Search Box
చిత్రం: లవ్ బర్డ్స్ (1996) సంగీతం: ఏ. ఆర్. రెహమాన్ సాహిత్యం: సిరివెన్నెల (All) నటీనటులు: ప్రభుదేవా, నగ్మా దర్శకత్వం: పి.వాసు నిర్మాత: శ్రీమతి వి. నిర్మల రాజు విడుదల తేది: 1996
Songs List:
Come On Come On పాట సాహిత్యం
చిత్రం: లవ్ బర్డ్స్ (1996) సంగీతం: ఏ. ఆర్. రెహమాన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: మనో Come On Come On
మనసున మనసుగా పాట సాహిత్యం
చిత్రం: లవ్ బర్డ్స్ (1996) సంగీతం: ఏ. ఆర్. రెహమాన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: హరిహరన్ , చిత్ర మనసున మనసుగా నిలిచిన కలవా పిలిచినా పలకగ ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా మనసున మనసుగా నిలిచిన కలవా పిలిచినా పలకగ ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లే ప్రేమావరాల జల్లు కావా పిలుపే అందుకొని బదులే తెలుపుకొను కౌగిట ఒదిగి ఉండనీవా నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ నిరుక్షించు స్నేహం కోరి జతనై రానా రానా ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట మనసున మనసుగా నిలిచినా కలవా పిలిచినా పలకగ ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా పువ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమా విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమా కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై వేటాడు ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై నువ్వు నేను చెరి సగం అవుదాం వయస్సు పండించే వరమై ప్రియమైన అనురాగం పలికింది మధు గీతం తుదే లేని ఆనందం వేచేనే నీ కోసం మనసున మనసుగా నిలిచినా కలవా పిలిచినా పలకగ ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా...
రేపే లోకం పాట సాహిత్యం
చిత్రం: లవ్ బర్డ్స్ (1996) సంగీతం: ఏ. ఆర్. రెహమాన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఉన్ని కృష్ణన్ , సుజాత మోహన్ రేపే లోకం
నో ప్రాబ్లం పాట సాహిత్యం
చిత్రం: లవ్ బర్డ్స్ (1996) సంగీతం: ఏ. ఆర్. రెహమాన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: అపాచి ఇండియన్, ఏ. ఆర్. రెహమాన్ నో ప్రాబ్లం
సాంబ సాంబ పాట సాహిత్యం
చిత్రం: లవ్ బర్డ్స్ (1996) సంగీతం: ఏ. ఆర్. రెహమాన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: అస్లాం ముస్తఫా సాంబ సాంబ
Love Birds (1996)
చిత్రం: కొండపల్లి రాజా (1993) సంగీతం: యమ్. యమ్. కీరవాణి నటీనటులు: వెంకటేష్ , సుమన్ , నగ్మా స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి నిర్మాత: కె.వి.వి.సత్యనారాయణ విడుదల తేది: 09.07.1993
Songs List:
కొండపల్లి రాజా పాట సాహిత్యం
చిత్రం: కొండపల్లి రాజా (1993) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి. బాలు కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న ఓ బసవన్నా గుండెలోన పొంగే ప్రేమ నీదిరా వినరన్నా ఓ బసవన్నా పశువంటె మనిషికి అలుసు మనసున్న నీకది తెలుసు అ ఆ ఇ ఈ రానె రాదు అయినా మాయా మర్మం లేదు కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న ఓ బసవన్నా గుండెలోన పొంగే ప్రేమ నీదిరా వినరన్నా ఓ బసవన్నా కన్నతల్లిలా పాలనిచ్చి ప్రాణం పోసే త్యాగం ఉన్న గొప్ప జాతి నీది సొమ్ము చూపిస్తే గొంతు కోసి రంకెలేసే జాలిలేని పాడు లోకం మాది తెలుసా బసవన్న నీకైనా యెందుకు ఇంతటి భేదం క్షణమే బతుకన్న ఓ బసవన్న మనిషికి లేదురా పాశం కాటికెళ్ళినా కాసు వీడడు సాటివాడిపై జాలి చూపడు డబ్బును మేసే మనుషులు కన్న గడ్డిని మేసే నువ్వె మిన్న కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న ఓ బసవన్నా గుండెలోన పొంగే ప్రేమ నీదిరా వినరన్నా ఓ బసవన్నా మబ్బు డొంకల్లో దూసుకెళ్ళే పక్షిని చూసి కూర్చినాడు మనిషి విమానం వాగు వంకల్లో ఈదుకెళ్ళే చేపని చూసి నేర్చినాడు పడవ ప్రయాణం దివికి భువికి ముచ్చటగా నిచ్చెన వేసిన మనిషి చెలిమి కలిమి నలుగురికి ఎందుకు పంచడు తెలిసీ తరిగి పోనిది ప్రేమ ఒక్కటే తిరిగి రానిది ప్రాణమొక్కటే ప్రాణం కన్నా స్నేహం మిన్న స్నేహం లేని బతుకే సున్నా కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న ఓ బసవన్నా గుండెలోన పొంగే ప్రేమ నీదిరా వినరన్నా ఓ బసవన్నా పశువంటె మనిషికి అలుసు మనసున్న నీకది తెలుసు అ ఆ ఇ ఈ రానె రాదు అయినా మాయా మర్మం లేదు కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న ఓ బసవన్నా గుండెలోన పొంగే ప్రేమ నీదిరా వినరన్నా ఓ బసవన్నా
గువ్వం గుడుగుడు పాట సాహిత్యం
