Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sebastian P.C. 524 (2022)




చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
నటీనటులు: కిరణ్ అబ్బవరం , నువేక్ష, కోమలి ప్రసాద్ 
దర్శకత్వం: బాలాజీ సయ్యపు రెడ్డి 
నిర్మాతలు: బి.సిద్దా రెడ్డి, రాజు, ప్రమోద్ 
విడుదల తేది: 04.03.2022



Songs List:



నా ప్రపంచం హేలి పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం: కపిల్ కపిలన్ 

నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే
నేను ఎవరో ఎవరో తెలిసింది నీ వల్లా
నువ్వు లేను నేను ఖాళీ కాదులే కల్లా

నీ కలలే మదిలో మెదులు
నీ వలనే సరదా మొదలు
నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే

నా ప్రపంచం హేలి అనే నాకు
అసలేమౌతోందో చుట్టూ తెలియదుగా
నా చిరాకే ఉంది పరారీలో
తెగ సంబరపడుతూ ఉంటా
నువ్వే కనబడగా కదలనుగా
మెదలనుగా వదలనుగా

ఎక్కడిదే ఈ వెలుగంతా నా కళ్ళలో
నీలాలలా మెరిసే నీ నవ్వులందే
ఎప్పటికీ నను బతికించే ఊపిరివే
గాలాడదే క్షణమైనా నువ్వు లేనిదే

నువ్వొచ్చాకనే కదా జీవితం అంటే తెలిసింది
అవస్థ ఉన్నా సరే నా పనికి బాధ్యత పెరిగింది
నువ్వు లేవా… నేనసలు ఏమైపోతానో జీవితము ఏమౌనో
ఎపుడైతే నీతో ఉంటానో సందడిగా ఉంటానే

నిజము తెలుపనా లేదుగా
మనసు మనసులా
జతపడు అడుగు అడుగునా
కుదురుగా మనసు నిలవదా

విడివిడినే మడగడదాం
వడివడిగా ముడిపడదాం
హా, ముడిపడదాం
విడివిడినే మడగడదాం

నీ మాట వింటే రాదా మైమరపే
నీ పేరు అంటే రాదా మైమరపే
నేను ఎవరో ఎవరో తెలిసింది నీ వల్లా
నువ్వు లేను నేను ఖాళీ కాదులే కల్లా

నీ కలలే మదిలో మెదులు
నీ వలనే సరదా మొదలు





కంటిలోని చీకటిని పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం: పద్మలత 

కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా
వెలుగు సెబా..!
రాజాధి రాజా

వదిలిపోని వేకువని
తిరుగులేని రేపటిని
ఏలుకొనే ఏలికలా
ఎదుగు సెబా..!
రాజాధి రాజా

నిజాలు కన్న కలల్లో
సమాధి నీ గతం
సవాలు ఉన్న కధల్లో
జవాబు జీవితం

నిరాశ ఒడిలోన పారాడక
తీరానికి దారి చూపు
ఆశ మీద దూసుకుపో పారిపోక

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజా రాజాధి రాజా
రాజాధి రాజా రాజాధి రాజా

నీ వంక చూసే మసకబారు లోకం
కనకుండా చూడు నీ లోపం
నీ నీడకైనా తెలియనీకు సారం
నిశ్శబ్దం చేయు నీకోసం

దోబూచులాడే కరుకు మనసు కాలం
కరిగేలా రగులు ఆసాంతం
ఏనాటికైనా నీకు నీవే ఊతం
నీతోనే నీకు పోరాటం

కంటిలోని చీకటిని
గుండెలోన దాచుకొని
వేదనలో వేడుకలా
వెలుగు సెబా..!
రాజాధి రాజా

వదిలిపోని వేకువని
తిరుగులేని రేపటిని
ఏలుకొనే ఏలికలా
ఎదుగు సెబా..!
రాజాధి రాజా

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ

రాజాధి రాజా రాజాధి రాజా
రాజాధి రాజా రాజాధి రాజా

రాజాధి రాజాధి రాజో రాజా
బాగుండు రారాజ
రాజాధి రాజాధి రాజో రాజా
భద్రం రేరాజ




నీ కనులలో దాగుందా పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం:  అనుదీప్ దేవ్

హ్మ్ మ్ మ్ మ్
నీ కనులలో దాగుందా మాయాజాలం
ఏ కదలికా లేకుండా లేదా కాలం

మనసారా మన మాటల్లో మునకేసింది
తనువారా మహదానందం చవిచూసింది
మనపై పనిలో పనిగా కధ రాసింది
మరలా మరల చదివి తెగ మురిసింది

ఎంత ప్రేమగా బిగిసింది
జంట మధ్యలో జారుముడీ

నీ కనులలో దాగుందా
మాయాజాలం
ఏ కదలికా లేకుండా
లేదా కాలం




న్యాయాన్ని కాపాడే పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ పాత్రుడు 
గానం:  అనుదీప్ దేవ్ , సాహితి గాలిదేవర 

న్యాయాన్ని కాపాడే
ఆరాటం లేనే లేని
చట్టాన్ని కాదయ్యా
చూడాలనుకుంది

అన్యాయం వైపుండే
బంధాలే ఉన్నా కాని
సంకెళ్ళు వద్దంటే
నేరం అవుతుంది

లోకం చూడని లోపం బాధిది
లోనుండే ఇజాన్ని మోయకు
ఫ్రెండేరాయని ప్రశ్నే వేయక
సాగించే ప్రయాణమే దులుపు

మేయగా చిమ్మ చీకటి మారదే
నిజాన్ని ఓ కాంతిరేఖలా నీ చూపు
ఏమైనా కాని ధైర్యాన్ని పూని
సత్యాన్ని గెలిపించెయ్ నేడు

న్యాయాన్ని కాపాడే
ఆరాటం లేనే లేని
చట్టాన్ని కాదయ్యా
చూడాలనుకుంది




The Rage Of Seba పాట సాహిత్యం

 
చిత్రం: సెబాస్టియన్ (2022)
సంగీతం: గీబ్రాన్
సాహిత్యం: గీబ్రాన్
గానం:  దీప్తి సురేష్ 

The Rage Of Seba

No comments

Most Recent

Default