Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sunkara Ramabrahmam"
Chanakya (2019)


 






చిత్రం: చాణక్య (2019)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్, శ్రీ చరణ్ పాకల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిణి ఇవటూరి
నటీనటులు: గోపిచంద్, మెహ్రీన్ కౌర్ పిర్జాద, జీనా ఖాన్
దర్శకత్వం: తిరు
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
విడుదల తేది: 05.10.2019

డార్లింగ్ మై డియర్ డార్లింగ్
ఎందుకంత ఫైరింగ్
చూడమాకు చుర చుర చురా

ఫీలింగ్ గుండెలోని ఫీలింగ్
కళ్ళలోన వెయిటింగ్
గుర్తుపట్టి తెలుసుకో జరా

నిమ్మళంగ ఉన్న దాన్ని
నింగిదాక ఎగిరేసి
ప్రేమ గీమ లేదు అంటూ
మాట తప్పుకూ

కమ్మనైన కలలోన
నిన్ను నన్ను కలిపేసి
వాల్ పోస్టరేసినాక
ప్లేటు తిప్పకూ

అంత సీన్ లేదు రా
ఆటలాడు కోకురా
ఆడపిల్ల అడుగుతోందని

నాటకాలు మానరా
దాచిపెట్టలేవురా 
మనసులోన ఉన్న ప్రేమని

నిద్దరలొ నడిచి వచ్చి
నా కలల్లో తిరుగుతూ
ఏం తెలియనట్టు ఏంటలా

పొద్దుపోని ఊసులాడి
నాతోపాటే గడుపుతూ
గుర్తుండనట్టు ఆటలా

నా మనసిది నీ ప్రేమ దాడికి
అల్లాడుతున్నది
ఈ సొగసిది నిన్ను చేరడానికి
వేచివున్నది

జగమును గెలిచిన
మగసిరి మధనుడ
ఆడ మనసు చదివి చూడరా సరిగా

డార్లింగ్ మై డియర్ డార్లింగ్
ఎందుకంత ఫైరింగ్
చూడమాకు చుర చుర చురా

ఫీలింగ్ గుండెలోని ఫీలింగ్
కళ్ళలోన వెయిటింగ్
గుర్తుపట్టి తెలుసుకో జరా

నిమ్మళంగ ఉన్న దాన్ని
నింగిదాక ఎగిరేసి
ప్రేమ గీమ లేదు అంటూ
మాట తప్పుకు

కమ్మనైన కలలోన
నిన్ను నన్ను కలిపేసి
వాల్ పోస్టరేసినాక
ప్లేటు తిప్పకు

అంత సీన్ లేదు రా
ఆటలాడు కోకురా
ఆడపిల్ల అడుగుతోందని

నాటకాలు మానరా
దాచిపెట్టలేవురా
మనసులోన ఉన్న ప్రేమని


Palli Balakrishna Saturday, January 23, 2021
Bangaru Bullodu (2021)



చిత్రం: బంగారు బుల్లోడు (2021)
సంగీతం: సాయి కార్తిక్
నటీనటులు: అల్లరి నరేష్ , పూజా జెవేరి
దర్శకత్వం: పి. వి. గిరి
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
విడుదల తేది: 23.01.2021



Songs List:



స్వాతిలో ముత్యమంత పాట సాహిత్యం

 

చిత్రం: బంగారు బుల్లోడు (2021)
సంగీతం: సాయి కార్తిక్
సాహిత్యం: వేటూరి
గానం: ఎల్.వి.రేవంత్, నాధప్రియ

(ఈ పాట నందమూరి బాలకృష్ణ , రవీనా టాండన్ కలిసి నటించిన బంగారు బుల్లోడు (1993) చిత్రంలోనిది. ఈ సినిమాకు దర్శకత్వం రవిరాజా పినిశెట్టి, నిర్మాత వి. బి.రాజేంద్ర ప్రసాద్, సంగీతం రాజ్-కోటి, పాడినవారు బాలు, చిత్ర)

వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా
వానా వానా వచ్చేనంటా వాగు వంకా మెచ్చేనంటా...

ఓహో... ఓహో...

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో - అందాలెన్నో యాలో యాల...

