-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "N. T. Rama Rao (As a Producer)"



చిత్రం: సామ్రాట్ అశోక్ (1992)
సంగీతం: యం. ఎస్. విశ్వనాథన్ 
నటీనటులు: యన్.టి.రామారావు, వాణీ విశ్వనాథ్ 
నిర్మాత, దర్శకత్వం: యన్.టి.రామారావు 
విడుదల తేది: 28.05.1992



Songs List:



ఓ రామో రామా పాట సాహిత్యం

 
చిత్రం: సామ్రాట్ అశోక్ (1992)
సంగీతం: యం. ఎస్. విశ్వనాథన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర

ఓ రామో రామా




కించిత్ కించిత్ పాట సాహిత్యం

 
చిత్రం: సామ్రాట్ అశోక్ (1992)
సంగీతం: యం. ఎస్. విశ్వనాథన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర

కించిత్ కించిత్ 



అనురాగినిగా పాట సాహిత్యం

 
చిత్రం: సామ్రాట్ అశోక్ (1992)
సంగీతం: యం. ఎస్. విశ్వనాథన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర

అనురాగినిగా 

Palli Balakrishna Friday, August 12, 2022



చిత్రం: అగ్గిరవ్వ (1981)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 
నటీనటులు: యన్.టి.రామారావు, శ్రీదేవి, మోహన్ బాబు
దర్శకత్వం: కె.బాపయ్య
నిర్మాత: యన్.టి.రామారావు
విడుదల తేది: 14.08.1981



Songs List:



వన్ టూ త్రీ పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిరవ్వ (1981)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు 

వన్ టూ త్రీ 



కాశీకి పోయాను రామా హరీ పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిరవ్వ (1981)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

కాశీకి పోయాను రామా హరీ 




పారిపోతుంది పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిరవ్వ (1981)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

పారిపోతుంది 




గొప్పల గోవిందమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిరవ్వ (1981)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు

గొప్పల గోవిందమ్మో



పండైతే పనికిరాదు పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిరవ్వ (1981)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

పండైతే పనికిరాదు 




లేత పందిల్లో పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిరవ్వ (1981)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

లేత పందిల్లో 





బొబాబా అరె సొరబా పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గిరవ్వ (1981)
సంగీతం: టి. వి.రాజు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు

బొబాబా అరె సొరబా 

Palli Balakrishna Tuesday, March 5, 2019



చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: బాలక్రిష్ణ, యన్.టి.రామారావు, శ్రీదేవి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: యన్.టి.రామారావు
విడుదల తేది: 15.08.1980



Songs List:



ఓ మై డార్లింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

ఓ... ఓ... ఓ... మై డార్లింగ్
అందాలనే అప్పిచ్చుకో కౌగిళ్ళలో కప్పేసుకో
ముద్దిచ్చిపో ... మురిపించిపో

రెప రెప లాడే వయసే చూస్తున్నా
రెప్పలు వేసే తాళం వింటున్నా
అవి కలిసి మెలిసి కవ్విస్తుంటే
కదం తొక్కనా పదం పాడనా
సుమలతా నా ప్రియంతా...

కాశ్మీరంలో మందారాలు... తెనుగు తోటతో శృంగారాలు
నీలో నాలో విరబూసే నువ్వే నువ్వే నువ్వే నా హీరో
గజల గురం నడకే చూస్తున్నా
గజ గజ లాడే నడుమే చూస్తున్నా
వేలికి వేస్తే కాలికి వేస్తుంటే
వయసు పొంగు వరస చూడనా
జయసుధ నా ప్రియ సుధా

నిమ్మకూరులో నిన్ను చూసినా నిమ్మ తోటలో కన్ను వేసినా
రేపూ మాపూ గిలి రేడే నువ్వే నువ్వే నా హీరో



కొంటె కోరికుంది పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

ఓ లచ్చమ్మో....
కొంటె కోరికుంది చెప్పనా మంట రేగుతుంటే ఆపనా....
కొత్త జోరువుంది చూపనా కొండకోనలన్నీ దాటనా...
నిన్ను చూడగానే ఈడువచ్చి గోడదాటి దూకుతుంటే

ఓ బాలయ్యో....
కొంటె కోరికుంటే చెప్పకు మంట రేపుతుంటే దాచకు
కొత్త జోరు మీద రేగకు కొండలెక్కబోయి జారకు
నన్ను చూడగానే ఈడు వచ్చి గోడదాటి దూకుతుంటే

చలి చలి నవ్వుల సందడిలో తెలి తెలి మంచులు పడుతుంటే
పగ్గమేసినా ఆగనంటుంటే పక్కకొచ్చినా చాలదంటుంటే....

