-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Devi Sri Prasad"
Varsham (2004) Telugu Songs Lyrics Album Cover

Varsham (2004) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Varsham (2004)
Director : Sobhan
Producer : M. S. Raju
Actors : Prabhas, Gopichand
Actresses : Trisha
Release Date : 14 January 2004

Nuvvosthanante Song Lyrics in Telugu – Varsham (2004)

'Nuvvosthanante' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by K. S. Chithra and Raqeeb Alam.

SONG INFORMATION
Movie : Varsham (2004)
చిత్రం: వర్షం (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కె. ఎస్. చిత్ర ,రాఖీబ్ ఆలమ్ (Raqueeb Alam) చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో పంచవన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న వాన గువ్వలో చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి నవ్వులో ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట త ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన ముద్దులొలికే ముక్కుపుడకై ఉండిపోవే ముత్యపు చినుకా చెవులకు చక్కా జూకాల్లాగా చేరుకోవే జిలుగుల చుక్కా చేతికి రవ్వల గాజుల్లాగా కాలికి మువ్వల పట్టీలాగా మెళ్లో పచ్చల పతకంలాగా వగలకు నిగ నిగ నగలను తొడిగేలా నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా ఆహా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట త ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా చిన్న నాటి తాయిలంలా నిన్ను నాలో దాచుకోనా కన్నె ఏటి సోయగంలా నన్ను నీలో పోల్చుకోనా పెదవులు పాడే కిలకిల లోనా పదములు ఆడే కథకళి లోనా కనులను తడిపే కలతల లోనా నా అణువణువున నువు కనిపించేలా నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా నువ్వొస్తానంటే ఏయ్ ఏయ్ నేనొద్దంటానా తరికిట తరికిట త ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా (4)

Mellaga Song Lyrics in Telugu – Varsham (2004)

'Mellaga' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by S. P. B. Charan and Sumangali.

SONG INFORMATION
Movie : Varsham (2004)
చిత్రం: వర్షం (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. చరణ్, సుమంగళి మెల్లగా తరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా... ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం నీ మెలికెలలోనా ఆ మెరుపులు చూస్తున్నా ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా ఆ ఉరుములలోనా నీ పిలుపును వింటున్నా ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా జత పడే స్నేహమై అనునయించనా... చలి పిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగా ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా ఆ వరుణునుకే ఋణపడిపోనా ఈ పైనా త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా విడుదలే వద్దనే ముడులు వేయనా... మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా... ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం మెల్లగా తరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా... ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం

Nachave Nizam Pori Song Lyrics in Telugu – Varsham (2004)

'Nachave Nizam Pori' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by Adnan Sami and Suneeta Rao.

SONG INFORMATION
Movie : Varsham (2004)
చిత్రం: వర్షం (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: అద్నాన్ సమీ, సునీతా రావ్ హోయ్... హే నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి హే ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని హేయ్ నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగంబారి శాసిస్తే చాలు ఓ సారి సిద్దంగా ఉంది సింగారి అయ్యరే సయ్యంటుందే తయ్యారై వయ్యారి నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని హే... సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగసుల చోరీ చాల్లెద్దూ మాట కచేరి దోచేద్దూ తళుకు తినారి ముదిరావే మాయలమారి మురిపిస్తే ఎలా మురారి హే పరిచానే మల్లెపూదారి పరిగెత్తుకు రావె పొన్నారి పిలిచాడే ప్రేమ పూజారి వెళ్ళిపోదా మనసే చేజారి గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని హే... వరదల్లే హద్దులు మీరి వచ్చావా పొగడల పోరి హే సుడిగాలే నిలువున నిమిరి ఎగరేసుకుపోతా నారి దాటొస్తా సిగ్గుల ప్రహరి హేయ్ చేరుస్తా చుక్కల నగరి ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బుల్లో తేల్చి ఓ సారి మైకంలో తూరి ఓ సారి కావ్యంలో వాలి ఓసారి వాహ్ వారే అనిపించాలి వాటేసే ప్రతిసారి హే నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి ఆ జారే రాజా జానీ లేజారే లేత జవాని

Langa Voni Song Lyrics in Telugu – Varsham (2004)

'Langa Voni' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by Tippu and Usha.

SONG INFORMATION
Movie : Varsham (2004)
Singers : Tippu, Usha
చిత్రం: వర్షం(2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: టిప్పు, ఉష హే లంగా వోణీ నేటితో రద్దై పోని సింగారాన్నీ చీరతో సిద్దంకాని నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడీ చిందులే ఆపగా ముళ్ళు వేయని సర్లేగాని చక్కగా పెళ్లైపోని అల్లర్లన్ని జంటలో చెల్లైపోనీ లగ్గమే పగ్గమై పట్టుకో ప్రాయాన్ని సొంతమై అందమే అప్పగించనీ హే లంగా వోణీ నేటితో రద్దై పోని సింగారాన్నీ చీరతో సిద్దంకాని ఓ చూడు మరి దారుణం ఈడునెలా ఆపడం వెంటపడే శత్రువయే సొంత వయ్యారం హే ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం కళ్లెదురే ఉంది కదా ఇంత సహాయం పుస్తే కట్టి పుచ్చుకో కన్యాధానం హే హే హే హే శిస్తే కట్టి తీర్చుకో తియ్యని రుణం హే లంగా వోణీ నేటితో రద్దై పోని అరె సింగారాన్నీ చీరతో సిద్దంకాని సోకు మరీ సున్నితం దాన్ని ఎలా సాకటం లేత నడుం తాళదు నా గాలి దుమారం కస్సుమనే లక్షణం చూపనిదే తక్షణం జాలిపడే లాలనతో లొంగదు భారం ఇట్టే వచ్చి అల్లుకో ఇచ్చేవిచ్చి ఆర్చీ తీర్చి ఆదుకో గిచ్చీ గిచ్చీ హాయ్ హాయ్ హాయ్ హాయ్ లంగా వోణీ నేటితో రద్దై పోని సర్లేగాని చక్కగా పెళ్లైపోని హేయ్ నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడీ చిందులే ఆపగా ముళ్ళు వేయని

Neeti Mullai Song Lyrics in Telugu – Varsham (2004)

'Neeti Mullai' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by Sagar and Sumangali.

SONG INFORMATION
Movie : Varsham (2004)
Singers : Sagar, Sumangali
చిత్రం: వర్షం (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సాగర్, సుమంగళి నీటి ముల్లై నన్ను గిల్లీ వెల్లిపోకే మల్లె వానా జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండి వానా తేనెల చినుకులు చవిచూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావ సిరివానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా

Kopama Song Lyrics in Telugu – Varsham (2004)

'Kopama' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by Karthik and Shreya Ghoshal.

