-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vijaya Krishna Murthy"



చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
నటీనటులు: N.T. రామారావు, దేవిక 
దర్శకత్వం: బి. విఠలాచార్య 
నిర్మాత: M.K. గంగరాజు 
విడుదల తేది: 12.03.1971



Songs List:



ఈ నేల బంగారు నేల పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

పల్లవి:
ఆహా హా హా హా హా ఆహా హా హా హా హా
ఈ నేల బంగరు నేల
ఈ వేల చల్లని వేళ
కనరాని తీయని ఊహలతో
మనసూగెను ఊగెను  ఉయ్యాలా
మనసూగెను ఊగెను ఉయ్యాలా
ఈ నేల బంగరు నేల

చరణం: 1
పూచే పూవులన్నీ ఏ పుణ్యమూర్తుల హృదయాలో
ఊగే తరువులన్నీ ఏ యోధులు గాచిన జండాలో
వీచే గాలీ వినిపించేది వీచే గాలీ వినిపించేది
ఏ వేణులోలుని గీతాలో

ఈ నేల బంగరు నేల
ఈ వేల చల్లని వేళ
కనరాని తీయని ఊహలతో
మనసూగెను ఊగెను ఉయ్యాలా
ఈ నేల బంగరు నేల

చరణం: 2
ఎగిసే పావురాలూ ఏ శాంతిదేవి సందేశాలో
కదలే నీ రధాలు ఏ కరుణామయుని దీవెనలో
పొంగే అలల పులకించేవి 
పొంగే అలల పులకించేవి
ఏ కవిరాజు భావనలో

ఈ నేల బంగరు నేల
ఈ వేల చల్లని వేళ
కనరాని తీయని ఊహలతో
మనసూగెను ఊగెను ఉయ్యాలా
మనసూగెను ఊగెను ఉయ్యాలా

ఆహా హా హా హా హా ఆహా హా హా హా హా
హహహహహా ఓ హె హె హె హెూ.. ఆ



కరుణించవా పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, బృందం 

పలవి : 
కరుణించవా వరుణదేవ 
నిరుపమ కరుణ సురగంగ కురిపించి 

కోరస్: కరుణించవా వరుణదేవ 

అమృతాంతరంగుడు ఆచార్యదేవుడు 
ఆరని జ్వాలల అలమటించగా 
మాతృదేవియై మము నడిపించిన 
విద్యానిలయము విలవిలలాడగ 
అంబర వీధుల దాగున్నావా 
ఆర్త నాదమే వినకున్నావా 

కోరస్ : కరుణించవా వరుణదేవ 
నిరుపమ కరుణ సురగంగ కురిపించి  
కరుణించవా వరుణ దేవ 

ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ జలదరాలు గార్జించగా
కోరస్ : ఆ ... ఆ.... 
తళతళ తళతళతళ తటిల్తతలు దీవించగా 
కోరస్ : ఆ.... ఆ... 
కుంభిని ఆనందాంబుధిలో విహరించగా 
కోరస్ : ఆ.... ఆ.... 
కుంభివృష్టి కురిపించవా 
కోరస్ : ఆ.... ఆ 
గురుదేవుని కరుణించవా 
కరుణించవా కరుణించవా 




నా వల్లో చిక్కినా పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: కొసరాజు
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

హ హ హ హ సుందరా 
చూడరా, నాదొరా 
రావా, ఇటురావా 
నిన్ను చేరాను, చేరిపిలిచాను 
చెంతవున్నాను చేయిచాచాను రా రా 

కామినీ మోహినీ ఆడూ ఆడూ, పాడూ పాడూ 

నావల్లో హాయ్, నావల్లో చిక్కినవాడు పోనేపోలేడు 
హాయ్ గమ్మత్తు కైపులోస ముంచేసాను చూడు చూడు. 