చెప్పకు చెప్పకు చెప్పకు చెప్పకు చెప్పకు
ఇప్పుడిప్పుడే కన్ను తెరిచిన కన్నెపిల్లని
ఇరవైకన్నా మూడ తక్కువ చిన్నపిల్లని
బుగ్గలోన దాచుకున్న - మొగ్గలన్ని దోచుకున్న
పులకరింత పూతకొచ్చి – చిలక ముద్దు పెట్టుకుంటే

గిలి గిలి గింతల కౌగిలి - గిజ గిజ లాడిని పరువంలో
ఈడు జోడుతో గూడుకడుతుంటే- ఇద్దరొకటై ఉలిక్కి పడుతుంటే

చెప్పకు చెప్పకు చెప్పకు చెప్పదు చెప్పకు
ఎప్పుడెప్పుడా అన్న వయసుకు కొత్తవాడిని
ఇప్పుడిప్పుడే అన్న వరసలో కొంటె వాడిని
మొదులోని అయ్యకన్న మూడు ఆకు లెక్కు వున్న
ఛదువులెన్నో చదివినోణ్ణి -సరిసనున్న అందగాణ్ణి 




పప్పులో ఉప్పేసి పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

పప్పులో ఉప్పేసి తిరగమాత పెట్టినట్టు గొప్పగా ఉన్నావె పిల్లో
నిన్నిడిసి వుండలేను గడియైనా గడపలేను
ఘుమ ఘుమ ఘుమ ఘుమ గుమ్మెత్తి పోతుంటే

పప్పులో నెయ్యేసి కసాపిసా నమిలినట్టు గొప్పగా వున్నాపురయ్యే
గొడవేమో చూడలేను గడియేమో తీయలేను
దడ దడ దడ దడ దండెత్తి వస్తుంటే...

బిర్రు బిర్రు పేంటు మీద కిర్రు కిర్రు బూటువేసి
నువ్వు చరా చరా చరా చరా నడుస్తుంటే
తధిగిణతోం తధిగిణతోం తధిగిణతోం తధిగిణతోం
అన్నదీ వయసు ఉన్నదా మనసు

మనసుంది నీమీద అందగాడా మనసైన మాటుంది సందకాశా
తధిగిణతోం తధిగిణతోం తధిగిణతోం ధిగిణతోం
అన్నదీ చిన్నది వెళ్ళిరా అన్నది రావుడో దేవుడో వదిలిపెట్టు

కుర్రకారు జోరుమీద చిర్రు బుర్రు లాడుకుంటూ
గుస గుస గున గున జారుకుంటే
తధిగిణతోం తధిగి తోం తధిగిణతోం తధిగిణతోం
అశ్వదా సొగసు ఆగదీమనసు…

వేళ గాని పాళ గాని తాళమేల
వెర్రి మొర్రి ఈలలేసే తాళజాల
తధిగిణతోం తధిగిణతోం తధిగిణతోం తధిగిణతోం
అన్నదీ చిన్నదీ వెళ్ళిరా అన్నది.
రాముడో దేవుడో వదిలిపెట్టు




అసలే చినదాన్ని (జంగ్లా జం జం...) పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

ఆసలే చిన్నదాన్ని కసిగా వున్నదాన్ని
అర్ధరాత్రి మేళమైతే సంకురాత్రి
తెల్లవారి తాళమేస్తే శివరాత్రి
జంగ్లా జం జం... జంగ్లా జం జం...జంగ్లా జం జం... జా

అసలే గడుసువాణ్ణి అందులో గట్టివాణ్ణి
ఆరిరాత్రి మేళమైతే - సంకురాత్రి
తెల్లవారి తాళమేస్తే శివరాత్రి
జంగ్లా జం జం... జంగ్లా జం జం...జంగ్లా జం జం... జా

ఇప్పుడు పిల్లా నా కిల్లానా సూశావంటే అంతే
తానా అంటే తందానా అనకుంటే గల్లంతే
అసలే వేటగాణ్ణి - అందులో నీటుగాణ్ణి

ఉరిమే మబ్బై రాకు రాకు రాకు ఉలిక్కి పడతాను
తరిమే పిడుగై రాకు రాకు రాకు గతుక్కు మంటాను.
ఆతుక్కుపోతాను...
వయసొక వాగై పొంగుతువుంటే వాలెయ్యడమే మందు
చీటికి మాటికి చిందెయ్యలేనంచే తల్లకిందు
అందులో దీటుగాణ్ణి...

