-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Mrunal Thakur"
Dacoit (2026) Telugu Songs Lyrics

Dacoit (2026) Telugu Songs Lyrics

Movie Details

Movie : Dacoit (2026) Music : Bheems Ceciroleo Starting : Adivi Sesh, Mrunal Thakur Director : Shaneil Deo Producers : Supriya Yarlagadda, Suniel Narang Release Date : 10.04.2026

Rubaroo Song Lyrics in Telugu – Dacoit (2026)

‘Rubaroo’ song from Dacoit movie is composed by Bheems Ceciroleo and sung by Bheems Ceciroleo, Chinmayi Sripada.

Song Information

Song : Rubaroo Singer : Bheems Ceciroleo, Chinmayi Sripada Lyrics : Bhaskarabhatla Music : Bheems Ceciroleo
చిత్రం: DECOIT (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: భీమ్స్ సిసిరోలియో, చిన్మయి శ్రీపాద రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని అంటున్నది మనసే కాసేపు నువ్వు నేను కలిసే క్షణంలో లోకమంతా తెలిసే నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా ఎంత ఎంత నేనపినా నా ప్రాణమే ఆగనంటోందిగా రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ నీ ప్రేమనే గుర్తించగా నీతో పాటే నేనొచ్చాగా నీ అడుగులో నా అడుగుని ఓసారైనా గమనిస్తేగా ఆ గన్నిల్లే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా మంటల్లే మండేటి ఎండ నిన్ను వచ్చి తగకుండ వాన మబ్బునవుతా రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ రుబరూ...

Chichubuddi Song Lyrics in Telugu – Dacoit (2026)

“Chichubuddi” from the movie Peddi is composed by Bheems Ceciroleo and sung by Ram Miriyal, Jonita Gandhi.

Song Information

Song : Chichubuddi Singer : Ram Miriyal, Jonita Gandhi Lyrics : Bhaskarabhatla Music : Bheems Ceciroleo
చిత్రం: DECOIT (2026) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: రామ్ మిర్యాల, జోనితా గాంధీ హాాా… బూమ్ బూమ్ బూమ్ బూమరాంగ్, బూమరాంగ్ (బూమ్ బూమ్ బూమ్) ఎగరేస్తా పట్టుకోండి చీర కొంగు డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి హే… బూమ్ బూమ్ బూమ్ బూమరాంగ్ బూమరాంగ్ (బూమ్ బూమ్ బూమ్) తేనెలో ముంచి తీసా ఒంటి రంగు డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు సారబుడ్డి అంటుకుంటా, మంట పెడితే, ఆగుతుందా వయసులోని పాల పొంగు, రా రా డార్లింగు హెయ్… బేబ్, డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి ఒప్పుకో… చుట్టు తిప్పుకో మూడు లెక్కపెట్టేలోపు వచ్చి లొంగిపో హా, ఒప్పుకో… చుట్టు తిప్పుకో మూడు లెక్కపెట్టేలోపే వచ్చి లొంగిపో ఇందులో, ఎంతమందికో ఒళ్ళు కాలిపోతావుంది నీళ్ళు చల్లిపో డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి హాాా… ఆడ బిల్లు కట్టు ఈడ జల్లి కట్టు రెడ్ బుగ్గ మీద ముద్దులే పెట్టుకో సిగ్గులన్నీ డెడ్, ఎక్స్–వై–జెడ్ టాటూ లాగా అంటి కట్టుకో వయిలలా వయిలలా, వయిలలా అర్ధరాత్రి రేళ అపసోపాలా వయిలలా వయిలలా, వయిలలా నీ నోరు కాస్త తీపి చేయాలా ఇచ్చుకో ఇచ్చుకో గంపగుత్త ఇచ్చుకో బెంగాలీ స్వీట్ ఉంది నీ పెదవుల్లోన ఎవ్రిబాడీ వాంట్స్ సమ్ మోర్ గివ్ మీ నా గివ్ మీ… బేబ్, డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి (సారబుడ్డి) డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు బుడ్డి డుండునుక్కు టక్కడుమ్మ డుండునుక్కు చిచ్చుబుడ్డి

Palli Balakrishna Sunday, April 5, 2026



చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024)
సంగీతం: గోపి సుందర్  
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్
దర్శకత్వం: పరసురం 
నిర్మాత: రాజు, శిరీష్ 
విడుదల తేది: 05.04.2024



Songs List:



