చిత్రం: స్వప్న సుందరి (1950) సంగీతం: సి. ఆర్. సుబ్బరామన్ నటీనటులు: అక్కినేని నాగేశ్వర రావు, అంజలీదేవి, జి. వరలక్ష్మి నిర్మాత, దర్శకత్వం: గంటసాల బలరామయ్య విడుదల తేది: 10.11.1950
Songs List:
-->
చిత్రం: స్వప్న సుందరి (1950) సంగీతం: సి. ఆర్. సుబ్బరామన్ నటీనటులు: అక్కినేని నాగేశ్వర రావు, అంజలీదేవి, జి. వరలక్ష్మి నిర్మాత, దర్శకత్వం: గంటసాల బలరామయ్య విడుదల తేది: 10.11.1950
Songs List:
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, డా॥ సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, సాహితి గానం: యస్.పి.బాలు, ఆనంద్, పి.సుశీల , యస్. పి. శైలజ, కె. చక్రవర్తి నటీనటులు: రజినీకాంత్, కృష్ణ, చంద్రమోహన్, శ్రీదేవి, సునీత, ఫటా ఫట్ జయలక్ష్మి, అంజలీ దేవి, హలం దర్శకత్వం: విజయనిర్మల నిర్మాత: ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు విడుదల తేది: 31.05.1980
Songs List:
అమ్మంటే అమ్మ పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: కె. చక్రవర్తి అమ్మంటే అమ్మ ఈ అనంత సృష్టికామె అసలు బ్రహ్మ రక్తాన్ని అర్పించి ప్రాణాన్ని పూరించి చేస్తుంది నీ బొమ్మ మరణాన్ని ఎదిరించి మరోసారి జన్మించి ఇస్తుంది - నీకు జన్మ ధనం పోసి కొనలేము రుణం తీర్చుకోలేము అందుకే అమ్మా విధి ఆడే ఆటలో విడిపోయే బ్రతుకుల్లో మిగిలేదే మమకారం మిగులుండే మమతల్ని తెగిపోనీ బంధాన్ని కలిపేదే తల్లి రక్తం తనకు కన్ను నీవై తే నీకు రెప్ప తానౌతుంది అందుకే అమ్మా
చిలకుందీ చిలక పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు సాకి మన సైన సొగసుపైన మధువే కురిపించనా మధువే కురిపించనా - వలచే నెలవంక వంక గులాబీ విసిరేయనా పల్లవి : చిలకుందీ చిలక ముసుగున్న చిలక ఆ చిలకమ్మ ముసుగును తొలిగించకుంటే నేను రహీమును కానేకాను చరణం : 1 ఏ వైపు చూసినా నేను ఎన్నో చూపులు నా వైపు మాట వినని నా చూపు దూకుతోంది మరోవైపు అఁ కలల్లో కదిలే యువరాణి కళలు విరజిమ్మే విరిబోణి నిన్ను తొలిసారి చూశాను ప్రేమ గీతాలు రాశాను ఇంక నిన్ను ఇంక నిన్ను మేలి ముసుగు మేలి ముసుగు వుంచలేను లోకానికి బయపడకే బాల లోగుట్టు తెలుసుకోవే బేల అరె ఒక్క సారైన నీ మోము చూపించు నీ సొగసు గుప్పించు - లేకుంటే నీ పేరు పదిమందిలో చెప్పి మన గాథ ముడి విప్పి వలపంటే ఏమో ఎరిగించకుంటే ఆఁ.... చిలకమ్మ ముసుగును తొలగించుకుంటే హె.హె., హె.. నీవు రాహీమువు కానేకావు కోరస్ చరణం : అల్లా దయవల్ల ఆ మోము కనిపించే సుబానల్లా ఈ వాలు కళ్ళలోన ఇంకా తొలిసిగ్గులేనా ఇటేమో గుండె గుబులాయె ఆటేమో సిగ్గు తెరలాయె విషాదం కమ్మిందొక కంట వినోదం చిమ్మిందొక కంట ఆ.... బాపురే ఏమి ప్రియురాళ్ళు జాలి కనరాని గుండ్రాళ్ళు మొదట వగలొలక పోస్తారు పిదప సెగలార పోస్తారు చెలీ వున్న మాటంటే నువ్వులికి పడతావు చురుకెత్తి నీ మోము తెరలోన దాసావు నీ వయసు నిప్పైతె నా వలపు జల్లై అలకల మంటలు చల్లార్చకుంటే నీవు రహీమువు కానేకావు