ఒకటే కసిగా ఆడిపాడమాకు ఒణుక్కు పోతాను
వయసే బుసగా పైకి పైకి రాకు  రాకు   ఒణుక్కు మంటాను
చిలక్కి చెబుతాను...




అపూర్వ సహోదరులం పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది రమేష్

అపూర్వ సహోదరులం అనురాగ సుధాఝరులం
ఇద్దరు ఇద్దరు కలసిన ఈ ఉదయం సూర్య చంద్రోదయం
అమ్మ అనే రెండక్షరాలు అన్నదమ్ముల రూపాలు
గంగా యమునా సంగమించిన కౌగిలి గుడిలో దీపాలు
అనురాగంలో దేవుడు రాసిన అట్టితెలుగు కీర్తన
అన్నా అన్నా అన్నా
అనుబంధానికి దేవుడు చేసిన అపురూప కల్పన
తమ్ముడు మా తమ్ముడు
ఇద్దరు కలిసిన ఈ ఉదయం మమతకు మహోదయం
ఇన్నాళ్ళకు ఆ దేవుడు నాకో తీయని వరమిచ్చాడు.
నా అన్న వాడు లేడనుకుంటే, అన్నీ తానైవచ్చాడు ..
అన్నీ తానైపున్నాడు..
ఇన్నాళ్ళకు ఈ రాముడుకి ఒక తమ్ముడు తోడైవచ్చాడు
నా అయోధ్యలో అడవి దారిలో తోడూ నీడై వచ్చాడు.
తొలకరి ఆశలు తెచ్చాడు.
ఇద్దరు కలిసిన యీ ఉదయం ప్రేమకు హిమాలయం...



రామాయణం పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది రమేష్ 

కోరస్
రామాయణం దివ్య ప్రేమాయణం
సర్వదీనావనం విత్య పారాయణం

రామబ్రహ్మను రాముడెందుకే రావే సీతాభామినీ
రాముడికేవే పదితలకాయలు వాడికి తెలుసా రాక్షసమాయలు
తలలెన్నుంటేనేం.. రావణా... నీ తలసన్నే వాడుండగా
కూలిన ఆ తాటక మారీచులు - నీ కులపోళ్ళని మరిచేవా
ముక్కు చెవులూ తెగిన శూర్పణఖ  ముద్దుల చెల్లెలు
అది మరిచేవా

ఆయ్ వదరికే సీతా వదరకే ఆట్టె వదరకే
గడువిస్తుంటిని రేపటి వరకు వస్తా రేపొస్తా నీ పని చూస్తా

అమ్మా సీతా నీకివియే నా సాష్టాంగ దండ ప్రణామాలు
శ్రీరామబంటునే తల్లీ అనవాలుగా అందుకోవే
ఆ శ్రీరామ చంద్రుని ముద్రిక

నింపకే కన్నీళ్లు తల్లీ   ఈ లంక చెర ఎన్నాళ్లు
చెరబాప స్వామి రాకా తప్పదు. రావణుడు నేలకూలక తప్పదు.
ఎవడురా మర్కట నీవు మతిలేక మా లంకజొచ్చినావు
శ్రీరామబంటును నేను మాతల్లి సీతమ్మ జాడ తెలియగపిచ్చినాను
ఏమరా ఆ రామకార్యం ఏమురా నీ కోతి దౌత్యం
ధర్మమార్గము ననుసరించి స్వామికి సీతమ్మని అప్పగించి
శరణు కోరితే నీకు మంచి లేదా మరణ మొకటే నీకు శాస్తి
దహనం దహనం లంకాదహసం
లంకాపై భవ నాశనం రావణ దర్ప వినాశనం

కోరస్: దహనం దహనం లంకాదహసం లంకావైభవ నాశనం
రావణ దర్ప వినాశనం

రామజయం శ్రీరామ జయం - రామజయం శ్రీరామ్ జయం
రామజయం శ్రీరామ జయం రామజయం శ్రీరామ జయం




సీతాకాలం వచ్చింది పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

సీతాకాలం వచ్చింది రామా రామా
చిమ చిమ లాడింది ప్రేమ ప్రేమ
జివ్వు జివ్వు మన్నాది సిగ్గూ నిగ్గూ
వద్దు వద్దు అన్నాది హద్దు హద్దు

