Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Anjali"
Premalekha Raasa (2007)



చిత్రం: ప్రేమలేఖ రాశా (2007)
సంగీతం: శ్రీరామ్ కౌషిక్ (తొలి పరిచయం)
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: కమల్
గానం: చిత్ర, జాస్సి గిఫ్ట్, ఆర్.పి.పట్నాయక్, శ్రావణి, ప్రణవి గీతామాధురి, స్వప్న, బేబీ సౌందర్య లహరి , బాలాజీ 
నటీనటులు: మల్లిడి. వెంకట్ (తొలి పరిచయం), అంజలి (తొలి పరిచయం), సుమన్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం: కులశేఖర్ 
నిర్మాత: 
విడుదల తేది: 2007


(ఈ సినిమా హీరో మల్లిడి. వెంకట్, తండ్రి పేరు మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి ఈయన నిర్మాతగా బన్ని (2005), మరియు భగీరధ (2005)  సినిమాలు తీశారు. మల్లిడి. వెంకట్ పేరును వశిస్ట గా మార్చుకొని డైరెక్టర్ గా బింబిసార (2022) సినిమా తీశారు ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరో )



Songs List:



ఓ ప్రేమా నువ్వేనా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖ రాశా (2007)
సంగీతం: శ్రీరామ్ కౌషిక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: చిత్ర 

ఓ ప్రేమా నువ్వేనా 




రామా రామా రామా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖ రాశా (2007)
సంగీతం: శ్రీరామ్ కౌషిక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: ప్రణవి ఆచార్య, బాలాజీ, సౌందర్య లహరి 

రామా రామా రామా 



మల్లెపూలు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖ రాశా (2007)
సంగీతం: శ్రీరామ్ కౌషిక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: గీతామాధురి

మల్లెపూలు 




మావా రాతిరికోస్తావా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖ రాశా (2007)
సంగీతం: శ్రీరామ్ కౌషిక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: ప్రణవి ఆచార్య, సప్నా అవాస్తి

మావా రాతిరికోస్తావా 




ఓ చెలి ఓ చెలి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖ రాశా (2007)
సంగీతం: శ్రీరామ్ కౌషిక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: శ్రావణ భార్గవి, ఆర్.పి.పట్నాయక్ 

ఓ చెలి  ఓ చెలి 



వెంకటేశ వెంకటేశ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖ రాశా (2007)
సంగీతం: శ్రీరామ్ కౌషిక్ 
సాహిత్యం: కులశేఖర్ 
గానం: జాస్సి గిఫ్ట్ 

వెంకటేశ వెంకటేశ

Palli Balakrishna Thursday, August 11, 2022
Shopping Mall (2010)


 

చిత్రం: షాపింగ్ మాల్ (2010)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్, విజయ్ ఆంటోని
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: హరిచరణ్, చిన్మయ శ్రీ పాద
నటీనటులు: మహేష్ , అంజలి
దర్శకత్వం: వసంత బాలన్
నిర్మాత: సురేష్ కొండేటి
విడుదల తేది: 06.11.2010



నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హో...
యద చప్పుడు చేసే శృతి నీవే

ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే ఓ...
యద చప్పుడు చేసే శృతి నీవే

నీ పరువాల పూ జల్లే కురిపించావే
నా మనసును దోచి మాయను చేసి మురిపించావే
నా మదిలోని భావనల అర్ధం నువ్వే
బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే
నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన
ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా

హో.. ఎండల్లోవెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం

నా పాటకు మాటై పలికావే హో..
యద చప్పుడు చేసే శృతి నీవే
ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం
నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం
నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం
నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం
నీ జాడగ ఉంటే తప్ప నా నీడకు అర్దమ్మా లేదే
అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా
ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. 
నిప్పుల్లో వానై వచ్చావే

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం
నా పాటకు మాటై పలికావే హో..
యద చప్పుడు చేసే శృతి
ఎండల్లో వెన్నెల తెచ్చావే హో..
నిప్పుల్లో వానై వచ్చావే

Palli Balakrishna Saturday, May 8, 2021
Vakeel Saab (2021)


 


చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతి హాసన్, అంజలి, నివేత థామస్, అనన్య నగళ్ళ,  ప్రకాష్ రాజ్
దర్శకత్వం: వేణు శ్రీరామ్
నిర్మాత: దిల్ రాజు, బోనీ కపూర్
విడుదల తేది: 09.04.2021


Songs List:




మగువా మగువా మేల్ వెర్సన్ పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్





మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా

అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయట
అలుపని రవ్వంత అననే అనవంట
వెలుగులు పూస్తావు వెళ్లే దారంత

