-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sam C. S."



చిత్రం: దిల్ రూబా (2025)
సంగీతం: సామ్ సి.ఎస్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లన్
దర్శకత్వం: విశ్వ కరుణ్ 
నిర్మాణ సంస్థలు: శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ, ఏ యూడ్లీ ఫిలిం
విడుదల తేది: 14.03.2025



Songs List:



అగ్గిపుల్లే అలా గీసినట్టు పాట సాహిత్యం

 
చిత్రం: దిల్ రూబా (2025)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం: 	భాస్కర్ బట్ల
గానం: అనురాగ్ కులకర్ణి

అగ్గిపుల్లే అలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి దుమారమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు

నీవే అగ్గిపుల్లే అలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి దుమారమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు

పొరపాటుగా ఓ మాటని
నేనే జారానులే
సరేలే అని వదిలేయక
రోజు ఎందుకీ గొడవలే

హే నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ
నీక్కూడా నాతో వచ్చేంత ప్రేమ
అంతంత దూరం ఎంతెంత నేరం
ఓ చిన్న నవ్వు నవ్వవే

నీ అగ్గిపుల్లే అలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి దుమారమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు

హో ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం
ఆ బుంగమూతేంటే బంగారం
ఎంటంత పంతం శాంతించు కొంచెం
ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం

ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం
ఆ బుంగమూతేంటే బంగారం
ఎంటంత పంతం శాంతించు కొంచెం
ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం

చంపొద్దే చంపొద్దే కారాలు నూరి
నీవల్లే పోతుందే ప్రాణం పొలమారి
కన్నుల్లో నిండావే కన్యాకుమారి
కన్నెత్తి చూడు ఒక్కసారి

నీ అగ్గిపుల్లే అలా
కోపంగా చూడకే
గాలి దుమారమే
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు

పొరపాటుగా అన్నాలే
సర్లే అని వదిలేయ్‍వే
చంపొద్దే చంపొద్దే నీవే





హేయ్ జింగిలీ పాట సాహిత్యం

 
చిత్రం: దిల్ రూబా (2025)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: సామ్ సి.ఎస్

హేయ్ జింగిలీ హేయ్ జింగిలీ
నా జిందగీ నిండుగా జల్లావు రంగులే
హేయ్ జింగిలీ హేయ్ జింగిలీ
నా సింగిలు లైఫునే తిప్పావు రింగులే జింగిలీ

లబ్ డబ్ లబ్ డబ్ హార్టుబీటు ఆగిపోయే
లవ్ లవ్ లవ్ లవ్ లవ్ పాటలాగా మారిపోయే
లబ్ డబ్ లబ్ డబ్ హార్టుబీటు ఆగిపోయే
లబ్ డబ్ లవ్ లవ్ లవ్ పాటలాగా మారిపోయే

మొదలయింది లోపలేదో యుద్ధమే ఓ హో
ఓడిపోత నేను నీకోసమే ఓ ఓ
మరింతగా మరింతగా మరింత దగ్గరవ్వవే
నీ గుండెదో నా గుండెదో
ఈ చప్పుడెవరిదంటే తెలియకూడదే

ఏం నవ్వుతున్నావే
కళ్లతోటి పొడిచి పొడిచి
నా ప్రాణమే నువ్వు
వెళ్లిపోకే విడిచి విడిచి

ఏం నవ్వుతున్నావే
కళ్లతోటి పొడిచి పొడిచి
నా ప్రాణమే నువ్వు
వెళ్లిపోకే విడిచి విడిచి

మైకుసెట్టులో ఓ ఓ ఓల్డ్ సాంగులా ఓ ఓ
లాగినావే నా రాకుమారీ మారీ
నిప్పు పెట్టిన తేనే పట్టులా
రేపినావే ఆశలొక్కసారి ఆశలొక్కసారి

నచ్చావులే మచ్చలేని జాబిలమ్మా
నీ వల్లనే ఎత్తాను చూడు కొత్త జన్మ
మెల్లగా మాయమైంది కంటిచెమ్మ
ఎందుకే నేనంటే నీకు ఇంత ప్రేమా

