Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ram Miriyala"
DJ Tillu 2 (2023)



చిత్రం: DJ Tillu 2 (2023)
సంగీతం: రామ్ మిరియాల  
నటీనటులు: సిద్దు, అనుపమ పరమేశ్వరన్ 
దర్శకత్వం: మల్లిక్ రామ్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ 
విడుదల తేది: 15.09.2023



Songs List:

Palli Balakrishna Thursday, August 3, 2023
Das Ka Dhamki (2023)



చిత్రం: దాస్ కా ధమ్కీ (2023)
సంగీతం: లియోన్ జేమ్స్, రామ్ మిరియాల 
నటీనటులు: విశ్వక్ సేన్, నివేత పేతురాజ్
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాతలు: కరాటే రాజు, విశ్వక్ సేన్
విడుదల తేది: 22.03.2023



Songs List:



ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: దాస్ కా ధమ్కీ (2023)
సంగీతం: లియోన్ జేమ్స్ 
సాహిత్యం: పూర్ణాచారి 
గానం: ఆదిత్య RK, లియోన్ జేమ్స్ 

ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లా
సునూరే జాను చేజారేను
అదిరే కన్ను కొంటె పిల్లా పిల్లా
ఓ ఫుల్ మూనుకున్నా
నే క్లౌడ్ నయను
వోడ్కా వైను నువ్వే పిల్ల పిల్లా
హే సావరియా చెలియా
కొంటెగా నవ్వేస్తుంటే
నా దునియా రెండుగా అయిపోతున్నాదే
నా మానియా సాథియా
మాయలో మనసు పడ్డానా
నాలో నేనే లేనా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
చెంపకు పింపిలా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
కళ్ళకు రేబాన్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
ముందుకు మంచింగ్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లా

లే లే లే మజా… లే లే లే మజా
లే లే లే మజా… పిల్లా జిల్లా
లే లే లే మజా… లే లే లే మజా
లే లే లే మజా… పిల్లా జిల్లా

నీ చుట్టే తిరుగుతూ
కరుగుతూ ఇపుడు మరి
నా టైము చేతికి దొరకట్లేదే
నీ వెనకే ఉరుకులు పరుగులు పెడుతూ మరి
నా హార్టు వేగమే తెలియట్లేదే
రోజొక్క సీజను ఏదో ఓ రిజను
చెప్పేస్తూ కప్పేస్తున్నానే
నువ్వుంటే రాజును
నువ్వే ఆక్సీజెను
నో అంటే నో మోరే నే నే
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
చెంపకు పింపిలా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
కళ్ళకు రేబాన్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
ముందుకు మంచింగ్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లా

లే లే లే మజా… లే లే లే మజా
లే లే లే మజా… పిల్లా జిల్లా
లే లే లే మజా… లే లే లే మజా
లే లే లే మజా… పిల్లా జిల్లా



మావా బ్రో పాట సాహిత్యం

 
చిత్రం: దాస్ కా ధమ్కీ (2023)
సంగీతం: రామ్ మిరియాల 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల 

సందమామ రావే అంటే వచ్చిందా
కోరస్: రాలే రాలే
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
కోరస్: తేలే తేలే
మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటాదా
కోరస్: చాల్లే చాల్లే
ఇన్‌స్టాలో కష్టాలు చూపించుకుంటారా
కోరస్: నిజమే నిజమే

పైకి నువు చూసేదొకటి
లోపల ఇంకోటి గోవిందా

కోరస్: జిందగిని ఆడో ఈడో
ఇంకొకడెవడో ఆడిస్తుంటడు బ్రో
అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని
పాడిస్తుంటడు బ్రో

కోరస్: 
జిందగీ అంతే అంతే అంతే అంతే 
అంతే మావా బ్రో
లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే
ఇంతే మావా బ్రో

సందమావ రావే అంటే వచ్చిందా
కోరస్: రాలే రాలే
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
కోరస్:హోయ్ హోయ్ హోయ్

