Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "2014"
Maaya (2014)



చిత్రం: మాయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర 
నటీనటులు: హర్షవర్ధన్ రానే, అవంతిక మిశ్రా, సుష్మా రాజ్, నందిని రాయ్, అనితా చౌదరి 
దర్శకత్వం: నీలకంఠ 
నిర్మాత: మధురా శ్రీధర్ రెడ్డి 
విడుదల తేది: 01.08.2014



Songs List:



ఏం చేస్తూ ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: మాయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: బాలాజీ 
గానం: శ్రీ సౌమ్యా, దినకర్

ఏం చేస్తూ ఉన్నా 




పోకిరి రాజా పాట సాహిత్యం

 
చిత్రం: మాయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: డి. రమా
గానం: శ్రావణ భార్గవి 

పోకిరి రాజా 



ఎందుకో పాట సాహిత్యం

 
చిత్రం: మాయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: సిరా శ్రీ 
గానం: రమ్యా బెహ్రా 

ఎందుకో 




ఔనన్నా కాదు అన్నా పాట సాహిత్యం

 
చిత్రం: మాయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: డి. రమా, కిరణ్ వారణాసి 
గానం: సాయి శివాని, దినకర్ 

ఔనన్నా కాదు అన్నా 




మాయ పాట సాహిత్యం

 
చిత్రం: మాయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: సిరా శ్రీ 
గానం: అమల చేబ్రోలు 

మాయ

Palli Balakrishna Monday, August 8, 2022
Basanti (2014)





చిత్రం: బసంతి  (2014)
సంగీతం: మణిశర్మ 
నటీనటులు: రాజ గౌతం , ఆలీషా బైగ్
దర్శకత్వం: చైతన్య దంతులూరి 
నిర్మాత: ఉమా 
విడుదల తేది: 28.02.2014



Songs List:



తిరుగాబాటిది పాట సాహిత్యం

 
చిత్రం: బసంతి  (2014)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: శ్రీకృష్ణ , కారుణ్య, హేమచంద్ర , సాహితి 

తిరుగాబాటిది 




పారిపోతున్నా పాట సాహిత్యం

 
చిత్రం: బసంతి  (2014)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: శ్రీమణి
గానం: పవన్ 

అక్కడ  లేను  ఇక్కడ  లేను  ఎక్కడికక్కడ  ఏమయ్యను 
ఇప్పుడు  లేను  అప్పుడు  లేను  ఇప్పటికిప్పుడు  ఏమయ్యను 
ఎపుడు  ఉండే  చోట  లేను  ఎవరు  లేని  చోట  లేను 
ఇక్కడికిక్కడ  ఇప్పటికిప్పుడు  ఏమైపోతున్నాను
పారిపోతున్నా  బంగారు  లోకంలోకి  వాలిపోతున్నా 

నాలోనే  నే  లేనా  నేనా  ఇంకేవరోనా 
నీ  నడుములా  నీ  మనసులా  కనిపించనంటున్నాన
నా  పేరులా  నా  తీరులా  వినిపించనంటున్నాన
నేనంటే  నాకు  పడక  పారిపోతున్నా...

(నాలోనే )

చేసే  పనిలో  తికమక 
ఎం  చేస్తున్నానో  తెలియక 
నీ  కోసం  అన్ని  తప్పుకుపోతున్నా...
నేనేదురైన  తల  తిప్పుకుపోతున్నా...
అరి  కాళ్ళతో  చిటికెలు  వేసిన
అర  చేతులతో  నడిచేసినా 
తలకిందుల  తేడా  తేలదు  ఏమైనా...
నలుగురిలో  నవ్వులపాలై  పోతున్నా...
నా  బాల్యం  ఆయన  ఇంతలా  చిందేసాన
నా  ప్రాణాన్నైన  ఇంతలా  ప్రేమించాన 
ఏ  మాట  తేల్చలేక  పారిపోతున్నా 

(నాలోనే )