ఒక్కసారి ముద్దు పెట్టు పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఒక్కసారి ముద్దు పెట్టు వుండలేను చేయి పట్టుకో మెత్తగా మెల్లిగా - మేనిలో జిల్ జిల్లుగా ఒక్కసారి ముద్దు పెట్టుకో - వుండలేను చేయి పట్టుకో కొత్త, కొంటెగా, గుండెలో ఝల్ ఝల్లుగా చరణం : 1 ఎంతలో ఎంతగా ఎదిగినావే అమ్మడూ, మొగ్గవో పుష్వవో చెప్పుమరి ఇప్పుడు చెప్పు వేమరిప్పుడు నువు చూస్తే సిగ్గువేస్తే, పువ్వునై నా మొగ్గనే నీ ముందుంటే ముద్దంటే మొగ్గనైనా పువ్వునే.... ||ఒక్కసారి|| చరణం : 2 అంతగా చూడకు- వింతగా వున్నది మెరుపులా కొంక వురకలేస్తూ వున్నది వురక వేస్తే పరవశిస్తే ఒదిగిపోనా సందిట గాలికై నా చోటులేదు కరిగే మన కౌగిట ॥ఒక్కసారి॥
మైనేమ్ ఈజ్ రాబర్ట్ పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర గానం: మాధవపెద్ది రమేష్. పల్లవి : మైనేమ్ ఈజ్ రాబర్ట్ గంజాల్విజ్ ఐ కమ్ ఫ్రమ్ లౌల్లీ పేరడైజ్ ఎవరైనా అమ్మాయి మా ఇంటికి రావాలంటే వలపుల పేట షోకుల వీధి డోరు నెం. 420 చార్ సౌబీన్ దట్స్ మై ఎడ్రస్ చరణం: 1 ముదొచ్చే అందాలు మురిపించే మోహాలు ఇద్దరిలో వున్నాయి ఈనాడే కలిశాయి నన్నే నన్నే చూడు కుదిరే ఈడూ నాతో కలిసి ఆడు నా గుండెల్లో బాజాలు మోగించు వన్నెలులు చూసి చూసి తిన్నగ వచ్చెయ్ డోర్ నెంబరు 420 చార్ సౌబీన్ ఎక్స్ క్యూజ్మీ ప్లీజ్ చరణం: 2 ప్రేమిస్తే వస్తాయి ఎన్నెన్నో కష్టాలు నిజమయిన ప్రేమయితే పండేను స్వప్నాలు వుందా వుందా వలపు మనసూ మనసూ కలుపూ మనదే మనదే గెలుపు నా కళ్ళలో కాపురమే వుంటావా నీది నాది ఒకటే ఇల్లు డోర్ నెంబరు 420 చార్ సౌబీస్ ఎక్స్ క్యూజ్ మీ ప్లీజ్
ఒక అమ్మాయి ఒక అబ్బాయి పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పలవి : ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మెలిసి కౌగిట బిగిసే బంధాలలో కురిసిందీ పదే పదే పడుచంధంలో తొలకరి చినుకుల చిటపటలాడే జడివాన! చరణం: 1 కనులు దాటే కబురు వింటే మనసు దాటే మనసు వింటే తలుచుకుంటే పులకరింతే కలుసుకుంటే కౌగిలింతే నీలో కొత్త మెరుపే మెరిసి నాలో ఉరుమై ఒకటై కలిసి పొమ్మంటే ఎదా ఏదా ఉండి ఉండి ఝుమ్మంటుంటే ఆ చలి చలి పిడుగుల సరిగమలేవో వింటుంటే చరణం: 2 వలపు వీణ పిలవసాగే వయసు వయసు కలవసాగే నిదర రాక రేయి పగలై నీవు రాక తీపి సెగలై ఏదో కొత్త బంధం కలిసి నువ్వూ నేనూ మనమై ఏక మవుతుంటే హాఁ అదే అదే అందమైన గొడవౌవుతుంటే ఈ మురిసిన పెదవుల ముసి ముసి నవ్వులు చూస్తుంటే చరణం: 3 నవ్వు చాలు నాకు రశీదు మనసు చాలు మక్కా మసీదు చాలు చాలు నీ నమాజు సరసమాడే సందె మోజు ఇలవంక దిగి వచ్చే నెలవంక నీవింక రావాలి నా వంక కని విని ఎరుగని కమ్మని కథ వింటుంటే నీ అల్లరి వలపుల ఆవిరి సెగలకు సెలవింక