నవ్వులతోటి ఎవ్వరినైనా వూరిస్తాను నాటకమాడి 
కాళ్ల చుటూ తిప్పిస్తాను వాల్చూపుతోనే తిమ్మిని బమ్మిని చేస్తాను 
వయ్యారంతోనే పుక్కిరి బిక్కిరి చేస్తాను 
నెరజాణ తునకను నేను, రాజ రాజ రా రా 

హ్వ ! హ్వ : బలే : బలే : ఆ   ॥నావల్లో॥ 

గడ్డంబెంచిన స్వాముల్నైనా కవ్విస్తాను, హాయ్ 
జంతర్ మంతర్ బొమ్మల్లాగా ఆడిస్తాను 
అరచేతిలోన వైకుంఠం చూపిస్తాను 
అందాల కౌగిటో, ఆనందం కురిపిస్తాను 
చేయి చేయి కలుపుతాను సిగ్గు కాస్త దులిపేస్తాను 
రాజ ! రాజ ! రా! రా! 

ఆ ఆ బాగు బాగు  ఆ 





అలివేణి నీ రూపము పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల

పల్లవి:
అలివేణీ... నీ రూపము మలచిన సుందర శిల్పము
విరిబోణీ... నీ అందము అరవిరిసిన అరవిందము

చరణం: 1
చిరుగాలికి ఊగిన ముంగురుల మరులు కనుగొంటిని
ఎదపొంగుల దాచిన పై ఎద గుసగుసలే వింటిని

చరణం: 2
నీ చెక్కిలి అద్దమున నీడ చూసుకోనా
నీ బింబాధరమున తేనీయలు దోచుకోనా

చరణం: 3
నీ అగమ్య లావణ్య ధునితరంగ డోళలందు
పగలు ఎరుగక రేయి ఎరుగక పరవశించిపోనా పరవశించి పోనా 




నను మరువని పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి:
తొలి సిగ్గుల తొలకరిలో తలవాల్చిన చంద్రముఖి
తెరలెందుకు నీకు నాకు దరి జేరవె ప్రియసఖి 

నను మరువని దొరవని తెలుసు
నను మరువని దొరవని తెలుసు
నా మదిలోన ఏముందొ అది నీకు తెలుసు

నను వలచిన చెలివని తెలుసు
నను వలచిన చెలివని తెలుసు
నా ఎదలోన ఏముందొ అది నీకు తెలుసు
నను వలచిన చెలివని తెలుసు

చరణం: 1
చెంపల కెంపులు దోచాలని 
సంపంగి నవ్వులు దూయాలని

ఆ .. ఆ .. ఆ
చెంపల కెంపులు దోచాలని 
సంపంగి నవ్వులు దూయాలని
నడుమున చేయి వేసి నడవాలని
నా ... నడుమున చేయి వేసి నడవాలని
అంటుంది అంటుంది నీ కొంటె వయసు 

నను వలచిన చెలివని తెలుసు
నా ఎదలోన ఏముందొ అది నీకు తెలుసు
నను వలచిన చెలివని తెలుసు

చరణం: 2
నీ రాజు తోడుగ నిలవాలని
ఈ ఏడు లోకాల గెలవాలని

ఆ .. ఆ .. ఆ
నీ రాజు తోడుగ నిలవాలని
ఈ ఏడు లోకాల గెలవాలని
బ్రతుకే పున్నమి కావాలని 
నీ ...బ్రతుకే పున్నమి కావాలని
కోరింది కోరింది నీ లేత మనసు

నను మరువని దొరవని తెలుసు
నా మదిలోన ఏముందొ అది నీకు తెలుసు
నను వలచిన చెలివని తెలుసు




నెలవంక తొంగి చూసింది పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి:
నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది
మనసైన చెలువ కనులందు నిలువ తనువెల్ల పొంగి పూచింది 

నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక నిలువెల్ల వెల్లి విరిసింది 

నెలవంక తొంగి చూసింది

చరణం: 1
ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికె
ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికె
ఏ పూలనోము ఫలమో నీ రూపమందు నిలిచె
సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసె 

నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది

చరణం: 2
ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి కలవరింత ఈనాటి కౌగిలింత
ఏనాటికైన ఏ చోటనైన విడిపోనిదోయి మన జంట 

నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక  నిలువెల్ల వెల్లి విరిసింది 
నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది




రోజాకొక్క మోజుగా పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝణ 
ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝణ ఝు 
ఘననాట్యము ఆడేఎడ తూలేవోయ్ ఎదమీద ॥ఝుణ॥ 

చరణం: 1
రోజున కొక మోజుగ 
మోజున కొక హాయిగ 
హాయికి ఒక తీపుగ 
తీపున కొక మత్తుగా
ఘన నాట్యము ఆడేయెడ తూలేవోయ్ 
ప్రియగానము చేసేయెడ సోలేవోయ్   ॥ఝణ || 

చరణం: 2
భావనకొక రాగముగ 
రాగముకొక సంగతిగ.... ఆ.... ఆ 
సంగతికొక మాధురిగ 
మాధురికొక మైకముగ 
ఘననాట్యము ఆడేయెడ తూలేవోయ్ 
ప్రియగానముచేసేయెడ సోలేవోయ్ సోలేవోయ్ ॥ఝణ || 





నీవు నాకు రాజా పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

నీవునాకు రాజా 
మరినీకు నేను రోజా 
నీ చెంతచేరి నా వింతచూపి 
నీ తంతు చూతులేరా 

చరణం: 1
మగువో మధువో తేలాలిరా 
తేలక నేను పోనురా 
హ హ హ అలాగా ఆ 
పొగరో, నగరో 
నీవో నేనో చూతురా 

చరణం: 2 
నీతో నాకు చెలగాటరా 
నీ కౌగిలి నా కోటరా 
ఆహ హ హ ఎట్లా 
చాటూ మాటూ 
అరసీ, మురిసీ పోదురా 
హ హ హ హ ఆ 




కన్నవారి పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల

కన్నవారి కన్నీరును తుడిచే 
తనయుని బ్రతుకే ధన్యమురా
గుణవంతుడైన తనయుణ్ని కన్న 
తలి దండ్రులదే పుణ్యమురా

చరణం: 1
ఏతల్లి దండ్రుల, ఎదపైన పెరిగానో 
ఎవ్వరి నీడలో యిన్నాళ్లు మెలిగావో 
ఆ కన్నవారికే కన్నయ్యవై 
కావడిలో మోసి వెళుతున్నావా 
నిత్యము నీజన్మ చరితార్ధము 
నిజధర్మమే నీ పరమార్ధము 
 
చరణం:  2 
సామ్రాజ్యము వీడి, సంపదలు విడనాడి 
సహనము, శీలము కవచాలుగా దాల్చి 
కన్నవారికే కంటిరెప్పవై 
కానలనే పడి పోతున్నావా 
నిత్యము నీజన్మ చరితార్ధము 
నిజధర్మమే నీ పరమార్ధము 





ఈశ్వరీ జయము నీవే పాట సాహిత్యం

 
చిత్రం: రాజకోట రహస్యం (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల, బృందం

శ్లోకం:
సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే

పల్లవి :
ఈశ్వరీ జయము నీవే పరమేశ్వరీ అభయమీవే
ఈశ్వరీ జయము నీవే పరమేశ్వరీ అభయమీవే

చరణం: 1
సూర్యులు కోటిగ చంద్రులు కోటిగ
మెరసిన తేజము నీవే దేవి
శక్తి వర్ధనివి వరదాయినివే (2)
ఇహమూ పరమూ నాకిక నీవే

చరణం: 2
మంత్రతంత్రముల మాయల ప్రబలిన
క్షుద్రుల పీడకు బలియగుటేనా
దుష్టశక్తులను రూపుమాపగ...  (2)
మహా మహిమనే నాకిడ లేవా

చరణం: 3
నిరపరాధులగు తల్లిదండ్రులు సతి
క్రూరుని హింసకు గురియగుటేనా
దుర్మార్గులనిక నాశము చేసి (2)
తరించు వరమిడి దయగనరావా