చిత్రం: కొండపల్లి రాజా (1993) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: భువనచంద్ర గానం: మనో , యస్.పి. శైలజ హే గువ్వం గుడు గుడు గువ్వా నీ సర్వం చెరిసగమివ్వ పెదవి పెదవి కలిసే క్షణమిది సిరిమువ్వా రగిలే పొగిలే ఒడిలో కథ బలపడనివ్వ రెక్కపట్టి రెచ్చకొట్టి చుట్టుముట్టి ఛీఛీకొట్టి దుడుకు దుడుకు వయసు ముడుపులడిగిన హే గువ్వం గుడు గుడు గువ్వా నీ సర్వం చెరిసగమివ్వ చికిచికి చాo చికిచికి చాo చాo ముద్దబంతి పువ్వు చికిచికి చాo చికిచికి చాo చాo ముద్దులాడనివ్వు లకిచికి చాo లకిచికి చాo చాo వేడి వేడి లవ్వు లకిచికి చాo లకిచికి చాo చాo ఆరగించనివ్వు కసకస లాడే మిస మిస లన్నిచూసా పరువపు సరిగమలో పెదవుల పదనిసలా పంచుకున్న పోక చక్క పెంచమంది తీపి తిక్క అసలు సిసలు మరుల మలుపు తెలియగ హే గువ్వం గుడు గుడు గువ్వా నీ సర్వం చెరిసగమివ్వ తకధిమితోo తకధిమితోo తోo వగలమారి పింఛం తకధిమితోo తకధిమితోo తోo విప్పుకుంది కొంచెం దిమికిటతోo దిమికిటతోo తోo మల్లెపూల మంచo దిమికిటతోo దిమికిటతోo తోo అడుగుతోoది లంచం పదపదమన్న పసి పసి పొంగు చుసేయ్ తనువుల తొణికిసలో సొగసుల రిమరిమలే వెచ్చబడ్డ వెన్నెలమ్మ వెన్ను మీద వాలుతుంటే కొసరి కొసరి చిలిపి వరములడిగిన హే గువ్వం గుడు గుడు గువ్వా నీ సర్వం చెరిసగమివ్వ పెదవి పెదవి కలిసే క్షణమిది సిరిమువ్వా రగిలే పొగిలే ఒడిలో కథ బలపడనివ్వ రెక్కపట్టి రెచ్చకొట్టి చుట్టుముట్టి ఛీఛీకొట్టి దుడుకు దుడుకు వయసు ముడుపులడిగిన హే హే హే గువ్వం గుడు గుడు గువ్వా నీ సర్వం చెరిసగమివ్వ
దానిమ్మ తోటకు పాట సాహిత్యం
చిత్రం: కొండపల్లి రాజా (1993) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: మనో , చిత్ర దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు మాటు ఆటు పోటు కొకమ్మా కట్టుదాటి పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు నీటు అందాల అర్ధరాత్రిలో అతికే వుంటు గంధాల కౌగిలింతలొ ఒదిగే ఉంటూ చిరాకులే సరాగారమై పారాకు లారగించి పైటంతా పక్కకు దీసి దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు మాటు ఆటు పోటు, కొకమ్మా కట్టుదాటి పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు ఎడమ కుడి కన్నుల జంట అదిరింది నీకు నాకు ఏక మంచ యోగముందని ఆ పందిరి పట్టె మంచంలో తెలిసింది వెన్ను వెన్ను ఆనిస్తే వెన్నలేనని చిలిపి సొగసు చలికి రగిలే పెదవి చివర ఎదలు పలికే కూసినా తొలికోడి అనలేదు కోక్కొరుకోక్కో కోరుకో ఒకసారి సరసాల చెమ్మల చెక్కు సుఖీభవే సఖిప్రియ తపించి పోవు జంట తపాలే దీపాలెట్టి దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు మాటు ఆటు పోటు కొకమ్మా కట్టుదాటి పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు గణపవరం సిద్ధాంతి అన్నడు వలపుల్లో వర్జలే ఉండబోవని గన్నవరం వేదాంతి చెప్పాడు కౌగిలింత నోముల్లో కరిగిపోమ్మని నలక నడుము మెలిక తిరిగి తొడిమే తగిలి తొనలు అదిరే చచ్చినా చలిగాలి మరి రాదు వెన్నెలకొడకో వచ్చినా వడగాలై మరిగేను మల్లెల మొలకో కదా ఖుషి కమామిషి కామాను అన్న వేళా కౌగిట్లో చప్పట్లేసి దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు మాటు ఆటు పోటు కొకమ్మా కట్టుదాటి పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు నీటు అందాల అర్ధరాత్రిలో అతికే వుంటు గంధాల కౌగిలింతలొ ఒదిగే ఉంటూ చిరాకులే సరాగారమై పారాకు లారగించి పైటంతా పక్కకు దీసి దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు మాటు ఆటు పోటు కొకమ్మా కట్టుదాటి పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు
ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గు పాట సాహిత్యం
చిత్రం: కొండపల్లి రాజా (1993) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు , చిత్ర ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గూ ఒగ్గేసాకే ఒల్లోకొచ్చా ఏమ్చేస్తావో చేసేసేయ్యి మావ యమ్మహో యమ్మహో యమ్మహా విందులే అందుకో కమ్మహా ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపేసాకే కౌగిళ్లిచ్చా ఏమిస్తాఓ ఇచ్చేసెయ్యి భామ యమ్మహో యమ్మహో యమ్మహా కమ్మహా కొట్టనా చుమ్మాహా యమ్మహో యమ్మహో యమ్మహా కమ్మహా కొట్టనా చుమ్మాహా కన్ను కొట్టుడు రోజుల్లో కాగే కౌగిళ్ళల్లో నీ ప్రేమకె సెగనై తగిల పైటలాగుడు పుటల్లో సాగే సంజట్టల్లో నీ సిగులే నిరుడే అడిగా తొణికే పాలే తొలికొపాలై తడిరూపాలే అహహహ ఒడి దీపాలై అహహహ గిల్లి గిల్లి కజ్జా లెట్టి బుల్లి బుల్లి బుజ్జయంటీ ఈడును లేపి వెచ్చని తోడై దౌడే తీస్తుంటే యమ్మహో యమ్మహో యమ్మహా ఎక్కడో నొప్పిగ వుందాహ ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపేసాకే కౌగిళ్లిచ్చా ఏమిస్తా ఓ ఇచ్చేసెయ్యి భామ యమ్మహో యమ్మహో యమ్మహా కమ్మహా కొట్టనా చుమ్మాహా ఏకపక్కల రాత్రుల్లో మల్లె మాగాణుల్లో నీ వన్నెలో వెన్నెలే చిలికా తెల్ల వారని పొద్దుల్లో తెరిచే వాకిళ్ళలో నా నవ్వులే ముగ్గులోకలిపా మనసే నీవై తనువేనేనై శృతిలో ఉంటే అహహహ పతిగా ఓకే అహహహ చిట పట చేమంతుల్లో కట్టు బొట్టు గల్లంతుల్లో హద్దులు దాటి అల్లరి చేసి ముద్దే దోస్తుంటే యమ్మహో యమ్మహో యమ్మహా ఎప్పుడో ఎక్కడో అమ్మహా ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గూ ఒగ్గేసాకే ఒల్లోకొచ్చా ఏమ్చేస్తావో చేసేసేయ్యి మావ యమ్మహో యమ్మహో యమ్మహా కమ్మహా కొట్టనా చుమ్మాహా ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపేసాకే కౌగిళ్లిచ్చా ఏమిస్తా ఓ ఇచ్చేసెయ్యి భామ యమ్మహో యమ్మహో యమ్మహా విందులే అందుకో కమ్మహా యమ్మహో యమ్మహో యమ్మహా యమ్మహో యమ్మహో యమ్మహా
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా పాట సాహిత్యం
