-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Aamani"



చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: సీతారామశాస్త్రి, జాలాది, భువనచంద్ర
గానం: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాసూరావు
నటీనటులు: ఘట్టమనేని రమేష్ బాబు, సౌందర్య, ఆమని
దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాత: ఘట్టమనేని హనుమంతరావు
విడుదల తేది: 30.07.1993



Songs List:



ఏమని చెప్పనులే పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: జాలాది 
గానం: ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

ఏమని చెప్పనులే 



సందింట్లో సరిగమ పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలు 

సందింట్లో సరిగమ




ఆ నింగి పుట్టినరోజే... పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర 
గానం: ఎస్.పి.బాలు 

ఆ నింగి పుట్టినరోజే...




కనరండి కళ్యాణం పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలు 

కనరండి కళ్యాణం



రా రంభోలా పాట సాహిత్యం

 
చిత్రం: అన్న చెల్లెలు (1993)
సంగీతం: సాలూరి వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర
గానం: కె.ఎస్.చిత్ర, వాసూరావు

రా రంభోలా

Palli Balakrishna Saturday, May 16, 2026



చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
నటీనటులు: జగపతి బాబు, ఆమని, ఇంద్రజ, కృష్ణ
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
నిర్మాత: ఎం.వి.లక్ష్మి, ఎడిటర్ మోహన్
విడుదల తేది: 20.10.1995



Songs List:



గో గో గోపాల పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత జూనియర్ 

(ఇంద్రజ, కృష్ణ లపై చిత్రీకరించారు)

గో గో గోపాల



ఈ భందనాల నందనాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు

ఈ భందనాల నందనాన్ని 



ఘల్ ఘల్ అను పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఘల్ ఘల్ అను




ఓసి మిస్సో ఓని మిస్సో పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఓసి మిస్సో ఓని మిస్సో 



ఓ మామ పాట సాహిత్యం

 
చిత్రం: శుభమస్తు (1995)
సంగీతం: కోటి 
సాహిత్యం: డి.నారాయణ వర్మ
గానం: రాధిక, మురళి

ఓ మామ
పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి 

Palli Balakrishna Thursday, November 23, 2023



చిత్రం: నారాయణ & కో (2023)
సంగీతం: నాగ వంశి
నటీనటులు: సుధాకర కోమకుల, ఆమని 
దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి 
నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్, సుధాకర కోమకుల 
విడుదల తేది: 2023



Songs List:



డండక డం డం పాట సాహిత్యం

 
చిత్రం: నారాయణ & కో (2023)
సంగీతం: నాగ వంశి
సాహిత్యం: పూర్ణ చారి 
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

ఏ, డండక డం డం
డండక డం డం
డండక డం డం
డామ్ డండక డం డం

హరిలో రంగ హరి
తగిలింది లాటరీ
నారాయణ అండ్ కో అంటె
రిచ్చో రిచ్చు ఫ్యామిలీ

ఏ, డండక డం డం
డండక డం డం
డండక డం డం
డామ్ డండక డం డం

హే అదృష్టంగా సిరి
చేరింది నా ధరి
చిటికెల్లో లైఫే మారే మాయే
జరిగిందే మరి

తప్పుకోడా అంబానీ
తోపు మేమే అనుకొని
టాప్ వన్ మనమేనంటూ
కుమ్మేద్దాము దునియాని

ఆడినాము టీ ట్వంటీ
ఆడమాకు నా పోటీ
ఆడి, బెంజ్, బి.ఎం.డబ్ల్యు
నింపెయ్యాలి బాల్కనీ

అరె సున్ సున్ సున్రే బాసు
ఇక లైఫంతా బిందాసు
కరుణించింది కాసు
మరి మన కజినే బిల్ గేట్స్

సున్ సున్ సున్రే బాసు
ఇక లైఫంతా బిందాసు
కరుణించింది కాసు
మరి మన కజినే బిల్ గేట్స్ఏ

ఏ, డండక డం డం
డండక డం డం
డండక డం డం
డామ్ డండక డం డం

ఏ, డండక డం డం
డండక డం డం
డండక డం డం
డామ్ డండక డం డం

కింగాది కింగు వలె
సింహాసనమెక్కేస్తా
శ్రీ కృష్ణరాయలనే గుర్తే చేస్తా
బులియన్ మార్కెట్టులోనే
మిలియన్లే పెట్టేస్తా
డాలర్నే రూపీతో తూకం వేస్తా

