-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ranjith"


చిత్రం: జువ్వ (2018)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహ్రా
నటీనటులు: కార్తిక్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం:
నిర్మాత:
విడుదల తేది: 2018

ఓతప్ప  ఓతప్ప  ఓతప్ప రప్పారప్పారో (4)

నేనసలసలసలసలనుకోలేదే
అసలసలసలసలనుకోలేదే
అసలసలసలనుకోనేలేదే

నీ కలయిక నిజమని అనుకోలేదు
కదలిక నిజమని అనుకోలేదే
నీ జత నిజమని అనుకోనేలేదే
హే గుండెల్లో గుబులుగుంది కాస్తా
నా కళ్లల్లో కదులుతుంది కోస్తా
హే పిచ్చ పిచ్చగా హే వెచ్చ వెచ్చగా
హే కచ్చ కచ్చగా హే రచ్చ రచ్చగున్నాదే

నేనసలసలసలసలనుకోలేదే
అసలసలసలసలనుకోలేదే
అసలసలసలనుకోనేలేదే

తారలన్ని తారుమారు అవుతాయని
దారులన్ని నా దారి కొస్తాయని
కాలమొచ్చి కాలుకింద ఉంటాదని
జాతకంలో గీతలన్ని గిర్రు గిర్రు తిరిగి
జంట రాత రాస్తాయని 

నేనసలసలసలసలసలసలనుకోలేదే
అసలసలసలనుకోలేదే
అసలు అసలు అసలనుకోనేలేదే

ఉప్పెనైనతియ్యతియ్య గుంటాదని
నిప్పులైన వెన్నెళ్ళు తెస్తాయని
తప్పులన్ని మెప్పులందుకుంటాయని
చెప్పలేని తీరులోన చళ్ళు చళ్ళు మంటు చెంప
ముద్దులందు కుంటాదనీ...

నేనసలసలసలసలసలసలసలనుకోలేదే
అసలసలసలనుకోలేదే
అసలు అసలు అసలనుకోనేలేదే

ఓతప్ప  ఓతప్ప  ఓతప్ప రప్పారప్పారో (4)

నీ కలయిక నిజమని అనుకోలేదు
కదలిక నిజమని అనుకోలేదే
నీ జత నిజమని అనుకోనేలేదే

Palli Balakrishna Saturday, March 3, 2018
Athanokkade (2005) Telugu Songs Lyrics Album Cover

Athanokkade (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Athanokkade (2005)
Music : Mani Sharma
Director : Surender Reddy
Producer : Nandamuri Janaki Ram
Actors : Kalyan Ram
Actresses : Sindhu Tolani
Supporting Cast : Ashish Vidyarthi
Release Date : 07 May 2005

Meghamala Song Lyrics in Telugu – Athanokkade (2005)

'Meghamala' song from Athanokkade (2005) movie is composed by Mani Sharma and sung by Ranjith, Sunitha Upadrashta.