చిత్రం: కొండపల్లి రాజా (1993) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: మనో , చిత్ర అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏదారి కాయాలంట గోదారి ఈ దాలంట వయ్యారి పాలపిట్ట పాడుతుంటే హాయ్ హాయ్ హోయ్ తగులుతున్న తాకిడి మొగళి తేనె దోపిడి నా సోకు వేసింది మారాకు అట్టైతె నాదే నీ నాజూకు అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా కోరస్: గొల్లవాడే గొల్లపిల్లవాడే పాలవాడే మీకు ఈడు జోడే పాలుగారే బుగ్గా మొగ్గా పిండేస్తా మల్లె పూలల్లోని సోకు నీకు దండేస్తా పాలే పంచి పక్కంగాను తోడేస్తా నువ్వు పాలిస్తుంటే పండుచెండు విందిస్తా రాగాల రాస లీలల్లో రగడ నీకేర రాతిరేలల్లో మగడా పాలరాతి మందిరం పంచదార పంజరం నా గోల వేసెటి ఈలలుతో నీ వెన్న జున్ను వేడెక్కిస్తా అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్ మణిక్యాల మెడలోన మారాజ నీకు అందిస్తున్నా స్త్రీ రోజా వోణి కొద్ది బోణి కొట్టే పూబోణి నీకు రాసిస్తాలే మల్లెల్లోని మాగాణి యుద్దాలు చేసుకుందామా చలిలో అందాలు పూసుకుంటాలే జతలో వలపు కోట వాయణం వయసు కోరు శోభనం నీతోటి కొలువున్న వేళలలో ఈ రోజా పూజా రాజా నీకే అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏదారి కాయాలంట గోదారి ఈ దాలంట వయ్యారి పాలపిట్ట పాడుతుంటే హాయ్ హాయ్ హోయ్ తగులుతున్న తాకిడి మొగళి తేనె దోపిడి నా సోకు వేసింది మారాకు అట్టైతె నాదే నీ నాజూకు
సింగరాయకొండకాడా.. పాట సాహిత్యం
చిత్రం: కొండపల్లి రాజా (1993) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి,బాలు, మాల్గాడి శుభ ఆ.... ఆ....హా... ఆ.... ఆ....హా... సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా ఊబరాల గిత్తరో... ఒంగవోలు గింజరో... దీన్ని కొమ్ముల దాడి హడాహుడి తడేమియా తడాఖా.. సింగరాయకొండకాడా..ఆ..ఆడ దిబ్బకాడా రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడ సోకుమాడా ఎగబడి దిగబడి కలబడి పొరబడి పెట్టేసుకో..ఓ నా లేత ఈడు ఉంగరం ఇక చూసుకోరా సంభరం గిజగిజ వయసుల గిలగిలసొగసులు వడ్జించుకో..ఓ అల్లారుముద్దు అగడం అందాల మీది మీగడం నెరనెర జాననోయ్ తుళి పరువపు వీణనోయ్ వీణవైతే మీటనా జానవైతే దాటనా ఇది తాగిన జంట ససేమిరా సడేమియా సరోజా సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా ఆ.... ఆ....హా... కుతుకుడు ఉతుకుడు వెతుకుడు చెడుగుడు ఆడేసుకో..చెడుగుడు చెడుగుడు చెడుగుడు నీ రేవు కోరి వేగిరం నా నావకున్న లంగరం పిడికెడు నడుముల చిటికెడు తలుకులు తోడేసుకో.. చెయ్యి జారుతుంది పావురం పట్టుకో.. బేజారుచేస్తే నిబ్బరం చిమ చిమ చీకటోయ్ ఇవి చిటపట చిందులోయ్ పెగ్గులాగా జారనా.. అగ్గిలాగే మారనా.. ఇవి కౌగిలి దాడి ఖజూరహో మజాలహో ఖలేజా సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా ఊబరాల గిత్తరో... ఒంగవోలు గింజరో... దీన్ని కొమ్ముల దాడి హడాహుడి తడేమియా తడాఖా.. సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా..
Kondapalli Raja (1993)
చిత్రం: సూపర్ పోలీస్ (1994) సంగీతం: ఎ. ఆర్.రెహమాన్ నటీనటులు: వెంకటేష్ , నగ్మా , సౌందర్య దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు నిర్మాత: డి.సురేష్ బాబు విడుదల తేది: 23.06.1994
Songs List:
సూపర్ పోలీస్ పాట సాహిత్యం
చిత్రం: సూపర్ పోలీస్ (1994) సంగీతం: ఎ. ఆర్.రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: సురేష్ పీటర్స్ , అనుపమ, స్వర్ణలత సూపర్ పోలీస్
బాబు లవ్ చేయరా పాట సాహిత్యం
చిత్రం: సూపర్ పోలీస్ (1994) సంగీతం: ఎ. ఆర్.రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: యస్. పి.బాలు, చిత్ర బాబు లవ్ చేయరా
తేలుకుట్టిన తెనాలిలో పాట సాహిత్యం
చిత్రం: సూపర్ పోలీస్ (1994) సంగీతం: ఎ. ఆర్.రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: మనో, సుజాత తేలుకుట్టిన తెనాలిలో
పక్కా జెంటిల్మాన్ ని పాట సాహిత్యం
చిత్రం: సూపర్ పోలీస్ (1994) సంగీతం: ఎ. ఆర్.రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: యస్. పి.బాలు, యస్. జానకి పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూల పక్కే వేసి చక్కా వస్తావా పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూల పక్కే వేసి చక్కా వస్తావా ఆ ఆ...పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా పాల చుక్కే చూసి పై పైకొస్తావా పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా పాల చుక్కే చూసి పై పైకొస్తావా కులాసాలా ఘంటసాలా కొత్త కూనిరాగమందుకో మారా ఓ కుమారా కుర్ర కూచిపూడి ఆడుకో పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూల పక్కే వేసి చక్కా వస్తావా ఆ ఆ...పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా పాల చుక్కే చూసి పై పైకొస్తావా ఆడోళ్ళు మెచ్చినవాడ్నీ...ఆ ..ఆ..ఆ. ఆడోళ్ళు మెచ్చినవాడ్నీ ఈడోళ్ళలో చినవాడ్ని యే రాసలీలకైన గానలోలుడైన వాణ్ణి కుర్రోళ్ళు కోరినదాన్ని కుచ్చీళ్ళు జారినదాన్ని ఏ ప్రేమలేఖ రాక చిన్నబోయి ఉన్నదాన్ని పాట సిరి వేటలాడి పైటచాటు లడిగినవాడ్ని ఆటలకు హంసలాడె ఆడగాలి తగిలినవాడ్ని అజంతాల అందాలన్ని కుదించి మధించి వధించి పోరా పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూలపక్కే వేసి చక్కా వస్తావా ఆ ఆ...పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా పాలచుక్కే చూసి పై పైకొస్తావా పైటేసి పుట్టినదాన్నీ ఆ...ఆ...ఆ...ఆ... పైటేసి పుట్టినదాన్ని మొగ్గేసి పెరిగినదాన్ని యే తీపి కాటుకైన ఓపలేని వయ్యారాన్ని మాటేసి పొంచినవాణ్ణీ మావిళ్ళు విసిరినవాణ్ణి నీ కోణమంటుకున్న పూల బాణమంటివాణ్ణి నిన్ను గని కన్నెఈడు జున్నులార విడిచినదాన్ని వెన్నెలకు వేసవల్లే మల్లె సోకు విరిసినదాన్ని వసంతాలు నాతో ఆడి రసాల కితాబు రచించి పోవే పక్కా...ఆహా...100% పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూల పక్కే వేసి చక్కా వస్తావా ఆ ఆ...పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూలపక్కే వేసి చక్కా వస్తావా ఆ ఆ...పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా పాల చుక్కే చూసి పై పైకొస్తావా కులాసాలా ఘంటసాలా కొత్త కూనిరాగమందుకో మారా ఓ కుమారా కుర్ర కూచిపూడి ఆడుకో పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూలపక్కే వేసి చక్కా వస్తావా ఆ ఆ...పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా పాల చుక్కే చూసి పై పైకొస్తావా