ప్రతీ క్షణం ఈ హాయిలో ఈ హాయిలో
ఇలా ఇలా ఉంటాను
తడిచి తడిచి తడిచి

నీ వెంట వస్తానే
నిదురలోనూ నడిచి నడిచి
దూరాన్ని పెంచొద్దే
జ్ఞాపకాలు తుడిచి తుడిచి

నీ వెంట వస్తానే
నిదురలోనూ నడిచి నడిచి
దూరాన్ని పెంచొద్దే
జ్ఞాపకాలు తుడిచి తుడిచి

హేయ్ జింగిలీ హేయ్ జింగిలీ
నా జిందగీ నిండుగా జల్లావు రంగులే
జింగిలీ హేయ్ జింగిలీ
నా సింగిలు లైఫునే
తిప్పావు రింగులే జింగిలీ ఓ ఓ ఓ




కన్నా నీ ప్రేమ సంద్రమే పాట సాహిత్యం

 
చిత్రం: దిల్ రూబా (2025)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం: 		విశ్వ కరుణ్, భాస్కరభట్ల రవికుమార్
గానం: సత్యప్రకాష్ , మాళవిక సుందర్

కన్నా నీ ప్రేమ సంద్రమే
నేను నీ తీరమే
కన్నా నువ్వు నా ప్రాణమే
నేనే నీ దేహమే

అలలుగా తాకగానే
కరిగిపోనా నీలో
ప్రళయమై తాండవిస్తే
అలజడే నాలో ఓ ఓ ఓ

ఓ నీవే నీవే నా ఎదను విడిచావ్
నన్నే నన్నే నన్నే ఒంటరి చేశావ్
అటో ఇటో ఎటో దారే మరచిన
నన్నే నాలో వెతుకుతున్నా

నీవే నీవే నా ఎదను విడిచావ్
నన్నే నన్నే నన్నే ఒంటరిని చేశావ్
అటో ఇటో ఎటో దారే మరచిన
నన్నే నాలో వెతుకుతున్నా

కన్నా నీ ప్రేమ సంద్రమే
నేను నీ తీరమే
కన్నా నువ్వు నా ప్రాణమే
నేనే నీ దేహమే

ఒకరికి ఒకరం అని రాసిన
మన ప్రేమకథా
ఎవరికీ ఎవరో అని
ఇలా ముగిసెనో కదా

ఒకరికి ఒకరం అని రాసిన
మన ప్రేమకథా
ఎవరికీ ఎవరో అని
ఇలా ముగిసెనో కదా

మనసా మనసా అలసిపోకే
కలగా కలగా కరిగిపోయే
తననే తననే మరచిపోవే
మనసా ఆ ఆ
ప్రేమకే నీ ప్రేమకే ఈ యుద్ధమే ఏ ఏ

నీవే నీవే నా ఎదను విడిచావ్
నన్నే నన్నే నన్నే ఒంటరిని చేశావ్
అటో ఇటో ఎటో దారే మరచిన
నన్నే నాలో వెతుకుతున్నా

నీవే నీవే నా ఎదను విడిచావ్
నన్నే నన్నే నన్నే ఒంటరిని చేశావ్
అటో ఇటో ఎటో దారే మరచిన
నన్నే నాలో వెతుకుతున్నా

కన్నా నీ ప్రేమ సంద్రమే
నేను నీ తీరమే
కన్నా నువ్వు నా ప్రాణమే
నేనే నీ దేహమే





KCPD పాట సాహిత్యం

 
చిత్రం: దిల్ రూబా (2025)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం: 		విశ్వ కరుణ్
గానం: సAbhishek AR

KCPD



మధురం పాట సాహిత్యం

 
చిత్రం: దిల్ రూబా (2025)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం:	సెనాపతి భరద్వాజ్ పాత్రుడు 
గానం: శరత్ సంతోష్ 

మధురం 

Palli Balakrishna Thursday, April 30, 2026



చిత్రం: క (2024)
సంగీతం: సామ్ సీఎస్ 
నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన సారిక, తన్వి రామ్ 
దర్శకత్వం: సుజిత్, సందీప్ 
నిర్మాతలు: చింతల గోపాల కృష్ణారెడ్డి, వినీషా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి 
విడుదల తేది:31.10.2024



