-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kongara Jaggaiah"



చిత్రం: పదండి ముందుకు (1962)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, జగ్గయ్య
గానం: ఎ.పి.కోమల,ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, శిష్ట్లా జానకి, పులపాక సుశీల, మహమ్మద్ రఫీ
నటీనటులు: జగ్గయ్య, జమున, గుమ్మడి, జి.వరలక్ష్మి, ఘట్టమనేని  కృష్ణ, హేమలత
దర్శకత్వం: వి.మధుసూధనరావు
నిర్మాత: తుమ్మల కృష్ణమూర్తి
విడుదల తేది: 26.01.1962


ఎల్వీ ప్రసాద్ తీయబోయిన కొడుకులు కోడళ్ళు సినిమా ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘట్టమనేని కృష్ణని ఈ సినిమాలో చిన్న పాత్రకు తీసుకున్నారు. అనంతరకాలంలో సూపర్ స్టార్ అయిన కృష్ణకు తొలి చిత్రం ఇదే

Palli Balakrishna Wednesday, May 20, 2026



చిత్రం: ప్రజానాయకుడు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, కొసరాజు 
గానం: పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు 
నటీనటులు: కృష్ణ, జగ్గయ్య, రాజబాబు, చంద్రమోహన్, నాగభూషణం, జయ (నూతన నటి) జ్యోతి లక్ష్మి, జానకి, రమాప్రభ, నిర్మల 
మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
దర్శకత్వం: వి. మధుసూదన రావు
నిర్మాత: సి హెచ్. రాఘవరావు 
విడుదల తేది: 10.11.1972

Palli Balakrishna Tuesday, December 6, 2022



చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
నటీనటులు: జగ్గయ్య, కృష్ణ , జమున, విజయ లలిత, అంజలీ దేవి 
దర్శకత్వం: పి. సాంబశివ రావు 
నిర్మాత: అమరారామ సుబ్బారావు 
విడుదల తేది: 22.06.1973



Songs List:



పిల్లా పాపల చల్లని గూడు పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల

పిల్లా పాపల చల్లనిగూడు 
చెల్లా చెదురై పోయెను నేడు
ఒకరిది నేరం - ఒకరికిభారం 
జీవిత నావకు లేదా తీరం
ఏమైపోవునొ ఈ సంసారం

చరణం: 1
మంచిని మెచ్చే మనిషే లేడు 
మచ్చను చూపును ప్రతివాడు
ఇన్ని తరాల యింటి గౌరవం 
ఒక్క నిందతో మంటగలిసెరా

చరణం: 2
కన్నీళ్ళైనా కషాలెనా 
అన్నిభరించే అమ్మవు నీవు
పిల్లలకోసం జీవించాలి
నిండుకుటుంబం నిలపాలి

చరణం: 3
పసిహృదయానికి తగిలెను గాయం
యెవ్వరులేరు నీకుసహాయం 
వయసుకుమించిన పంతంతో 
పయనించే ఓ పసివాడా
విజయం నీదే నీదేరా !




నవ నవ లాడే నవతరం పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల, రమోల, వి.రామకృష్ణ 

యువతరం
నవతరం
నవనవలా దే - నవతరం
ఉరకలువేసే - యువతరం
మనలా అవడం - యెవరితరం
యువతరం
నవతరం

చరణం: 1
ముందు ముందుకు సాగిపోయే
యువకులం మేము
స్వేచ్ఛకోసం పోరుసలిపే
యువతులం మేము
యెవ రేమం టె నేమి - యేపేరు పెడితేనేమి
మనమూ మనమూ యేకమైతే మార్పుసాధిస్తాం

చరణం: 2
ఆటలందూ దోరవయసు
తొంగిచూడాలి
పాటలందూ కొంటె మనసు
పొంగిపోవాలి
చేయీ చేయీ కలిపి
సరదాల తేలి తేలి
పాతకాలం రోతలన్నీ - మరిపించెయ్యాలి

చరణం: 3
యవ్వనమే అందరికీ వఠములాంటిది
నవ్వులతో గడపడమే మనకు మంచిది 
వడివడిగా నీటిలోనే బోటు షికారు
లోతు లోతు కెళుతుంటే భలే హుషారు 
ఛల్ ఛల్ ఛల్ ఛల్ బోటు షికారు 
జిల్ జిల్ జిల్ జిల్ భలే హుషారు 
జంటలుగా వలపుమజా రుచిచూడాలి




