-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sindhu Menon"



చిత్రం: వైశాలి (2011)
సంగీతం: ఎస్.థమన్
నటీనటులు: ఆది పినిశెట్టి, సిందూ మీనన్, శరన్య మోహన్ 
దర్శకత్వం: అరివళగన్ 
నిర్మాత: యస్. శంకర్ 
విడుదల తేది: 27.05.2011



Songs List:



కురిసే కురిసే పాట సాహిత్యం

 
చిత్రం: వైశాలి (2011)
సంగీతం: ఎస్.థమన్
సాహిత్యం: కృష్ణచైతన్య
గానం: రంజిత్

కురిసే కురిసే



కురివిప్పిన నెమలి అందము పాట సాహిత్యం

 
చిత్రం: వైశాలి (2011)
సంగీతం: ఎస్.థమన్
సాహిత్యం: కృష్ణచైతన్య
గానం: సుచిత్ర , ఎస్.తమన్

పల్లవి:
కురివిప్పిన నెమలి అందము
కురిసిన ఆ చినుకు అందము
కలగలిపిన క్షణము అందము
ఈ దారం ఆధారం అయ్యిందో ఏమో
తొలి తొలి పరవశం ఇది
అడుగడుగున తేలుతున్నది
తడబడి పొడిమాటలే మది
అచ్చుల్లో హల్లుల్లో నన్నే జోకొట్టింది
ఓ మాయా అమ్మాయా...
నువ్వే లేక లేనులే మాయా

చరణం : 1
వెలిగే దీపం సిందూరమే
మెడలో హారం మందారమే
ఎదనే తడిమెను నీ గానమే
పరువం పదిలం అననే అనను
వీచే గాలి ప్రేమే కదా
శ్వాసై గాలై చేరిందిగా
ఎదకే అదుపే తప్పిందిగా
మైకం మైకం ఏదో మైకం
మైకం మైకం మైకం మైకం

చరణం : 2
నాతో నాకే ఓ పరిచయం
మునుపే లేదే ఈ అవసరం
మాయే చేసింది ఒక్కో క్షణం
జగమే సగమై కరిగెనేమో
హృదయం ఉదయం నీ చూపుతో
కరిగే కోపం నీ నవ్వుతో
విరిసెను వలపే ఈ వేళలో




జల్లే పాట సాహిత్యం

 
చిత్రం: వైశాలి (2011)
సంగీతం: ఎస్.థమన్
సాహిత్యం: కృష్ణచైతన్య
గానం: రంజిత్

జల్లే 




Vaishali - Theme Music పాట సాహిత్యం

 
Vaishali - Theme Music

Palli Balakrishna Tuesday, November 28, 2023


చిత్రం: శ్రీరామ చంద్రులు (2003)
సంగీతం: ఘంటాడి కృష్ణ
సాహిత్యం: మద్దెల శివకుమార్
గానం: కుమార్ సాను, శ్రీదేవి
నటీనటులు: రాజేంద్రప్రసాద్ , శివాజి, బ్రహ్మానందం, రాశి, సింధు మీనన్, కోవై సరళ
దర్శకత్వం: ఐ. శ్రీకాంత్
నిర్మాత: డి.అనిల్ కుమార్
విడుదల తేది: 07.11.2003

సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా
సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా
వెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమా
వెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమా
నా గుండె వేగానివే ఓ ప్రేమ గీతానివే

ఓ ఓ సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా ఓ ఓ

దిక్కులు చూసే వేళా నువు పక్కకు చేరేవేళ
చెయ్యాలి పువ్వుల మేళా గోపాలా
చుక్కలు కాసే వేళా సిరిమల్లెలు పూచే వేళా
నును సిగ్గులు మొగ్గలు ఏలా ఓ జవరాలా

వెదురులో వేణువుంటుందని తెలుసు లోకానికి
నా గుండెలో నువ్వు ఉన్నావని తెలపాలి నీ మనసుకే
నీ తోడు కోరుకుంటున్నా నీడల్లే చేరుకుంటున్నా
మన్నించి నా మాటని అందించు నీ ప్రేమని
మన్నించి నా మాటని అందించు నీ ప్రేమని

ఓ ఓ సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా ఓ ఓ

కుదురన్నదే లేదు నా మనసుకి పగలంత నీ ధ్యాసలో
ఓ కునుకన్నదే రాదు నా కంటికి రేయంత నీ ఊహలో
అందాల రామ చిలకమ్మా కాసింత జాలి చూపమ్మా
పరిచాను ఎద కాగితం కావాలి నీ సంతకం
పరిచాను ఎద కాగితం కావాలి నీ సంతకం