ఓం నారాయణి... ఓం నారాయణి

చరణం: 4
ప్రాణము లైదుగ వేదనలైదుగ
పరిపరి విధముల నినువేడితినే
అమోఘ మహిమల ఆదిశక్తివే
ఓం నారాయణి... ఓం నారాయణి
అమోఘ మహిమల ఆదిశక్తివే
చలమూ బలమూ నాకికనీవే దేవి... దేవి...
ఓం నారాయణి... ఓం నారాయణి (2)


Palli Balakrishna Monday, October 16, 2023



చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
నటీనటులు: కృష్ణ , రాజశ్రీ 
దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్ 
నిర్మాతలు: జి.రామం, చంద్రశేఖర్
విడుదల తేది: 05.03.1971



Songs List:



అబలని ఎందుకని పుట్టించావని పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

అబలని ఎందుకని పుట్టించావని 




ఇది ఎన్నడు వీడని కౌగిలి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

ఇది ఎన్నడు వీడని కౌగిలి 



కొట్టాడయ్య ఛాన్స్ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జె.వి.రాఘవులు 

కొట్టాడయ్య ఛాన్స్ కొట్టాడయ్య మొనగాడయ్య 




చిగురు వేసెనే చిలిపి కోరిక పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

చిగురు వేసెనే చిలిపి కోరిక 



దయచూడు యేసు ప్రభూ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: దాశరథి 
గానం: విజయలక్ష్మి కన్నారావు 

దయచూడు యేసు ప్రభూ 



పిల్లా ఓ పిల్లా నీకు ఒళ్లంతా సిగ్గే సిగ్గు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

పిల్లా ఓ పిల్లా నీకు ఒళ్లంతా సిగ్గే సిగ్గు 





మీద కొబ్బరి చెట్టు కింద చెరువు గట్టు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, విజయలక్ష్మి కన్నారావు

మీద కొబ్బరి చెట్టు కింద చెరువు గట్టు 


Palli Balakrishna Wednesday, August 17, 2022



చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
నటీనటులు: యన్.టి.రామారావు, రాజశ్రీ 
దర్శకత్వం: బి.వి.శ్రీనివాస్ 
నిర్మాత: బి.విఠలాచార్య 
విడుదల తేది: 17.10.1969



Songs List:



లేడి కన్నులు పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

లేడి కన్నులు రమ్మంటే 
లేత వలపులు జుమ్మం 
ఓలమ్మీ .... ఓలమ్మీ సై.... 

కన్నె మనసే నీదైతే 
కలికి వెన్నెల తోడైతే 
ఓరబ్బీ .....ఓరబ్బీ పై

వాగులా గలగల ఉరికీ
తీగలా మెలికలు తిరిగి
గుండెలో అల్లుకుపోతే 
గువ్వలా గుసగుస పెడితే...
ఓలమ్మీ పై .... ఓలమ్మీ పై ...

వాలుగా చూపులు చూసే 
పూల బాసలు చేసి
ముదుగా ఉందామంటే
ఇద్దరం ఒక టేనంటే 
ఓరబ్బీ .... ఓరబ్బీ పై .....




సరి సరి మగసిరి పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: కొసరాజు 
గానం: గాయనీ గాయకులు బృందం 

సరిసరి మగసిరి నీ అందము 
మరిమరి మనసుకు ఆనందము 
చక ఝణత తక ధిమిత 
రా రా రతిరాజా !

చిలకల కులుకులు చూడు
జిల్ జిల్ జిల్ సొగవే జోడు
వినరా హే సుకుమారా ధీరా 
కౌగిట చేరగ రా ! రా! 
లల్లలా జురా....జుం....జుం ....

ముసిముసి నవ్వుల తీరు 
విసిరే చూపుల జోరు
భళిరా రాజకుమారా రా రా
చల్లని వేళయిదేరా





అలాంటి దాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల 

అలాంటిదాన్ని గౌనుః యిలాంటిదాన్ని గాను 
ఎలాంటిదాన్నో నేను నీకిపుడె తెలిసిపోను 
లబ్జలకిడి లబ్జలకిడి చక్కని చకెర చక్కని చక్కెరకేళి॥ 

ఒయ్యారం ఒలక చూసే చిన్నదానినోయ్
చూపులతో గాలమేయు సుందరాంగినోయ్ 
ఎవరనుకున్నావు నన్నెరుగవులే నీవు
అబ్జలకిడి.....