తళతళ తళతళ మెరుపే మెరిసింది పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, యస్.పి.బాలు 

తళ తళ తళ తళ మెరుపే మెరిసిందీ 
జల జల జల జల జ లేకురిసింది
ఏంచేయాలీ - అబ్బా! ఏంచేయాలీ

మిల మిల మిల కళే మెరిసినవీ
గుబ గుబ గుబ గుబ గుబులేరేగినది
ఏంచేయాలి - అబ్బా ! ఏంచేయాలి 

చరణం: 1
ఏదో చెయ్మని వయసంటే
ఏల తొందరని మనసంటుంది 
మనసుకు వయసుకు మధ్యనచిక్కి 
సొగసే ఉసూరు మంటుంది

చరణం: 2
వెచ్చని జతగా నువ్వున్నావని 
చలి నన్నెంతో మెలివేస్తుంది 
దుడుకుగ దూకే తోడున్నావని 
వలపే వరదై వంచేస్తుంది 

చరణం: 3
ఎత్తూ పల్లా లేకంచేసే
చీకటి ఎంతో బాగుంటుంది
చేయీ చేయిగ యిద్దరముంటే
చీకిటి వెచ్చని వెలుగౌతుంది




అవలీలగా శ్రీరాముడు శివధనువును (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల

అవలీలగ శ్రీరాముడు 
శివధనువును విరిచినంత
చిత్తము పొంగన్
నవ సుమ మాలను చేకొని
అవనీ సుత వచ్చి నిలిచె అతని ఎదుటన్ 
అందమునకె అందమైన సీతమ్మను
ప్రేమమీద చూచె రామమూర్తి
వీరవరుల కెల్ల వీరుడా రాముని
సంతసమున కాంచే జనక జాత
కొంత పులకరింత కొంత చక్కలిగింత 
అతని చూచినంత అదొక వింత 
పూలమాలతోడ - బాలనిండు మనమ్ము 
స్వామి కంఠసీమ వ్రాలిపోయె 




ఎవరు కారణము పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, కె.హరిరావు 

ఎవరు కారణము
ఈ లోకమిలా - అల్లకల్లోల మగుటకు
ఎవరు కారణము
ప్రతి మనిషీ బాధలు పడుతున్నాడు 
ప్రతి దానికి దేవుని తిడుతున్నాడు 
దేవుడు పాపం అలోచించాడు 
మనిషికి పాఠం నేర్పాలనుకున్నాడు

సృష్టించాడొక స్త్రీ మూ ర్తిని
చేశాడు రెండుగా దానిని
తెల్లనిదే  మంచిన్నాడు- నల్లనిదే చెడుగన్నాడు


అల్లదిగో మానవలోకం-అక్కడికే పొమ్మన్నాడు
మంచిని నేను
మీ మంచికోరి వచ్చాను...మంచిని నేను 
మీ హృదయాల్లో చోటిస్తే వుంటాను 
ఉండి-మిమ్మల్ని మనుషులుగా చేస్తాను 
రావమ్మా | రావమ్మా ! మా మంచి 
ఏమి తెచ్చావు మాకు దీనినించి 
చీకటి పోగొడతాను
మీలో చీలికలన్నీ మాన్పుతాను 
అందరి నొకటిగ చేస్తాను. 
ఆనందం-అందం-అందిస్తాను 
సమతా-మమతా పండిస్తాను 
శాంతి- సౌఖ్యం-పంచేస్తాను
ఆకలి శోకం లేనిరాజ్యం రామరాజ్యం 
మీలోకంలో స్థాపిస్తాను.

నేను నేనే
నేను నేననే అహం నేనే
నాది నాదనే స్వార్ధం నేనే
బలే బలే నువ్వేకావాలి
పక్కవాడిని తొ క్కెయ్యాలి
గొంతు పిసికి పారెయ్యాలి!
గొయ్యి తవ్వి పూడ్చెయ్యాలి!