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 1
తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
మేనక మెరపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ
శ్రావణ సరిగమ యవ్వన ఘుమ ఘుమ లయనీదమ్మ
వానా వానా వల్లప్పా వాటేస్తేనే తప్పా
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా కాదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 2
వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా

తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
వానల్లోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగా
గాలి వాన గుళ్ళోనా ముద్దేలే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో - అందాలెన్నో - యాలో యాల...

వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా





కనక మహాలక్ష్మి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (2021)
సంగీతం: సాయి కార్తిక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దత్తు, M.L. గాయత్రి

నేనేమో పటాసు నువ్వేమో మాచిసు
నువు నేను జంటైతే బ్రేక్ అయిపోతాది
సైలెన్సు సైలెన్సు సైలెన్సు
భూగోళం తప్పుదే బ్యాలన్సు
నేను నీకు గాగుల్సు నువు నాకు బ్యాంగిల్స్
మన ఇద్దరి జోడికి షాక్ అయిపోతారే
కపుల్పు కపుల్పు కపుల్సు
ఆకాశం తాకేలా విజిల్సు
చలో రయ్ రయ్ రయ్ రయ్ వచ్చింది లైసెన్సు
ఒకటైపోయేలా చిక్కింది చాన్సు
తక తై... తై... ... తై... గాల్లో తేలే డ్రీమ్సు
ఇక చూసుకో నీలో నాలో హ్యాపీ ఫీలింగ్సు

ఓయ్ కనక మహాలక్ష్మి బొడ్డు కనక మహాలక్ష్మి
లైఫ్ అంతా నీతో ఉంటా నీ అందంతో ఆటాచ్మీ
కనక మహాలక్ష్మి బొడ్డు కనక మహాలక్ష్మి
రోజు రోజా ఇస్తా నీకు రొమాన్స్ గట్రా టీచ్ మీ

నేనేమో పటాసు నువ్వేమో మాచిసు
నువు నేను జంటైతే బ్రేక్ అయిపోతాది
సైలెన్సు సైలెన్సు సైలెన్సు
భూగోళం తప్పుదే బ్యాలన్సు

అట్టా ఎట్లా పుడితివే బబ్లీ బార్బీ బొమ్మలా
సెటిలైపోతివే దిల్ మొబైల్ సిమ్ములా
చెప్పమంటే కష్టమే నా అందాల ఫార్ములా
చెయ్యి పట్టి ఏలుకో 2 ఇన్ 1 స్కీములా
లెఫ్ట్ రైట్ తళ తళ ఫ్రంట్ బ్యాక్ గళ గళ
అయ్యబాబోయ్ ఏ యాంగిల్ లో నిన్నే చూడాలే
ఆశ పడ్డ కొంటె కల అంత దూరమెందుకలా
గుండెపై నెక్కలేసులా పెట్టేసుకుంటాలే

ఓయ్ కనక మహాలక్ష్మి బొడ్డు కనక మహాలక్ష్మి
లైఫ్ అంతా నీతో ఉంటా నీ అందంతో ఆటామ్మో
కనక మహాలక్ష్మి బొడ్డు కనక మహాలక్ష్మి
రోజు రోజా ఇస్తా నీకు రొమాన్స్ గట్రా టీచ్ మీ

నేనేమో పటాసు నువ్వేమో మాచిసు
నువు నేను జంటైతే బ్రేక్ అయిపోతాది
సైలెన్సు సైలెన్సు సైలెన్సు
భూగోళం తప్పుదే బ్యాలన్సు




యానాం పంతులు గారు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (2021)
సంగీతం: సాయి కార్తిక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాకేత్

యానాం పంతులు గారు ఎప్పుడో చెప్పేసారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు
యానాం పంతులు గారు ఎప్పుడో చెప్పేసారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు

నీ నా ఇంటి పేరు ఎప్పుడో కలిపేసారు
ఇకపై మిగిలిందొకటే దండల తారుమారు

కృష్ణమాయే నీకు నాకు ఇలా 
వేసినాదే పూల సంకెలా
దక్కినావే కన్నె రాధాల 
నా మనసే విన్నట్టే

