-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: జయమ్మ పంచాయితి (2022)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి 
నటీనటులు: సుమ కనకాల, దేవి ప్రసాద్, డేనిష్ కుమార్ , శాలిని కొండేపూడి
దర్శకత్వం: విజయ్ కుమార్ కలివరపు
నిర్మాత: బలగా ప్రకాష్ 
విడుదల తేది: 06.05.2022



Songs List:



తిప్పగలనా చూపులు పాట సాహిత్యం

 
చిత్రం: జయమ్మ పంచాయితి (2022)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: రామాంజనేయులు 
గానం: PVNS రోహిత్ 

తిప్పగలనా చూపులు
నీ నుంచే ఏ వైపైనా
ఆపగలనా అడుగులు
నా చెంతే కాసేపైనా

వస్తావు నువ్వే తెస్తావు నన్నే
ఇస్తావు నాకే ఓ ఓఓ
నువ్వెళ్ళగానే నేనింకా లేనే
నీ లాగే అయిపోతానే

ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా

నేనెందుకు పుట్టానంటే… ఏమివ్వను బదులే
నీ కోసమే అన్నానంటే… తిడతావో ఏమోలే
నాకెవ్వరు నచ్చారంటే… ఏం చెప్పను మాటే
నీ కన్నా ఎవరుండరు… అంటే, కొడతావేమోలే

అనలేక, ఓ… ఏమనలేక ఓ
మిగిలానే ప్రేమలేఖలా
వస్తావు నువ్వే
తెస్తావు నన్నే ఇస్తావు నాకే ఓ
నువ్వెళ్ళగానే నేనింకా లేనే
నీ లాగే అయిపోతానే

ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా

తిప్పగలనా చూపులు
నీ నుంచే ఏ వైపైనా
ఆపగలనా అడుగులు
నా చెంతే కాసేపైనా

వస్తావు నువ్వే తెస్తావు నన్నే
ఇస్తావు నాకే ఓ ఓఓ
నువ్వెళ్ళగానే నేనింకా లేనే
నీ లాగే అయిపోతానే

ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా




కాసింత భోళాతనం పాట సాహిత్యం

 
చిత్రం: జయమ్మ పంచాయితి (2022)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రీకృష్ణ 

కాసింత భోళాతనం
కూసింత జాలి గుణం
కాసింత గండ్రతనం
కూసింత మొండి గుణం

కాసింత భోళాతనం
కూసింత జాలి గుణం
కాసింత గండ్రతనం
కూసింత మొండి గుణం

అచ్చమైన పల్లెటూరి ఇత్తనం
ఎక్కడైనా ఆమెదేగా పెత్తనం
ఈ అమ్మోరు తల్లి తూఫాను ముందర
తూనీగలే మనమందరం

హెయ్, జయమ్మ జయమ్మ
జయమ్మ జయమ్మ జయమ్మ
చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ
అసలైన సంగతి నిజంగానే వేరమ్మా
మచ్చలేని ఆ మనసే ఆకాశమంతమ్మా

పక్క ఇంటి లక్ష్మి
పంచదార అప్పు తీర్చలేదు
పోస్టుమ్యాను భద్రం
వారం రోజుల్నుంచి రాడం లేదు

సికెను షాపు సీను
ఎనకట్లాగా తూకం తుయ్యట్లేదు
అట్టా ఎల్లే ఎంకాయమ్మ
నన్ను సూసి పలకరించలేదు

పొద్దున గొన్న బీరకాయల్
నాలుగింట్లో మూడు చేదు
ఎందోగాని నా గాచారం
ఒక్క సంగతి సరిగ్గాలేదు
ఫో ఫో ఫో

సివంగి లెక్కన లేస్తది గానీ
సిన్న పిల్ల మనసు
ఇట్టాగ ఎందుకు పుట్టించాడో
ఆ దేవుడికే తెలుసు

పట్టాసు తీరున పేలుద్ది బాబోయ్
నోటి మాటే పెళుసు
జయమ్మ గొంతు లెగిసిందో చాలు
భూజగమే సైలెన్సు

బుస్సున ఆకాశమంటే కోపం, తకధిమి
సప్పున సల్లారిపోతది పాపం, తకధిమి
బుస్సున ఆకాశమంటే కోపం, తకధిమి
సప్పున సల్లారిపోతది పాపం, తకధిమి తక తక
తప్పుకోక తప్పదు ఆ అరనిమిషం భూకంపం

హెయ్, జయమ్మ జయమ్మ
జయమ్మ జయమ్మ జయమ్మ
చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ
అసలైన సంగతి నిజంగానే వేరమ్మా
మచ్చలేని ఆ మనసే ఆకాశమంతమ్మా

అమ్మాడియమ్మో జయమ్మా
అమ్మాడియమ్మో జయమ్మా
జయమ్మో జయమ్మో జయమ్మ
జయమ్మో జయమ్మో జయమ్మ

ఎదురింట్లోని చంటిపాప ఏడుపింకా ఆపట్లేదు
ఖతారెళ్లిన కాంతం కొడుకు
ఏమయ్యాడో పత్తా లేడు
రచ్చబండ హనుమంతుడికి
ఎండా వానా నీడే లేదు

అబ్బులు గారి చూలు గేదే
అన్నం నీళ్లు ముడతలేదు
సుబ్బాయమ్మ మొగుడికి దానికి
నిమిషం కూడా పడుతలేదు
అబ్బబ్బా ఈ కష్టాలకి
అంతు పొంతూ లేనే లేదు
ఫో ఫో ఫో

అమ్మాడియమ్మో జయమ్మా
అమ్మాడియమ్మో జయమ్మా
జయమ్మో జయమ్మో జయమ్మ
జయమ్మో జయమ్మో జయమ్మ

పొరుగోళ్ళకి సాయం చెయ్యడమంటే
ఇష్టమండి తనకు
తిరిగి సాయం చెయ్యకపోతే
ఇరకాటమే మనకు

నిద్దరోతే ఒట్టు పక్క వాళ్ళ
కళ్ళ నీళ్లు తుడిచే వరకు
అట్టాగే మనని తోడుండమంటది
తనకొచ్చే ఆపదకు

లేదే మోమాటం ఇంటావంటా, తకధిమి
తనదేననుకుంటది ఊరూరంతా, తకధిమి
లేదే మోమాటం ఇంటావంటా, తకధిమి
తనదేననుకుంటది ఊరూరంతా, తకధిమి
ఎవరేమేమనుకున్నా మరో మాటే లే దం ట

హెయ్, జయమ్మ జయమ్మ
జయమ్మ జయమ్మ జయమ్మ
చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ
అసలైన సంగతి నిజంగానే వేరమ్మా
మచ్చలేని ఆ మనసే ఆకాశమంతమ్మా



బాగుంది కదా స్నేహం పాట సాహిత్యం

 
చిత్రం: జయమ్మ పంచాయితి (2022)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం:  అనిరుద్ సుస్వరం, నీలిమ శంకుల 

నువ్వో రెక్క… అరెరే నేనో రెక్క
రెక్కలు రెండు కలిపి చూద్దామింకా
మనదే కాదా చుక్కల ఆకాశం
మనతో రాదా రంగుల సంగీతం

బాగుంది కదా స్నేహం
ఆగింది కదా కాలం
ఇక నీది నాదొక
సరదా సరదా సామ్రాజ్యం
ఈడ అల్లరి అల్లరి
సందడి సందడి మన సొంతం

నువ్వో రెక్క… అరెరే నేనో రెక్క
రెక్కలు రెండు కలిపి చూద్దామింకా
మనదే కాదా చుక్కల ఆకాశం
మనతో రాదా రంగుల సంగీతం