కెమెరా… నా కళ్ళకు కట్టి
కొమోడో… డ్రాగన్ నే పట్టి
కాన్వాస్… పైన్నే గిస్తా
పిల్లా నీ బ్యూటీ

కాన్వా… తో పాట కచేరి
సైన్మా… నను మెచ్చిన జ్యూరీ
గ్రామీ… లో హార్మొనియమే
సరిగమపదననిస లే

ఇల్లు కాదిది దర్బారు
గల్లీలోనే తీస్మారు
పాట పాడి పొగిడి పొగిడి
కొడతారయ్యో తీన్మారు

నాకు నేనే సామ్రాటు
గోల్డు ప్లేటులో సాపాటు
లక్కుకొద్ధి దొరికిందయ్యో
ఎవరు చూడని జాక్‌పాటు

సున్ సున్ సున్రే బాసు
ఇక లైఫంతా బిందాసు
కరుణించింది కాసు
మరి మన కజినే బిల్ గేట్స్

సున్ సున్ సున్రే బాసు
ఇక లైఫంతా బిందాసు
కరుణించింది కాసు
మరి మన కజినే బిల్ గేట్స్ఏ

ఏ, డండక డం డం
డండక డం డం
డండక డం డం
డామ్ డండక డం డం

ఏ, డండక డం డం
డండక డం డం
డండక డం డం
డామ్ డండక డం డం

Palli Balakrishna Friday, June 2, 2023



పాట: నువ్వే కావలి అమ్మ 
సంగీతం: సందీప్ సన్ను
సాహిత్యం: రంజిత్ కుమార్ రిక్కి
గానం: సందీప్ సన్ను, సోనీ ఆరే
ఆర్టిస్ట్స్: మానస్ , ఆమని, లికిత్ సాయిరాం కాసర్ల
దర్శకత్వం: సందీప్ సన్ను
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 21.02.2023



నువ్వే కావలి అమ్మ పాట సాహిత్యం

 
పాట: నువ్వే కావలి అమ్మ 
సంగీతం: సందీప్ సన్ను
సాహిత్యం: రంజిత్ కుమార్ రిక్కి
గానం: సందీప్ సన్ను, సోనీ ఆరే

లాలి జోజో కన్నా
జోజో లాలీ కన్నా
నాకన్నీ నువ్వే నాన్న
నీకంటే ఏదీ మిన్నా

ప్రాణమంత పోసి నాకు ఇచ్చినావే జన్మ
నువ్వు లేని లోకమంత చిమ్మచీకటమ్మ
కంటి నీరు పిలుపుకైనా పలకవెందుకమ్మ
దేవుడైనా ఇవ్వలేడు అమ్మలాంటి ప్రేమ

తిరిగివచ్చి నాకు జోల పాడవమ్మ
అమ్మలేని ప్రేమకు ఆయువెందుకమ్మ
వెలుగు లేక వెల్లిపోయే నింగి జాబిలమ్మ
మళ్ళి వచ్చి ఒక్కసారి ప్రేమ పంచవమ్మ

నువు లేక ఆగిపోయే
కాలమంతా ఏకాంతంగా
పసివాన్ని వదిలేసి వెళ్లిపోకమ్మా

నువ్వే కావాలమ్మా
నీతో ఉండాలమ్మా
నా ప్రాణం నువ్వేనమ్మా
నా సర్వం నువ్వేనమ్మా

విశ్వమంతా నువ్వు లేని క్షణం
ఆగిపోయే అంతులేని జీవం
జాలి చూపి టెన్ టు ఫైవ్ తిరిగిరావమ్మా
క్షణమే చూపలేవా నిండు చందమామ
గుర్తు లేదు కన్నపేగు ప్రేమ
గుండె నిండా కొలువు తీరేనా కన్నీరే

నడిపించావులే లాలించావులే
నేనే ప్రాణమని జీవించావులే
ఆనందమేదో చూపించావులే
గతమే మళ్ళీ రాదే హో

కవ్వించావులే సహించావులే
నాకోసమే నువు తపించావులే
నీ త్యాగమేదో తెలిసెలోపలే
తనువు వదిలినావే హే

Palli Balakrishna Saturday, May 27, 2023




చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: జగపతిబాబు, ఆమని, రోజా
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: కె.వెంకటేశ్వరరావు
విడుదల తేది: 25.09.1994



Songs List:



ఘల్లు ఘల్లు పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: విశ్వనాధ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఘల్లు ఘల్లు 




అల్లుకుపోవే పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: యస్.పి.బాలు, చిత్ర 

అల్లుకుపోవే  ఓసి మల్లెతీగ 




అల్లరి తుమ్మెద పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: యస్.పి.బాలు, చిత్ర 