వంటిలో ఫుల్లు షుగరున్నోడు, ఆహ
స్వీట్ షాపులో కూసున్నట్టు, ఆహ
అన్నీ ఉంటయ్ అందెటట్టు
ఏది కాదు నీది ఒట్టు
మంది ఉంటరు నీకు సుట్టు
రోజు ఫంక్షనే జరిగినట్టు
సేవలెన్నైన జేసి పెట్టు
వాల్ల తిట్లే నీకు గిఫ్టు

నీ స్టోరీలో హీరోలా 
ఫీలైపోతు బతికేస్తుంటవ్ మావా బ్రో
జరా టైరో… మావా బ్రో
జోకర్ల నిన్ను వాడేసుకుంటూ షో కొట్టేస్తారో

కోరస్: 
జిందగీ అంతే అంతే అంతే అంతే 
అంతే మావా బ్రో
లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే
ఇంతే మావా బ్రో

కోరస్: 
జిందగీ అంతే అంతే అంతే అంతే 
అంతే మావా బ్రో
లైఫంతా ఇంతే ఇంతే ఇంతే ఇంతే
ఇంతే మావా బ్రో

మబ్బులెన్ని అడ్డే వచ్చినా
డ్యూటీ చేసే సూర్యున్నాపునా
డబ్బు సుట్టు గ్లోబే తిరిగినా
మనిషి విలువ మాత్రం తరుగునా ఆ ఆఆ

ఏ దునియా పైసామే డూబుగయా
పైసా పైసా పైసామే డూబుగయా



ఓ డాలరు పిలగా పాట సాహిత్యం

 
చిత్రం: దాస్ కా ధమ్కీ (2023)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: పూర్ణా చారి 
గానం: మంగ్లీ, దీపక్

ఓ దారువాలా దిల్లువాలా
గోళీసోడారా నేను
థౌసండ్ వాలా పేలినట్టు
ఓపెన్ చేసెయ్రా నన్ను

రిమి జిమి జిమి హై
రిమ్మి జిమి హై
రిమి జిమి జిమి హై డీలు ఒకే
రిమి జిమి జిమి హై
రిమ్మి జిమి హై
రిమి జిమి జిమి హై నాతో కేకే

ఓ దారువాలా దిల్లువాలా
గోళీసోడారా నేను
థౌసండ్ వాలా పేలినట్టు
ఓపెన్ చేసెయ్రా నన్ను

హే ముస్తాబై నే వచ్చాను గానీ
ముచ్చట్లు ఏందయ్యా హోయ్
ఏ మూమెంటు లేదయ్యా హోయ్
ఈ ఈవెంటు నాదయ్య

ఆ ఆఆ ఆజా లడికి
నే తీర్చేస్తా బాకీ
నీ నీకిస్తా ధమ్కీ కోలో కిడికి

ఓ డాలరు పిలగా
జిల్ జిలగ నే జంగల్ జింకనురా
హే ముందు వెనక లేదనక
చల్ బూమ్ బూమ్ బద్దలిక

ఓ డాలరు పిలగా
జిల్ జిలగ నే జంగల్ జింకనురా
హే ముందు వెనక లేదనక
చల్ బూమ్ బూమ్ బద్దలిక

రిమి జిమి జిమి హై
రిమ్మి జిమి హై
రిమి జిమి జిమి హై డీలు ఒకే
రిమి జిమి జిమి హై
రిమ్మి జిమి హై
రిమి జిమి జిమి హై నాతో కేకే

రేసుగుర్రం ఉరికినట్టు
డోసుపెంచి దూకి రారా
పట్టు అందం పట్టానే నీకే రాసిస్తా

ఆన్ ద రాక్ మందు పైన
వైల్డ్ ఫైరు అంటినట్టు
ఉక్కపోతే పెంచేసి నీ తిక్కే తీరుస్తా

నీ రసికతకు నే చెలికత్తెనై
ఊ అంటాను ప్రతి నిమిషం
నీ సరసములో నే చేరి సగమై
ఆడిస్తాను చదరంగం

ఆ ఆఆ ఆజా లడ్కి
నే తీర్చేస్తా బాకీ
నే నీకిస్తా ధమ్కీ
కోలో కిడికి

ఓ డాలరు పిలగా
జిల్ జిలగ నే జంగల్ జింకనురా
హే ముందు వెనక లేదనక
చల్ బూమ్ బూమ్ బద్దలిక