నలు  దిక్కులనే  కలిపినా 
నా  చిరునామా  దొరుకునా 
నువ్వెక్కడ  ఉన్నా  ఇట్టే  కనుగొన్నా 
నా  జాడను  మాత్రం  జల్లెడ  వేస్తున్నా 
నీ  పేరే  పలికాననా 
చీమకు  కూడా  చులకనా 
నేనేమంటున్నా  అర్ధం  ప్రేమేనా 
ఇక  పైన   లోనా  స్వార్థం  నువ్వేనా 
నీకోసం  చార్మినార్  లే  ఏకం  కావ 
నువ్వుంటే  ప్రేమసీదులే గుల్లై  పోవా 
ఈ  వింతలు   చూడలేక  పారిపోతున్నా 

(నాలోనే )




ప్రతీకారం పాట సాహిత్యం

 
చిత్రం: బసంతి  (2014)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: శ్రీమణి 
గానం: దిన్కర్ , చైత్ర 

ప్రతీక్షణం



స్పిరిట్ అఫ్ బసంతి పాట సాహిత్యం

 
చిత్రం: బసంతి  (2014)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: శ్రీకృష్ణ , కారుణ్య, హేమచంద్ర 

స్పిరిట్ అఫ్ బసంతి



వెల్లకురా పాట సాహిత్యం

 
చిత్రం: బసంతి  (2014)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం:  శ్రీమణి 
గానం: దీపు 

వెల్లకురా 

Palli Balakrishna Thursday, July 22, 2021
Bhimavaram Bullodu (2014)
చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: సునీల్, ఎస్తర్
దర్శకత్వం: ఉదయ్ శంకర్
నిర్మాత: డి. సురేశ్ బాబు
విడుదల తేది: 27.02.2014







చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: అంజనా సౌమ్య, భార్గవి పిళ్ళై, మేఘా రాజ్

హెయ్ ఆల్ ద పీపుల్ లిసన్ టు
ద స్టోరీ ఆఫ్ భీమవరం బుల్లోడు
యా వీక్ లైక్ ఏ స్పైడర్ మ్యాన్
సోల్ లైక్ ఏ సూపర్ మ్యాన్
క్యాచ్ హిస్ పర్సనల్ సూపర్ హ్యూమన్
ఆల్ ద థింగ్స్ సెటిల్ డౌన్ హీ ఈస్
ది ఓన్లీ ఒన్ హూ కెన్ పుల్ ఆఫ్
ఆల్ ది స్టార్స్ అండ్ లీవ్ యు స్ట్రాంగ్

హీ ఈస్ బీమ్ బీమ్.. 
భీమవరం బుల్లోడు.. ఓయా 
కన్నె కథ బాగా లేనోడు
మన కథలోని నాయకుడు
పెళ్లి చూపులకు వెళతాడు
పిల్ల నచ్చెనని చెబుతాడు
ఆ పిల్లకు పెళ్లి అవుతుంది...
వేరే వాడితో 
ఈడి గుండెకు చిల్లి పడుతుంది పెళ్లి బాధతో పెళ్లికాని కుర్రాడు ప్రేమాచారము ఉన్నోడు 

వీడు వీడు వీడు...
వీడు.. బీమ్ బీమ్.. భీమవరం బుల్లోడు
హీ ఈస్ బీమ్ బీమ్.. భీమవరం బుల్లోడు

బలహీనుడు తెలివైన వెర్రివాడు
ధైర్యమున్న పిరికివాడు
గంభీరమైన చిలిపోడు
అమ్మాయిని చూసాడు
ఆమెతో ప్రేమలో పడిపోయాడు 
అందరినెదిరించాడు ఆఖరికేమయ్యాడు
చావంటే భయమే లేనోడు
భయంతోటే చస్తూ బ్రతికేస్తాడు 
భయం వీడ్ని వీడిందా
మరి జయం వీడికి కలిగిందా 

దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ భీమవరం బుల్లోడు
హీ ఈస్ బీమ్ బీమ్.. భీమవరం బుల్లోడు..

భీమవరం బుల్లోడు..







చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనూప్ రూబెన్స్, సైంధవి

హా ఒక వైపు నువ్వు ఒక వైపు నేను
ఒక వైపే చూస్తున్నామా 
అన్నీ ఒకలాగే చేస్తున్నామా

హో ఒక వైపు నువ్వు ఒక వైపు నేను
ఒక మాటే దాస్తున్నామా
గాల్లో ఒక మాటే రాస్తున్నామా

హోగుండెల్లోన మాటే ఉంది
బయటికేమో రానంటుంది 
ఆగలేక మనసు మాత్రం గొడవ పెడుతోంది

ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ

ఒక వైపు నువ్వు ఒక వైపు నేను
ఒక వైపే చూస్తున్నామా 
అన్నీ ఒకలాగే చేస్తున్నామా 

హో అదిరే కుడి కన్ను కొన్నాళ్ళుగా
నాకేదో శుభవార్త చెబుతున్నాది
హో ఎడంవైపున నా యద సవ్వడి
సిరిమువ్వల సడిలా వినిపిస్తున్నది
హా అద్దం ముందు నా బొమ్మ నన్నే
ఎవరో అంటున్నది ఓ...
అర్ధం కాని ఆనందం ఏదో నీడై వస్తున్నది
అటు మొన్నలో నిన్నలో ఎన్నడు లేనిది మనసంతా బరువౌతుందే 
ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ

హో చుట్టూ ఒకరైనా కనరాకున్నా
నాకు నేనే లోకంలా ఉందే ఇది
హొ చుట్టూ పదిమంది ఎవరున్నా లేరని
ఏదో మైకంలా ఉంది మది
అరె ముళ్ళురాళ్లు పూలైపోతాయే నిన్నే ఆలోచిస్తే నిమిషాలన్నీ నిలబడిపోతాయే నీలోనన్నే చూస్తే 
కనువిందుగ ఇంతటి వింతలు నేరుగా
మనసే గురి చూసాయంటే 

ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ

ఒక వైపు నువ్వు ఒక వైపు నేను
ఒక వైపే చూస్తున్నామా 
అన్నీ ఒకలాగే చేస్తున్నామా

ఒక వైపు..ఒక వైపు.. ఒక వైపు.. ఒక వైపు..







చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజా హాసన్, రమ్య యన్. యస్

అరె పల్లకితో వస్తానే పిల్లదానా
నీలో పెళ్లికళే తెస్తానే కుర్రదానా 
హె అల్లుడివి నువ్వేరా అల్లరోడా
నీతో గిల్లుడుకే పెళ్లాన్నై నేనురానా 
అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ
తుళ్లి తుళ్లి పోవాలిలే 
ఇండియాలో మన పెళ్లి జరగాలి పండగల్లే

భల్లే భల్లే భల్లే ఆ బ్యాండు బాజా
అరె భలే భలే భల్లే ఆ స్వీటు కాజా
భల్లే భల్లే భల్లే ఆ ప్రేమ పూజ 
అరె భలే భలే భల్లే నా జడ్లో రోజా

పల్లకితో వస్తానే పిల్లదానా 
నీలో పెళ్లికళే తెస్తానే కుర్రదానా

ఓ పిల్లా నాలోన పొంగే ప్రేమంతా కట్టేస్తా పుస్తెల్లాగా
ఇలా నీలోన పుట్టే పులకింత పెట్టేయి మెట్టెల్లాగా
హే చిట్టి చిట్టి ముద్దు - సింధూరంలా దిద్దు
మహా బాగా మన షాదీ జరగాలి జాతరల్లే 

అరె భల్లే భల్లే భల్లే ఆ షామియానా
అరె భలే భలే భల్లే ఆ మల్లెల మేనా
భల్లే భల్లే భల్లే ఆ ఖానా పీనా
అరె భలే భలే భల్లే ఆ గానా బజానా 

హే పిల్ల నీపైన రెండు చేతుల్ని వేసేస్తా పూదండలా
ఇలా నాలోని నిండు గుండెల్ని పరిచేస్తా తలదిండులా 
చిందే చమట జల్లు - అక్షింతలే చెల్లు
ప్రతిరేయి జరగాలి సరికొత్త శోభనాలే 

భల్లే భల్లే భల్లే ఆ పళ్ల పల్లెం
అరె భలే భలే భల్లే ఆ తలుపుల గొళ్ళెం
ఏ భల్లే భల్లే భల్లే ఆ అగరు దూపం
అరె భలే భలే భల్లే ఆ అక్తరు తాపం 

