Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Janaka Aithe Ganaka (2024)




చిత్రం: జనక అయితే గనక (2024)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
నటీనటులు: సుహాస్, సంగీర్తన విపిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ 
దర్శకత్వం: సందీప్ రెడ్డి బండ్ల 
నిర్మాత: హర్షిత్ రెడ్డి , హన్షిత
విడుదల తేది:  07.09.2024



Songs List:



నా ఫేవరెట్టు నా పెళ్లామే పాట సాహిత్యం

 
చిత్రం: జనక అయితే గనక (2024)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: ఆదిత్య ఆర్కే 

నేనేది అన్న బాగుంది కన్నా
అంటూనే ముద్దడుతువే
నీవే…నా పక్కనుంటే చాలే…

కష్టాలు ఉన్న కాసేపు అయినా
రాజాలా పోజు కొడతానే
నీవే…నా పక్కనుంటే చాలే…

కలతలు కనబడవే
నువ్వు ఎదురుగా నిలబడితే
గొడవలు జరగావులే
ఒడుదుడుకులు కలగావులే
అరక్షణమైన అసలెప్పుడైనా
కోపం నీలోనా
ఎప్పుడైనా చూశానా…..

పుణ్యమేదో చేసి ఉంటనే
నేడు నేను నిన్ను పొందెనే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే

నాడు బ్రహ్మ కోరి రాశాడే
నీకు నాకు ముడి వేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే
ఓ…ఆ …

హే ఉదయం నే లేచే ఉన్న
వేచుంటనే
నువ్వే ముద్దిచ్చేదాకా
మంచం దిగానే

హే నీతో తాగేస్తూవుంటే కప్పు కాఫీ
కొంచం బోరంటూ ఉన్న కదా మాఫీ

మన గదులిది ఇరుకులు కానీ
మన మనసులు కావే
ఎగరడమే తెలియదు గానీ
ఏ గొలుసులు లేవే

నువ్వు అన్న ప్రతి ఒక్క మాట
సరి గమ పద నిస పాట
గుండా కూడా చిందులేసేనంట
చూడే ఈ పూట
ఆ…ఓ…

పుణ్యమేదో చేసి ఉంటనే
నేడు నేను నిన్ను పొందెనే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే

నాడు బ్రహ్మ కోరి రాశాడే
నీకు నాకు ముడి వేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే





నువ్వే నాకు లోకం పాట సాహిత్యం

 
చిత్రం: జనక అయితే గనక (2024)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కార్తీక్ 

ఓ సరైయా చూడవే
ఉండిపోవే ఉండిపోవే
వింటావా నా మాటనే
ఉండిపోవే ఉండిపోవే
మనసే ఇరుకై నలిగా నేనే
గదిలో నువ్వు లేక
నిదుర కుదురు చెదిరే పోయే
నువ్విలా వదిలేక
అనుకొనే లేదే
నాలా నువ్వు కాదే
తలపే రాలేదే
ఈ వైనం నీ నుండే

నేనే నీకు సొంతం
నీ మీదే నా ప్రాణం
పోనే పోదే ఈ బంధం
నువ్వే నాకు లోకం
నువ్వుంటే సంతోషం
నువ్వే లేక నే శున్యం

కొమ్మ వేరు బంధమే ఇది
పువ్వే పూసి నిన్ను నన్ను వేరే చేసింది
కష్టమున్న తేలికే మరి
తోడే నువ్వే ఉన్నావంటే
దాటేస్తానాన్ని
నన్ను నమ్మేది ఓక నువ్వేలే
నువ్వు వెల్లవే..

ఓ మాటే ఇచ్చి తప్పనే
ఒప్పుకుంటేనే…
కంట కన్నిరే మల్లి రానినే
ఇంకో అవకాశం ఇచ్చేసి వచైవే…

నేనే నీకు సొంతం
నీ మీదే నా ప్రాణం
పోనే పోదే ఈ బంధం
నువ్వే నాకు లోకం
నువ్వుంటే సంతోషం
నువ్వే లేక నే శున్యం

ఓ సరైయా చూడవే
ఉండిపోవే ఉండిపోవే
వింటావా నా మాటనే
ఉండిపోవే ఉండిపోవే
మనసే ఇరుకై నలిగా నేనే
గదిలో నువ్వు లేక
నిదుర కుదురు చెదిరే పోయే
నువ్విలా వదిలేక
అనుకొనే లేదే
నాలా నువ్వు కాదే
తలపే రాలేదే
ఈ వైనం నీ నుండే

తానా నాన నానే
తానా నాన నానే
థానే నానే తననే

తానా నాన నానే
తానా నాన నానే
థానే నానే తననే




ఏ పాపం చేసుంటావో పాట సాహిత్యం

 
చిత్రం: జనక అయితే గనక (2024)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: రితేష్ జి. రావ్

ఏ పాపం చేసుంటావో
అయ్యో రామ కింది జన్మ
ఎంప్లాయ్ అల్లే పుట్టేసామా
పైనున్న హెల్లే ఈడే ఉండనైనా
మేనేజర్లే ఆఫీసుల్లో చూపిస్తారా

ఓటీ చేసినా డ్యూటీ తప్పదా
హైకే ఇస్తే మీ
సోమ్మేం పోద్దిరా
శాలరీ చూస్తే చాలదు అంతే
జీరో బ్యాలెన్స్ జీవితాలే లేరా

ఈ మేనేజర్ల ఎందుకింత కష్టాలు
మేం చెయ్యాలా తెల్లార్లు ఓటీ లు
అరే శాలరీ లు పెంచమంటే కోపాలు
ఇక మిగిలేది మాకింక చిల్లర్లు

అరే ఆఫీస్ అంటే
హెవెన్ కి డోర్ కాదు
వాళ్ళు తీస్తారు
నరకంకి ద్వారాలు
మా లైఫ్ లకు లేవా
ఇంత వాల్యూ లు
పెట్టారా డెడ్ లైన్లు
మరి అందని టార్గెట్ లు
ఇస్తారే ఎటులు

ఏ పాపం చేసుంటావో
అయ్యో రామ కింది జన్మ
ఎంప్లాయ్ అల్లే పుట్టేసామా
పైనున్న హెల్లే ఈడే ఉండనైనా
మేనేజర్లే ఆఫీసుల్లో చూపిస్తారా

ఓటీ చేసినా డ్యూటీ తప్పదా
హైకే ఇస్తే మీ
సోమ్మేం పోద్దిరా
శాలరీ చూస్తే చాలదు అంతే
జీరో బ్యాలెన్స్ జీవితాలే లేరా





సంతోషం ఈ పూట పాట సాహిత్యం

 
చిత్రం: జనక అయితే గనక (2024)
సంగీతం: విజయ్ బుల్గానిన్ 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: రితేష్ జి. రావ్

సంతోషం ఈ పూట

No comments

Most Recent

Default