SONG INFORMATION
Movie : Varsham (2004)
చిత్రం: వర్షం (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తీక్, శ్రేయా ఘోషాల్ కోపమా నా పైనా ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హొ... చాలులే నీ నటనా సాగదే ఇటుపైనా ఎంతగా నసపెడుతున్నా లొంగిపోనె లలనా దరి చేరిన నెచ్చెలిపైనా దయచూపవ కాస్తయినా మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ కస్సుమని కారంగా కసిరినది చాలింకా ఉరుము వెనుక చినుకుతడిగా కరగవా కనికారంగా కుదురుగా కడదాకా కలిసి అడుగెయ్యవుగా కనుల వెనకే కరిగిపోయే కలది గనుకా నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా నువ్వు గొడుగునే ఎగరేస్తావే జదివానా హొ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... కోపమా నా పైనా ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హొ... హొ... తిరిగి నిను నాదాకా చేర్చినది చెలిమేగా మనసులోని చెలియ బొమ్మ చెరిపినా చెరగదు గనకా సులువుగా నీలాగ మరిచిపోలేదింక మనసు విలువ నాకు బాగా తెలుసుగనుక ఎగసే అల ఏనాడైనా తన కడలిని వెతికేనా వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హో ఓ... ఓ... ఓ... ఓ... ఆఁ కోపమా నా పైనా ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హొ... తాననే తనినాన తాననే తనినాన తాననే తనినేనాన తన్నే నాన నానే హో

Joole Joole Song Lyrics in Telugu – Varsham (2004)

'Joole Joole' song from Varsham (2004) movie is composed by Devi Sri Prasad and sung by Mallikarjun and Kalpana Raghavendar.

SONG INFORMATION
Movie : Varsham (2004)
చిత్రం: వర్షం (2004) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కల్పన రాఘవేందర్, మల్లికార్జున్ ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే పొంగే ఈ గంగనాపే శివుడేలే వాడంటే వాడే మగ వాడంటే వాడే ఆ రొమ్ము చూడే ఆ దమ్ము చూడే నా జన్మ జతగాడే హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే అందెల్లో జలపాతాలే తుళ్ళేలే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే శిరసెక్కి చిందాడిందే జవరాలే ఆఁ... సూదంటి కళ్ళే అవి తేనెటీగ ముళ్ళై ఆ సూదంటి కళ్ళే తేనెటీగ ముళ్లే చుక్కల్ని తెంచే చూపులే పువ్వంటి ఒళ్ళే పచ్చిపాల జల్లే ఎక్కిళ్ళు పెంచే సోకులే నీ కౌగిలింత నా కోట చేసుకుంటా చిరు చినుకంత చింతా నిన్ను చేరకుండా కన్నుల్లో దాచుకుంటా... హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే పొంగే ఈ గంగనాపే శివుడేలే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే శిరసెక్కి చిందాడిందే జవరాలే హో చిన్నరి హంస ఇష్టమైన హింస హేయ్ చిన్నరి హంస ఇష్టమైన హింస రేపావే నాలో లాలస అహ కొండంత ఆశ నీకు అందజేసా నీ సొంతమేలే బానిస నీ తాపాన్ని చూశా అరె పాపం అనేసా ఇక నీదే భారోసా వందేళ్ళ శ్వాస నీ పేరే రాసేసా హే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే అందెల్లో జలపాతాలే తుళ్ళేలే ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే

Palli Balakrishna Monday, June 22, 2026
Nuvvostanante Nenoddantana (2005) Telugu Songs Lyrics Album Cover

Nuvvostanante Nenoddantana (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Banner : Sumanth Art Productions
Music : Devi Sri Prasad
Director : Prabhu Deva
Producer : M. S. Raju
Actors : Siddharth, Srihari
Actresses : Trisha Krishnan, Archana Shastry (Veda), Santhoshi
Release Date : 14 January 2005

Chandrullo Unde Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Chandrullo Unde' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Shankar Mahadevan
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్ చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా తందానే తందానే చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా తందానే తందానే నువ్వలా సాగే తోవంతా నావలా తూగే నీవెంట ఏవంట నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా... ఓ... చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా ఏలే ఏలే ఏలో ఏలేలేలో ఏలో ఏలేలేలో ఏలో ఏలో ఏలే ఏలేలో హాయ్ మై నేమ్ ఈజ్ సంతోష్ యువర్ నేమ్ ప్లీజ్ - స్టెల్లా స్టెల్లా ఓ వాటే బ్యూటిఫుల్ నేమ్ కెన్ యూ హేవ్ ఏ ఫోన్ నంబర్ రేయ్ రేయ్ రేయ్... ఓ... కమింగ్ డాడ్ గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ... హే గగగా రిగ రిసాస సానినిస గగగా రిగ రిససా... కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా జావళీల జాణతనం బాటచూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంత వరకో రేపు వైపు ముందడుగా లేని పోని దుందుడుకా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే లెక్కలే మాయం అయిపోవా రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా

Something Something Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Something Something' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Tippu.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Tippu
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: టిప్పు something something something something something there is some thing... Come on... అందర్లోనూ ఉంది something అర్ధం కానీ ఏదో feeling లో లో దాగున్నా no no nothing అంటున్నా పారా కాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... ఓ కొంటె కలా ఆ పంతమేలా రా ముందుకిలా కం నియర్ ఇలా చెయ్యందిస్తా చంద్రకళా సందేహిస్తా వెందుకలా సంకెళ్ళేమీ లేవు కదా why fear అలా చిలిపి చిటికి తలుపు తడితే నిదరపోతే ఇంకా మసక తెరల ముసుగు చాటుగా ఎలాంటి అలుపు లేక ఆటాడమంది వేళ మాయదారి హాయి గోల అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అందర్లోనూ ఉంది something అర్ధం కానీ ఏదో feeling నీ కాలి వెంట ఈ నేల అంతా ఏం తుళ్ళెనంట క్యా కమాల్ అనేలా ఆకాశంలో పాలపుంత నీ కన్నుల్లో వాలుతుందా సంతోషానికి సంతకంలా ఈ క్షణం నవ్వేలా తకిట తదిమి జతులు ఉరిమి తరుముతున్న వేళ ఉలికిపడదు తళుకు తారకా మహానంద లీల సాగుతోంది వేళ కాలమంత ఆగిపోదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా...

Niluvaddam Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Niluvaddam' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Karthik and Sumangali.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Karthik, Sumangali
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తీక్, సుమంగళి ఊ నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా హే నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా హా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నామాట విన్నట్టు నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు నీలేత పాదాలు జలపాత మయ్యేట్టుగా నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం హే నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

Paripoke Pitta Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Paripoke Pitta' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Mallikarjun and Sagar.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Mallikarjun, Sagar
Special Note : 'Paripoke Pitta' పాటలో హీరో సిద్ధార్థ్‌తో పాటు ఈ చిత్ర దర్శకుడు ప్రభుదేవా కూడా ప్రత్యేకంగా కనిపించడం విశేషం.
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: మల్లికార్జున్, సాగర్ పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా హే పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా అంత మారాం ఏంటంట మాట వినకుండా సరదాగా అడిగాగా మజిలీ చేర్చవా తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట చరణం: 1 నా సంతోషాన్నంతా పంపించా తన వెంట భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా తన అందెలుగా తొడిగా నా చిందరవందర సరదా ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా హోయ్ చినబోయిందేమో చెలి కొమ్మ ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా నీ వాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట హే పుటుక్కు జర జర డుబుక్కు మేఁ పుటుక్కు జర జర డుబుక్కు మేఁ చరణం: 2 ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది నిద్దర ఎదురయ్యింది తెగ చిరాగ్గ ఉన్నట్టుంది తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది హోయ్ ఏం గారం చేస్తావే ప్రేమ నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా ఆ సంగతి నీకూ తెలుసమ్మా నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా తీసుకుపో నీ వెంట ఓ ప్రేమా తీసుకుపో నీ వెంట తీసుకుపో నీ వెంట అరి తీసుకుపో నీ వెంట అరి హొయ్ హొయ్ హొయ్

