Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Tarun Kumar"
Yuddham (2014)


చిత్రం: యుద్ధం  (2014)
సంగీతం: చక్రి
సాహిత్యం:
గానం: రేవంత్ , సాహితి కోమందురి (సోనీ)
నటీనటులు: తరుణ్ కుమార్, యామి గౌతమ్, శ్రీహరి
దర్శకత్వం: భారతి గణేష్
నిర్మాతలు: నట్టుకుమార్
విడుదల తేది: 14.03.2014

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏందీ ఈ ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగో..
ఇదిగో డార్లింగ్.. ఒక సారిటు సుడర్రాదు

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్
ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్
ఏంటేంటో డూయింగు ఏమైందో సంథింగ్
ఎద నిన్నే కాలింగు ఎంట్రీలో వెయిటింగ్
నేనిన్ను మిస్సింగు సేమ్ టు సేమ్ ఫీలింగు
మనమైతే మాచింగ్ చేసేద్దాం డేటింగ్
ఇంకేంటి సోది మీటింగు

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్

హలో హలో డార్లింగ్ డార్లింగ్  (2)
సునో సునో  డార్లింగ్ డార్లింగ్  (2)

హలో హలో డార్లింగ్ డార్లింగ్  (2)
ఏదో ఏదో ఫీలింగ్ ఫీలింగ్ (2)

చరణం: 1
గోళ్లు రంగు ఘోర రంగు హంగుపొంగులో
నన్ను చేసే డిస్టర్బింగ్
డిజైనింగ్ డెవలపింగ్ అన్ని రంగులు
పెళ్లిరోజే టోలేటింగు
అందాక డార్లింగ్ ఆకాల ఈటింగ్
బాబోద్దు క్రాసింగ్ దాస్తేనే థ్రల్లింగ్
హే నీ రూపే థింకింగ్ నీ పేరే రైమింగ్
ప్రేమంటే కాదా కేరింగూ..

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్

చరణం: 2
ఎవ్రిథింగ్ అమేజింగ్ పిల్ల సోకులు
ఎలుకుంటా లైఫ్ లాంగ్
ఎరైవింగ్ ఎటర్నింగ్ అందుకోసము
జంటగానే ట్రావిలింగు
ఏరేసను డార్లింగ్ స్వర్గాలే సంథింగ్
నువ్వేనా డేరింగ్ నీతోనే సంథింగ్
నువ్వే నా బ్రీతింగ్ నేనే నీ క్లోనింగ్
ఐపోతా నీలో మిక్సింగ్

ఏమైంది డార్లింగో కళ్ళలో ఏంటి ఫీలింగు
ఏం చెప్పను డార్లింగ్ గుండెలో ఉంది సంథింగ్


Palli Balakrishna Thursday, December 21, 2017
Veta (2014)


చిత్రం: వేట (2014)
సంగీతం: చక్రి
సాహిత్యం:
గానం: సింహా , గీతామధురి
నటీనటులు: తరుణ్ కుమార్, శ్రీకాంత్, మధురిమ, జాస్మిన్ భాసిన్
దర్శకత్వం: అశోక్ అల్లే
నిర్మాతలు: సి.వి.రావు, సి.కళ్యాణ్
విడుదల తేది: 21.03.2014

బావగారు బావగారు మీరు చాలా బాగున్నారు
బావగారు బావగారు మాకు ఎంతో నచ్చినారు
చక్కని చంద్రుడు మీరు చుక్కనే పట్టేశారు
మాయనే చేసేశారు మనసునే దోచేశారు
కన్నునే కలిపేశారు కలలో దించేశారు
ప్రేమని రాజేశారు గుండెని కాజేశారు
పెళ్లికి సిద్ధం చేశారు...

ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి

బావగారు ఓ బావగారు మీరు చాలా బాగున్నారు

ఏభైఐదు కేజీల గోల్డ్ మా అల్లరి అమ్మాయి
విల్లు చెదిరి కళ్యాణ జ్యూలరి ఇక మీ ఇల్లండి
చీరకట్టులో కొండపల్లి బొమ్మంటే నమ్మండి
మోడ్రన్ డ్రెస్ లో జన్నీఫర్ నే మరిపించేస్తుంది
లాకర్ లో బంగారాన్ని దాచేస్తా
మనప్పురం గోల్డ్ వారి తకట్టే పెట్టేయా
బొమ్మను ముద్దే చేస్తాను
అల్లరి మాన్పించేస్తాను
అమ్మను త్వరగా చేస్తానూ...

ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి

బావగారు బావగారు మీరు చాలా బాగున్నారు
మాకు ఎంతో నచ్చినారు

ఆంధ్రులందరి లవర్ బాయ్ ఈ మా అబ్బాయి
ఒక్క చూపుతో మనసు దోచే మన్మధుడితడోయి
హీరోయిన్స్ మోడల్స్ ట్రైచేసి విసిగారు
ఒక్క చాన్స్ మాకివ్వమంటు వెనకాలే తిరిగారు
అతిలోక సుందరిముందు ఆ అందమెంతండీ
జగదీక వీరుడి సత్తా చూపిస్తే బాగండి
అందం కోసం కాదండి ప్రేమతో ఒకటయ్యారండి
ఆశీస్సులందించేయండి ఓ ఓ...

ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి

Palli Balakrishna
Uncle (2000)



చిత్రం: అంకుల్ (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు
నటీనటులు: తరుణ్ కుమార్, పల్లవి
దర్శకత్వం: రాజశేఖర్ ( కన్నడ డైరెక్టర్)
నిర్మాత: ఏవియస్
విడుదల తేది: May 2000

పల్లవి:
ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం
ఆడే పాడే పాపగా 
గడపాలనుంది జీవితం
ఏదైవం ఇస్తాడో ఆ వరం 
ఏ దీపం చూపేనో ఆ వనం
వెదికి వెదికి వేసారిన

ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం

చరణం: 1
చినుకమ్మకు పడవాటలు
చిలుకమ్మకు పొడిమాటలు
నేర్పించే చిన్నారులతో
చిగురమ్మకు తొలిపూతలు
వెలుగమ్మకు తొలి జ్యోతలు
అనిపించే చిరునవ్వులతో
ప్రతిక్షణం సంతోషమే
ప్రతిస్వరం సంగీతమే
దివిజాబిలి దిగలేదని చిరుకోపాలా
తీయతియ్యగ ఉంటుంది కన్నీరైన
అలక సొగసే ఆ ప్రాయాన

ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం
ఆడే పాడే పాపగా 
గడపాలనుంది జీవితం

చరణం: 2
విలువెందుకు చదివేందుకు 
కలిమెందుకు బలిమెందుకు
పసితనమును కరిగిస్తుంటే
పాపాయిలుగా పుట్టి
పాపాలుగా మారే 
పయనం పేర పెరగడమంటే
తిరిగిరాని ఆ పెన్నిధి
ఏ సంపద కొనలేనిది
చేజారిన నా బాల్యమె వస్తానంటే
ఇన్నాళ్లుగ నన్నళ్లిన దారాన్నిట్టే
వదిలి తనతో వెళ్లాలని

ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం
ఆడే పాడే పాపగా 
గడపాలనుంది జీవితం
ఏదైవం ఇస్తాడో ఆ వరం 
ఏ దీపం చూపేనో ఆ వనం
వెదికి వెదికి వేసారిన

ఎన్నో ఎన్నో ఏళ్లుగా 
అడగాలనుంది ఓ వరం


Palli Balakrishna Monday, December 18, 2017
Chirujallu (2001)



చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: తరుణ్ కుమార్, రీచా
దర్శకత్వం: శ్రీరామ్
నిర్మాత: జి.వి.జి.రాజు
విడుదల తేది: 17.08.2001



Songs List:



రాదే...రాదే పాట సాహిత్యం

 
చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర, విశాల, వందేమాతరం శ్రీనివాస్

రాదే...రాదే 



కురిసింది చిరుజల్లు పాట సాహిత్యం

 
చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, విశాల

పల్లవి:
కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా
విరిసింది హరివిల్లు నీ చిరునవ్వుల్లా
చినుకుల్ని స్వాగతించే ఈ మట్టి వాసనలా
చిగురుల్నే మేలుకొలిపే సరికొత్త సరిగమల 
చిన్ననాటి అల్లర్ల తడి జ్ఞాపకంలా

కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా

చరణం: 1
నీ సరదాలన్నీ నా గుండెల్లో గువ్వలై వాలని
నీ కిలకిలలన్నీ నా కన్నుల్లో పువ్వులై విరియని
దివినుంచి తారకలన్ని దిగివచ్చేనా
మనకోసం వరములు ఎన్నో అందించేనా
ఆశలకే అవానమై నిను పిలిచా ఆషాడమై
పురివిరిసే మయూరమై బదులిచ్చా నీకోసమై
ఆ బదులే నా మదికి ముత్యాల జల్లు

కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా

చరణం: 2
నా ఏకాంతంలో వినిపించాయి ఘల్ అని మువ్వలు
నీ సావాసంలో చిగురించాయి ఝల్లనే ఊసులు
నువుమీటిన సంతోషాల శ్రావణవీణ
నిలువెల్లా కరిగిస్తుంది అనురాగాన
అడుగులలో నయాగర కనిపించే ఉత్సహమై
ఎద సడిలో సుధా స్వరం పలికించే సంగీతమై
మనసంత మురిపించె ఈ తేనె ముళ్ళు

కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా
చినుకుల్ని స్వాగతించే ఈ మట్టి వాసనలా
చిగురుల్నే మేలుకొలిపే సరికొత్త సరిగమల 
చిన్ననాటి అల్లర్ల తడి జ్ఞాపకంలా
విరిసింది హరివిల్లు నీ చిరునవ్వుల్లా



హయ్ రామా పాట సాహిత్యం

 
చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.పి.చరణ్, సుజాత 

హయ్ రామా 




భూదేవి బుగ్గ పాట సాహిత్యం

 
చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి
గానం: వందేమాతరం శ్రీనివాస్, చిత్ర 