అన్నీ చేసాను-మీ ఆశలు తీరుస్తాను 
ధర్మాన్ని ఉరి కెక్కిసాను 
అధర్మాని కే పట్టం కడతాను
రాజకీయ రాక్షసి నా రూపం 
రాపిడి దోపిడి నా రాజ్యం 
ఫిరంగి నాకు మృదంగము 
ప్రేతభూమి నా నాట్యరంగము

మీరే, మీరే |
ఎవరికివారే కారణము
ఈ మంచి వున్నది మీలో నే
ఈ చెడ వున్నదీ మీలోనే 
మంచిని మీలో పెంచుకోవాలి
చెడునుదాంతో గెలుచుకోవాలి
ఈ జగతి స్వర్గం చేసుకోవాలి




ఈవేళ పాడేటి పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: గోపి
గానం: పి.సుశీల

ఈవేళ పాడేటి పాటా
నేడూ రేపూ వినిపించు నీ వున్నచోటా 
ఏ నాటికీ
ముమ్మూలకీ

చరణం: 1
మనసుంది. మన లేవు నీవూ
తనువుంది కనరాను నేనూ
చిరుగాలి నేనూ- తెరచాప నీవూ
యేనాడు చేరేము రేవూ

చరణం: 2
మన కేసిపోయేను హృదయం
చేజారిపోనీకు సమయం
మనవింత స్నేహం వెలిగించుదీపం 
తొలగించు నీపైన  శాపం

Palli Balakrishna



చిత్రం: కలెక్టర్ జానకి (1972)
సంగీతం: వి.కుమార్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, రామారావు, స్వర్ణ, పి.సుశీల, పట్టాభి భాగవతార్, కె.జమునారాణి
నటీనటులు: జగ్గయ్య, జమున, జయంతి, సి.హెచ్.నారాయణరావు
నిర్మాత, దర్శకత్వం: ఎస్.ఎస్.బాలన్
విడుదల తేది: 10.03.1972



Songs List:



వలచిన మనసే ఆలయం పాట సాహిత్యం

 
చిత్రం: కలెక్టర్ జానకి
సంగీతం: వి కుమార్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి సుశీల, జమునారాణి

వలచిన మనసే ఆలయం 
అది ఒకే దేవునికి నిలయం
ఆ దేవుని అలరించు దారులు రెండు 
ఒకటి అనురాగం ఒకటి ఆరాధనం

నీ వన్నది నీ వనుకున్నది 
నే నన్నది ఇలలో వున్నది
నీ మదిలో మెదిలే స్వప్నమది 
స్వప్నంకాదు, సత్యమిది
మాయని జీవిత సత్యమిది

ఒక హృదయంలో నివసించేది
ఒకే ప్రేమికుడు కాదా
ఆ ప్రేమికుని మనసార చూసే
కన్నులు రెండు కాదా
శ్రీనివాసుని ఎదపై నిలిచేదిశ్రీలక్ష్మీయేకాదా
అలివేలుమంగ దూరానవున్నా
ఆతని సతియేకాదా

బ్రతుకుదారిలో నడిచేవారికి
గమ్యం ఒకటేకాదా
పదిలంగా ఆ గమ్యం చేర్చే
పాదాలు రెండు కాదా
కృష్ణుని సేవలో పరవశమొందిన రుక్మిణి నా ఆదర్శం
అతని ధ్యానమున అన్నీ మరచిన
రాధయె నా ఆదర్శం




పాట ఆగిందా ఒక సీటు గోవిందా పాట సాహిత్యం

 
చిత్రం: కలెక్టర్ జానకి
సంగీతం: వి కుమార్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు 

పాట ఆగిందా ఒక సీటు గోవిందా



చింతించకో ప్రాణనాథ (హరికథ) పాట సాహిత్యం

 
చిత్రం: కలెక్టర్ జానకి
సంగీతం: వి కుమార్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు 

చింతించకో ప్రాణనాథ (హరికథ)




అభినవ కుచేల పాట సాహిత్యం

 
చిత్రం: కలెక్టర్ జానకి
సంగీతం: వి కుమార్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు 

అభినవ కుచేల




వెండితెరపై పాట సాహిత్యం

 
చిత్రం: కలెక్టర్ జానకి
సంగీతం: వి కుమార్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: 

వెండితెరపై



ఒక చిలకమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: కలెక్టర్ జానకి
సంగీతం: వి కుమార్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి సుశీల

ఒక చిలకమ్మ

Palli Balakrishna Wednesday, July 27, 2022



చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958)
సంగీతం: కె.వి. మహదేవన్ 
నటీనటులు: జి. వరలక్ష్మి , గిరిజ, హేమలత, సి. యస్. ఆర్. ఆంజనేయులు, జగ్గయ్య 
దర్శకత్వం: నరసింహారావు భీమవరపు 
నిర్మాణ సంస్థ: ప్రతిభా పిక్చర్స్ 
విడుదల తేది: 11.07.1958