వణక్కు వణక్కు వణక్కు వణక్కు నేనున్నా తోడు
సణక్కు గొణక్కు వణక్కు మిణక్కు నేనే నీ గూడు
వెచ్చ వెచ్చనీ ముద్దిస్తా ముచ్చటేమిటో ఆడేస్తా
అందమైనదీ అందు కోవిది అచ్చ తెలుగులో అడిగేస్తా
పులిమీద పుట్రమ్మ వీడు
చలిమీద ఉన్నాడు చూడు
చలిగాలి వీస్తుంది ఆ చూపులో
ఇటు గాలి ఆటు సోకెనా పిలుపులో

చినుక్కు చినుక్కు చినుక్కు చినుకులు పడుతుంటే
చిరుక్కు చిరుక్కు చూపులు చిటికెలు వేస్తుంటే
వయసు వయసునై వాటేస్తా మనసు చాటున చాటేస్తా
మంచు కొండలో లేత ఎండలో మంచమేసి చలిమంటేస్తా

చెలి చూపు చలి కన్నా వేడి
నడిరేయి కూసింది కోడి
తెల్లారి పోవాల ఈ చుక్కతో
పరువాల ముచ్చట్లు దుప్పట్లలో...





అమ్మో ఇదే మేనకరా పాట సాహిత్యం

 
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది రమేష్, పి. సుశీల 

సరిగమ మమమమ మమమమ మమమమ మల్లెపూలు వేళాయే రాయిక 
పదనిస నినినిని  నినినిని నినినిని నిదరంటూ మనకింక  లేదిక 
అమ్మో ఇది మేనకరా అందానికి తారకరా 
అమ్మమ్మో... అమ్మో ఇది మేనకరా అందానికి తారకరా 

జవజవ లాడే జవరాలా జనమందరికీ ప్రియురాలా 
జవజవ లాడే జవరాలా జనమందరికీ ప్రియురాలా 
నవనవ లాడే కుర్రోణ్ణి... నీ నడకలు తెలిసిన చిన్నోణ్ణి...
ఈడు ఇప్పుడే ఈల వేసినా గోలచేసిరా మైకంలో 
నీతో ఆడినా జోడు కూడినా కలిసి పాడినా 
ఆడినా కూడినా పాడినా వస్తదిలే 
చక్కిలి గిలిగిలి గిలిగిలి  చక్కిలి గిలిగిలి గిలిగిలి  హా...

అమ్మో ఇది మేనకరా అందానికి తారకరా 
అమ్మమ్మో... అమ్మో ఇది మేనకరా అందానికి తారకరా 
సరిగమ మమమమ మమమమ మమమమ మల్లెపూలు వేళాయే రాయిక 
పదనిస నినినిని  నినినిని నినినిని నిదరంటూ మనకింక  లేదిక 

జగమెరిగిన ఓ చినవాడా జనమంతా మెచ్చిన వాడా 
జగమెరిగిన ఓ చినవాడా జనమంతా మెచ్చిన వాడా 
సలసలకాగిన చినిదాన్ని నీ చకపక లెరిగిన చినదాన్ని 
సోకులేప్పుడో పురుడు విప్పిన తెరలకెక్కిన బుల్లెమ్మా 
సోకులేప్పుడో పురుడు విప్పిన తెరలకెక్కిన బుల్లెమ్మా 
నిన్ను తాకినా వన్నె సోకినా కలిసి ఊగినా 
తాకినా సోకినా ఊగినా గంట గిలి 
చక్కిలి గిలిగిలి గిలిగిలి  చక్కిలి గిలిగిలి గిలిగిలి  హా...

అమ్మో ఇది మేనకరా అందానికి తారకరా 
అమ్మమ్మో... అమ్మో ఇది మేనకరా అందానికి తారకరా 
సరిగమ మమమమ మమమమ మమమమ మల్లెపూలు వేళాయే రాయిక 
పదనిస నినినిని  నినినిని నినినిని నిదరంటూ మనకింక  లేదిక 

Palli Balakrishna Sunday, March 25, 2018



చిత్రం:  శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం:  పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: యన్. టి.రామారావు, జయప్రద, జయసుధ
దర్శకత్వం: యన్. టి.రామారావు
నిర్మాత: యన్. టి.రామారావు
విడుదల తేది: 28.09.1979



Songs List:



ఇది నా హృదయం.. పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఇది నా హృదయం.. ఇది నీ నిలయం..
ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం

ఇది నా హృదయం .. ఇది నీ నిలయం
ఇది సురమునియోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం
ఇది నా హృదయం ..