తేలిపోయా నింగి తారల 
పేలిపోయా గాలి బూరల
ఇంత హాయా 
కుందనాల బొమ్మలాగా నాతో నువ్వుంటే

యానాం పంతులు గారు ఎప్పుడో చెప్పేసారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు

ఒక్కటంటే ఒక్క జీవితం 
నువ్వు పక్కనుంటే ఎంత అద్భుతం
నువ్వుగా వందేళ్ల పండుగైనా
గుండె నిండెనే స్వర్గాల అమృతం
బుజ్జి గుండె తెల్ల కాగితం 
దానిపైన నువ్వు ప్రేమ సంతకం

నవ్వులే గులాబీ పువ్వులై 
నీ కాలి బాటకు వరాల స్వాగతం
సీతాకోక నువ్వుగా నీపై చుక్క నేనుగా
చుక్కలదాకా సాగనే నాలో సంబరం
అందమైన మత్తు మందులా 
లక్షకోట్ల లంకె బిందెలా 
చేరినావే ప్రేమ లేఖలా
నా రంగుల రసగుల్లా...

యానాం పంతులు గారు ఎప్పుడో చెప్పేసారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు
నీ నా ఇంటి పేరు ఎప్పుడో కలిపేసారు
ఇకపై మిగిలిందొకటే దండల తారుమారు


Palli Balakrishna
Sita (2019)


చిత్రం: సీత (2019)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: లక్ష్మీ భూపాల్
గానం: అర్మాన్ మాలిక్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోను సూద్
దర్శకత్వం: తేజ
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
విడుదల తేది: 24.05.2019

కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
ఓ ఓ కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
ఆ నవ్వులో సిరిమల్లెలై
పూయాలిలే నీ పెదవంచులో
ఈ పూలకి ఆరాటమే చేరాలని జడ కుచ్చిళ్ళలో
ఓ ఇంద్ర దనస్సే వర్ణాల వానై
కురిసెను జల జల చిటపట చినుకులుగా

కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా

ఈ చల్లగాలి ఓ మల్లెపూవై
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం నీ నవ్వుకోసం
ఓ మెరుపు లేఖే రాయాలి (2)

సెలయేరు పైన జలతారు వీణ
పలికెను గల గల సరిగమ పదనిసగ

కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా

నీలాల నింగి చుక్కల్ని తెచ్చి
నక్షత్రమాలే వెయ్యాలి
నీకంటి నీరు వర్షించకుండా
దోసిల్ల గొడుగే పట్టాలి (2)

ఏ కష్టమైనా ఉంటాను తోడై
తడబడు అడుగున జతపడి నేనున్నా

కూ కూ కూ కూ
కుహూ కుహూ అని కోయిలమ్మ
తీయగ నిన్నే పిలిచిందమ్మ
కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా




Palli Balakrishna Thursday, June 27, 2019
Bindaas (2010)



చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి, గురు చరణ్ 
నటీనటులు: మంచు మనోజ్, షీన శతాబ్ది
దర్శకత్వం: వీరు పోట్ల
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల తేది: 05.02.2010



Songs List:



గిరిజ గిరిజ పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కార్తీక్, చిన్మయి & కోరస్: సంత్యన్, సామ్

గిరిజ గిరిజ 



బిందాస్ పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: భువనచంద్ర
గానం: రంజిత్, Mc బుల్లెట్, కొ కొ నందా 

బిందాస్



ఏంటమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: భువనచంద్ర
గానం: కార్తీక్, అనురాధ శ్రీరామ్, మంచు మనోజ్ 

ఏంటమ్మా 




సురాంగని పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: జస్సి గిఫ్ట్ 

సురాంగని 



జుమ్ గర గర పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శివం, RJ సుచిత్ర 

జుమ్ గర గర 



క్యారెక్టర్ ఆఫ్ అజయ్ పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: భువనచంద్ర 
గానం: సంత్యన్, సామ్, సువి 

క్యారెక్టర్ ఆఫ్ అజయ్ 




స్పిరిట్ ఆఫ్ బిందాస్ పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: గురు చరణ్ 
సాహిత్యం: భువనచంద్ర 
గానం: హేమచంద్ర 