SONG INFORMATION
Movie : Athanokkade (2005)
Music : Mani Sharma
Lyricist : Bandaru Danaiah
చిత్రం: అతనొక్కడే (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: బండారు దానయ్య గానం: రంజిత్, సునీత ఉపద్రష్ట పల్లవి: మేఘమాల మెరిసిందటే వాన చినుకు కురిసిందటే నేలకు ఆనందం ఆ నింగికి ఆనందం మేఘమాల మెరిసిందటే వాన చినుకు కురిసిందటే నేలకు ఆనందం ఆ నింగికి ఆనందం తారాలన్ని మురిసే వేళ నీటి పూలై విరిసే వేళ వెన్నెల ఆనందం ఆ వన్నెలు ఆనందం తారాలన్ని మురిసే వేళ నీటి పూలై విరిసే వేళ వెన్నెల ఆనందం ఆ వన్నెలు ఆనందం ఆనందం మర్మముమైతే అనురాగం మమ్మరమైతే స్వర్గానికి నిచ్చెన వేస్తా ఈ జగతికి ప్రాణం పోస్తాం చరణం: 1 అచ్చతెలుగు అంటానన్ని అచ్చం నా కోసం వెండి మబ్బుల బంగారు తొడుగే మా కోసం నవ్వు పువ్వులే ఈ జన్మంతా రువ్వులు మా కోసం గుండె లోతుల తేనెల మడుగే మా కోసం మన్ను మిన్ను వన్నె చిన్నె అన్ని మా కోసం ఉదయ సంధ్యా సాయం సంధ్యల వెలుగు మా కోసం అమృతానికి తీపిని అద్దిన సొగసు మా కోసం స్వర్గ సారను మించగా పుట్టినా భూమి మా కోసం చరణం: 2 చందమామకు వంతెన వేసే వెన్నెల మా కోసం నీలి కన్నుల తెల్లని కలలే మాకోసం చంద్రవంక వాగు వంక నిత్యం మా కోసం కొండకోన చెట్టు చేమ మా కోసం ఏడు రంగుల ఇంద్రుని ధనస్సు పొంగు మా కోసం ఈడు రేగిన ఇంతటి మనస్సు పొంగు మా కోసం అదుర లేనిది ఏది లేదను వయస్సు మా కోసం ఇన్ని ఇచ్చిన ఆ పై దేవుడు అసలు మా కోసం

Chita Pata Song Lyrics in Telugu – Athanokkade (2005)

'Chita Pata' song from Athanokkade (2005) movie is composed by Mani Sharma and sung by Tippu, Sunitha Upadrashta.

SONG INFORMATION
Movie : Athanokkade (2005)
Music : Mani Sharma
Lyricist : Chandrabose
చిత్రం: అతనొక్కడే (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: టిప్పు, సునీత ఉపద్రష్ట పల్లవి: చిటా పటా... చిటా పటా... చిటా పటా చిటా పటా... చిటా పటా... చిటా పటా చిటా పటా చిటా పటా చిందే వానా ఇక చెటా పటా చెటా పటా వేసే వానా చెట్టే లేని పువ్వుల్లాగ రాలే వానా చెంత వాలే వానా వానా వానా వెండి వానా బంగారంలా నిను దాచెయ్యనా వానా వానా రౌడి వానా చేసే అల్లర్లు గుండె నిండ నింపుకోన ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా నీతో రానా... ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా... ఏదేమైనా... చరణం: 1 వానకొట్టి వణుకుపుట్టి చలిగా ఉన్నాకాని చల్లనైన ఐసు నేను తింటూ ఉంటా ఏకధాటి వానలోన ఎగిరి తడిసి అలిసి తెచ్చుకున్న జలుబులోన తుమ్ముకూడ కమ్మనంట నల్లమబ్బులే నా ఆశకేమో అద్దమంట నల్లగొడుగులే నా ఆటకేమో అడ్డమంట ఆటలాడి చేస్తుంటే కొంటె చేష్టలే మబ్బు అమ్మలాగ వేస్తుంది నీటిమొట్టికాయలే చిలిపి దాడి చేస్తుంటే చిట్టి చినుకులే నేల నాకుమల్లె ఒళ్ళంతా పులకరించిపోయెలే వానా వానా నచ్చే వానా నన్నే నీలోన చూస్తూ ఉన్నా వానా వానా నవ్వే వానా ఆకాశాన్నంటె నిచ్చెనల్లే చేసుకోన ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా నీతో రానా... ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా... ఏదేమైనా... చరణం: 2 వానవిల్లు రంగులంటే ఏడే ఉంటాయేమో వేల వేల రంగులన్ని నాకేచెల్లు వానజల్లు కురిసెనంటె ఉరుమే ఉరిమేనేమో ఉరుము లేక చినుకునంట కుర్ర కళ్ళు ప్రేమజల్లు చినుకు తాకితే జిగొచ్చునంట కోనసీమ నేను తాకితే ఫలించునంట కొంటెసీమ మేఘాన ఉన్నాయ్ నీటి పిడుగులే నా దేహాన ఉందోయ్ పట్టువిడని పిడికిలే తారల్లో ఉన్నాయ్ మెరుపు తీగలే నా దేహాన పూచాయ్ వెలుగుపూల తీగలే వానా వానా బుజ్జి వానా నన్నే నీతోటి పోలుస్తున్నా వానా వానా బుల్లి వానా నాలో భావాలు మనసు విప్పి పంచుకోన ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా నీతో రానా... ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా ఏదేమైనా...