Songs List:



World of Vasudev పాట సాహిత్యం

 
చిత్రం: క (2024)
సంగీతం: సామ్ సీఎస్ 
సాహిత్యం: శనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: కపిల్ కపిలన్ 

ఏ మొదలు తుదలు లేని ప్రయాణం
ఏ అలుపు సొలుపు రాని విహారం
ఏ చెరలు తెరలు తెలియని పాదం
ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం

నిన్న మొన్న ఉన్న నన్ను చూసారా
వెన్ను దన్ను అంటు ఏముంది…
ఒంటరి వాడినని అంటారా
నాతో పాటు ఊరుంది…

పచ్చని కొండాకోనల్లో
చిత్రంగ ముస్తాబై వుంది
సాగి ఉన్న రేయిలోన… ఆహా ఏముంది
కాగడాల కాంతిలోన… ఇంకా బాగుంది

ఏ మొదలు తుదలు… లేని ప్రయాణం
ఏ అలుపు సొలుపు రాని విహారం
ఏ చెరలు తెరలు తెలియని పాదం…
ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం…

ప్రేమతో ఎన్నో లేఖలూ, ఊ ఊ
రాసేనే చూసే చూపులూ, ఊ ఊ

రేపో ఎల్లుండో… రాణి గుండెల్లో
దర్జాగా నేనుంటా… రాజా హోదాలో
మునిగా నవ్వుల్లో… తేలా గాలుల్లో
ఆనందం ఎంతుందో… ఒక్కో బంధంలో

చుట్టూరా అంత ప్రేమ
కాదా ఇది నా చిరునామా
చిందేసే చెట్టు చేమా, ఆ ఆ

ఏ మొదలు తుదలు… లేని ప్రయాణం
ఏ అలుపు సొలుపు రాని విహారం
ఏ చెరలు తెరలు తెలియని పాదం…
ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం…



క మాస్ జాతర పాట సాహిత్యం

 
చిత్రం: క (2024)
సంగీతం: సామ్ సీఎస్ 
సాహిత్యం: శనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: దివాకర్, సామ్ సీఎస్ 

క మాస్ జాతర 




బుజ్జమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: క (2024)
సంగీతం: సామ్ సీఎస్ 
సాహిత్యం: శనపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: శరత్ సంతోష్

కనులకు కానుకలా కనబడినావే
కొడవలి చూపులతో కలబడినావే
తలవగ నీవే కలవరమాయే
కలకలమాయే…

ఓ బుజ్జమ్మాయి… ఓ బుల్లమ్మాయి
నీ రెండు కళ్ళు చూడగానే
చిట్టి గుండె చిత్తు చిత్తు
బుజ్జమ్మాయి ఓ బుల్లమ్మాయి
యే గుట్టు రట్టు చెయ్యనట్టి
కట్టు బొట్టు మీద ఒట్టు

మనసు నీదే నెరజాన
అందుకోవే నజరానా
నవ్వు పిట్ట నా మోము వాకిట
వాలింది నీ వలనే

భామ భామ
సత్యభామ సత్యభామ
సొగసే సుతారమ
సత్యభామ సత్యభామ
నడకే నిదానమా
సత్యభామ సత్యభామ
పలుకే ప్రశాంతమా
అందాల సత్యభామా భామా
అంతా నీ మహిమా

ఆ, వంపు సొంపు లింపుగున్న వయ్యారీ
చెంపలోనే కెంపులున్న చింగారీ
దిష్టి చుక్క పెట్టుకోవే సింగారీ, సింగారీ…

ముద్దు ముద్దు మాటలాడు చిన్నారీ
ముచ్చటైన రూపు నీది పొన్నారీ
ముగ్గులోకి దించి నన్ను ముంచావే, కావేరీ…

హే కాపలాగ కాచుకున్న
కాలాన్ని కొల్లగొట్టు మాయలాడివమ్మ
హే చూపురువ్వి చిచ్చురేపే
చందమామవమ్మ

