-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "1991"



చిత్రం: నా ఇల్లే నా స్వర్గం (1991)
సంగీతం: రామ్ లక్ష్మణ్
నటీనటులు: ఘట్టమనేని కృష్ణ,రమేష్ బాబు, దివ్య భారతి, రూపా గంగూలీ
దర్శకత్వం: కె.ఋష్యేంద్రరెడ్డి
నిర్మాత: కె.కె.రెడ్డి
విడుదల తేది: 05.12.1991



Songs List:



స గ మ ద... పాట సాహిత్యం

 
చిత్రం: నా ఇల్లే నా స్వర్గం (1991)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, కె.ఎస్.చిత్ర

స  గ మ ద...  స  గ మ ద 
గ మ ద ని...  గ మ ద ని 



ఏనాటిదో ఈ ప్రేమ పురాణం పాట సాహిత్యం

 
చిత్రం: నా ఇల్లే నా స్వర్గం (1991)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, కె.ఎస్.చిత్ర

ఏనాటిదో ఈ ప్రేమ పురాణం ఆ ప్రేమకోసం



వస్తున్నా వచ్చేస్తున్నా పాట సాహిత్యం

 
చిత్రం: నా ఇల్లే నా స్వర్గం (1991)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్. పి. బాలు, కె.ఎస్.చిత్ర

వస్తున్నా వచ్చేస్తున్నా తెచ్చినవన్ని ఇచేస్తున్నా



దోమ దోమ వలపుల పాదాలమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: నా ఇల్లే నా స్వర్గం (1991)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, కె.ఎస్.చిత్ర

దోమ దోమ వలపుల పాదాలమ్మా మేలు కొలుపులు



ఓం నమః శివాయ.. పాట సాహిత్యం

 
చిత్రం: నా ఇల్లే నా స్వర్గం (1991)
సంగీతం: రామ్ లక్ష్మణ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, కె.ఎస్.చిత్ర

ఓం నమః శివాయ..విషనాగుల విషమెక్కిందా సుతి మించిన శివమెక్కిందా

Palli Balakrishna Tuesday, May 19, 2026



చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సహాయ సంగీత దర్శకుడు: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్, మీనా (తొలి పరిచయం)
దర్శకత్వం: కె. ఆదిత్య
నిర్మాత: ఎం. నాగేశ్వర రావు
విడుదల తేది: 05.10.199



Songs List:



యువతరం శివమెత్తితే పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: నార్ల చిరంజీవి
గానం: వందేమాతరం శ్రీనివాస్

యువతరం శివమెత్తితే



జిన్ని తారా జిన్ని పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: అదృష్ట దీపక్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి

జిన్ని తారా జిన్ని



చూస్కో చూస్కో పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: గుండవరపు సుబ్బారావు
గానం: వందేమాతరం శ్రీనివాస్

చూస్కో చూస్కో



నల్లకోటు బావా పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: కె. అప్పలాచారి
గానం: ఎస్. జానకి, వందేమాతరం శ్రీనివాస్

నల్లకోటు బావా



ఏవిటో తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: నార్ల చిరంజీవి
గానం: వందేమాతరం శ్రీనివాస్

ఏవిటో తల్లి

Palli Balakrishna Wednesday, April 29, 2026



చిత్రం: అశ్వని (1991)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి 
నటీనటులు: అశ్వని నచ్చప్ప , భాను చందర్ 
దర్శకత్వం: T. S. B. K. మౌళీ
నిర్మాతలు: అట్లూరి రామారావు, రామోజీ రావు 
విడుదల తేది: 12.03.1991



Songs List:



ఓ లేడి చిక్కవేల పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వని (1991)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

ఓ లేడి చిక్కవేల 



సానపట్టు పట్టకుంటె పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వని (1991)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి 
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర 

సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా 
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా 
లోని వెలుగు చూడరా పైని మెరుగు కాదు
దారి మలుపు తిప్పరా గెలుపు నీది నేడు 
సవాలు గుర్రముందిరా సవారి చేసి చూడరా 
నిరాశ నీకు చేటు ఆశయాల చేక్కు పోస్టు నీకు రూటు

సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా 
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా 

నా ఫుడ్డు మానేసినా ఈ గుడ్డు తెచ్చానులే 
చపాతీ కుర్మాలగా చమటోడ్చీ తెచ్చానులే 
బొజ్జనిండ ఆరగించు బుజ్జి అమ్మడు 
కండ దండిగుంటె పండగా
పెట్టుకున్న ఆశలన్నీ తీర్చు అమ్మడు 
తీర్చకుంటె తిండి దండగా 
తారలందు నీవె ఫస్టులే ఆశ్వని 

సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా 
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా 

త్యాగాలూ నీకోసమే చేసేటీ వారుండగా 
ప్రాణాలే నీకోసమే పంచేటీ వారుండగా 
బుద్దిలేని బద్దకాలు మాను అమ్మడూ 
నిన్న మాట నిండు సున్నగా 
ఆకసాన సంతకాలు చెయ్యి ఇప్పుడూ 
నింగి దాక వేసి నిచ్చెనా 
రామబాణమల్లె సాగవే ఆశ్వనీ 

సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా 
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా 

లోని వెలుగు చూడరా పైని మెరుగు కాదు
దారి మలుపు తిప్పరా గెలుపు నీది నేడు 
సవాలు గుర్రముందిరా సవారి చేసి చూడరా 
నిరాశ నీకు చేటు ఆశయాల చేక్కు పోస్టు నీకు రూటు

సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా 
ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా 




చెయ్ జగము మరచి పాట సాహిత్యం

 
చిత్రం : అశ్విని (1991)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి 
సాహిత్యం : వేటూరి
గానం : యస్.పి.బాలు 

చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
చెయ్ జగము మరచి జీవితమె సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన

ఆశయమన్నది నీ వరం
తలవంచును అంబరం
నీ కృషి నీకొక ఇంధనం
అది సాగర బంధనం

చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
చెయ్ జగము మరచి జీవితమె సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన

నిదురపోనేల నింగినీనేల
అలుపురానేల గెలుపునిన్నేల
ఒడలు వంచాలి ఓడి గెలవాలి
కదలి రావాలి కాలమాగాలి
కలలు పండాలి గగన మందాలి 
నేడు నీకిది జీవన విధానం
బ్రతుకు నవ్విన నందనం
నీదొక ఆగని ప్రయాణం
అడుగు దాటును యోజనం

చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన

ఉడుకు పుట్టాలి ఊపు రావాలి
చెమట పిండాలి శ్రమలు పండాలి
మట్టిలో పుట్టి మణివి కావాలి
జనము చూడాలి జాతి మెచ్చాలి
మెదడుకే నీవు పదును పెట్టాలి 
నేడు నీదొక నూతన పురాణం
విజయ విప్లవ కేతనం
నీవొక జీవన ప్రమాణం 
ప్రగతికే అది చేతనం

చెయ్ జగము మరచి జీవితమే సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన
చెయ్ జగము మరచి జీవితమె సాధన
నీ మదిని తరచి చూడడమే శోధన

ఆశయమన్నది నీ వరం
తలవంచును అంబరం
నీ కృషి నీకొక ఇంధనం
అది సాగర బంధనం  




మోహన రాగం పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వని (1991)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర 

మోహన రాగం 

Palli Balakrishna Monday, April 27, 2026



చిత్రం: కలికాలం (1991)
సంగీతం: విద్యాసాగర్
నటీనటులు: చంద్ర మోహన్, జయసుధ, సాయి కుమార్
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: నితిన్ కపూర్
విడుదల తేది: 27.03.1991



Songs List:



ఏ నాటికీ నీ వడి వీడని పాట సాహిత్యం

 
చిత్రం: కలికాలం (1991)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఏ నాటికీ నీ వడి వీడని 



యేనాటికానాడు పాట సాహిత్యం

 
చిత్రం: కలికాలం (1991)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

యేనాటికానాడు



అచ్చచో అచ్చో పాట సాహిత్యం

 
చిత్రం: కలికాలం (1991)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: నాగూర్ బాబు, చిత్ర

అచ్చచో అచ్చో 




ఆరని ఆకలి కాలం..పాట సాహిత్యం

 
చిత్రం: కలికాలం (1991)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

ఆరని ఆకలి కాలం..కలికాలం
అవనికి ఆఖరి కాలం..కలికాలం
నీతిని కాల్చే నిప్పుల గోళం
నిలువునా కూల్చే నిష్టుర జాలం
కలికాలం ఆకలి కాలం
కలికాలం ఆఖరి కాలం