ఓ డాలరు పిలగా
జిల్ జిలగ నే జంగల్ జింకనురా
హే ముందు వెనక లేదనక
చల్ బూమ్ బూమ్ బద్దలిక





ఎవరిని ఎవరితో పాట సాహిత్యం

 
చిత్రం: దాస్ కా ధమ్కీ (2023)
సంగీతం: లియోన్ జేమ్స్ 
సాహిత్యం: పూర్ణా చారి 
గానం: హరిచరణ్ 

ఎవరిని ఎవరితో కలుపునొ
విధి విలాసం
మనసుతో ముడిపడే మనిషిగా తోలి ప్రయాణం
ఏ తోదలు తెలియని మొదలిదా
ఏ బదులు దొరకని ప్రశ్న ఇదా
నేనుపుడు అడగని వరమీదా
నా నిజముగా నిజమిదా
కథగా మలిచాడో
పరిచయం చేసాడో
ప్రతి అడుగు వెనకాల
ఏ మలుపు రాశాడో
ఇది మరు జన్మ తెలిసెను ప్రేమ
పెదవులపైనా చిరునవ్వులు ఏమైనా
ముసుగున ఉన్నా నటన అనుకున్న
తెలియని అమ్మ ఎదురు నిలవదా
ఎద తాడిచెనుగా

ఎవరిని ఎవరితో కలుపునొ
విధి విలాసం
మనసుతో ముడిపడే మనిషిగా తోలి ప్రయాణం హ్మ్…

Palli Balakrishna Monday, April 3, 2023
Pushpaka Vimanam (2021)




చిత్రం: పుష్పక విమానం (2021)
సంగీతం: రామ్ మిరియాల
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శాన్వీ మేఘన, గీత్ షైనీ,  సునీల్, నరేష్,
దర్శకత్వం: దామోదర
నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దశి, ప్రదీప్ ఎర్రబెల్లి
విడుదల తేది: 20.05.2021



Songs List:



సిలకా...పాట సాహిత్యం

 
చిత్రం: పుష్పక విమానం (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: రామ్ మిరియాల, ఆనంద్ గుఱ్ఱం
గానం: రామ్ మిరియాల

సిలకా...
ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా
సిలకా...
చిన్నబోయిందే చిట్టి గుండె నువ్వు లేకా
బంగారు సిలకమ్మో ఈ అలక దేనికమ్మో
ఈ అల్లిబిల్లి ఆటలింకా ఆపవమ్మ్మో
గుండెను తప్పుజారి పండనుకున్నవేమో
ఇంకెంత కొరుకుతావే జాలి చూపవమ్మో

సిలకా...
ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా
ఏ హే హే... సిలకా... ఎగిరిపోయావా... ఏ...

నిన్నమొన్న దాక కులుకులాడినావే
ఇంతలోనే ఎట్ట జారిపోయినావే
నువ్వు గుర్తుకొచ్చి క్వార్టర్ ఏసినానే
మాటలాడలేక పాట రాసినానే
ప్రేమలోన నేను దేవదాసు
గుళ్ళు కట్టలేని రామదాసు

హేయ్... పాట రాసుకొచ్చ ఫస్ట్ క్లాస్
పాడమంటే అవుత యేసుదాసు
ఒక్క ఛాన్స్ ఇచ్చి నాకు చూడవే
ఇంకో ఛాన్సు అడిగితే చెప్పు తీయ్వే
నిన్ను విడిచి అస్సలుండలేనే
మిన్ను విరిగి మీద పడ్డా వదలనే

కూల్ డౌన్... మై బాయ్

సిలకా...
ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా

చెల్లియో చెల్లకో అత్త తెచ్చిన కొత్త చీర నచ్చకో
బావ తెచ్చిన మల్లెపూలు ముడవకో
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నదో

వాడపల్లి రేవు పుంతల్లో చూశా
సింగరాయికొండ జాతర్లో వెతికా
హైదరాబాద్ పోయి మైత్రివనం సెంటర్లో
లవ్వు మిస్సింగని పాంప్లెట్లు పంచా