చరణం: 1
ఇది నా "శ్రీ" నివాసం... ఇది నీ రాణి వాసం
ఇది నా "శ్రీ" నివాసం... ఇది నీ రాణి వాసం
నాపై నీకింత అనురాగమా?... నా పై మీకింత ఆదరమా..
ఇది నీ ప్రణయ డోళ.. ఇది నా ప్రభువుని లీలా .. ఆ .. ఆ..

ఇది నా హృదయం .. ఇది నీ నిలయం
ఇది సురమునియోగీశ్వరుల చూపులకు అందని ఆనందాలయం
ఇది నా హృదయం ..

చరణం: 2
ఎల్లలోకముల ఏలేవారికి ఈడా... జోడా ఈ సిరి?
వికుంఠపురిలో విభువక్షస్థలి విడిది చేయు నా దేవేరి ..
ఇది నా భాగ్యం... ఇది మన భోగం..

ఇది నా హృదయం .. ఇది నీ నిలయం...
ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం
ఇది నా హృదయం ..




ఎంత మధురం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

ఎంత మధురం 



ఈ పల్లె వ్రేపల్లె పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: పి. సుశీల 

ఈ పల్లె వ్రేపల్లె 




దేవుడు ఒక్కడే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: మహమ్మద్ రఫీ 

దేవుడు ఒక్కడే



నారాయణ శ్రీమన్నారాయణ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: మాధవపెద్ది రమేష్ 

నారాయణ శ్రీమన్నారాయణ



పోయి రావే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల 

పోయి రావే




ప్రభూ రానైనా రావు పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి 
గానం: పి. సుశీల 

ప్రభూ రానైనా రావు 




వేసింది గున్నమామి పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి. సుశీల, విజయలక్ష్మి శర్మ 

వేసింది గున్నమామి 




సుప్రభాతం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, వి. రామకృష్ణ , పి. బి. శ్రీనివాస్ 

సుప్రభాతం 




ఏనాడు పొందిన వరమో పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఏనాడు పొందిన వరమో 





ఆ తొలిచూపే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఆ తొలిచూపే 




అయిపోయిందైపోయింది పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి 

అయిపోయిందైపోయింది 

Palli Balakrishna



చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: యన్.టి.రామారావు, బాలక్రిష్ణ
దర్శకత్వం: డి.యోగానంద
నిర్మాత: యన్.టి.రామారావు
విడుదల తేది: 08.01.1976



Songs List:



అనుకుంటున్నాను నేననుకుంటున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: వి. రామకృష్ణ, పి.సుశీల

అనుకుంటున్నాను నేననుకుంటున్నాను




సై రా మగాడా సై పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల

సై రా మగాడా సై సైసై రా మగాడా సై



రాజు వెడలె సభకు పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం, తులసీ దాస్ 

రాజు వెడలె సభకు! కళింగ గంగు యువరాజు 





లేరా లేరా నిద్దుర లేరా (బుర్రకథ) పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల 

లేరా లేరా నిద్దుర లేరా ఓరి తెలుగుబిడ్డ  (బుర్రకథ)




జగదీశ పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: మాధవపెద్ది రమేష్ 

జగదీశ 




ఈశానా నేను నీదానా పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: ఎస్. జానకి 

ఈశానా నేను నీదానా గిరిజా రమణ




చిలకల కొలికిరో పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల

చిలకల కొలికిరో 





చందమామ నీతోటి పందెంవేసి పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల

చందమామ నీతోటి పందెంవేసి

Palli Balakrishna



చిత్రం: శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నటీనటులు: యన్. టి.రామారావు, బాలక్రిష్ణ , రతి అగ్నిహోత్రి
దర్శకత్వం: యన్. టి.రామారావు
నిర్మాత: యన్. టి.రామారావు
విడుదల తేది: 29.11.1984



Songs List:



పంచముడని నిను పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: వి. రామకృష్ణ