ఓ ఓ సొగసరి జాణ గడసరి మైనా
నిను చూశాక నా మధిలోన తికమక పడిపోనా
వెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమా
వెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమా
నా గుండె వేగానివే ఓ ప్రేమ గీతానివే ఓ ఓ

Palli Balakrishna Saturday, October 21, 2017


చిత్రం: రెయిన్బో (2008)
సంగీతం: నిహాల్
సాహిత్యం: వనమాలి
గానం: నిహాల్, సునీత
నటీనటులు: రాహుల్ , సోనాల్ చౌహన్, సింధు మీనన్
దర్శకత్వం & నిర్మాత: వియన్.ఆదిత్యా
విడుదల తేది: 02.10.2008

మనసా చలించకే ఇకనైనా
క్షమించదే వేదనా
మమతే గతించెనా తనలోనా
జ్వలించకే నిలువునా

నీలో ప్రతి రంగు తన ముందే తలొంచినా
ముంచే ప్రతి అంచూ తన రూపం స్మరించినా

కల నిజమయే క్షణం కనులే వాలనీ
అడిగే వరానికే బదులే చేదెలా
వలపు తరిమినా వలలు విసిరినా దిశను మరిచి నది నడిచేనా
దరిని తడిమినా అలలు కడలివని తెలిసెను నీవలనా

కురిసే క్షణాలలో చినుకైనా వెలేయదా నింగిని
తడిసే వనాలలో తనులేకా కలే కదా ఆమని
సాగే నది ఇలనే ఎపుడైనా వెలేసెనా
దాటే నిశి లోనా నీడైనా వెన్నంటునా


********  ********  **********


చిత్రం: రెయిన్బో (2008)
సంగీతం: నిహాల్
సాహిత్యం: వనమాలి
గానం: నిహాల్, సునీత

ఓఓ లలనా మతి పొయినా నీ వలనా
ఓఓ లలనా మతి పొయినా నీ వలనా
ఔనౌనా అంత క్యూట్ గా హ హ ఉన్నానా

జబిలి ముక్కని తెప్పించి
జన్నీఫరల్లే  చెక్కించి
ఎదురుగ నిలిపిన బొమ్మవి నువ్వె దెఖొ న

బొలెడు గొప్పలు వల్లించి
లవ్ లొ దించె లాలుచి
మానక పొతె ఐపొతవొఇ దివాన
డిస్కవర్ ఛానల్  కైనా దొరకని
సౌందర్యం నీదేనే సౌధమిని

పికాసో చిత్రం కూడ వేస్ట్ అని
ఫీల్ అవ్వకోయి నీదె గొప్ప టేస్ట్  అని

నిన్ను చుసి తారలంత నెర్చుకోరా ఫాషన్
ఈ కొంచ మైన కొతలాపి నెర్చుకొ మార్చుకొనీ భాషని

కాస్తైనా కరుణించవా హ హ..
ఓ మైనా.....

నమ్మెల అనిపించని కొంతైనా....


వెలం లొ పెడితె నీ చిరునవ్వులు
వెలల్లొ పోటి పడర యువకులు

ఆ వరాలెవరొ తెలిపె సెర్చ్ లొ
నిన్ను మాత్రం చుపిస్తుందొయి గూగుల్

మోనాలిస  మోము లొనీ
నవ్వుకె ను మోడలా ఆ??

మొసి మొసి మాయ చెసి
మొసపుచె మాకల..

ఇక నైన ప్రెమించవా...... ఊఊ మగువా
హ్మ్మ్.. నచ్చిందొఇ నన్ను ఒడించె నీ తెగువా...