(ఎల్. ఆర్. ఈశ్వరి గారు తెలుగులో పాడిన మొదటి పాట.  చమురుంటేనే దీపాలూ ఈ నిజముంటేనే కోపాలూ అనే పాట పాడింది. దీనిలో రాజేశ్వరి అనే పేరు ఉంటుంది. ఈమె పూర్తి పేరు లూర్డ్ రాజేశ్వరి ఈశ్వరి. అందుకు  ఎల్.ఆర్.ఈశ్వరి అని అంటారు)




Songs List:



వలపే పులకింత సరసాలే గిలిగింత పాట సాహిత్యం

 
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్. జానకి, పి. బి శ్రీనివాస్ 

వలపే పులకింత సరసాలే గిలిగింత



అయ్యోయ్ ఏమయ్యో అలా చూస్తావేమయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి)

అయ్యోయ్ ఏమయ్యో అలా చూస్తావేమయ్యా



కల్ల కాదు కలా కాదు కన్నెపిల్ల బాసలు పాట సాహిత్యం

 
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి)

కల్ల కాదు కలా కాదు కన్నెపిల్ల బాసలు




చమురుంటేనే దీపాలూ పాట సాహిత్యం

 
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: రాజేశ్వరి (ఎల్. ఆర్. ఈశ్వరి), కస్తూరి 

చమురుంటేనే దీపాలూ ఈ నిజముంటేనే కోపాలూ



వినరా నాన్నా కనరా చిన్నా పాట సాహిత్యం

 
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: మాధవపెద్ది సత్యం 

వినరా నాన్నా కనరా చిన్నా విస్సన్న చెప్పే వెర్రిమాటలో




హాసమా పరిహాసమా పాట సాహిత్యం

 
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి)

హాసమా పరిహాసమా చందమామ ఓ చందమామ




ఏమనెనోయి ఆమనిరేయి పాట సాహిత్యం

 
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి), ఘంటసాల 

ఏమనెనోయి ఆమనిరేయి ఎవ్వరికోయి తీయనిహాయి




ఎరుక చెబుతానూ ఎరుక పాట సాహిత్యం

 
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త (1958)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు 
గానం: టి.జి. కమలాదేవి 

ఎరుక చెబుతానూ ఎరుక చెబుతా ఏడేడు లోకాల ఎరుక చెబుతానూ

Palli Balakrishna Sunday, July 3, 2022



చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి (All)
నటీనటులు: జగ్గయ్య, జయలలిత, వాణిశ్రీ 
దర్శకత్వం: బి.ఎస్.నారాయణ 
నిర్మాత: పి.ఎస్.వీరప్ప 
విడుదల తేది: 22.07.1966



Songs List:



టిక్కిరికి టిక్కిరికి టట్టటా పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి 

టిక్కిరికి టిక్కిరికి టట్టటా 



నీవు చూసే చూపులో పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి 

నీవు చూసే చూపులో 




కన్నె మనసు దోచుకున్న మామయ్య పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

కన్నె మనసు దోచుకున్న మామయ్య
ఈ చిన్నదాన్ని కనికరించవేమయ్య




అందాల ఈ రేయి పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

అందాల ఈ రేయి 




ఓ నా రాజా రావా రావా... పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

ఓ నా రాజా రావా రావా...
ఓ నా రాజా రావా రావా... 
చెలినే మరిచేవా...

ఓ నా రాజా రావా రావా
ఓ నా రాజా రావా రావా

నీ రూపే ఆశ రేపేను 
నీ మాటే వీణ మీటేను
ఓ... ఓ... ఓ...
నీ రూపే ఆశ రేపేను 
నీ మాటే వీణ మీటేను
గతాలే నన్ను పిలిచాయి 
ఆ హాయే నేడు లేదోయి
కలగ కరిగిందంతా జగమే యెంతో వింత
రేయి పగలు నిన్నే వెతికేనూ....