నందనందనా పాట సాహిత్యం

 
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024)
సంగీతం: గోపి సుందర్ 
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్

ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో

హృదయాన్ని గిచ్చి గిచ్చకా
ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా
చిత్రంగా చెక్కింది దేనికో

ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో

నందనందనా
నందనందనా
నందనందనా

అడిగి అడగకా అడుగుతున్నదే, ఆ ఆ
అడిగి అడగకా అడుగుతున్నదే
అలిగి అలగకా తొలగుతున్నదే
కలత నిదురలు కుదుటపడనిదే
కలలనొదలక వెనకపడతదే

కమ్ముతున్నాదే మాయలా
కమ్ముతున్నాదే, టాం టాం టాం….

ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో

సిరుల వధువుగా ఎదుట నించుందే
సిరుల వధువుగా ఎదుట నించుందే
విరుల ధనువుగా ఎదని వంచిందే
గగనమవతలి దివిని విడిచిలా
గడపకివతల నడిచి మురిసెనే

ఇంతకన్నానా జన్మకీ
ఇంతకన్నానా

ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో



కళ్యాణి వచ్చా వచ్చా పాట సాహిత్యం

 
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024)
సంగీతం: గోపి సుందర్ 
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్, మంగ్లీ

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా

ధమకు ధమా ధమారి
చమకు చమా చమారి
సయ్యారి సరాసరి
మొదలుపెట్టేయ్ సవారి
నుందుంతన నుందుంతన
నుందుంతన నుందుంతన

డుముకు డుమా డుమారి
జమకు జమా జమారి
ముస్తాబై ఉన్నా మరి
అదరగొట్టెయ్ కచేరీ

చిటికెలు వేస్తోంది
కునుకు చెడిన కుమారి
చిటికెన వేలిస్తే
చివరి వరకు షికారీ

ఎన్నో పొదలెరకా
ఎంతో పదిలముగా
ఒదిగిన పుప్పొడిని
నీకిప్పుడు అప్పగించా

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చెయ్యందించా
ఏనుగంబారి సిద్ధంగుంచా

ధమకు ధమా ధమారి
చమకు చమా చమారి
సయ్యారి సరాసరి
మొదలుపెట్టేయ్ సవారి
నుందుంతన నుందుంతన
నుందుంతన నుందుంతన

హెయ్ హెయ్ హెయ్ హెయ్
సువ్వీ కస్తూరి రంగ
సూపియ్‍కావీధి వంక
సువ్వి బంగారు రంగ
సువ్వి సువ్వి

పచ్చాని పందిరి వేసి
పంచావన్నెల ముగ్గులు పెట్టి
పేరాంటాలు అంతా కలిసి
పసుపు దంచారే

సాహో సమస్తము ఏలుకొనేలా
సర్వం ఇవ్వాలని ముందర ఉంచా
ఎగబడి దండయాత్ర చెయ్‍రా

కలబడిపోతూ గెలిపిస్తా
నీ పడుచు కలనీ
బరిలో నిలిచే ప్రతిసారీ ఆ ఆ
అలసటలోను వదిలెయ్‍కుండా
ఒడిసి ఒడిసి
పడతను చూడే నిను కోరీ ఆ ఆ

తగువుల కధా ఆ ఆ ఆ
ముగిసెను కదా ఆ ఆ ఆ
బిగిసిన ముడి తెగదిక పదా ఆ ఆఆ

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చెయ్యందించా
ఏనుగంబారి సిద్ధంగుంచా

కళ్యాణి వచ్చా వచ్చా
పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా
సింగారి చెయ్యందించా
ఏనుగంబారి సిద్ధంగుంచా



మధురము కదా ప పాట సాహిత్యం

 
చిత్రం: ద ఫ్యామిలీ స్టార్ (2024)
సంగీతం: గోపి సుందర్ 
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రేయా ఘోషల్ 

పించం విప్పిన నెమలికిమల్లె
తొలకరి జల్లుల మేఘంమల్లె
అలజడి హృదయం ఆడిన కూచిపూడి

రంగులు దిద్దిన బొమ్మకుమల్లె
కవితలు అద్దిన పుస్తకమల్లె
సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి

ఆరారు ఋతువుల అందం
ఒకటిగ కలిపి వింతలు ఏడు
పక్కకు జరిపి కొత్తగ పుంతలు
తొక్కెను ఈ అరవిందం

అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి
వేణువుగానం తియ్యగ పండే
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం

మధురము కదా ప్రతొక నడకా
నీతో కలిసి ఇలా
తరగని కధా మనదే కనుకా
మనసు మురిసెనిలా

ఉసురేమో నాదైనా
నడిపేదే నీవుగా
కసురైన విసురైన
విసుగైన రాదుగా

పించం విప్పిన నెమలికిమల్లె
తొలకరి జల్లుల మేఘంమల్లె
అలజడి హృదయం ఆడిన కూచిపూడి

రంగులు దిద్దిన బొమ్మకుమల్లె
కవితలు అద్దిన పుస్తకమల్లె
సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి

ఆరారు ఋతువుల అందం
ఒకటిగ కలిపి వింతలు ఏడు
పక్కకు జరిపి కొత్తగ పుంతలు
తొక్కెను ఈ అరవిందం

అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి
వేణువుగానం తియ్యగ పండే
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం

ఏదో సంగీతమె
హృదయమున ఎంతో సంతోషమే
క్షణములో గాల్లో తేలిన భ్రమే
తిరిగి నవ్వింది ప్రాయమే

ఏదో సవ్వడి విని
టక్కుమని తిరిగాలే నువ్వని
మెరుపులా నువ్వొస్తున్నావని
ఉరుకులో జారె ప్రాణమే

నీపేరే పలికినదో
ఏ మగువైన తగువేనా
నా గాలే తాకినదో
చిరుగాలైన చంపెయ్ నా

హెచ్చరిక చేసినా నీకు నీడయ్యెరా
వెన్నెలను నిన్ను వదలమని వైరం
ప్రతి నిమిషమునా
హక్కులివి నాకు మాత్రమవి సొంతం
ఇలా నీపైనా

మధురము కదా ప్రతొక నడకా
నీతో కలిసి ఇలా
తరగని కధా మనదే కనుకా
మనసు మురిసెనిలా

పించం విప్పిన నెమలికిమల్లె
తొలకరి జల్లుల మేఘంమల్లె
అలజడి హృదయం ఆడిన కూచిపూడి

రంగులు దిద్దిన బొమ్మకుమల్లె
కవితలు అద్దిన పుస్తకమల్లె
సంతోషంలో ముద్దుగ ఈ అమ్మాడి

ఆరారు ఋతువుల అందం
ఒకటిగ కలిపి వింతలు ఏడు
పక్కకు జరిపి కొత్తగ పుంతలు
తొక్కెను ఈ అరవిందం

అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి
వేణువుగానం తియ్యగ పండే
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం

Palli Balakrishna Tuesday, February 13, 2024



చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
నటీనటులు: నాని, మృణాల్  ఠాకూర్
దర్శకత్వం: సౌరవ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల 
విడుదల తేది: 21.12.2023



Songs List:



గాజు బొమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: హేషం అబ్దుల్ వహేబ్

ఇటురావే నా గాజు బొమ్మా
నేనే నాన్న అమ్మా
ఎదనీకు ఉయ్యాల కొమ్మా 
నిన్ను ఊపే చెయ్యే ప్రేమా 
వాలిపో... ఈ గుండెపై...నే...
ఆడుకో... ఈ గూటిలో...నే...
దూరం పోబోకు మా

చిన్ని చిన్ని పాదాలని 
నేలై నే మోయనా 
చిందే క్షణంలో నువు కింద పడినా 
ఉంటావు నా నీడన 
నీ చెంతే రెండు చెవులుంచి బయలెల్లనా 
ఏ మాట నీ నోట మొగించినా 
వెనువెంటే వింటానే 
రానా నిమిషంలోన 
నే నన్నే వదిలేసైనా 

తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి 
కాపై నేనుండనా 
ఉచ్వాస నైన నిశ్వాస నైన 
మేలెంచి పంపించనా 
ఏ కాంతులైన అవి నన్ను దాటాకనే 
ఆ రాజు చేరాలి నీ చూపునే
నీ రెప్పై ఉంటానే పాపా కంటి పాపా 
నా పాపా కంటి పాపా 

ఇటురావే నా గాజు బొమ్మా 
నేనే నాన్న అమ్మా
ఎదనీకు ఉయ్యాల కొమ్మా 
నిన్ను ఊపే చెయ్యే ప్రేమా 
వాలిపో... ఈ గుండెపై...నే...
ఆడుకో... ఈ గూటిలో...నే...
దూరం పోబోకు మా



