Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: లంబ సింగి  (2022)
సంగీతం:  ఆర్ ఆర్.దృవన్
నటీనటులు: భరత్ రాజ్ , దివి
దర్శకత్వం: నవీన్ గాంధీ 
నిర్మాణసంస్థ: కాన్సెప్ట్ ఫిలిమ్స్
విడుదల తేది: 2022



Songs List:



నచ్చేసిందే నచ్చేసిందే పాట సాహిత్యం

 
చిత్రం: లంబ సింగి  (2022)
సంగీతం:  ఆర్ ఆర్.దృవన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సిద్ శ్రీరాం 

నచ్చేసిందే నచ్చేసిందే
నాకెంతో నచ్చిందే ఈ పిల్లా
నవ్వేసిందే నవ్వేసిందే
నా మనసే తవ్వేసిందే ఇల్లా

చిట్టి గుండె జారి మొట్ట మొదటిసారి
కొట్టుకోడం తాను మరిచిందేమో
పట్టుకురుల గాలి చుట్టుకుంటే తుళ్ళి
శ్వాసే తీసి మళ్ళీ సాగిందేమో

కలలు కవితలు చదివిన క్షణమున నచ్చేసిందే
నచ్చేసిందే నచ్చేసిందే
నాకెంతో నచ్చిందే ఈ పిల్లా
నవ్వేసిందే నవ్వేసిందే
నా మనసే తవ్వేసిందే ఇల్లా, ఓ ఓఓ

ముందే కలిసినట్టు
తను ఎంతో తెలిసున్నట్టు
తెగ అనిపిస్తుందే ఎందువలనా
ప్రతినిమిషం కలవాలంటూ
గడియారం ముళ్ళై చుట్టూ
తిరిగేస్తున్నాయ్ ఏం చెప్పలేకున్నా

ఆమె చూపు తాకినా మంచులాగ మారనా
ఒక్క జన్మ చాలునా ఇంత హాయినా
పెదవి పలుకులు వెతికిన క్షణమున నచ్చేసిందే
ఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆ

నచ్చేసిందే నచ్చేసిందే
నాకెంతో నచ్చిందే ఈ పిల్లా
ఓఓ ఓ, నవ్వేసిందే నవ్వేసిందే
నా మనసే తవ్వేసిందే ఇల్లా

గుండె తలుపు తట్టి… నన్నదృష్టంలా పట్టి
నా సంతోషానికి సంతకమయ్యిందే
ప్రతిరోజు పక్కన ఉంటూ
తన ఊపిరి చప్పుడు వింటూ
నిశ్శబ్దంగా నిదరోవాలని ఉంటే

అడుగు వేసేలోపల అడగకుండా నీడలా
తనకు నేను కాపలా… అన్ని వైపులా
సెలవు ఇక అడగను ఏ క్షణమున, నచ్చేసిందే

నచ్చేసిందే నచ్చేసిందే
నాకెంతో నచ్చిందే ఈ పిల్లా
ఓఓ ఓ, నవ్వేసిందే నవ్వేసిందే
నా మనసే తవ్వేసిందే ఇల్లా




డోలారే డోలా పాట సాహిత్యం

 
చిత్రం: లంబ సింగి  (2022)
సంగీతం:  ఆర్ ఆర్.దృవన్
సాహిత్యం: రఘురాం 
గానం: మంగ్లీ 

అమ్మడి కన్నుల కాటుక మెరిసే
గుమ్మడి పువ్వులు చాటుగ విరిసే
పుత్తడి నవ్వులు నిండుగ కురిసే
కొత్తగ ఈవేళా

చిందర వందర సందడులన్నీ
తొందర తొందరపెట్టెను ఇపుడే
ముందర ముందర కన్నుల ముందర
కలలే తెచ్చేలా

ఏలో ఏలో ఏలో… ఎన్నెలలే వచ్చెను యాలో
ఊరంతా ఊగిపోయేలాగా… సిందేవేయాలో
హే, కోలో కోలో కోలో… సరదాల కోలాటంలో
జనమంతా ఉక్కిరి బిక్కిరి అయ్యే గోలే సెయ్యాలో

హే, సిన్నా పెద్దా తేడాలన్నీ మరిసిపోవాలో
అరె, సుట్టూ సేరి సుట్టాలందరు ఆటే ఆడాలో

డోలారే డోలారే దిల్ డోలా
దరువే వెయ్యాలా… సందల్లే సొంతం అయ్యేలా, ఓ ఓ
రేలారే రేలా రేలారేలా
నేలే అదిరేలా… నాట్యాలే ఎన్నో సెయ్యాలా

అమ్మడి కన్నుల కాటుక మెరిసే
గుమ్మడి పువ్వులు చాటుగ విరిసే
పుత్తడి నవ్వులు నిండుగ కురిసే
కొత్తగ ఈవేళా

చిందర వందర సందడులన్నీ
తొందర తొందరపెట్టెను ఇపుడే
ముందర ముందర కన్నుల ముందర
కలలే తెచ్చేలా

హే, ఆకాశంలో మేఘం
అరె చేసిందేమో ఆగం
కనుకే మనకై చినుకై కురిసిందే
ఇంతటి సంతోషం

గుండెల్లోనా వేగం
పెంచిందే ఈ అనురాగం
అంబరమే అంటే సంబరమే
పలికిందే ఆహ్వానం

గింగిర గిర గిర బొంగరమై
మనసే తిరిగేసిందే
చెక్కిలి గిలి గిలి గిలిగింతలు
ఎన్నెన్నో పెంచిందే టెన్ టు ఫైవ్

కొండకోనల్లో స్వచ్ఛమైన ప్రేమే చూడగా
కొత్త గాలేదో దారే మారి మా ఇల్లే చేరిందిగా

డోలారే డోలారే దిల్ డోలా
దరువే వెయ్యాలా… సందల్లే సొంతం అయ్యేలా, ఓ ఓ
రేలారే రేలా రేలారేలా
నేలే అదిరేలా… నాట్యాలే ఎన్నో సెయ్యాలా

No comments

Most Recent

Default