పంచముడని నిను కించపరచిరని
బాధపడకురా కక్కా 
పంచముడని నిను కించపరచిరని
బాధపడకురా కక్కా 
తిట్టిన నోరే నిను పొగడుతున్నప్పుడు
వదిలేనురా వాళ్ళ తిక్క
వదిలేనురా వాళ్ళ తిక్క

పంచముడని నిను కించపరచిరని
బాధపడకురా కక్కా

ఆది లోన కులమతాలు లేవు
వాడు వీడని తేడాల్లేవు
దేహానికే ఈ బేదాలన్ని
అంటరాని తనం ఆత్మకు లేదు

పంచముడని నిను కించపరచిరని
బాధ పడకురా కక్కా

జగతిన వెలిగే సూర్యచంద్రులు
నీ గూడేన వెలగనంటార
భవనాల మండే అగ్నిదేవుడు
నీ గుడిసెలో మండనంటాడ
చల్లగ వీచే వాయు దేవుడు
మిమ్మంటకుండ పోతున్నాడా
ఆ దేవుళ్ళకే లేని అంటు
ఈ మనుషులకేలరా కక్కా

పంచముడని నిను కించపరచిరని
బాధ పడకురా కక్కా

జీవనాధారమైన నీరు 
మిము తాగవద్దు పొమ్మంటుందా
అందరికందని ఆకాశం 
అది నీకే అందక పోతుందా
సస్యశ్యామలమైన నేల 
నువ్వు దున్నితే పండక పోతుందా

పంచ భూతాలకే లేని పక్షపాతము
మనలో ఎందుకు కక్కా

పంచముడని నిను కించపరచిరని
బాధ పడకురా కక్కా
బాధ పడకురా కక్కా

అందరు మీకే దాసోహం అను 
కాలం దగ్గరలో ఉంది
అగ్రగాములై రాజ్యాలేలే 
అదృస్టము పడుతుంది
తప్పదురా నా మాట 
నే చూపింది సూటి బాట

Palli Balakrishna



చిత్రం: శ్రీమద్విరాట పర్వము (1979)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నటీనటులు: యన్.టి.రామారావు, వాణిశ్రీ
దర్శకత్వం: యన్.టి.రామారావు
నిర్మాత: యన్.టి.రామారావు
విడుదల తేది: 28.05.1979



Songs List:



రమ్మని పిలిచిందిరా ఊర్వశీ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమద్విరాట పర్వము (1979)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: వాణీ జయరాం

రమ్మని పిలిచిందిరా ఊర్వశీ
రాగ సుథార్జ్వ రాకాశశీ
స్వప్నలోకాలకు - స్వర్గభోగాలకు
సరస సౌందర్య - రస సౌందర్య
అప్సరస సౌందర్య లీలా విలాసాలకు ॥ రమ్మని ॥

అగ్ని నేత్రుని నొప్పించి - అగ్నిహోత్రుని మెప్పించి
అరెరే పాసుపత గాండీవాలే పొందినావురా
వివాత కవచుని  నిర్జీంచి  నీ తండ్రి అమరేంద్రునే మించినావురా
దివిలో విజయ దుందుభులు మ్రోగించినావురా
పాసుపత ధీర... గాండీవదార... జగదేక వీర... భళిరే
ఓ భారత వీర.. ...రా...రా
॥ రమ్మని ॥

అన్నన్న నినుగాంచి...పరవశించి పాంచాలి
మీ ఐదుగురి ముత్తైదువై మురిపెనంట
మగపిరి యదగాంచి మొగలి పొదగా యెంచి
తలయూచి నిను జేరే తరుణి ఉలూచి
మగరూపునవున్న మగువ నీ మగదిమి మై సోకినంత
మగపాలి పోయెనట ఆ చిత్రాంగద

నీ ఎత్తులకు - బావ చిత్తులకు
చిత్తైన చెలువ సుభద్రమ్మ - చెప్పనే... అన్నకు చెప్పకనే
అవ్వ లేచొచ్చెనంట - నీతో లేచొచ్చెనంట
మఝారే - భళా - భళారే
అర్జున ఫలుణ - పార్థ - కిరీటి శ్వేతవాహనా
మదమతీ మోహనా రా...రా...రా..
॥ రమ్మని ॥




జీవితమే కృష్ణ సంగీతము పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమద్విరాట పర్వము (1979)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: ఎం. బాలముళీకృష్ణ 

