చిత్రం: శ్రీనివాస మంగాపురం (2026)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: ఎల్.వి.రేవంత్
ఏ మంగా హే మంగా దేవతవే కచ్చితంగా
ఏ లోకం నుండి ఊడి పడ్డావే
ఏ మంగా హే మంగా శీనునే కరుణించంగా
ఈ ఏడు కొండలు చేరి ఉంటావే
ముక్కే మూసేసుకొని బక్క చిక్కేలా నేను
మొక్కులెన్నో మొక్కి ఉంటానే
రెక్క కట్టేసుకొని చుక్క చక్కంగా వచ్చి
చుట్టు వెలుగులిట్ట నింపావే
గుంపులో గోవిందయ్యను కాదే
గుండెలో నిన్నే నింపేసుకున్నానే
నా కోసం నువ్వు పుట్టేసావే
నువ్వే లేకుంటే ఒక్కన్నే సచ్చిపోనమ్మో
ఏ మంగా చూసే కళ్ళే నావే
మంగా నవ్వే పళ్ళే నావే
మంగ మొత్తం ఒళ్ళే నాదే
దాచేసుకుంటానే
ఏ మంగ గుండె కొట్టిస్తానే
పొర్లు దండాలు పెట్టేస్తానే
మంగా నీకై పస్తుంటానే
ప్రేమిస్తున్నానే
ఏ నువ్వెల్లే ప్రతి దారి పిలుస్తోంది
ఈ గాలుల్లో నీ ప్రతి శ్వాస తెలుస్తోందే
మనసే ఉంటే నా మనసున గుణమే నీకు వినిపిస్తుందే
ప్రేమే ఉంటే నీ చుట్టూ తిరిగేటి నా ప్రేమే నీకు కనిపిస్తుందే
మంగా కళ్ళే నొక్కేస్తానే మంగా గొళ్ళే సవరిస్తానే
మంగ ముద్దులు పెట్టేస్తానే నిమిషం కోసారే
మంగ నన్ను తీసేయ్యద్దే మంగ నన్ను తోసెయ్యద్దే
మంగా ఆశలు కోసెయ్యద్దే వస్తా ప్రతిసారే
హే మంగా హే మంగా నీ చేత్తో కమ్మంగా
ఆ గోరు ముద్దలు ఎప్పుడు పెడ్తావే
హే మంగా హే మంగా నా ఒళ్ళో క్షేమంగా
ఓ ముద్దు ముచ్చటలెప్పుడు చెప్తావే
నువ్వే ఒప్పేసుకుంటే పెళ్ళే చేసేసుకుంటే
ఏకంగా గుడి కట్టించేస్తానే
పుట్టే పిల్లాడికేమో వెంకటేశులు పేరే పెట్టి
గారబంగా పెంచేసుకుంటానే
నువ్వే నేనని మనసే నీదని
ఓ క్షణమే నువ్వు చెప్తే చాలమ్మో
ఎవరేమైనా ఏదేమైనా ఉంటా నేనుంటా
నీతోనే ఉంటానే చివారంటా
ఏ మంగా చూసే కళ్ళే నావే
మంగా నవ్వే పళ్ళే నావే
మంగ మొత్తం ఒళ్ళే నాదే
దాచేసుకుంటానే
ఏ మంగ గుండె కొట్టిస్తానే
పొర్లు దండాలు పెట్టేస్తానే
మంగా నీకై పస్తుంటానే
ప్రేమిస్తున్నానే
చిత్రం: పరదేశి (1998)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర, ఉన్ని కృష్ణన్
తెలుగింటి పెరటిలోన విరిసే మందారమా
చిగురుమావి కుబురులోని కుహుకుహూల రాగమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్
దట్ ఐ యామ్ ఫాలెన్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఈ ఊరి గాలి మంచి కబురు తెచ్చింది
కోరుకోని కాలమేమో కలిసొచ్చింది
నయాగరా దారుల్లో ఉరికే జలపాతమా
న్యూజెర్సీ తోటల్లో అల్లుకున్న శాంతమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్
దట్ ఐ యామ్ ఫాలెన్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది
ఇంత వరకు లేని హాయి తెలిసొచ్చింది
జూలియెట్టు రోమియెల జంటలేల మనది
నల దమయంతిలోని పంతమే ఇది
డ్రీం లాండు నేల మీద ప్రేమ కాండ మనది
యదుకుల వీధిలోని ప్రణయమే ఇది
దేశం మారినా ప్రేమ రసం ఒక్కటే
కాలం మారినా కన్నెతనం ఒక్కటే
చనువే పెరిగినా తనువే మరిగినా
సరిగంగ స్నానాల వణుకు ఒక్కటే
వాల్ట్ డిస్నీ ఊహల్లో దాగిన సౌందర్యమా
పడమరమ్మ నుదుటి పైన మెరిసే సింధూరమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్
దట్ ఐ యామ్ ఫాలెన్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం
మధువుల ముంచు ఫ్రెంచు ముద్దులే సుమా
సీమరాణి రామరాజు దగ్గరైన సమయం
మనువుకు ప్రేమ తాడు సిద్దమే సుమా
అథిదిగా వచ్చినా అమృతమే ఇవ్వనా
హృదయం అర్చన ఈ క్షణమే చెయ్యనా
కరగని కాంక్షతో వదలని దీక్షతో
వెయ్యేళ్ళు వెయ్యాలి వలపు వంతెన
విజయ నగర వీధుల్లో మెరిసే రవి కిరణమా
వాషింగ్టన్ డి సి లో కురిసే హిమ చైత్రమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్
దట్ ఐ యామ్ ఫాలెన్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది
కోరుకోని కాలమేమో కలిసొచ్చింది
చిత్రం: పరదేశి (1998)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: సుజాత మోహన్, యం.యం.కీరవాణి
ఇండియా బ్యూటిఫుల్ ఇండియా
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం
మగువ శిరస్సున మణులు పొదిగిన హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది
ఐ లవ్ ఇండియా..ఐ లవ్ ఇండియా..