అంటె?
అర్ధం కాలేద? ఇడియట్!!
తిట్టావ?
హబ్బా నె చేతిలో ఒడిపొయ నన్నరా...!! :ఫ్
అంతె??
నువ్వు నన్ను గెలిచవన్నన్ర బాబూఉ
హ్మ్మ్ అంటె ఎంటి?!!
i love u అన్ననురా బుద్దూఊఊఉ...
హా?
హూఉ హూహూఊ


********  ********  **********


చిత్రం: రెయిన్బో (2008)
సంగీతం: నిహాల్
సాహిత్యం: వనమాలి
గానం: సునీత, హేమచంద్ర, నిహాల్

చల్లు చల్లు చల్లు
రంగులన్ని చల్లు
ఝల్లు ఝల్లు మంది
నింగి వాన విల్లు

పూల ఒంటి రంగు
నవ్వు మీద చల్లు
గువ్వ రెక్క రంగు
గుండె మీద చల్లు

అంగరంగ సంబరంగ రంగవల్లు లొచ్చి
ముంగిలంత రంగులన్ని రంగరించి చల్లు

బుంగ మూతి బెంగలన్ని గంగలొన దించి
ఆకు పచ్చ రంగులన్ని ఆశ మీద చల్లు

ఆ నల్లని మబ్బును పిండి హరివిల్లుని బైటికి తీయన ఊఊఒ ఊఒ ఊ
కను పాపల నలుపును కడిగె ఆ చిత్రాలెన్నొ గీయన
ఎ కుంచెకు అందని బొమ్మలు ఎన్నొ నెనె గీస్తున్న
నా బొమ్మను గీసిన దెవుడికెమొ అలుసైపొయన
ఆ రంగుని కలిపె కొంచెల అంచులు నలుపెనన్నది మరిచాన

అపరంజి బొమ్మ రా
విరజాజి కొమ్మ రా
చిగురాకు తెరలలొ
చిలిపి చిలుకమ్మ ర
హరువిల్లు కన్నె కె అరువిచు వన్నె ర
చిరునవ్వు చిన్ని లొ సిరులున్న కిన్నెరా

హా...
నీ వెంటె అడుగులు వెస్తె నా నీడకు రంగులు పుట్టవ ఊఊ ఊఒ ఊ
నీ వైపె చిలిపిగ చుస్తె నా కలలకు వన్నెలు అంటవ ఊఒ

ఈ లొకం మొత్తం చికటి వెలుగుల చిత్రం ల ఉన్న
నె రూపం మత్రం రంగులు దల్చిన వింతను చుస్తున్న
ఈ బ్రతుకున బంగారు వన్నెలు పూసిన బంధం నువ్వె అనుకొన


********  ********  **********


చిత్రం: రెయిన్బో (2008)
సంగీతం: నిహాల్
సాహిత్యం: అనురాధ
గానం: సునీత, నిహాల్

స స ని సా ని స పని పని స స ని సా ని స (2)

నా కళ్ళలో నీ కల ఇలా కన్నానులే
ప్రియతమా ప్రియతమా
నీ ఆశలే నా శ్వాసగా ఉన్నానులే ప్రాణమా ప్రాణమా
ఇరు హృదయాల ప్రేమావేశం కడలిగ మారేనా
చిలిపి తనాల భావావేశం చరితను మార్చెనా

నీ కళ్ళాలొ నా కల ఇలా చూశానులే
ప్రియతమా ప్రియతమా
నీ ఆశలే నా శ్వాసగా చేశానులే ప్రాణమా ప్రాణమా
ఇరు హృదయాల ప్రేమావేశం కడలిగ మారేనా
చిలిపి తనాల భావావేశం చరితను మార్చెనా

చరణం: 1
వెన్నెల వంటి వేకువ నీకోసం
వేకువ వెంటే వేడుక నీ యోగం
కన్నుల వెంటే కలగా నీ సాయం
వెన్నెల కాదా వేసవి నా ప్రాయం
నీలో నే సగమై
నువ్వే రస జగమై
ఇరు హృదయాల ప్రేమావేశం కడలిగ మారేనా
చిలిపి తనాల భావావేశం చరితను మార్చెనా

చరణం: 2
తొందర పడితే తుమ్మెదకానందం
అన్దనిదా ఈ పువ్వుల మకరందం
అందం గా నువ్వలుకుపొథున్టె
అంకింత మవనా నీలో ఆసాంతం
జత గా తరు లతగా
రతిగ హారతిగా
ఇరు హృదయాల ప్రేమావేశం కడలిగ మారేనా
చిలిపి తనాల భావావేశం చరితను మార్చెనా

స స ని సా ని స పని పని స స ని సా ని స (2)