సాయిబాబా ఓ సాయిబాబా పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు పల్లవి : సాయిబాబా ఓ సాయిబాబా షిర్డీ సాయిబాబా ఈ ఇలలో మరో పేర వెలసిన దేవా అను పల్లవి: కన్నీళ్ళు దాచీ కడకొంగు సాచీ వచ్చాము దేవాః కరుణించ రావా || సాయిబాబా || చరణం: 1 మొక్కెదమో సాయి దేవా ముక్తికి నీవే త్రోవ పిన్నలనూ లాలించేవు పెద్దలను పాలించావు అందరి మొర విని ఆండగ నిలిచీ అభయము నొసగీ నడిపించేవు భక్తుల రిక్తుల దీనుల హీనులు బాధలు తొలగించేవు "బాబా" అని నోరారగ పిలిచిన బాబూ అని పలికేవు సాయిదేవాః కావ రావా ఏ మతమైనా ఏ కులమైనా కాపాడు బాబా మా పాలిదేవా చరణం: 2 ప్రతి బాటా షిర్డీ వైపే ప్రతిచోటా నీ రూపే ఊరూరా నీ మందిరమే ఇంటింటా నీ వందనమే ఆర్తుల చేసే ప్రార్థనలన్నీ అన్ని వేళలా ఆలించేవు చెదరిన బ్రతుకులు చివరికి కలిపే చిన్మయమూర్తివి నీవే ఆరిన దివ్వెల చీకటి గుండెల ఆశాజ్యోతివి నీవే ! సాయిదేవా ! కావరావా ! ఓ దేవా శరణం నీ దివ్య చరణం ఎంతెంత మధురం నీ నామ స్మరణం కోరస్ : సాయిబాబా - ఓ సాయిబాబా షిర్డీ సాయిబాబా - సాయిబాబా
లక లక లక లక చెంచుక పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: సాహితి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: లక లక లక లక చెంచుక తక తక తక తక దంచుక ఊరు చేరింది ఊర పిచ్చుక మహాజోరు చేసింది కన్నెపిచ్చుక లక లక లక లక చెంచుక తక తక తక తక దంచుక పంట చూసింది కొంటె గోరింక నా జంటకొచ్చింది పె డి గోరింక చరణం : 1 ఎగిరి .... ఏటికెగిరి మునిగి .... నీట మునిగి ఒళ్ళంత కసూరె....వయసంత ముస్తాబే పెందలాడే సందెకాడే అంబరాల ఎగిరొచ్చావా ఈ సంబరానికే దిగి వచ్చావా చూసి.... దారి కాచి వేసి .... కన్ను వేసి నూనూగు మీసంతో.... నీటైన వేషంతో సరదాగ దొరలాగ పండగపూట చూసుకున్నావా నీ పట్టపు రాణిని చేరుకున్నావా చరణం : 2 ఎగిరి .... తోటకెగిరి వెదికి.... చోటు వెదికి బూరుగ చెట్టె... నేరుగ వచ్చేసి రాజుగారి రాక కోసం బొంతలెన్నో నేసుంచాను పాల పుంతలన్నీ పక్కేశాను చూసి.... నిన్ను చూసి చేరి .... చెంతచేరి పరువాల మరువాలు .... అందాల దవనాలు గూటిలోన గుట్టుగాను దాచినావని తెలుసుకున్నాను. అని దక్కించుకోవాలని కలుసుకున్నాను
ముగ్గురు కలిసి ఒకటై నిలిచీ పాట సాహిత్యం
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, ఆనంద్, రమేష్ పల్లవి : ముగ్గురు కలిసి ఒకటై నిలిచీ ముందుకు దూకారంటే ఆ శక్తులు మూడూ ఎవరని అంటే రాం రాబర్ట్ రహీంలు చరణం: 1 మా రూపం వేరైనా మా రక్తం ఒక పేరా పెళ్ళి గడియ ముంచుకొచ్చింది ఇక పిల్లను రప్పించాలిరా : తుళ్ళిపడకురా పెళ్ళికొడకా తాళం మేళం బాగా కుదిరింది.. ఇక తూతూ మంత్రం చదివించాలిరా పెట్టిన లగ్నం - పట్టిన భరతం గుర్తుగ మిగలాలంటే - ఈ శక్తులు మూడు కలిశాయంటే రాం - రాబర్ట్ - రహీం చరణం : 2 నేనంటే నేనేలే మేమంటే మేమేలే ఇంత మంచి తరుణంలో దిగు లెందుకె పైడిబొమ్మా - గుర్తించవె ననుగున్మమ్మా ఒలికిన నీ నవ్వులే - ఏ వెలలేని రతనాలమ్మా తీరని కలలూ ఈ రోజే తియ తీయగ పండాలంటే ఈ శక్తులు మూడూ కలిశాయంటే రాం రాబర్ట్ - రహీం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కొసరాజు, డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల, బి. వసంత, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు నటీనటులు: రామారావు, అంజలీ దేవి, కాంచన దర్శకత్వం: వి. మధుసూదనరావు నిర్మాత: డి.వెంకటపతిరెడ్డి విడుదల తేది: 14.10.1966
Songs List:
చక్కని చల్లని యిల్లు పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి. సుశీల చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు మమతల కలలకు పందిళ్ళు చక్కని చల్లని యిల్లు, చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు మమతల కలలకు పందిళ్ళు చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు చరణం:1 అమ్మా, నాన్నా కట్టినవి అమ్మా, నాన్నా కట్టినవి అల్లరి పిల్లలు పుట్టినవీ.. అహహహ అల్లరి పిల్లలు పుట్టినవి ముద్దుల ముద్దలు పెట్టినవి ముల్లోకాలకు స్వర్గమిదీ..ఈ.. అహహహా.. అహహహా...అహహహా చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు చరణం: 2 మనసు పెరిగితే ఒకటౌతాము వయసు పెరిగితే వేరౌతాము మనసు పెరిగితే ఒకటౌతాము వయసు పెరిగితే వేరౌతాము పెరిగే మీరు తరిగే మేము ప్రేమనిక్కడే చవి చూద్దాము అహహహా.. అహహహా...అహహహా చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు మల్లెల మనసులు విరజల్లు మమతల కలలకు పందిళ్ళు చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు అహహహా.. అహహహా...అహహహా
నీలమోహనా.. రారా పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: దేవులపల్లి గానం: పి. సుశీల పల్లవి: నీలమోహనా.. రారా నిన్ను పిలిచె నెమలి నెరజాణ నీలమోహనా.. రారా నిన్ను పిలిచె నెమలి నెరజాణ నీలమోహనా.. రారా జారువలపు జడివాన కురిసెరా.. జాజిలత మేను తడిసెరా జారువలపు జడివాన కురిసెరా.. జాజిలత మేను తడిసెరా లతలాగే నా మనసు తడిసెరా.. నీలమోహనా.. రారా రారా..రారా.. చరణం: 1 ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి? ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి? అతడేనేమో అనుకున్నానే.. అంత దవుల శ్రావణ మేఘములగనీ అతడేనేమో అనుకున్నానే.. అంత దవుల శ్రావణ మేఘములగనీ ప్రతిమబ్బు ప్రభువైతే... ప్రతికొమ్మ మురళైతే ఏలాగె ఆ... ఏలాగె మతిమాలి.... ఏడే నీ వనమాలి? హ హా హా.. హా హా.. నీలమోహనా.. రారా.. నిన్ను పిలిచె నెమలి నెరజాణ నీలమోహనా.. రారా.. రా రా రా... చరణం: 2 ఆ... సారెకు దాగెదవేమి? నీ రూపము దాచి దాచి ఊరించుటకా స్వామీ? సారెకు దాగెదవేమి..? నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా కృషా కృష్ణా కృష్ణా... సారెకు దాగెదవేమి..? చరణం: 3 అటు... అటు... ఇటు... ఇటు... ఆ పొగడకొమ్మవైపు