ఐ లవ్ ఇండియా..ఐ లవ్ ఇండియా..
గంగ యమునలు సంగమించిన గానమో
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో
అజంతాల..ఖజురహోల..
సంపదలతో సొంపులొలికే భారతి జయహో
మంగళం మాతరం
ఐ లవ్ ఇండియా..ఐ లవ్ ఇండియా..
ఐ లవ్ ఇండియా..ఐ లవ్ ఇండియా..
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
తాజమహలే ప్రణయ జీవుల పావురం
కృష్ణవేణి శిల్ప రమణి నర్తనం
వివిధ జాతుల వివిధ మతముల
ఎదలు మీటిన ఏక తాళపు భారతి జయహో
మంగళం మాతరం
ఐ లవ్ ఇండియా..ఐ లవ్ ఇండియా..
ఐ లవ్ ఇండియా..ఐ లవ్ ఇండియా..
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం
వందే మాతరం
మళ్ళీ మళ్ళీ పాట సాహిత్యం
చిత్రం: పరదేశి (1998)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర, యస్.పి.బాలు
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పూసింది మధువనం
మధువనం మధువనం మధువనం మధువనం
తల్లో మెల్లో ఒళ్ళో జల్లో తుళ్ళి తుళ్ళి ఆడింది పరవశం
పరవశం పరవశం ప్రతిక్షణం పరవశం
ఆషాడాలు అంతమై మూఢాలన్నీ మాయమై
మళ్ళీ మళ్ళీ మళ్ళీ
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పూసింది మధువనం
మధువనం మధువనం మధువనం మధువనం
నైరుతి ఋతుపవనం మన కౌగిళికొచ్చి వెచ్చగా మారింది
పున్నమి శశికిరణం మన వరసే మెచ్చి హారతులిచ్చింది
చిలుక గువ్వ చెబుతున్నాయి శకునాలు
మెరుపు మబ్బు జరిపించాయి తిరునాళ్ళు
విరహాలు వేమల్లు జరజర జరజర జరజర జరజర పారిపోగా
మళ్ళీ మళ్ళీ మళ్ళీ
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పూసింది మధువనం
మధువనం మధువనం మధువనం మధువనం
కన్యారాశి ఫలం మన అల్లరి ఆటకు అనుకూలించింది
తారాచంద్ర బలం మన తోడే ఉంటూ తొందర పడమంది
నెమలి హంస పరిచేశాయి దైతాలు
నిమ్మ పనస అందించాయి తలదిండ్లు
సరసాల సల్లాపాలు చకచక చకచక చకచక చకచక సాగిపోగా
మళ్ళీ మళ్ళీ మళ్ళీ
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పూసింది మధువనం
మధువనం మధువనం మధువనం మధువనం
తల్లో మెల్లో ఒళ్ళో జల్లో తుళ్ళి తుళ్ళి ఆడింది పరవశం
పరవశం పరవశం ప్రతిక్షణం పరవశం
చూశారా చూశారా పాట సాహిత్యం
చిత్రం: పరదేశి (1997)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: మాల్గాడి శుభ, యస్.పి.బాలు
చూశారా చూశారా చూశారా
నా పరదేశిని ప్రియహాసిని అనురాగ సీమలోని ప్రేమసుమాన్ని
చూశారా చూశారా చూశారా
నౌ నో మోర్ గేమ్స్ లెట్ మి టీచ్ యు తెలుగు ఒకే..ఒకే
నేను నేను నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను
దట్ మీన్స్ ఐ లవ్ యు ఓ
రోజు రోజు నిన్ను నిన్ను పూజిస్తున్నాను పూజిస్తున్నాను
చెయ్యి చెయ్యి కలవనీ చెయ్యి చెయ్యి కలవనీ
వెయ్యేళ్ళీ స్నేహం నిలవనీ వెయ్యేళ్ళీ స్నేహం నిలవనీ
జతలో తుదిలేని జతలో తుదిలేని
కథలే మొదలవనీ కథలే మొదలవనీ
హాయి రెమ్మల్ కోయిలమ్మల కొంటె పలుకుల నా
పరదేశిని సహవాసిని హృదయాన్ని దొచుకున్న సౌందర్యాన్ని
చూశారా మీరైనా చూశారా