ఓ నా రాజా... రావా రావా...
ఓ నా రాజా... రావా రావా
వృధాగ కాలమేగెను... 
నిరాశే పొంగివచ్చేను
ఓ... ఓ... ఓ...
వృధాగ కాలమేగెను నిరాశే పొంగి వచ్చేను
తరంగంలాగ రావోయి ప్రియా నన్నాదుకోవోయి
యేదో తీరని బాధ కన్నీరొలికే గాధ
రేయి పగలు నిన్నే వెతికేనూ...

ఓ నా రాజా... రావా రావా
ఓ నా రాజా... రావా రావా
నీ కోసం నేనే వచ్చాను నీ ఇంటికి దీపమైనాను

నీ కోసం నేనే వచ్చను నీ ఇంటికి దీపమైనాను
నా తోని ఆడు కోవేల ఈ కోపం నేడు నీకేలా
నీ అడుగులలో నేను నా కన్నులలో నీవు
నాలో నీవు... నీలో నేనేలే....

ఓ నా రాజా రావా రావా
చెలినే మరిచేవా....

ఓ నా రాజా రావా రావా
ఓ నా రాజా రావా రావా

వరించిన మంచి వధువునులే 
రుచించే తీపి మధువునులే
ప్రియా నీ ప్రేమ కథనోయి 
సదా నీ నీలినీడనులే
ఏనాటిదో అనుబంధం 
ఎన్నడు తెగదీ బంధం...
రేయి పగలు నిన్నే వెతికేనూ....

ఓ నా రాజా... రావా రావా
ఓ నా రాజా... రావా రావా




నీ కన్నులలోన కన్నీరా పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

నీ కన్నులలోన కన్నీరా





అందచందాల పాట సాహిత్యం

 
చిత్రం: ఆమె ఎవరు (1966)
సంగీతం: వేదా 
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

అందచందాల


Palli Balakrishna Sunday, June 26, 2022



చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
నటీనటులు: కైకాల సత్యన్నారాయణ, జగ్గయ్య, యస్.వి.రంగారావు 
నిర్మాత & దర్శకత్వం: బి.యన్.రెడ్డి 
విడుదల తేది: 19.03.1955



Songs List:



హరికథ సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: 

హరికథ

సీతాదేవి శ్రీరామచంద్రుని మరీమరీ వేడుకోగా-
మిసమిసలాడే పసిడిలేడికయి
మిథిలానందనవేడ
ఆ మిథిలానందనవేడ
విసవిస నా రఘువీర వరేణ్యుడు
వెడలె లేడిజాడ

అది – వెనుకకొక్క పరిజూచి
తన మునిగాళ్ల పైనిలేచి
అట వేచి తన మెడను సాచి
భయమెదను దోచి
తన యొడలు దాచి
మరి – తారి పొదలలో దూరియడవి బం
గారు లేడి పరు గెత్తె

అంతట 
పారు లేడి గని శ్రీరాముడు తన
బాహువులను విల్లెత్తె
రోసముతో రఘురాముడు బాణము
మోసకారిపై వదలె -
హా సీతా ! హా లక్ష్మణా! యని యా
హరిణము ప్రాణము వదలే -

ఆ యార్త నాదమునిని యదరిపడి జానకీదేవి మరదియయిన లక్ష్మణస్వామితో.

తే॥ గీ॥ 
అన్న పొమ్మయ్య, పొమ్ము, నీ యన్నగారి
ఆర్తనాదము వలెదోచునది యదేమొ
నా మనసుకీడు శంకించునయ్య! క్రూరు.
లైన రాక్షసులుందురీ కానలోన!

ఆ పలుకులు విన్న సౌమిత్రి పక్కున నవ్వి, “అమ్మా !”

తెలియక అందువుగానీ ఆ
దేవదేవునకు భయమేమీ
తులువలైన దైత్యులను దునిమి – ఈ
ఇలనుబ్రోవ జనియించె రాముడని॥ తెలియక ||

అన్న మరది మాటలకు ఆపార్ధంబు కల్పించి ఆ సీతా మహిసాధ్వి అనరాని నిష్ఠురో క్తులాడింది

తే॥ గీ॥ 
అవురవుర మాయదారి! నీ యన్నగారి
మోసకారి రక్కసుల పార్టీని, ఇచట
నేమిచేయ దలంచితో యెరుగవచ్చె
కుటిల బుద్ధులు, నీకు దక్కుదునె నేను