కమ్మంగా పాటపాడి కవ్విస్తానోయ్ 
గజ్జెకట్టి ఆటలాడి నవ్విస్తానో య్ 
ఎవరనుకున్నావు నన్నెరగవులే నీవు
అబ్జలకిడి.....




పిలిచింది అందాల పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల 

హాయ్ లల్లలా.... లల్లలా 
లల్లలా.... లల్లలా.. యే యిదిగో నిన్నే... 
నిన్నే నిన్నే ...

పిలిచింది అందాల బాల నిను
వలచింది మందార మాల
హాయ్ రాజ రాజ ఠారా! అందాలే అందుకోరా!!

జాబిలిలేని కలువను నేను
కౌగిలిలేని పరువము నేను 
కలలో నిన్నే కనుగొన్నాను 
హాయ్ రాజ... రాజ...

వేచెను నీకె ఈ మధుమాసం 
పూచెను వీకై నాదరహాసం
దాచితి నీకై ఈ అవకాశం
హాయ్ రాజ... రాజ...





ఎవరో నీవెవరో పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఓ ప్రియతమా.. రావేలా... చెలిని చేరగ ఈ వేళ!
ఎవరో... నీవెవరో ఎదలో పిలిచీ
ఎదురుగ నిలిచీ
తీయని ఊహల ఊయల లూపేవు 

చొక్కపు బంగరుమేను: పొగరెక్కిన 
సింగపు నడుము చుక్కల రాయని సోయగమ్ము నెక 
సక్కెములాడే మోము ::
ఏ గంధర్వ లోకాల ఉన్నావో ఏ 
నీలాల గగనాలు దిగినావో
శత వసంతముల ప్రతినిధివీవు 
ప్రతిలేని రతిరాజు ప్రతిరూపమే నీవు

చంద్ర ఖండములు చెక్కిళ్లు
ఇంద్ర నీలములు ముంగురులు 
అ పాలకడలి కెరటాల కరణి 
నాలోన పొంగినవి మరులు
నీ అధరాన చిరునవ్వు విరిసింది 
నా హృదయాన విరిజల్లు కురిసింది.
వనమయూరీవోలె తనువూగినది
ఒక చింత గిలిగింత ఉయ్యాలలూపింది 




రవ్వల నవ్వుల పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

రవ్వల నవ్వుల రాజకుమారీ 
నా నవజీవన నాట్యమయూరీః
అందెలు పలుకగ రావే: 
గంధము చిలుకగ రావే!

ఈ వేళలో! ఏమున్నదో 
పలెకెనులోన కల్యాణ వీణ
ఆ రాగ మంజరిలోనా అనురాగ మాధురి లేదా
రవ్వల నవ్వుల రాజకుమారా 
రాజకుమారీ మానసచోరా
నా అణువణువున నీవే: 
నా ప్రాణములన్నీ నీవే.....

నయనాలలో నడిరేలలో 
విరబూసె నాలో నీరూపమాల
ఆ రూప మాలిక నీకై
అందిచు కానుక కాదా ....




కాకి ముక్కుకు దొండపండు పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల 

అత్తరులో మునిగివున్న నవాబూ...ప్యారే నవాబ్ :.
మత్తుగా తూలుతున్న జనాబూ....హాయ్ జనాబ్ :
కలికి వలపే పూలచెండు: మగువ సొగసే దొండపండు।

కాకిముక్కుకు దొండపండు దండగః దండగః
అది రామచిలకకు దొరికితేనే పండగః పండగః
వరహాల మూటలకన్న వజ్రాల కోటలకన్న 
ఖరీదైనది ప్రేమించే దిల్ 
అది వుంటేనే అందుతుంది బుల్ బుల్ 
కడకన్నులతో వేటాడేవా... కను బొమ్మలతో ఆటాడేవా 
చిరునవ్వుల పువ్వుల దోసిలితో వెంటాడేవాః

కన్నెపిల్ల కనబడితే... 
గాజుల గలగల వినబడితే 
అంతలోనే మైమరిచేరు కడకు
అడియాసల పాలౌతారు:

దొరబాబుల తీరు అంతేలే 
నవ్వాబుల జోరు ఇంతేలే..... 
ఆ నాటికి నేటికి మిగిలింది ఈ వింతేలే...