ఓ మిస్సమ్మాయి… కస్సు బుస్సమ్మాయి
నీ రెండు కళ్ళు చూడగానే
చిట్టి గుండె చిత్తు చిత్తు
మిస్సమ్మాయి… కస్సు బుస్సమ్మాయి
యే గుట్టు రట్టు చెయ్యనట్టి
కట్టు బొట్టు మీద ఒట్టు…

మనసు నీదే నెరజాన
అందుకోవే నజరాన
నవ్వు పిట్ట నా మోము వాకిట
వాలింది నీ వలెనే
భామ భామ

సత్యభామ సత్యభామ
సొగసే సుతారమ
సత్యభామ సత్యభామ
నడకే నిదానమా
సత్యభామ సత్యభామ
నన్నే వరించుమా


Palli Balakrishna Saturday, April 18, 2026

 


చిత్రం: మోసగాళ్లు (2021)
సంగీతం: శ్యామ్ సి.ఎస్
సాహిత్యం: సిరాశ్రీ (సి.రామ్ శ్రీకాంత్)
గానం: ఎస్. హరిచరణ్
నటీనటులు: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, రుహీ సింగ్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్రా
దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్
నిర్మాతలు: మంచు విష్ణు, అర్. విజయ్ కుమార్
విడుదల తేది: 19.03.2021







డబ్బులు సంపాదించాలంటే
రైటు రాంగు డిస్కషనొద్దు కన్నా
స్కీమే అయినా స్కామే అయినా
రెండు ఒకటే తప్పే లేదురా అన్నా

లోకం మొత్తం డబ్బుల మూటలు 
పడి ఉన్నాయిరా బ్రదరు
దమ్మునోడు తెలివున్నాడు
ఏరుకుపోతుంటాడు
దిమాక్ తోటి, తెగింపు తోటి
డబ్బుని గెల్చుకుంటే
గెలిచినోడిని ఓడినవాడు 
మోసం అంటే ఎట్టా ఎట్టా ఎట్టా

హా... డబ్బులు సంపాదించాలంటే
రైటు రాంగు డిస్కషనొద్దు కన్నా
స్కీమే అయినా స్కామే అయినా
రెండు ఒకటే తప్పే లేదురా అన్నా

నీలాసు ఒకడికి గెయిను
నీ గేయిను ఒకడికి లాసు
ఏముంది ఇందులో ఫాల్సు
ఈ సత్యం వినరా బాసు 
బాసు బాసు బాసు







చిత్రం: మోసగాళ్లు (2021)
సంగీతం: శ్యామ్ సి.ఎస్
సాహిత్యం: సిరాశ్రీ (సి.రామ్ శ్రీకాంత్)
గానం: హేమచంద్ర

డబ్బే మనది కుమ్మెస్కో మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్లీ మందే ఏసేస్కో ఏస్కో ఏస్కోరోయ్
కోరికలన్నీ తీర్చేస్కో నచ్చినవన్నీ తెచ్చేస్కో
రాతే నువ్వు మార్చేస్కో లైఫే నీదేరోయ్

ఆ చేతుల్లోన డబ్బేలేని కాలం దాటి పోయింది
పీకల్దాకా డబ్బుల్లోన మునిగే డేస్ వచ్చాయి
చేతిలోని జాతకరేఖ మొత్తం మారిందోయ్
ఇదే ఇదే మన టాలెంటోయ్

డబ్బే మనది కుమ్మెస్కో మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్లీ మందే ఏసేస్కో ఏస్కో ఏస్కోరోయ్
కోరికలన్నీ తీర్చేస్కో నచ్చినవన్నీ తెచ్చేస్కో
రాతే నువ్వు మార్చేస్కో లైఫే నీదేరోయ్

ఏదేమైనా కోరు చెంత చేరు నీకు
పైసా పవరే చూడు బ్రదర్
అంబానీలు అయినా టాటా బిర్లా అయినా
దోస్తులేరా నీకు ఇదర్ ఉదర్ బ్రదర్

డబ్బే మనది కుమ్మెస్కో మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్లీ మందే ఏసేస్కో ఏస్కో ఏస్కోరోయ్
కోరికలన్నీ తీర్చేస్కో నచ్చినవన్నీ తెచ్చేస్కో
రాతే నువ్వు మార్చేస్కో

డబ్బే మనది కుమ్మెస్కో మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్రీ మందే ఏసేస్కో ఏస్కో ఏస్కోరోయ్

కోటల్లోనా లైఫు కోటి పైన కారు
కోరుకుంటే నీదే, పదా...
అందమైన లోకం అంతులేని సౌఖ్యం
కాళ్ళ కింద ఉంది కదా...