********  ********  **********


చిత్రం: రెయిన్బో (2008)
సంగీతం: నిహాల్
సాహిత్యం: జిల్లెళ్ల వరప్రసాద్
గానం: సునీత

లా లా లాల లా లా
హూ హూ హు హు ఆహహా

ఆశ చిన్ని ఆశా ..నన్ను చూసె మాయగా
శ్వాస కొత్త శ్వాసా నన్ను చేరే హాయిగా

నేను నడిచే దారిలో నాకు దొరికే తోడు గా
నేను వెతికే ఊహలో నన్ను నడిపే నావగా
ఎదురే చేరి ప్రేమించ గా

చరణం: 1
గతం లోన కధల్లొన చూడని పగల్లొని
పతంగాల ఆమని
నన్ను చూసి నాతో ఆడేనా
వనం లోని విహంగాల సారిక
ఇలా నన్ను వెతుక్కుంటూ వాలగ
జంట చేరి నాతో పాడేనా ...

వేల వేల ఆసల్లొన సూర్యోదయం
కోటి కోటి తారాల్లోన చన్ద్రొదయమ్

వేల వేల ఆసల్లొన సూర్యోదయం
కోటి కోటి తారాల్లోన చన్ద్రొదయమ్
హరివిల్లులొ కొత్త రంగు నై చేరనా

చరణం: 2
వయ్యరాల వసంతాల వాకిట
స్వరం లోన పదాలల్లి పాడగా
మేఘమాల నేనై సాగేనా..
పదారేళ్ళ పసందైన కోరిక
పదా అంటూ పిలుస్తున్న వేడుక పారి జాత పూవై పూసెనా
గాలి నీరు నేలా నింగి దీవించగా
అంతు లేని ఆనందాలే లొగిళ్ళు గా
తొలి వేకువై కొత్త లోకమే చూడనా


********  ********  ********


చిత్రం: రెయిన్బో (2008)
సంగీతం: నిహాల్
సాహిత్యం: బాలాదిత్య
గానం: హేమచంద్ర

కృష్ణా కృష్ణా ..కృష్ణా కృష్ణా ..
కృష్ణా కృష్ణా ..అరె కృష్ణా కృష్ణా ..

ఎంత మంచి వాడవయ్య కృష్ణా కృష్ణా
ఎంత గొప్ప గాడ్ వయ్య కృష్ణా కృష్ణా
గర్ల్స్ కోరే జోడు వయ్య కృష్ణా కృష్ణా

నాకు నువ్వే తోడు వయ్య కృష్ణా కృష్ణా

చరణం: 1
పిల్లిలా పిల్లలతో ఇళ్ళలొకి దూరెల్లి
వెన్నను జూన్నునూ దోచుకొచ్చావు
అల్లన ఇల్లన అల్లరెన్తొ చేసేసి
నల్లనయ్య తల్లికి తలనొప్పి తెచ్చావు
నువ్వు స్నేక్ మీద బ్రేక్ డ్యాన్స్
గోపికలతో టెర్రోమాన్శు
చేసినావని నాకు తెలుసు బాలకృష్ణా
నువ్వు ఫ్లూట్ తోటే ఫ్లాట్ చేసి
స్వీట్ గా ఒక కాటు వేసి
హార్ట్ దోచే స్మార్ట్ బోయ్ వి మురళి కృష్ణోయ్
ఎంత మంచి ..తమంచి తమంచి ఎంతో మంచి..

ఎంత మంచి వాడవయ్య కృష్ణా కృష్ణా
ఎంత గొప్ప గాడ్ వయ్య కృష్ణా కృష్ణా

చరణం: 2
బ్రదర్ తో మధురకి రధం ఎక్కి నువ్వెళ్ళి
బావా నే కోమా కి పంపించేశావు
పాండవులకి అండగా ఓ ఫ్రెండ్ గా మరి నువ్వున్ది
కౌరవుల దన్డుకి బెన్డు తీశావు
నువ్వు అస్ట భామల ఇస్ట మొగుడువి దుస్టులకి అతి కశ్ట మొగడివి
సిస్టులకి అద్రుస్ట గురుడీవీ గోపికృష్ణా
నువ్వు నమ్మినోళ్లకి కమ్మనొడివి
మోస గాళ్ళకి మోసగాడీవి
లవబుల్లు నైస్ లార్డ్ వి వంశీ కృష్ణోయ్
ఎంత మంచి ..తమంచి తమంచి ఎంతో మంచి..