Palli Balakrishna Monday, January 31, 2022





చిత్రం: నిండు దంపతులు (1971)
సంగీతం: టి.వి.రాజు
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, విజయ నిర్మల, లక్ష్మి, చంద్రమోహన్
దర్శకత్వం: కె.విశ్వనాధ్ 
నిర్మాత: ఎం.జగన్నాధ రావు 
విడుదల తేది: 04.02.1971



Songs List:



ఓ శకుంతుల పాట సాహిత్యం

 
చిత్రం: నిండు దంపతులు (1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, బి.వసంత 

ఓ శకుంతుల




మల్లె పూలు పాట సాహిత్యం

 
చిత్రం: నిండు దంపతులు (1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, సుశీల 

మల్లె పూలు 




కొత్త పెళ్లి కూతురని పాట సాహిత్యం

 
చిత్రం: నిండు దంపతులు (1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: L.R.ఈశ్వరి

కొత్త పెళ్లి కూతురని 




గేదె ఓ గేదె పాట సాహిత్యం

 
చిత్రం: నిండు దంపతులు (1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

గేదె ఓ గేదె నా ముద్దుల గేదె 




ఔనంటాడు పాట సాహిత్యం

 
చిత్రం: నిండు దంపతులు (1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: సుశీల 

ఔనంటాడు



నీటి చాటున పాట సాహిత్యం

 
చిత్రం: నిండు దంపతులు (1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: L.R.ఈశ్వరి

నీటి చాటున 




అనగనగా ఒక ఊరు పాట సాహిత్యం

 
చిత్రం: నిండు దంపతులు (1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.లీల, వసంత 

అనగనగా ఒక ఊరు 





మల్లె పూలు (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: నిండు దంపతులు (1971)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల

మల్లె పూలు 

Palli Balakrishna Thursday, August 19, 2021


చిత్రం: నిన్నే పెళ్ళాడతా (1968)
సంగీతం: విజయ కృష్ణమూర్తి
సాహిత్యం: సినారె
గానం: సుశీల
నటీనటులు: యన్ .టి.రామారావు, భారతి
దర్శకత్వం: బి.వి.శ్రీనివాస్
దర్శకత్వ పర్యవేక్షణ: జి.విశ్వనాధం
నిర్మాత: బి. విఠలాచార్య
విడుదల తేది: 30.08.1968

పల్లవి:
మల్లెల పానుపు ఉంది...చల్లని జాబిలి ఉంది
నీ కోసమా నా కోసమా...
నీ కోసమా నా కోసమా...కాదోయి కాదు మన కోసమే

చరణం: 1
నీ జోడుగా నేనుంటానని...నీ జోడుగా నేనుంటానని
నీ నీడలో మేడ కడతానని..అన్నాను కాదా ఆనాడే
అది తీరలేదా ఈనాడే...ఏ..ఏ..

మల్లెల పానుపు ఉంది...చల్లని జాబిలి ఉంది
నీ కోసమా నా కోసమా...
నీ కోసమా నా కోసమా...కాదోయి కాదు మన కోసమే

చరణం: 2
అందాల గంధాలు అందించనా...అందాల గంధాలు అందించనా
పరువాల పన్నీరు చిందించనా...
కనరానిదోయి ఈ హాయి...మనసైన దోయి ఈ రేయి

మల్లెల పానుపు ఉంది...చల్లని జాబిలి ఉంది
నీ కోసమా నా కోసమా...
నీ కోసమా నా కోసమా...కాదోయి కాదు మన కోసమే...


Palli Balakrishna Friday, February 8, 2019

Most Recent

Default