చిత్రం: రగిలే గుండెలు (1985)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: మోహన్ బాబు , రాధిక , ప్రభ, మంచు విష్ణు (చైల్డ్ ఆర్టిస్ట్)
నిర్మాత: మంచు మోహన్ బాబ
విడుదల తేది: 02.05.1985
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: మోహన్ బాబు , రాధిక , ప్రభ, మంచు విష్ణు (చైల్డ్ ఆర్టిస్ట్)
నిర్మాత: మంచు మోహన్ బాబ
విడుదల తేది: 02.05.1985
చిత్రం: రగిలే గుండెలు (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:
గానం:
నవ్వులు పూసే నందనం పాట సాహిత్యం
నవ్వులు పూసే నందనం
మమతలు పండే బృంధావనం
నవ్వులు పూసే నందనం
మమతలు పండే బృంధావనం
అన్నయ్య మనసే రామాలయం
వదినమ్మ నీడే ప్రేమాలయం
మా ఇల్లే దేవాలయం
మా ఇల్లే దేవాలయం
నవ్వులు పూసే నందనం
మమతలు పండే బృంధావనం
అన్నదమ్ముల అనుబంధానికి అర్థం చెప్పే తమ్ముడు
అన్నదమ్ముల అనుబంధానికి అర్థం చెప్పే తమ్ముడు
లక్ష్మణుడంటి తమ్ముడు
ఎన్నడూ వీడని మిత్రుడు
ఆ తమ్ముడు వదినై
ఈ అన్నకి సతినై
సీతానైనాను ఒక మాటనైనాను
నీ సీతానైనాను ఒక మాటనైనాను
ఈ అన్నదమ్ముల అనుబంధం ఇక వర్ధిల్లాలి కలకాలం
ఇక వర్ధిల్లాలి కలకాలం
మా ఇల్లే దేవాలయం
మా ఇల్లే దేవాలయం
నవ్వులు పూసే నందనం
మమతలు పండే బృంధావనం
ఆలయమంటి మెట్టినింటిలో దీపంలాంటి కోడలు
ఆలయమంటి మెట్టినింటిలో దీపంలాంటి కోడలు
చిరునవ్వుల శ్రీలక్ష్మిగా మా ఇంటి మహాలక్ష్మి గా
మా అమ్మానాన్నకి ముద్దు
ఈ చిన్నాన్నికి నే ముద్దు
ఈ ముగ్గురి మురిపాలు శ్రీరామ రక్షణలు
ఈ ముగ్గురి మురిపాలు శ్రీరామ రక్షణలు
ఈ ఇంటిపచ్చని తోరణం ఇక వాడిపోదులే కలకాలం
ఇక వాడిపోదులే కలకాలం
మా ఇల్లే దేవాలయం
మా ఇల్లే దేవాలయం
నవ్వులు పూసే నందనం
మమతలు పండే బృందావనం
అన్నయ్య మనసే రామాలయం
వదినమ్మ నీడే ప్రేమాలయం
మా ఇల్లే దేవాలయం
మా ఇల్లే దేవాలయం
నవ్వులు పూసే నందనం
మమతలు పండే బృంధావనం
Note: This Lyric was Donated by Runku Ramprasad
No comments
Post a Comment