-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sriranjani Jr."


చిత్రం: ఉమా సుందరి (1956)
సంగీతం: జి. అశ్వద్ధామ
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం (All)
నటీనటులు: యన్. టి. రామరావు, పసుపులేటి కన్నాంబ, శ్రీరంజని జూనియర్, నాగయ్య, సురభి బాలసరస్వతి
దర్శకత్వం: పి. పుల్లయ్య
నిర్మాత: యం. సోమసుందరం
విడుదల తేది: 20.07.1956



Songs List:



మాయా సంసారం తమ్ముడు పాట సాహిత్యం

 
చిత్రం: ఉమా సుందరి (1956)
సంగీతం: జి. అశ్వద్ధామ
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం
గానం: పిఠాపురం

పల్లవి:
మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు

చరణం : 1
ముఖము అద్దము ఉందీ మొగమాటమెందుకు
సుఖదుఃఖములు లెక్క చూసుకో తమ్ముడు
ముఖము అద్దము ఉందీ మొగమాటమెందుకు
సుఖదుఃఖములు లెక్క చూసుకో తమ్ముడు

సకల సమ్మోహన సంసారమందున
సకల సమ్మోహన సంసారమందున
సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్నా
సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్నా

మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు

చరణం: 2
కోరి తెచ్చుకున్న భారమంతే గానీ
దారా పుత్రులు నిను దరి జేర్చుతారా
కోరి తెచ్చుకున్న భారమంతే గానీ
దారా పుత్రులు నిను దరి జేర్చుతారా

తేరి చూసి నిజము తెలుసుకో తమ్ముడు
తేరి చూసి నిజము తెలుసుకో తమ్ముడు
సారము సత్యం సర్వం పరమాత్మ

మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు

చరణం: 3
వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది
వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది
పోయేటప్పుడు కొని పోయేదేముంది
పోయేటప్పుడు కొని పోయేదేముంది

అద్దె కొంప లోకమంతేరా తమ్ముడు
అద్దె కొంప లోకమంతేరా తమ్ముడు
వద్దు పొమ్మనగానే వదిలేసి పోవాలి

మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు





నమ్మకురా ఇల్లాలు పిల్లలు పాట సాహిత్యం

 
చిత్రం: ఉమా సుందరి (1956)
సంగీతం: జి. అశ్వద్ధామ
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం
గానం: ఘంటసాల, పిఠాపురం

నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా
తోలుబొమ్మలురా జీవా
నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా
తోలుబొమ్మలురా జీవా

సమ్మతించి నను నమ్మిన వారికి సాయుజ్యమురా జీవా 
శివ సాన్విజ్యమురా జీవా
సమ్మతించి నను నమ్మిన వారికి సాయుజ్యమురా జీవా 
శివ సాన్విజ్యమురా జీవా 

ఘోర దురిత సంసార జలదిలో జ్ఞానమే చేయూత
ఆజ్ఞానమే ఎదురీత
జీవా జ్ఞానమే చేయూత ఆజ్ఞానమే ఎదురీత
ఘోర దురిత సంసార జలదిలో జ్ఞానమే చేయూత
ఆజ్ఞానమే ఎదురీత
జీవా జ్ఞానమే చేయూత ఆజ్ఞానమే ఎదురీత

మోహమెందుకీ జీవము పై ఇది తోలు తిత్తిరా జీవా ఉత్త గాలి తిత్తిరా జీవా
మోహమెందుకీ జీవము పై ఇది తోలు తిత్తిరా జీవా ఉత్త గాలి తిత్తిరా జీవా

నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా
తోలుబొమ్మలురా జీవా

Palli Balakrishna Sunday, June 27, 2021
చిత్రం: గీతాంజలి (1948)
సంగీతం: కె. ప్రకాశ రావు
సాహిత్యం:
గానం:
నటీనటులు:
దర్శకత్వం: టి. హనుమంతరావు
నిర్మాణ సంస్థ: శ్యామలా ఫిల్మ్స్
విడుదల తేది: 05.03.1948