ముక్కంబే ముక్కంబే పాట సాహిత్యం
చిత్రం: సూపర్ పోలీస్ (1994) సంగీతం: ఎ. ఆర్.రెహమాన్ సాహిత్యం: సాహితి గానం: మనో, చిత్ర ముక్కంబే ముక్కంబే
Super Police (1994)
చిత్రం: అశ్వమేధం (1992) సంగీతం: ఇళయరాజా నటీనటులు: బాలక్రిష్ణ , శోభన్ బాబు, నగ్మా, మీనా దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: సి.అశ్వనీదత్ విడుదల తేది: 25.12.1992
Songs List:
ఝుం చకు చకు పాట సాహిత్యం
చిత్రం: అశ్వమేధం (1992) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్. పి.బాలు, ఆశాభోంస్లే ఝుం చకు చకు
ఓ ప్రేమా పాట సాహిత్యం
చిత్రం: అశ్వమేధం (1992) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్. పి.బాలు, ఆశాభోంస్లే పల్లవి: ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా ఓ మైనా ఇంక ఏదేమైనా రావేమైనా రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా అధరాలి నాలో అందం అధరాలు అందిస్తే ముదరాలి చుమ్మా చుంబం మురిపాలు పిండేస్తే ఒకమాటో అరమాటో అలవాటుగా మారేవేళ ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా ఓ మైనా... చరణం: 1 చలువరాతి హంస మేడలో ఎండే చల్లనా వలువచాటు అందగత్తెలో వయసే వెచ్చనా వసంతపు తేనెతోనే తలంటులే పోయనా వరూధినీ సోయగాల స్వరాలు నే మీటనా నువ్వుకల్లోకొస్తే తెల్లారే కాలం నిన్ను చూడాలంటే కొండెక్కే దీపం నువ్వు కవ్విస్తుంటే నవ్విందీరాగం రెండు గుండెల్లోన తప్పిందీతాళం మురిసింది తార మూగాకాశంలో ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా ఓ మైనా ఇంక నేనేమైనా నీకేమైన గాలేవీచి కూలే ప్రేమా తెలుసా విధి నిన్ను ఓడిస్తుంటే వ్యధలాగే నేనున్నా కథ మారి కాటేస్తుంటే ఒడిగట్టి పోతున్నా ఎడబాటే ఎదపాటై చలినీడగా సాగేవేళ ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా ఓ మైనా... చరణం: 2 మనసులోన తీపి మమతలు ఎన్నో ఉంటవి ఇసుక మీద కాలి గురుతులై నిలిచేనా అవి ఎడారిలో కోయిలమ్మ కచేరి నా ప్రేమగా ఎదారిన దారిలోనే షికారులే నావిగా కన్నె అందాలన్నీ పంపే ఆహ్వానం కౌగిలింతల్లోనే కానీ కళ్యాణం స్వర్గ లోకంలోనే పెళ్లి పేరంటం సందెమైకంలోనే పండే తాంబూలం మెరిసింది తార ప్రేమకాశంలో ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై తేనె పొంగే ప్రేమ తెలుసా ఓ మైనా ఇంక ఏదేమైనా రావేమైనా రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా అధరాలి నాలో అందం అధరాలు అందిస్తే ముదరాలి చుమ్మా చుంబం మురిపాలు పిండేస్తే ఒకమాటో అరమాటో అలవాటుగా మారేవేళ ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా ఓ మైనా...
శీతాకాలం ప్రేమకు పాట సాహిత్యం
చిత్రం: అశ్వమేధం (1992) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, ఆశా భోంస్లే శీతాకాలం ప్రేమకు ఎండాకాలం ఎండాకాలం ముద్దులు పండే కాలం సందిట్లో విందే సాయంకాలం కౌగిట్లొ రద్దే ప్రాతఃకాలం వలపమ్మ జల్లే వానాకాలం సిగ్గమ్మ కొచ్చే పోయే కాలం ఇది శీతాకాలం ప్రేమకు ఎండాకాలం ఎండాకాలం ముద్దులు పండే కాలం చేగాలికే చెదిరే నడుమే .. పూగాలికే పొదలా వణికే ఊరింపుతో ఉడికే పెదవే .. లాలింపుగా పెదవే కలిపే సన్నగిల్లే .. చెలి వెన్ను గిల్లే ఆకలింతే .. తొలి కౌగిలింతే చలి అందాలన్నీ చందాలిస్తా .. ఓ ఓ ఓ శీతాకాలం ప్రేమకు ఎండాకాలం ఎండాకాలం ముద్దులు పండే కాలం నూనూగుగా తగిలే తనువే.. నాజూకుగా తపనై రగిలే నీ వంపులో ఒదిగే తళుకే.. కవ్వింపులే కసిగా అలికే జివ్వుమంటే.. ఎద కెవ్వుమంటే జవ్వనాలే.. తొలి పువ్వు పూసే పొద పేరంటాలే ఆడించేస్తా .. ఓ ఓ ఓ శీతాకాలం ప్రేమకు ఎండాకాలం ఎండాకాలం ముద్దులు పండే కాలం సందిట్లో విందే సాయంకాలం కౌగిట్లొ రద్దే ప్రాతఃకాలం వలపమ్మ జల్లే వానాకాలం హాయ్.. సిగ్గమ్మ కొచ్చే పోయే కాలం ఇది శీతాకాలం ప్రేమకు ఎండాకాలం అరె ఎండాకాలం ముద్దులు పండే కాలం ఆ .. శీతాకాలం ప్రేమకు ఎండాకాలం ఎండాకాలం ముద్దులు పండే కాలం
చెప్పనా ఉన్న పని పాట సాహిత్యం