రాగం రాగం భావం భావం మనమే కావాలి
వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్
నో నో నో నో
మనమే కావాలి మనమే కావాలి
లోకం లోకం మొత్తం మొత్తం
మనదై పోవాలి మనదై పోవాలి
అందని చుక్కల సాక్షిగా అందని చుక్కల సాక్షిగా
ఈ కందిన చెక్కిలి సాక్షిగా ఈ కందిన చెక్కిలి సాక్షిగా
చెరిసగమవ్వాలి చరితగ మిగలాలి
జన్మ జన్మకు జోడు నేనని జోల పాడిన నా
దృవతారవి యువరాణివి తొలిప్రేమలోని తీపి తెలిపిన చెలిమివి
అమ్మా నువ్వైనా చూశావా
మీరు..నువ్వు చూశావా ..మీరు చూశారా
డిడ్ ఎనీ బడీ సీ హర్ ప్లీజ్ హా
చిత్రం: పరదేశి (1998)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: మాల్గాడి శుభ, మనో
మల్లెపూవ్వు లాగా మనస్సు దోచే సీమ దొరసాని
తెల్ల పావురంలా మరొక్కసారి నవ్వు చిందనీ
మల్లెపూవ్వు లాగా మనస్సు దోచే సీమ దొరసాని
తెల్ల పావురంలా మరొక్కసారి నవ్వు చిందనీ
కరుణించవా నవలామని వరమియ్యవా సౌధామిని
ఓ..పరదేశి ఓ..పరదేశి
వన్నెలు కావని కిన్నెరసాని అలలేమో అలివేణి
ఇఫ్ యు వాంట్ టు లవ్ మి గెట్ అప్ ఆండ్ బూగీ
ఆండ్ మేక్ ఇట్ వోర్త్ యువర్ వైల్
యు హావ్ చార్మ్ ఆండ్ ఐ హావ్ బ్యూటీ
ఆండ్ వి బోత్ హావ్ అవర్ స్టైల్
నీ పసిమోము చంద్రం పై ఎద పాల సంద్రం యువరాణి
భారత సొగసుల రమణిమణి భారత యువకుని మనసుకని
అడుగులని ఇటు పడనీ తరుణి
ఓ..పరదేశి ఓ..పరదేశి
శ్యామల మేఘం నీ సిగచేరే గగనంలో పని మాని
దేర్ ఆర్ టాయ్స్ ఆండ్ దేర్ హావ్ ట్రెజర్స్
బట్ దేర్ ఆర్ దోస్ దట్ మస్ట్ బి ప్లెజర్స్
ఐ వుడ్ లైక్ సమ్ వన్ టు కమ్
ఆండ్ షేర్ మై డ్రీమ్స్ ఆండ్ ఫాంటసిస్
నీ మెడ ఒంపు చూసి తన తల దింపుకోనీ శంఖాన్ని
అమెరికా చలి చలి చెలిమి కని
తమరిక నా తొలి పిలుపు విని విడిదవని నీ ఒడిని వాణి
ఓ..పరదేశి ఓ..పరదేశి
చిత్రం: కల్కి (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్
నటీనటులు: ప్రభాష్, అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, ప్రియాంకా చోప్రా
దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మాత: అశ్వినీదత్
విడుదల తేది: 10.07.2024
Songs List:
Bhairava Anthem పాట సాహిత్యం
చిత్రం: కల్కి (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: Deepak Blue, Diljit Dosanjh
ఒక నేనే… నాకు చుట్టు నేనే
ఒకటైనా ఒంటరోన్ని కానే…
ధీరుడినే, హ
యోధుడినే, హ
భూమి నేనే… సూర్యుడైనా నేనే
నన్ను నేనే చుట్టి తిరుగుతానే
స్వార్ధము నేనే… పరమార్ధము నేనే
నా రెండు కళ్ళతో లోకమే చదివేసా
ముసుగున మనుషుల రంగులు చూసా
నేననువా అంటే నాకు ముఖ్యం నేనంట
గెలుపు జెండాలే నా దారంతా.
మనసు ఉన్నాగాని లేదంట
మెదడు మాటే నే వింట
మాయదారి లోకంలో
ఇంతే ఇంతే నేనంటా, ఆయ్…
నాకు నేనే కర్త కర్మ క్రియా
ఒక నేనే వేల సైన్యమయ్యా…
నా గమనం నిత్య రణం
కణకణ కణం, అనుచరగణం…
సాహస మంత్రమే నా జవజీవము
సమయము చూడని సమరమిది
సాయుధ యంత్రమే లోహపు దేహము
నా కథయే విధి గెలవనిది.