అల్లరి తుమ్మెద 




చిలకా ఏ తోడు లేక పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

చిలకా ఏ తోడు లేక ఎటెపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటీ ఆశల వెనక 
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్ జారాకా 
లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మెశాక 

గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా
బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే
గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా
బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే
వెలుగుల్నె వెలివెసే కలలోనే జీవించావే 
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహాలం పొందావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలొ తడిసీ కనుమరుగైనావే 

కొండంత అండ నీకు లేదింక కొండంత అండ నీకు లేదింక 
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో 
మమకారం విలువెంతో మరీచావా సిరి మైకంలో 
ఆనందం కొనలేని ధన రాసితో 
అనాధగా మిగిలావే అమవాసలో
తీరా నువ్వు కను తెరిచాకా తీరం కనబడదే ఇంకా 



పొరుగింటి మంగళ గౌరి పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పొరుగింటి మంగళ గౌరి 
వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు
ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు
నాగ నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు
మనకు మల్లే ఎవరు ఉన్నారు
ఉసూరంటూ ఇలా ఎన్నాళ్ళు
మన బతుకేమో ఇట్టా తగలబడింది
ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది

పక్కాళ్ళ పాడు గోల పట్టించుకోవద్దే
పొరుగింటి పుల్లకూర తెగ మెచ్చుకోవద్దే
నెత్తిన పెట్టుకు చూసే మొగుడు నీకూ ఉన్నాడే
అందని పళ్లకు అర్రులు చాచి అల్లరి పడొద్దే
మనకి లేక అదో ఏడుపా
పరులకుంటే మరో ఏడుపా
ఎందుకే ఇట్టా రోజు మెదడు తింటావు
ఇంటి గుట్టంతా వీధిని పెట్టుకుంటావు

ఓ... ఓ... ఓ....
కాంతమ్మ గారు కట్టే చీర ఖరీదైనా
లేదే పాపం తమ జీతం
నేత చీర కట్టుకున్నా కొట్టవచ్చినట్టు ఉందే
అందం నీ సొంతం
ఉత్తి మాటలెన్ని అన్నా నా సరదా తీరదుగా
ఉన్నదానితోనే మనం సర్డుకుంటే మంచిదిగా
కట్టుకున్నదాని సంబరం 
తీర్చడమే పురుష లక్షణం
సంపదలోనే లేదు సంతోషం
చంపకే నన్ను నీ డాబు కోసం

పలానా వారి మిస్సెస్ అంటూ అంతా మెచ్చుకుంటే మీకే గొప్ప కాదా
ఆ బోడి పదవికని అప్పో తప్పో చెయ్యమంటే
ఊళ్ళో పరువు పోదా
ఖానీకి కొరగాని పరువూ ఓ పరువేనా
మగాణ్ణి తూచేది వాడి పర్స్ బరువేనా
డబ్బు లేని దర్పమెందుకు
చేతగాని శౌర్యమెందుకు
నీకు మొగుడయ్యే యోగ్యత మనిషికి లేదే
ఇనప్పెట్టెనే వరించి ఉండాల్సిందే



చినుకు చినుకు అందెలతో పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, చిత్ర

(మాయలోడు (1993) సినిమాలో ఈ పాటని ఈ సినిమాలో మళ్ళీ వాడటం జరిగింది. మాయలోడు సినిమాలో సౌందర్య, బాబూమోహన్ పై ఈ పాట చిత్రీకరణ జరిగింది, ఈ సినిమాలో ఆలీ, సౌందర్య పై  ఈ పాట చిత్రీకరణ జరిగింది.)

పల్లవి:
చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చరణం: 1
నింగి నేల ఈవేల చలికి వనికి పోతుంటే 
బిగికౌగిలి పొదరింటికి పద పద మంది 
ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండకాసె ఏలో
అరెయ్ పైన మొబ్బు ఉరిమింది 
పడుచు జింక బెదిరింది 
వలవేయక సెలయేరై పెనవేసింది 
అరెయ్ చినుకమ్మ మెరుపమ్మ ఏలో
చిటుకేసే బుగ్గమీద ఏలో 
తలపు తొలివలపూ ఇక తకజమ్ తకజమ్
వయసూ తడి సొగసూ అరవిరిసే సమయమ్  
ఆహ - ఊహూ,  ఓహొ హొ హొ