స్పిరిట్ ఆఫ్ బిందాస్




సురాంగని (Version 2) పాట సాహిత్యం

 
చిత్రం: బిందాస్ (2010)
సంగీతం: బొబొ శశి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: Mc బుల్లెట్, కొ కొ నందా

సురాంగని  (Version 2)

Palli Balakrishna Tuesday, February 19, 2019
Action 3D (2013)



చిత్రం: యాక్షన్ 3D (2013)
సంగీతం: బప్పి లహరి , సున్నీ ఎం.ఆర్ ( BGM)
నటీనటులు: అల్లరి నరేష్  శామ్, వైభవ్, రాజు సుందరం, నీలం ఉపాద్యాయ, స్నేహ ఉల్లాల్, కామ్న జఠ్మలాని, షీనా శతాబ్ది
దర్శకత్వం: అనిల్ సుంకర
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల తేది: 21.06.2013

Palli Balakrishna Friday, February 15, 2019
James Bond (2015)



చిత్రం: జేమ్స్ బాండ్ (2015)
సంగీతం: సాయి కార్తిక్ 
నటీనటులు: అల్లరి నరేష్ , సాక్షి చౌదరి 
దర్శకత్వం: సాయి కిషోర్ మచ్చా 
నిర్మాత: రామబ్రహ్మం సుంకర 
విడుదల తేది: 24.07.2015



Songs List:



ఓ జానే జానా పాట సాహిత్యం

 
చిత్రం: జేమ్స్ బాండ్ (2015)
సంగీతం: సాయి కార్తిక్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: రాహుల్ నంబియార్ 

ఓ జానే జానా 



బుల్లెట్ పాట సాహిత్యం

 
చిత్రం: జేమ్స్ బాండ్ (2015)
సంగీతం: సాయి కార్తిక్ 
సాహిత్యం: విశ్వా 
గానం: సాయి చరణ్ భాస్కరుని 

బుల్లెట్



అరే హల్లో హల్లో పాట సాహిత్యం

 
చిత్రం: జేమ్స్ బాండ్ (2015)
సంగీతం: సాయి కార్తిక్ 
సాహిత్యం: భువనచంద్ర 
గానం: రంజిత్ 

అరే హల్లో హల్లో





సన్నజాజి పక్క మీద పాట సాహిత్యం

 
చిత్రం: జేమ్స్ బాండ్ (2015)
సంగీతం: సాయి కార్తిక్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: M.L.R. కార్తికేయన్, దివిజ కార్తీక్ 

(ఈ పాట అల్లరి నరేష్  నటించిన దొంగల బండి (2008) సినిమాలో మరియు  జేమ్స్ బాండ్ (2015) సినిమాలలో రీమిక్స్ చేశారు.   ఈ పాటను  కృష్ణ , శ్రీదేవి నటించిన వజ్రాయుధం (1985) సినిమాలో నుండి తీసుకున్నారు  దీనికి కె. చక్రవర్తి సంగీతం అందించగా యస్.పి. బాలు, యస్. జానకి గాత్ర దానం చేశారు)

సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి

సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
హా...

పాలు పట్టుకొచ్చాను.. పంచదార వేసుకో
పండు పట్టుకొచ్చాను.. పక్కకొచ్చి పంచుకో
పాలుపంచుకుంటాను పడుచందాము
పండిచ్చుకుంటాను పట్టి మంచము
సర్దుచెయ్యకు నిశిరాత్రి
ముద్దు తీర్చుకో నడిరాత్రి
సర్దుచెయ్యకు నిశిరాత్రి
ముద్దు తీర్చుకో నడిరాత్రి
హద్దు చెరుపుకో తొలిరాత్రి తొలిరాత్రి

ఏయ్ సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
హా...

తెల్లచీర తెచ్చాను తెల్లవార్లు కట్టుకో
మల్లె పూలు తెచ్చాను మంచమంతా జల్లుకో
చిన్ని పంట తేనేలన్ని నువ్వు పిండుకో
కోడికూత పెట్టించి నువ్వు పండుకో
రతికే తెలియని రస రాత్రి
శృతిలే కలిసిన సుఖ రాత్రి
రతికే తెలియని రస రాత్రి
శృతిలే కలిసిన సుఖ రాత్రి
ఎరగని వాళ్లకి యమ రాత్రి యమ రాత్రి

సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి
పెదవులు అడిగిన రుచి రాత్రి
కౌగిలి అడిగిన కసి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
కవ్విస్తున్నది చలి రాత్రి
హా...