సా గమపమాగసా గమపమాగసా
గమపమాగ గమపమాగ గమనిపామస
గమపమాగసా  గమపమాగసా
గమపమాగ గమపమాగ గమనిపామస

మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా

చరణం:
నీ కాటుక కనులు విప్పారకపోతే 
ఈ భూమికి తెలవారదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే 
ఏమనుగడ కొనసాగదుగా

ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా
అంతులేని నీ శ్రమా అంచనాలకందునా
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా 
నీవులేని జగతిలో దీపమే వెలుగునా

నీదగు లాలనలో ప్రియమగు పాలనలో 
ప్రతి ఒక మగవాడు పసివాడేగా
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా 
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా

సా గమపమాగసా గమపమాగసా
గమపమాగ గమపమాగ గమనిపామస
గమపమాగసా  గమపమాగసా
గమపమాగ గమపమాగ గమనిపామస

మగువా మగువా
లోకానికి తెలుసా నీ విలువా
మగువా మగువా
నీ సహనానికి సరిహద్దులు కలవా




సత్యమేవ జయతే పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్
ర్యాప్: పృధ్వీ చంద్ర





జన జనజన జనగణమున
కలగలిసిన జనం మనిషిరా
మన మన మన మనతరపున
నిలబడగల నిజం మనిషిరా

నిశి ముసిరిన కలలను తన వెలుగుతో
గెలిపించు ఘనుడురా
పడి నలిగిన బతుకులకొక
బలమగు భుజమివ్వగలడురా

వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే
ఇతనిలా ఓ గళం మన వెన్నుదన్నై పోరాడితే

సత్యమేవ జయతే సత్యమేవ జయతే
సత్యమేవ జయతే సత్యమేవ జయతే

జనజన జన జనగణమున
కలగలిసిన జనం మనిషిరా
మన మన మన మనతరపున
నిలబడగల నిజం మనిషిరా

నిశి ముసిరిన కలలను తన వెలుగుతో
గెలిపించు ఘనుడురా
పడి నలిగిన బతుకులకొక
బలమగు భుజమివ్వగలడురా

గుండెతో స్పందిస్తాడు
అండగా చెయ్యందిస్తాడు

ఇలా చెంప జారెడి ఆఖరి అశ్రువునాపెడివరకు
అనునిత్యం బలహీనులందరి ఉమ్మడి గొంతుగ
పోరాటమే తన కర్తవ్యం

వకాల్తా పుచ్చుకుని వాదించే ఈ వకీలు
పేదోళ్ళ పక్కనుండి కట్టిస్తాడు బాకీలు
బెత్తంలా చుర్రుమని కక్కిస్తాడు నిజాలు
మొత్తంగా న్యాయానికి పెట్టిస్తాడు దండాలు

ఇట్టాంటి ఒక్కడుంటే అంతే చాలంతే
గొంతెత్తి ప్రశించాడో అంతా నిశ్చింతే
ఇట్టాంటి అన్యాయాలు తలెత్తవంతే
నోరెత్తే మోసగాళ్ళ పత్తా గల్లంతే

సత్యమేవ జయతే సత్యమేవ జయతే
సత్యమేవజయతే సత్యమేవ జయతే
సత్యమేవ జయతే





కంటిపాప కంటిపాప పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అర్మాన్ మాలిక్, దీపు, థమన్, గీతా మాధురి, సాహితి, శృతి రంజని, హారిక నారాయణ్, శ్రీనిధి, యమ్. ఎల్. గాయత్రి, నారాయణ నయ్యర్, శృతి యమ్. ఎల్





కంటి పాప కంటి పాప చెప్పనైన లేదే
నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా
కాలి మువ్వ కాలి మువ్వ సవ్వడైన లేదే
నువ్విన్నిన్నాల్లుగా వెంట తిరుగుతున్నా

నీ రాక ఏరువాక నీ చూపే ప్రేమ లేఖ
నీలో నువ్వాగిపొక కలిశావే కాంతి రేఖ
అంతులేని ప్రేమనువ్వై ఇంత దూరం వచ్చినాక
అందమైన భారమంత నాకు పంచినాక

మొదలేగా కొత్త కొత్త కథలు
మొదలేగా కొత్త కొత్త కలలు
ఇకపైన నువ్వు నేను బదులు
మనమన్న కొత్త మాట మొదలు

కంటి పాప కంటి పాప చెప్పనైన లేదే
నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా

సాప మాప మాప మాగ సామగారిస (2)