పల్లకితో వస్తానే పిల్లదానా
నీలో పెళ్లికళే తెస్తానే కుర్రదానా 
యే అల్లుడివి నువ్వేరా అల్లరోడా
నీతో గిల్లుడుకే పెళ్లాన్ని నేనురానా 
అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ
తుళ్లి తుళ్లి పోవాలిలే 
ఇండియాలో మన పెళ్లి జరగాలి పండగల్లే

భల్లే భల్లే భల్లే ఆ బ్యాండు బాజా
అరె భలే భలే భల్లే ఆ స్వీటు కాజా
భల్లే భల్లే భల్లే ఆ ప్రేమ పూజ 
అరె భలే భలే భల్లే నా జడ్లో రోజా







చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయ్ ప్రకాష్ , శ్రావణి

ప్రేమలో పడ్డానురా తొలిచూపుల్లో
నాకేదో అయ్యిందిరా - ఓ గర్ల్ 
హ మనసే లాగిందిరా తొలి మైకంలో
తనువే ఊగిందిరా - లిసన్ టు మీ 

ఓయ్యయ్యయ్యో...

ప్రేమలో పడ్డానురా తొలిచూపుల్లో
నాకేదో అయ్యిందిరా
హ మనసే లాగిందిరా తొలి మైకంలో
తనువే ఊగిందిరా 

అరె జల్లు జల్లునా ఆనందం అల్లేనా
ఘల్లు ఘల్లున అదృష్టం గిల్లేనా
మబ్బును మీటేస్తున్నా మెరుపును వాటేస్తున్నా
ఆకాశం దాటేస్తున్నా

జారే జారే జారే నా మనసే జారే
మారే మారే మారే నా వరసే మారే

ఓయ్యయ్యయ్యో...

ప్రేమలో పడ్డానురా తొలిచూపుల్లో
నాకేదో అయ్యిందిరా 

ఓ నా పేరే అనుకుంటూ నీ పేరే నే రాస్తున్నా
ఇద్దరి పేర్లు ప్రేమే అంటున్నా ఓ సజ్నా
నా దారే అనుకుంటూ నీ దార్లో నేనొస్తున్నా
ప్రేమకు మనమే రహదారంటున్నా సంజోనా

హిందీలో దీన్ని ఇష్కన్నా
ఇష్కులోన రిస్కున్నా
చెన్నైలో కాదల్ అంటున్నా
అన్నిట్నీ కాదని అంటున్నా
నీకోసం దూకేస్తున్నా ఓ... 

జారే జారే జారే నా మనసే జారే
మారే మారే మారే నా వరసే మారే

ఓ.. వెన్నెల్లో పడుకున్నా కన్నులు మూయను క్షణమైనా
ప్రేమకు నిదరే శత్రువు అంటున్నా ఓ సజ్నా
ఎన్నెన్నో అనుకున్నా అన్నీ దాగును లోలోన
ప్రేమ గుబులు స్నేహితులంటున్నా సునోనా

ఇంగ్లీషులోన లవ్ అన్నా
స్పానిషులో ఆమోర్ అన్నా
బెంగుళూరులోన ప్రీతన్నా
బెంగాల్లో భాలో అంటున్నా

తెలుగులోనే ప్రేమిస్తున్నా ఓ...

జారే జారే జారే నా మనసే జారే
మారే మారే మారే నా వరసే మారే





Palli Balakrishna Friday, March 5, 2021
Rowdy Fellow (2014)



చిత్రం: రౌడీ ఫెలో (2014)
సంగీతం: సన్నీ MR 
నటీనటులు: నారా రోహిత్, విశాఖ సింగ్ 
దర్శకత్వం: కృష్ణ చైతన్య 
నిర్మాత: టి. ప్రకాశ్ రెడ్డి 
విడుదల తేది: 21.11.2014



Songs List:



రారారా రౌడీ పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ ఫెలో (2014)
సంగీతం: సన్నీ MR 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: ఆర్జిత్ సింగ్, అదితి సింగ్ శర్మ 

దాన వీర శూర కర్ణ
నువ్వు చక్కని చంటోడా
మూర్కులే నీ సాటి రారు
నువ్వు వేరు నీ రధం నువ్వే రా
నాటి మేటి వీరులంతా ఎంత
వీరుడా నీముందరే కలహమే కొన్నాళ్లు
నిన్ను చూసి పారిపోయే వాట్ టూ సే