బాగుంది కదా స్నేహం
ఆగింది కదా కాలం
ఇక నీది నాదొక
సరదా సరదా సామ్రాజ్యం
ఈడ అల్లరి అల్లరి
సందడి సందడి మన సొంతం

తరరా రరరా రారార
తరరా రరరా రార
తరరా రరరా రారార
తరరా రరరా రార

భయము లేదు ఇక్కడ భాధ లేదు
పుస్తకాల సంచీ బరువూ లేదు
కలత లేదు ఇక్కడ కొరత లేదు
రాత కూతలంటూ దిగులు లేదు

ఆడే ఆటకు హద్దే లేదు
పాడే పాటకు పొద్దే లేదు
ఏదో ఏదో కోరిక లేదు
ఏ చోట క్షణము తీరికలేదు

ఉన్నదంటూ ఒక్కటే నీతో
ఉన్నదంటూ ఒక్కటే ఉల్లాసం

బాగుంది కదా స్నేహం
ఆగింది కదా కాలం
ఇక నీది నాదొక
సరదా సరదా సామ్రాజ్యం
ఈడ అల్లరి అల్లరి
సందడి సందడి మన సొంతం



గొలుసుక‌ట్టు గోస‌లైపోయే పాట సాహిత్యం

 
చిత్రం: జయమ్మ పంచాయితి (2022)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం:  చారు హరిహరన్, ఎం.ఎం.కీరవాణి

క‌లిసి బ‌తికే కాల‌మే… మాయే నేడే
ప‌గటి వేళ పీడ క‌ల‌లాయే
అలిసిపోనీ ఆశలేమాయే అయ్యో
గొలుసుక‌ట్టు గోస‌లైపోయే
పొర‌పాట్లు కొన్ని… పంతాలతోని
మ‌రి ఎంత‌కీ… తేల‌దు పంచాయితీ

క‌లిసి బ‌తికే కాల‌మే… మాయే నేడే
ప‌గటి వేళ పీడ క‌ల‌లాయే

పుట్ట‌క‌తో పూజ‌కు త‌గ‌వ‌ని
కోవెల కొలువుకే గోలాయే
వ‌ల‌పులే దూర‌పు త‌ల‌పులై
ప్రేమకు తలుపులే మూసాయే

వెంటాడే మా భయ్యాలే దయ్యాలై
మంచీపైనే మన్నేసెలే
ఖర్మే కాలి పెద్దోళ్లు చెడ్డోల్లై
బంధీలైనారా..!
నారే నా ఆ ఆ ఆ ఓ ఓ ఓ
నారే నా ఆ ఆ ఆ ఓ ఓ ఓ

క‌లిసి బ‌తికే కాల‌మే… మాయే నేడే
ప‌గటి వేళ పీడ క‌ల‌లాయే

వెలుగునే చూడ‌ని క‌లుగులో
చీక‌టి బ‌తుకులై పోయేనే
తిరుగుతూ ఆశ‌ను వెతుకుతూ
ఏ దిశ కొస‌ల‌నే చేరేనో
ఇచ్చేశాక వ‌చ్చేదా చ‌చ్చేదా
క‌చ్చెలోలో గిచ్చేన‌మ్మ‌
సొమ్మూ రాక సొంతమ్మి కన‌రాక‌
సొమ్మాసిల్లేవా

క‌లిసి బ‌తికే కాల‌మే… మాయే నేడే
ప‌గటి వేళ పీడ క‌ల‌లాయే
అలిసిపోనీ ఆశలేమాయే అయ్యో
గొలుసుక‌ట్టు గోస‌లైపోయే
పొర‌పాట్లు కొన్ని… పంతాలతోని
మ‌రి ఎంత‌కీ… తేల‌దు పంచాయితీ

Palli Balakrishna Tuesday, February 1, 2022



చిత్రం: రాజనందిని (1958)
సంగీతం: టి.వి.రాజు 
నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీదేవి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య 
నిర్మాతలు: యం.రామకృష్ణారావు, మిద్దే జగన్నాధ రావు 
విడుదల తేది: 04.07.1958



Songs List:

Palli Balakrishna



చిత్రం: డబ్బుకు లోకం దాసోహం (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: యన్.టి.రామారావు, జమున
దర్శకత్వం: డి.యోగానంద్ 
నిర్మాత: యం.జగన్నాధరావు 
విడుదల తేది: 12.01.1973



Songs List:

Palli Balakrishna



చిత్రం: ఆప్త మిత్రులు (1963)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారి, కాంతారావు
నిర్మాత, దర్శకత్వం: కడారు నాగభూషణం
విడుదల తేది: 29.05.1963



Songs List:

Palli Balakrishna



చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, కృష్ణ కుమారి 
దర్శకత్వం: యన్.టి.రామారావు
నిర్మాత: యన్.త్రివిక్రమరావు
విడుదల తేది: 10.01.1969



Songs List:



ఎందుకీ తొందర పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు
గానం: పి. సుశీల, తిలకం 

ఎందుకీ తొందర 




ఇదేనా మన సంప్రదాయమిదేనా పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల

ఇదేనా మన సంప్రదాయమిదేనా




ఇల్లు వాకిలిరోసే ఇల్లాలు పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: 
గానం: మాధవపెద్ది సత్యం 

ఇల్లు వాకిలిరోసే ఇల్లాలు



మల్లిపూల పందిరిలోన చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జమునారాణి

మల్లిపూల పందిరిలోన చందమామ 




అడుగు అడుగులో పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

అడుగు అడుగులో మదమరాళములు తడబడి



గిలకల మంచం ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: కె. జమునారాణి, పిఠాపురం నాగేశ్వరరావు 

గిలకల మంచం ఉంది చిలకల పందిరి పొందు




పుట్టలోన నాగన్న లేచి పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల, జిక్కి

పుట్టలోన నాగన్న లేచి 



సై సై జోడెడ్ల బండి పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం, ఘంటసాల

సై సై జోడెడ్ల బండి 




ఎన్నాళ్ళకు నా నోము పండింది ఇన్నాళ్ళకు పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

ఎన్నాళ్ళకు నా నోము పండింది ఇన్నాళ్ళకు




మరదల మరదల తమ్ముని పెళ్ళామా పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల,  జిక్కి (పి.జి. కృష్ణవేణి)

మరదల మరదల తమ్ముని పెళ్ళామా ఏమమ్మా



ధరసింహాసనమై పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: 
గానం: మాధవపెద్ది సత్యం 

ధరసింహాసనమై




ఖగపతి అమృతము తీగ పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: 
గానం: మాధవపెద్ది సత్యం 

ఖగపతి అమృతము తీగ 




ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం 

ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఎప్పుడైన తప్పదన్నా



ఇదేనా మన సంప్రదాయమిదేనా (Female) పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

ఇదేనా మన సంప్రదాయమిదేనా



కట్టుకున్న ఆలి గయ్యాళి అయినచో పాట సాహిత్యం

 
చిత్రం: వరకట్నం (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: 
గానం: మాధవపెద్ది సత్యం 

కట్టుకున్న ఆలి గయ్యాళి అయినచో 


Palli Balakrishna Monday, January 31, 2022



చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
నటీనటులు: యన్.టి.రామారావు, రాజ సులోచన
దర్శకత్వం: బి.యన్.రెడ్డి 
నిర్మాత: బి.యన్.రెడ్డి  
విడుదల తేది: 24.02.1960



Songs List:



అంజలీదే జనని దేవి పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: బాలాంత్రపు రజినీకాంత్ రావు 
గానం: పి. లీల 

అంజలీదే జనని దేవి 



ఏడనున్నదో ఎక్కడున్నదో పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: పి. లీల 

ఏడనున్నదో ఎక్కడున్నదో నా చుక్కల రేడు



యేటివడ్డున మా వూరు పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: జిక్కి (పి.జి.కృష్ణవేణి)

యేటివడ్డున మా వూరు 




జయ జయ మనోజ మంగళ పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల 

జయ జయ మనోజ మంగళ 




నిను చూసి నీలి పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: బాలాంత్రపు రజినీకాంత్ రావు 
గానం: ఘంటసాల, పి. లీల 

నిను చూసి నీలి 



సడిసేయకో గాలి పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి. లీల 

ఊ..ఊ ఊ ఊ ఊఊ..ఊ ఊ ఊ ఊ

సడిసేయకో గాలి..సడి సేయబోకే
సడిసేయకో గాలి..సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిసేయకో గాలి..

రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహారాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే
సడిసేయకో గాలి..

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే..
నిదుర చెదరిందంటే నేనూరుకోను..

సడిసేయకో గాలి..

పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన బూని విసిరి పోరాదే..

సడిసేయకో గాలి..సడి సేయబోకే
సడిసేయకో గాలి..సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిసేయకో గాలి..

ఆ ఆఆఆఆ ఆఆ .. ఊ ఊఊఊ ఊ.. ఊ ఊ ఊ
 



తకిట తకిట ధిమి తబలా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల

తకిట తకిట ధిమి తబలా 



కాంత పైన ఆశ పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం, మల్లిక్ 

కాంత పైన ఆశ 



జింగన తింగన పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: బాలాంత్రపు రజినీకాంత్ రావు 
గానం: జిక్కి (పి.జి.కృష్ణవేణి)

జింగన తింగన




రారండోయ్ రారండోయ్ ద్రోహుల్లారా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం, మల్లిక్ 

రారండోయ్  రారండోయ్ ద్రోహుల్లారా



చూడచక్కని చుక్కల రేడు ఎక్కడున్నాడో (Bit) పాట సాహిత్యం

 
చిత్రం: రాజ మకుటం (1960)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల

చూడచక్కని చుక్కల రేడు ఎక్కడున్నాడో (Bit)

Palli Balakrishna



చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
నటీనటులు: యన్.టి.రామారావు, రాజశ్రీ 
దర్శకత్వం: బి.వి.శ్రీనివాస్ 
నిర్మాత: బి.విఠలాచార్య 
విడుదల తేది: 17.10.1969



Songs List:



లేడి కన్నులు పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

లేడి కన్నులు రమ్మంటే 
లేత వలపులు జుమ్మం 
ఓలమ్మీ .... ఓలమ్మీ సై.... 

కన్నె మనసే నీదైతే 
కలికి వెన్నెల తోడైతే 
ఓరబ్బీ .....ఓరబ్బీ పై

వాగులా గలగల ఉరికీ
తీగలా మెలికలు తిరిగి
గుండెలో అల్లుకుపోతే 
గువ్వలా గుసగుస పెడితే...
ఓలమ్మీ పై .... ఓలమ్మీ పై ...

వాలుగా చూపులు చూసే 
పూల బాసలు చేసి
ముదుగా ఉందామంటే
ఇద్దరం ఒక టేనంటే 
ఓరబ్బీ .... ఓరబ్బీ పై .....




సరి సరి మగసిరి పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: కొసరాజు 
గానం: గాయనీ గాయకులు బృందం 

సరిసరి మగసిరి నీ అందము 
మరిమరి మనసుకు ఆనందము 
చక ఝణత తక ధిమిత 
రా రా రతిరాజా !

చిలకల కులుకులు చూడు
జిల్ జిల్ జిల్ సొగవే జోడు
వినరా హే సుకుమారా ధీరా 
కౌగిట చేరగ రా ! రా! 
లల్లలా జురా....జుం....జుం ....

ముసిముసి నవ్వుల తీరు 
విసిరే చూపుల జోరు
భళిరా రాజకుమారా రా రా
చల్లని వేళయిదేరా





అలాంటి దాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల 

అలాంటిదాన్ని గౌనుః యిలాంటిదాన్ని గాను 
ఎలాంటిదాన్నో నేను నీకిపుడె తెలిసిపోను 
లబ్జలకిడి లబ్జలకిడి చక్కని చకెర చక్కని చక్కెరకేళి॥ 

ఒయ్యారం ఒలక చూసే చిన్నదానినోయ్
చూపులతో గాలమేయు సుందరాంగినోయ్ 
ఎవరనుకున్నావు నన్నెరుగవులే నీవు
అబ్జలకిడి.....

కమ్మంగా పాటపాడి కవ్విస్తానోయ్ 
గజ్జెకట్టి ఆటలాడి నవ్విస్తానో య్ 
ఎవరనుకున్నావు నన్నెరగవులే నీవు
అబ్జలకిడి.....




పిలిచింది అందాల పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల 

హాయ్ లల్లలా.... లల్లలా 
లల్లలా.... లల్లలా.. యే యిదిగో నిన్నే... 
నిన్నే నిన్నే ...

పిలిచింది అందాల బాల నిను
వలచింది మందార మాల
హాయ్ రాజ రాజ ఠారా! అందాలే అందుకోరా!!

జాబిలిలేని కలువను నేను
కౌగిలిలేని పరువము నేను 
కలలో నిన్నే కనుగొన్నాను 
హాయ్ రాజ... రాజ...

వేచెను నీకె ఈ మధుమాసం 
పూచెను వీకై నాదరహాసం
దాచితి నీకై ఈ అవకాశం
హాయ్ రాజ... రాజ...





ఎవరో నీవెవరో పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఓ ప్రియతమా.. రావేలా... చెలిని చేరగ ఈ వేళ!
ఎవరో... నీవెవరో ఎదలో పిలిచీ
ఎదురుగ నిలిచీ
తీయని ఊహల ఊయల లూపేవు 

చొక్కపు బంగరుమేను: పొగరెక్కిన 
సింగపు నడుము చుక్కల రాయని సోయగమ్ము నెక 
సక్కెములాడే మోము ::
ఏ గంధర్వ లోకాల ఉన్నావో ఏ 
నీలాల గగనాలు దిగినావో
శత వసంతముల ప్రతినిధివీవు 
ప్రతిలేని రతిరాజు ప్రతిరూపమే నీవు

చంద్ర ఖండములు చెక్కిళ్లు
ఇంద్ర నీలములు ముంగురులు 
అ పాలకడలి కెరటాల కరణి 
నాలోన పొంగినవి మరులు
నీ అధరాన చిరునవ్వు విరిసింది 
నా హృదయాన విరిజల్లు కురిసింది.
వనమయూరీవోలె తనువూగినది
ఒక చింత గిలిగింత ఉయ్యాలలూపింది 




రవ్వల నవ్వుల పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

రవ్వల నవ్వుల రాజకుమారీ 
నా నవజీవన నాట్యమయూరీః
అందెలు పలుకగ రావే: 
గంధము చిలుకగ రావే!

ఈ వేళలో! ఏమున్నదో 
పలెకెనులోన కల్యాణ వీణ
ఆ రాగ మంజరిలోనా అనురాగ మాధురి లేదా
రవ్వల నవ్వుల రాజకుమారా 
రాజకుమారీ మానసచోరా
నా అణువణువున నీవే: 
నా ప్రాణములన్నీ నీవే.....

నయనాలలో నడిరేలలో 
విరబూసె నాలో నీరూపమాల
ఆ రూప మాలిక నీకై
అందిచు కానుక కాదా ....