చిత్రం: అశ్వమేధం (1992) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్. జానకి చెప్పనా ఉన్నపని చెయ్యనా కాస్త పని జంటగా పని ఉందమ్మో చెప్పకు పాత పని చేసుకో కొత్త పని ఇంతకీ పని ఏందయ్యో నువ్వు అదరహం నవ్వు ముదరహం పువ్వుల కలహం యవ్వన విరహం నీ పై మొహం చెప్పనా ఉన్నపని చెయ్యనా కాస్త పని జంటగా పని ఉందమ్మో చెప్పకు పాత పని చేసుకో కొత్త పని ఇంతకీ పని ఏందయ్యో నున్నబడిన నీ మెడపై వెన్నెలే చమట సన్నబడిన నీ నడుమే మీటనీ అచట ఎంత తిమ్మిరిగా ఉంటె అంత కమ్మనిది ఎంత కమ్మనిదో ప్రేమ అంత తుంటరిది చూపులో ఉంటాయి ఊటీలు షేప్ లో అవుతాయి బ్యూటీలు ఒంటిలో ఉంటుంటే డిగ్రీలు కాంతిలో వస్తాయి ఏంగ్రీలు మల్లె పూలే నిద్ర లేక మండి పోతుంటే లవ్ లవ్ చెప్పనా ఉన్నపని చెయ్యనా కాస్త పని జంటగా పని ఉందమ్మో చెప్పకు పాత పని చేసుకో కొత్త పని ఇంతకీ పని ఏందయ్యో నువ్వు అదరహం నవ్వు ముదరహం పువ్వుల కలహం యవ్వన విరహం నీ పై మొహం చెప్పనా ఉన్నపని చెయ్యనా కాస్త పని జంటగా పని ఉందమ్మో చెప్పకు పాత పని చేసుకో కొత్త పని ఇంతకీ పని ఏందయ్యో ఎర్రబడిన నీ కనుల నీడలే పిలుపు వెంటబడిన నీ కధల అర్ధమే వలపు పచ్చి కౌగిలినే నీతో పంచుకోమంది గుచ్చి గుత్తులుగా అందం ఉంచుకోమంది గిచ్చితే పుడతాయి గీతాలు చీటికీ పులకింత గీతాలు చూడని అందంగా ఆగ్రాలు జోరుగా శుభస్య శీగ్రాలు చందమామే చమ్మ లేక ఎండిపోతుంటే లవ్ లవ్ చెప్పనా ఉన్నపని చెయ్యనా కాస్త పని జంటగా పని ఉందమ్మో చెప్పకు పాత పని చేసుకో కొత్త పని ఇంతకీ పని ఏందయ్యో నువ్వు అదరహం నవ్వు ముదరహం పువ్వుల కలహం యవ్వన విరహం నీ పై మొహం చెప్పనా ఉన్నపని చెయ్యనా కాస్త పని జంటగా పని ఉందమ్మో చెప్పకు పాత పని చేసుకో కొత్త పని ఇంతకీ పని ఏందయ్యో
గుంతలకిడి గుమ గుమందం పాట సాహిత్యం
చిత్రం: అశ్వమేధం (1992) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత సొగసు యమ వయ్యారం గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత పొగరు యమ యవ్వారం ఆహా ఓహో యహ యహ యహ యహ గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత సొగసు యమ వయ్యారం గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత పొగరు యమ యవ్వారం పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో దాచొద్దు అందమంతా కోకసీమ తోటలో రైక ముళ్ళ రేవులో దోచెయ్యి అందినంతా గుమ్మెత్తి పోవాలి గుమ్మరింతలో గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత సొగసు యమ వయ్యారం గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత పొగరు యమ యవ్వారం చరణం: 1 కొప్పులోన సంపెంగంటా ఆ పువ్వు మీద నా బెంగంటా తోలి రేకు సోకూ నీకే ఇస్తా నవ్వు జాజి పులేనంటా నేను తుమ్మేదల్లె వాలేనంటా మరుమల్లె జాజి మందారాల పానుపెస్తానంటా మురిపాలు పోస్తానే వేసుకుంటా గడియ విడిపోకు నన్నీ ఘడియా దాస్తే చూస్తావు చూస్తే దోస్తావు అల్లారు అందాలు హొయ్ కుడి ఎడమ గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత పొగరు యమ యవ్వారం గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత సొగసు యమ వయ్యారం పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో దాచుకో అందమంతా కోకసీమ తోటలో రైక ముళ్ళ రేవులో దోచెయ్యి అందినంతా గుమ్మెత్తి పోవాలి గుమ్మరింతలో గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత సొగసు యమ వయ్యారం గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత పొగరు యమ యవ్వారం చరణం: 2 కంచిపట్టు చీరేకట్టి నిను కంచెలగా నెనే చుట్టి అరె చెంగే కాస్త చేనే మేస్తా వెన్నపూస మనసే ఇచ్చి చిరునల్లపూస నడుమే ఇస్తే అరె కవ్వం లాగా తిప్పి తిప్పి కౌగిలిస్తానంటా నను కాదు పొమ్మన్నా తొలిసారి విన్నా మాటా ప్రతి రేయి నా పాటా నీతో పేచీలు రాత్రే రాజీలు నా ప్రేమ పాటాలు హొయ్ గుడిఎనక గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత సొగసు యమ వయ్యారం గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత పొగరు యమ యవ్వారం పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో దాచొద్దు అందమంతా కోకసీమ తోటలో రైక ముళ్ళ రేవులో దోచెయ్యి అందినంతా గుమ్మెత్తి పోవాలి గుమ్మరింతలో గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత సొగసు యమ వయ్యారం గుంతలకిడి గుమ గుమందం అరె ఎంత పొగరు యమ యవ్వారం
ఏం దెబ్బ తీశావురా పాట సాహిత్యం
చిత్రం: అశ్వమేధం (1992) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్. జానకి ఏం దెబ్బ తీశావురా
Aswamedham (1992 )
చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: బాలక్రిష్ణ , కృష్ణ , నగ్మా
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: డి.కిషోర్
విడుదల తేది: 05.05.1993
పల్లవి:
ఒ..ఒ..ఒ.. ఓరియా
ఒ..ఒ..ఒ.. ఓరియా
సిలకలాగా కులుకుతుంటే
సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని కుదురుగుంటే
మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే
ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా
ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య
ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా
సిలకలాగా కులుకుతుంటే
సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని కుదురుగుంటే
మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే
చరణం: 1
పాపా పాపా పైరగాలిలో పైటలాగా చుట్టుకోనా
బావా బావా వంగతోటలో ఒడుపు చూపితే ఒప్పుకోనా
మాయమాటలింక చాలు పోకిరి ఇటు రా మరి
కాక మీద ఉంది పిల్ల డింగరి చూసై గురి
కరగదీయనా... అరగదీయనా...
చిక్కావులే ఎడాపెడా చిన్నారి
ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా..
ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య..
ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా
సిలకలాగా కులుకుతుంటే
సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని కుదురుగుంటే
మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే
చరణం: 2
ఉంగా ఉంగా ఓరి నాయనో..