తొందరేం లేదు... టైం తీసుకొని
ఓలా ఎక్కి రావే నీలవేణి
ఒక్కసారి నిన్ను చూసుకోని
ఎన్నిసార్లైనా సచ్చిపోనీ

కూనవరం కోనలోకి పోదామే
గోరువంకలల్లే జంట కడదామే 
రెల్లు పాకలు అల్లుకొని వెచ్చగా
మళ్ళి మళ్ళి ఒక్కటైపోదామే

సిలకా, ఏ హే సిలకా

సిలకా...
ఎక్కడున్నాగాని గూటికొచ్చి వాలిపోవే, సాలికా
సిలకా...
సిన్నబోయిందే చిట్టి గుండె.... నువ్వు లేకా

రే రేలా రే రేల రేలా... రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా... రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా... రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా... రే రేలా సిలకమ్మ




కళ్యాణం పాట సాహిత్యం

 


చిత్రం: పుష్పక విమానం (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సిద్ శ్రీరామ్,   మంగ్లీ, మోహన్ భోగరాజు, దివ్య మాలిక్, హరిప్రియ

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో

మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో
పలకండి మంతరాలో

కళ్యాణం కమనీయం 
ఒకటయ్యే వేళ నా వైభోగం
కళ్యాణం కమనీయం 
ఈ రెండు మనసులే రమణీయం
మూడే ముళ్ళటా.. ముడిపడుతుంటే ముచ్చట
నాలుగు దిక్కులకంట.. 
చూడముచ్చటైన వేడుకంట
ఆ పంచభూతాల తోడుగా 
ప్రేమ పంచుకునే పండగంట
ఆరారు కాలాలు నిండుగా
ఇది నూరేళ్ళ పచ్చని పంట

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
ఇంటిపేరు మారే ఈ తంతులో
చుక్కలే అక్షింతలో

మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
పలకరించే తడి ఓ లీలలో
పుట్టినింట కళ్ళలో

ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా
ఏడు జన్మలా బంధంగా
ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా
మీ అనుబంధమే బలపడగా
ఇక తొమ్మిది నిండితే నెల
నెమ్మ నెమ్మదిగా తీరే కల
పది అంకెల్లో సంసారమిలా
పదిలంగా సాగేటి అల

ఒకటయ్యేనంట ప్రాణం
ఒకరంటే ఇంకొకరి లోకం
ఇద్దరు చెరో సగం
ఇక ఇద్దరిదంట కష్టం సుఖం

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో

మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో
పలకండి మంతరాలో

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో

మోగేటి సన్నాయి మోతల్లలో
సాగేటి సంబరాలో
కోయిలాలో రామసిలకలాలో
పలకండి మంతరాలో !!



ఆహా..! పాట సాహిత్యం

 
చిత్రం: పుష్పక విమానం (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: ఫణికుమార్ రాఘవ
గానం: కైలాష్ కెహర్

ఆహా..!
ఓ తారకా… ఓ ఓ తారకా
మాయ లోకములో… కనుమరుగై పోయావా

ఓ ఓ ఓ, అసలే మొదలుకాని
కథ కంచి చేరెనుగా… ఇంతలోనే రామ
అరెరె ఇంతిలేని ఓ ఇంటివాడి కథ రాసి నాడు బ్రహ్మ

వినపడుతుందా వేమా… వీడికి ఏంటి కర్మ
కనికరమైనా చూపించక… మలిచావే జన్మ
చూడని భవసాగరమే… సుడిలో పడదోసేనా
తిరిగిన ఆ చోటే తిప్పిందా… ఇది పతి సంసారమా

ఆహా… ఒరే జీవుడా
ఆహా… తెలవారెరా
ఆహా… మొదలెట్టరా
ఆహా… జర నీ నటన
ఆహా… ఓ సుందరా
ఆహా… నీ లెక్కలన్నీ
ఆహా… తలకిందుగా
ఆహా అయిపోయెనా
ఓ తారకా… ఓ ఓ తారకా

ఓ ఓ, అయోమయంగా మారెనా
ఓ ఓ, ప్రతి ఘడియకి నాయన
అంగట్లో అన్నీ ఉన్నా
అల్లుడు నోట్లో శని ఉందా
అరచేతిలో వంకర గీతై
నీ కాపురమే కూల్చిందా

పానకము లేకుండానే
పుడకేదో తగిలేసిందా
నానిందా నలుగురి నోట
ఇక నీ పరువే గోవిందా

ఓ తారకా… ఓ ఓ తారకా
మాయ లోకములో… కనుమరుగై పోయావా
ఆహా.!!