Palli Balakrishna Tuesday, May 11, 2021





చిత్రం: జీవనతరంగలు (1973)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: శోభన్ బాబు, కృష్ణంరాజు, వాణిశ్రీ, లక్ష్మి, చంద్రమోహన్, శ్రీరంజని Jr.
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: డి. రామానాయుడు
విడుదల తేది: 1973



Songs List:



ఈ అందానికి బంధం పాట సాహిత్యం

 
చిత్రం: జీవనతరంగలు (1973)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి:
ఈ అందానికి బంధం వేశానొకనాడు
ఆ బంధమే నాకందమైనది ఈనాడు

చరణం: 1
నీ కళ్లు ఆనాడు ఎరుపెక్కెను
నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను
నీ చేతులానాడు తెరలాయెను
నేడు ఆ తెరలె కౌగిలై పెనవేసెను

చరణం: 2
నీ వేడిలోనే నా చలువ ఉందని
వాన ఎండను చేరింది
నీ చలువే నా వేడికి విలువని
ఎండే వానను మెచ్చింది

ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో
ఇంద్రధనస్సే విరిసింది
ఏడురంగుల ముగ్గులు వేసి
నింగీనేలను కలిపింది
ప్రేమకు పెళ్లే చేసింది




ఈ జీవనతరంగాలలో... పాట సాహిత్యం

 
చిత్రం: జీవనతరంగలు (1973)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

పదిమాసాలు మోశావు పిల్లలను
బ్రతుకంతా మోశావు బాధలను
ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు

పల్లవి :
ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము

చరణం: 1
కడుపు చించుకు పుట్టిందొకరు
కాటికి నిన్ను మోసేదొకరు
తలకు కొరివి పెట్టేదొకరు
ఆపై నీతో వచ్చేదెవరు... ఆపై నీతో వచ్చేదెవరు
ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము

చరణం: 2
మమతే మనిషికి బందిఖానా
భయపడి తెంచుకు పారిపోయినా
తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది
తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది
నీ భుజం మార్చుకోమంటుంది
ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము

చరణం: 3
తాళి కట్టిన మగడు లేడని
తరలించుకు పోయే మృత్యువాగదు
ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు
ఆ కన్నీళ్ళకు చితిమంటలారవు
ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు
ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము
ఈ జీవనతరంగాలలో...




నందామయా గురుడ పాట సాహిత్యం

 
చిత్రం: జీవనతరంగలు (1973)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల

పల్లవి:
నందామయా - గురుడ
నందామయా
ఉందామయా....తెలుసుకుందామయా

చరణం: 1
మెరిసే సంఘం మేడిపండు - దాని
పొట్ట విప్పిచూస్తే పురుగులుండు (2)
ఆ కుళ్లులేని చోటూ - యిక్కడే
ఆ కుళ్లులేని చోటూ - యిక్కడే
అనుభవించు రాజా - యిప్పుడే
ఆనందసారం యింతేనయా!
ఆనందసారం యింతేనయా! 

చరణం: 2
పుట్టినప్పుడు బట్టకట్టలేదు
పోయేటప్పుడు అది వెంటరాదు (2)
నడుమ బట్టకడితే నగుబాటు
నడుమ బట్టకడితే నగుబాటు
నాగరీకం ముదిరితే పొరపాటు
వేదాంతసారం యింతేనయా!
వేదాంతసారం యింతేనయా!
వేదాంతసారం యింతేనయా!




పుట్టినరోజు పండగే అందరికి పాట సాహిత్యం

 
చిత్రం: జీవనతరంగలు (1973)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల

పల్లవి :
పుట్టినరోజు పండగే అందరికి
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
పుట్టినరోజు పండగే అందరికి
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
ఎందరికి ఎందరికి...

