  సఖియా...చెలియా  నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు పచ్చందనమే పచ్చదనమే  తొలి తొలి వలపే పచ్చదనమే  పచ్చిక నవ్వుల పచ్చదనమే  ఎదకు సమ్మతం చెలిమే ఎదకు సమ్మతం చెలిమే పచ్చందనమే పచ్చదనమే  ఎదిగే పరువం పచ్చదనమే  నీ చిరునవ్వు పచ్చదనమే  ఎదకు సమ్మతం చెలిమే  ఎదకు సమ్మతం చెలిమే  ఎదకు సమ్మతం చెలిమే  చరణం: 1  కలికి చిలకమ్మ ఎర్రముక్కు  ఎర్రముక్కులే పిల్ల వాక్కు  పువ్వై పూసిన ఎర్ర రోజా  పూత గులాబి పసి పాదం  ఎర్రాని రూపం ఉడికే కోపం ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే  ఎర్రని పంట పాదమంటే  కాంచనాల జిలుగు పచ్చ  కొండబంతి గోరంత పచ్చ  పచ్చా...పచ్చా..పచ్చా...  మసకే పడితే మరకత వర్ణం  అందం చందం అలిగిన వర్ణం సఖియా....చెలియా...  కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు  సఖియా...చెలియా  నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు అలలే లేని సాగర వర్ణం  మొయిలే లేని అంబర వర్ణం  మయూర గళమే వర్ణం  గుమ్మాడి పూవు తొలి వర్ణం  ఊదా పూ రెక్కలపై వర్ణం  ఎన్నో చేరెనీ కన్నె గగనం  నన్నే చేరె ఈ కన్నె భువనం  చరణం: 2  రాత్రి నలుపే రంగు నలుపే  వానాకాలం మొత్తం నలుపే  కాకి రెక్కల్లో కారు నలుపే  కన్నె కాటుక కళ్ళు నలుపే  విసిగి పాడే కోయిల నలుపే  నీలాంబరాల కుంతల నలుపే నీలాంబరాల కుంతల నలుపే సఖియా....చెలియా...  కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు  సఖియా...చెలియా  నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు తెల్లని తెలుపే ఎద తెలిపే  వానలు కడిగిన తుమి తెలిపే తెల్లని తెలుపే ఎద తెలిపే  వానలు కడిగిన తుమి తెలిపే ఇరుకనుపాపల కధ తెలిపే  ఉడుకు మనసు తెలిపే  ఉరుకు మనసు తెలిపే 

Palli Balakrishna Friday, August 4, 2017
Swathi Muthyam (1986) Telugu Songs Lyrics Album Cover

Swathi Muthyam (1986) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
Director : K. Viswanath
Actors : Kamal Haasan
Release Date : 13 March 1986

Suvvi Suvvi Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Suvvi Suvvi' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
చిత్రం: స్వాతి ముత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సి. నారాయణరెడ్డి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...ఆ... ఆ... ఆ... ఆ... ఆ... చాలా బాగా పాడుతున్నారే ఆ... పైశడ్యం ఉఁ ఆఁ మంగలం ఆ... ఆ... ఆ... చుడండి ఆ... ఆ...ఆ...ఆ... ఆ... ఆఁ ఆ... ఆ... ఆ... ఆ... నిసరిమపనిసరి నిరినిసనిప మపనిసానిమరిపరీనీసా తానననా తానాన తదరీ... నా... ఆ... పల్లవి: సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా హా హా ఆ ఆ ఆ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా చరణం: 1 ఓహో హో హో... ఆ... హా హా... ఏ...హే హే హే... అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా గుండెలేని మనిషల్లే... గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ... సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా చరణం: 2 చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు సువ్వీ సువ్వీ సువ్వీ...

Vatapatra Saayiki Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Vatapatra Saayiki' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja and sung by P. Susheela.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
Singers : P. Susheela
చిత్రం: స్వాతి ముత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి... ఆ... మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ కల్యాణ రామునికి కౌసల్య లాలి కల్యాణ రామునికి కౌసల్య లాలి యదువంశ విభునికి యశోద లాలి యదువంశ విభునికి యశోద లాలి కరిరాజ ముఖునికి... కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి పరమాంశభవునికి పరమాత్మ లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి జోజో జోజో జో... జోజో జోజో జో... అలమేలు పతికి అన్నమయ్య లాలి అలమేలు పతికి అన్నమయ్య లాలి కోదండరామునికి గోపయ్య లాలి కోదండరామునికి గోపయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి ఆగమనుతునికి త్యాగయ్య లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ

Ramaa Kanavemiraa Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Ramaa Kanavemiraa' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
చిత్రం: స్వాతి ముత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సి. నారాయణరెడ్డి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ రామా కనవేమిరా (2) శ్రీ రఘురామ కనవేమిరా రామా కనవేమిరా రమణీ లలామ నవ లావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసధులందరూపదే పదే చూడగా శ్రీ రామచంద్ర మూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు రామా కనవేమిరా (2) శ్రీ రఘురామ కనవేమిరా రామా కనవేమిరా రమణీ లలామ నవ లావణ్య సీమ రమణీ లలామ నవ లావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా ముసిముసి నగవుల రసిక శిఖామనులు ఒసపరి చూపుల ఆసదుశ విక్రములు సగారిదా మని దా మ ని ని ముసిముసి నగవుల రసిక శిఖామనులు థా థకిట థక జణుథ ఒసపరి చూపుల ఆసదుశ విక్రములు థకజణు థకధిమి తక మీసం మీటే రోష పరాయణులు నీ దా మ ప మ స రీ గా మా సరి ఎవరను మత్త గుణోల్వణులు ఆహా క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివ ధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ రామా కనవేమిరా కనవేమిరా... ముందుకేగి విల్లందబొయి ముచ్చెమటలు పట్టిన దొరలు భూవరులు తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు ముందుకేగి విల్లందబొయి ముచ్చెమటలు పట్టిన దొరలు భూవరులు తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు ఆ... గుండెలు జారిన విభులు విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నర పంగవులు తమ ఒళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గేసిన పురుషాఘ్రనులు ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టె వారు లేరా ఆ ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టె వారు లేరా అరెరరె ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టే వారు లేరా అహా ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టె వారు లేరా తాకిట తైయ్యకు తా దిమి తా రామాయ రామభద్రాయా రామచంద్రాయ నమః అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీదచెయ్యివేసినాడు అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యివేసినాడు సీత వంక ఓరకంట చూసినాడు సీత వంక ఓరకంట చూసినాడు ఒక్కచిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు పెళపెళ పెళపెళ పెళపెళ పెళపెళ విరిగెను శివధనువు కళలోలికెను సీతానవవధువు జయ జయ రామా రఘుకుల సోమ జయ జయ రామా రఘుకుల సోమ దశరధ రామా ధైత్యవిరామ దశరధ రామా ధైత్యవిరామ జయ జయ రామా రఘుకుల సోమ జయ జయ రామా రఘుకుల సోమ దశరధ రామా ధైత్యవిరామ దశరధ రామా ధైత్యవిరామ సీతాకళ్యాణవైభోగమే శ్రీరామకళ్యాణవైభోగమే సీతాకళ్యాణవైభోగమే శ్రీరామకళ్యాణవైభోగమే కనగ కనగ కమనీయమే అనగ అనగ రామణీయమే కనగ కనగ కమనీయమే అనగ అనగ రామణీయమే సీతాకళ్యాణవైభోగమే శ్రీరామకళ్యాణవైభోగమే రామయ్య అదుగోనయ్య రమణీ లలామా నవలావణ్య సీమా ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా రామా కనవేమిరా

Manasu Palike Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Manasu Palike' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
చిత్రం: స్వాతి ముత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సి. నారాయణరెడ్డి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి మనసు పలికే, మనసు పలికే మౌనగీతం, మౌనగీతం మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే, మమతలొలికే స్వాతి ముత్యం, స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు ఉఁ మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే స్వాతి ముత్యం నీవే చరణం: 1 శిరసుపైని గంగనై మరుల జలకాలాడనీ మరుల జలకాలాడనీ ఆ... సగము మేన గిరిజనై పగలు రేయి ఒదగనీ పగలు రేయీ ఒదగనీ ఆ... హృదయ మేళనలో మధుర లాలనలో హృదయ మేళనలో మధుర లాలనలో వెలిగిపోనీ రాగ దీపం వెలిగిపోనీ రాగ దీపం వేయి జన్మలుగా... మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే స్వాతి ముత్యం నీవే ఆ... ఆ... ఆ... ఆ... ఆ... చరణం: 2 కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ ఓనమాలు దిద్దనీ ఆ... పెదవిపైని ముద్దునై మొదటి తీపి అద్దనీ మొదటి తీపి... ఓ... లలిత యామినిలో కలల కౌముదిలో లలిత యామినిలో కలల కౌముదిలో కరిగిపోని కాలమంతా కరిగిపోని కాలమంతా కౌగిలింతలుగా... మనసు పలికే, మనసు పలికే మౌనగీతం, మౌనగీతం మనసు పలికే మౌన గీతం నేడే మమతలొలికే, మమతలొలికే స్వాతి ముత్యం, స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు

Chinnaari Ponnaari Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Chinnaari Ponnaari' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
Lyricist : Acharya Aatreya
చిత్రం: స్వాతి ముత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవలు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబో ఊరుకో నా నాన్న నిన్నూరడించ నేనున్నా చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవలు కొట్టారమ్మా నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరోక తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో వెన్నకై దొంగలా వెళ్లితివేమో మన్నుతిని చాటుగా దాగితివేమో అమ్మా మన్నుతినంగ నే చిచువును ఆకొంతినో వెద్దినో చూదు నోలు ఆఆ వెర్రిది అమ్మేరా ఆఆఆఅ వెర్రిది అమ్మేర పిచ్చిదామె కోపంరా పచ్చికొట్టి వెల్దామ్మా బూచికిచ్చి పోదామా వూ వూ హుహు హుహు ఏలుపోత్తోంది నాకేడుపోత్తోంది పచ్చికొట్టిపోయామా పాలెవలు ఇత్తారు ఆ బూచాడికి ఇచ్చామా బువ్వెవలు పెడతాలు చెప్పు అమ్మతోనే ఉంటాము అమ్మనొదిలి పోలేము అన్నమైన తింటాము తన్నులైన తింటాము కొత్తమ్మ కొత్తు బాగా కొత్తు ఇంకా కొత్తు కొత్తు చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య తిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారు నాన్న ఎవలమ్మా చిన్నవాడ వైతేను చెయ్యెత్తి కొట్టేను పెద్దవాడవైతేను బుద్ధిమతి నేర్పేను యశోదను కానురా నిను దండించ సత్యను కానురా నిను సాధించ ఎవ్వరు నువ్వని ఈ ఈ ... ఎవ్వరు నువ్వని నన్ను అడుగకు ఎవరు కానని విడిచి వెళ్లకు నన్ను విడిచి వెళ్లకు ఆ వెళ్ళము వెళ్ళములేమ్మ చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబోయ్ ఊరుకో నా నాన్న నిన్నూరడించ నేనున్నా చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య

Dharmam Saranam Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Dharmam Saranam' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam, S. P. Sailaja and Chorus.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
చిత్రం: స్వాతి ముత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సి. నారాయణరెడ్డి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ ధర్మం... శరణం గచ్ఛామి దానం... శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ఇంతో అంతో... ఓ ఇంతో అంతో ఇచ్చిన వారికి ఇహమే స్వర్గం లేదిక మరుజన్మం లేదిక మరుజన్మం ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి తెల్ల వారితే కూడు దక్కకా పొద్దు వాలితే గూడు చిక్కకా తెల్ల వారితే కూడు దక్కక పొద్దు వాలితే గూడు చిక్కక బాధలు మోసే అభాగ్యులం బతుకులు ఈడ్చే అనాథలం అభాగ్యులం అనాథలం అభాగ్యులం అనాథలం ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి కన్నవారికి కానివారమై కన్నవారికి కానివారమై ఉన్న ఊరికి దూరదూరమై ఎన్ని గడపలు ఎక్కామో ఎన్ని కాళ్ళకు మొక్కామో అభాగ్యులం అనాథలం అభాగ్యులం అనాథలం ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి

Pattu Cheera Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Pattu Cheera' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
Lyricist : K. Viswanath
చిత్రం: స్వాతి ముత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: కె. విశ్వనాథ్ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. శైలజ పట్టుసీర తెస్తననీ... పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా గట్టు సేరేదాకా అట్టగే ఉండు పట్టపగలల్లే ఓ సందమామా పట్టపగలల్లే ఓ సందమామా… తన్ననానె నానా తానానెనానా తన్ననానా… తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు మావా తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు మావా ఆలినయ్యేదాకా వెల్లిపోమాకా ఎన్నెలమ్మతోడూ ఓ సందమామా ఎన్నెలమ్మ ఓయ్ తోడూ ఓ సందమామా ఎన్నెలమ్మ ఆ అబ్బా

Vatapatra Saayiki Pathos Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Vatapatra Saayiki Pathos' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja and sung by P. Susheela.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
Singers : P. Susheela
చిత్రం: స్వాతి ముత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ లాలీ వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి జోజో జోజో జోజో జో... జోజో జోజో జోజో జో...

Laali Laali Ending Song Lyrics in Telugu – Swathi Muthyam (1986)

'Laali Laali Ending Song' song from Swathi Muthyam (1986) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. P. Sailaja.

SONG INFORMATION
Movie : Swathi Muthyam (1986)
Music : Ilaiyaraaja
Song: 9 Laali Laali Ending Song Telugu Lyrics Paste Here

Palli Balakrishna Tuesday, July 25, 2017

Most Recent

Default