అమ్మోరు తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: జేమ్స్ బాండ్ (2015)
సంగీతం: సాయి కార్తిక్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సింహా 

అమ్మోరు తల్లి 

Palli Balakrishna
Raju Gadu (2018)


చిత్రం: రాజుగాడు (2018)
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హేమచంద్ర
నటీనటులు: రాజ్ తరుణ్, అమైరా డస్టర్
దర్శకత్వం: సంజనా రెడ్డి
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
విడుదల తేది: 01.06.2018

రాజుగాడు మన రాజుగాడు
లవ్వులోన పడిపోతన్నాడు
రాజుగాడు మన రాజుగాడు
లవ్వులోన పడిపోతన్నాడు

రబ్బరు బుగ్గల రాంసిలకా
రయ్యంటున్నా నీ వెనకా..ఆఆ..
రంగుల పొంగుల రసగుళికా
నువ్వు పుట్టిందే మరి నా కొరకా..ఆఅ
ఓ ఎస్ అంటే చాలంటా
నిను గుండెకు లోపల మడతెడతా..ఆఅ..
జి.ఎస్.టి కి భయపడక
నువు కోరినవన్నీ కొనిపెడతా..ఆఅ...

రబ్బరు బుగ్గల రాంసిలకా
రయ్యంటున్నా నీ వెనకా..ఆఆ..
రంగుల పొంగుల రసగుళికా
నువ్వు పుట్టిందే మరి నా కొరకా..ఆఅ

ఫాక్స్ టైలే తొక్కానే
ది బెస్ట్ నిన్నే చేరానే
నిలువెత్తున నీలో గ్లామరు
క్యూటే సో హాటే
ఫాస్ట్ ఫార్వార్డ్ చేశానే
మన లైఫ్ సినిమా చూశానే
ఒక ఫ్రేములో నువ్వూ నేనూ
ఉంటే బొంబాటే
వెయిటింగ్ చేసీ వేలంటైన్ ఐ
నిను చేరానే
వాల్యూం పెంచీ పదిమందికిలా
లౌడ్ స్పీకర్ లా ఈ న్యూసే
హాపీ గా చెప్పాలే

రబ్బరు బుగ్గల రాంసిలకా
రయ్యంటున్నా నీ వెనకా..ఆఆ..
రంగుల పొంగుల రసగుళికా
నువ్వు పుట్టిందే మరి నా కొరకా..ఆఅ

రేసు హార్సై దూకానే
ఆ మార్సు దాకా ఎగిరానే
ఏ నిమిషం చెప్పావో నువు
ఓకే డబుల్ ఓకే
దిల్ బ్యాటరీలే పగిలేలా
లవ్ లాటరీలా తగిలావే
శుభవార్తై చేశావే అటాకే కిర్రాకే
అపుడో ఇపుడో
ప్రేమవుతుందనుకున్నా గానీ
ఇంతటి త్వరగా
నీ కంపెనిలో లవ్ సింఫనిలో
మునకేస్తా అనుకోలే సరెకానీ

రబ్బరు బుగ్గల రాంసిలకా
రయ్యంటున్నా నీ వెనకా..ఆఆ..
రంగుల పొంగుల రసగుళికా
నువ్వు పుట్టిందే మరి నా కొరకా..ఆఅ
ఓ ఎస్ అంటే చాలంటా
నిను గుండెకు లోపల మడతెడతా..ఆఅ..
జి.ఎస్.టి కి భయపడక
నువు కోరినవన్నీ కొనిపెడతా..ఆఅ...

రబ్బరు బుగ్గల రాంసిలకా
రయ్యంటున్నా నీ వెనకా..ఆఆ..
రంగుల పొంగుల రసగుళికా
నువ్వు పుట్టిందే మరి నా కొరకా..ఆఅ

Palli Balakrishna Saturday, January 26, 2019

Most Recent

Default