ఎంత మంచి వాడవయ్య కృష్ణా కృష్ణా
ఎంత గొప్ప గాడ్ వయ్య కృష్ణా హరే కృష్ణా హరే

Palli Balakrishna Saturday, September 23, 2017



చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్  
నటీనటులు: నవదీప్, శివబాలాజీ, కాజల్,  సింధు మీనన్
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాతలు: సి.కళ్యాణ్, యస్.విజయానంద్
విడుదల తేది: 06.09.2007



Songs List:



రేగుముళ్ళోలె పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కార్తీక్, యమ్.యమ్. శ్రీలేఖ, నోయెల్

రేగుముళ్ళోలె నాటు సిన్నాది బొడ్డు మల్లెను సూడు అన్నది
మీసాలు గుచ్చకుండా ఒరే బావో ముద్దాడుతావా అంది
కంది పూవల్లె ముట్టుకుంటాను కందిరీగల్లె కుట్టిపోతాను
కుచిళ్ళు జారకుండా ఒరే బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
నీ నడుముకెంత పొగరబ్బా అది కదులుతుంటే వడదెబ్బ
నువు కెలకమాకు మనసబ్బా ఇక నిదుర రాదు నీయబ్బ
మీసాలు గుచ్చకుండా...

కోనేటి నీళ్ళల్లో వంగిందిరో
కుండల్లే నా గుండె ముంచిందిరో
తను తడిసిందిరో నను తడిపిందిరో
ఆ పిట్ట గొడెక్కి నుంచుందిరో
కొమ్మొంచి కాయేదో తెంపిందిరో
అది జాంపండులా నను తింటుందిరో
ఎదురే పడితే ఎదలో గుండు సూదల్లె దిగుతావురో
తన కనులు గిలికి సింగారి తన జడను విసిరి వయ్యరి
చిరు నగవు చిలికి ఒకసారి కొస పెదవి కొరికి ప్రతిసారి
యహ మీసాలు గుచ్చకుండా ఒరే బావో ముద్దడతావా నువ్వు

ఆ జొన్న చేలళ్లో పక్కందిరో
ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరక కసి ఊరిందిరో
ఓసారి నాతోనే సై అంటేరో
దాసొహమౌతాను నూరెళ్ళురో
ఇక తన కాళ్ళకే పసుపవుతానురో
ఇదిగో పిల్లడో నువ్వు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో
నీ నడుము పైన ఒక మడతై పై జనమలోన ఇక పుడతా
అని చెలిమి చేరి మొర పెడితే  తెగ కులుకులొలికె ఆ సిలక
మీసాలు గుచ్చకుండా ఒసే భామ ముద్దాడలేనే నేను

కంది పూవల్లె ముట్టుకుంటాను అహ కందిరీగల్లె కుట్టిపోతాను
కుచిళ్ళు జారకుండా ఒరే బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
మీసాలు గుచ్చకుండా ఒరే బావో ముద్దాడుతావా అంది




బుగ్గే బంగారమా పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం:  పెద్దాడ మూర్తి
గానం: రాజేష్ కృష్ణన్

సాకీ:
పచ్చిపాల యవ్వనాల గువ్వలాట 
పంచుకుంటే రాతిరంత జాతరంట

పల్లవి: 
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ 
ఒళ్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ 
పట్టుచీరల్లొ చందమామ ఏడు వన్నెల్లొ వెన్నెలమ్మ 
కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లొ ముద్దుగుమ్మ

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ 
ఒళ్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ 

చరణం: 1
ఎదురే నిలిచే అధర మధుర దరహాసం 
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం 
వెలిగే అందం చెలికే సొంతం వసంతం 
వరమై దొరికే అసలు సిసలు అపురూపం 
కలిసే వరకు కలలో జరిగే విహారం 
పుష్యమాసాన మంచునీవో భోగిమంటల్లొ వేడి నీవో 
పూల గంధాల గాలినీవో పాల నురగల్లొ తీపి నీవో 

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ 

నగమల్లి పూల తోడ నంజుకున్న ముద్దులాట
సందెకాడ కొత్తగానే ఆరుబయట ఎన్నేలెంత 
సర్దుకున్న కన్నె జంట సర్దులాయెరో
యో నారుమల్లి తోటకాడ నాయుడోరి ఎంకిపాట
నగమల్లి పూల తోడ నంజుకున్న ముద్దులాట
సందెకాడ కొత్తగానే ఆరుబయట ఎన్నేలెంత 
సర్దుకున్న కన్నె జంట సర్దులాయెరో