జీవితమే కృష్ణసంగీతము
సరిసరి నటనలు - స్వర మధురిమలు
ఆంతరంగాన ఊగే రసతరంగాల తేలే
యమునా - నదీ - లహరీకా-నాట్యగీతము
నయని నట్టింది కరిలేగ దూడ
కాళిందిలో కేళిగా పాము తలవాడ
గోకుల మదిచూడ - గోప బాలకులాడ
ఆది విన్న యిల్లాలు...యశోదమ్మ అల్లాడ
ఆనంద తాండవమాడిన, ఆ నందనుని
శ్రీ పాదయుగళ శ్రీ పారిజాత సుమదళాశ
పరిమళాల - పరవశించే.......
వెన్నల రుచికన్న మన్నుల రుచి మిన్న
అన్నన్నా ఇది ఏమి అల్లరిరా అన్న
తెరచిన తన నోట తెరిచి చూచిన కంట
ఈ యేడు భువనాలు కనిపించెనంట
ఆబాల గోపాల మదికవి... ఆబాల గోపాల దేవుని
పదములామ కధలు విన్న... యదలుపొంగి యమువలైన




ఆడవే హంసగమన పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమద్విరాట పర్వము (1979)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: ఎం. బాలముళీకృష్ణ 

ఆడవే హంసగమనా
నటన మాడవే ఇందువదనా
మానస లాలస మధురస నటనా
నరనారాయణ... నవరస ఘటన...

చరణ మందార చళిత మంజీర
మధుప దిస్వనముతో... అచ్చరలకై నా
మచ్చరము గల్లు అచ్చతెలుగు కృతులతో
అభినవ కృతులతో......

పారావతాల కల కూజితాల
శృంగార మధురిములతో
జలద వాదాలు జతులుగా
జలధరించు బంగిమలతో
నీ అభినయాన, ఈ అఖిల జగము
ఓలలాడగా... ఉయ్యాలూగగా...

నృత్యము కదలాడు సాహిత్యము
నాట్యము కనుపించు సంగీతము
అనుభవాన రసవేదము
అననుభూత కలసాధము
ఐహీం నృత్యావసానే
నటరాజరాజ వినాద ఢక్కాంనవపంచ వాయమ్
నటరాజ హస్త ఢమరు కారదీస్పుట
వాఙ్మయాక్షర దీపము
ఈ జ్ఞాత గురువు అజ్ఞాత విజయుడై
ఆనంద మొందగా... నిన్నాశీర్వదించగా...




నీరాజనం జయ నీరాజనం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమద్విరాట పర్వము (1979)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఎస్.జానకి 

నీరాజనం.. జయ నీరాజనం
మీ వీరానికే మా కైవారం
మామా మేనమామా
ఓ కేకయ సార్వభౌమా......
ఏమి రాజస మూర్తి మీది
ఏమేమి కావస దీపి మీది
మీ పేరు వినగానే – మీ అడుగు పడగానే
ఉరక లిడును తత్తరలు కలిగి కేసరులైనా
ఆదరిపడును మస్తకము లదరి ధిక్కరులైనా...

రారాజుకే సై సై దోడువై
తారారాజుకే అందని రేడవై
మత్స్యదేశ కవచంబు వై ... మహీసాధ మకుటంబువై
గీయమాన బిరుదమ్ము ధరించిన సింహబలా
జేగీయమాన నిర్విక్ర పరాక్రమ రమూజ్వలా...




ముద్దిస్తే మురిపింత పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీమద్విరాట పర్వము (1979)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఎస్.జానకి, మాధవపెద్ది రమేష్ 

ముద్దిస్తే మురిపింత, చిటికేస్తే చిగురింత
ఏనాడు తెలియని ఈ వింత, ఈనాడు కలిగిన బులిపింత
ముద్దిస్తే మురిపింత, చిటికేస్తే చిగురింత
ఈనాడు యీ తీపి మరికొంత, కావాలీ కావాలీ చెరికొంత

ఆడ మొగరుగని వాణ్ణి... ఆరూ పదేళ్ళవాణ్ణి
మామ చాటున పెరిగేవాణ్ణి, ప్రేమపాఠం నేర్వనివాణ్ణి
రప్పించుకున్నావు చిరుదానా, శ్రీ చుట్టించుకున్నావు
ఈ ముహూర్తాన