Prema Kosamai Valalo (Remix) Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Prema Kosamai Valalo (Remix)' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Ghantasala.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Pingali Nagendra Rao
Singers : Ghantasala
Special Note : ఈ పాటను యన్.టి.రామారావు గారు నటించిన పాతాళభైరవి (1951) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు, దీనికి సంగీతం ఘంటసాల గారు అందించారు, V.J. వర్మ ఆలపించారు, పింగళి నాగేంద్రరావు సాహిత్యం అందించారు.
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: పింగళి నాగేంద్రరావు గానం: జూనియర్ ఘంటసాల పల్లవి: ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు. అయ్యో పాపం పసివాడు ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు అయ్యో పాపం పసివాడు

Ghal Ghal Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Ghal Ghal' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2) ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా పిలిపించే తడిగానం ప్రేమంటే అణువణువును మీటె మమతల మౌనం పదపదమంటే నిలువదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2) చరణం: 1 ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసె మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే అది చరితను సైతం చదవనివైనం కవితలు సైతం పలకని భావం సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటె దరిదాటి ఉరకలు వేసె ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినదేదంటే చిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2) చరణం: 2 మండే కొలిమినడగందే తెలియదే మన్నుకాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరె ప్రియురాలే గెలుపంటె తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జతవుంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతె నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2)

Padam Kadalanantunda Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Padam Kadalanantunda' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Sagar.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Sagar
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సాగర్ పాదం కదలనంటుందా ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూడందే దూరం కరగనంటుందా తారలను దోశిల పట్టే ఆశలు దూసుకు పోతుంటే లోతెంతో అడగననే పడవల్లే అడుగేస్తే దారియను అంటుందా కడలైనా తన కలలుగ మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం పిసలను తరిమే ఉరుమే ప్రేమంటే నువ్వే తన ఐదో తనమని నీకై నోచే నోముంటే నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా తానే నీ పెదవులపై చిరు నవ్వై నిలిచే ప్రేమంటే ఆ తీపికి విషమైన అమృతమే ఐపోదా

Adhire Adhire Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Adhire Adhire' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Jassie Gift and Kalpana Raghavendar.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Jassie Gift, Kalpana Raghavendar
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: జస్సి గిఫ్ట్, కల్పన రాఘవేందర్ శివశివ మూర్తివి గణనాథా శివశివ మూర్తివి గణనాథా శివుని కొమరుడవు గణనాథా శివుని కొమరుడవు గణనాథా ఛల్ సిరికి హరికీ మనువంట ఛల్ సిరికి హరికీ మనువంట భళరే అనరా జనమంతా భళరే అనరా జనమంతా హేయ్ ఘల్లుమంటు గజ్జ కట్టి చిందు కొట్టే జగమంతా అదిరే అదిరే కన్నే అదిరే అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నీ కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురయిందిగా వయసు వేడుకా ఓ... ఓ... అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నీ కుదిరే చరణం: 1 ఏం మాయ మెలికో కలికి ఒంటి కులుకో నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో ఏం నిప్పు కణికో అదేం పంటి కొరుకో వగలువాడలో నెగడు వేస్తే నువ్ సొగసుకాడవనుకో హెయ్ వరసై పిలిచే అందాలు అరె మనమై చిలికే గంధాలు అహ మనసే గెలిచే పంతాలు అరె మనువై కలిపే బంధాలు రణము చేయగా రమణి కోరిక అదుపు దాటగా అదిరే అదిరే కన్నే అదిరే ఓ కుదిరే కుదిరే అన్నీ కుదిరే చరణం: 2 పన్నీటి చినుకో పసిడిపంట జిలుగో కాలిమెట్టెగా తాళిబొట్టుగా జంట చేరెనిదిగో పందార తునకో పదం లేని తెలుగో మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకెనిదిగో హే ఎదురై రానీ మేనాలు హో హో చెవిలో పడనీ మేళాలు అరె అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు మదన దీపిక మదిని మీటగ ఎదురు లేదుగా అదిరే అదిరే కన్నే అదిరే హే కుదిరే కుదిరే అన్నీ కుదిరే హేయ్...

Palli Balakrishna Thursday, June 18, 2026
Kalusukovalani (2002) Telugu Songs Lyrics Album Cover

Kalusukovalani (2002) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Kalusukovalani (2002)
Director : R. Raghuraj
Producers : Dil Raju, Praveen, Giri
Actors : Uday Kiran
Actresses : Gajala, Prathyusha
Supporting Cast : Kaikala Satyanarayana
Release Date : 8 February 2002

Udayinchina Song Lyrics in Telugu – Kalusukovalani (2002)

'Udayinchina' song from Kalusukovalani (2002) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.

SONG INFORMATION
Movie : Kalusukovalani (2002)
Lyricist : Devi Sri Prasad
Singers : Devi Sri Prasad
చిత్రం: కలుసుకోవాలని (2002) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: దేవీ శ్రీ ప్రసాద్ గానం: దేవీ శ్రీ ప్రసాద్ హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే మనసు అంత నీ రూపం నా ప్రాణం అంత నీకోసం నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలిసిపోయే పాపం నీ జాడ తెలిసిన నిమిషం అహ అంతులేని సంతోషం ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం అడుగు అడుగునా నువ్వే నువ్వే నన్ను తాకెనే నీ చిరునవ్వే కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే హొయ్ ప్రేమపాటకు పల్లవి నువ్వే గుండెచప్పుడుకి తాళం నువ్వే ఎదను మీటు సుస్వరమై రావే నన్ను చేరవే హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లే మండుతోంది కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది దూరాన్ని తరిమివేసే గడియ మన దరికి చేరుకుంది ఏమి మాయవో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని హోయ్ నువ్వు ఎక్కడున్నావో గానీ నన్ను కాస్త నీ చెంతకు రానీ నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపనీ హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ ఎప్పుడూ నే మరువలేని తీపి గురుతులే

Aakasam Song Lyrics in Telugu – Kalusukovalani (2002)

'Aakasam' song from Kalusukovalani (2002) movie is composed by Devi Sri Prasad and sung by Sumangali and Kid Sathya.

SONG INFORMATION
Movie : Kalusukovalani (2002)
Lyricist : Devi Sri Prasad
చిత్రం: కలుసుకోవాలని (2002) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: దేవీ శ్రీ ప్రసాద్ గానం: సుమంగళి, సత్యా (కిడ్) చికి చికి చికి చం చాం చికి చికి చికి చం (4) ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతు ఉంటే భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్దురలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి ఏవేవో కొన్ని కళలు ఉన్నాయి అవి రేపోమాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలోన చీకటినంతా తరిమెయ్యలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతు ఉంటే భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్దురలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి చికి చికి చికి చం చాం చికి చికి చికి చం (4) ఆరారో అని ఈ గాలి నాకే జోలలు పాడాలి ఏలేలో అని గోదారి నాతో ఊసులు ఆడాలి ఇంద్రధనస్సుని ఊయలగా నేను మలచాలి - చం తారలన్ని నాకు హారం కావాలి - చికి చికి చికి చం మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి - చం చందమామ నాకు చందనమవ్వాలి - చికి చికి చికి చం రంగులతో కళ్ళాపే చల్లాలి ఆ రంగులనుండి లాలించే ఒక రాగం పుట్టాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతు ఉంటే భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి హొయ్ చికి చికి చికి చం చాం చికి చికి చికి చం (2) నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నను చేరుకోవాలి నాతో ఉంటూ ఎన్నడైనా సరే పసిపాపల్లె నను చూసుకోవాలి అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి నాకు ముద్దు ముద్దు గోరుముద్దలు పెట్టాలి - చికి చికి చికి చం ప్రేమలోన ఉన్న తీయదనం ప్రేమ తోటి కలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయగ తిట్టాలి - చికి చికి చికి చం ఏనాడూ నా నీడై ఉండాలి ఆ నీడను చూసి ఓటములన్ని పారిపోవాలి హే ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతు ఉంటే భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్దురలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి చికి చికి చికి చం చాం చికి చికి చికి చం (4)

Shakeela Song Lyrics in Telugu – Kalusukovalani (2002)

'Shakeela' song from Kalusukovalani (2002) movie is composed by Devi Sri Prasad and sung by Devan and Mathangi Jagadish.