చరణం: 2
ఎదలో జరిగే విరహ సెగల వనవాసం 
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం 
వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో 
జతగా పిలిచే అగరు పొగల సహవాసం 
జడతో జగడం జరిగే సరసం ఎపుడో 
అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే 
అన్ని రంగుల్లో ఆమె రూపే 
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే 
నన్ను మొత్తంగా మాయచేసే 

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ 
ఒళ్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ 
పట్టుచీరల్లొ చందమామ ఏడు వన్నెల్లొ వెన్నెలమ్మ 
కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లొ ముద్దుగుమ్మ



ఘల్లు ఘల్లు ఘల్లుమన్న పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వనమాలి
గానం: గాయత్రి, కారుణ్య

ఛెంగు ఛెంగు ఛెంగుమంటు తుళ్ళుతున్న తుంగభద్ర
చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా
ఘల్లు ఘల్లు ఘల్లుమన్న ఎడ్ల బండి జోరు చూసి 
ఏరువాక సాగుతుంటే చెంత చేరవా
ఏయ్ ఎర్ర మిరప కన్ను ఆ ఎండ పొద్దుకు
చుర్రు చుర్రంటూ గుచ్చే ఈ పల్లె బుగ్గకు
కోలో కోయిల పాట ఈ కొమ్మ గొంతుకు
ఏలో ఎన్నెల్లో ఊట ఆ కొండ కోనకు

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో
ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో

చెంగు చెంగు చెంగుమంటూ తుళ్ళుతున్న తుంగభద్ర
చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా

నూనూగు మీసాల ఊరి పెద్దలం
ఎవడెంతటోడైన మాది పెత్తనం 
పక్కవాడు ఏడిస్తే ప్రాణమిస్తాం
బక్కవాడు కనిపిస్తే ఏడిపిస్తాం
ఎన్నుపూస లేనోణ్ణి ఎండగడతాం
ఎన్నపుస మనసుంటే ఎంట పడతాం
కాడి పట్టి దున్నుతున్న బాలచంద్రులం
ఆకలేసి అరిసినోళ్ళకన్నదాతలం హే
చిట్టిగువ్వ రెక్క రంగు చీర కట్టుకున్నది
ఉట్టిమీది ఎన్న లాగ ఊరిస్తా ఉన్నది
కొబ్బరాకు పచ్చలాంటి కొంగు తిప్పుతున్నది
జబ్బ చూసి నాటి నుంచే బెంగ పెట్టుకున్నది
నా లేత తమలాపాక నా రాజా నిమ్మలపండా
నా గున్న మామిడి మొగ్గా నాకున్న మాపటి దిక్కా

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో 
ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో

మేలుకోవే ఓ మనసా
మేళుకోవే ఓ మనసా
బొమ్మనే చేశాడు ప్రాణమే పోశాడు
సిరులిచ్చి దీవించి చింతలే తీర్చాడు
ఉన్ననాడే మేలుకొని ఉట్టికెక్కమన్నాడు
ఊపిరాగిపోయిందా మట్టిపాలే వీడు
మేలుకోవే  ఓ మనసా
మేలుకోవే ఒ మనసా

ప్రాయమంతా పండగే చేశావు
తల పండినాక తత్వమే చెబుతావు
అనుభవించనివ్వు ఈ వైభోగం
వయసు ఉడిగి పోయాకే వైరాగ్యం హే 

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో
ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో

ఛెంగు ఛెంగు ఛెంగుమంటు తుళ్ళుతున్న తుంగభద్ర
చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా
ఘల్లు ఘల్లు ఘల్లుమన్న ఎడ్ల బండి జోరు చూసి 
ఏరువాక సాగుతుంటే చెంత చేరవా





నాలో ఊహలకు పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: ఆషా భోంస్లే, కె.యమ్. రాధాకృష్ణన్

ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
తరికిటతోం తనకధీం తంగిట తరికటతక
తానిదానిదా తానిదానిదా
గమద సనిద ఆ...
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ఆ... ఆ...ఆ... ఆ...ఆ...

సనిసస నినిసస నిస సనిసస నినిసస నిస

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా... పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

ససనిపస ససనిపరి (3)
ఆ... రారెరెరా...

కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
ఆ... ఆ...
గరిగ మమగ గరిగ మమగరిసని
తరికిటతోం తరికిటతోం
తరికిటతోం తరికిటతోం
తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం
ఆ... రారెరెరా...
మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనే

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా... పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 



హే సక్కుబాయినే పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: లక్ష్మి భోపాల్
గానం: జాస్సి గిఫ్ట్, మమతా మొహన్ దాస్

హే సక్కుబాయినే సక్కంగ ఉంటనే పక్కమీదనే నేనొక్కదానినే 
టక్కులాడినే తైతక్క లేడినే ఒక్కసారికే నే పొక్కిపోతనే
మల్లెపూల పక్క ఓ పంచదార చెక్క గల్లుమంది తిక్క వేడెక్కవేంది టెక్కా

హే సక్కుబాయినే  నేనొక్కదానినే హే సక్కుబాయినే

పచ్చి కొబ్బరాకు అబ్బ గిచ్చి చంపమాకు
ఇచ్చి లేచి వస్తే నువు గజ్జకట్టమాకు

డిల్లా డిల్లా డిల్లా డిల్లా  డిల్లా డీల్లారే (2)

సక్కుబాయివే నా సక్కుబాయివే
సక్కుబాయినే నే సక్కుబాయినే

నలుగు పెడితే కందే ఒళ్ళు
నాదస్వరమే జడ కుచ్చిళ్ళు
నలుగు పెడితే కందే ఒళ్ళు
నాదస్వరమే జడ కుచ్చిళ్ళు
నడుము సన్నా నాధ దానినే

ముడతపడ్డా నడుమే చూసే మెలిక పడ్డా నడకే చూసే
ముడతపడ్డా నడుమే చూసే మెలిక పడ్డా నడకే చూసే
ముడత ముంజం పడతావెందుకే 
హే ఆకు వక్క సున్న కట్టి చిలకలిస్తవా
చీకు చింత సిగ్గు ఎగ్గూ వదిలిపెడతవా
హే కోక రైక కట్టు బొట్టు చెదరనీకురో
గిల్లీ గిచ్చి ఆడేయ్ మంటూ గీతలేందుకే
కాలు కింద పెట్టకుండ మల్లెలేస్తవా
బొండు మల్లె చెండు నీకు మల్లెలెందుకే
అబ్బో బీటక్కరోడివే మా సక్కనోడివే
పక్కమీదనే నేనొక్కదానినే
పిల్ల కసిముల్లా నిలువెల్లా నేను గిల్లా 
పిల్లా సబ్బిల్లా నీ ఒల్లే రసగుళ్ళ

అత్తిపత్తి పువ్వే నువ్వు అత్తరిచ్చే సొత్తువి నువ్వు
అత్తిపత్తి పువ్వే నువ్వు అత్తరిచ్చే సొత్తువి నువ్వు
గుత్తమొత్తం కౌలే నాదిలే 
సడలనీకు కసి కౌగిల్లు బెదిరిపోతాయ్ పసి మావిళ్ళ
సడలనీకు కసి కౌగిల్లు బెదిరిపోతాయ్ పసి మావిళ్ళ
పోంకమంతా జంకేట్టుందిరో 
హే గోలపెట్టి కాదు అంటే విడిచిపెట్టలే
హే మాటమంతి కట్టిపెట్టి బరిలొ దిగుతవా
ఎండా వానా ఉన్నా కూడా బెండు తీస్తానే
హే ఒంపు సోంపు వయ్యారాల గండికోడతవా
ఎంత సేపు సంత గోల చెంత చేరవే 
ఎగిరి అందుకుంటె నే పండుతీయన
టక్కులాడివే తైతక్క లేడివే
అబ్బా టెక్కు చూపినా నీ పక్కకోస్తినే
పిల్ల కసిముల్లా నిలువెల్లా నేను గిల్లా 
పిల్లా సబ్బిల్లా నీ ఒల్లే రసగుళ్ళ
పిల్లా పిల్లా పిల్లా పిల్లా కళ్ళే తిరిగెనే... అయ్యో
చిల్లా చిల్లా మళ్ళా మళ్ళా వెలికి చూస్తినే
అల్లం మల్లం ఎగా దిగా చూసే వస్తినే
కళ్ళు ఒళ్ళు తెల్లా మల్లె దారే చూపెనే
మంచ మీదనే నీ అంతు చూస్తనే కంచె దాటినా కోర కంచరిస్తనే
పిల్ల కసిముల్లా నిలువెల్లా నేను గిల్లా 
పిల్లా సబ్బిల్లా నీ ఒల్లే రసగుళ్ళ