Naughty Girl Song Lyrics in Telugu – Athanokkade (2005)

'Naughty Girl' song from Athanokkade (2005) movie is composed by Mani Sharma and sung by Venu, Ganga.

SONG INFORMATION
Movie : Athanokkade (2005)
Music : Mani Sharma
Lyricist : Chinni Charan
Singers : Venu, Ganga
చిత్రం: అతనొక్కడే (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చిన్ని చరణ్ గానం: వేణు, గంగ పల్లవి: నాటి గాళ్‌ - - - నాటి గాళ్‌ నాటి గాళ్‌ నన్నే పిలిచింది నాతోటే ఎవ్రిడే ఉంటానంటోంది నాటి గాళ్‌ నాటి గాళ్‌ నన్నే పిలిచింది నాతోటే ఎవ్రిడే ఉంటానంటోంది ఫ్రామిస్‌ ఓ చెలియా ఐ లవ్‌ యు ఫ్రామిస్‌ సఖియా ఐ లవ్‌ ఫర్‌ యు ఫ్రామిస్‌ లైఫంతా లాఫింగ్సే లవ్‌లో పడితే ఐ లవ్‌ యు మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోని లవ్వేలే సోగ్రేట్‌ మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోనే లవ్వేలే సో గ్రేట్‌ చరణం: 1 బ్యూటి కంట్రి లాఫి ఎంట్రి అవ్వాంలంటే బిల్లే పాస్పోటంటా ఫాట్లోడ్‌ లేవంటా స్వీటి చిరుదూరాలే దాటి నిన్నే చేరి కల్లో నిన్ను అల్లుకునే ఫిట్‌సీట్‌ నేనంటా ఫోనంటు మరి నోనంటు నాలోన ఉండదుగా ఒకటైతే మామూలైనా మనవైపే వాలునుగా ట్రైనైనా ఎయిర్‌ పైనైనా స్టాపంటు ఉండునుగా లవ్‌ బర్డ్స్‌ విహరిస్తుంటే ఏ సిగ్నలు మనలను ఆపదుగా మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోనే లవ్వేలే సో గ్రేట్‌ మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోనే లవ్వేలే సో గ్రేట్‌ చరణం: 2 చోటి హృదయంలోన చోటే దొరికిందంటే టాటా బిల్‌ గేట్స్‌ కన్నా నే నే గ్రేటంటా డౌటే ఇక లేదంటే నువ్వే మరి నా జంట లవ్‌లి లాకప్‌ లోన లాకై పొమ్మంటా సన్‌ లైటే లేదంటే ఈలోకం కదలదుగా సఖియా నీ సరి లేకుంటే నాప్రాణం నిలవదుగా నువ్వంటూ మరి నేనంటూ డిఫరెన్సే లేదుకదా మనలోన లవ్‌ స్టార్ట్‌ అయిలే ఈ దునియా అంతా మనదేగా మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోని లవ్వేలే సో గ్రేట్

Amma Devudo Song Lyrics in Telugu – Athanokkade (2005)

'Amma Devudo' song from Athanokkade (2005) movie is composed by Mani Sharma and sung by Karthik, Ganga.