SONG INFORMATION
Movie : Kalusukovalani (2002)
Lyricist : Kulashekhar
చిత్రం: కలుసుకోవాలని (2002) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: కులశేఖర్ గానం: దేవన్, మతాంగి జగదీష్ దేవా రంభా ఊర్వశి మేనక బరితెగించి భూలోకంగాని ఒళ్ళుపొచ్చిసినారేటి చెస్ పల్లకోరా మరి అలెవలేటి మామా షకిలా షకీలా, షకిలా షకీలా ఆ స్టెల్లా మేరీ లైలా మన ఎమ్ ఆర్ ఎఫ్ లీలా అరె ఫోనీటెయిల్ గీత మరి ఎమ్ పి పాప రీటా హే సోడాబుడ్డి సునీతా చూయింగ్ గమ్ముల సుజాతా పప్పి క్రాపు రమ్మోలా పాలబూతు ప్రమీలా టచ్ మి నాట్ తనూజా జీరో బోర్డు సరోజా నిక్కరులేసుకు వచ్చర్రోయ్ కళ్ళకు పండుగ తెచ్చార్రోయ్ షకిలా షకీలా, షకిలా షకీలా ఎంకిని పాపం ఎక్స్ పోజింగ్ అని ఎన్నో నిందలు వేస్తారు F TV లో డ్రెస్సులు మాత్రం ఇట్టే ఫాలో అవుతారు ఓయ్ ఫ్యాషన్ గీషన్ అంటూ లేని లోకం ఉండదు అంటారు మాయ మర్మం ఏమి లేని చోటే బలే చూపిస్తారు హయ్యె హయ్యె యే హమ్మా హమ్మా యే హమ్మా హమ్మా హయ్యెయ్యె యే హయ్యె హయ్యె యే హమ్మా హమ్మా యే హమ్మా హమ్మా హయ్యెయ్యె అదిరి అదిరి పడకురో నువు అసలు దిగులు పడకురో హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొహోయ్ హొహోయ్ హొయ్ అదిరి అదిరి పడకురో నువు అసలు దిగులు పడకురో జమకు జమా జ్యోతిలక్ష్మినీ మీ బాబులకే కలల రాణిని షకిలా షకీలా, షకిలా షకీలా నేను చూపించని చోటే లేదురా నేను ఆడించని ఆటే లేదురా హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ భూగోళంలో నేనీ భూగోళంలో చూపించని చోటే లేదురా నేను ఆడించని ఆటే లేదురా ఊరు వాడా ఎమనుకున్నా పాపలు డోంట్ కేర్ అంటారు ఊహాల్లో తెగ విహరిస్తూ కాలక్షేపం చేస్తారు కాలేజీలో కుర్రోళ్లంతా పాపల వెంటే పడతారు అరె నిక్కర్లేసుకు వచ్చారంటూ నిద్దర పట్టక చస్తారు హయ్యె హయ్యె యే హమ్మా హమ్మా యే హమ్మా హమ్మా హయ్యెయ్యె యే హయ్యె హయ్యె యే హమ్మా హమ్మా యే హమ్మా హమ్మా హయ్యెయ్యె ఉలికి ఉలికి పడకురో అది కునుకులేని మెరుపురో హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్... ఉలికి ఉలికి పడకురో అది కునుకులేని మెరుపురో పైన చూసి మోసపోకు తీయ్ అది చైనా బజార్ గోల్డ్ బ్యాటరీ షకిలా షకీలా, షకిలా షకీలా ఆ స్టెల్లా మేరీ లైలా మన ఎమ్ ఆర్ ఎఫ్ లీలా అరె ఫోనీటెయిల్ గీత మరి ఎమ్ పి పాప రీటా హే సోడాబుడ్డి సునీతా చూయింగ్ గమ్ముల సుజాతా పప్పి క్రాపు రమ్మోలా పాలబూతు ప్రమీలా టచ్ మి నాట్ తనూజా జీరో బోర్డు సరోజా నిక్కరులేసుకు వచ్చర్రోయ్ కళ్ళకు పండుగ తెచ్చార్రోయ్ షకిలా షకీలా, షకిలా షకీలా ఆ స్టెల్లా మేరీ లైలా మన ఎమ్ ఆర్ ఎఫ్ లీలా అరె ఫోనీటెయిల్ గీత మరి ఎమ్ పి పాప రీటా హే సోడాబుడ్డి సునీతా చూయింగ్ గమ్ముల సుజాతా పప్పి క్రాపు రమ్మోలా పాలబూతు ప్రమీలా టచ్ మి నాట్ తనూజా జీరో బోర్డు సరోజా నిక్కరులేసుకు వచ్చర్రోయ్ కళ్ళకు పండుగ తెచ్చార్రోయ్

Cheliya Cheliya Song Lyrics in Telugu – Kalusukovalani (2002)

'Cheliya Cheliya' song from Kalusukovalani (2002) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad and Kalpana.

SONG INFORMATION
Movie : Kalusukovalani (2002)
Lyricist : Kulashekhar
చిత్రం: కలుసుకోవాలని (2002) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: కులశేఖర్ గానం: దేవీ శ్రీ ప్రసాద్, కల్పన చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమె వయ్యారం చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం బావ బావ బంగారం అతిగా నాన్చకు యవ్వారం ఈ పూటైనా తీర్చెయవా నా భారం ఓ చెలి అరె అలా పొడిగించకే కధే ఇలా చాటుగా అదీ ఇదీ మరియాదా రా ప్రియా అదేంటలా అరిటాకుల మరీ అలా గాలి వాటుకే ఇలా భయమేలా చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమె వయ్యారం చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం సోకులను ఆరేసి నా మదికి వల వేసి లాగకికా వన్నెల వయ్యారీ కొరికలు రాజేసి కోక నను వదిలేసి నాకు ఇక తప్పదు గొదారి ముగ్గుల్లో దించొద్దు మున్నీట ముంచొద్దు అమ్మమ్మా నిన్నింక నమ్మేదెలా ముద్దుల్లో ముంచెత్తి నా మొక్కు చెల్లించు ముద్దయిలా నువ్వు కుర్చోకలా వాగల్లే వస్తావు వాటేసుకుంటావు చీ పాడు సిగ్గంటూ లేదే ఎలా దూరంగ ఉంటూనే నన్నల్లుకుంటావు ఈ మాయ చెప్పేదెలా మాటలతో మురిపించి మల్లెలతో చలి పెంచి పెట్టకిక నాతో ఈ పేచీ కాముడికి కసి రెచ్చి కౌగిలికి సెగలిచ్చి ఆడెనటా మనతో దోబూచి అబ్బబ్బా అబ్బాయి జుబ్బాల బుజ్జాయి యెన్నెన్ని పాఠాలు నెర్పాలిలా అందాలా అమ్మాయి మోగిస్త సన్నాయి అందాక హద్దుల్లో ఉండాలలా కల్లోకి వస్తావు కంగారు పెడతావు నాకర్ధమె కాదు నీ వాలకం ఒళ్ళోన ఉంటేను ఊరంతా చూస్తావు అయ్యాగా నీలో సగం చెలియ చెలియ సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం బావా బావా బంగారం అతిగ నాంచకు యెవ్వారం ఈ పుటైనా తీర్చెయ్యవా నా భారం

Tala Talamani Song Lyrics in Telugu – Kalusukovalani (2002)

'Tala Talamani' song from Kalusukovalani (2002) movie is composed by Devi Sri Prasad and sung by Harini and S. P. B. Charan.