అన్న సీతమ్మ పలుకులు చెవులకు ములుకులై సోకిన లక్ష్మణస్వామి, “హరి హరీ!" యని దుఃఖించి, చేయునదిలేక పర్ణశాల వాకిట.. ఏడుగీటులు గీసి, ఏమి
సంభవించినను, వానిని దాటి అడుగు పెట్టకూడదని వదినగారితో పదేపదే చెప్పి, ఒప్పించి అన్నగారు పోయిన మార్గము ననుసరించి తానునూ బయలుదేరెను.
అంతలో అదనుకై ప్రక్కనే పొంచియున్న రావణాసురుడు వృద్ధభిక్షుక వేషంలో
పర్ణశాల ముంగిట నిలిచి, "భవతి భిక్షాందేహీ” అన్నాడు. ఆ కేక విని జానకి దేవి
బిచ్చంతో బైటికివచ్చి గుమ్మందగ్గిరే నిలబడింది. ఆ తల్లి ఆ గీటుదాటి
రాకపోవడం జూచి, తాను ముందుకు రావడానికి భయపడి, లేని ఆగ్రహం నటిస్తూ
ఆ కపటి - “ ఔరా ! ఈ ముసలి సన్యాసిపై ఇంత తిరస్కారమా: నాలుగడుగులు

ముందుకు రాలేవా ? అభ్యాగతుణ్ణి దైవంలాగ పూజించాలని సాధ్వివి నీకు ఆ మాయావి తెలియదా ? నీ భిక్షం నీ దగ్గరే ఉంచుకో-నే వెళ్లొస్తా” నన్నాడు.
మాటలు విని, మనస్సు కలతపడి అమాయకురాలైన ఆ తల్లి తోందరగా విచ్చంతో ఆ రాక్షసుడి ముందు నిలబడగా,

చటుకున తన పది తలలతోడ
ఆ కుటిల రాక్షసుడు తో చె
వికటముగా పకపకమని నగి
తన వింశతిబాహులు చాచె
అది గని 'హా'యని గుండెలదర
సీతమ్మ నేలపై వ్రాలె

అప్పుడా లంకాధిపతి మూర్ఛపోయిన సీతాదేవిని భూమితోసహా పెల్లగించి ఆకాశమార్గాన్ని ఎత్తుకుని పారిపోయాడు. పాపం ! ఆ మహా సాధ్వి....




బ్రతుకు స్వప్నముకాదు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి. సుశీల

బ్రతుకు స్వప్నముకాదు పండుపున్నమికాదు
అంతులేని వసంతమస లెక్కడాలేదు.

ఈసెగల ఈ పొగల నీబ్రతుకు ముగిసెనే
నీ కలలు మాసెనే - అయ్యో -

ఈదీన పసికూన కేదారి చూపేవు
ఏరాతి మనసు నీ పాపకై కరుగునో

ఆమంటలంతలో ఆరిపోవునుగాని
నీ మనసులో మంట నిలిచి రగిలేను

తానెవరో నీవెవరో ఏనాటి బంధమో
దైవమే నీ గుండె దయతోడ నింపెనా!




తాధిమి తకధిమి తోల్బొమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: మాధవపెద్ది సత్యం 

లుళ లుళ లుళా.... ఆయీ.... ఆయి
తాధిమి తకధిమి తోల్ బొమ్మా
దీని తమాష చూడవె కీల్బోమ్మా

తాధిమి తకధిమి తోల్బొమ్మా
దీని తమాష చూడవె కీల్ బొమ్మా
దీని తమాష చూడవే మాయబొమ్మా
ఆటమ్మా పాటమ్మా జగ
మంతా బొమ్మాలాటమ్మా....
తలాంగు తకధిమి తోలొ బొమ్మా తోం
తకతై తకతై మాయబొమ్మా

లుళ లుళ లుళా.... ఆయీ... ఆయి
ఆయి - ఆయీ
ఆపదలు కాయీ.... ఆపదలు కాయీ....
ఆయి - ఆయీ
ఆపదలు కాయీ.....