ఈ గాలి ఏ జాలి ఎరుగదు
ఈ నేల ఏ పూలు విరియదు
ఈ మూల ఎకాకి ప్రతి మనిషి
ఈ గోల ఎనాడు అణగదు
ఈ జ్వాల ఏవేళ తరగదు
ఈ నింగి పంచేది కటిక నిశి
కూటికోసమేనా ఇంత చేటు బోను
సాటివారిపైనా కాటు వేయు జోరు
మనిషే మృగమై అడవైపోయే నడివీధిలో
కూరిమి కోరని క్రౌర్యం..యుగసారం
ఓరిమి చేరని వైరం..గ్రహచారం
కత్తులు నూరే కర్మాదానం
నెత్తురు పారే అత్యాచారం
కసికాలం..రక్కసికాలం
కలికాలం ఆఖరి కాలం

వాటాల పోటీల నడుమ వేలాడుతుంటారు మనుషులు
వ్యాపారమే వావి వరసులుగా
వేలాల పాఠం విలువలు వేసారిపోతాయి మనసులు
ఏపాటి స్నేహాలు కనపడక
రాగిపైసతోనే వేగుపాశమైనా
అత్యాశతోనే అయినవాళ్ళ ప్రేమ..
అడిగే వెలనే చెల్లించాలి అడుగు అడుగున
అంగడి సరుకై పోయే మమకారం
అమ్ముడు పొమ్మని తరిమే పరివారం
తీరని నేరం...ఈ వ్యవహారం
తియాని నేరం..ఈ సంసారం
కనికారం కానని కాలం
కలికాలం ఆకలి కాలం

నీ బ్రతుకు తెల్లారినాకే..
వేరొకరి ఆశలకు వేకువ..
ఈ ఇరుకు లోకాల వాడుక ఇది
ఓ పాడె మేళాల అపశ్రుతి..
ఓ పెళ్ళి కట్నాల ఫలశ్రుతి..
ఏ కరకు ధర్మాల వేడుక ఇది
కాటి కాంతిలోనే బాట చూసుకుంటూ
కాళరాత్రిలోనే చోటు చేసుకుంటూ
బ్రతుకే వెతికే ఏ రాకాసి లోకం ఇది
సంతతి సౌఖ్యం కోసం బలిదానం
అల్లిన ఈ యమ పాశం బహుమానం
ఆశలు అల్లే ఈ విష జాలం
చీకటి పాడే చిచ్చుల గానం
కలికాలం కలతల గాళం
కలికాలం ఆకలి కాలం

ఏనాటి కానాడు నిత్యం వేదించు ఆ పేద గాధకు
ఈనాడు రేటంత పెరిగినది
జీవించినన్నాలు ఎన్నడు
ఊహించలేనంత పెన్నిధి
ఈ వారసత్వానికి ఇచ్చినది
చావుకున్న భీమ..జీవితానికి ఏది
ఊపిరున్న ధీమా..జ్ఞాపకానికి ఏది
కనకే కనకం..కన్నీరేందుకు అంటున్నది
నమ్మినవారికి నష్టం కొనప్రాణం
తప్పక తీరును చస్తే ఋణకాలం
ఆహుతి కాని నిన్నటి రూపం
కంచికి పోని నీ కధ వేగం
అనివార్యం ఈ పరిహారం
కలికాలం ఆకలి కాలం

పైనున్న పున్నామనరకం..
దాటించు పుణ్యాల వరమని..
పుత్రులున్ని కన్న ఫలితమిది
ప్రాణాలు పోయెటిలోపునే..
వెంటాడి వేటాడి నిలువునా..
అంటించి పోతారు తలకొరివి
పాలు పోసి పెంచే..కాల నాగు రూపం.
నోము నోచి పొందే..ఘోరమైన శాపం
బ్రతుకే బరువై..చితినే శరణు వేడే క్షణం
కోరలు చాచిన స్వార్ధం..పరమార్ధం
తీరని కాంక్షల రాజ్యం..ఈ సంఘం
నీతిని కాల్చే..నిప్పుల గోళం
నిలువున కూల్చే..నిష్టుర జాళం
కలికాలం ఆకలి కాలం
కలికాలం ఆఖరి కాలం

ఈ మాయ భందాలు నమ్మకు
ఈ పరుగు పందాల ఆగకు
నీ బాట నీదేరా కడవరకు
ఏ గాలిని దారి అడగకు
ఏ జాలికి ఎదురు చూడకు
నీ నీడే నీ తోడనుకో
ఓడలాగ నిన్ను..వాడుకున్న వారు
తీరమందగానే..తిరిగి చూడబోరు
పడవై బ్రతికి నది ఓడిలోనే నిలిచి ఉండకు
ఏరయి పారే కాలం ఏమైనా
సాక్షిగ నిలిచిన గట్టు కరిగేనా
వేసవి కాని..వెల్లువ రాని
శాశ్వత స్నేహం అల్లుకుపోని
చెదిరేనా పండిన భంధం
చెరిపేనా ఏ కలికాలం