SONG INFORMATION
Movie : Athanokkade (2005)
Music : Mani Sharma
Lyricist : Sahithi
Singers : Karthik, Ganga
చిత్రం: అతనొక్కడే (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సాహితి గానం: కార్తిక్ , గంగ పల్లవి: అమ్మదేవుడో అనిపించావే అయ్యో బ్రహ్మయ్యా ఏమో నీదయ నాపై లేదయా ఓరి దేవుడో యెదలో రేగే ఇదేంగోలయ్యో ఈ కధ ఏందయ్యా తెలిసేదెట్టయా మదిలో ఏదో గొట్టే గొట్టే గుండెల్లో సునామి పుట్టే ఏడుకొండల వెంకటేశ్వరా నువ్వు నాకు దిక్కు ఏదునాళ్ళుగా కోడి సాక్షిగా ఎంగిలడితే ఒట్టు వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్టు పట్టు నిండు సాక్షిగా రెండు కన్నుల నిద్దరోతే ఒట్టు చరణం: 1 ప్రపంచ వింతలు ఏడున్నా మరొక్కటి ఇక్కడ చూస్తున్నా ప్రతొక్క చెలిమాటే వినిపించేలే జగాన ఎందరు గనులున్నా జనాలు మెచ్చే పొగరున్నా మగాడు మాత్రం నా ప్రియుడే అనిపించేనే ఒక నవ్వే అది చాలు తన చిరునవ్వే అది పదివేలు తగువే అనిపించే ఇక తనతోటే సరదాలు ఏడుకొండలు వెంకటేశ్వరా పొద్దు పోకవుందిక ఎంతమందిలో కలిసి ఉండినా నాకు తోచకుంది వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్ట పట్టు నిండు సాక్షిగా రెండుకన్నులా నిద్దరోతె ఒట్టు చరణం: 2 వయ్యారమంతా నాలోన వసంతమాడే తరుణాన వరించి నే నే పెళ్ళాడే వరుడతడేలే గతాల జన్మలు ఏవైనా మరింక జన్మలు ఎన్నున్నా యుగాలు నాకు తోడుండే సఖి తానేలే నా జంటై తానుంటే చలి మంటేగా చనువరులు ముద్దై మురిపిస్తే బదులిస్తాగా మగసిరులు వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్టు పట్టు నిండు సాక్షిగా రెండు కన్నులా నిద్దరోతె ఒట్టు జమ్మి కొండల జంబుకేశ్వరా యెదను హత్తుకుంది అందువల్ల తన చెంతకే మనస్సు పరుగులెడుతు ఉంది

Gundelalo Song Lyrics in Telugu – Athanokkade (2005)

'Gundelalo' song from Athanokkade (2005) movie is composed by Mani Sharma and sung by Mallikarjun, K. S. Chithra.

SONG INFORMATION
Movie : Athanokkade (2005)
Music : Mani Sharma
Lyricist : Sai Sri Harsha
చిత్రం: అతనొక్కడే (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: మల్లికార్జున్ , కె. ఎస్. చిత్ర పల్లవి: అంతా నిండిన ప్రేమ ఏది చిరునామా ఎవరికి తెలిసేనమ్మా ఓహొ ఓహొ ఓహొ ఓహొ ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేదమ్మా నువ్వే చాలని ప్రేమ ఓహొ ఓహొ ఓహొ గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది చెప్పేందుకు మాటే ఎలా వెన్నెలే పండినది కన్నె మనస్సు నిండినది తేటేందుకు ఉన్నదిచాలు మౌనం లోని ఆ భాషలు ఎన్నో చూపులలోని దాగెను భాసలు ఎన్నో విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నది గుప్పెట్లో అంతా ఉంది గుట్టు దాగుంటే బాగుంటుంది చరణం: 1 కళ్ళే పలికించు మదిలో మాటలను ఇంకా పెదవిప్పే చెప్పాలా నవ్వే ఉలికించు అవునను సైగలను అయినా వివరించి తెలపాలా ముఖమంతా కాంతులతో వెలిగేనమ్మా మనసంతా ఆ వెలుగులో తెలిసేనమ్మా పెదవుల్లో ఆ మధవే పొంగే వేళ ప్రేమంటు పేరే ఎలా నువ్వు నేనంటు వేరవ్వాలా చరణం: 2 తొలకరి జల్లుల్లో మట్టి సువాసనలు ఎలా వస్తాయో అలాగే ప్రేమే విరిశాకా ఒంటికి పరిమళము తానై వస్తుంది ఎలాగా ప్రేమన్నది భాషలకు అసలందదులే మౌనంగా ధ్యానంగా తానుండులే ఊహలతో నింపేస్తే అది నిలవదులే కలగంటు పాటలు ఎలా ప్రేమ కలగంటు మాటలు ఎలా

Athanokkade Song Lyrics in Telugu – Athanokkade (2005)

'Athanokkade' song from Athanokkade (2005) movie is composed by Mani Sharma and sung by Ranjith.