సమయమా..!! పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: అనురాగ్ కులకర్ణి , సితార కృష్ణ కుమార్ 

నీ సా సా గ స, నీ సా సా గ స
నీ సా సా గ స నీ సా మ గ స
నీ సా సా గ స నీ సా సా గ స
నీ సా సా గ స నీ సా మా గ స

సమయమా..!!
భలే సాయం చేశావమ్మా
ఒట్టుగా, ఒట్టుగా
కనులకే..!!
తన రూపాన్నందిచావే గుట్టుగా
ఓ ఇది సరిపోదా…

సరె సరె తొరపడకో
తదుపరి కథ ఎటుకో
ఎటు మరి తన నడకో
చివరికి ఎవరెనకో

సమయమా..!!
భలే సాయం చేశావమ్మా
ఒట్టుగా, ఒట్టుగా
కనులకే..!!
తన రూపాన్నందిచావే గుట్టుగా

హో తను ఎవరే..?
నడిచే తారా, తళుకుల ధారా
తను చూస్తుంటే, రాదే నిద్దుర
పలికే ఏరా… కునుకే ఔరా
అలలై పొంగే అందం
అది తన పేరా..!

ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం
చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం
బంగారు వానల్లో నిండా ముంచే కాలం
చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం

భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం
చూపిస్తుందే తనలో ఇంకో కోణం
చంగావి చెంపల్లో చెంగుమంటు మౌనం
చూస్తూ చూస్తూ తీస్తువుందే ప్రాణం

తను చేరిన ప్రతి చోటిలా
చాలా చిత్రంగున్నదే
తనతో ఇలా ప్రతి జ్ఞాపకం
ఛాయా చిత్రం అయినదే

సరె సరె తొరపడకో
తదుపరి కథ ఎటుకో ఓ ఓ
ఎటు మరి తన నడకో
చివరికి ఎవరెనకో

సమయమా..!!
భలే సాయం చేశావమ్మా
ఒట్టుగా, ఒట్టుగా
కనులకే..!!
తన రూపాన్నందిచావే గుట్టుగా
ఓ ఇది సరిపోదా…
సమయమా..!!!




అసలిలా పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: అనంత శ్రీరామ్  
గానం: శక్తిశ్రీ గోపాలన్, అనురాగ్ కులకర్ణి 

అసలిలా




అమ్మాడి పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ 

హ హ హా ఆ ఆ హ హ హా ఆ ఆ
ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి
అందం కట్టేసుకుంటే అమ్మాడి
ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి
ఈ మాటే అంటు ఉంటు
రోజంత నన్నొదలడుగా

హే ముద్దు ముద్దు
ముద్దంటూనే ముద్దొస్తాడే హే హా
కాలే నేలే తాకొద్ధంటు
ముద్దొస్తాడే హే హా

ఉప్పు మూట ఎత్తేస్తూనే
ముద్దొస్తాడే
కోపం లోను ముద్దొస్తాడే

నీ ఒళ్ళో పవలిస్తుంటే
చేతుల్తో దువ్వేస్తుంటే
పిల్లోన్నే అయిపోతాలే
మౌనంగా నవ్వేస్తాలే

నిజమే సగమే అడిగా లేరా
ఎదుటే జగమే నిలిపావా

కన్నీరే లేని కళ్ళే
నీవైతే అంతే చాలే
చూస్తుంటే నీ ఆ నవ్వే
నా కళ్ళే చెమ్మగిల్లే

ఒదిగే భుజమే అడిగా లేరా
గగనం పరిచే నడిపావా

ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి
అందం కట్టేసుకుంటే అమ్మాడి
ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి
ఈ మాటే అంటు ఉంటు
రోజంత నన్నొదలడుగా

హే ముద్దు ముద్దు
ముద్దంటూనే ముద్దొస్తాడే హే హా
కాలే నేలే తాకొద్ధంటు
ముద్దొస్తాడే హే హా

ఉప్పు మూట ఎత్తేస్తూనే
ముద్దొస్తాడే
కోపం లోను ముద్దొస్తాడే




ఎన్నో ఎన్నో పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: భావన ఇస్వి

ఎన్నో ఎన్నో 



అడిగా పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: కార్తీక్ 

అడిగా




ఇదే ఇదే ఇదే తొలిసారిలా పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: హేషం అబ్దుల్ వహేబ్