కాకి ముక్కుకు దొండపండు పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల 

అత్తరులో మునిగివున్న నవాబూ...ప్యారే నవాబ్ :.
మత్తుగా తూలుతున్న జనాబూ....హాయ్ జనాబ్ :
కలికి వలపే పూలచెండు: మగువ సొగసే దొండపండు।

కాకిముక్కుకు దొండపండు దండగః దండగః
అది రామచిలకకు దొరికితేనే పండగః పండగః
వరహాల మూటలకన్న వజ్రాల కోటలకన్న 
ఖరీదైనది ప్రేమించే దిల్ 
అది వుంటేనే అందుతుంది బుల్ బుల్ 
కడకన్నులతో వేటాడేవా... కను బొమ్మలతో ఆటాడేవా 
చిరునవ్వుల పువ్వుల దోసిలితో వెంటాడేవాః

కన్నెపిల్ల కనబడితే... 
గాజుల గలగల వినబడితే 
అంతలోనే మైమరిచేరు కడకు
అడియాసల పాలౌతారు:

దొరబాబుల తీరు అంతేలే 
నవ్వాబుల జోరు ఇంతేలే..... 
ఆ నాటికి నేటికి మిగిలింది ఈ వింతేలే...

Palli Balakrishna



చిత్రం: ఒకే ఒక జీవతం (2022)
సంగీతం: జోక్స్ బిజోయ్
నటీనటులు: శర్వానంద్, రీతువర్మ , అమల
దర్శకత్వం: శ్రీ కార్తీక్
నిర్మాత: S.R.ప్రభు, S. R. ప్రకాష్ బాబు
విడుదల తేది: 2022



Songs List:



అమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ఒకే ఒక జీవతం (2022)
సంగీతం: జోక్స్ బిజోయ్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: సిద్ శ్రీరాం

అమ్మా..! వినమ్మా.. నేనాటి నీ లాలి పదన్నే 
ఓ ఔనమ్మా.. నేనేమ్మా.. నువ్ ఏనాడో కనిపెంచిన స్వరాన్నే
మౌనమై ఇన్నాళ్లూ నిదరలోనే ఉన్నా..
గానమై ఈనాడే మేలుకున్నా..

నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మా
నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..
నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా....
అణువణువు నీ కొలువే అమ్మా..
ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా..

అమ్మా.. నే కొలిచే శారదవే
నను నిత్యం నడిపే సారధివే

బెదురుపోవాలంటే నువ్వు కనిపించాలి
నిదర రావాలంటే కథలు వినిపించాలి
ఆకలయ్యిందంటే నువ్వెతినిపించాలి
ప్రతి మెతుకు నా బతుకు అనిపించేలా..

నువ్వుంటేనే నేనూ నువ్వంటేనే నేనూ
అనుకోలేకపోతే ఏమైపోతాను
నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండక
తడబడి పడిపోనా చెప్పమ్మా

మరి మరి నునునువు మురిపెంగా చూస్తూ ఉంటే చాలమ్మా
పరిపరి విధముల గెలుపులుగా పైకెదుగుతు ఉంటానమ్మా..
అయినా సరే ఏనాటికీ ఉంటాను నీ పాపాయినై
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే

నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ.. (3)

నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా....
అణువణువు నీ కొలువే అమ్మా..
ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా.. 
అమ్మా.. నే కొలిచే శారదవే
నను నిత్యం నడిపే సారధివే

Palli Balakrishna



చిత్రం: మంగమ్మ శపథం (1965)
సంగీతం: టి.వి.రాజు 
నటీనటులు: యన్.టి.రామారావు, జమున
దర్శకత్వం: బి.విఠలాచార్య
నిర్మాత: డి.వి.ఎస్.రాజు 
విడుదల తేది: 06.03.1965



Songs List:

Palli Balakrishna



చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు 
నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: ఐ.యన్.మూర్తి 
నిర్మాత: చిలంకుర్తి విజయ సారధి 
విడుదల తేది: 11.01.1963



Songs List:



నా మనసంతా తీసుకో పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

నా మనసంతా తీసుకో
ఏమైనా నువు చేసుకో
రంగేళివై శృంగారములో
రాతిరి కలలో కలుసుకో
కనులతో మాటాడే జాణ
నా కొనచూపులే కోటిసరసాల నజరాన
తీయని కాసుక తీసుకువస్తే
ఎందుకు నీకు నిరాదరణ !
నవనవలాడే నా వయసంతా
చేశా నీకు బహూకరణ
మనసుగలవాడె నిజమైన మనిషి!
మమత ఫలియించుకే దిల్ రుషీ !
కమ్మని సొగసు కోరిన వలపు
కలిగించునులే కైపు!
నీవూ నేనూ, ఒకటువుతాము
నేడు కాదేని రేపు 



ముందు చూపుగా నే పోతుంటే పాట సాహిత్యం

 

చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

ముందు చూపుగా నే బోతుంట - హూమ్
ముందు చూపుగా నే బోతుంట
వెనక ఊపుగా సురొస్తుంటే!
అందరు గుసగుస లాడికిరో
సైరా నా రాజా !
కిల కిల నవ్వుల్ జూచి - నీ నడకల్ జూచీ
నీళ్ళ రేవుకడ పొంచుకేసుకొని నిలుచున్నావుగా

హుషారుతోటీ పచారుచేస్తూ ఉలికించావురా
మెల్లమెల్లగా కనుసైగలో కవ్వించావురా
తోచనివాళ్ళు ఎన్నో నిందలు వేశారురా

వెనకవాలుగా కళ్లుమూసి నను తెరిపించావురా
వెన్నెలలో సయ్యాటలాడి -బల్ వేధించావురా
తోడుతోడుగా జోడుగ షికారు రమ్మన్నావురా
పాడులోకమూ ఎందుకో ఓర్వలేదాయరా

అదేపనిగ నన్నల్లరి పెడితే ఫలితం లేదుర బావ
అదాటుగా మన మనసులు కలిసిన అందం ఉన్నది 
హాయిహాయిగా ఇద్దరి స్నేహం అల్లుకొనాలిరా
చేయీచేయీ గలిపితే లోకులు సిగ్గుపడా లేరా



జిగి జిగేలుమని పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి 

జిగి జిగేలుమని మన దొరసాని
సొగసెవ్వరికొరకోగాని వారెవా జోరు హై
పొరుగింటి పుల్లయ్యకోసం
ఈరోజున వేసితి వేషం. వారెవా జోరు హై 
ఇరిగింటెల్లమ్మలు ఇంతేలే పంతానికి కవ్వింతురులే
అనగూడదులే - మన కెందుకులే
మాటంటే చిటపట మందురులే వారెవా జోరు హై

మగవారి ప్రతాపం తెలుసు మా ఆడవారనిన అలుసు
ఇకిలింతురులే- సకిలింతురులే
తమ బడాయి జూపింతురులే వారెవా జోరుహై 
ఎంతయినా మేము మొగాళ్ళ
మా మూతిని ఉన్నది మీసం
జగమిటులైనా యుగమటులైనా
చెల్లునులే మా అధికారం వారెవా జోరు హై 



మబ్బుల చాటున పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

మబ్బులచాటున చంద్రునిలా
పొదమాటున దాగిన చినవాడా
ఎందుకు విందుకురావు
మన సెందుకు తీసుకోవు
ప్రేమించినవారికి భయమేల
మగవారికి ఇంతటి సిగ్గేల
ఎడబాయనిది కడుతీయనిది
మన ప్రేమను తెలుపగ రావేల

నీ హృదయములోని కోరికలు
నా జన్మదినానికి కానుకలు
వసివాడనివి - కుసుమించినవి
నా కురులన విరిసిన మాలికలు




కవ్వించేవే కవ్వించేవే పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: మాధవపెద్ది సత్యం , స్వర్ణలత 

కవ్వించేవే - కవ్వించేవే
కలువ రేకుల కన్నుల ధాన
కవ్విస్తే జవ్వనమంతా గంతేయునె చినదాన
నవ్వించేవు నవ్వించేవు
కొంటె నడకల కులాసకాడ
నవ్విస్తే నాజూకంతా నలిగినో వన్నెకాడ