ఓపలేనురోయ్ వన్నెకాడా
వయ్యారంగా అస్కుబుస్కులు
మొదలు పెట్టనా మంచెకాడా
తీపి తిక్క రేగుతోంది పిల్లడా నీ జిమ్మడ
సోకు వెచ్చ బెట్టుకుంటే పోతదే పద గుమ్మడి
దొరికినానని కొరకమాకురో
సందిట్లో చెడమడా బావయ్యో
ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా..
ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య..
ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా
సిలకలాగా..ఓయ్.. కులుకుతుంటే..ఓయ్..
సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని..ఓయ్..
కుదురుగుంటే..ఓయ్..
మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే
ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా
ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య
ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా
******* ******** ********
చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర
పల్లవి:
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్... యమ డేంజర్
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్... యమ డేంజర్
విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్... యమ డేంజర్
విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్... యమ డేంజర్
మెత్త మెత్తగా తలకెక్కుతుంతది
మత్తు మత్తుగా అహ ముంచుతుంతది
నులి వెచ్చని ఎత్తుల జిత్తుల గాలమేసి గోలుమాలు చేస్తుంది ..
డేంజర్... యమ డేంజర్
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్... యమ డేంజర్
విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్... యమ డేంజర్
చరణం: 1
ఒక్క లుక్కే చాలు
ఒక్క లుక్కే చాలు..
చమక్ చం చం... చుక్కలన్నీ నక్కే చోటికి
నే దూసుకుపోతా
ఒక్కటిస్తే చాలు
ఒక్కటిస్తే చాలు...
జమక్ జం జం... సిగ్గుపడ్డ సొగసంతా
నీకే సొంతం చేస్తా
వయ్యారమహో వల వేసే
ఇది కనికట్టు... అది కనిపెట్టు
కవ్వింపులతో కలబోసి
ఇది తొలిమెట్టు... ఇక తలపెట్టు
కన్ను గీటితే... వెన్ను మీటనా
చిరునవ్వులు రువ్వుకు పొమ్మని
కన్నె సోకు కరగదీసి పోతుంది
డేంజర్... యమ డేంజర్
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్... యమ డేంజర్
విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్... యమ డేంజర్
చరణం: 2
బుగ్గ కాటే బాయ్యో...
బుగ్గ కాటే బాయ్యో...
ధనక్ దన దన... కొత్త కోక నలిగే
కౌగిలిలో బానిసనవుతా
సిగ్గు దాటేయ్ పిల్లో...
సిగ్గు దాటేయ్ పిల్లో....
సమక్ సం సం... కుర్ర వేడి ముదిరే
నీ ఒడిలో జాతర చేస్తా
తయ్యారు రా హో తెర తీశా
ఇది మలిమెట్టు ఇక జతకట్టు
అయ్యారే సుఖం శృతి చేశా
ఇది ఎవెరెస్ట్ ... ఇక నో రెస్ట్
చోటు దొరికితే... చాటు చేరనా
ఎరుపెక్కిన ఒంపులు సొంపులు
లంచమిచ్చి లొంగదీయు ప్రేమంటే
డేంజర్... యమ డేంజర్
యమ యమ యమ యమ డేంజర్
******* ******** ********
చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర
పల్లవి:
ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...
ఈనాడే తెలిసింది నీ తోడే కలిసింది
జగమే సగమై యుగమే క్షణమై ఉందామా
వలేసి కలేసి నిలేసి మనసున
ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...
చరణం: 1
చలో మేరీ స్వీటీ బుల్ బుల్ బ్యూటీ
భలేగుంది భేటీనీతోటి
నిదానించు నాటీ ఏమా ధాటి
మజా కాదు పోటీ మనతోటి
సిగ్గు లూటీ... చేసెయ్యి కళ్లతోటి
ఇచ్చేయి ముద్దు చీటీ... కౌగిళ్లు దాటి
ఒకటే సరదా... వయసే వరద
కలలే కనక కథలే వినక మర్యాద
చురుక్కు చలెక్కి అడక్క అడిగిన
ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...
చరణం: 2
ఇదేం ప్రేమ బాబూ ఇలా చంపుతుంది
అదే ధ్యాస నాలో మొదలైంది
పదారేళ్ల ప్రేమ కథంతేను లేమ్మా
అదో కొత్త క్రేజీ హంగామా
పొద్దుపోదు... ముద్దైనా ముట్టనీదు
నిద్రైనా పట్టనీదు... నా వల్ల కాదు
ఒకటే గొడవ... ఒడిలో పడవా
నిన్న మొన్న లేనే లేదు ఈ చొరవ
ఇవాళ ఇలాగ దొరక్క దొరికిన
ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...
ఈనాడే తెలిసింది నీ తోడే కలిసింది
జగమే సగమై యుగమే క్షణమై ఉందామా
వలేసి కలేసి నిలేసి మనసున
ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...
******* ******** ********
చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర
చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా
ముద్దెలేని చెంపకు పొద్దె పోదు చంపకూ
పెదవి పెదవి కలిసినప్పుడు
చిలిపి చదువు చదివినప్పుడు
ఎదుట నిలిచె యెదను తొలిచె
వలపు ఒడిని వొదిగినప్పుడు
చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా
తనువులకు తపనలు రేగె అడిగినది అచ్చటా
చొరవలకు దరువులు ఊగీ ముదిరినది ముచ్చటా
చలేసి గుండె గంట కొట్టెనంటా
బలేగ తేనె మంట పుట్టెనంటా
అనాస పండు లాంటి అందమంటా
తినేసి చూపుతోటి జుర్రుకుంటా
తియ్యనైన రేయిలో విహారమూ
మోయలేని హాయిలో ప్రయానము
మోగుతుంది మోజులో అలారమూ
ఆగలేక రేగె నీ వయ్యరమూ
సొగసు దిగులు పెరిగినప్పుడు
వయసు సెగలు చెరిగినప్పుడు
మనసు తెలిసి పనులు కలిసి
కలలు విరిసి మురిసినప్పుడు
చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా
కులుకులకు కుదిరిన జొడి కొసరినది సందిటా
అలకల్కు అదిరిన డెడీ దొరికినది దోసిటా
చలాకి ఈడు నేడు చెమ్మ గిల్లె
గులాబి బుగా కంది సొమ్మ సిల్లె
పలానిదేదొ కోరె జాజి మల్లె
ఫలాలు పంచమంటు మోజు గిల్లె
ఆకతాయి చూపులో యేదో గిలి
ఆకలేసి మబ్బులో బలే చలీ
కమ్మనైన విందులో కదాకలీ
కమ్ముకున్న హాయిలొ బలాబలీ
ఒదిగి ఒదిగి కధలు పెరిగి
జరిగి జరిగి రుచులు మరిగి
ఎదురు తిరిగి ఎదలు కరిగి
పడిచు గొడవ ముదిరినప్పుడు
చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా
******* ******** ********
చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
పాప హెల్లొ హెల్లొ
చిట్టి పాప ఇస్తావ డేటు
బామ బోలొ బోలొ
తొలి ప్రేమ వేసానె బీటు
ఉడుకు వయసుల జోడీ
కిటుకు తెలిసె కిలాడీ
ఓ మై లేడి నీపై దాడీ
పట్టుకొ పట్టుకొ పట్టుకొ
పట్టుకొ పట్టుకొ కుక్కూ
బుజ్జి పాప హెల్లొ హెల్లొ
చిట్టి పాప ఇస్తావ డేటు
బామ బోలొ బోలొ
తొలి ప్రేమ వేసానె బీటూ
నీ పిక్కల పిట పిట చూస్తె
చీప...చిక్కెనమో
traffic jam - traffic jam
కైపెక్కిన మక్కెలు చూస్టె
నొర్ముయ్....కిక్కెనమ్మో
చా... పపరం పపరం
అ కసికసి ఎత్తులలో... ఏయ్
కదలింతలు చూస్తుంటే
నీ పసి పసి బుగ్గలలో
గిలిగింతలు పూస్తుంటే
sexy figure ఆవొ ఇదర్
kiss me kiss me kiss me
kiss me kiss me కుక్కూ
పాప హెల్లొ హెల్లొ
చిట్టి పాప ఇస్తావ డేటు
బామ బోలొ బోలొ
తొలి ప్రేమ వేసానె బీటు
నీ ప్రేమె దక్కని నాడు పస్తేనమ్మో...
