Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Shekar (2022)
చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
నటీనటులు: రాజశేఖర్ 
దర్శకత్వం: జీవిత 
నిర్మాత: బీరం సుధాకర్ రెడ్డి 
విడుదల తేది: 2022Songs List:లవ్ గంటె పాట సాహిత్యం

 
చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనూప్ రూబెన్స్ , విజయ్ ప్రకాష్, రేవంత్ 

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం

ఆ, బొట్టు పెట్టి కాటుకెట్టి
వచ్చిందమ్మా సిన్నది
బుగ్గా మీద సుక్కే పెట్టి
సిగ్గే పడుతు ఉన్నదీ

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం

అరె, నెత్తి మీద బుట్టే పెట్టి
వచ్చిందమ్మా సిన్నదీ
బుట్టలోన నన్నే పెట్టే
వన్నె సిన్నెలున్నదీ

కోలా కళ్ళతో నను చూస్తున్నది
కొంటె నవ్వుతో నమిలేస్తున్నది
ఆ నవ్వే చూసి నా ప్రాణం
జివ్వు జివ్వు మన్నది

హే, డండ డండ డండ
లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ
తొలిప్రేమే పుట్టిందంట
డండ డండ డండ
లవ్ గంటే మోగిందంట

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
ఓకే, మరి నీ కదేంట్రా..?

చూడిదారు చుట్టుకోని
వచ్చిందమ్మా సిన్నదీ
చున్నీ లాగా చందమామను
కప్పుకొని ఉన్నదీ

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
అరె , చూడిదారు చుట్టుకోని
వచ్చిందమ్మా సిన్నదీ
చున్నీ లాగా చందమామను
కప్పుకొని ఉన్నదీ

మెల్లమెల్లగా అడుగేస్తున్నది
నేల వెన్నెల మడుగౌతున్నది
తన నడకే చూసి నా గుండె
ధడకు ధడకుమన్నది

హే, డండ డండ డండ
లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ
తొలిప్రేమే పుట్టిందంట
డండ డండ డండ
లవ్ గంటే మోగిందంట

ఆహ, ఏంట్రా..! నీ కథేంటి?
చింతా పూలా, ఓ ఓ ఓ హో
చింతపూలా చీరె కట్టి
వచ్చిందమ్మ సిన్నది
సంతోషాల నగలే పెట్టి
గంతులేస్తు ఉన్నది

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
ఆ, రాణి లాగ రైకే చుట్టి
వచ్చిందమ్మా సిన్నది
రాను రాను అంటూనే
రయ్యున వచ్చేస్తున్నది

తీగ మల్లికి చెల్లెలు అన్నది
తేనె చుక్కకి అక్కను అన్నది
తన మాటే వింటూ నా మనసే
తన మాటే వింటూ నా మనసే
నా మాటే విననన్నది, ఆయ్

డండ డండ డండ
లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ
తొలిప్రేమే పుట్టిందంట
కిన్నెరా పాట సాహిత్యం

 
చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: అనంత్ శ్రీరాం 
గానం: అర్మాన్ మాలిక్ 

ఓ, సన్నజాజి తీగల అల్లుకోవే నన్నిలా
కిన్నెరా... ఓ కిన్నెరా
సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా
కిన్నెరా... ఓ కిన్నెరా

చీకటి నిండా నీ కలలే
వేకువ నిండా నీ వెలుగే
నన్ను చేరెనే ఓ కిన్నెరా
నిన్ను కోరెనే నా కిన్నెరా

అన్నులా మిన్నులా అల్లిబిల్లి వెన్నెలా
నవ్వుతు నువ్వు నా వెంటరా
గల్ గలా గల్ గలా తుళ్లుతున్న మువ్వలా
గుండెలో చిందగా జంటరా, నా జంట రా

ఒక గంటనో రోజో నాకు చాలదే
ఒక జీవితం కూడా తక్కువే కాదే
అందుకే మరి ప్రాణం ఊరకుండదే
జన్మ జన్మని నీకే రాయమన్నదే
రాసి ఇస్తానే మనసారా

కిన్నెరా... ఓ కిన్నెరా
కిన్నెరా... నా కిన్నెరా

సన్నజాజి తీగల అల్లుకోవే నన్నిలా
కిన్నెరా... ఓ కిన్నెరా
సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా
కిన్నెరా... ఓ కిన్నెరా

నిన్నే నిన్నే చూడందే రాదే నిద్దుర
కిన్నెరా... ఓ కిన్నెరా
నిన్నే ఉంచమంది నా రెండు కళ్ళ ముందర
కిన్నెరా... ఓ కిన్నెరా