సుధతి సుమలోచని సుమనోహర హాసిని
రమణీ ప్రియ భాషిని కరుణగుణ బాసిని
మనసైన వాడిని మనువాడిన ఆమని
బదులీయ్యవే చెలి నువ్వు పొందిన ప్రేమని
పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా

సాప మాప మాప మాగ సామగారిస (2)

ఎదలో ఏకాంతము ఏమైందో ఏమిటో
ఇదిగో నీ రాకతో వెళిపోయింది ఎటో
నాలో మరో నన్ను చూశా నీకు స్నేహితున్ని చేశా
కాలం కాగితాలపై జంట పేర్లుగా నిన్ను నన్ను రాశా
ఆకాశం గొడుగు నీడ పుడమేగా పూల మేడ
ఏ చూపులు వాలకుండ ప్రేమే మన కోట గోడ
నాకు నువ్వై నీకు నేనై ఏ క్షణాన్ని వదలకుండ
గురుతు లెన్నో పెంచుకుందాం గుండె చోటు నిండా

మొదలేగా కొత్త కొత్త కథలు
మొదలేగా కొత్త కొత్త కలలు
ఇకపైన నువ్వు నేను బదులు
మనమన్న కొత్త మాట మొదలు

మొదలేగా కొత్త కొత్త కథలు
మొదలేగా కొత్త కొత్త కలలు
ఇకపైన నువ్వు నేను బదులు
మనమన్న కొత్త మాట మొదలు





కదులు కదులు పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శ్రీకృష్ణ , వేదాల హేమచంద్ర





కదులు కదులు కదులు
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు

కాలం తన కళ్ళు తెరిచి గాలిస్తున్నది నీలో
కాళిక ఏమైందని ఉగ్రజ్వాలిక ఏమైందని
దెబ్బకొడితే పులిని నేను ఆడదాన్ననుకున్నా
తోక తొక్కితే నాగు తనను ఆడదనుకుంటుందా

ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ

కదులు కదులు కదులు
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు

గాజుతో గాయాలు చెయ్
చున్నీనే ఉరి తాడు చెయ్ 
రంగులు పెట్టే గోళ్ళునే గుచ్చే బాకులు చెయ్
పిరికితనం ఆవహించి పరిగెత్తే నీ కాళ్ళతో
రెండు తొడల మధ్య తన్ని
నరకం పరిచయం చెయ్

నీ శరీరమే నీకూ ఆయుధ కర్మాగారం
బతుకు సమర భూమిలో నీకు నీవే సైన్యం 
సైన్యం సైన్యం

ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ
ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓ

కదులు కదులు కదులు
కట్లు తెంచుకొని కదులు
వదులు వదులు వదులు
బానిస సంకెళ్ళను వదులు





మగువా మగువా ఫీమేల్ వెర్సన్ పాట సాహిత్యం

చిత్రం: వకీల్ సాబ్ (2021)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మోహన భోగరాజు





మగువా మగువా 
నీ మనసుకు లేదా ఏ విలువా

ఆకాశం తాకే నీ ఆక్రదనాలు
మనసారా వినువారేవారు
నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు
సవరించే మనవారేవారు
కళా మారుతున్న జీవితం కలతలోకి జారేన
కలలుగన్న కనులకు నీటిచెమ్మ తగిలేనా
వెళుతురైన ప్రతిదినం చుపుతోంద వేదన
అందమైన బతుకున అలజడి చెలరేగెనా

ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం
చీకటి ముసిరిందే చిటికలోనే
తీరదు నీ శోకం మారదు ఈ లోకం
తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా

మగువా మగువ
నీ మనసుకు లేదా ఏ విలువ
మగువ మగువ
నీ తలరాతలో చిరునవ్వులు కలవా

అలుసుగా చూస్తారు లోకువ చేస్తారు
అనాది కాలంగా అబలవే నువ్వు
నిందలు వేస్తారు నిను వెలివేస్తారు
ఆడదిగా నువ్వు పొరబడి పుట్టవు

మగువ మగువ
నీ మనసుకు లేదా ఏ విలువ
మగువ మగువ
నీ తలరాతలో చిరునవ్వులు కలవా

Palli Balakrishna Thursday, March 18, 2021
Nishabdham (2020)



చిత్రం: నిశ్చబ్ధం (2020)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: విజయ్ ఏసుదాస్
నటీనటులు: అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మెడ్సెన్
దర్శకత్వం: హేమంత్ మధుకర్
నిర్మాతలు: కోన వెంకట్, టి. జి. విశ్వ ప్రసాద్
విడుదల తేది: 02.10.2020







ఈ ప్రేమంటే ఇంతే
విషాన్ని పంచె నీసీదనే
నింపేనా... క్షణాలలోన
దహించివేసే ప్రమాదమే

ప్రాణమల్లె ప్రేమిస్తాము
ఊపిరల్లే జీవిస్తాము
కోరిందల్లా తెచ్చిస్తాము
చెప్పిందల్లా నమ్మేస్తాము
కాలు కందనివ్వకుండా
ఎత్తుకుంటూ తిప్పేస్తాము
నెత్తురోడుతున్న గుండె
ఎత్తుకెళ్ళి పారేస్తారేరా
మా పైన జాలే రాబోధ ఇంతేన

వై  వై...  వై వై... వై వై...