చక్కని నీ రూపు ! ఒలికించు ఓరచూపు 
వన్నెల చిల్కు - వయ్యార మెలుకు
కాదని యనబోకు వాదమాడబోకు

ఎంతటి నగుబాటు - ఎవరైన విన్నలోటు 
వలపుమాటలు - చిలిపి చేష్టలు
అతియైతే చేటు - తగదీ అలవాటు

నీ వాడనుకాదా - నామీద ప్రేమలేదా 
కమ్మని రేయి - గుమ్మయిపోయి
కలుపు చేయి చేయీ కానరాని హాయి
సరసాలు దాచి పెట్టు తెలుసును నీ గుట్టు 

ఈ విరహాలు ఈ సరదాలు
ఇప్పటికి ఉన్నదింక రేపు




సన్నజాజి చెలిమి కోరి పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి 

సన్నజాజి చెలిమికోరి - చల్లగాలి వీచెను
ఆ చల్లగాలి సోకగానె - జాజిమనసు పూచెను
పడుచుదనము, గడుసుదనము - పరిమెళాలు చిందెనే 
ఆ పరిమెళాల సుమదళాలు పరవషమేచెందెనే

ఒకరినొకరు చేరగానె - ఊహలు చెల రేగెనే 
ఆ ఊహల ఉయ్యాలపైన హృదయాలె ఊగెనే

ఆకసాన మెరుపుతీగె - అరనిముషము వెలుగునే
నా కనులలోన కాంతివగుచు
కలకాలము వెలుగుమా




తోటకు వచ్చిందొక చెలియా పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: పి. బి. శ్రీనివాస్, జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

తోటకు వచ్చిందొక చెలియ - దాని
దోరవయసుపై పువ్వులు కోసిందొక చిలుక
నా మనసు
దాని నవ్వుముఖముపై నా మనసు

చెట్టుననెక్కే డొకకోతి - వాడి
చిలిపి చేష్ట పై నా మనసు
కొమ్మల నెక్కే డొకకోతి - వాడి
కోరమీసంపై నా మనసు
...   ....  .... (రాగం)

రావిచెట్టెక్కేవు - రాగాలు తీశావు
రాలిపోతవు రాలుగాయో - ఎంకయ్య
కూలిపోతవు రామ రామ

చిరునవ్వు నవ్వుతో - చేయివేస్తే చాలు
చింతలన్నీ మాయమౌతాయె చంద్రమ్మ
వంతలన్నీ మాయమైనాయె

ఒక్క మనసూతోన - చక్కగా మనముం
పైన సుక్కలు నవ్వుకోవా - ఎంకయ్య
కింద సుక్కలు నడిసిరావా

మాలోణ్ణి పెళ్లాడ మరియాద పోతాది 
మనవు మాటలు ఎత్తరాదె - చంద్రమ్మ
మారుమాటలు ఆడబోకె
మంచి మనసైతేను – మాలోడి మాటేల 
కుల మెన్నుకో లేదురో – ఎంకయ్య
గుణమునే చూశానురో

నీవు నేనూ కలిసి - నీటిలోపల కరిగి
ఏక మైపోదాములే - స్వర్గాన
ఇంపుగా ఉందాములే!

ఎటుచూచిన కురిసే - కన్నీ రే
వికసించిన కలలే - శిలలాయె 
నిర్భాగ్యము నీడగ వెంటాడె
నిట్టూర్పులు మదిలో  బరువాయె
కని పెంచిన హృదయము ఎడబాసి
కనుపించని బాధలు చెరువాయె

తోబుట్టినవాడు కనరాడె
మా త్రోవలు చీలెను - చిననాడె
కరుణించినవారికి శాపమునై
కడుచల్లని తల్లిని బాసితినే

ఈ లోకము కరుణామయమైనా
నా దోసిటనిండెను వేదనలే
ప్రేమించిన మదిలో – గాయాలా
పరమాత్మకు వేడుక కాబోలు




నృత్య రూపకం పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి 

నృత్య రూపకం 




ఎటు చూసినా పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగు పొరుగు  (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

ఎటు చూసినా 

Palli Balakrishna



చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారి
నిర్మాత, దర్శకత్వం: కె.హేమాంబరధర రావు 
విడుదల తేది: 14.03.1964



Songs List:



మంచి మనసు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: నార్ల చిరంజీవి 
గానం: యస్. జానకి 

మంచిమనసు తెలిపేదే స్నేహము,
మనిషి విలువ నిలిపేదే స్నేహము
మనసు మనసు కట్టుకున్న,
మరుమల్లెల వంతెనయే స్నేహము
మనిషిలోని మంచికే మారుపేరు స్నేహము

ఆపదలో ఆదుకొనీ ఆనందము పంచునులే స్నేహము
కలిమిలేమి అంతరాలు కానబోదు స్నేహము,
స్నేహమే, స్నేహము

మల్లెకన్న తెల్లని, జాబిల్లికన్న చల్లని
తేనెకన్న తీయని, ఏనాటికైన మాయనిదీ
స్నేహము



ఎందుకే ఎందుకే పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల, సరస్వతి 

ఎందుకే ఎందుకే ఎందుకే ఎందుకే
పొంగి పొంగి లేతవయసు ఛెంగుమన్న దెందుకే

కదిలే పిల్లగాలి కైపు రేపు నెందుకో
మల్లెల పరిమళాలు వత్తుగొలుపు నెందుకే
ఎందుకా ?
ఊఁ
ఎందుకో తెలుపనా ? ఇపుడే తెలుపనా ?

ఎదలో పడుచుదనం ఎదిగిపోయినందుకే
తెలిసెనా, తెలిసెనా, ఎందుకో తెలిసెనా ?
కమ్మని నిదురలో కలవరింత లెందుకే,
మెత్తని పాన్పుపై మేను నిలువదెందుకే ?
ఎందుకా ?
ఎందుకో తెలుపనా ? ఇపుడే తెలుపనా ?

చక్కని ఊహలకే రెక్కలొచ్చినందుకే
తెలిసెనా, తెలిసెనా, ఎందుకో తెలిసెనా ?
ఎన్నడు లేనిరీతి కన్నులదురు నెందుకే
వెన్నెలవానలోన వేడి కలుగునెందుకే ?
ఎందుకా?
ఎందుకో తెలుపనా ? ఇప్పుడే తెలుపనా ?

మనసే మెఱుపువోలె చెణుకులొలికి నందుకే
తెలిసెనా ? తెలిసెనా ? ఎందుకో తెలిసెనా ?




దొంగ చూపులు పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

దొంగ చూపులు చూచి, దోరవయసు దోచి
కొత్తవలపులు చిలికితివా, మత్తుకనులా చినదానా
దొంగచూపులు చూచి, దొరవయసు దోచి
మత్తుమందు చిలికితివా. మనసుపడినా చినవాడా

ముచ్ఛటైన కురులుదువ్వి, మొగలిరేకుల జడను వేసి
మోజుతీర ముస్తాబు చేసి, మోమాటపడ నేల
ఓ చిన్నదానా 

కోరమీసాల మెలేసి, కోటిసరసాల వలేసి
చిలిపిసైగల పిలిచావు కానీ చెప్పేటి కబురేమి
ఓ చిన్నవాడా 

హంసలాగ నడచిరాగా అందమంతా పొంగిపోగా
కోయిలల్లే గొంతెత్తిపాడ, గుండెల్లొ గిలిగింతలయ్యేను
పిల్లా

పూలతావుల చేరదీసి, గాలితీగల ఓడగట్టి
మబ్బుదారుల కేరింతలాడీ మైమరచిపోదాము
ఓ చిన్నవాడా