SONG INFORMATION
Movie : Athanokkade (2005)
Music : Mani Sharma
Lyricist : Sai Sri Harsha
Singers : Ranjith
చిత్రం: అతనొక్కడే (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: రంజిత్ పల్లవి: అతనొక్కడేలే అందర్లోను  ఈ జీవితమంటే ఓ కోరికరేపే అతనొక్కడేలే అతనొక్కడేలే ఎవ్వరికైనా ఓదార్పును చూపే  ఓ దారిని చూపే అతనొక్కడేలే అతనొక్కడేలే అతనికి తోడు ఆనందంలోను బాధే అయిననూ అతనొక్కడేలే అందర్లోను తానొలడై కూడా ఉన్ననూ..... చరణం: 1 ఈ లోకమంతా మనలో ఉంది మనకోసం ఉంది మనతోడై ఉంది నీడనంది మదికోరుకుంది ఇస్తానంది నవ్విస్తానంది కవ్విస్తానంది నేస్తమంది మనమొంటరైతే వెంటే ఉంది  మనజంటే అంది ప్రాణం లాంటిది మన బాధ అంతా నాదేనంటూ నేనున్నానంటు అన్నది చరణం: 2 ఓ చిన్ని ఆశతో సాగావంటే కేకేసావంటే ఆకాశంకూడా అదిరిపోదా నీ చిన్ని గుండెలో దాచావంటె భూగోళంకూడా భూపాలంతోటి నిదురపోదా ఏం చెయ్యాలన్నా నీలో ఉంది  అడుగేసావంటే అడ్డేఉన్నదా నీఅంత నువ్వే వద్దన్నావో నీవద్దే అంతా చెరదా

Palli Balakrishna Thursday, November 16, 2017
Arya (2004) Telugu Songs Lyrics Album Cover

Arya (2004) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Arya (2004)
Director : Sukumar
Producer : Dil Raju
Actresses : Anu Mehta
Release Date : 7 May 2004

You Rock My World Song Lyrics in Telugu – Arya (2004)

'You Rock My World' song from Arya (2004) movie is composed by Devi Sri Prasad and sung by Shaan and Premji Amaren.

SONG INFORMATION
Movie : Arya (2004)
Lyricist : Viswa
Singers : Shaan, Premji Amaren
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: విశ్వ గానం: షాన్, ప్రేమ్ జి అమరెన్ Whats up! R u ready to break it down..yeah  and keep it a real...yeah  Lets get ready to Rumble...stop  యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన  డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా ఆవోనా ఓ... జర దేఖోనా ఓ... యెవరేమన్న జరిగెతుంటె జరగక మానేన  జానోనా ఓ... జర సున్లేనా ఓ... మనసే ఉంటె మార్గలెన్నో సంఝోనా  యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన  డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా బీ రెడీ ఓ... ఎవ్రిబడి ఓ... లవ్ అంటేనె గుండెని తాకె తీయ్యని మెలోడీ నోబడి కెన్ టెల్ యు రియల్లీ ఎప్పుడు ఎక్కడ మొదలవుతుందో ప్రేమ గారడి  హేయ్ నాచోనా ఓ... జర ఝూమోనా ఓ... ప్రేమిస్తే అరే మనసంత మరి అల్లరిథిల్లాన  ఓ జాన ఓ... జర మానోనా ఓ... ప్రేమను మించిన పవర్ లేదీలోకన  యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన  డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా ఓ గీత సెహనో రీట  స్నేహం కోరి చెయ్యందిస్తె చూడవె ఎంచేత ఎంచేత  నీ జత నాకో వింతా నా గుండెల్లో పుట్టించావే ఏదో గిలిగింత  ఔనన్న నువ్వు కాదనన్న నాలో ఉన్నది నువ్వే నన్నది నిజమే ఓ మైన  ఎండైన తగు వానైన నీవెంటె నేనుంటానంట ఏమైన యు రాక్ మై వరల్డ్ యు నో యు స్టే ఇన్ మై హార్ట్ యు నో మైన్ హూ తెరా దీవాన  డోంట్ వాక్ ఎవే ఫ్రమ్ మి యు గాట్ టు లిజన్ టు మి చేస్తా నీకోసం యేదైనా