ఈ మొగలి గుబురువైపు కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా... నీలిమేఘమాకాశము విడిచి... నేల నడుస్తుందా ? కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా... నీలిమేఘమాకాశము విడిచి... నేల నడుస్తుందా ? నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా? నవ్వే పెదవులకూ మువ్వల మురళుందా? పెదవి నందితే పేద వెదుళ్ళు కదిలి పాడుతాయా? నడిచే మబ్బులకు నవ్వే పెదవులు నవ్వే పెదవులకు మువ్వల వేణువులు మువ్వల వేణువులు... మువ్వల వేణువులు
పెరుగుతుంది హృదయం పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల పెరుగుతుంది హృదయం
మదిలోని నా స్వామి పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు అతనిని కనినంత అందెలు పలికే అతనిని కనినంత అందెలు పలికే అందెలు రవళించ డెందము పలికే నాలో శతకోటి భావాలు పలికే మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు మనసెరిగిన వాడు మమతల నెలరేడు వలపుల దీపాలని నిలిపిన చెలికాడు మనసెరిగిన వాడు మమతల నెలరేడు వలపుల దీపాలు నిలిపిన చెలికాడు ఇన్నాళ్లకు తానే నన్నేలినాడు మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు అతడే నాపాలి అభినవ వనమాలి ఆతని నయనాలు అందిన నయనాలు అతడే నాపాలి అభినవ వనమాలి ఆతని నయనాలు అందిన గగనాలు ఆతని పాదాలు నా పారిజాతాలు మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను పలికించినాడు.
నీలాల కన్నులతో పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని చూసేవెందుకని
ముసుగు తీయవోయి పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.బి.శ్రీనివాస్ ముసుగు తీయవోయి
తళుకు బెళుకు చీరదాన పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: పిఠాపురం, స్వర్ణలత తళుకు బెళుకు చీరదాన
చక్కని చల్లని యిల్లు (Female Version) పాట సాహిత్యం
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి. సుశీల చక్కని చల్లని యిల్లు చక్కెర బొమ్మలు పాపలు
చిత్రం: ఇంటింటి కథ (1974) సంగీతం: రమేష్ నాయుడు నటీనటులు: కృష్ణ, చంద్రకళ, అంజలీదేవి మాటలు: రంగనాయకమ్మ దర్శకత్వం: కె. సత్యం నిర్మాత: కాకర్ల కృష్ణ విడుదల తేది: 20.09.1974
Songs List:
కావాలని వచ్చావా పాట సాహిత్యం
చిత్రం: ఇంటింటి కథ (1974) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి. బాలు, పి. సుశీల కావాలని వచ్చావా చెయ్యాలని చేశావా ఈ అల్లరి పనులు ఈ చిల్లర పనులు
ఇంటింటి కథ ఒక బొమ్మలాట పాట సాహిత్యం
చిత్రం: ఇంటింటి కథ (1974) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి. బాలు ఇంటింటి కథ ఒక బొమ్మలాట
ఉరిమిరిమి చూస్తూ పాట సాహిత్యం
చిత్రం: ఇంటింటి కథ (1974) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి. బాలు, ఎస్ జానకి ఉరిమిరిమి చూస్తూ