very good.... జాగారం జాగారం
నే జోడి కట్టని నాడు చస్తానమ్మో
better.... శంతి ఓం శాంతి ఓం
ఈ జగమిక మాయేలే
నా బ్రతుకిక రాయేలే
నీ ఒడి ఎడమైపోతే
నే సుడిలొ దూకాలే ....దూకెయ్
రావె చెలి అనార్కలీ
love me love me love me
love me love me కుక్కూ
బుజ్జి పాప హెల్లొ హెల్లొ
చిట్టి పాప ఇస్తావ డేటు
బామ బోలొ బోలొ
తొలి ప్రేమ వేసానె బీటు
ఉడుకు వయసుల జోడీ
కిటుకు తెలిసె కిలాడీ.
ఓ మై లేడి నీపై దాడి
పట్టుకొ పట్టుకొ పట్టుకొ
పట్టుకొ పట్టుకొ కుక్కూ
Varasudu (1993)
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ నటీనటులు: ప్రభుదేవా, నగ్మా దర్శకత్వం: యస్.శంకర్ నిర్మాత: కె.టి.కుంజమాన్ విడుదల తేది: 17.09.1994
Songs List:
ఊర్వశీ ఊర్వశీ పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: షాహుల్ హమీద్, ఏ.ఆర్.రెహమాన్, సురేష్ పీటర్స్ పల్లవి: ఊర్వశీ ఊర్వశీ డటేకిటీజీ ఊర్వశీ వూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫార్మసీ గెలుపుకీ సూత్రమే టేకిటీజీ పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ ఓ చెలి తెలుసా తెలుసా తెలుగు మాటలు పదివేలు అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు చరణం: 1 చిత్రలహరిలో కరెంటుపోతే టేకిటీజీ పాలసీ బాగ చదివి ఫెయిలయిపోతే టేకిటీజీ పాలసీ తిండి దండగని నాన్న అంటే టేకిటీజీ పాలసీ బట్టతలతో తిరుపతి వెళితే టేకిటీజీ పాలసీ ఓ చెలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో తెలుపవే చిలకా చిలకా ప్రేమనాడి ఎక్కడుందో చరణం: 2 చూపుతో ప్రేమే పలకదులే కళ్లతో శీలం చెడిపోదే మాంసమే తినని పిల్లుందా పురుషులలో రాముడు ఉన్నాడా విప్లవం సాధించకపోతే వనిత కు మేలే జరగదులే రుద్రమకు విగ్రహమే ఉంది సీతకు విగ్రహమే లేదే పోజుకొట్టి పిల్ల కూడా పడలేదంటే టేకిటీజీ పాలసీ పక్కసీటులో అవ్వే ఉంటే టేకిటీజీ పాలసీ సండే రోజు పండగ వస్తే టేకిటీజీ పాలసీ నచ్చిన చిన్నది అన్నా అంటే టేకిటీజీ పాలసీ పగలు నిన్ను చూడని కన్నెలకు రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం స్వేచ్ఛయే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏం లాభం ఫిగరుల సందడి లేకుండా క్లాసుకి వెళ్లి ఏం లాభం ఇరవైలో చెయ్యని అల్లరులు అరవైలో చేస్తే ఏం లాభం
మండపేట మలక్ పేట పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సురేష్ పీటర్స్, షాహుల్ హమీద్, తేని కుంజరమ్మా మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ నేడేంటి రెపేంటి దినసరి అదే రాత్రేంటి పగలేంటి మార్పులేదులే మర్చిపోదామే బాధలు మర్చిపోదామే కోపం వస్తే కొంచం ఆపుకొందామే అరే గెట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే చాన్స్ నీ చేతిలో అన్ని ఉన్నవిరా తాక్ చిక్ టపాట పాడుదాం ముందు ఎవరు ముందు ఎవరు ముందు ముందు ముందు ముందు పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట అచ్చంపేట బుచ్చంపేట పేట రాప్ కొత్తపేట కొబ్బరి మట్ట హే డబ్బులేంటి గిబ్బులేంటి ఉన్నది ఒక లైఫ్ చాలయ్య దేవుడా నాకు ఒక వైఫ్ తెరిచి వుంచుదాం మనసు తెరిచి వుంచుదాం వచ్చేది ఎవరో వేచిచూద్దాం అరే నీ కోసం పుట్టింది నీదేరా దొరికింది అందుకోర అంతేరా జరిగింది జరిగేది ఇంతే తెల్లవారె తెల్లవారె తెల్ల తెల్ల తెల్లవారె పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ వాటర్ కరెంట్ కళ్ళాపి ప్యాకెట్ పాలు పిల్లలు స్కూలు ఫీజు చెక్కర చమురు రవ్వ రేషన్ పామాయిల్ పచ్చి బియ్యం గోధుమకు చాలక చాలక ఉన్న డబ్బులన్నీ చాలక ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి పావలా అర్ధ అప్పు సొప్సు చేసి ఒక్క అణా రెండు అణా హుండి పగలు గొట్టి పావలా అర్ధ అప్పు సొప్సు చేసి చెంబు చాట తాకట్టు పెట్టి ఐదు పది అడుక్కున్న అవసరాలు తీరలేదే మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్ అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట అచ్చంపేట బుచ్చంపేట కొత్తపేట కొబ్బరి మట్ట సారాయి ఎండు చిప్ప బీడి ముక్క పండు కప్ప గుడిసె కుప్పతొట్టి పక్కనే టీ కొట్టు రిక్షా గాలిపటం గాజుపెంకు మాంజా గుటిబిళ్ళ గోళికాయ గాలిపాట పాడుదాం అగడం బగడం నెమలికి దంతం సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్రా నాగమని ఎన్.టి.ఆర్.ఏ.ఎన్.ఆర్. చిరంజీవి బాలయ్య పగలు గిగులు రాత్రి గీత్రి ఆల్ షోస్ హౌస్ పుల్లే పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్
హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.జానకి, యస్.పి.బాలు హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీ చూపు నాకేలా కోడి కోసం వచ్చావా గోపాలా దాని బుట్ట కింద దాచాను గోపాలా పుట్ట తేనే కావాలా గోపాలా దాని ముంలోన వుంచాను గోపాలా గోపాల గోపాల రేపల్లె గోపాల కొండంత సింగారమ్మందిస్తా నీయాల రేపల్లె గోపాల ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే పిల్లవాడి రాకకోసం కళ్లతో వేచి వేచి చుశానే ఆయాసం వచ్చేలా ఐదారు కిలోమీటర్లు నడిచానే హాయి హాయి హాయి భలే హాయి హాయిలే ఈ జోరు నీకేలా సందెపొద్దు దాకనువ్వాగలేవా ఆగలేను నేను గుండెలో ఆగడాలు రగిలే చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే చెలియా నీ దేహం తళ తళ మెరిసే బంగారం అరెరె ఏ నీ నోటా కవితలు పలికెను ఎన్నో ఎర్రాని కుర్రదాన్ని గోపాలా అహ చుర్రుమంది నీ చూపు నాకేలా చక్కాని చుక్కనేను గోపాలా నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల బుగ్గమీద ముద్దుపెడితే ఎక్కడో కలిగెను గిలిగింత చెవిలోన ముద్దుపెడితె అమ్మమ్మ కళ్ళ్లోన కవ్వింత మావయ్యో మావయ్య సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా లే లే లే లే లే లే సన్నాయి లే లే లే అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూసాను నీలోన చికుబుకు రైలే జోరుగా వదిలెను పొగలే ఎత్తుపల్లమొస్తే నడకలో ఇక తికమకలే అహా హా ఈ పూట కనివిని ఎరుగని యోగం దొరికే ఈ చోట ఎవ్వరికి అందని స్వర్గం