ఏమౌతుందో ఎదరెదరా
నువ్వెదురైతే మతి చెదరా
ఓ కిన్నెరా… నా కిన్నెరా
నిన్నే కోరెరా… నా తోడు రా

గవ్వలా రవ్వలా రివ్వుమన్న గువ్వలా
జంటలో సంబరం చెయ్యరా
గుండెలో గంధమై... వంద ఏళ్ళ బంధమై
ఉండిపోమంది ఈ తెమ్మెరా... నా కిన్నెరా

కళ్ళ నిండుగ నిన్నే నింపుకుందునా
కంటిపాపను కాచే రెప్పనవ్వనా
నువ్వు కోరితే ప్రాణం చేతికివ్వనా
జన్మజన్మని నీకే కానుకివ్వనా
నాకు ఎవ్వరింక లోకాన

కిన్నెరా... ఓ కిన్నెరా
కిన్నెరా... నా కిన్నెరాచిన్ని చిన్ని ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: చిన్మియి శ్రీపాద, హైమత్ 

చిన్ని చిన్ని ప్రాణం
చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం
అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా

నేనే తానై వీచే గాలి
పాడే జో లాలి
ఖాళీ ఖాళీ కన్నుల్లోనా
కలలా దీవాళీ

చిన్ని చిన్ని ప్రాణం
చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం
అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా

పచ్చని గూడు… వెచ్చని తోడు
పొద్దు పొడిచాడు… కొత్త సూరీడు
నిండు నట్టింట… ముద్దు బంగారు
ఎంత బాగుందో… జీవితం నేడు

ఇంతే ఇంతే చాలు… ఇల్లా ఉంటె చాలు
నా చేయి పట్టినాయి చిట్టి వేళ్ళు
నిన్న మొన్న లేనే లేని… ఆహ స్వరాలూ
ఏరి కోరి నన్నే చేరే… ఎన్నో వరాలు

చిన్ని చిన్ని ప్రాణం
చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం
అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా

పసిడి పాదాల… మువ్వనై నేనే
ఘల్లు మంటోంది… నా గుండె సడులే
పరికిణి అంచు… పరవళ్లలోనే
పరవసించేటి నాన్ననయ్యాలే

ఏదో లేదే అన్న చేదు బాధ అన్ని
మరిపించి మురిపిస్తుంది ఈ ప్రపంచం
రంగు రంగు జతగా చేర్చి… గీసా రంగోలి
రోజు పూసే రోజా పువ్వై… సమయం నవ్వాలి

చిన్ని చిన్ని ప్రాణం… చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం… అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా

సత్యం శివం సుందరం పాట సాహిత్యం

 
చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విజయ్ యేసుదాస్ ఉమా నేహా 

సత్యం శివం సుందరం
జగమే దివ్య మందిరం
ఎటుగా చూసినా నీ వెలుగేనయా
నీ వారేగా అందరం
నీ ప్రేమేగా మా బలం
ఎపుడేం జరిగిన నీ వలనేనయా

హితుడై నువ్వలా… జతగా నిలువ
కలత నలత… ధరి రాగలవా
ప్రతి మలుపు మార్పు… నీ వలనే దేవా

నీ కను చూపే వసంతం
నీ కరునేగా సమస్తం
నింగి నేల దిగంతం
దేవా నీ దయ అనంతం

ఎన్ని జన్మాల… వరమో ఏమో గాని
నాన్నావయ్యావు నాకు
ఎంత దూరాన… కొలువై ఉన్నాగాని
ఊతమిస్తావు ఎదకూ

అంతులేని నీ ప్రేమే… పండు వెన్నెల
అంతరాయమే లేని పండుగై ఇలా
కాలమంతా నువ్వు నన్ను… చూస్తుంటే చాలు

నీ కను చూపే వసంతం
నీ కరునేగా సమస్తం
నింగి నేల దిగంతం
దేవా నీ దయ అనంతం

శిధిలాలన్నీ చేర్చన
శిల్పంలాగ మార్చనా
మరల కొత్తగా మొదలై సాగనా

ఎదలో దిగులు తుంచన
కాలం రంగు మార్చనా
నడిచే దారిలో… నవ్వులు పెంచనా

నిన్న మొన్న… నిశిలో ఉన్న
ఇకపై నీతో అడుగేస్తున్న
బ్రతికే బలమై… నను నడిపించవయా

నీ కను చూపే వసంతం
నీ కరునేగా సమస్తం
నింగి నేల దిగంతం
దేవా నీ దయ అనంతం

No comments

Most Recent

Default