అలా ఎగసే అలలా
పడే కురులతో పడేసినావా
అవే చిలిపి కనులా
అదే మెరుపు మరలా

ఇది కలా కదా
తిరిగిలా ఎదుట పడగా
నడిచిన నదా
కదలదే శిలే అయ్యేనా ప్రాణం

ఇదే ఇదే ఇదే తొలిసారిలా
పదే పదే ఎదే కుదిపేనుగా
స్వాసగా స్వాసగా

చాయే ఇసుక మెరుపా
చీరే చీకటేల ఆకాశమేగా
నిన్నే పొగిడే పుడకా
బొట్టే నిమిరే నుదురు
జరిగిన కథే

గురుతులే తిరిగి నడిచె
కమ్మేను కదే
పెగలదే మాటే
ఏంటో ఈ మౌనం

ఇదే ఇదే ఇదే తొలిసారిలా
పదే పదే ఎదే కుదిపేనుగా
స్వాసగా స్వాసగా




ఓడియమ్మ హీటు పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: చిన్మయి శ్రీపాద, శృతి హాసన్ , ధ్రువ విక్రమ్

పైకి తీయి లోన హాయిని
బైటవేయి లోపలోడిని
దాచుకోకు ఇంకా దేనిని
గోలే నీ పని

తొంగి చూడు కింద నింగిని
గాలికేయి కొత్త రంగుని
నిన్న నింక నేడు మింగని
దాంతో ఏం పని

ఒక షాటులో ఉత్సాహమే
ఒక షాటులో ఉల్లాసమే
ఒక షాటులో ఉక్రోషమే
ప్రతి షాటు లోపలే

ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

ఓడియమ్మ హీటు
ఈడిఎంలో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

తాగితే మరిచిపోగలను తాగనివ్వదు
మరిచిపోతే తాగగలను మరువనివ్వదు

ఫీల్ హై ఫీల్ దిస్ హై
నాతో చెయ్ కలిపేయ్
అరె దేన్నో చూస్తావే

కాలం చల్తా హై
భేజా ఉడ్తా హై
వదిలేసెయ్ వచ్చేసెయ్
యయ్ యయ్ యా

ఒక గ్లాసులో ఆనందమే
ఒక గ్లాసులో ఆలోచనే
ఒక గ్లాసులో ఆవేశమే
ప్రతి గ్లాసు ఖాళీ చెయ్

ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

జోరుగున్నదో జారుతున్నదో
జన్మకేమయిందో
ఊహ నిజములా
నిజము ఊహలా
తోచి తోసినాయో

జరుగుతున్నదే జరగనున్నదో
జరిగిపోయినాదో
తిరుగుతున్నదో తిప్పుతున్నదో
డే జా వు

నీ పాత్ ఓ పాతాలమే
ఈ కైపులో కైలాసమే
నా వైబ్ లో వైకుంఠమే
ఈ మైకం మోక్షమే

ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు

ఓడియమ్మ హీటు
ఈడిఎం లో బీటు
రేడియంలా లైటు
పార్టీలో ఇటు అటు





చేదు నిజం పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: గీతామాధురి, వినీత్ శ్రీనివాసన్ 

చేదు నిజం 




నీదే నీదే పాట సాహిత్యం

 
చిత్రం: హాయ్ నాన్న (2023)
సంగీతం: హేషం అబ్దుల్ వహేబ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అవని మల్హర్ 

నీదే నీదే 

Palli Balakrishna Saturday, October 7, 2023



చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
నటినటులు:దుల్కర్ సాల్మన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ 
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: అశ్వని దత్ 
విడుదల తేది: 05.08.2022



Songs List:



ఓ సీతా వదలనిక పాట సాహిత్యం

 
చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: యస్.పి.బి.చరణ్ , రమ్యా బెహ్రా 

ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా

తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా

హే రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
రేపేం జరుగునో రాయగలమా
రాసే కలములా మారుమా

జంట జన్మనే గీయగలమా
గీసే కుంచెనే చూపుమా
మెరుపులో ఉరుములో దాగుంది
నిజము చూడమ్మా

ఓ సీతా వదలనిక తోడౌతా
హే రామా ఒకరికొకరౌతామా

నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ
నీ చూపులే నేలపై వాలుతున్నవి
అడుగు అడుగున పువ్వులై

ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది
మరోవైపు లోకం ఏమి తోచని సమయంలో
ఏది తేల్చని హృదయమో
ఏమో బిడియమో నియమమో
నన్నాపే గొలుసు పేరేమో

నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే
నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే

ఎపుడు లేదే ఏదో వింత బాధే
వంత పాడే క్షణం ఎదురాయే
కలిసొస్తావా ఓ కాలమా
కలలు కునుకులా కలుపుమా
కొలిచే మనిషితో కొలువు ఉండేలా
నీ మాయ చూపమ్మా

హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా

తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా




ఇంతందం దారి మల్లిందా పాట సాహిత్యం

 
చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: యస్.పి.బి.చరణ్ 

ఇంతందం దారి మల్లిందా
భూమిపైకే చేరుకున్నదా
లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్ప సంపదా

జగత్తు చూడనీ
మహత్తు నీదేలే
నీ నవ్వు తాకి 
తరించె తపస్సీలా
నిశీదులన్నీ తలొంచే
తుషారాణివా

విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరీ
వీడే వీలు లేని
ఏదో మాయలోకి
లాగే పిల్ల తెంపరీ

నదిలా దూకేటి
నీ పైట సహజగుణం
పులిలా దాగుంది
వేటాడే పడుచుతనం
దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

చిలకే కోక కట్టి
నిన్నే చుట్టుముట్టి
సీతాకోకలాయేనా..!
విల్లే ఎక్కుపెట్టి
మెల్లో తాళి కట్టి
మరలా రాముడవ్వనా

అందం నీ ఇంట
చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది
నీపైన ఈ జగమే
దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే



కానున్న కళ్యాణం ఏమన్నది పాట సాహిత్యం

 
చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: అనురాగ్ కులకర్ణి, సింధూరి. S

ఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆఆ
కానున్న కళ్యాణం ఏమన్నది
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది
ప్రతి క్షణం మరో వరం

విడువని ముడి ఇది కదా
ముగింపులేని గాధగా
తరముల పాటుగా...
తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా...
ప్రణయమునేలగా సదా

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా...
కళ్ళముందు పారాడగా... (2)

చుట్టు ఎవరూ ఉండరుగా
కిట్టని చూపులుగా
చుట్టాలంటూ కొందరుండాలిగా
దిక్కులు ఉన్నవిగా

గట్టిమేలమంటూ ఉండగా
గుండెలోని సందడి చాలదా
పెళ్లి పెద్దలెవరు మనకి
మనసులే కదా
అవా..! సరే..!!

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా...
కళ్ళముందు పారాడగా.... (2)

తగు తరుణం ఇది కదా
మదికి తెలుసుగా
తదుపరి మరి ఏమిటటా
తమరి చొరవట..!
బిడియమిదేంటి కొత్తగా
తరుణికి తెగువ తగదుగా
పలకని పెదవి వెనక
పిలువు పోల్చుకో
సరే మరి.!

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా...
కళ్ళముందు పారాడగా... (2)




ఓ ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కపిల్ కపిలన్, చిన్మయి శ్రీపాద 

వస్తా… నే వెంటనే
ఉంటా… నీ వెంటనే

ముద్దంటిన చెంపపై
తడి ఆరనే లేదులే
మాటొకటి చెప్పెంతలో
పయనాలు మొదలాయెనే

ఓ ప్రేమా.. - ఓ ప్రేమా
అవసరమా... - అవసరమా
మాయే నీ...- మాయే నీ
చిరునామా... - చిరునామా

మనసంతా నీవే ప్రియా
విరహాన్ని చంపేదెలా
అంతరిక్షం అంచుదాక
ప్రేమ తాకిందిగా

నీతో ఙ్ఞాపకాలే
ఈ మంచుల అవి కరగవే
ఈ నీ పరిమళాలే
గుండెలో నిండెలే

ఓ ప్రేమా.. - ఓ ప్రేమా
అవసరమా... - అవసరమా
మాయే నీ...- మాయే నీ
చిరునామా... - చిరునామా

ఇటు చూడవా ప్రియతమా
ఎడబాటు అనుకోకుమా
కాలికిందే చిక్కుకుందీ
చూడు నా ప్రాణమే

దూరం ఆవిరాయే
నీ వెచ్చనీ నిశ్వాసలో
నిదురే చెదిరేలోపే
తిరిగిరా స్వప్నమా

ఓ ప్రేమా.. - ఓ ప్రేమా
అవసరమా... - అవసరమా
మాయే నీ...- మాయే నీ
చిరునామా... - చిరునామా

Palli Balakrishna Tuesday, August 2, 2022

Most Recent

Default