చరణం: 1
కలిమికేమి వలసినంత ఉన్నా
మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది
ఆ మనసే ఎంత పేదైదైనా
అనురాగపు సిరులు పంచుతుంది
మమత కొరకు తపియించే జీవనం
మమత కొరకు తపియించే జీవనం
దైవమందిరంలా పరమపావ నం
పుట్టినరోజు పండగే అందరికి
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
ఎందరికి... ఎందరికి...

చరణం: 2
పువ్వెందుకు తీగపై పుడుతుంది
జడలోనో గుడిలోనో నిలవాలని
ముత్యమేల కడలిలో పుడుతుంది
ముచ్చటైన హారంలో మెరవాలని
ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని
తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని
తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని
తానున్నా... లేకున్నా...
తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి
పుట్టినరోజు పండగే అందరికి
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
ఎందరికి... ఎందరికి...




తెంచుకుంటావా పాట సాహిత్యం

 
చిత్రం: జీవనతరంగలు (1973)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల, L.R. ఈశ్వరి 

తెంచెయ్...
ఆగు...అది సవిత్రమైన మంగళ సూత్రం
కాదు కాదు... అది బలవంతాన వేసిన వురితాడు..

తెంచుకుంటావా ?
ఉంచుకుంటావా ?
అది పవిత్రమైన మంగళ సూత్రం... మంగళ సూత్రం
ఇది బలవంతాన వేసిన వురితాడు... పురితాడు... వురితాడు...

ఎవరు వేశారు ?
ఏనాడో విధి నీ నొసటను రాశాడు.
ఆది అతడు చేశాడు... నీ భర్తెనాడు
ఎవరు భర్త... ? ఆ మనసులేని పశువా ?
పశువు కట్టినదా మాంగల్యం ?
కసాయితోనా దాంపత్యం... ?
మనసు చచ్చీ బ్రతికితే నువు మనిషివి కావు
ఉరితాటి కింత పసుపు రాస్తే తాళి కాదు...
తెంచెయ్...

తెంచుకుంటావా...?
ఉంచుకుంటావా... ?
భగవాన్...
నాకెందుకీ శిక్ష... ?
ఏమిటీ పరీక్ష... ?
నేను కోరుకోలేదే ?
నాకు తెలిసి జరగలేదే ?
పిచ్చిదానా.....
ఎలా జరిగినా పెళ్లి పెళ్లే
నువ్వేనాటికైనా అతని సతివే
ఒక్కసారే ఆడదానికి పెళ్లి జరిగేది
తెంచుకున్నా తీరిపోని బంధమే యిది
తాళి తెంచే దెవరికమ్మా
ఆ పై ... ఆడబ్రతుకు దేనికమ్మా-
ఆడబ్రతుకు దేవికమ్మా....




ఉడతా ఉడుతా ఊచ్ పాట సాహిత్యం

 
చిత్రం: జీవనతరంగలు (1973)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, రమోల

పల్లవి : 
ఉడతా ఉడతా హూత్...
ఎక్కడి కెళతావ్ హూత్ ...
కొమ్మమీది...జాంపండు
కోసుకొస్తావా... మా
బేబీకిస్తావా ?......

చరణం : 
చిలకమ్మా! ఓ చిలకమ్మా
చెప్పేది కాస్తా వినవమ్మా !!
నీ పంచదార పలుకులన్నీ
బేబీకిస్తావా... నూ
బేబీకిస్తావా...?

చరణం :
ఉరకలేసే  ఓ జింకా 
పరుగులాపవె నీవింకా
నువు నేర్చుకున్న పరుగులన్నీ
బేబీకిస్తావా... మా బేబీకిస్తావా ?

చరణం :
చిలకల్లారా, కోకిలలారా !
చెంగున దూకే జింకల్లారా!
చిన్నారి పాపలముందు మా
చిన్నారి పాపలముందు-మీ రెంత... ?

Palli Balakrishna Sunday, August 13, 2017

Most Recent

Default