ఒకొక్క ప్రాణాన్ని పేర్చి
మా కళ్ళు చూస్తుండంగానే
కూల్చేరు కన్న కలలే - వై
గుర్తొస్తే కన్నీటి దారై
ఉప్పొంగే అంతంటూ రానే
సంకెళ్లు లేని చరలే... వై
ప్రేమలో మోసముంటుందా
నాశనం కోరుకుంటుందా
బాధనే కోపమంటారా
పూజలే చేయమంటారా

నర నరం - వై,  కలవరం - వై
తగదు లే కనికరం ఎదలో
ఎగసెగ రుధిరం - వై

ఈ ప్రేమంటే ఇంతే
విషాన్ని పంచె నీసీదనే
నింపేనా... క్షణాలలోన
దహించివేసే ప్రమాదమే

ప్రాణమల్లె ప్రేమిస్తాము
ఊపిరల్లే జీవిస్తాము
కోరిందల్లా తెచ్చిస్తాము
చెప్పిందల్లా నమ్మేస్తాము
కాలు కందనివ్వకుండా
ఎత్తుకుంటూ తిప్పేస్తాము
నెత్తురోడుతున్న గుండె
ఎత్తుకెళ్ళి పారేస్తారేరా
మా పైన జాలే రాబోధ ఇంతేన







చిత్రం: నిశ్చబ్ధం (2021)
సంగీతం: గోపి సుందర్, గిరీష్. జి.
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: భద్ర

నా కనుపాప వెతికింది నీ కోసం 
కన్నీరు వెతికింది నీ కోసం 
నా శ్వాస వెతికింది నీ కోసం 
నేనైనా బ్రతికుండి 
ఎటు కదిలావు నను వదిలావు
ఇక కానరాను సెలవని
జత విడిపోయి గగమైనావు
నను ఓదార్చేది ఎవరని

నువు లేని నా మౌనం నిండు నిశ్శబ్దం
నువు లేని నా ప్రాణం నిండు నిశ్శబ్దం
నువు లేని నా లోకం నిండు నిశ్శబ్దం
నువు లేని నా మార్గం నిండు నిశ్శబ్దం

నా కనుపాప వెతికింది నీ కోసం 
కన్నీరు వెతికింది నీ కోసం 

దినమొక నరకం అడుగు పడుదుగా
నిజమొగా గరళం గుటక దిగదుగా
బలైయ్యావు కలైయ్యావు తిరిగిరాని లోకంలోకి
నిన్నే నీవు అర్పించావు నా చెలిమి

నువు లేని నా మౌనం నిండు నిశ్శబ్దం
నువు లేని నా ప్రాణం నిండు నిశ్శబ్దం
నువు లేని నా లోకం నిండు నిశ్శబ్దం
నువు లేని నా మార్గం నిండు నిశ్శబ్దం

మరుక్షణమని ఈ తెలిసిరాదుగా
తెలిసేలోపే నువ్వు లేవుగా
ఉన్న నేను లేనే లేను
పడున్నాను తడి నయనంగా
మందే లేని గాయం లాగ మిగిలేనా

నువు లేని నా మౌనం నిండు నిశ్శబ్దం
నువు లేని నా ప్రాణం నిండు నిశ్శబ్దం
నువు లేని నా లోకం నిండు నిశ్శబ్దం
నువు లేని నా మార్గం నిండు నిశ్శబ్దం







చిత్రం: నిశ్చబ్ధం (2021)
సంగీతం: గోపి సుందర్, గిరీష్. జి.
సాహిత్యం: శ్రీజో
గానం: హరిణి, నజిం హర్షద్

మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే

మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే
తొలిసారి ఎదని తడుముతూ
మేలుకొలుపే స్వరమే విన్న
అది నీ ఎద నుండి పయనమై
నన్ను చేరే మహిమ

మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే

అరచేతిలో గగనం చూపింది ఈ చెలిమే
వర్ణాల విన్యాసం తెలిపే కలలే
నీతోటి సావాసం నీ నడగ నీ వరమే
ఇంతందామా స్నేహం...
నీతో కొత్త లోకం ఉహించనిదే
మరు జన్మయ్ ఎదురైందే
నాలో మౌనమంతా కావ్యమై కరిగింది వినమని

మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే

కడలేమో నీ హృదయం మేఘాన నా నిలయం
ప్రరవహించే నీ వైపే చినుకై ప్రణయం
నీ కథలకే గానం నా ఊపిరై గమగం
స్పందించు నీ ప్రాణం
నువ్వుంటేనే నేను అంటే నిజమే
మనసొకటై అది మనమై
ప్రేమై కాలమంతా ఉండిపో ఉండాలి జతపడు

మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే

తొలిసారి ఎదని తడుముతూ
మేలుకొలిపే స్వరమే విన్న
అది నీ ఎద నుండి పయనమై
నన్ను చేరే మహిమ

మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే


Palli Balakrishna Tuesday, February 9, 2021
Sankarabharanam (2015)



చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
నటీనటులు: నిఖిల్ సిద్దార్ధ్, నందిత రాజ్, అంజలి
కథ, మాటలు: కోన వెంకట్
దర్శకత్వం: ఉదయ్ నందనవనం
నిర్మాత: ఎమ్.వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 04.12.2015



Songs List:



బన్నో రాణి పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

బన్నో రాణి



దారు పీలే బ్రో పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: సిరాశ్రీ 
గానం: బాబా సెహగల్ 

దారు పీలే బ్రో



డింగ్ డాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: నూతన మోహన్, హేమచంద్ర 

డింగ్ డాంగ్



ఘంటా పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: ఉమా నేహా 

ఘంటా 



రాక్ యువర్ బాడీ పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: యస్. థమన్ 

రాక్ యువర్ బాడీ



సంగీత్ పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: రాహుల్ నంబియార్ , లిప్సిక 

సంగీత్ పాట



తూరుపే పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (2015)
సంగీతం: ప్రవీణ్ టామీ
సాహిత్యం: శ్రీజో
గానం: కార్తిక్, రమ్యా బెహ్రా 

తూరుపే

Palli Balakrishna Sunday, March 24, 2019
Stree Janma (1967)



చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, ఘట్టమనేని కృష్ణ, అంజలి, కృష్ణ కుమారి, ఎల్. విజయలక్ష్మి, గీతాంజలి, రాజశ్రీ,  వాణిశ్రీ(అతిథి పాత్ర), డి.రామానాయుడు(అతిథి పాత్ర)
దర్శకత్వం: కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 31.08. 1967



Songs List:



ఎదో ఎదో ఔతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల

పల్లవి:
ఎదో ఎదో ఎదో ఎదో ఔతున్నది
ఇదే ఇదే ఇదే ఇదే బాగున్నది
దోర వయసు పొంగి పొంగి దూకుతున్నది

చరణం: 1
కరగే వెన్నెల కవ్విస్తున్నది
కదిలే గాలిలో కైపేదో వున్నది
తీయని కౌగిలి పూవుల పందిరి
సై యంటే సై యన్నవి

చరణం: 2
పందెం వేసే అందాలున్నవి
ముందుకు లాగే బంధాలున్నవి
గుబ గుబలాడే కోరిక లేవో
కో అంటే కో అన్నవి




ఎన్ని పూవులిలా నలిగిపోయినవో పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

ఎన్ని పూవులిలా నలిగిపోయినవో
ఎన్ని బ్రతుకులిలా చెదరి రాలినవో
మగజాతికి నువు బలిపశువమ్మా
నీ సొగసూ వయసే నీకు పగమ్మా
స్త్రీ ప్రకృతే నీ పాలిట శాపం
ఈ స్త్రీ జన్మే నువు చేసిన నేరం
అందం నీవే అంటారు
ఆనందానికి నెలవంటారు
ఆ రెంటిని పొందీ నిన్నాఖరుకు
అపవిత్రవని వెలివేస్తారు

అరిటాకమ్మా ఆడజన్మము
ముళ్ళకంచె యీ మూఢ సంఘము
ముళ్ళకెన్నడూ దండన లేదూ
చిరిగిన ఆకు విస్తరికాదు




వెడలే సింహబలుడు పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొనరాజు
గానం: మాధవపెద్ది అండ్ స్వర్ణలత