Edo Priya Ragam Vintunna Song Lyrics in Telugu – Arya (2004)

'Edo Priya Ragam Vintunna' song from Arya (2004) movie is composed by Devi Sri Prasad and sung by Sagar and Sumangali.

SONG INFORMATION
Movie : Arya (2004)
Singers : Sagar, Sumangali
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సాగర్, సుమంగళి(ఆలాప్) ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా ఆ సందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో ప్రేమా ఆ సవ్వడి నీదేనా ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం ఓ... పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం అడవినైన పూదోట చేయదా ప్రేమ బాటలో పయనం దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే ప్రతిమాట వేదం నువ్వుంటే ప్రతిపలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం ఓ ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన ఆమెలోని ఆనందసాగరం నన్ను ముంచు సమయాన హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా నువ్వుంటే దిగులంటూ రాదే నువ్వుంటే వెలుగంటూ పోదే నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే నువ్వుంటే ఎదురంటూ లేదే నువ్వుంటే అలుపంటూ రాదే నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే

O My Brotheru Song Lyrics in Telugu – Arya (2004)

'O My Brotheru' song from Arya (2004) movie is composed by Devi Sri Prasad and sung by Ravi Varma.

SONG INFORMATION
Movie : Arya (2004)
Singers : Ravi Varma
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: రవివర్మ ఏం బ్రదర్ ఒన్ సైడ్ లవ్వా?  చూడు బ్రదర్ ఒన్ సైడ్ లవర్స్ ఎప్పుడూ బాధ పడకూడదు  ఎందుకంటే ఒన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు  మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం  మనం ఇచ్చేవాళ్లం వాళ్లు తీసుకునేవాళ్లు మనదే అప్పర్ హ్యాండు  హొయ్ ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు  ఆ నా సలహాలు వింటే ఎవరూ  ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు  హెయ్ ఐ లవ్ యు అన్న పదం గమనించర భాయి యు లవ్ మి అని అర్థం అక్కడ లేదోయి  ఐ లవ్ యు అన్న పదం గమనించర భాయి  యు లవ్ మి అని అర్థం అక్కడ లేదోయి  ఓ మై బ్రదరూ చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు  నా సలహాలు వింటే ఎవరూ  ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు అవరు హే ఒన్ వే రూటులో వెళ్లిపో సూటిగా  ఎవరూ ఎక్కడా ఆపరు గనక  ఒన్ సైడ్ ప్రేమనే చేసెయ్ స్వేచ్ఛగా  ప్రేమను ఇమ్మని అడగవు గనక  మదనపడి మెదడు చెడే ట్రాజిక్ లవ్ కన్నా  అసలు ఫెయిలయ్యే ఛాన్సు లేని ఒన్ సైడ్ లవ్ మిన్నా  అరె ఈ కిటుకే తెలిసుంటే దేవదాసు ఐనా  కుడి ఎడమైతే పాట పాడి గ్లాసు దాసుడవునా  ఓ మై బ్రదరూ ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు  నా సలహాలు అరె వింటే ఎవరూ  ఇక పైన ఎపుడూ మజ్నులే అవరు  హే ఒకరా ఇద్దరా కన్నుల ముందర తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా  పరవాలేదురా పరువేం పోదురా లైనెయ్ సోదరా అందరి పైనా  ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా  ప్రతి అందాన్ని ప్రేమిస్తు సరదా పడు నాన్నా  ఈ లైలాచే చిక్కనంటే నానా హైరానా  ఒక వేళ ఒప్పుకుంటే అదే కమిట్మెంటు ఔనా  ఓ మై బ్రదరూ ఓ మై బ్రదరూ అరె చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు  నా సలహాలు అరె వింటే ఎవరూ  ఇక పైన ఎపుడూ మజ్నులే అవరు  ఎహేయ్ అది సరే రా ఒన్ సైడ్ లవ్ వలన మనకొచ్చే లాభాలేంటి అదీ చెప్తా విను  అమ్మాయ్ మనసుని దోచెయ్యాలని  ట్రిమ్ముగ డ్రస్సులెయ్యనక్కర్లెద్దు అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని  తీరని అప్పులు చెయ్యక్కర్లెద్దు అరె సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పక్కర్లెద్దు ఏ బైక్ పైన షికార్లకీ తిప్పక్కర్లెద్దు ఓ కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు పెట్టక్కర్లెద్దు ఓ సినిమాకీ టిక్కెట్లు పెట్టక్కర్లెద్దు ఓ మై బ్రదరూ ఓ మై బ్రదరూ చెబుతా వినరో ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు  నా సలహాలు వింటే ఎవరూ  ఇక పైన ఎపుడూ  మజ్నులే అవరు