చిత్రం: కల్కి (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సంజిత్ హెడ్గే, ధీ
సృష్టికే అస్సలంతు చిక్కని
అందాలనందుకున్న
ఆహా, ఆశ్చర్యమే నింగికీ నేలకీ
మధ్య ఊయలూగుతున్న
ఇన్ని వింతలన్నీ
ఒక్క ఈ చోటే చేరాయెలా
ఆ ఆ ఆ ఆ ఆ
స్వర్గమే నన్ను స్వాగతించెనే
పాదాలు మోపగానే
రాజా వైభోగమే
చెంపలే మీటెనే నన్ను చూసి చూడగానే
పలకరించే నన్నే
పంచభూతాలు నేస్తాలుగా
ఆ ఆ ఆ ఆ ఆ
అబ్బబ్బ తీరిపోయే ఇన్నాళ్లు కన్న కలా
ఆ: ఊ ఊ ఊ ఊ ఊ
ఊఊ ఊ ఊ ఊ
చిత్రం: అగ్ని పర్వతం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: కృష్ణ, విజయశాంతి, రాధ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: సి.అశ్వినీదత్
విడుదల తేది: 11.01.1985
Songs List:
ఈ గాలిలో...పాట సాహిత్యం
చిత్రం: అగ్ని పర్వతం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, ఎస్.జానకి
పల్లవి:
ఈ గాలిలో... ఓఓ ఓఓ...
ఈ గాలిలో... ఓఓఓ...
ఎక్కడో అలికిడి అక్కడే అలజడి
మత్తుగా తడబడి మెత్తగా జతపడి
కట్టెను కౌగిలి ఒక వంక
తట్టెను చెక్కిలి నెలవంక
ఏమౌతదో ఏమటో... ఓ...
ఈ గాలిలో... ఓఓ ఓఓ...
ఈ గాలిలో... ఓఓఓ...
ఎక్కడో అలికిడి... అక్కడే అలజడి...
మత్తుగా తడబడి మెత్తగా జతపడి
చెక్కిలి గుంతలు ఒక వంక చక్కిలి గింతలు ఒక వంక...
ఈ కాస్తకే ఎందుకో... ఓ...
ఈ గాలిలో... ఓఓఓ...
చరణం: 1
నవ్వినవేళా మధుమాసంలో విరబూసే నా కోర్కెలే
పూవు నేను పుట్టిననాడే వాలాము నీ పక్కనే
వేసవి ఒడిలో వెన్నెల జడిలో
తనువులు కలిపే
పెదవుల ముడిలో
నీ ప్రేమ పందిళ్లలో... ఓ...
ఈ గాలిలో... ఓఓఓ..
చరణం: 2
తాకినచోట తాంబూలంలా
ఎరుపెక్కెనే చెక్కిలీ
పొద్దూ ముద్దూ పుట్టేచోటా
ఎరుపెక్కవా దిక్కులే
ఎదచలి పెరిగే ఎదరకు జరిగే
కథ ఇక మొదలై కౌగిట బిగిసే
ఈ సందె సయ్యాటలో... ఓ...
ఈ గాలిలో... ఓఓఓ...
గోడదూకి వచ్చాను చందమామ పాట సాహిత్యం
చిత్రం: అగ్ని పర్వతం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు
గోడదూకి వచ్చాను చందమామ
ఇదే ఇదే రగులుతున్న పాట సాహిత్యం
చిత్రం: అగ్ని పర్వతం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు
పల్లవి:
ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం
ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం
ఇదే ఇడె మండుతున్న మానవ హౄదయం
రక్తంతో రాసుకున్న రాక్షస గీతం
చరణం: 1
సప్త తాలముల చాటునా
సర్వ ధర్మములు మరిచి
వంచనతొ వాలి వధ గావించిన
స్వార్ధపరుడు ఈ రాముడు కాదా
అది కాదా నేరం దానికి లేదా శిక్ష
రధ చక్రం కుంగినప్పుడు
వక్ర ధర్మమును అనుసరించి
రాధేయుడిని చంపించిన రాజకియ
సుత్రధారి ఈ కృష్ణుడు కాదా
అది కాదా పాపం దానికి లేదా శిక్ష
ఇదేన భవయామి ధర్మం
ఇదేనా రక్షయామి చట్టం
ఆ డెవుడి పాపాలే లొఖానికి పుణ్యమా
ఆ దేవుడి ధర్మమును నే చేస్తే నేరమా
చరణం: 2
కన్న తల్లి కన్నీళ్లకు
ఏ ఖరిదు కటింది కసాయి లోఖం
అదా లొక ధర్మం ఇదా మీకు న్యాయం
తప్పటడుగులు వేస్తు
తల్లి శవం లాగినప్పుడు
కరుణించిందా సంఘం
ఇది కాదా ధారుణం
ఇది కాదా అక్రమం
ఇదేనా సకల వేద సారం
ఇదేనా వేదవిహిత ధర్మం
దానవ మానవ సంగటు
ధర్మానికి లొంగనా
రగులుతున్న హౄదయాగ్ని
నేనే బలి అవ్వనా
రావే ఇంగ్లీష్ రంబ పాట సాహిత్యం
చిత్రం: అగ్ని పర్వతం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు
రావే ఇంగ్లీష్ రంబ
వయ్యారాలు సింగారాలు పాట సాహిత్యం
చిత్రం: అగ్ని పర్వతం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు
వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాలు
వేయి వేయి చెయ్యి వేయి పాట సాహిత్యం
చిత్రం: అగ్ని పర్వతం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు
వేయి వేయి చెయ్యి వేయి నంబర్ వన్
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: మహేష్ బాబు, అల్లరి నరేష్ ,పూజా హెగ్డే
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాతలు: దిల్ రాజు, అశ్వినీదత్, పొట్లూరి వర ప్రసాద్
విడుదల తేది: 09.05.2019
Songs List:
పదర పదర పదరా పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: శంకర్ మహదవన్
భల్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోనా
ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన
సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే
పదర పదర పదరా
నీ అడుగుకి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదరా
ఈ పుడమిని అడిగి చూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా
నీ కథ ఇదిరా నీ మొదలిది రా
ఈ పథమున మొదటడుగేయిరా
నీ తరమిదిరా అనితరమిదిరా అని చాటెయ్ రా
పదర పదర పదరా
నీ అడుగుకి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదరా
ఈ పుడమిని అడిగి చూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా
ఓ భల్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోనా
ఎడారి కళ్లు తెరుచుకున్న వేళన చినుకు పూల వాన
సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టి నేలనే
కదిలే ఈ కాలం తన రగిలే వేదనకీ
బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా
పగిలే ఇల హృదయం తన ఎదలో రోదనకీ
వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా
కనురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక
విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా
పదర పదర పదరా
ఈ హలమును భుజము కెత్తి పదరా
ఈ నేలను ఎదకు హత్తుకుని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా
పదర పదర పదరా
ఈ వెలుగను పలుగు దించి పదరా
పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు భూములిక
మెతుకులిచ్చు కదరా
నీలో ఈ చలనం మరి కాదా సంచలనం
చినుకల్లే మొదలయి ఉప్పెన కాదా ఈ కథనం
నీలో ఈ జడికి చెలరేగే అలజడికి
గెలుపల్లే మొదలయి చరితగ మారే నీ పయనం
నీ ఆశయమే తమ ఆశ అని
తమకోసమనీ తెలిసాకా
నువ్వు లక్ష్యమని తమ రక్షవనీ
నినదించేలా
పదర పదర పదరా
నీ గతముకు కొత్త జననమిదిరా
నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలి పునాది
గది తలుపు తెరిచి పదరా
పదర పదర పదరా
ప్రతొక్కరి కథవు నువ్వు కదరా
నీ ఒరవడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు
సాగుబడికి బడిరా
తనను తాను తెల్సుకున్న హలముకు పొలముతో ప్రయాణం
తనలోని రుషిని వెలికి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవో
చోటి చోటి బాతే పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: దేవి శ్రీ ప్రసాద్
చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే (2)
ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే
ఈ చెలిమికే కాలమే చాలదే
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు (2)
చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
ఓ మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
హో యే
ఆటలాగ పాటలాగ నేర్చుకుంటే రానిదంట
స్నేహమంటే ఏమిటంటే
పుస్తకాలు చెప్పలేని పాఠం అంట
కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్లదంట
నేస్తమంటే ఏమిటంటే
కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంటా
ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం
నీలో ప్రతి వంటరి తరుణం చెరిపేస్తూ...