Palli Balakrishna Monday, August 30, 2021





చిత్రం: సర్పయాగం  (1991)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, సుశీల, చిత్ర 
నటీనటులు: శోభన్ బాబు, వాణీ విశ్వనాధ్, రేఖ, శ్రీనివాస వర్మ (తొలిపరిచయమ౦), రోజా, సాయి కుమార్, బ్రహ్మాజీ, రాజారవీంద్ర
రచన, దర్శకత్వం: పరుచూరి బ్రదర్స్ 
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్ 
నిర్మాత: డి.రామానాయుడు 
విడుదల తేది: 01.11. 1991



Songs List:



ABCD గుండెలలో పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎస్.పి.బాలు, సుశీల 

(శ్రీనివాస వర్మ ,  రోజా పై ఈ పాట చిత్రీకరణ జరిగింది)

ABCD గుండెలలో




శుబ్రం చేయనా పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎస్.పి.బాలు, సుశీల 

(బ్రహ్మానందం  , జయలలిత  పై ఈ పాట చిత్రీకరణ జరిగింది)

శుబ్రం చేయనా 



చుక్కా చుక్కా కన్నీటి చుక్కా పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: సినారె
గానం: ఎస్.పి.బాలు

చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు
నా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు

అమ్మ నీకు కావాలంటే అంగడిలో కొనితేలేను
అమ్మ నీకు కావాలంటే అంగడిలో కొనితేలేను
నేనే నీ అమ్మనుకుంటే ప్రాణం హారతి పడతాను
బ్రతుకే పండిందంటాను.

చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు
నా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు.

జరిగిన కాలం ఏనాడైనా తిరిగి రాగలిగేనా...ఓ.
జరిగిన కాలం ఏనాడైనా తిరిగి రాగలిగేనా...
నేలకు రాలిన ధృవతారైనా నింగికి పోగలిగేనా
శ్వాసకు హద్దు ఉన్నది గాని ఆశకు లేదమ్మా
కాటిలో కలిసిన ఏ ప్రాణైనా గూటికి రానే రాదమ్మా...

చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు
నా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు

ఇంతగ ఉన్న నా పసిగున్నా ఎంతగా ఎదిగావమ్మా...ఆ..
ఇంతగ ఉన్న నా పసిగున్నా ఎంతగా ఎదిగావమ్మా.
ఒదిగే కళ్ళల్లో ఊరేగే బిడియం ఓణీ వేసిందమ్మా...
నీ నవ్వుల్లో మీ అమ్మ రూపం నిత్యంకంటాను.
నూరేళ్లయినా నిన్నే చూస్తూ మారాజల్లే ఉంటాను.





దిగు దిగు దిగు పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: చిత్ర 

(రాజారవీంద్ర , వాణీ విశ్వనాధ్ పై ఈ పాట చిత్రీకరణ జరిగింది)

దిగు దిగు దిగు 




కుంకుమ పూభోని పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎస్.పి.బాలు

కుంకుమ పూభోని



చుక్కా చుక్కా కన్నీటి చుక్కా (విషాద గీతం) పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎస్.పి.బాలు

చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు



చెలి రాగం చెలి కోరే పాట సాహిత్యం

 
చిత్రం: సర్పయాగం (1991)
సంగీతం: విద్యాసాగర్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: 

చెలి రాగం చెలి కోరే 

Palli Balakrishna Sunday, August 8, 2021



చిత్రం: అగ్ని నక్షత్రం (1991)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి, జాలాది 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల యస్. జానకి వాణీ జయరాం, నాగుర్ బాబు 
డైలాగ్స్: జంధ్యాల
నటీనటులు: శోభన్ బాబు, కళ్యాణ చక్రవర్తి, మోహన్ బాబు, రజిని 
దర్శకత్వం: శరత్ 
నిర్మాత: వల్లభనేని లక్ష్మిదాస్
విడుదల తేది: 13.12.1991



Songs List:



ఎవరో తెలుసా పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని నక్షత్రం (1991)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, వాణీ జయరాం 

ఎవరో తెలుసా ఎదురన్నదే లేదురా
వివరం చెబితే నిదురన్నదే రాదురా 



ఎదలో ఎదలో ఒక తాళం పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని నక్షత్రం (1991)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల 

ఎదలో ఎదలో ఒక తాళం 




ఒత్తిడి చిత్తడి వయసురా పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని నక్షత్రం (1991)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి 