Thakadimithom Song Lyrics in Telugu – Arya (2004)

'Thakadimithom' song from Arya (2004) movie is composed by Devi Sri Prasad and sung by Tippu.

SONG INFORMATION
Movie : Arya (2004)
Lyricist : Surendra Krishna
Singers : Tippu
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: టిప్పు హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం  చిందులు వేసే వయసుకి తకదిమి తోం  తకదిమి తోం తకదిమి తోం సరిగమ పదమని తకదిమి తోం  ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం  కష్టం నష్టం ఎదురైన నచ్చినదె చేసేద్దాం  అలవాటైతే చేదైనా తకదిమి తోం  తప్పో ఒప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం  అనుభవమైతే ఏదైనా తకదిమి తోం  కృషి ఉంటే నీ వెంటేరా ఈ లోకం  గాయేంగె జోష్ కె లియె జీయేంగె ప్యార్ కె లియె  హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం  చిందులు వేసే వయసుకి తకదిమి తోం  తకదిమి తోం తకదిమి తోం సరిగమ పదమని తకదిమి తోం  ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం  చిరునవ్వుతో అటు చీకటిని ఇటు ఓటమిని తరిమెయ్యరా  ఆ ఓర్పుకి తకదిమి తోం  ఉల్లాసమె ఓ వెల్లువలా ఓ ఉప్పెనలా ఉరకాలిర  ఆ జోరుకి తకదిమి తోం  పరిగెడదాం పరిగెడదాం గెలిచే వరకు పరిగెడదాం  గురి చూశాక మనకింక తిరుగేది  గాయేంగె జోష్ కె లియె  హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం  చిందులు వేసే వయసుకి తకదిమి తోం  నీ మాటతో అటు నిశ్శబ్దం ఇటు ఓ యుద్ధం ఆగాలిరా  ఆ నేర్పుకి తకదిమి తోం  నీ ప్రేమతో ఆ శత్రువునె ఓ మిత్రునిగా మార్చాలిరా  ఆ గెలుపుకి తకదిమి తోం  ఒకటౌదాం ఒకటౌదాం ప్రేమను పంచగ ఒకటౌదాం  ప్రేమించే మనసుంటే మహరాజే  జీయేంగె ప్యార్ కె లియె హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం  చిందులు వేసే వయసుకి తకదిమి తోం  కష్టం నష్టం ఎదురైన నచ్చినదె చేసేద్దాం  అలవాటైతే చేదైనా తకదిమి తోం  తప్పో ఒప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం  అనుభవమైతే ఏదైనా తకదిమి తోం  కృషి ఉంటే నీ వెంటేరా ఈ లోకం  గాయేంగె జోష్ కె లియె జీయేంగె ప్యార్ కె లియె 

Feel My Love Song Lyrics in Telugu – Arya (2004)

'Feel My Love' song from Arya (2004) movie is composed by Devi Sri Prasad and sung by K. K. and Clinton Cerejo.