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు
చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
చోటి చోటి బాతే బాతే
మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
మీటి మీటి యాదే యాదే
గుర్తులేవి లేనినాడు బ్రతికినట్టు గుర్తురాదే
తియ్యనైన జ్ఞాపకాల్లా
గుండెలోన అచ్చ ఏమి సావాసాలే
బాధలేవి లేనినాడు నవ్వుకైనా విలువుండదే
కళ్ళలోన కన్నీళ్ళున్నా
పెదవుల్లో నవ్వు చెరగదు స్నేహం వల్లే
నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగ కంటూ
నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు
చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
చోటి చోటి బాతే బాతే
మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
మీటి మీటి యాదే యాదే
నువ్వే సమస్తం పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: యజిన్ నజీర్
నువ్వే సమస్తం
ఎవరెస్ట్ అంచున పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: వేదాల హేమచంద్ర , విష్ణుప్రియ రవి
కల గనే కలలకే కనులనే ఇవ్వనా
ఇది కలే కాదని రుజువు నే చూపనా
ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే
ఓ చిరునవ్వే విసిరిందే
టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే
నాతో ప్రేమలో చిక్కానంటుందే
నాలో నుంచి నన్నే తెంచి
మేఘంలోంచి వేగం పెంచి ఎత్తుకుపోతుందే
ఓ ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే
ఓ చిరునవ్వే విసిరిందే
టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే
నాతో ప్రేమలో చిక్కానంటుందే
కలగనే కనులకే కనులనే ఇవ్వనా
ఇది కలే కాదని రుజువునే చూపనా
హు వజ్రాలుండే ఘనిలో
ఎగబడు వెలుతురులేవో
ఎదురుగ నువ్వే నడిచొస్తుంటే
కనబడునా కళ్ళల్లో
వర్ణాలుండే గదిలో - గదిలో
కురిసే రంగులు ఏవో - ఏవో
పక్కన నువ్వే నిలబడి ఉంటే మెరిసే
నా చెంపల్లో - ఎల్లో
నోబెల్ ప్రైజ్ ఉంటే నీకై ఫ్రీజ్ అంటే వలపుల సబ్జెక్ట్ లో
ఓ ఎవరెస్ట్ అంచున పూసిన రోజా
పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే
టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే
నాతో ప్రేమలో చిక్కానంటుందే
కలగనే కనులకే కనులనే ఇవ్వనా
ఇది కలే కాదని రుజువునే చూపనా
ఫిర్ షురు పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: బెన్నీ దయాల్
ఫిర్ షురు
పాల పిట్టలో వలపు పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఎమ్. ఎమ్. మనసి, రాహుల్ సిప్లిగంజ్
ఏవో గుస గుసలే నాలో
వలసి విడిసి వలపే విరిసే ఎదలో...
హొయ్ పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే
పిల్లా నా గుండెల్లోనా ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే
కొండలంచులో మెరుపు
నీ చురుకు చూపులో చేరిందే
గడపకద్దిన పసుపు
నీ చిలిపి ముద్దులా తాకిందే
మలుపు తిరిగి నా మనసిట్ఠా
నీవైపుకి మళ్ళిందే
పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్ని ఎల్లా గొట్టేసినావే
విల్లు లాంటి నీ ఒళ్ళు
విసురుతుంటే బాణాలు
గడ్డి పరకపై అగ్గి పుల్లలా
భగ్గుమన్నవే నా కళ్ళు
నీ మాటలోని రోజాలు
గుచ్చుతుంటే మరి ముళ్ళు
నిప్పు పెట్టిన తేనె పట్టులా
నిద్ర పట్టదే రాత్రుళ్ళు
నీ నడుము చూస్తే మల్లె తీగ
నా మనసు దానినల్లే తూనీగ
మెల్ల మెల్లగా చల్లినావుగా
కొత్త కళలు బాగా
పిల్లా నా గుండెల్లోన ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే
పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే
పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్ని ఎల్లా గొట్టేసినావే
ఇదే కదా ఇదే కదా నీ కథ పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: విజయ్ ప్రకాష్
ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
నీ కంటి రెప్పలంచునా
మనస్సు నిండి పొంగిన..
ఓ నీటి బిందువే కదా
నువు వెతుకుతున్న సంపద..
ఒకొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆయువుందిగా
ఇంకెన్ని ముందు వెచెనో
అవన్నీ వెతుకుతూ... పదా
మనుష్యులందు నీ కథా
మహర్షిలాగా సాగదా
మనుష్యులందు నీ కథా
మహర్షిలాగా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
నిస్వార్థమెంత గోప్పదో
ఈ పధము రుజువు కట్టదా
సిరాలు లక్ష ఒంపదా
చిరాక్షరాలు రాయదా
నిశీధి ఎంత చిన్నదో
నీ కంటి చూపు చెప్పదా
నీ లోని వెలుగు పంచగ
విశాల నింగి చాలదా
మనుష్యులందు నీ కథా
మహర్షిలాగా సాగదా
మనుష్యులందు నీ కథా
మహర్షిలాగా సాగదా
నువ్వని ఇది నీదని పాట సాహిత్యం
చిత్రం: మహర్షి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కార్తీక్
నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా
కాదుగా నువనుకుంది ఇది కాదుగా నువెతికింది
ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నా వా
కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువ్వడిగినది
ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే
ఒంటరిగా నేర్చాడా ఎవడైనా
ఓ సాయం అందుకొని సాగేదె బ్రతుకంటె
ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా
పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా
నిను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా
నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా
కాదుగా నువనుకుంది ఇది కాదుగా నువెతికింది
ఓ ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నా వా
కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువడిగినది
ఓ....ఓ....ఓ....ఓ....