వెడలే సింహబలుడు
అరివీర భయంకరుడు
మచ్చ కంఠులెల్ల పొగిడి 
మెచ్చెడు నవ మన్మధుడు

సైరంధ్రి : రమణి సైరంధ్రి వచ్చేను
మధిరమ్ము తేవగ
రాజా వీధికి వచ్చెను
కాళియందియలు ఘల్లని మ్రోయ
కన్నుల మిలమిల కాంతులు మెరయ
చూపులే మరుని తూపులౌచు
తన రూపు జూచి జనులౌరా
భళా యనుచు

కీచక : వగలాడి నీ మోము సొగసు చూడని
కన్నులుండిన ఫలమేమిటే
ఓ చెలియా ఉండిన ఫలమేమిదే

సైరంధ్రి : అయ్యయ్యయ్యొయ్యో 
అహా యింపుగ నిను కౌగలింపని
కరములు చేసెడి పని ఏమిటే
సైరంద్రి: త్రిజగమ్ములెత్తి వచ్చిన
భుజ బలమున ఉక్కడించు పోటరులగు

గ్విజయ ధనులు పతులేవురు
అజేయులు నిన్ను బట్టి హతము జేసెదరూ
ఆ గంధర్వులు ప్రతిన తీర్చెదరూ
రాచవీధిన బోవు రమణుల
వేచుటకు తరి వేచియుందువు
నీచుడా నీ శిరము నిపుడే
చెక్కలుగా ముక్కలుగా చేసి
రూపు మా పెద రూ ....

కీచక : పతులేవురు గలరని ఓ అతివా గొప్పగ వచింతువు
ఆపుము యిక నీ వాక్చాతుర్యము
ఉద్దతిమై గంధర్వ పతులా రెక్క లూడ్చెదనూ
ఈ సింహబలునీ దిటవు చూపెదనూ
ఒక్క సతికీ లోకమందును
ఒక్కడే పతి యనగ విందుము
ఇదెక్కడి విచిత్రమ్ము చెప్పు కొనంగ
సిగ్గెటు లేకపోయె చాలు పో పో వె
నీవానిగ నన్నేలుకోవే
సైరంధ్రా : చాలు పో పో రా
కిచక : నన్నేలుకోవే





హల్లో అన్నదీ మనసూ పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి.సుశీల

హల్లో అన్నదీ మనసూ
చలో అన్నదీ సొగసు
సరే నన్నదీ

సై అన్నది
హుషారెన వయసు
ఉక్కిరి బిక్కిరి చేస్తానంది
ఒంపులు తిరిగే పొంకం
కం....కం
చెక్కిలిగింతలు పెడతానంది
పెంకితనాల బింకం

ఓయ్..... ఓర్వని లోకం పగ్గాలేస్తే
తెంచమన్నదీ ఆవేశం!
కజీవితమంతా సెలవు
లవ్ లవ్
ప్రేమించడమే చదువు
హాయ్ : చిలిపి చూసలో భావం
చదవక వచ్చే పాఠం
హూయ్ జిలిబిలి కోరిక
పరీక్ష పెడితే
జై హిందన్నది ఆ సందం
హాయ్, హాయ్, హాయ్




బాసందీ నదీ తీరాన పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (జూనియర్)
గానం: పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి

బాసందీ నదీ తీరాన
రసగుల్లా కిల్లాలోన
మెసూర్ పాక్ పందిరిలో
నీకు నిఖా చేస్తానే

రాణీ ! డెమన్ రాణి
నువ్వు నా చిక్కెన్ బిరియానీ
రాజా ! ఇస్పేట్ రాజా
నువు నా ఇత్తడి మర కూజా
చక్కెర కేళీ అనార్కలీ
మా బాబున్నాడే పెద్దపులి
మారో గోలీ అన్నాడా
మన మొహబ్బల్ ఖాళీ ఎలా గైతీ
భయపడతావేం డేమ్ సిల్లీ
మీ బాబైతేనేం పెద్దపులి
చేసాం దానిని చెవుల పిల్లి
మనం సాగిద్దామోద్ ఫ్యామిలీ

హోయ్ హోయ్ హోయ్

లవ్ పరీక్షలో సున్నా రానీ
సలీం డోంట్ బి సారీ
సినీ జగత్తుకే లభిస్తుంది.
చక్కని స్టోరీ స్టోరీ స్టోరీ
నిన్ను ప్లాస్టిక్ గాజు చేసి వేసుకోనా
ఫేస్ పౌడరుగా జేసి పూసుకోనా
కూలింగ్ గ్లాసల్లే కళ్ళకీ పెట్టుకోనా
నైలాన్ చీరల్లే ఉతికేసి కట్టుకోనా