ఏమిటో అనుకుంటి గోంగూరకి పాట సాహిత్యం
చిత్రం: ఇంటింటి కథ (1974) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: కొసరాజు గానం: ఎల్.ఆర్. ఈశ్వరి ఏమిటో అనుకుంటి గోంగూరకి
రమణి ముద్దుల పాట సాహిత్యం
చిత్రం: ఇంటింటి కథ (1974) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: కొసరాజు గానం: పి బి శ్రీనివాస్,ఎల్.ఆర్. అంజలి రమణి ముద్దుల
ఎంత వెర్రి తల్లివో పాట సాహిత్యం
చిత్రం: ఇంటింటి కథ (1974) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి గానం: పి. సుశీల ఎంత వెర్రి తల్లివో
చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు నటీనటులు: జగ్గయ్య, కృష్ణ , జమున, విజయ లలిత, అంజలీ దేవి దర్శకత్వం: పి. సాంబశివ రావు నిర్మాత: అమరారామ సుబ్బారావు విడుదల తేది: 22.06.1973
Songs List:
పిల్లా పాపల చల్లని గూడు పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరధి గానం: ఘంటసాల పిల్లా పాపల చల్లనిగూడు చెల్లా చెదురై పోయెను నేడు ఒకరిది నేరం - ఒకరికిభారం జీవిత నావకు లేదా తీరం ఏమైపోవునొ ఈ సంసారం చరణం: 1 మంచిని మెచ్చే మనిషే లేడు మచ్చను చూపును ప్రతివాడు ఇన్ని తరాల యింటి గౌరవం ఒక్క నిందతో మంటగలిసెరా చరణం: 2 కన్నీళ్ళైనా కషాలెనా అన్నిభరించే అమ్మవు నీవు పిల్లలకోసం జీవించాలి నిండుకుటుంబం నిలపాలి చరణం: 3 పసిహృదయానికి తగిలెను గాయం యెవ్వరులేరు నీకుసహాయం వయసుకుమించిన పంతంతో పయనించే ఓ పసివాడా విజయం నీదే నీదేరా !
నవ నవ లాడే నవతరం పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరధి గానం: పి. సుశీల, రమోల, వి.రామకృష్ణ యువతరం నవతరం నవనవలా దే - నవతరం ఉరకలువేసే - యువతరం మనలా అవడం - యెవరితరం యువతరం నవతరం చరణం: 1 ముందు ముందుకు సాగిపోయే యువకులం మేము స్వేచ్ఛకోసం పోరుసలిపే యువతులం మేము యెవ రేమం టె నేమి - యేపేరు పెడితేనేమి మనమూ మనమూ యేకమైతే మార్పుసాధిస్తాం చరణం: 2 ఆటలందూ దోరవయసు తొంగిచూడాలి పాటలందూ కొంటె మనసు పొంగిపోవాలి చేయీ చేయీ కలిపి సరదాల తేలి తేలి పాతకాలం రోతలన్నీ - మరిపించెయ్యాలి చరణం: 3 యవ్వనమే అందరికీ వఠములాంటిది నవ్వులతో గడపడమే మనకు మంచిది వడివడిగా నీటిలోనే బోటు షికారు లోతు లోతు కెళుతుంటే భలే హుషారు ఛల్ ఛల్ ఛల్ ఛల్ బోటు షికారు జిల్ జిల్ జిల్ జిల్ భలే హుషారు జంటలుగా వలపుమజా రుచిచూడాలి
తళతళ తళతళ మెరుపే మెరిసింది పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల, యస్.పి.బాలు తళ తళ తళ తళ మెరుపే మెరిసిందీ జల జల జల జల జ లేకురిసింది ఏంచేయాలీ - అబ్బా! ఏంచేయాలీ మిల మిల మిల కళే మెరిసినవీ గుబ గుబ గుబ గుబ గుబులేరేగినది ఏంచేయాలి - అబ్బా ! ఏంచేయాలి చరణం: 1 ఏదో చెయ్మని వయసంటే ఏల తొందరని మనసంటుంది మనసుకు వయసుకు మధ్యనచిక్కి సొగసే ఉసూరు మంటుంది చరణం: 2 వెచ్చని జతగా నువ్వున్నావని చలి నన్నెంతో మెలివేస్తుంది దుడుకుగ దూకే తోడున్నావని వలపే వరదై వంచేస్తుంది చరణం: 3 ఎత్తూ పల్లా లేకంచేసే చీకటి ఎంతో బాగుంటుంది చేయీ చేయిగ యిద్దరముంటే చీకిటి వెచ్చని వెలుగౌతుంది