తకతై - తకతై మాయబొమ్మా
నాలుగు దిక్కుల నడిమి సంతలో
తూలే తుళ్లే తోల్బొమ్మా
తూలే తుళ్లే కీల్బొమ్మా
ఎవరికెవ్వరో ఏమౌతారో
ఇవరము తెలుసా ? - కీల్ బొమ్మా
ఈ-ఇవరము తెలుసా ? - మాయబొమ్మా

తలాంగు తకధిమి తోల్ బొమ్మా - తోం
తకతై - తకతై - మాయబొమ్మా

కోపము తాపము క్రూర కర్మలూ
కూడని పనులే తోలొమ్మా
పాపపు రొంపిని పడబోకే పర
మాత్ముని నమ్మవె కీల్బొమ్మా
ఆటన్నా - పాటన్నా పర
మాత్ముని బొమ్మా లాటన్నా
ఆటన్నా - పాటన్నా.........





కన్నదేవకి వంతు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: 

కన్నదేవకి వంతు కన్నీరే కాని
కన్నార నీలీల కాంచలేదాయె, కృష్ణా....
ఏకొర నోములు - ఏవి నోచెనో
శన్నదేవకికి - కన్నీరాయె

నీ మురిపెములూ - నీ చిరుసొగసులు
పేద యశోదా - పెన్నిధులాయె
వ్రేపల్లియలో - వెలసిన కృష్ణా
వెన్నమీగడల చిన్నారికృష్ణా ! పొన్నారి కృష్ణా!
కృష్ణా ! గోవర్ధన గిరిధారీ కృష్ణా !
గోపీ హృదయ విహారీ కృష్ణా !
బృందావన సంచారీ కృష్ణా !
సుందర మురళీ ధారీ కృష్ణా !
అగణిత గుణ పరమాత్మా,
అగణిత గుణ పరమాత్మా, కృష్ణా !
జగముల వెలిగే స్వామి కృష్ణా, స్వామి కృష్ణా !
నీ లీలల మే మెరుగము, కృష్ణా !
నీలమోహనా ! బాలా కృష్ణా !
బాలా కృష్ణా ! బాలా కృష్ణా !



వెడలె ఈ రాజకుమారుడు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: ఎ.యం.రాజా, పి.సుశీల

వెడలె ఈ రాజకుమారుడు బంగారు తేరుపైన
రంగైన రాణితోడ వెడలె ఈ రాజకుమారుడు

మోజైన నాట్యాలాడ జైజై గీతాలు పాడ
బాజా బాకాల తోడ తాదీం తక తకతక తకతై
కస్తూరి రంగయ్య కావేటి రంగయ్య
ఎచటికి పయనము ఎరుగము వైనము
ఒయ్యారి భామాతోడ ఊరేగే రంగయ్య
ఒయ్యారి దేవీతోడ ఊరేగే రంగయ్య
కస్తూరి రంగయ్య కావేటి రంగయ్య
మాఊరికావల తామరపూవుల కోనేటికీవల
కొలువుండ పొయ్యేము రంగయ్య రంగయ్య
రావయ్య రంగయ్య కస్తూరి రంగయ్య

కోరమీసపు చిన్నావాడ
ఓరచూపుల పిల్లాతోడ
కులుకుతు బెళుకుతు జాతరకెళ్లేవ్ రయ్యో చిన్నోడ
నీవు గోటుగ నీటుగ జాతరకెళ్లేవ్ రయ్యో చిన్నోడ
ఓరయ్యో చిన్నోడు....
అయ్యో చిన్నోడ
ఓ లమ్మీ చిన్నమ్మీ !
గలగల మువ్వల సవ్వడితో తలలూ పుచు లేగల తో
అదే అదే ఆలమందా ఆ పుంతలోన
రెక్కలుసాచి చుక్కలదారి రివురివ్వున గూళ్లకు చేరే
అదే అదే పిట్టల బారు ఆకాశ వీధి....
ఆరేవు కాడ ఆతోపు నీడ
సన్ను సూసి సిన్నది నవ్వి ఊరు కున్నది
నన్ను చూసి చిన్నది నవ్వి ఊరు కున్నది

మిన్నేటి జాడ మేఘాల ఓడ
వెండి తెర చాపతో కొండ దాటి పోదువా
వెడలె ఈ రాజకుమారుడు బంగారు తేరుపైన
పొంగారు ఠీవి తోడ వెడలె మా రాజకుమారుడు



వెన్నెలపందిరిలోన పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: ఎ.యం.రాజా, పి.సుశీల