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చరణం: 2
మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది 
యదలోపల చలిగాలుల సుడిరేగింది 
వానొచ్చే వరదొచ్చే ఏలో 
వయసంటే తెలిసొచ్చే ఏలో
నేలచూపు పోయింది వాలుచూపుసై అంది 
చలికోరిక అలఓకగ తల ఊపింది
అరెయ్ సరసాల సింధులోన ఏలో 
సరిగంగ తానాలు ఏలో 
ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే 
సరసానికి  దొరసానికి ముడిపెడుతుంటే 
ఆహా - ఊహూ
ఓహో హొ హో 

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా


Palli Balakrishna Saturday, December 25, 2021




చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
నటీనటులు: కార్తిక్ రత్నం, నవీన్ చంద్ర, సూహాష్, సాయి కుమార్, కృష్ణ ప్రియ, ఆమని
దర్శకత్వం: రవీంద్ర పుల్లే
నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ
విడుదల తేది: 11.06.2021 (AHA)



Songs List:



రాయే ఎన్నెలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: రెహమాన్
గానం: శక్తి లోగనాధం

రాయే ఎన్నెలమ్మ 



ఏ కన్నులు చూడనీ చిత్రమే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: రెహమాన్
గానం: సిద్ శ్రీరామ్

పల్లవి:
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

చరణం: 1
ఎంత దాచుకున్నా పొంగిపోతువున్నా
కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా
దారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నా
నువ్వు చూడగానే దాగిపోతువున్నా
నినుతలచి ప్రతినిమిషం
పరవశమై పరుగులనే
తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా...

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

చరణం: 2
రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వునవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండుకళ్ల నిండా
నిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిదీ తెలియదులే
మనసుకిదీ మధురములే
నాలో నే మురిసి ఓవేకువలా
వెలుగైవున్నా..!

అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే

ఏ కన్నులు చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే



ఎర్రని సూరీడే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: లక్ష్మీ ప్రియాంక
గానం: మోహన భోగరాజు

అరె..! ఎర్రని సూరీడే
పొద్దంతా సిందేసి నిదరోయాడే
హే..! మా సక్కాని చంద్రుడే
రేయంతా ఆడంగా లేస్తున్నాడే

ఒంటి మీద జారుతున్న సెమట సుక్కలే
సుతారంగా మెరిసిపోయే నింగి సుక్కలై
డొక్కా లోకి జారుకుంటే గంజి మెతుకులే
రెక్కలొచ్చినట్టు పొంగిపోవా బతుకులే

ఎర్రని సూరీడే
పొద్దంతా సిందేసి నిదరోయాడే
మా సక్కాని చంద్రుడే
రేయంతా ఆడంగా లేస్తున్నాడే

ఒంటి మీద జారుతున్న సెమట సుక్కలే
సుతారంగా మెరిసిపోయే నింగి సుక్కలై
డొక్కా లోకి జారుకుంటే గంజి మెతుకులే
రెక్కలొచ్చినట్టు పొంగిపోవా బతుకులే



కాలం అడిగే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: రెహమాన్
గానం: అనురాగ్ కులకర్ణి 

కాలం అడిగే మనిషంటే ఎవరు




నీ ప్రేమనే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా A.I.S
సాహిత్యం: రెహమాన్
గానం: ఆంటోని దాసన్

రప్పప్పప్పా రప్పప్ప రప్పప్పా రప్పప్పప్పా
రప్పప్పా రప్పప్ప రప్పప్పప్పా (2)

నీ ప్రేమనే తేలిపే ఆ పువ్వు ఎపుడు పూసెనో
ఈ లోకమే మరిచి కనులు ఎదురు చూసెనో
నిదుర రాదులే కుదురు లేదులే
వేరేది ఏదీ గురుతు రాదులే
పగలు రేయిలా సతమతమై ఇలా
ఎన్ని పడిగాపులు కాస్తున్నావో

రప్పప్పప్పా రప్పప్ప రప్పప్పా రప్పప్పప్పా
రప్పప్పా రప్పప్ప రప్పప్పప్పా (2)

ఈ మాయలో మునిగి మనసు ఎపుడు తేలెనో
ఈ దారిలో కదిలే అడుగు ఏ ధరి చేరేనో
ఈ పువ్వు ఎప్పుడొ పూచేది




మెరిసెలే మెరిసెలే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నవ్ ఫాల్ రాజా AIS
సాహిత్యం: రెహమాన్
గానం:  శంకర్ మహదేవన్