ఓ ఊపిరి మొత్తం ఉప్పెనలా పొంగిందా
నీ పయనం మళ్ళీ కొత్తగ మొదలయ్యిందా
ఇన్నాళ్ళు ఆకాశం ఆపేసిందా
ఆ ఎత్తే కరిగి నేలే కనిపించిందా
గెలుపై ఓ గెలుపై నీ పరుగే పూర్తైనా
గమ్యం మిగిలే ఉందా
రమ్మని నిను రమ్మని ఓ స్నేహమే పిలిచిందా
ఎన్నడూ నిను మరువనిది
ఎప్పుడూ నిను విడువనిది
ప్రేమని తన ప్రేమని నీ కోసమే దాచిందిగా
గుండెలో గురుతైనదీ గాయమై మరి వేచినది
లోకాలే తలవంచి నిన్నే కీర్తిస్తున్నా
నువు కోరే విజయం వేరే ఉందా
నీ గుండె చప్పుడుకే చిరునామా ఏదంటే
నువు మొదలయిన చోటును చూపిస్తోందా
నువ్వొదిలెసిన నిన్నలలోకి అడుగె సాగేనా
నువు సాధించిన సంతోషానికి అర్థం తెలిసేనా
చిత్రం: అడవి సింహాలు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: కృష్ణంరాజు, కృష్ణ, జయప్రద, శ్రీదేవి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: సి.అశ్వనీదత్
విడుదల తేది: 28.04.1983
Songs List:
అగ్గిపుల్ల భగ్గుమంటది పాట సాహిత్యం
చిత్రం: అడవి సింహాలు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, యస్. జానకి
పల్లవి:
హా..అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ..ఓ..ఓ..
హ..హ..హ..హ..అగ్గిపుల్ల చీకటింటికే
హ..హ..హ..హ..ఆడపిల్ల కౌగిలింతకే
చీకటింటిలో... కౌగిలింతలో ..నీ చింత తీర్చేసుకో
అహా..అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..
హ..హ..హ..హ..అగ్గిపుల్ల అంటుకుంటదీ ..
హ..హ..హ..హ..ఆడపిల్ల జంటగుంటదీ...
అందమిప్పుడే అంటగట్టుకో ..నీ ముద్దు తీర్చేసుకో
అహా..అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ..ఓ..ఓ..
చరణం: 1
చూపు తాకిడి సుఖమేముందీ.. చేయి అలజడి నీ ఇష్టం
నిలువు దోపిడి సగమైపోయే.. చూసుకో మరి నా ఇష్టం
చూపు తాకిడి సుఖమేముందీ.. చేయి అలజడి నీ ఇష్టం
నిలువు దోపిడి సగమైపోయే.. చూసుకో మరి నా ఇష్టం
దొంగ చేతిలో తాళం ఉందీ.. తాళం ఎప్పుడూ కప్పుకు ఉందీ..
అంగుళానికో అందం ఉందీ.. బేరమప్పుడే పెంచుతు ఉంది
చౌక బేరమే ..సోకు లాభమే...ఘరానాదొంగకి
అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..
హ..హ..హ..అగ్గిపుల్ల చీకటింటికే
హ..హా...ఆడపిల్ల కౌగిలింతకే
చీకటింటిలో... కౌగిలింతలో ..నీ చింత తీర్చేసుకో
అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..
చరణం: 2
దోరసరుకులు దొరుకుతు ఉన్నా.. దొంగ సరుకే నాకిష్టం
అలక ముద్దులు అడిగే కన్నా.. దోచుకుంటే నా కిష్టం
దోరసరుకులు దొరుకుతు ఉన్నా.. దొంగ సరుకే నాకిష్టం
అలక ముద్దులు అడిగే కన్నా.. దోచుకుంటే నా కిష్టం
కంటి చూపులో గారం ఉందీ... వంటి నిండ బంగారం ఉందీ...
కన్నె చూడనీ నేరం ఉందీ... కమ్ముకుంటే శృంగారం ఉందీ..
సొంత లాభము కొంత మానుకో... చలానా వేళకి..
అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..
హ..హ..హ..హ..అగ్గిపుల్ల చీకటింటికే
హ..హ..హ..హ..ఆడపిల్ల కౌగిలింతకే
చీకటింటిలో... కౌగిలింతలో.. నీ చింత తీర్చేసుకో
అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..ఓ..
ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..ఓ..
క్షేమమా.. ప్రియతమా.. పాట సాహిత్యం
చిత్రం: అడవి సింహాలు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల
పల్లవి:
ఏహే ఏహే లాలలాలలా
ఆహా ఆహా లాలలాలలా
క్షేమమా.. ప్రియతమా..
సౌఖ్యమా.. నా ప్రాణమా....
కుసుమించే అందాలు.. కుశలమా...
వికసించే పరువాలు.. పదిలమా..
మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా
మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా
క్షేమమా.. ప్రియతమా ..
సౌఖ్యమా.. నా ప్రాణమా....
కుసుమించే అందాలు.. కుశలమా...
