Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bimbisara (2022)




చిత్రం: భింబిసార (2022)
సంగీతం: చిరంతన్ భట్ 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: యం.యం.కీరవాణి
నటినటులు: కళ్యాణ్ రామ్, కేథరిన్ త్రేస, సంయుక్త మీనన్
దర్శకత్వం: మల్లిడి వశిస్ట (మల్లిడి. వెంకట్)
నిర్మాత: హరికృష్ణ కె.
నిర్మాణసంస్థ యన్.టి.ఆర్.ఆర్ట్స్ 
విడుదల తేది: 05.08.2022

(ఈ సినిమా డైరెక్టర్ మల్లిడి వశిస్ట అసలు పేరు వెంకట్, తండ్రి పేరు మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి ఈయన నిర్మాతగా బన్ని (2005), మరియు భగీరధ (2005)  సినిమాలు తీశారు. మల్లిడి.వెంకట్ హీరోగా అంజలి హీరోయిన్ గా ప్రేమలేఖ రాశా (2007) అనే సినిమా తీశారు)




Songs List:



ఈశ్వరుడే పాట సాహిత్యం

 
చిత్రం: భింబిసార (2022)
సంగీతం: చిరంతన్ భట్ 
సాహిత్యం: శ్రీమణి 
గానం: కాల భైరవ 

భువిపై ఎవడు కనివిని ఎరుగని
అద్భుతమే జరిగెనే
భువిపై ఎవడు కనివిని ఎరుగని
అద్భుతమే జరిగెనే
దివిలో సైతం కథగా రాని
విధిలీలే వెలిగెనే

నీకు నువ్వే దేవుడన్న
భావనంత గతమున కథే
నిన్ను మించే రక్కసులుండే
నిన్ను ముంచే లోకం ఇదే

ఏ కాలమో విసిరిందిలే
నీ పొగరు తలకు తగిన వలయమే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యమిదే సాక్ష్యమిదే
బిక్షువయ్యే బింబిసారుడే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యమిదే సాక్ష్యమిదే
బిక్షువయ్యే బింబిసారుడే

రాజభోగపు లాలస బ్రతుకే
మట్టి వాసన రుచి చూసినదే, ఆ ఆ
రాజభోగపు లాలస బ్రతుకే
మట్టి వాసన రుచి చూసినదే

రక్త దాహం మరిగిన మనసే
గుక్క నీళ్లకు పడి వేచినదే
ఏది ధర్మం ఏదీ న్యాయం
తేల్చువాడొకడున్నాడులే
లెక్క తీసి శిక్ష రాసే
కర్మఫలమే ఒకటుందిలే
ఏ జన్మలో, ఓ ఓ ఓ ఓ
ఏ జన్మలో నీ పాపమో
ఆ జన్మలోనె పాప ఫలితమే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యమిదే సాక్ష్యమిదే
బిక్షువయ్యే బింబిసారుడే

నరకమిచ్చిన నరకుడి వధతో
దీప పండుగ మొదలయ్యినదే
నరకమిచ్చిన నరకుడి వధతో
దీప పండుగ మొదలయ్యినదే

నీతి మరచిన రావణ కథతో
కొత్త చరితే చిగురించినదే
రాక్షసుడివో రక్షకుడివో
అంతుతేలని ప్రశ్నవి నువ్వే

వెలుగు పంచే కిరణమల్లె
ఎదుగుతావో తెలియని కలే
ఏ క్షణం… ఓ ఓ ఓ ఓ
ఏ క్షణం ఏ వైపుగా
అడుగేయనుందో నీ ప్రయాణమే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యమిదే సాక్ష్యమిదే
బిక్షువయ్యే బింబిసారుడే

ఈశ్వరుడే ఈశ్వరుడే
చేసినాడు కొత్త గారడే
సాక్ష్యమిదే సాక్ష్యమిదే
బిక్షువయ్యే బింబిసారుడే




ఓ తేనె పలుకుల అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: భింబిసార (2022)
సంగీతం: చిరంతన్ భట్ 
సాహిత్యం: వరికుప్పల యాదగిరి 
గానం: హైమత్ మహమ్మద్, సత్య యామిని 

ఓ తేనె పలుకుల అమ్మాయి
నీ తీగ నడుములో సన్నాయి లాగిందే
ఓ కోర మీసపు అబ్బాయి
నీ ఓర చూపుల లల్లాయి
బాగుందోయ్, ఓ ఓ

నీ చెంపల నులుపు, బుగ్గల ఎరుపు… 
ఊరిస్తున్నాయ్
నీ మాటల విరుపు ఆటాల ఒడుపు 
గుండెపట్టుకొని ఆడిస్తున్నాయ్