ముక్కుపై ముద్దు పెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: సాయి శ్రీహర్ష
గానం: హరిచరన్, సుజాత

ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరై పోయెట్టు
చెంపపై ముద్దు పెట్టు చెక్కరై పోయెట్టు
మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు
గడ్డంపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు

మొదట నుదిటి మీద ఒక్క బొట్టు ముద్దు
ఆ పిదప చెవికి చిన్న బుట్ట ముద్దు
మత్తు మెడకు ఒక్క మొక్క జొన్న ముద్దు
గమ్మత్తు గొంతుకొక్క సన్నజాజి ముద్దు
బుగ్గ పండు కోరికేసె రౌడీ ముద్దు
కొంటె ఈడూ కాజేసే కేడి ముద్దు
కంత్రి ముద్దు జాగజ్జంత్రి ముద్దు
కంత్రి ముద్దు జాగజ్జంత్రి ముద్దు
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ...
ముక్కుపై ముద్దు పెట్టు 

వగల నడుము మడత మీద వడ్డానం ముద్దు
ఈ నాభి చుట్టు వేడి సెగల సిగ్గానం ముద్దు
ఒంటి వన్నె చిన్నె విన్నపాల ముద్దు
పువ్వంటి కన్నెకొక్క జున్నుపాల ముద్దు
అల్లరాణి వల్ల కానిగా అల్లరి ముద్దు
అల్లసాని పద్య మంత అల్లిక ముద్దు
ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్రా ముద్దు
ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్రా ముద్దు
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ...

ముక్కుపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు
చెంపపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు
ముక్కుపై ముద్దు పెట్టు


Palli Balakrishna Tuesday, August 1, 2017



చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: శ్రీహరి, సింధు మీనన్
దర్శకత్వం: యన్. శంకర్
నిర్మాత: మేడికొండ మురళీకృష్ణ
విడుదల తేది: 06.12.2001



Songs List:



ఇదే నా పల్లెటూరు పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: వందేమాతరం శ్రీనివాస్, ఉష

ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు
మావూరి పాడిపంట రాములోరి దీవెనంటా
తల్లీ గోదావరి నీళ్లు కడిగే సీతమ్మ పాదాలు

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్... 

చరణం: 1
రామునికి బాణమొకటే 
భార్య సీతమ్మ ఒకటి
ఆ రాముడంటి కొడకు 
ఇంటింటా ఉంటే ఒకడు

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా జోయ్ జోయ్ జోయ్...

ఒక దేవుడే తనకు ఒక ధర్మమే తనది
హనుమంతుడే మనకు ఆదర్శమే ఐతే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్... 

చరణం: 2
తొలకరిలో వానచుక్క 
రుచిచూస్తే తేనెచుక్క
భూమిపై మోముపైన 
చిన్ని గరిక నవ్వుతుంటే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా జోయ్ జోయ్ జోయ్...

ఆలమంద పాలధార 
మీటుతున్నదో సితార
కడుపునిండ పాలు తాగి లేగదూడలాడుతుంటే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్....




ఓ ఓ చెలియా పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కుమార్ సాను, స్వర్ణలత

ఓ ఓ చెలియా



కుడ కుడడ రోడ్డులో పిల్ల ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత

కుడ కుడడ రోడ్డులో పిల్ల ఉంది
అది రానంటుంది నన్నే రమ్మంది





చేనేత చీరకట్టి పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కవితా కృష్ణమూర్తి, జస్విందర్ సింగ్ నిరోల

చేనేత చీరకట్టి



ఒకటే జననం ఒకటే మరణం పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహదేవన్, చిత్ర

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ 
ఏమైన గానీ ఎదురేది రానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు
నిద్రే నీకొద్దు నీకేది హద్దు

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
ఆ గెలుపూ చప్పట్లే గుండెలలో మోగాలీ
నీ నుదిటీ రేఖలపై సంతకమే చేస్తున్నా 
ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా 
నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం

నీలికళ్ళలో మెరుపూ మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

నిదరోకా నిలుచుంటా వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా కన్నీటీ బొట్టువలె
అడుగడుగు నీ గుండె 
గడియారం నేనవుతా
నువు నడిచే దారులలో 
ఎదురొచ్చి శుభమవుతా
రాసిగ పోసిన కలలన్నీ 
దోసిలి నిండా నింపిస్తా
చేతులు చాచిన స్నేహంలా

ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లువౌతుంది

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default