-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sharreth"




చిత్రం: హలో అల్లుడు (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, భువనచంద్ర
నేపద్యగానం: యస్. పి. బాలు, మనో, చిత్ర
నటీనటులు: సుమన్, రంభ, వాణిశ్రీ, జయచిత్ర
కో- డైరెక్టర్: యనమదల. కాశీవిశ్వనాథ్
దర్శకత్వం: శరత్
నిర్మాత: కె. అనితా నాగేందర్
విడుదల తేది: 1994



Songs List:



మొదటి మోజుల రేగేవేళకి పాట సాహిత్యం

 
చిత్రం: హలో అల్లుడు (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి బాలు, చిత్ర

మొదటి మోజుల రేగేవేళకి



ఊపులో ఉన్నది పిట్ట పాట సాహిత్యం

 
చిత్రం: హలో అల్లుడు (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి బాలు, చిత్ర

ఊపులో ఉన్నది పిట్ట



ఏంటి పిల్లా (కంచిపట్టు చీర) పాట సాహిత్యం

 
చిత్రం: హలో అల్లుడు (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, చిత్ర

ఏంటి పిల్లా (కంచిపట్టు చీర)




అమ్మ పిల్లడో... పాట సాహిత్యం

 
చిత్రం: హలో అల్లుడు (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

అమ్మ పిల్లడో...





ఓ నా మైనా ఇంత మౌనమా పాట సాహిత్యం

 
చిత్రం: హలో అల్లుడు (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, చిత్ర

ఓ నా మైనా ఇంత మౌనమా

Palli Balakrishna Wednesday, July 7, 2021



చిత్రం: అగ్ని నక్షత్రం (1991)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి, జాలాది 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల యస్. జానకి వాణీ జయరాం, నాగుర్ బాబు 
డైలాగ్స్: జంధ్యాల
నటీనటులు: శోభన్ బాబు, కళ్యాణ చక్రవర్తి, మోహన్ బాబు, రజిని 
దర్శకత్వం: శరత్ 
నిర్మాత: వల్లభనేని లక్ష్మిదాస్
విడుదల తేది: 13.12.1991



Songs List:



ఎవరో తెలుసా పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని నక్షత్రం (1991)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, వాణీ జయరాం 

ఎవరో తెలుసా ఎదురన్నదే లేదురా
వివరం చెబితే నిదురన్నదే రాదురా 



ఎదలో ఎదలో ఒక తాళం పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని నక్షత్రం (1991)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల 

ఎదలో ఎదలో ఒక తాళం 




ఒత్తిడి చిత్తడి వయసురా పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని నక్షత్రం (1991)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి 

ఒత్తిడి చిత్తడి వయసురా 




ఘణ ఘణం భలే ఘణం మహా ఘణా దీప పాట సాహిత్యం

 
చిత్రం: అగ్ని నక్షత్రం (1991)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి. బాలు, నాగుర్ బాబు 

ఘణ ఘణం భలే ఘణం మహా ఘణా దీపం 

Palli Balakrishna Wednesday, March 20, 2019


చిత్రం: నా నువ్వే (2018)
సంగీతం: శరత్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: కార్తీక్, సప్తపర్ణ చక్రవర్తి
నటీనటులు: కళ్యాణ్ రామ్, తమన్నా
దర్శకత్వం: జయేంద్ర పంచపాకేషన్
నిర్మాత: కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటి
విడుదల తేది: 14.06.2018

చినికి చినికి చిలిపి గాలి తడి
తగిలి తగిలి వలపు వానజడి
కురిసి కురిసి వయసు వాగువడి
పెరిగి పెరిగి మనసు గండిపడి
వరదై వరదై ఉరుకు ప్రేమనది
ఒడులై సుడులై కడలై ఎగిసినదే

ఏమైందో  ఏమైందో
ఇపుడసలేమేమి ఔతుందో సమయం
ఎం చేయ్యమంటుందో తెలియదే
తెలియదే తెలియదే తెలియదే

ఈడు బరిలో అధరాలు నిలబడి
సైనికులుగా సమరాన కలబడి
ఏది గెలుపో మరిచేంత ఎగబడి
ఆత్రపడుతూ మరికొంత మెలిపడి

ఏకం అవుతూ తికమక
ఎదో చేస్తూ సుఖముల
రాజ్యాలేలే పదవిని
పొందాయేమో పెదవులిలా

మాయ మరుపే ముసిరింది మనలను
హాయి మెరుపే తెరిచింది కనులను
తీపి తలపే కలిపింది ఎదలను
చేరువయితే అరచెయ్యి వదలను

నేనే  నీవై ఇప్పుడిక
నాలో నేనే  మిగలను
నీలో శ్వాసై కదులుతూ
లోలో ఆశై కరిగెదనే

చినికి చినికి చిలిపి గాలి తడి
తగిలి తగిలి వలపు వానజడి
కురిసి కురిసి వయసు వాగువాడి
పెరిగి పెరిగి మనసు గండిపడి
వరదై వరదై ఉరుకు ప్రేమనది
ఒడులై సుడులై కడలై ఎగిసినదే

ఏమైందో  ఏమైందో ఇపుడసలేమేమి
 ఔతుందో సమయము
ఎం చేయమంటుందో తెలియదే
తెలియదే తెలియదే తెలియదే
తెలియదే తెలియదే

Palli Balakrishna Saturday, January 26, 2019


చిత్రం: దృశ్యం (2014)
సంగీతం: శరత్
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయ్ ఏసుదాస్
నటీనటులు: వెంకటేష్ , మీనా
దర్శకత్వం: శ్రీప్రియ
నిర్మాతలు: డి.సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి
విడుదల తేది: 11.07.2014

నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
గడిచే సమయం నడిపింది వింతజాలం
నీకైనా... నాకైనా...
గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా
మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా...

నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
నీకైనా... నాకైనా...
మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా...

గాయాలు చేసేసేది ఈకాలమే గాయాన్ని మాన్పించేది ఈ కాలమే
గాయాలు చేసేసేది ఈకాలమే గాయాన్ని మాన్పించేది ఈ కాలమే
తనకే లేదు ప్రేమా జాలీ కరునా మనకే పోదు మనపై మమతా తపనా
కాలసంద్రానికే ఎదురీతే కాదా బ్రతుకంటే...

నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
గడిచే సమయం నడిపింది వింతజాలం

కధ మలుపు తిప్పించేది ఈ కాలమే
కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే
కధ మలుపు తిప్పించేది ఈ కాలమే
కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే
తానే కరిగీ నిన్నే కదిపీ కుదిపీ
తానే తరిగీ నిన్నే తరిమీ తరిమీ
ఒక్క క్షణకాలమే వెంటాడేనంటా కలకాలం

నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
గడిచే సమయం నడిపింది వింతజాలం
నీకైనా... నాకైనా...
గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా
మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా...

నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం
నీకైనా... నాకైనా...
మరు క్షణములోన జరిగేది ఏంటొ ఊహించటం సాధ్యమా...



*********   ********   ********


చిత్రం: దృశ్యం (2014)
సంగీతం: శరత్
సాహిత్యం: చంద్రబోస్
గానం: నజీమ్ అర్షద్

ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే
మదిలోన ఆనందాలా మెరుపులు మొదలైతె
ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే
ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె

ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే

ఇంటిపేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమె
కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే
అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే
తుల్లి తుల్లి పొంగేనంట ఆటా పాటా
అల్లి బిల్లి ఆకాశంలో అమ్మా నాన్నా అక్కా చెల్లి
మల్లెపూల మొబ్బులైతే

ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే
ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె
ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే

అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే
సుడిగాలికి చెడుజ్వాలకి తెగిపోదు ఈదారమే
గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిధ్యమే
గుమ్మం లోనే వాలేనంట దేవాలయం
చిన్ని చిన్ని కోపాలన్ని చిర్రు బుర్రు తాపాలన్నీ వచ్చీ పోయే ఉరుమైతే...

ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే
ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె
ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే
ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే
మదిలోన ఆనందాలా మెరుపులు మొదలైతె
ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే
ప్రతి మలుపు మమతేలే కధలెన్నొ మాతో కదిలేలె

Palli Balakrishna Saturday, July 29, 2017



చిత్రం: 180 (2011)
సంగీతం: శరత్
సాహిత్యం: వనమాలి
గానం: చిత్ర, సౌమ్య, ఆనంద్ అరవిందాక్షన్
నటీనటులు: సిద్దార్ధ్, నిత్యామీనన్, ప్రియ ఆనంద్
దర్శకత్వం: జయేంద్ర
నిర్మాతలు: కిరణ్ రెడ్డి, స్వరూప్ రెడ్డి, సి. శ్రీకాంత్
విడుదల తేది: 25.06.2011

నిన్న లేని వింతలే చూపెనే కంటిపాపలే
మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే
నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేలా
చిరునవ్వే నాదయ్యేనా
నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే

నీ లో ఆ కసి గుసలే ప్రేమే వల్లించేనా
పలుకే అలిసే పెదవే సెధ తీరేలా
నిరకం నిలిచే పనులే చేద్దాం చేతల్లో
రి ని రి గ రి -  బ్రతుకున ఓఓ
రి మ ని ప గ రి - పరమార్ధమే
మనసా కోరే తీరి
రి గ మ ప ద ని స - మనిషిగా - నిలపదా

నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే
మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే

నీతో ఈ పయనాలే రోజూ కొనసాగేనా
మలుపే తిరిగే పెరిగే బహుదూరాలే
మననే కడకు నిలిపే గమ్యం నీదైనా
ఆఆ ద ని ద మ గ రి - నిను విడని
రి ప మ ని ప గ రి - చిరు సంబరం
ద ని స ని నీతో నీడై
గ మ ప ద ని స - కదిలితే - చాలదా

నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే
మొములన్ని చింతగా చూడని వెండి నవ్వులే
నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేలా
నీ నవ్వే చిరునవ్వే నాదయ్యేనా...

Palli Balakrishna Monday, July 24, 2017

Most Recent

Default