నీ అయ్య చేష్టలు తెలుసు... మామయ్య లీలలు తెలుసు
అందులో వీసమైన అబ్బకుండునా... అది అంతో ఇంతో
రసికత అంటకుండునా ?
రప్పించుకున్నావు పసివాడా... చుక్క పెట్టించుకున్నాను శుభవేళ

శ్రీ చుట్టగానే - దొరికింది తుదిమెట్టు
చుక్క పెట్టగానే - తెలిసింది లోగుట్టు
ఊరికే పోయెనా తొలిపాఠం... ముద్దుతో తీరెనా బులపాఠం

ఈ పలుకు కోసమేనా కలవరింత
ముడుపుగా దాచాను మొలకవలపంత...



నీకు నేనే సరి పాట సాహిత్యం

 

చిత్రం: శ్రీమద్విరాట పర్వము (1979)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, ఎస్. జానకి, మాధవపెద్ది రమేష్ 

హై వలచి వచ్చిన దానవే
పిలిచి ఇచ్చిన దానవే...ఏమే సొగసరి
నీకు నేనే సరి నాకు నీవే సరి...
ఓసి పున్నమి వెన్నెలా - బోసి పోయావెందుకే
హాయిరి మల్లె పందిరీ ... వాడి పోయావెందుకే
అహో పిల్లతెమ్మెరా... అగిపోయా వెందుకే
వాగే రాచిలకలాఠా... మూగపోయా వెందుకే 

చెలిమోము చిన్నబోయిందనా
చిరునవ్వు చెన్ను తరిగిందనా
జిలుగూ వయ్యెద తుళ్ళి పడలేదనా
పలుకే పెదవి దాటి రాలేదనా

నీకు నేనే సరి... నాకు నీవే సరి ...
కోటికోటి స్వర్గ సుఖాలూ... కొత్తగ కొల్ల గొట్టనీ వెచ్చని
కొంగు నీడలో
ఇలాంటి తేనె తీయదనాల మత్తుగ చూరలాడనీ ముద్దుల మొదటి ముద్రలో
పరచిన వెన్నెలనే పానుపు చేసే
పొంగే వయసునే పూలుగ వేసీ
పగలెరుగక - జగమెరుగక - వగకౌగిలి బిగివదలక
ఒరిగి ఒరిగి కరిగి కరిగి పోదామా
నీకు నేనే సరి... నాకు నీవే సరి...

సరి సరి సరి సరి సరి
మీకు మీరే సరి... మాకు మేమే సరి
ఆయ్... మీకు మీరే సరి... మాకు మేమే సరి
ఇంతటితో సరి





మనసాయెనా మారిపోయెనా పాట సాహిత్యం

 

చిత్రం: శ్రీమద్విరాట పర్వము (1979)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

మనసాయెనా... మతిపోయెనా
ఎవరికి ?
ఓ మదనా ... మదవా
మరి మరి ఉడికించ తగువా......
ఎప్పుడు మనసవుతుందో
అప్పుడు మతిపోతుంది
ఎప్పుడు మతిపోతుందో
అప్పుడే కధ మొదలవుతుంది

పగలేమో సూర్యుడుంటాడనీ
రేయైతే చంద్రుడొస్తాడనీ
తోటయితే తుమ్మెదల రొదలుంటాయనీ
దిగులుపడే చెలిగుండె గుబులుగని
ఓ మదనా - మదనా మరి మరి ఉడికించ తగునా

సూర్యుడుంటే ఏమి...పైట చాటు కాదా ?
చంద్రుడొస్తే ఏమి...పూలమాట లేదా ?
ఝుమ్మని తుమ్మెదలుంటే తారమ్మని అర్థం కాదా ?
మదిరాక్షి  మనసుంటే మార్గమే లేదా?

కన్నె వయవేమో కాకున్నా
సెభాష్
ఆంకెకు పతులేమో ఐదుగురున్ను
అంతేనా
తీరనిదేదో ఆతడి పెడుతుంటే
మరిగే కోరిక మారాము చేస్తుంటే...

దోరవండిన వయసులకే రుచులు మెండుకాదా
అంకె పెరిగినకొద్దీ - అనుభవం అధికం కాదా
మరిగే కోరిక వుంటే - మరి మరి మధురం కాదా
గుండె గుట్టు ముడి విప్పందే... గూటికి పోనిస్తానా
ఔనా... అంతేనా...


Palli Balakrishna

Most Recent

Default