నీ వెంట వెల్లమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్

ముద్దు ముద్దు నీ మాట చప్పుడు
నిద్దరొద్దు అంటుందే
పొద్దు మాపులు ముందు ఎప్పుడు
నిన్ను తెచ్చి చూపిస్తుందే

పూలతోటలో గాలి పాటలో
దాని అల్లరి నీదే
చీరకట్టులో ఎర్రబొట్టులో
బెల్లమెప్పుడు నీదే

నీ నవ్వుల తెలుపు మువ్వల కులుకు
ముందుకెళ్ళమని నెట్టేస్తున్నాయ్
నీ వెంట వెల్లమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్

గోడచాటు నీ దొంగ చూపులు
మంట పెట్టి పోతున్నాయ్
పట్టు పరుపులు మల్లె పాన్పులు
నచ్చకుండా చేస్తున్నాయ్

మూతి విరుపులు తీపి తిప్పలు
రెచ్చగొట్టి చూస్తున్నాయ్
సోకు కత్తులు హాయి నొప్పులు
నొక్కి నొక్కి నవ్వుతున్నాయ్

నీ తిప్పల తలుపులు మోహపు తలుపులు
తియ్య తియ్యమని బాధేస్తున్నాయ్

నీ వెంట వెల్లమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్

ఓ తేనె పలుకుల అమ్మాయి
నీ తీగ నడుములో సన్నాయి లాగిందే




నీతో ఉంటే చాలు పాట సాహిత్యం

 
చిత్రం: భింబిసార (2022)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: యం.యం.కీరవాణి
గానం: మోహన భోగరాజ్, శాండిల్య పీసపాటి

గుండె దాటి గొంతే దాటి పలికిందేదో వైనం
మోడువారిన మనసులోనే పలికిందేదో ప్రాణం

ఆ, కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం
కాలంతో పరిహాసం చేసిన స్నేహం

పొద్దులు దాటి హద్దులు దాటి
జగములు దాటి యుగములు దాటి
దాటి.. దాటి.. దాటి.. దాటి..

చెయ్యందించమంది ఒక పాశం ఋణ పాశం విధి విలాసం
చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధివిలాసం

అడగాలే కానీ ఏదైనా ఇచ్ఛే అన్నయ్యనౌతా
పిలవాలే కానీ పలికేటి తోడు నీడయ్యిపోతా
నీతో ఉంటే చాలు సరితూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు లేదే దిగులు తడిసె కనులు 
ఇది వరకెరుగని ప్రేమలో గారంలో 

చెయ్యందించమంది ఒక పాశం ఋణ పాశం విధి విలాసం
ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం రుణబంధం

నోరారా వెలిగే నవ్వుల్ని నేను కళ్ళారా చూసా
రెప్పల్లో ఒదిగే కంటిపాపల్లో నన్ను నేను కలిసా
నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం ఓ హరివిల్లు
రాత్రి పగలు లేదే గుబులు మురిసే ఎదలు 
ఇదివరకెరుగని ప్రేమలో గారంలో 

ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం రుణపాశం విధివిలాసం
చెయ్యందించమంది ఒక బంధం ఋణబంధం

ఆటాల్లోనే పాటల్లోనే వెలిసిందేదో స్వర్గం
రాజే నేడు బంటై పోయిన రాజ్యం నీకే సొంతం



విజయహో పాట సాహిత్యం

 
చిత్రం: భింబిసార (2022)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం:  హేమచంద్ర, అరుణ్ కౌండిన్య, రఘురామ్, లోకేష్ , హారిక నారాయణ్ , నయనా నయ్యర్, పూర్ణిమ, శ్రీసౌమ్య, గౌతమి 

ఆ ఆఆ ఆ ఆ, ఓ ఓ ఓ ఆ ఆ ఆఆ
హోహో హో, హో హో
రుధిరహో ఉద్యత్… కౌక్షేయ భీకరా
సమర ప్రకర ధీరా శూరా
విజయహో స్వైరా
విలయ జ్వలన భాస్వరా
హృదయ దళన ప్రళయ ప్రసర బింబిసార

విలయహో, త్రాతా… త్రీగర్తలేశ్వరా
విజిత రుధిర పారావారా
విజయహో, జేతా… కదన రణిత కంధరా
ప్రబల కఠిన అచల శిఖర, బింబిసార

భయద వదన… జ్వలిత నయన
కణకణాగ్ని శీకరా..!
సతత సమరాగ్ర చలిత
ప్రళయ జలధరా..!