డబ్బే మనది కుమ్మెస్కో మస్తీ మస్తీ చేసేస్కో
కాస్ట్లీ మందే ఏసేస్కో ఏస్కో ఏస్కోరోయ్
కోరికలన్నీ తీర్చేస్కో నచ్చినవన్నీ తెచ్చేస్కో
రాతే నువ్వు మార్చేస్కో లైఫే నీదే లే (2)






Palli Balakrishna Monday, February 8, 2021


చిత్రం: అర్జున్ సురవరం (2019)
సంగీతం: సామ్ సి.ఎస్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి, చిన్మయి శ్రీపాద
నటీనటులు: నిఖిల్ సిద్దార్ధ, లావణ్య త్రిపాఠి
దర్శకత్వం: టి.యన్. సంతోష్
నిర్మాత: రాజ్ కుమార్ ఆకెళ్ల
విడుదల తేది: 2019


నా మనసిల మనసిల
ఓ మనసే కోరుకుందే
నీ మనసుకె మనసుకె
ఆ వరసే చెప్పమందే
ఏమో ఎలా చెప్పెయ్యడం
ఆ తీపి మాటే నీతో
ఏమో ఎలా దాటేయ్యడం
ఈ తగువే తకదిమి తోమ్

ఏదో తెలియనిదే
ఇన్నాళ్లు చూడనిదే
నేడే తెలిసిందే
మునుపెన్నడూ లేనిది
మొదలౌతుందే

ఎదో జరిగిందే
బరువేదో పెరిగిందే
మౌనం విరిగిందే
పెదవే విప్పే వేళ ఇదే

కన్నె కన్నె రెప్పే వేస్తే
ని కళలోకే నడిచలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేను మరిచానే
కన్నె కన్నె రెప్పే వేస్తే
ని కళలోకే నడిచలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేను మరిచానే

తియ్యగా తీయతియ్యగా
నీ తలపులు పంచావేల
దాచుతూ యేమర్చుతూ
నిన్ను నువ్వే దాస్తావెందుకలా

ఓ చినుకు...కిరణం
కలగలిపే మెరుపె హరివిల్లే
సమయం వస్తే
ఆ రంగులు నీకు కనపడులే

మెల్లగా మెల్ల మెల్లగా
మన దారులు కలిసెనుగా
హాయిలో ఈ హాయిల
ఆకాశాలే దాటేస్తాగా
ఇన్నాళ్ల నా ఒంటరితనమే
చేరిగెను ని వల్లనే
చూపులతో కాకా పెదవులతో
చెప్పేయి ఈ మాటలనే

కన్నె కన్నె రెప్పే వేస్తే
ని కళలోకే నడిచలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేను మరిచానే
కన్నె కన్నె రెప్పే వేస్తే
ని కళలోకే నడిచలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేను మరిచానే

కదలిక తొలి కదలిక
నా నిలకడ తలపుల్లో
సడలిక తొలి సడలిక
మరి చుట్టూ బిగిసిన సంకేలలో
ఈ కలహం విరహం
తియ్యని తరహగుండాలు విడుదలేలా

వినవా చెలియా కనిపించని
పెదవుల పలుకులిలా
మొదలిక తొలిసారిగా
నా ఎదలో అలజడులే
నిదురిక కారువవగా
మరి కుదురే కుదురే చెదిరెనులే

ఇన్నేళ్ల కాలం మెరిసెనులే
నిన్నే  కలిసిన వేళా
నా ఊహల విస్మయ విశ్వంలో
వెన్నెల నీ చిరునవ్వే

కన్నె కన్నె రెప్పే వేస్తే
ని కళలోకే నడిచలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ
నన్నే నేను మరిచానే
కన్నె కన్నె రెప్పే వేస్తే
ని కళలోకే నడిచలే
నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ


నన్నే నేను మరిచానే


Palli Balakrishna Tuesday, March 19, 2019

చిత్రం: NOTA (2018)
సంగీతం: శామ్. సి.ఎస్
నటీనటులు: విజయ దేవరకొండ, మేహరీన్ కౌర్ పిర్జాద
దర్శకత్వం: ఆనంద్ శంకర్
నిర్మాత: జ్ఞానవేల్ రాజా
విడుదల తేది: 05.10.2018

Palli Balakrishna Tuesday, February 12, 2019


చిత్రం: కణం (2018)
సంగీతం: శామ్ సి.ఎస్.
సాహిత్యం: కృష్ణ మదినేని
గానం: అరవింద్ శ్రీనివాస్, అను ఆనంద్
నటీనటులు: నాగసౌర్య, సాయిపల్లవి
దర్శకత్వం: విజయ్ ఎ. ఎల్
నిర్మాత: సుభాస్కరన్
విడుదల తేది: 27.04.2018

నిను చూసి ఎన్నెలంతా
అలిగెళ్ళిపోదా ఇల్లా
నీ రేడు ఈడే పిల్లా

నా కలా కథా నువ్వూ
నా జగం సగం నువ్వూ

నాలోన నువ్వు
నా ముందు నువ్వూ
నా శ్వాసలోనా నువ్వూ

సంజాలీ సంజాలీ
నువ్వేలే నా రంగోలీ
సంజాలీ సంజాలీ
నీతోనే నా రంగేళీ
నా వరము నీవనీ

నిను చూసి ఎన్నెలంతా
అలిగెళ్ళిపోదా ఇల్లా
నీ రేడు ఈడే పిల్లా

కౌగిలై చిరు కౌగిలై
నీ ప్రేమలే కురిసే
ఊపిరై నీ ఊపిరై
నా శ్వాసలో కలిసే

నా కన్నుల్లోనా దాచుకున్న మెరుపా
నా గుండెల్లోనా మోగుతున్న పిలుపా

నాదన్న లోకమే నీదనీ

సంజాలీ సంజాలీ
నువ్వేలే నా రంగోలీ
సంజాలీ సంజాలీ
నీతోనే నా రంగేళీ
సంజాలీ సంజాలీ


******  ******  ******


చిత్రం: కణం (2018)
సంగీతం: శామ్ సి.ఎస్.
సాహిత్యం: కృష్ణ మదినేని
గానం: స్వాగత ఎస్.కృష్ణన్


జో లాలిజో జో లాలిజో
నీ లాలిపాటను మరచావేలా
ఏ బంధమో మీకున్నదీ
నీ నీడల్లే నిన్నే చేరెనిలా
జో లాలిజో జో లాలిజో
నీ లాలిపాటను మరచావేలా
తానెవ్వరో నువ్వెవ్వరో
అమ్మా అంటు ఆ గుండె పిలిచెలే

నువ్వు చూసిన ప్రాణమే నీతో నడిచే
కొంగు పట్టి వెంట కదిలె నీతో నీడలా
గాయం కనిపించని నీ గేయం ఇదిలే
ప్రాణమవని ప్రాణమేదో ప్రాణమే కోరెన్
వెన్నెలో పుట్టే నీజాబిలమ్మా
నీ కంటి వెలుగై తానున్నదే
నీకేమి కానీ నీ భాగమేదో
నిను వీడిపోకా తోడున్నదీ
కాలం మళ్ళీ ఎదురవ్వదూ

దింపేసిన భారమే శ్వాసై కలిసే
నువ్వు కనని జననమేదో నిన్నే చేరెనే
నువ్వే కనిపెంచనీ నీ రూపం తనదో
అమ్మ ఐనా అమ్మ కానీ అమ్మతో ఉన్నదో
పొద్దుల్లో అలసి నువ్వు సోలిపోతే
నీ కురులే నిమిరే ఓ అమ్మలా
నీ కంటి వెనుక కలలేవొ తెలిసి
నీ ముందు నిలిపే పసిపాపలా
పాశం నిన్ను ప్రేమించెనే

Palli Balakrishna Friday, February 1, 2019

Most Recent

Default