అవలీలగా శ్రీరాముడు శివధనువును (పద్యం) పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరధి గానం: పి. సుశీల అవలీలగ శ్రీరాముడు శివధనువును విరిచినంత చిత్తము పొంగన్ నవ సుమ మాలను చేకొని అవనీ సుత వచ్చి నిలిచె అతని ఎదుటన్ అందమునకె అందమైన సీతమ్మను ప్రేమమీద చూచె రామమూర్తి వీరవరుల కెల్ల వీరుడా రాముని సంతసమున కాంచే జనక జాత కొంత పులకరింత కొంత చక్కలిగింత అతని చూచినంత అదొక వింత పూలమాలతోడ - బాలనిండు మనమ్ము స్వామి కంఠసీమ వ్రాలిపోయె
ఎవరు కారణము పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల, కె.హరిరావు ఎవరు కారణము ఈ లోకమిలా - అల్లకల్లోల మగుటకు ఎవరు కారణము ప్రతి మనిషీ బాధలు పడుతున్నాడు ప్రతి దానికి దేవుని తిడుతున్నాడు దేవుడు పాపం అలోచించాడు మనిషికి పాఠం నేర్పాలనుకున్నాడు సృష్టించాడొక స్త్రీ మూ ర్తిని చేశాడు రెండుగా దానిని తెల్లనిదే మంచిన్నాడు- నల్లనిదే చెడుగన్నాడు అల్లదిగో మానవలోకం-అక్కడికే పొమ్మన్నాడు మంచిని నేను మీ మంచికోరి వచ్చాను...మంచిని నేను మీ హృదయాల్లో చోటిస్తే వుంటాను ఉండి-మిమ్మల్ని మనుషులుగా చేస్తాను రావమ్మా | రావమ్మా ! మా మంచి ఏమి తెచ్చావు మాకు దీనినించి చీకటి పోగొడతాను మీలో చీలికలన్నీ మాన్పుతాను అందరి నొకటిగ చేస్తాను. ఆనందం-అందం-అందిస్తాను సమతా-మమతా పండిస్తాను శాంతి- సౌఖ్యం-పంచేస్తాను ఆకలి శోకం లేనిరాజ్యం రామరాజ్యం మీలోకంలో స్థాపిస్తాను. నేను నేనే నేను నేననే అహం నేనే నాది నాదనే స్వార్ధం నేనే బలే బలే నువ్వేకావాలి పక్కవాడిని తొ క్కెయ్యాలి గొంతు పిసికి పారెయ్యాలి! గొయ్యి తవ్వి పూడ్చెయ్యాలి! అన్నీ చేసాను-మీ ఆశలు తీరుస్తాను ధర్మాన్ని ఉరి కెక్కిసాను అధర్మాని కే పట్టం కడతాను రాజకీయ రాక్షసి నా రూపం రాపిడి దోపిడి నా రాజ్యం ఫిరంగి నాకు మృదంగము ప్రేతభూమి నా నాట్యరంగము మీరే, మీరే | ఎవరికివారే కారణము ఈ మంచి వున్నది మీలో నే ఈ చెడ వున్నదీ మీలోనే మంచిని మీలో పెంచుకోవాలి చెడునుదాంతో గెలుచుకోవాలి ఈ జగతి స్వర్గం చేసుకోవాలి
ఈవేళ పాడేటి పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: గోపి గానం: పి.సుశీల ఈవేళ పాడేటి పాటా నేడూ రేపూ వినిపించు నీ వున్నచోటా ఏ నాటికీ ముమ్మూలకీ చరణం: 1 మనసుంది. మన లేవు నీవూ తనువుంది కనరాను నేనూ చిరుగాలి నేనూ- తెరచాప నీవూ యేనాడు చేరేము రేవూ చరణం: 2 మన కేసిపోయేను హృదయం చేజారిపోనీకు సమయం మనవింత స్నేహం వెలిగించుదీపం తొలగించు నీపైన శాపం