SONG INFORMATION
Movie : Kalusukovalani (2002)
చిత్రం: కలుసుకోవాలని (2002) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: హరిణి, ఎస్. పి. చరణ్ తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటు అందా నీ దారి నిను చూసి పారిపోయిందే నిదురించే రాతిరి చిటుకేసి చేరుకోమంది ఉదయించే లాహిరి తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటు అందా నీ దారి లోకం కనరాని మైకం జతలోని వేగం చెలరేగని పైకేం వినలేని రాగం మనలోని మౌనం కరిగించని ఇంతకాలం బరువైన ప్రాయం అడిగే సహాయం ఒడిచేరని పాపం ప్రియురాలే తాపం అణిగే ప్రతాపం చూపించని కమ్మని తిమ్మిరి కమ్మిన ఈడుని ఏంకావాలని అడగాలి ఉక్కిరి బిక్కిరి లాలన ఇవ్వాలి జంటకు చేరిన ఒంటరి ఒంపుల తుంటరి ఆశలు తీరాలి నమ్ముకు వచ్చిన అమ్మడు మెచ్చిన ఉమ్మడి ముచ్చటలో పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటు ఉన్నా నీ దారి తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ లోలో రుసరుసలు రేపే తహ తహాలు ఆపే సమయం ఇది నాలో గుసగుసలు నీతో పదనిసలు పాడే వరసే ఇది అందుకోని తెరచాటు దాటే జవరాలు చాటే వివరాలని కానీ నిలువెల్ల నాటే కొన గోరు మీటే కొంటె ఆటని ముద్దులు పెట్టక నిద్దర పట్టక బిత్తరపోయిన కోమలికి కోరిన కౌగిలి ఊయల వెయ్యాలి ఇప్పటికిప్పుడు చెప్పక తప్పని తప్పులు చేయాలి హద్దులు పద్దులు ఇద్దరి మధ్యన సర్దుకుపోవాలి తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటు అందా నీ దారి నిను చూసి పారిపోయిందే నిదురించే రాతిరి చిటుకేసి చేరుకోమంది ఉదయించే లాహిరి తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి

Pade Pade Song Lyrics in Telugu – Kalusukovalani (2002)

'Pade Pade' song from Kalusukovalani (2002) movie is composed by Devi Sri Prasad and sung by Sumangali.

SONG INFORMATION
Movie : Kalusukovalani (2002)
Singers : Sumangali
చిత్రం: కలుసుకోవాలని (2002) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సుమంగళి పదే పదే వెంటాడే కల ఇదే ఇదే కాదంటే ఎదా ఇవ్వాళ నీకోసమే వరాల సావసమై చేయ్యందుకోమన్నది వెయ్యేళ్ళ ఈ పెన్నిధి ఎన్నాళ్ళని నిరీక్షణం ఫలించినట్టున్నది

Oke Okka Kshanam Song Lyrics in Telugu – Kalusukovalani (2002)

'Oke Okka Kshanam' song from Kalusukovalani (2002) movie is composed by Devi Sri Prasad and sung by Sumangali.

SONG INFORMATION
Movie : Kalusukovalani (2002)
Singers : Sumangali
చిత్రం: కలుసుకోవాలని (2002) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సుమంగళి ఒకే ఒక క్షణం చాలుగా ప్రతి కల నిజం చేయగా యుగాలు గల కాలమా ఇలాగే నువ్వాగుమా దయుంచి ఓ దూరమా ఇవాళ ఇటు రాకుమా ఇదే క్షణం శిలాక్షరం అయ్యేట్టు దీవించుమా

Priya Priya Song Lyrics in Telugu – Kalusukovalani (2002)

'Priya Priya' song from Kalusukovalani (2002) movie is composed by Devi Sri Prasad and sung by Srirangam Venu and Sumangali.

SONG INFORMATION
Movie : Kalusukovalani (2002)
చిత్రం: కలుసుకోవాలని (2002) సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: శ్రీరంగం వేణు, సుమంగళి ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది దహించు ఏకాంతమే సహించలేనన్నది యుగాల ఈ దూరమే భరించలేనన్నది విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది కన్నీళ్ళలో ఎలా ఈదను నువే చెప్పు ఎదురవని నా తీరమా నిట్టూర్పుతో ఎలా వేగను నిజం కాని నా స్వప్నమా హా ఎలా దాటాలి ఈ ఎడారిని ఎలా చేరాలి నా ఉగాదిని క్షణం క్షణం నిరీక్షణం తపించవా స్నేహమా ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది

Palli Balakrishna Wednesday, June 17, 2026
Sing Geetham (2026) Emaindhi Emaindhi Song Lyrics

Sing Geetham (2026) – Emaindhi Emaindhi Song Lyrics in Telugu and English

Emaindhi Emaindhi Song Lyrics in Telugu and English – Sing Geetham (2026)

'Emaindhi Emaindhi' song from Sing Geetham (2026) movie is composed by Devi Sri Prasad and sung by R. P. Krishaang, Ahilya Bamroo, Shalini Kondepudi, Rita, Haripriya, S. P. Abhishek, Chitti Prakash Rao, Shiva Narayana, Racha Ravi, Mahesh Achanta, Junior Relangi, Sunandhan and Deepak Blue. Lyrics are written by Sreemani.

SONG INFORMATION
Song : Emaindhi Emaindhi
Lyricist : Sreemani
Singers : R. P. Krishaang, Ahilya Bamroo, Shalini Kondepudi, Rita, Haripriya, S. P. Abhishek, Chitti Prakash Rao, Shiva Narayana, Racha Ravi, Mahesh Achanta, Junior Relangi, Sunandhan, Deepak Blue