పల్లవి:
మాంగళ్యం తంతునానే
మవజీవన హేతునా
అరె మెరిసెలే మెరిసెలే
మిలమిలమిల మెరిసెలే
కనులలో వెలుగులే కలల సిరులుగా
జత కలిసెలే కలిసెలే
ఇరుమనసులు కలిసెలే
అడుగులే ఒకటిగా కలిసి నడవగా
ఆనింగి మెరిసింది పందిరిగా
ఈ నేల వెలసింది పీటలుగా
తొలి వలపే వధువై నిలిచే...
వరుడే వరమై రాగ

ఈ జగమే అతిథై మురిసే...
మనసే మనువై పోగా
ఇక శ్వాసలో శ్వాసగా
కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

ఒక కల లాగ కరిగెను దూరం
ఇక జత చేరి మురిసెను ప్రాణం
ఒక శిలలాగా నిలిచెను కాలం
ఒడిగుడిలోనే తరిగేను బాణం

ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ బంధం
ఒక స్వరమై తడిమినది తనువును రాగ బంధం
గుండె నిండా సందడేమి తెచ్చి
ఉండిపోయినవే పండగల్లె వచ్చి
పున్నమల్లే వెండి వెన్నెలల్లే
నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి
జరిగి జరిగి కరిగే తొలకరి పరువపు జడిగా
ఎదపై పలికే తడి తకతకతక తక తకధిమిత

ఇక శ్వాసలో శ్వాసగా
కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

గెలిచినవే నిను నా ప్రేమ
నిలిపినదెలోలోనా
విడువనులే ఇక ఏ జన్మ
జతపడుతూ రానా
ఒక నీడనై నడిపించనా
ఒక ప్రాణమై బ్రతికేయనా
ప్రణయములే ఎదురైనా
చెదరని దీపయణం
సరిగమలు చదవనివో కథ మాన ప్రేమ కావ్యం
నువ్వు నేను పాడుకున్న పాట
రంగురంగులున్న జ్ఞాపకాల తోట
నువ్వు నేను ఏకమైనా చోట
మబ్బులంటూ లేని చందమామ కోట
నువ్వు నా సగమై జగమై ఉదయపు తోలి కిరణముగా
వెలుగై తగిలే తోలి చిలిపిలి తళుకులు తరగలురా

ఇక శ్వాసలో శ్వాసగా
కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా
ఆనింగి మెరిసింది పందిరిగా
ఈ నేల వెలసింది పీటలుగా
తొలి వలపే వధువై నిలిచే...
వరుడే వరమై రాగ
ఈ జగమే అతిథైమురిసే...
మనుసే మనువై పోగా

ఇక శ్వాసలో శ్వాసగా
కలగలిసిన ఆశగా
ఉండిపోవాలిలా ఒకరికొకరుగా

Palli Balakrishna Thursday, June 17, 2021


చిత్రం: ఆలుమగలు (1995)
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
నటీనటులు: సుమన్, మీనా, ఆమని
దర్శకత్వం: సాగర్
నిర్మాత: కె.విజయలక్ష్మి ప్రసాద్
విడుదల తేది: 26.01.1995

చిత్రం: ఆలుమగలు (1995)
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, ఎం. ఎం. శ్రీలేఖ

మల్లి... మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ  మళ్ళీ
తుళ్ళి.. తుళ్ళి తుళ్ళి గుండె గుడి గంటెయ్ మోగిందే మళ్ళీ మళ్ళీ
నీ ఊహలె నీ ఊసులె నా ఊపిరిలో పలికే మురళి... రవళి

మల్లి...మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ
తుళ్ళి.. తుళ్ళి తుళ్ళి గుండె గుడి గంటెయ్ మోగిందే మళ్ళీ మళ్ళీ
నీ ఊహలె నీ ఊసులె నా ఊపిరిలో పలికే మురళి... రవళి

మల్లి...మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ

మృదువయిన రేఖ మధుమాస లేఖ
అది అందినాక కుదురేదికా
విరబూసినాక  దరహాస రేఖ
విరితేనెవాకా  ఎద నిండగా
వెలుగు చిలుకు కోరిక ఇలకు దిగిన తారక
మదన కధల తొలి వేదికా....
మునిమాపుల కనుపాపల మణి గీతిక నీవేనే మల్లి మల్లి...

మల్లి... మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ

సుకుమారమైన కుసుమారివైనా రసరాజ్యమేలే నా రాణివే...
నెలరాజుకైన వలరాజుకైనా విరహాలు రేపే నేర జాణవె
పడుచు కలల గీతిక కవి తలపులు కదలిక పరిమళాల స్వరమాలికా
నీ వన్నెలు నీ చిన్నెలు ఎన్నెన్నని వర్ణించనె మల్లి... మల్లి...

Palli Balakrishna Wednesday, May 12, 2021

Most Recent

Default