స్వామి రా రా పాట సాహిత్యం

 
Song Details



మళ్ళీ రావా… పాట సాహిత్యం

 
చిత్రం: పుష్పక విమానం (2021)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: రెహ్మాన్
గానం: హరిహరణ్

గుండె అంచును మీటిపోయిన
కోటి ఆశల మేఘమా
రెప్పపాటున వచ్చి పోయిన
రంగు రంగుల స్వప్నమా

ఎందుకో మరి అంత తొందర
చెప్పవా ఇది న్యాయమా
తిరిగి రావా నేస్తమా
వదిలి కదిలిన ప్రాణమా

మళ్ళీ రావా… మళ్ళీ రావా
చీకటైనది నా లోకం
చూపలేవా… చూపలేవా
కోటి వెలుగుల నీ రూపం
రాలేవా రాలేవా… ఓ సారి నాకోసం

తోడు నడిచిన ఏడు అడుగుల
అర్ధమే వివరించగా టెన్ టు ఫైవ్
వీడి పోనని ఒట్టు వేసిన
మంత్రమే మన సాక్షిగా

తరలిరావా బంధమా
మనసు మరువని గంధమా

మళ్ళీ రావా… మళ్ళీ రావా
చీకటైనది నా లోకం
చూపలేవా చూపలేవా
కోటి వెలుగుల నీ రూపం
రాలేవా రాలేవా… ఓ సారి నాకోసం



చోరి చోరి దేఖో రే పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Friday, June 18, 2021
Ganapathi Song (2020)




పాట: గణపతి పాట (2020)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: ఆనంద్ గుర్రం 
గానం: మంగ్లీ


గణపతి పాట (2020) సాహిత్యం

 
ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి
ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి

లంబోదరా నేను ఏమివ్వనురా
ఈసారికి ఎలాగోలా మన్నించరా
లంబోదరా నేను ఏమివ్వనురా
ఈసారికి ఎలాగోలా మన్నించరా

ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి
ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి

భాజాభజంత్రీలు లేవు
భారీగా సెట్టేసే బడ్జెట్టు లేదు
పట్టుబట్టలా ఊసేలేదు సామి
పంచభక్ష పరమాన్నాల్లేవు
కోటి దీపాల్లేవు - కోటి దీపాల్లేవు
కొబ్బరి ముక్కా లేదు -  కొబ్బరి ముక్కా లేదు
కోటి దీపాల్లేవు కొబ్బరి ముక్కా లేదు
అరటి పండు కరువే హారతి బిల్లా బరువే

ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి
ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి

లంబోదరా ఎట్టాగయ్యా 
గట్టెక్కే దారేదో సూపించయ్యా
లంబోదరా ఎట్టాగయ్యా
గట్టెక్కే దారేదో సూపించయ్యా

ముక్కు మూతి మూసుకోని
మనసులో తెలిసిందేదో మొక్కుకుంటాం
కాళు బయటాబెట్టాకుండా సామి 
మట్టితో నిన్ను చేసుకుంటాం

ఆశా పడకూ సామీ - ఆశా పడకూ సామీ
అలిగీ పోకు సామి - అలిగీ పోకు సామి
ఆశా పడకూ సామీ అలిగీ పోకు సామి
వచ్చే ఏడు బూందీ లడ్డూ పెట్టనా ఏమి

ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి
ఎట్టా నిన్ను పిలిసేది సామి
అరె ఎట్టా నిన్ను కొలిసేది సామి


Palli Balakrishna Thursday, May 27, 2021

Most Recent

Default