SONG INFORMATION
Movie : Arya (2004)
Lyricist : Chandrabose
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: కె.కె. క్లింటన్ సెరెజో ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ నాప్రేమను భారంగానో నాప్రేమను దూరంగానో నాప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ నాప్రేమను మౌనంగానో నాప్రేమను హీనంగానో నాప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో కాదో ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ హే... నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్ నేపంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్ నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ ఫీల్ మై లవ్ నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్ నా ఉనుకే నచ్చదంటూ నా ఊహే రాదనీ నేనంటే కిట్టదంటూ నా మాటే చేదనీ నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్ ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్ విధిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్ వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్ అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే ఆపైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను ద్వేషంగానో నాప్రేమను భారంగానో నాప్రేమను దూరంగానో నాప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్

Aa Ante Amalapuram Song Lyrics in Telugu – Arya (2004)

'Aa Ante Amalapuram' song from Arya (2004) movie is composed by Devi Sri Prasad and sung by Malathy and Ranjith.

SONG INFORMATION
Movie : Arya (2004)
Lyricist : Veturi
Singers : Malathy, Ranjith
చిత్రం: ఆర్య (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: వేటూరి గానం: మాలతి, రంజిత్ హెయ్ అ అంటే అమలాపురం  ఆ అంటే ఆహాపురం  ఇ అంటే ఇచ్చాపురం  ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం  హెయ్ అ అంటే అమలాపురం  ఆ అంటే ఆహాపురం  ఇ అంటే ఇచ్చాపురం  ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం ఉ అంటే ఉంగాపురం  ఊ అంటే ఊగే జనం  ఎ అంటే ఎత్తు పల్లం  గాలమేస్తే వాలుతారు కుర్ర కులం  పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పైట జారుడెక్కువాయరో  యానాము చేరినా ఈనాము మారునా ఫ్రెంచ్ పిడేలు ఆగునా హెయ్ ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోనె సంపుతుంటడు  ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలి తోని గాలమేసి లాగుతుంటడు హెయ్ అ అంటే అమలాపురం  ఆ అంటే ఆహాపురం  ఇ అంటే ఇచ్చాపురం  ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం హేయ్ గాజువాక చేరినాక మోజు పడ్డ కుర్ర మూక నన్ను అడ్డకాగి చంపినారురో  కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు  చూస్తే రొంపిలోకి దింపకుంటరా రాజనిమ్మా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో  చిత్రాంగి మేడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో  హెయ్ అ అంటే అ అంటే అమలాపురం  ఆ అంటే ఆహాపురం  ఇ అంటే ఇచ్చాపురం  ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం  ఏయ్ కొంచం బీటు మార్చండ్ర బాబు ఇరగదీసిండు హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ సొంత మేనమామా వాటమందుకో  రేనిగుంట రాణివంట  బిట్రగుట్ట దేవివంట  నువ్వు సిగ్నలిచ్చి రైలు నాపుకో  హే ఒంటి లోన సెట్టు పుట్టెరో ఎన్నడో  ఒంటి పూస తేలు కుట్టెరో  నేనాడదాన్నిరో ఆడింది ఆటరో అమ్మోర బాజిపేటరో అ అంటే... అ అంటే... అ అంటే అమలాపురం  ఆ అంటే ఆహాపురం  ఇ అంటే ఇచ్చాపురం  ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం  ఉ అంటే ఉంగాపురం  ఊ అంటే ఊగే జనం  ఎ అంటే ఎత్తు పల్లం  గాలమేస్తే వాలుతారు కుర్ర కులం  పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పైట జారుడెక్కువాయరో  యానాము చేరినా ఈనాము మారున ఫ్రెంచ్ పిడేలు ఆగునా హెయ్ ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోనె సంపుతుంటడు  ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలి తోనిగాలమేసి లాగుతుంటడు ఈల వేసి లాగుతారు ఆంధ్రా జనం 

Palli Balakrishna Saturday, July 15, 2017

Most Recent

Default