రారారా రౌడీ రారారా రౌడీ
రారారా రౌడీ రారారా (2)

హోం ఈగాలిలో ఇలా ఉగానిలా ఎలా
సరే రా మరి అనుకున్నదే చేయారా
నీదో మతం నువ్వు మారావేంటి రా

రారారా రౌడీ రారారా రౌడీ
రారారా రౌడీ రారారా (2)

ఏ ఆహం అంటూ లేనివాడు వాడే మగాడ్రా
ఈ సిద్ధంతని నమ్మినోడు వాడే మనోడ్రా

రారారా రౌడీ రారారా రౌడీ
రారారా రౌడీ రారారా (2)




ఏదో నువ్వన్నావేదో ఏదో పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ ఫెలో (2014)
సంగీతం: సన్నీ MR 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: అర్మాన్ మాలిక్, హర్షిత గుడి 

ఏదో నువ్వన్నావేదో ఏదో
నే విన్నా ఏదో ఏదో
నువ్ అంటుంటే నే వింటున్నా ఏదో

ఏదో నువ్వన్నా వేదో ఏదో
నే విన్నా ఏదో ఏదో
నువ్వంటుంటే నే వింటున్నా 
మరి ఏదో ఏదో

పెదవే అడిగిందో లేదో
పలుకై వినిపించిందేదో
ఆ మాటే విన్నాక నేనైనా ఆగాలో లేదో
అన్ని అడగాలో లేదో
చెప్పాలి అవునో కాదో
కౌగిలిలో దూరంగా జరిగే
అంత విందో లేదో

ఏదో నువ్వన్నావేదో ఏదో
నే విన్న ఏదో ఏదో
నువ్వంటుంటే నే వింటున్నా ఏదో
ఏదో నువ్వన్నా వేదో ఏదో
నే విన్నా ఏదో ఏదో
నువ్వంటుంటే నే వింటున్నా 
మరి ఏదో ఏదో

ముద్దే ఇవ్వాలో లేదో
చెక్కిళ్ళకు బరువో కాదో
నా వొళ్ళో నువ్వున్నా 
నే చూస్తున్న నమ్మాలో లేదో
ఇక్కడ ఆపాలో లేదో
ఆపై ఇక అర్ధం కాదో
కలలకు వయసే పెరిగి
ఎదురే తిరిగి నువ్వు కావాలందో

ఏదో నువ్వన్నావేదో ఏదో
నే విన్నా ఏదో ఏదో
నువ్ అంటుంటే నే వింటున్నా ఏదో

ఏదో నువ్వన్నా వేదో ఏదో
నే విన్నా ఏదో ఏదో
నువ్వంటుంటే నే వింటున్నా 
మరి ఏదో ఏదో




ఆ సీతా దేవి నవ్వులా పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ ఫెలో (2014)
సంగీతం: సన్నీ MR 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: అర్జిత్ సింగ్ 

ఆ సీతా దేవి నవ్వులా 
ఉన్నావే ఎంటి మాటలా
లక్ష్మణుడే లేని రాముడే 
నీకు ఈడు జోడు వీడే
అందాలా బుట్ట బొమ్మలా 
అచ్చంగా కంటి పాపలా
వెన్నెల్లో ఆడ పిల్లలా 
నిన్ను తలుచుకుంది ఈడే

చెల్లియో చెల్లకో ప్రేమనే అందుకో
నూటికో కోటికో వరుడు నేను లే
నిన్నటీ జన్మ లో పుణ్యమే అందుకో 
కాళ్ళనే అద్దుకో వధువు గానె మారిపోవే

ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం
వీడుకోలు లేని తోడు అంది స్వాగతం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం...