ఉదగ్ర చరిత… వ్యగ్ర భరిత
చండ కిరణ బంధురా…!
నరవరా, భయకరా, బింబిసార..!

విజయహో, జ్వాలా… జాజ్వల్య భాసురా
అహిత రుధిర ధారా… ఘోరా..!
విజయహో, వీరా… ప్రకట మకుట శేఖరా
ప్రబల కఠిన అచల శిఖర బింబిసార, బింబిసార

భగ భగ భగ… భుగ భుగ భుగ
జ్వలిత వదన భయకరా
కణ కణ కణ… ఘన రణ చణ
తరుణ కిరణ దినకరా
సకల వికట కుటిల నిధన
సంచిత బల జలధరా
ప్రభువరా, శరధరా… బింబిసారా

ఛట ఛట ఛట… ఛట ఛట ఛట
చటుల ఛటల శిఖధరా
శత శత శత… హత హత హత
విగత విజిత గణభరా
ప్రళయ ఘటిత… విలయ నటిత
సంకుల రణ జయకరా
నరవరా,  అసిధరా… బింబిసారా




బింబిసారా RAP Song పాట సాహిత్యం

 
చిత్రం: భింబిసార (2022)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: లిప్సిక 
గానం: లిప్సిక

ద మైటీ ద ఫియర్లెస్
ద పవర్ఫుల్ బెహాల్డ్ ద ఎంపరర్
బింబిసారా ఆ ఆ

హి ఈజ్ రైసింగ్ ఫ్రమ్ ద యాషెస్
హి ఈజ్ ద బీస్ట్
వాచింగ్ హిమ్ ఈజ్
మోర్దాన్ ఎ ఫీస్ట్



గులెబకావలి పాట సాహిత్యం

 
చిత్రం: భింబిసార (2022)
సంగీతం: చిరంతన్ భట్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: చిమ్మాయి 

రాజ రాజ రణకేసరీ
రసడోలికా విహారి హేయ్
సమరమైన సరసమైనా
మీకు మీరే సరీ
హహహ హాయ్ హాయ్

గులేబకావళి పువ్వులాంటి యవ్వనం
గుమ్మంది చూడరా సుందరాంగుడా
కన్నె దీపావళి సోయగాల ప్రాంగణం
రమ్మంది చేరరా గ్రంధసాంగుడా

నువ్వంటే మోజురా ఉందే అందం
చెయ్యేసి తాకరా తనివార
రంగేళి విందురా రజనీగంధం
పోటెత్తి తాకరా పొలిమేరా

ఉల్లాస మేఘాల ఉయ్యాలలూగించు
సల్లాప రాగాల సయ్యాటలాడించు
మేలే కదా నన్ను లాలించ రారా

బింబిసారా బింబిసార
హే ధిమిర ధిమిర దిం
దింతార దిం దింతార ధీరా
నెమలి నెమలి ఈ నెమలి కన్ను
నిను కలగన్నది రారా 

ధిమిర ధిమిర దిం
దింతార దిం దింతార ధీరా
నెమలి నెమలి ఈ నెమలి కన్ను
నిను కలగన్నది రారా 

రేగిపోనీ మోహావేశం
వెలిగిపోనీ మన్మధహాసం
కోరుకోరా కోమలి సహవాసం
అంటనీరా మగసరి మీసం
పండనీరా చనువుగ సరసం
అందుకో ఈ చక్కని అవకాశం

చుట్టుపక్కలెక్కడైనా నీకులాంటి
అందగాడు లేనే లేడు సుకుమారా
నిన్ను మించే వన్నెకాడు
నిన్న లేడు రేపు లేడు
ఉన్న మాటే ఒప్పుకోరా

జాబిల్లి పొద్దంతా జాగారమయ్యేలా
సిరిమల్లి సిగ్గంత సింగారమయ్యేలా
బంగారు కౌగిళ్ళ బంధించ రారా

బింబిసారా బింబిసార
హే ధిమిర ధిమిర దిం
దింతార దిం దింతార ధీరా
నెమలి నెమలి ఈ నెమలి కన్ను
నిను కలగన్నది రారా

ధిమిర ధిమిర దిం
దింతార దిం దింతార ధీరా
నెమలి నెమలి ఈ నెమలి కన్ను
నిను కలగన్నది రారా

గులేబకావళి పువ్వులాంటి యవ్వనం
గుమ్మంది చూడరా సుందరాంగుడా
హే, కన్నె దీపావళి సోయగాల ప్రాంగణం
రమ్మంది చేరరా గ్రంధసాంగుడా


No comments

Most Recent

Default