Emaindhi Emaindhi Song Lyrics in Telugu

ఏమయ్యింది ఏమయ్యింది బాబో ఏదో అయిపోయింది (6) అయిపోయింది అయిపోయింది అయిపోయింది అయిపోయింది అయిపోయింది అయిపోయింది మాటలు రావట్లేదు అవును మాటలు రావట్లేదు పాటలు పోవట్లేదు పాటలు పోవట్లేదు ఇదేదో ఆగట్లేదు ఏమి అర్ధం కావట్లేదు ఇదేదో ఆగట్లేదు ఏమి అర్ధం కావట్లేదు మాటలు రావట్లేదు అవును మాటలు రావట్లేదు పాటలు పోవట్లేదు పాటలు పోవట్లేదు ఇదేదో ఆగట్లేదు ఏమి అర్ధం కావట్లేదు ఏమయ్యింది ఏమయ్యింది బాబో ఏదో అయిపోయింది (6) అయిపోయింది అయిపోయింది నా కత్తెర కూడా టకటక మంటూ స్పీడుగా పోతుందే నేను బిత్తరపోయి చూస్తున్నా నా మాటిననంటుందే ఇట్టా బీటుకు తగ్గ వేటేస్తుంటే ఏమైపోతుందే నా షాప్ కి వచ్చే వాళ్ళకి ఇంకా మిగిలేదీ గుండే రాతిరి తిన్న అన్నం గానీ తేడా కొట్టిందా లేదా ఊర్లో ఉన్నోళ్లందరికేదో గాలే సోకిందా లాఫింగ్ గ్యాస్ లా సింగింగ్ గ్యాస్ ఒంట్లో దూరిందా లేదా కరోనాకే అప్డేట్ ఏదో కొత్తగ వచ్చిందా ఏమయ్యింది ఏమయ్యింది బాబో ఏదో అయిపోయింది (2) ఆస్తికోసం ఆశగ వస్తే రోగం వచ్చిందే I Just Can't Believe What's happening today Situation చూస్తే డీల్ పోయేటట్టుందే ఇట్టా పాడుతుంటే ఊపిరి కూడా కష్టంగా ఉందే ఏమయ్యింది ఏమయ్యింది ఊరికి దెయ్యం పట్టిందా ఊరికి దెయ్యం పట్టిందా (4) పారిపొండ్రా ఏమయ్యింది ఏమయ్యింది బాబో ఏదో అయిపోయింది (6) అయిపోయింది అయిపోయింది అయిపోయింది అయిపోయింది

Emaindhi Emaindhi Song Lyrics in English (Transliteration)

Emaindhi emaindhi Baabo edho ayipoyindhi (6) Ayipoyindhi ayipoyindhi Ayipoyindhi ayipoyindhi Ayipoyindhi ayipoyindhi Maatalu raavatledhu Avunu maatalu raavatledhu Paatalu povatledhu Paatalu povatledhu Idhedho aagatledhu emi ardham kaavatledhu Idhedho aagatledhu emi ardham kaavatledhu Maatalu raavatledhu Avunu maatalu raavatledhu Paatalu povatledhu Paatalu povatledhu Idhedho aagatledhu emi ardham kaavatledhu Emaindhi emaindhi Baabo edho ayipoyindhi (6) Ayipoyindhi ayipoyindhi Naa katthera kooda takataka mantoo speedugaa pothundhe Nenu bittharapoyi choosthunnaa naa maatinanantundhe Ittaa beatuku thagga vetesthunte emaipothundhe Naa shop ki vacche vaallaki inkaa migiledhi gunde Raathiri thinna annam gaani theda kottindhaa Ledhaa oorlo unnollandarikedho gaale sokindhaa Laughing gas la singing gas ontlo dhoorindhaa Ledhaa coronake update edho koththaga vacchindhaa Emaindhi emaindhi Baabo edho ayipoyindhi (2) Aasthikosam aashaga vasthe rogam vacchindhe I Just Can't Believe What's happening today Situation choosthe deal poyetattundhe Ittaa paaduthunte oopiri kooda kashtangaa undhe Emaindhi emaindhi Ooriki dheyyam pattindhaa Ooriki dheyyam pattindhaa (4) Paaripondra Emaindhi emaindhi Baabo edho ayipoyindhi (6) Ayipoyindhi ayipoyindhi Ayipoyindhi ayipoyindhi

Palli Balakrishna Sunday, June 14, 2026
Sing Geetham (2026) Kotha Feeling Song Lyrics

Sing Geetham (2026) – Kotha Feeling Song Lyrics in Telugu and English

Kotha Feeling Song Lyrics in Telugu and English – Sing Geetham (2026)

'Kotha Feeling' song from Sing Geetham (2026) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad and Hari Priya. Lyrics are written by Sreemani.

SONG INFORMATION
Song : Kotha Feeling
Lyricist : Sreemani

Kotha Feeling Song Lyrics in Telugu

ఈ ఊరు ఈ గాలి ఈ నేల ఈ జోరు ఈ హోరు హుషారు ఈ దారి షికారు రోజు చూసేదే ఇదంతా సుమారు ఏంటో ఇవ్వాళ మారింది తీరు ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు ఈ ఊరు ఈ గాలి ఈ నేల ఈ జోరు ఈ హోరు హుషారు ఈ దారి షికారు మొగే నరాల్లో ఏదో గిటారు ఊహల్లో తేలే నా గుండెగారు ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు ఏమంటారు? (2) ఆకాశమంత నా కోసమంట మెల్లంగా వెళ్లమంటూ వొంపుతుంది ఉన్న దూరమంతా ఏం తొందరంటా, కాస్త ఆగమంట ఇంకొంత సేపు ఇలాగే సాగమందిగ ప్రాణమంత ఆ మేఘం, ఈ రాగం, అన్నాయి నిదానం చాలా తీరిగ్గా చేసే ప్రయాణం ఉన్న బెరుగ్గా బావుంది వైనం ఈ కొత్త ఫీలింగ్ నే ఏమంటారు ఏమంటారు? (2)

Kotha Feeling Song Lyrics in English (Transliteration)

Ee ooru ee gaali ee nela ee joru Ee horu hushaaru ee dhaari shikaaru Roju choosedhe idhanthaa sumaaru Ento ivvaala maarindhi theeru Ee kottha feeling ne emantaaru Ee kottha feeling ne emantaaru Ee ooru ee gaali ee nela ee joru Ee horu hushaaru ee dhaari shikaaru Moge narallo edho guitaru Oohallo thele naa gundegaaru Ee kottha feeling ne emantaaru Emantaaru? (2) Aakaashamantha naa kosamanta Mellangaa vellamantoo vomputhundhi unna dhooramanthaa Em thondarantaa, kaastha aagamanta Inkontha sepu ilaage saagamandhiga praanamantha Aa megham, ee raagam, annaayi nidhaanam Chaalaa theeriggaa chese prayaanam Unna berugggaa baavundhi vainam Ee kottha feeling ne emantaaru Emantaaru? (2)

Palli Balakrishna
Sri Ramadasu (2006) Telugu Songs Lyrics Album Cover

Sri Ramadasu (2006) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Sri Ramadasu (2006)
Music : M. M. Keeravani
Actors : Akkineni Nageswara Rao, Akkineni Nagarjuna
Actress : Sneha, Veda Sastry
Supporting Cast : Suman, Nassar, Brahmanandam, Sunil, Venu Madhav
Director : K. Raghavendra Rao
Producer : Konda Krishnam Raju
Release Date : 30 March 2006

Sri Raghavam Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Sri Raghavam' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Singers : M. M. Keeravani
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ట్రెడిషనల్ గానం: ఎం. ఎం. కీరవాణి ఓం గం క్లీం లక్ష్మీ గణపతయే నమః శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ఓం

Adigadigo Badragiri Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Adigadigo Badragiri' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, బృందం ఓం... ఓం... ఓం... శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః అదిగో అదిగో భద్రగిరీ ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ ఏ వాల్మీకీ రాయని కధగా సీతారాములు తనపై ఒదగా రామదాసకృత రామపదామృత వాగ్గేయస్వర సంపదగా వెలసిన దక్షిణ సాకేతపురీ అదిగో అదిగో భద్రగిరీ ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ రాం రాం రాం రాం రామనామ జీవన నిర్నిద్రుడు పునః దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడూ తపమును మెచ్చీ ధరణికి వచ్చీ దర్శనమిచ్చెను మహావిష్ణువూ సాససా నీదరి సానిదాప గమ పాదనీ దామపా త్రేతాయుగమున రామరూపమే త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆ దర్శనమే కోరెనప్పుడూ ధరణిపతియే ధరకు అల్లుడై శంఖచక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువై పోగా సీతాలక్ష్మణ సమితుడై కొలువు తీరె కొండంత దేవుడూ శిలగా మళ్ళీ మలచీ శిరమును నీవే నిలచీ భద్రగిరిగ నను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడూ వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండం కరే చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే ! అదిగో అదిగో భద్రగిరీ ఆంధ్రజాతికిది అయోధ్యాపురీ