ఓ ! అనార్కలి ! మనల్ని బ్రతక నీయది సొసైటీ
జానేదో..మనం చచ్చాక ఇస్తుందిలే
పబ్లిసిటీ....పబ్లిసిటీ.... పబ్లిసిటీ
ఆ పాపు---గుండెదడ వస్తోంది కట్టి పెట్టు
చార్మినార్ సిగరెట్టు

రానీ ఒక పాకెట్టు
లేదంటే మన లవ్వ కట్టు
ఎందుకిటు మార్చావు నీ రూటు
నా ప్రేమ ఇనప్పెట్టె
నీ చేతిలోన పెట్టా
ఏమౌనో ఇక మీద ఫేటు




చేయని నోమె పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల

చేయని నోమె అడగని వరమై
చిక్కిన తండ్రి లాలి
చక్కని తండ్రి లాలి
చల్లని నగవుల జాబిలి మొగమున
నల్లని నీడలు పరచినవాడు
అన్నెం పున్నెం ఎరగని నిన్నే 
అన్యాయానికి గురిచేశాడు
కడుపున పుట్టిన కసుకందులపై
మృగములకైనా మమతలు తప్పవు
పాలు విడువని పాపని విడిచిన
కన్నతల్లిది కడుపా చెరువా !




ఈనాటి కుర్రకారు పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (జూనియర్)
గానం: పి. సుశీల

ఈనాటి కుర్రకారు చూసే ఒకే చిరాకె
తోకొకటి లేదుగాని అసలైన కోతిమూ 

యహూ యహాఁ
ఈనాటి ఆడవారు మాకూ ఒకే చిరాకె
ఇవికూడ కోతిమూకే కాని తలమీద ఉంది తోక
అ బ్బ బ్బ బ్బ అబ్బాయిలూ
అమ్మమ్మమ్మ అమ్మాయిలూ
శాస్తారు రాకపోక వసారు ఇంటిదాక
వెనుదిరిగి చూసినాక ఆయ్యవారు ఒట్టిమేక

వాలుచూపు చూస్తారు, ఒళ్ళు విరుచుకుంటారు
చూపు కలవగానే కస్సు బుస్సుమంటారు
పళ్ళుకొరికి కళ్ళురిమి చూడు హై
పక్కగొందికే పరారు

వెనకాల వాగుతారు వింటుంటే ఎంత జోరు
మన మెళ్ళి పలకరిస్తే ఖంగారు బంద్ నోరు
వింత డ్రస్సు లేస్తారు కన్ను చెదర గొడతారు
చెంగు పట్టుకుంటే బేరు, బేరు మంటారు
రోజు రోజుకొక వింత పోజు మీ
మగ గుంపుకే రివాజు
కమీరు ఓర చూపు చూస్తే ఒప్పా ?
ఒప్పే :
కమేం పళ్ళికిలిస్తే తప్పా ?
తప్పే
పైట జారవేస్తే |
మా యిష్టం.
మేం పక్కకు వస్తే
మీకే నష్టం
నష్టమంటు కష్టమంటు
తప్పులంటు ఒప్పులంటు
ఎంచుకుంటు కూరుచుంటే ముప్పు గాన
మీరు మేము రాజీ పడదామా





ఎడారిలో పూలు పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల, పి. సుశీల

ఎడారిలో పూలు పూచె ఎందుకనీ
మనసులోన తలపు మెరిసె అందుకనీ
మూగవీణ పాట పాడె ఎందుకనీ.... హోయ్
చెలిమదిలో వలపు మొలిచె అందుకనీ....
కురులలోని పూలమాల కోరేను నన్నే
పెదవిలోని మధువులన్ని చేరేను నన్నే
కోటి కోటి దీపాలు ఆటాడు వేళ
కోరికొకటి నన్నిపుడు వేటాడు వేల
ఎందుకనో
అందుకనే
సిగ్గుతెరలు దాగియున్న ఆ కోరికేదో
బుగ్గమీద రాసి చూపి ఊరించరాదా !
దాచుకున్న సిగ్గులన్ని నీవాయె నేడే
తెరలు తొలగి మనసు కలసి ఆడేను నేడే
ఎందుకనో
అందుకనే





ఇది తర తరాల కథ చెల్లీ పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

సాకీ:
ఇది తర తరాల కథ చెల్లీ
ఇలాగే జరుగుతున్నది మళ్ళీ మళ్ళీ

పల్లవి:
మగజాతికి నువు బలిపశువమ్మా
నీ మనుగడ ఆరని కన్నీరమ్మా
మాతృత్వం నీపాలిట శాపం
శ్రీ జన్నే నువు చేసిన నేరం
లోకుల నిందలు ఓర్చిన తల్లీ
నీ నెత్తురు నిందించినది
సహనంకూడా సహించరానిదీ
నీ మరణమె దీన్ని మాపేది