భలేగా నవ్వితివి పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల

బలేగా నవ్వితివి, ఎలాగో చూచితివి, చెలాకీ చూపితివి
మత్తుగా, మెత్తగా మనసు దువ్వితివి

మధువును చిలికే నీ చూపే, మరలెను మెల్లగ నా వైపే
బంగరు వలపులు, రంగుల తలుపులు
తొంగి తొంగి చూచే

గాలికి నీ కురులూగినవి, నాలో వూహలు రేగినవీ
ఱువ్వున నీ నడుమాడినదీ, ఝుమ్మని నామది పాడినదీ
గువ్వల పోలిక కోరికలేవో కువ కువ లాడినవీ

కన్నుల బాసలు విన్నాను, ఎన్నడో నిను కనుగొన్నాను
అందము నాదనుకున్నాను, అందుకె నిను రమ్మన్నాను
డెందములోపల ఎందుకొ తీరని తొందర కలిగేనూ




ఏమిటో ఈ విపరీతం పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల

ఏమిటో యీ విపరీతం, విధి కెందుకు నా పై కోపం
తలచేడొకటి జరిగే దొకటి, ఎవరికి ఎవరో ఏమొ
ఆశించుటయే నేరమో ఏమో 
వెతలే మిగిలిన వేమో

ప్రేమగాధలే విషాద కధలా, లోకముతీరు ఇదియేనా
చిరునగవునకూ చోటే లేదా ?
చివరకు ఫలితమిదేనా

జీవితమా యిది కలయా, నిజమా,
చెదరని చీకటి మయమా
ఆరని వెలుగుల ఆశాజ్యోతిని,
ఏనాటికైనా కనలేమా



విరిసిన పూవును పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

విరిసిన పూవునునేనూ, వెన్నెలతీవనునేనూ
మిసమిసలాడే పసిడి యౌవనపు విసురుసైపలేను

ఇన్ని దినాలుగ ఎదలో దాగిన,
కమ్మని ఊహలు కనవేలా
మౌనముగా నామదిలో సాగిన
మంజులగానము వినవేలా

తొలకరి వలపుల చెలినే కాదని
కలలూ కలతలూ నీకేలా
వెన్నెలపందిరి వెచ్చని కౌగలి
రమ్మని పిలువగ రావేలా




నీ సొగసే పాట సాహిత్యం

 
చిత్రం: కలవారి కోడలు  (1964)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు 

నీ సొగసే లాగుతున్నది, నిను చూస్తూవుంటే
నా మనసే వూగుతున్నదీ
ఓ వలపుల జిలిబిలి వయారి హంసా,
నీ సొగసే లాగుతున్నదీ
నీ నడకజూడ నడకందముజూడ,
నడకకుతగ్గ నాధుడు ఎవరే?
నాకన్నా నాధుడు ఎవరే ?

ఓ వలపుల జిలిబిలి వయారి హంసా
నా వరాల హంసా నీ సొగసే లాగుతున్నదీ
కాశీపట్నం చూపిస్తా, గంగాస్నానం చేయిస్తా
గోవిందా, గోవిందా, కొంగుపట్టుకుని గోవిందాయని
ఏడుకొండలూ ఎక్కేస్తా,
చంద్రమండలు చెక్కేస్తా

కొండలు పిండిగ కొడతానే,
ఆ పిండితో మేడలు కడతానే
మేడలో నిన్ను కూర్చో బెట్టి, ఊయలగట్టి ఊగిస్తానే
ఉయ్యాలో, జంపాలో

నీకోసం నే పాడతా, నీకంటే బాగా పాడతా
మరి చెప్పలేదేం ?
ఇప్పుడు చెప్పానుగా !
సానిస దనిపా మసగా మాపాదనిసా దనిసరి సనిదపగని
సానీసా, దనిసరి, ససనిప, పమగరి, సనిపమ, మమగగ
దిదినని సానిసా

మామా, మా మామా - మా మామ నూటికి సర్దార్
అత్తా మా అత్తా - మా అత్తంటేనే కబడ్డార్
ఇక కట్టి పెట్టవోయ్ నీ జోరూ
ఇక మూసి పెట్టవోయ్ నీ నోరూ.
డో. చి.
వి. వి. మో.

Palli Balakrishna



చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
నటీనటులు: యన్.టి.రామారావు, బి.సరోజాదేవి
నిర్మాత, దర్శకత్వం: కె.వి.రెడ్డి 
విడుదల తేది: 13.09.1968



Songs List:



నీతోని వేగలేను పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

నీ తోటి వేగలేను పోపోరా
నీ ప్రేమ మానలేను రారారా
చేరగా దీసి మాలిమీ చేసి
జారి పోయేవురా ॥
ఎన్నెన్నొ మోహాలు చూపించేవు
ఎన్నైనా దాహాలు కలిగించేవు
కానీ లాలించగా పోనీ తేలించగా
కోరవు చేరవు ॥

ఎన్నెన్నొ చిందులు వేయించేవు
ఎన్నైనా విందులు గావించేవు
కానీ సయ్యాటకు పోనీ కై లాటకు
చిక్కవు దక్కవు ॥




వాన కాదు వాన కాదు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: పి. సుశీల 

వానకాదు వానకాదు వరదరాజా
పూలవాన కురియాలి వరదరాజా ॥

వనమునేలు బాలరాణి ఎవరో అంటూ
నగరినేలు బాలరాజు చేరరాగా
కోకిలమ్మ పాటపాడ నెమిలిపిట్ట ఆటలాడ
సందడించి నా గుండె ఝల్లు ఝల్లు ఝల్లు మనగ ॥

కొండలోన కోనలోన తిరిగే వేళ
అండదండనీకు నేనే ఉండాలంటూ
పండువంటి చిన్నవాడు నిండుగుండె వన్నెకాడు.
చేరరాగ కాలియందె ఘల్లు ఘల్లు ఘల్లు మనగ ॥

కొండపైన నల్లమబ్బు పందిరికాగా
కోనలోన మెరుపుతీగె తోరణకాగా
మల్లెపూల తేరుపైన పెళ్ళికొడుకు రాగానే
వాని చూచి నామనసు వలె వలె వలె యనగ ..




నీవులేక నిముషమైన పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఘంటసాల, పి. సుశీల 

నీవులేక నిముసమైన నిలువజాలనే
నీవేకాదా ప్రేమ నాలో విరియచేసినది ॥
లోకమంతా నీవుగానే నాకు తోచెనుగా
మరువరాని మమతలేవో మదిని పూసెనుగా ॥
ఒకరికోసం ఒకరమనిన ఊహ తెలిసెనుగా
వీడిపోని నీడవోలె కూడి ఉందుముగా ॥




కుండకాదు కుండకాదు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఘంటసాల

కుండకాదు కుండకాదు చిన్నదానా
నా గుండెలదర గొటినావే చిన్నదానా ॥

పరుగిడితే అందాలన్నీ ఒలికిపోయెనే
తిరిగిచూడ కన్నులలోన మెరుపు మెరిసెనే
ఒలికిన అందాలతో మెరిసిన నీ చూపులతో
ఎంత కలచినావో నన్ను ఎరుగవే తివే - ఓ హో హో ||

మొదటి చూపులోనే మనసు దోచుకుంటివే
ఎదుటపడిన నీ వలపు దాచుకొంటివే
దోచుకున్న నా మనసు దాచుకున్న నీ వలపు
అల్లిబిల్లి అయినాగానీ తెలియవైతివే ఓ హో హో ||

నన్ను చూచు కోరికతోనే వచ్చినావుగా
నిన్ను చూచు ఆశతోనే వేచినానుగా
పచ్చినట్టి నీ నెపము వేచినట్టి నా తపము
ఫలమునిలుపు కొందమన్న నిలువపై తివే - ఓ హో హో |