చిత్రం: మా ఇంటి వెలుగు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: శ్రీ శ్రీ , దాశరథి, కొసరాజు, వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్. జానకి , యస్.పి. బాలు నటీనటులు: కృష్ణ , చంద్రకళ, వెన్నిరాడై నిర్మల, అంజలీ దేవి, హేమలత, సెక్సీ క్వీన్ హలం, కుమారి రోజా రమణి (అతిధి నటి) మాటలు: పినిశెట్టి దర్శకత్వం: విజయ్ నిర్మాత: పైడిమర్రి విడుదల తేది: 01.11.1972
Songs List:
అబ్బబ్బబ నా చెంప చెళ్ళుమన్నా పాట సాహిత్యం
చిత్రం: మా ఇంటి వెలుగు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరథి గానం: యస్.పి. బాలు అబ్బబ్బబ నా చెంప చెళ్ళుమన్నా వొళ్ళు ఝల్లుమన్నా
అరె బడాయికోరు అబ్బాయిగారు పాట సాహిత్యం
చిత్రం: మా ఇంటి వెలుగు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: కొసరాజు గానం: పి. సుశీల అరె బడాయికోరు అబ్బాయిగారు బయలుదేరినాడే
ఏరా సిన్నోడా సిగ్గెందుకు పాట సాహిత్యం
చిత్రం: మా ఇంటి వెలుగు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి గానం: ఎల్.ఆర్.ఈశ్వరి ఏరా సిన్నోడా సిగ్గెందుకు రారా సోగ్గాడా నా ముందుకు
ఓ బులి బులి బుగ్గలపిల్ల పాట సాహిత్యం
చిత్రం: మా ఇంటి వెలుగు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం:దాశరథి గానం: యస్. జానకి , యస్.పి. బాలు ఓ బులి బులి బుగ్గలపిల్ల నీ జిలిబిలి నడకలు
కన్నీరే చేదోడా కష్టాలే నా నీడ పాట సాహిత్యం
చిత్రం: మా ఇంటి వెలుగు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: శ్రీ శ్రీ గానం: పి. సుశీల కన్నీరే చేదోడా కష్టాలే నా నీడ చెలరేగే చీకటిలో చిరుదీపం
చిత్రం: చదరంగం (1984) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, పాలవెల్లి గానం: జేసుదాసు, యస్.పి. బాలు, పి.సుశీల నటీనటులు: శారద, నరేష్, భానుప్రియ, రాజేష్ , భువన , చంద్ర కిరణ్ (నూతన పరిచయం) కథ: డా॥ ఎమ్. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం: బి. భాస్కర రావు నిర్మాత: పి. వి. రమణ మూర్తి విడుదల తేది: 05.10.1984
Songs List:
ఓ ముద్దుల గుమ్మా మనసీవమ్మ పాట సాహిత్యం
చిత్రం: చదరంగం (1984) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: పాలవెల్లి గానం: యస్.పి. బాలు ఓ ముద్దుల గుమ్మా మనసీవమ్మ
ఒకే ముద్దు చాలు పాట సాహిత్యం
చిత్రం: చదరంగం (1984) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: జేసుదాస్, పి. సుశీల ఒకే ముద్దు చాలు మరువలేవు నన్ను నీవు
మత్తు ముసురుకొస్తోంది అమ్మమ్మా పాట సాహిత్యం
చిత్రం: చదరంగం (1984) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: పాలవెల్లి గానం: జేసుదాస్, పి. సుశీల మత్తు ముసురుకొస్తోంది అమ్మమ్మా
పలికే దైవం మా అమ్మా మన అమ్మా పాట సాహిత్యం
చిత్రం: చదరంగం (1984) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు, ప్రకాశ్ పలికే దైవం మా అమ్మా మన అమ్మా
నీ నీడలోనే ఉన్నాను పాట సాహిత్యం
చిత్రం: చదరంగం (1984) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల నీ నీడలోనే ఉన్నాను