భూదేవి బుగ్గ 



కలలో నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణ మూర్తి 

కలలో నువ్వే 



రెండే రెండంట పాట సాహిత్యం

 
చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు,, రాద శిరీషా , వందేమాతరం శ్రీనివాస్, టిమొతీ

రెండే రెండంట 

Palli Balakrishna Sunday, December 17, 2017
Chukkalanti Ammayi Chakkanaina Abbayi (2013)


చిత్రం: చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: శ్రావణి
నటీనటులు: తరుణ్ కుమార్, విమలా రామన్
దర్శకత్వం: కన్మణి
నిర్మాతలు: రాజ్ కుమార్ హీర్వాణి , గోగినేని శ్రీనివాస్
విడుదల తేది: 25.05.2013

కమ్మని ఒక కోరిక
తుమ్మెదై నను తాకగా
గుండెల్లోన విరహమాగేనా
వెచ్చని ఒక వేడుక వెల్లువై నను చేరగ
రెప్పల్లోన కలలు తీరే చిలిపి తరుణాన
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..

నన్నొచ్చి తాకే శ్వాసతో
మంచల్లే నేనే మారిన
వయసనే ఋతువులో మెరిసాక
కవ్వింత రేపే చూపులో
పువ్వల్లే నేను పూసినా
మనసుతో ఋతువుగా తగిలాక
పెదవులదిరి మధువు కురిసే
ఎదల అలజడిలో
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..

తప్పేది కాదే తాపమే
ఒప్పేసుకుంది ప్రాణమే
తమకమే జగముగా ఎగిసాక
వద్దంటు ఇంకా దూరమే
ఇచ్చేసి నీకు భారమే
సుఖమయే కడలిలో మునిగాక
తపన పెరిగే తనువు ఒదిగే
వలపు అలుపులలో
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..
ఇది ప్రేమా..ఇది ప్రేమా..

కమ్మని ఒక కోరిక
తుమ్మెదై నను తాకగా
గుండెల్లోన విరహమాగేనా


Palli Balakrishna
Adrustam (2002)


చిత్రం: అదృష్టం (2002)
సంగీతం: దిన
సాహిత్యం: సాహితి
గానం: సుజాత, ఉన్ని కృష్ణన్
నటీనటులు: తరుణ్ కుమార్, గజాల, రీమాసేన్
దర్శకత్వం: శేఖర్ సూరి
నిర్మాతలు: మాన్సూర్ అహ్మద్, పరాస్ జైన్, వాకాడ అప్పారావు
విడుదల తేది: 06.06.2002

పల్లవి:
వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా
మొదటిసారిగా కలిశా
అతని ధ్యాసలో తడిశా
తెలియకున్నదే వయసా
ప్రేమకాదు కద బహుశా

వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా

చరణం: 1
ఆకతాయి చెలి నవ్వుల మహిమలు వారెవా
తాడులేని గాలమేసి మనసును లాగవా
ఎంతహాయి మరి వెతికిన దొరకదు ఓ ప్రియా
ఓపలేని తీపి బాధ బహుమతి లేవయా
ఆశలు తీరాలి కలలే నిజమవ్వాలి
జాబిలి పంపాలి నడిజాబులునవ్వాలి
ఇదివరకింతలేదులే వయసుకి తొందర
ఈనాడే నే వింటున్నా మది చేసే గోడవ

వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా

చరణం: 2
రాక రాక వనికిన పెదవుల గతి చూడవా
మౌనరాగ మాలకించి ఎదగుడి చేరవా
ఈడులోన ప్రతి నిమిషము తికమకలే కదా
ఆడగాలి తాకినంత బడలిక తీరదా
నా జత చేరాలి ఒకటై చలరేగాలి
ఓపిక కావాలి సుముహూర్తము రావాలి
కుదురగ ఉండలేనయ ఉంటా నీ దయా
ఈనాడే నే చూస్తున్నా కనులారా నీ చొరవ

వయసా వయసా నిను నే మరిచా
మనసే తెరచి ఇపుడే చూశా
మొదటిసారిగా కలిశా
అమె ధ్యాసలో తడిశా
తెలియకున్నదే వయసా
ప్రేమకాదు కద బహుశా

వయసా వయసా నిను నే మరిచా
ఇపుడే చూశా... ఇపుడే చూశా...

Palli Balakrishna Saturday, December 16, 2017
Soggadu (2005)


చిత్రం: సోగ్గాడు (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వేణు , కౌశల్య
నటీనటులు: తరుణ్ కుమార్ , ఆర్తి అగర్వాల్, శ్రేయా శరన్
దర్శకత్వం: రవిబాబు
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 31.03.2005

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా
ఓ ఓ మనసా వినవా పెదవి చాటు ఈ మాట
ఓ ఓ ఒకటే గొడవ కుదురులేదు ఈ పూట
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా
ఓ ఓ మనసా వినవా పెదవి చాటు ఈ మాట
ఓ ఓ ఒకటే గొడవ కుదురులేదు ఈ పూట
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా

Palli Balakrishna Wednesday, December 6, 2017

Most Recent

Default