ఆశ నిరాశను చేస్తివిరా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఘంటసాల

ఆశనిరాశను చేసితివా
రావా చెలియా రాలేవా
రావా చెలియా రాలేవా ॥
తోడుగనడిచేవనీ - నా నీడగనిలచేవనీ
జీవితమే ఒక స్వర్గముగా - ఇక చేసెదవని నే తలచితినే 
ప్రాణము నీవేయనీ - నా రాణివి నీవేయనీ
రాగముతో అనురాగముతో - నను ఏలెదవని నేనమ్మితినే 



రాజ కుమారి పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత 

రాజకుమారి బల్ సుకుమారి
నీసరి ఏరిధరన్
రాజకుమార బిరబిరా
నాసరి నీవెధరన్

సుందరమగునీ వదనము ముందర
చందురుడెందుకే బాలికా
పొందుగ పొగడిన నామదిపొంగి
చిందులు వేసెను బాలకా 
ఛెళుకున నీవొక కులుకు కులికితే
ఖలుకనె గుండెలు మోహినీ

ఏలా బెదరగ కొంచముగానే
కులికెదలేరా మోహనా ॥
బంగారముతో సింగారముకని
కంగారాయెనే సుందరీ
దొంగవుకావుగ కంగారెందుకు
చెంగున రారా సుందరా
తళుకు బెళుకులా చిలుకలకొలికివి
కళయన నీదే భామరో
నాలో అందము నీకే తెలిసెను
తెలివననీదే బావరో ॥
ఏమీ ? జడయా ?- పామేమోయని
నా మది బెదరెను కాంతరో
పాము మంత్రములు మా మామకు తెలియును
ఏమీ బెదరకు కౌంతుడా
నిన్నుచూచి నీ తీరునుచూచి
ఏమనవలెనో నాయికా
రాణి రాణీ నా రాణీయని
నను వెంటాడుము నాయకా




మనస్వామి నామం పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం 

మనస్వామి నామం పాడండీ
మనస్వామి రూపం చూడండీ ||
మనస్వామి భజనే చేయండీ
మనస్వామి మహిమే తెలియండీ
మానవ మాత్రుడు కాడండీ
మనస్వామి సాక్షాతు హరుడండీ ॥

వేదాలు మనకింక వద్దండీ 
అర్ధాలు తెలియక బెడదండీ
మనస్వామి మాటే మాటండీ
పరమపదానికి బాటండీ ॥

ఆషాడభూతి :
హరి : హారిలోరంగహారి హారిలో రంగహారి హారిలోరంగహారి
వాడు వీడూ ఎవడేకానీ
చూడ నీకడ మేడాలోన
చూడ చక్కని చిన్నదాని
కూడి మాడిన గురుస్వామండీ ॥

మనస్వామి నామం పాడండీ
మనస్వామి రూపం చూడండీ
మనస్వామి నామం - మనస్వామి రూపం
నామం రూపం - నామం రూపం
రహితం రహితం ||





తాళలేని తాపమై పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: పి. సుశీల 

తాళలేని తాపమాయె సామీ నా సామీ
వొళ్ళు కంపరమెత్తిపోయె సామీ నా సామీ 
సింగార రూపము కనగా - నీ రంగు హంగులు వినగా
మది చెదరే - యెద అదిరే అబ్బబ్బా
అబ్బబ్బ నా తల తిరిగెనురా ॥

చాటైన మారుని శరము - గాటైనగాయముశాయ
అసువులకే మోసముగా అబ్బబ్బా -
అబ్బబ్బ నిన్నిక విడువనురా



ఈవికి ఠీవికి ఎనలేని ఇంద్రుడు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఘంటసాల

ఈవికి ఠీవికి ఎనలేని ఇంద్రుడు
ఇతడు కాకున్నచో ఎవడు వీడు
కంఠాన గరళమ్ము కానరాని శివుండు
ఇతడు కాకున్నచో ఎవడు వీడు
తలకొక్క తెలివిగా వెలిగేటి శేషుడె
ఇతడు కాకున్నచో ఎవడు వీడు
ఇంతవాడంతయె ఎదిగిన హనుమంతు
డితడు కాకున్నచో ఎవడు వీడు
వాడె వీడని ఎలరు గోడు సేయ
వజ్ర, శివుడును, శేషుడు, వటుకపియును
వీడె వీడని చాటింప వెడలినాడ
వాసి కనువాడ నినుగొల్చి ఓసుతండ్రీ ॥



అవతారమెత్తినావ స్వామిరాజా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: 
గానం: మాధవపెద్ది సత్యం 

భజన

అవతారమెత్తినావ స్వామిరాజా
మమ్మాదరింప వచ్చినావ స్వామిరాజా ॥

ఆడమగ బేధాలు స్వామిరాజా నీకు
అంటనే అంటవయ్యా స్వామిరాజా
అందరికీ చిక్కబోదు స్వామిరాజా నీది
ఆనంద యోగమయ్య స్వామిరాజా ॥

ముక్తి కాంతలో నీవు స్వామిరాజా ఎన్నో
ముచ్చటలు సేతువట స్వామిరాజా
ఎంత వేదాంతులకు స్వామిరాజా - సుంత
అంతుదొరకని తంతునీది స్వామిరాజా ॥

అందరొకే జాతైన స్వామిరాజా - అదే
చిదానంద మన్నావు స్వామిరాజా
అందరినీ అందలాలు స్వామిరాజా - నీవు
ఎక్కించ పుట్టినావు స్వామిరాజా ॥

Palli Balakrishna
Pokiri (2006) Telugu Songs Lyrics Album Cover

Pokiri (2006) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Director : Puri Jagannadh
Actors : Mahesh Babu
Actresses : Ileana D'Cruz
Supporting Cast : Prakash Raj
Release Date : 28 April 2006

Devuda Song Lyrics in Telugu – Pokiri (2006)

'Devuda' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Naveen Madhav.

SONG INFORMATION
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Lyricist : Bhaskarabhatla
Singers : Naveen Madhav
చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: ఎన్.ఎస్.నవీన్ మాధవ్ నొప్పి నొప్పి గుండెంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తదే పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకే లాగేస్తదే అసలేమయిందో తెలియకుందిరో బాబోయ్ రాతిరంతా కునుకు లేదు ఏమెట్టి కన్నారురో... అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4) అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో చిచ్చు పెట్టీ చంపుతోంది... అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4) కొంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే ముగ్గులో దించకే మూతలా పెట్టమాకే ఓరగా చూడకే జలగలా పట్టుకోకే బతకనీ నన్నిలా ఇరుకులో పెట్టమాకే దేవుడా... నా మతి చెడిపోయెను పూర్తిగా అయినా... బాగుంది హాయిగా రాతిరంతా కునుకులేదు ఏదోటి చెయ్యాలిరో అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4) మెషిన్ లోన పెట్టి నన్ను పిండుతున్నాదిరో కొట్టి కొట్టి దంచుతోంది... ఏమిటీ కలవరం ఎన్నడూ చూడలేదే దీనినే ప్రేమనీ ఎవ్వరూ చెప్పలేదే యేటిలో మునిగినా ఎక్కడో తేలుతారే ప్రేమలో మునిగితే తేలడం వీలుకాదే దేవుడా...ఈ తెలియని తికమక దేనికో అరెెరే... ఈ తడబాటేమిటో రాతిరంతా కునుకులేదు ఫుల్లోటి కొట్టాలిరో అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4) ఒళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నాదిరో లోపలేదో జరుగుతోంది... అ దేవ దేవ దేవ దేవ దేవ దేవుడా (4)

Dole Dole Song Lyrics in Telugu – Pokiri (2006)

'Dole Dole' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Suchitra and Ranjith.