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: యస్. పి. బాలు, ఉదిత్ నారాయణ్, యస్.పి. పల్లవి అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... సానిసా సారిగారి సానిసానిసాని సానిసా సాగమామపమాగారీస సానిసా సారిగారినీ సానిపానిసానిసా సాగమమమ మాప మాగరీస అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో.. పిచ్చిరాతలైన కవితలవునులే ప్రేమకెపుడు మనసులోన భేదముండదే... ఎంగిలైన అమృతమ్ములే.. బోండుమల్లి ఒక్క రూపాయి.. నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు పీచు మిఠాయ్ అర్దరూపాయి.. నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు ఉహు..ఉహు...ఉం..ఉం..ఉహు..ఉమ్మ్.. అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే.. అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై.. చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం... ఓర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే వయసుల సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే... ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే.. రాహుకాలం కూడా కలిసి వచ్చులే ప్రేమ కొరకు హంస రాయబారమేలనే.. కాకి చేత కూడా కబురు చాలులే ప్రేమ జ్యోతి ఆరిపోదే.. ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే ఇది నమ్మరానిది కానెకాదే.. ఈ సత్యం ఊరికీ తెలియలేదే ఆకసం భూమి మారినా మారులే.. కానీ ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే.. ఇంకా వినిపించులే ప్రేమ తప్పు మాటని... ఎవ్వరైన చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో.. ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా..
ఓ చెలియా..నా ప్రియ సఖియా.. పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: ఉన్నికృష్ణన్ ఓ చెలియా..నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే.. ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే... నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే...ఏ.. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే..ఏ.. నా గుండెలలో ప్రేమ పరవశమై.. ఇరు కన్నులు సోలెనులే..ఏ.. ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే... ఈ పూటా.. చెలి నా మాటా.. ఇక కరువై పోయెనులే అధరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే... వీక్షణలో.. నిరీక్షణలో.. అర క్షణ మొక యుగమేలే చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే... ఇది స్వర్గమా..నరకమా...ఏమిటో తెలియదులే ఈ జీవికీ...జీవనమరణమూ...నీ చెతిలో ఉన్నదిలే..ఏ..ఏ... ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే కోకిలమ్మా నువు సై అంటే...నే పాడెను సరిగమలే గోపురమా నిను చేరుకుని...సవరించేను నీ కురులే..ఏ.. వెన్నెలమ్మా నీకు జోల పాడీ...కాలి మెటికలు విరిచేనే..ఏ.. వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే...ఏ.. నా ఆశలా..ఊసులే..చెవిలోన చెబుతానే... నీ అడుగులా ..చెరగని గురుతులే ..ప్రేమ చరితను అంటానే ఓ చెలియా.. నా ప్రియ సఖియా.. చెయ్ జారెను నా మనసే...
ముక్కాబులా చుక్కానిలా పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: మనో, స్వర్ణలత ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా లవ్వుకి కాపలా పరువాల తుపాకులా శృంగార వీరుల సింధూర పువ్వులా మత్తుజల్లే మంచు వెన్నెలా ఓలేలో ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా జురాసిక్ పార్కులోన సరదాగ జోడీలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడేను పికాసొ చిత్రం నన్ను వెంటాడే చిత్రంగ టెక్సాస్లో నాతో ఆడెను కౌబాయి కన్ను కొడితే ప్లేబాయి చెయ్యేపడితే ఒళ్లంతా సెక్సయ్యింది గుండెల్లో ఫిక్సయ్యింది పాప్ మ్యూజిక్ ధ్రిల్లయ్యేను స్టార్ బేబీ కళ్లయ్యేను లవ్ స్టారై ఊరించేను పిచ్చెక్కి ఊగించేను మన ప్రేమ గీతమే ప్రతినోట పలకాలా ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా తుపాకి లోడు చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా తిమింగలాలు పట్టే వలతెచ్చినేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండువుతుందా రావే నా రాజహంస రతనాల మణిపూస జింకల్లే చిందులెయ్యి సందేల విందుచెయ్యి సంతోష మెన్నడూ సాగరమై సాగాల ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా
గాలి తరగలపై పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సుజాత మోహన్ గాలి తరగలపై
అలలా వాలే వాన వరద వాలే పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: సుజాత మోహన్, సునంద, కళ్యాణి మీనన్, మిన్ మిని అలలా వాలే వాన వరద వాలే
ముట్టుకుంటే కందిపోయే పాట సాహిత్యం
చిత్రం: ప్రేమికుడు (1995) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: రాజశ్రీ గానం: పి.జయచంద్రన్ ముట్టుకుంటే కందిపోయే