Hylessa Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Hylessa' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ గానం: దేవి శ్రీ ప్రసాద్, ఎం. ఎం. కీరవాణి, మాళవిక హొలేసా హొలేసా హొలేసా హొలె హొలేసా ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుసూస్తున్నది గట్టు ఎమైనట్టు నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ హొలేసా హొలేసా హొలేసా హొలేసా ఏటయ్యిందె గోదారమ్మా... కృష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట దుంకులాట ఎంకన్నకు పాలుతాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుతపిల్లల ఉరుకులాట ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు... ఉ ఉ ఉ హొలేసా హొలేసా హొలేసా హొలేసా ఏటయ్యిందె గోదారమ్మఎందుకీ ఉలికిపాటు గగురుపాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు చిటుకిపందిరెయ్యాలని పిచ్చిపిచ్చి ఆశ నాది ముల్లోకాలని కాసేటొన్ని కాపాడాలని పిచ్చి నాది నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురుచూపు ఇన్నాళ్ళకు నిజమయ్యి ఎదరొంకన పడుతున్నది రాలేని శబరి కడకు రాముడు నడిచొచ్చినట్టు మన రాముని సేవకెవరో మనసుపడి వస్తున్నట్టు... హొలేసా హొలె హొలేసా హొలేసా హొలేసా ఏటయ్యిందె గోదారమ్మ ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఎమైనట్టు నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు మన సీతారామస్వామికి మంచి ఘడియ రాబోతున్నట్టు ఉ ఉ ఉ హొలేసా హొలేసా హొలేసా - హొలె హొలేసా హొలేసా హొలేసా హొలేసా - హొలె హొలేసా హొలేసా హొలె హొలేసా హొలేసా హొలేసా

Antha Ramamayam Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Antha Ramamayam' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, బృందం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున అత్మారాముడు రామ రామ రామ రామ అనంత రూపముల వింతలు సలుపగ రామ రామ రామ రామ సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ,ఓం నమో నారాయణాయ అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ నదులు వనంబులు నానామృగములు పీత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ సిరికిన్ జెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బంధింపడు ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడు నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై

Isvakulaku Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Isvakulaku' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: శంకర్ మహదేవన్ ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైన పలుకవే రామచంద్రా నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకము రామచంద్రా ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా కలికి తురాయి నీకు కొలుపుగా జేయిస్తినీ రామచంద్రా నీ తండ్రి దశరధ మహరాజు పంపెనా లేక నీ మామ జనక మహరాజు పెట్టెనా ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా

Allah Rama Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Allah Rama' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by Vijay Yesudas.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Singers : Vijay Yesudas
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: శ్రీ వేద వ్యాస గానం: శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాసు అల్లా... శ్రీ రామా... శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారుముద్దుగ అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవ్ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాన నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి గణమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి వునుగాని రస మూర్తి ఆ మూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి తాగరా... ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపప మపనిప మపనిప మపసనిప మపమ శ్రీ రామ పాపప మపనిని పనిసస రిరిసనిప మపని మపమ కోదండ రామ మపనిసరి సని పనిపమ సీతా రామ మపనిసరి సరి సరిమరిస నిపమ ఆనంద రామ మామా రిమ రిమరి సరిమ రామ జయ రామ సరిమ రామ సపమ రామ పా వననామ ఏ వేల్పు యెల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకె వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు ద్యుతిగొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పుదె మల్పులేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసానుదాసులకు కై మోడ్పు తాగరా...ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం

Idhigidhigo Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Idhigidhigo' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: జె. కె. భారవి గానం: సునీత ఉపద్రస్ట ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే మాయల బంగారు లేడి మాయని గురుతులివే పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగా సీతమ్మ వాడిన పసుపుకుంకుమ రాళ్ళివే దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి మరి నా రామునికీడ నిలువనీడ లేదిదేమి నిలువ నీడ లేదిదేమి

Charanamule Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Charanamule' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Singers : K. S. Chithra
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: కె. ఎస్. చిత్ర, మధు బాలకృష్ణన్, రామాచారి చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ చరణములే నమ్మితీ వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా నీ దివ్య చరణములే నమ్మితీ చరణములే నమ్మితీ పావన రామ నామసుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా చంచలగుణములు మాని సదా నిశ్చల మదియుండేదెన్నటికో పంచతత్వములు తారకనామము పఠియించుట నాకెన్నటికో రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం జలజ సంభవాది వినుతా జలజ సంభవాది వినుతా జలజ సంభవాది వినుతా జలజ సంభవాది వినుతా జలజ సంభవాది వినుతా చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధ వదనా నళినా మిళిందం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం శ్రీరామ నామం మరువాం మరువాం సిద్దము యమునికి వెరువాం వెరువాం శ్రీరామ నామం మరువాం మరువాం సిద్దము యమునికి వెరువాం వెరువాం గోవిందునీవేళ కొలుతాం కొలుతాం గోవిందునీవేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం శ్రీరామ నామం మరువాం మరువాం సిద్దము యమునికి వెరువాం వెరువాం విష్ణు కధలు చెవుల విందాం విందాం విష్ణు కధలు చెవుల విందాం విందాం వేరు కధలు చెవిన మాందాం మాందాం వేరు కధలు చెవిన మాందాం మాందాం శ్రీరామ నామం మరువాం మరువాం సిద్దము యమునికి వెరువాం వెరువాం హే జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పావన నామ పట్టాభి రామ పావన నామ పట్టాభి రామ నిత్యము నిన్నే కొలిచెద రామ అహ నిత్యము నిన్నే కొలిచెద రామ ఆహా రామా అయోధ్య రామ ఆహా రామా అయోధ్య రామ రామా రామా రఘుకుల సోమా అహ రామా రామా రఘుకులసోమా జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ జై జై రామ జానకిరామ

Chalu Chalu Chalu Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Chalu Chalu Chalu' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎస్. పి. చరణ్, సునీత ఉపద్రస్ట ససలు గగలు గగలు నినిలు ససలు నినిలు గగలు నినిలు గమదని సగసగ సగమగ సనిదని దనిసగ సనిదమ గమకములు చాలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు ముద్దుగ ముద్దుగ వినవలెగా నా ముద్దు విన్నపాలు పాలు వన్నెపూలలో విన్నపాలు ను ఆరగిస్తే మేలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు నీ కరములు నా మేనికి వశీకరములు నీ స్వరములు ఈ రేయికి అవసరములు నీ కరములు నా మేనికి వశీకరములు నీ స్వరములు ఈ రేయికి అవసరములు ఈ క్షణములు మన జంటకి విలక్షణములు ఈ సుఖములు మునుపెరుగని బహుముఖములు రా మా ఇంటికి అను పిలుపులు ఆ లీలలు అవలీలలు చాలు - చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ తనువులు సమరానికి ప్రాణ ధనువులు ఈ రణములు రససిద్దికి కారణములు విరామాలెన్నడు ఎరుగనివి చలి ఈడులు తొలి జాడలు ఛి పాడులు చాలు - చీ చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు

Nannu Brovamani Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Nannu Brovamani' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సునీత ఉపద్రస్ట నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతురా జనని జానకమ్మా నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే లోకాంతరంగూడి శ్రీకాంత నినుగూడి ఏకాంతమున ఏకో శెయ్య నున్నావేయ్య నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే అద్రిజ వినుతుడు బధ్రగిరీశుడు నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి నను బ్రోవమని, నను బ్రోవమని, నను బ్రోవమని చెప్పవే… సీతమ్మ తల్లి

Sri Rama Rama Ramethi Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Sri Rama Rama Ramethi' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ట్ట్రెడిషనల్ గానం: ఎం. ఎం. కీరవాణి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే

Entho Ruchira Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Entho Ruchira' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం రామా శ్రీరామా కోదండ రామా ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీనామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామ మేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవసర పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా శ్రీరామ అహ శ్రీరామ ఓ రామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నిను సదా భజించెడి సదానంద నీ నామ మేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామ మేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీనామమెంతో రుచిరా ఎంతో రుచిరా

Paluke Bangaramayena Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Paluke Bangaramayena' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Singers : M. M. Keeravani
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: కె. ఎస్. చిత్ర, ఎం. ఎం. కీరవాణి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పిలిచిన పలుకవేమి.... పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పలుకే... పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి పలుకే బంగారమాయెనా... పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా కరుణించు బధ్రాచల వన రామదాస పోషా పలుకే బంగారమాయెనా... పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా

Shuddha Brahma Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Shuddha Brahma' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: ట్ట్రెడిషనల్ గానం: ప్రణవి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖనిద్రిత రామ బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ శేషతల్ప సుఖనిద్రిత రామ బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతా రామ రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతా రామ ప్రియగుహ వినివేధితపద రామ శబరీ దత్త ఫలాశన రామ ప్రియగుహ వినివేధితపద రామ శబరీ దత్త ఫలాశన రామ హనుమత్సేవిత నిజపద రామ సీతా ప్రాణాదారక రామ రామ రామ జయ రాజా రామ రామ రామ జయ సీతా రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ

Bhadra Shaila Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Bhadra Shaila' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by K. S. Chithra and M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు గానం: హరిహరన్, కె. ఎస్. చిత్ర సాకీ: రామాయ రామబద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథయ నాథాయ సీతాయః పతయే నమః పల్లవి: భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా బృందం: భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మకర్మ యుగళ మండలా బృందం: వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మకర్మ యుగళ మండలా సతత రామదాస పోషకా శ్రీరామచంద్ర వితత భద్రగిరినివేషకా బృందం: భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండ రామా బృందం: కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండ రామా నీ దండ నాకు నీవెందుబోకు వాదేల నీకు వద్దుపరాకు బృందం: కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామా తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే బృందం: కోదండరామ కోదండరామ రామ రామ రామ కోదండరామ చరణం: దశరధ రామా గోవిందా మము దయజూడు పాహి ముకుందా బృందం: దశరధ రామా గోవిందా మము దయజూడు పాహి ముకుందా దశరథ రామా గోవిందా దశముఖ సంహారధరణిజ పతిరావ శశిధర పూజిత శంఖచక్రధర బృందం: దశరథ రామా గోవిందా తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ బృందం: తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ పక్కతోడుగా భగవంతుడు మును చక్రధారియై చెంతనె వుండగ తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ బృందం: జయ జయ రామా జగదభిరామా జానకిరామా పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో బృందం: పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో పాహి భద్రాద్రివై దేహి రామప్రభో పాహిరామ ప్రభో... శ్రీమన్మహా గుణస్తోమాభిరామ నీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో సుందరాకార మన్మందిరోద్దార సీతేందిరా సమ్యుతానందరామ ప్రభో బృందం: పాహిరామప్రభో...

Ye Theerugananu Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Ye Theerugananu' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by Nanditha.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Singers : Nanditha
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: విజయ్ యేసుదాస్ శ్రీ రఘునందన సీతా రమణా శ్రితజన పోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా ఏ తీరుగ నను దయ జూచెదవో ఇలవంశోత్తమ రామా నా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామా వాసవ కమల బావా సుర వందిత వారధి బంధన రామా భాసురవత సద్గుణములు గల్గిన బధ్రాద్రీశ్వర రామా రామా ఏ తీరుగ నను

Thandri Matanu Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Thandri Matanu' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by Sunitha Upadrashta.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Lyricist : J. K. Bhairavi
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: జె. కె. భారవి గానం: సునీత ఉపద్రస్ట తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పైనమయ్యే నేను మీ బాటలోనే వస్తాను అనుచూ సీతమ్మ కదిలే ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలి పెట్టి మీరెలా వెళ్లగలరనెను సీతా

Dhasaradhi Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Dhasaradhi' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Lyricist : Ramadasu Keerthana
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: వ్యాదవ్యాస్ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర దాసరధి కరుణా పయొనిది నువ్వె దిక్కని నమ్మడమా నీ అలయమును నిర్మించడమా నిరతము నిను భజియించడమా రామ కొటి రచియించడమా సీత రామస్వామి నే చేసిన నెరమదెమి నీ దయ చుపవ దెమి నీ దర్శన మీయవిదెమి దాసరధి కరుణపయొనిది గుహుడు నీకు చుట్టమ గుండెలకు హత్తుకున్నావు శబరి నీకు తొబుట్టువ ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటిన నీ దర్శనమె ఇమ్మంటిని కాని ఏల రావు నన్నెలరావు నన్నెల ఏల రావు సీత రామస్వమ్య్ నే చేసిన నెరమదెమి నీ దయ చుపవ దెమి నీ దర్శన మీయవిదెమి దాసరధి కరుణపయొనిది రామ రసరమ్య ధామ, రమణీయ నామ రఘువంస సోమ ,రణరంగ భీమ రాక్షస విరమ కమనీయ ధమ్మ సౌందర్య సీమ నీరజస్యామ నిజబుజొధామ భొజనల రామ భువన జయ రామ పాహి భద్రాద్రి రమ పాహీ తక్షన రక్షన విశ్వవిలక్షన ధర్మ విచక్షన గొదారిన కలిసెనెమి రా డాన్ డ డ డండ డండ నినధమ్ముల జాండము నిండ మత్త వెదండము నిక్కినె పొగడు నీ అభయవ్రతమెదిరా ప్రెమ రసాంతరంగ హౄదయంగమ శుంగశుభంగ రంగ బహురంగడ భంగ తుంగ సుగునైక తరంగ శుసంగ సత్య సారంగ సుస్రుతివిహంగ పాప మ్రుదు సంగ విభంగా భుతల పతంగ మదు మంగళ రూపము చుపవెమి రా గరుడగమన రా రా గరుడగమన రా రా

Mangalam Song Lyrics in Telugu – Sri Ramadasu (2006)

'Mangalam' song from Sri Ramadasu (2006) movie is composed by M. M. Keeravani and sung by M. M. Keeravani.

SONG INFORMATION
Movie : Sri Ramadasu (2006)
Lyricist : Traditional
Singers : M. M. Keeravani
చిత్రం: శ్రీరామదాసు (2006) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: రామదాసు కీర్తన గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్, కోరస్ రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం రామదాస మ్రుదుల హృదయ తామరసనివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం

Palli Balakrishna Thursday, June 11, 2026

Most Recent

Default