SONG INFORMATION
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Lyricist : Viswa
Singers : Suchitra, Ranjith
చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: విశ్వ గానం: రంజిత్, సుచిత్ర డోలె డోలె దిల్ జర జరా నిను ఓర ఓర గని నరవరా జాగు మాని చెయ్ కలపరా జత చేరి నేడు జతి జరుపరా జర జల్ది జల్ది పెందలకడనే రా రా ఒడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా పొదుగుతూ కుదురుగా నీలోన ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా దిల్ బర్ దేఖో నా మిస మిస కన్నె కొసరకు వన్నె వలపులతో వలపన్నీ నకసికలన్నీ నలుగును కొన్నే కలబడు సమయాన్ని ఒడికి త్వరగా యా... బరిలో కరగా యా... ఒడికి త్వరగా యా... బరిలో కరగా చిటుకిని విప్పేస్తా చెమటని రప్పిస్తా తళుకుతో తెగబడి నీపైన చటుకున చుంబిస్తా చనువుగా బందిస్తా సుందర దీవానా తొలితెరలన్నీ గడుసరి కన్నె తొలగును తమకాన్ని కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని తరలి దరికే యా... ఎగసి ఎదకే యా... తరలి దరకే యా... ఎగసి ఎదకే జర జల్ది జల్ది పెందలకడనే రా రా ఒడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడా కసి కోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడ నిశికేళి వేళ జత చోరా చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన చలేగ చలేగ యెహ్ హై ఇష్క జమాన కరేగ కరేగ హర్ దిల్ కో దీవాన

Gala Gala Song Lyrics in Telugu – Pokiri (2006)

'Gala Gala' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Nihal.

SONG INFORMATION
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Lyricist : Kandikonda
Singers : Nihal
చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కందికొండ గానం: నిహాల్ గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా వయ్యారి వానలా వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన ఊ...ఓ...ఈ అల్లరి, ఊ...ఓ... ఊ...ఓ...బాగున్నది, ఊ...ఓ... గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా చామంతి రూపమా తాళలేవుమా రాకుమా ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా హిందోళరాగమా మేళతాళమా గీతమా కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా ఊ...ఓ...ఈ లాహిరి, ఊ...ఓ... ఊ...ఓ...నీ ప్రేమది, ఊ...ఓ... గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా

Ippatikinka Song Lyrics in Telugu – Pokiri (2006)

'Ippatikinka' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Suchitra and Khushi Murali.

SONG INFORMATION
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Lyricist : Bhaskarabhatla
చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: మురళి, సుచిత్ర ఆ...అ...ఆ... నా మాటే వింటారా ఆ...అ...ఆ... నే నడిగిందిస్తారా ఆ...అ...ఆ... నా మాటే వింటారా ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే నా కెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే ఈడు ఝుమ్మంది తోడెవ్వరే... జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం మురుగా ఈ ఊరొచ్చాలే ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యాలే డాలర్సుతో డైలీ నాకు పూజలు చెయ్యాలే బంగారమే కరిగించీ ఇల్లంతా పరచాలే వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి ఆ చందమామ తేవాలి ఆ వైటు హౌసు కావాలి టైటానిక్కు గిఫ్టివ్వాలి... జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే జాసేజా నిన్ను చూస్తే సడన్ గా దడ పుడతా ఉంది జాసేజా ఇంతకాలం ఇలాంటి ఆశలు విన్లేదే పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలే చురకత్తిలో పదునంతా తనలో ఉండాలే ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలి తలంటి నీవు రుద్దాలె నైటంత కాళ్ళు పట్టాలి నిదురోతుంటే జోకొట్టాలే... జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే జాసేజా ఆగు తల్లే రంభలా ఫోజే కొట్టకులే జాసేజా ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే

Jagadame Song Lyrics in Telugu – Pokiri (2006)

'Jagadame' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Kunal Ganjawala.

SONG INFORMATION
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Lyricist : Kandikonda
Singers : Kunal Ganjawala
చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కందికొండ గానం: కునాల్ జగడమే... జగడమే... నా కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కవ్విస్తే సమరమే... సమరమే... నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగివస్తున్నా ఆకాశమే తెగి పడుతున్నా బిన్లాడిన్ ఎదుటే నిలుచున్నా ఎక్కడైన నా తీరింతే ఏ సెంటరైనా నా స్పీడింతే హే టైము చెప్పు వస్తానంతే జగడమే... నువ్వో నేనో మిగలాలంటే ఇక వాడి వేడి చూపాలంటే వైలెన్స్ జరగాలంతే జగడమే... నా ఊహకు వాయువు వేగం నా చూపుకు సూర్యుడు తాపం నా చేతికి సాగర వాటం నే సాగితే తప్పదు రణరంగం బోలో బోలో గణపతి బప్పా బోలియ (4) ఎప్పుడైనా నా రూటింతే ఈ రాంగు రూటు నా స్టైలంతే హే నచ్చకుంటే నీ కర్మంతే జగడమే... ఏయ్ రాజీ గీజీ పడలేనంతే మరి చావోరేవో తేలాలంతే గళ్ళ పట్టి కొడతానంతే జగడమే... నే పాడితే అల్లరి రాగం నే ఆడితే చిల్లర తాళం నా దారికి లేదొక గమ్యం నా వరసే నిప్పుతో చెలగాటం

Choododdantunna Song Lyrics in Telugu – Pokiri (2006)

'Choododdantunna' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Karthik and Mahalakshmi Iyer.

SONG INFORMATION
Movie : Pokiri (2006)
Music : Mani Sharma
Lyricist : Bhaskarabhatla
చిత్రం: పోకిరి (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: కార్తీక్, మహాలక్ష్మి అయ్యర్ చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా వచ్చేయ్నా వచ్చేయ్నా మోమాటమింక మనకేల వచ్చేయ్నా వచ్చేయ్నా ఆరాటమేదో కలిగేలా వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా... సడియో సడియో సడియో నేనే వస్తానుగా సడియో సడియో సడియో నీతో ఉంటానుగా సడియో సడియో సడియో నువ్వే కావాలిగా సడియో సడియో సడియో నాకే ఇల్లాలిగా చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా నువ్వు నేను ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా కాసేపైనా కనబడకుంటే కలవపడుతుంటా పక్కన నువ్వే ఉన్నావనుకుని పొరబడి పోతుంటా నిద్దరలోన తలగడకెన్నో ముద్దులు పెడుతుంటా ఎదురుగ్గా ఎవరున్నా ఎద నిండా నువ్వంటా ఎవ్రీ డే ఓసారైనా కన్ఫ్యూజ్ అవుతుంటా చుట్టూరా ఎందరు ఉన్నా ఒంటరినవుతుంటా నువులేని లైఫే బోరని ఫీలైపోతుంటా వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా... సడియో సడియో సడియో నేనే వస్తానుగా ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా సడియో సడియో సడియో నువ్వే రావాలిగా గడియో గడియో గడియో నేనే తీస్తానుగా ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదేననుకుంటా చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా నీ వెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా నీ చేతుల్లో బందీనయ్యే భాగ్యం ఇమ్మంటా నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంటా నీ కోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంటా నీ కన్నా విలువైంది నాకేదీ లేదంటా నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా వచ్చేయ్వా వచ్చేయ్వా బొట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేయ్వా వచ్చేయ్వా వచ్చేయ్వా... హా సడియో సడియో సడియో నేనే వస్తానుగా ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా సడియో సడియో సడియో నువ్వే రావాలిగా గడియో గడియో గడియో నేనే తీస్తానుగా చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం నీ కౌగిళ్ళే నా ఇల్లనుకుంటా

Palli Balakrishna Tuesday, January 25, 2022

Most Recent

Default