వికసించే పరువాలు.. పదిలమా..
మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా
మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా..
క్షేమమా.. ప్రియతమా ..
సౌఖ్యమా.. నా ప్రాణమా....
చరణం: 1
నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక.. కుశలమా
అడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక.. పదిలమా
నీ లోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు.. క్షేమమా..
నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక.. కుశలమా
అడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక.. పదిలమా
నీ లోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు.. క్షేమమా..
చలి గాలి గిలిగింత సౌఖ్యమా..
చెలి మీద వలపంతా సౌఖ్యమా..
నీ క్షేమమే..నా లాభము ..
నీ లాభమే..నా మోక్షము
క్షేమమా.. ప్రియతమా ..
సౌఖ్యమా.. నా ప్రాణమా....
కుసుమించే అందాలు.. కుశలమా...
వికసించే పరువాలు.. పదిలమా..
మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా
మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా..
చరణం: 2
కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి.. కుశలమా
నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు.. పదిలమా
నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా
కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి.. కుశలమా
నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు.. పదిలమా
నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా
తహతహలు తాపాలు.. సౌఖ్యమా..
బిడియాలు బింకాలు.. సౌఖ్యమా
నీ సౌఖ్యమే.. నా సర్వమూ ..
ఆ సర్వమూ.. నా సొంతమూ..
క్షేమమా.. ప్రియతమా ..
సౌఖ్యమా.. నా ప్రాణమా..
కుసుమించే అందాలు కుశలమా.. వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా.. చూసిపోవే నన్ను సుప్రభాతమా
క్షేమమా.. ప్రియతమా ..
సౌఖ్యమా.. నా ప్రాణమా..
కుసుమించే అందాలు కుశలమా.. వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా.. చూసిపోవే నన్ను సుప్రభాతమా
పిల్ల నచ్చింది పాట సాహిత్యం
చిత్రం: అడవి సింహాలు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల
పిల్ల నచ్చింది
గంట కొట్టిందాపాట సాహిత్యం
చిత్రం: అడవి సింహాలు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల
గంట కొట్టిందా
గూటిలోకి చేరేది ఎప్పుడు పాట సాహిత్యం
చిత్రం: అడవి సింహాలు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల
గూటిలోకి చేరేది ఎప్పుడు
ఆరి తేరిపోయాడమ్మ పాట సాహిత్యం
చిత్రం: అడవి సింహాలు (1983)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల
ఆరి తేరిపోయాడమ్మ
పల్లవి:
నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు
నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు
మన మధ్యలో ప్రేమన్నది
ఈ మధ్యలో తెలిసిందది
మనసిచ్చేస్తున్నది తెలుసు
ప్రేమించేస్తున్నది తెలుసు
ప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదు
మనసిచ్చేస్తున్నది తెలుసు
ప్రేమించేస్తున్నది తెలుసు
ప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదు
నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు
మన మధ్యలో ప్రేమన్నది
చరణం: 1
నిను చూస్తేనే నవ్వాలియని నా పెదవికి తెలిసింది
నువు వస్తే ఎగరాలి అని పైటకి తెలిసింది
నీ మాటే పలకాలి అని గొంతుకి తెలిసింది
లేకుంటే ఆగాలి అని గుండెకి తెలిసింది ఓహోహో
జరగంది జరుగుతున్నది జరిగేది తెలియకున్నది
తెలిసింది గొప్పగున్నది అంతే..
కొంతేగా తెలుసుకున్నది ఇంకెంతో మిగిలి ఉన్నది
ఎంతైనా ప్రేమ అన్నది ఇంతే...
నీ మనసేంటో తెలుసు
నీకు నా మనసేంటో తెలుసు
మనసైనది మనదైనది
చరణం: 2
ఇటువైపే చూడొద్దు అని లోకానికి తెలిసింది
ఈ జతని చేరొద్దు అని దూరానికి తెలిసింది
ఈ క్షణమే కరగొద్దు అని కాలానికి తెలిసింది
తలవంచే తీరాలి అని తలరాతకు తెలిసింది ఓహోహో..
భావంగా ఉండబోనని రూపాన్నే పొందుతానని
మనలాగ మారుతున్నది ప్రేమ
ప్రేమల్లో ఎన్ని మహిమలో
ప్రేమిస్తే ఎన్ని మలుపులో
మనసుంటే తెలుసుకుంటది ప్రేమ
నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు
నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసు
మన మధ్యలో ప్రేమన్నది
ఈ మధ్యలో తెలిసిందది
మనసిచ్చేస్తున్నది తెలుసు
ప్రేమించేస్తున్నది తెలుసు
ప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదు
మనసిచ్చేస్తున్నది తెలుసు
ప్రేమించేస్తున్నది తెలుసు
ప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదు
నీ మనసేంటో తెలుసు
నీకు నా మనసేంటో తెలుసు
మనసైనది మనదైనది