ఈ వెన్నెల.... మల్లి విరిపందిరిలోనా
చిరునవ్వుల హారతి శేఖరుతీనా
వెన్నెలపందిరిలోన - చిరునవ్వుల హారతులీనా
పండువెన్నెలా - మనసునిండా వెన్నెలా
కొండపైనా కోనపైనా కురిసేవెన్నెలా! విరిసేవెన్నెలా!
మబ్బులదారీ, ఓ బాటసారీ !
నీ ఒంటరి పయనముకాదా.
నీ జంటగ నీ సఖిలేదా.....
నాకై వేచే - నవ్వులు పూచే
నా చెలి కన్నులకాసే వెన్నెలా
పైనా వెన్నెలా - మనసులోనా వెన్నెలా
పైనాలోనా చందమామ పరచేవెన్నెలా! పాలా వెన్నెలా!
చల్లనిరేయి - మెలమెల్లని గాలి
అలనల్లన మమతలు మూగే
తియతీయని తలపులు రేగే
తీయని తలపులు తెచ్చేదెవరో
నాకై పరుగున వచ్చేదెవరో

పండువెన్నెలా - మనసునిండా వెన్నెలా
కొండపైనా కోనపైనా కురిసేవెన్నెలా ! విరిసేవెన్నెలా !





యౌవన మధువనిలో పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: ఎ.యం.రాజా, పి.సుశీల

ఉయ్యాల పాట

యౌవన మధువనిలో - వన్నెలపూవుల ఉయ్యాలా
ఉయ్యాల జంపాలా - ఉయ్యాల జంపాలా
జీవన మధువనిలో - పచ్చనితీగల ఊయాలా
ఉయ్యాల జంపాలా -
ఉయ్యాల జంపాలా
బ్రతుకే యెలమావితోట - మదిలో మకరందపుతేట
అడుగడుగున పూవులబాట అనిచాటే కోయిల పాట
ఉయ్యాల జంపాలా - ఉయ్యాల జంపాల
అలనల్లన నామదిలోనా - పలికేబంగారు వీణ
ఏమెత్తని అంగుళి ఆనీ - ఈ తీగెలు మీటెనొగానీ
ఉయ్యాల జంపాల - ఉయ్యాల జంపాల
పచ్చని మధువనిలో - వలపులు విచ్చిన ఊయాలా
పచ్చని మధువనిలో వలపులు....





ఘలుఘల్లున గజ్జెలుమోగ పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: 

బిచ్చగాళ్ల నాట్యం

ఘలుఘల్లున గజ్జెలుమోగ
తకతై తైతైతై ఆడవే

బులబుల్ జిల్లాలల్ ఆడవే
ఘలుఘల్లున గజ్జెలుమోగ ॥
వారే బుల్ బుల్!
చుక్కాలకోకగట్టి
అద్దాలారెయికా తొడిగి
కులుకుతూ నీవు ఆడ
రాలాలీ పైసా జోరుగ
రావాలీ పైసా జోరుగ
ఘలుఘల్లున గజ్జెలుమోగ
గలగలగల పైసా రాలునే




వెన్నెలవేళలు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి.సుశీల

వెన్నెలవేళలు పోయినా
ఏమున్నది నాకిక బ్రతుకునా
అనురాగ మెరుగలేని జగతిని
జీవితమంతా చీకటిరేయేనా
సుఖమంతా పోయెనా ॥
కలిమిలేనిదానా - ఏకులములేనిదీనా
అందరాని ఆచందమామకై
ఆశపడితినేలా బేలనై
జీవితమంతా చీకటిరేయేనా
సుఖమంతా పోయెనా

ఏరికొరకు ఈ వాకిట నిలబడి
ఎదురుచూచి వేచేనో
చేరి ఎవరునను “పాపా”యని ఇక
చెంతనిలిచి పిలిచేరో




కనుల కొకసారయిన కనబడని పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి.సుశీల

పాప పాట

కనుల కొకసారయిన కనబడని నాతల్లి
సెలవిమ్మ నీకన్న పాపకు
ఈ చోటికేనాడు ఇంక రాలేనమ్మా
ఒకసారి ఒడిలోన ఒరిగి సెలవడగనా
సెలవిమ్మ నీకన్నపాపకు -
కలలెన్నో బేలనై కనిమురిసినా నమ్మ
కడలేని వేదనే కడకు మిగిలేనమ్మా
కలనేని ఏనాడు కనరాని నాతల్లి
నీ పాప బ్రతుకింక నేలపాలేనా ?

Palli Balakrishna Tuesday, March 19, 2019

Most Recent

Default