Palli Balakrishna Tuesday, February 12, 2019
Dictator (2016)



చిత్రం: డిక్టేటర్ (2016)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
నటీనటులు:  బాలక్రిష్ణ, అంజలి , సోనాలి చౌహాన్
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: కిశోర్ లుల్లా, సునీల్ లుల్లా
విడుదల తేది: 14.01.2016



Songs List:



గం గం గణేశ పాట సాహిత్యం

 
చిత్రం: డిక్టేటర్ (2015)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దీపక్, సాయి చరణ్, నివాస్, దివ్యా కుమార్

గం గం గం గం గం గం గణేశ 
గౌరీ తనయా సర్వేశ 
హే రంబ విగ్న వినాశ 
జన మానస నిత్య నివాస 
నీ ప్రేమ మాకు బరోస 

గం గం గం గం గం గం గణేశ 
గౌరీ తనయా సర్వేశ 
హే రంబ విగ్న వినాశ 

నమో నమామి వక్ర తుండ 
నువ్వే మా గుండె నిండా 
నువ్వే మా అండా దండా
నీ అభయం ఆకు పచ్చ జెండా 
తోలి పూజల పూల దండ
నీ మెళ్ళో వేసుకుంటాం గన నాథుడ

గణపతి బప్పా మోరియా
హే మంగళ మూర్తి మోరియా
హే గణపతి బప్పా మోరియా
హే మోరియా హే మోరియా

గణపతి బప్పా మోరియా
హే మంగళ మూర్తి మోరియా
హే గణపతి బప్పా మోరియా
హే మోరియా హే మోరియా

గం గం గం గం గం గం గణేశ 
గౌరీ తనయా సర్వేశ 
హే రంబ విగ్న వినాశ 
జన మానస నిత్య నివాస 
నీ ప్రేమ మాకు బరోస 

గారికైనా చాలంటావు నీ పూజకి 
ఉండ్రాల్లె విందు అంటావు ఏ నాటకీ
సరితూగే కొడుకయ్యావు శివ మూర్తికి 
సంతృప్తిని బొందిన్చావు  మా జగతికి 

ప్రబోదె  గ్రేట్ అంట మాలోని ప్రాణం అంతా
చిట్టేలుకై నీ చెంత శరనంటుందిరా
హే ఖ ఎందుకంట ఈ వచ్చి పోయే తంటా 
ఎన్నడూ నువ్వే మాతో కొలువుండరా

గం గం గం గం గం గం గణేశ 
గౌరీ తనయా సర్వేశ 
హే రంబ విగ్న వినాశ 
జన మానస నిత్య నివాస 
నీ ప్రేమ మాకు బరోస 

నమో నమామి వక్ర తుండ 
నువ్వే మా గుండె నిండా 
నువ్వే మా అండా దండా
నీ అభయం ఆకు పచ్చ జెండా 
తోలి పూజల పూల దండ
నీ మెళ్ళో వేసుకుంటాం గన నాథుడ

గణపతి బప్పా మోరియా
హే మంగళ మూర్తి మోరియా
హే గణపతి బప్పా మోరియా
హే మోరియా హే మోరియా

గణపతి బప్పా మోరియా
హే మంగళ మూర్తి మోరియా
హే గణపతి బప్పా మోరియా
హే మోరియా హే మోరియా




What's up baby పాట సాహిత్యం

 
చిత్రం: డిక్టేటర్ (2015)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నవీన్, మాళవిక

What's up baby



చుర చుర పాట సాహిత్యం

 
చిత్రం: డిక్టేటర్ (2015)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సంజన, శ్రీకృష్ణ

చుర చుర





టింగో టింగో పాట సాహిత్యం

 
చిత్రం: డిక్టేటర్ (2015)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: కౌసల్యా, గీతా మాధురి, సింహా

టింగో టింగో



డిక్టేటర్ పాట సాహిత్యం

 
చిత్రం: డిక్టేటర్ (2015)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సత్యన్, సోలార్ సాయి, శరణ్, నవీన్, శ్రీకృష్ణ

డిక్టేటర్



గణ గణ పాట సాహిత్యం

 
చిత్రం: డిక్టేటర్ (2015)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం:  సమీరా భరద్వాజ్, దీపక్, సింహా

గణ గణ


Palli Balakrishna Wednesday, August 16, 2017

Most Recent

Default