ఇవాళ నింగి లోని తారా 
తళుక్కుమంది ఎదురుగా రా
వయస్సు తీరికుండదారా 
హాయి హాయి హాయి
సొగస్సు పంచుతున్న ధారా 
నీ పలుకులోని పంచదార
ఆ పైన ఊరుకోదు లేరా 
హాయి హాయి హాయి

ఉయ్యాల ఊగుతుంటే ఒళ్లో 
ఏకాంతం అంటూ వేరే లేదులేరా 
కళ్ళార నిన్ను చూసుకుంటే హాయి
హాయి హాయి హాయి

ఈ క్షణం స్వయంవరం ఇవ్వాళ సంబరం
ఈ క్షణం స్వయంవరం ఇవ్వాళ సంబరం
వీడుకోలు లేని తోడు అంది స్వాగతం
ఈ క్షణం స్వయంవరం ఇవాళ సంబరం...





ఎంతవారు గాని పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ ఫెలో (2014)
సంగీతం: సన్నీ MR 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: నకాష్ అజీజ్, నటాషా పింటో 

(ఈ పాటని యన్.టి.రామారావు గారు నటించిన భలే తమ్ముడు (1969) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు)

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో ఓఓ...

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో ఓఓ...

చిన్నది మేనిలో మెరుపున్నది
చేపలా తళుకన్నది సైప లేకున్నది
చిన్నది మేనిలో మెరుపున్నది
చేపలా తళుకన్నది సైప లేకున్నది
ఏ వన్నెకాని వలపు నమ్మి వలను చిక్కునో
కైపులో కైపులో కైపులో ఓఓ..


ఆడకు వయసుతో చెరలాడకు ఆహా
ఆడితే వెనుకాడకు ఊహూ కూడి విడిపోకు
ఆడకు వయసుతో చెరలాడకు
ఆడితే వెనుకాడకు కూడి విడిపోకు
మనసు తెలిసి కలిసి మెలిసి వలపు నింపుకో
కైపులో కైపులో కైపులో ఓఓ..

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో ఓఓ...
కైపులో కైపులో కైపులో ఓఓ...




రెడ్ అండ్ యెల్లో పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ ఫెలో (2014)
సంగీతం: సన్నీ MR 
సాహిత్యం: వశిష్ట శర్మ 
గానం: షాల్మాలి ఖోల్గాడే, సామ్రాట్ కౌషల్ 

రెడ్ అండ్ యెల్లో 

Palli Balakrishna Sunday, February 28, 2021
Sikindar (2014)
చిత్రం: సికిందర్ (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: సూర్య, సమంతా
దర్శకత్వం: ఎన్. లింగుస్వామి
నిర్మాతలు: సిద్దార్థ్ రాయ్ కపూర్, ఎన్. సుభాష్ చంద్రబోస్
విడుదల తేది: 15.08.2014







చిత్రం: సికిందర్ (2014)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: రాకెందు మౌళి
గానం: దీపక్, హరిచరణ్, యువన్ శంకర్ రాజా

నేనే  కాని నేనై  ఉండగా నీ  చూపే తాకి  
ప్రాణమే మరు జన్మే  పొందగా
ఎన్నో మార్పులు  రానె వచ్చెగా
అవి మారే కొద్ది  అణువణుల్లో నువ్వే కొత్తగా 

ఎందుకో...  ఇంతలో...
ఎందుకో  ఇంతలో  అంతటి వింతలే
ప్రేమ  మయమే మహిమే మహిలో నిండేలే

తను చిలిపిగ నగవులు చిలికితే 
తుది చనువుల చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో
మగతే మరి ఉరికే 
యద కదలిక  కుదురిక  వీడితే 
ఆ  పరుగులు పదనిస పాడితే 
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే  నీ ఉపిరీ

నేనేె కాని నేనై  ఉండగా
నీ చూపే తాకి ప్రాణమే మరు జన్మే పొందగా
ఓ ఎన్నో మార్పులు రానె వచ్చెగా
అవి మారే కొద్ది అణువణుల్లో నువ్వే కొత్తగా 

కనుల కల ఎదురైతే కునుకిక కుదురేదీ
కల, నిజం,యుగం, క్షణం, నీ  జంటగా ఓ వింతట
చుపులకు కనబడని రేపటిని  చదివే మది
ఊహలోకం, నా ముందర  కొరిందిలే ఎ  తొందర
హద్దు పొద్దు లేని వలపునే పంచనా
చొరవ చూపు వేళ నిన్ను నే మించనా
నిన్ను నే మించనా
ని స్వాసే  నాలో ఉసురై ఉంచెనా