ఒత్తిడి చిత్తడి వయసురా 




ఘణ ఘణం భలే ఘణం మహా ఘణా దీప పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని నక్షత్రం (1991)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి. బాలు, నాగుర్ బాబు 

ఘణ ఘణం భలే ఘణం మహా ఘణా దీపం 

Palli Balakrishna Wednesday, March 20, 2019



చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, డా॥ సి. నారాయణరెడ్డి 
నటీనటులు: కృష్ణ , మోహన్ బాబు, బి సరోజాదేవి, శోభన, మానస
మాటలు: జంధ్యాల
స్క్రీన్ ప్లే, కూర్పు, దర్శకత్వం: కృష్ణ ఘట్టమనేని
నిర్మాత: యు.సూర్యనారాయణబాబు
బ్యానర్: పద్మావతి ఫిలిమ్స్
విడుదల తేది: 21.07.1991



Songs List:



ఇది మల్లెలమాసం పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం: యస్.పి. బాలు, వాణీ జయరాం 

(ఈ పాట అమీర్ ఖాన్ మరియు మాధురి దీక్షిత్ నటించిన Dil (1990) సినిమాలోని సాంగ్ Mujhe neend na aayi - Music: Anand Milind Singers: అనూరాధ పాడ్వల్, ఉదిత్ నారాయణ్ గారు)

పల్లవి:
ఇది మల్లెలమాసం వలపుల వారం
ప్రేమకు తీరం 
పరువానికి ప్రాయం మదనుడి సాయం కోరిన గేయం

ఈ మల్లెల మాసంలో...
చెలికొమ్మలలో తొలికోయిలలా
చిగురాకుల ఊయలలూగె
వసంతమిక వచ్చెనులే
వయసు నులి వెచ్చనలే
ఉషస్సులిక కన్నులులే
మనసులిక వెన్నెలలే

తడి చిత్తడిలో ఎద హాత్తుకునే
పడుచాకుల పందిరి వేసె
ముహూర్తమిక ఆగదులే
ముడే ఇక వీడదులే
జతే ఒక జావళిగా
శ్రుతే ఇక మించెనులే

చరణం: 1
వేణువు వంతెన వేసే మధూదయంలోనే
పరువము పదే పదే.. విరబూసేనే
సూర్యుడు కన్నులు గీటే శుభోదయంలోనే..
పిలుపులు ప్రియా ప్రియా.. అనురాగాలే
తడబడు పెదవుల చప్పుడే
తగిలెను ముద్దులు ఇప్పుడే
అడగక తప్పదు అప్పుడే
అలిగిన సొగసులు గుప్పెడే
ఇవి జంటలలో చలి మంటలులే
ఒడి గంటలు మోగిన వేళా
కులుకు ముల్లు గుచ్చుకునే
వగలు అరవిచ్చెనులే
చినుకువాలు కన్నులలో...
నెమలి కళలొచ్చెనులే

చరణం: 2
హంసలు మోసుకు వచ్చిన హాయివి నీవేలే...
హంపిని కాసిన సొంపుల రేయివి నీవేలే..
ప్రేమకు పాటలు నేర్పిన పల్లవి నీవేలే
పూచిన ఆశల పూవుల పల్లకి నీవేలే
కుడి బుజమదిరెను గుట్టుగా
శుభశకునములకు గుర్తుగా
తొడిమకు చాటున మొగ్గలా
తడమకు నేనా సిగ్గిలా
తొలి చూపులనే గాలింపులలో
జల్లించకు మన్మధ మాల
వయస్సొక వాకిలిలే
ప్రియా అది దాటవలే

ఇది మల్లెలమాసం వలపుల వారం
ప్రేమకు తీరం
పరువానికి ప్రాయం మదనుడి
సాయం కోరిన గేయం..
చెలికొమ్మలలో తొలికోయిలలా
చిగురాకుల ఊయలలూగె
వసంతమిక వచ్చెనులే
వయసు నులి వెచ్చనలే
జతే ఒక జావళిగా..
శృతే ఇక మించెనులే




ఇత్తడి బిందెకు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: 

ఇత్తడి బిందెకు



కాస్కో కాంతామణి పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: 

కాస్కో కాంతామణి 




లబ్బుడు డిబ్బుడు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: 

లబ్బుడు డిబ్బుడు



వయస్సుర పాట సాహిత్యం

 
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: 

వయస్సుర 

Palli Balakrishna Thursday, March 14, 2019

Most Recent

Default