తను చిలిపిగ  నగవులు చిలికితే 
తుది  చనువుల  చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో
మగతే మరి ఉరికే
యద కదలిక  కుదిరిక  వీడితే 
ఆ  పరుగులు పదనిస పాడితే 
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే  నీ ఉపిరీ

మనసు పొరలొ మాటే పలికినది పాటే
నిరంతరం  నీ ధ్యానమే ఇహం పరం నీ కోసమే
అడుగు కోరిన బాటే కడవరకు నీ తోటే
ఏ జన్శకీ  నీ తొడునే  వీడానులే అత్యాసగా
నీకు తేలుపలేని  తలపులే వేలులే
నీవు చెంత నుంటే మౌనమే మేలులే
మౌనమే మేలులే 
ఈ తహ తహ తీర్చగ  ప్రేమే చేప్పవా 

తను చిలిపిగ  నగవులు చిలికితే 
తుది  చనువుల  చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో
మగతే మరి ఉరికే
యద కదలిక  కుదిరిక  వీడితే 
ఆ  పరుగులు పదనిస పాడితే 
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే  నీ ఉపిరీ



Palli Balakrishna Friday, February 19, 2021
Dikkulu Choodaku Ramayya (2014)








చిత్రం: దిక్కులు చూడకు రామయ్య (2014)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: రమ్యా బెహ్రా
నటీనటులు: నాగ శౌర్య, సన మక్బూల్, అజయ్, ఇంద్రజ
దర్శకత్వం: త్రికోటి. పి
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 10.10.2014

తేలిపోతున్నా తేలి మబ్బుల తేలే దూది పింజలా
చిగురాకుల చిలకి కల రెల్లు పువ్వు రేకుల పిల్ల లూదిన సబ్బి బూరల ఉల్లిపాయపై పొరలా
పరువాలు దాచే వీలు లేక తాళలేక
పైకి వెళ్లే పైట లాగ

తేలిపోతున్నా నేనే తేలిపోతున్నా
తేలిపోతున్నా హాయ్ హాయ్
తేలిపోతున్నా

నన్ను నేనే చూడకుండా
నాకు నేనే అందకుండా ఆకాశంలో

తేలిపోతున్నా నేనే తేలిపోతున్నా
తేలిపోతున్నా హాయ్ హాయ్
తేలిపోతున్నా

రెక్కలు ఇచ్చిన నువ్వే
నా పక్కన లేకుంటే ఎలా
నీతో పాటే ఎందాకైనా ఎగురుతున్నానిలా
ముచ్చట తీర్చిన నువ్వే 
నా ముందర లేకుంటే ఎలా
ఎదిమ్మన్నా ఇట్టే ఇస్తా తీసుకో అలా

చాలా చేద్దాం చాలా చూద్దాం
చాలని పించేదాక రానిద్దాం
అంతా చేద్దాం అన్నీ చేద్దాం
ఆశలు తీరేదాకా ఆడేద్దాం
పైటంచు భారం మోసుకుంటూ
పైకి వెళ్లే చల్లగాలి పల్లకిలా

తేలిపోతున్నా నేనే తేలిపోతున్నా
తేలిపోతున్నా హాయ్ హాయ్
తేలిపోతున్నా

ముందు వెనక చూడకుండ
ఊహకైన అందకుండ
ఆరాటంలో ఓ ఓ

తేలిపోతున్నా నేనే తేలిపోతున్నా
తేలిపోతున్నా నీపై వాలి పోతున్నా
జారిపోతున్నా మొత్తం మారిపోతున్నా






Palli Balakrishna Wednesday, February 17, 2021
Rough (2014)


చిత్రం: రఫ్ (2014)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: 
గానం: 
నటీనటులు: ఆది, రకుల్ ప్రీత్ సింగ్, శ్రీహరి
దర్శకత్వం: సి. హెచ్. సుబ్బా రెడ్డి
నిర్మాత: ఎమ్.అభిలాష్
విడుదల తేది: 28.11.2014


Palli Balakrishna Friday, February 12, 2021

Most Recent

Default