-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Shanthi Nivasam"



చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, పిఠాపురం,  జిక్కీ, పి.లీల , ఏ.పి.కోమలి , స్వర్ణలత 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన, కృష్ణ కుమారి, దేవిక, కాంతారావు
దర్శకత్వం: సి.ఎస్.రావు
నిర్మాతలు: సుందర్ లాల్ నహత, టి.అశ్వద్నారాయణ
విడుదల తేది: 14.01.1960



Songs List:



రావే రాధ రాణి రావే పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: గంటసాల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి)

రావే రాధ రాణి రావే 
రాధ నీవే కృష్ణుడనేనే రమ్యమైన శారదరాత్రి



చక్కని దాన చిక్కని దాన పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: స్వర్ణలత, పిఠాపురం

చక్కని దాన చిక్కని దాన ఇంకా అలకేనా



కలనైనా నీ వలపే పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం:  పి. లీల

సాకీ: 
తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన
ఈ కలువ నిరీక్షణ...నీ కొరకే.. రాజా...  వెన్నెల రాజా....

పల్లవి:
కలనైనా నీ వలపే
కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే

చరణం: 1 
కలువ మిఠారపు కమ్మని కలలు
కలువ మిఠారపు కమ్మని కలలు

కళలూ కాంతులూ నీ కొరకేలే
కళలూ కాంతులూ నీ కొరకేలే

చెలియారాధన సాధన నీవే
జిలిబిలి రాజా జాలి తలచరా

కలనైనా నీ వలపే
కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే

చరణం: 2 
కనుల మనోరధ మాధురి గాంచి...ఆ ..ఆ..ఆ...
కనుల మనోరధ మాధురి గాంచి

కానుక చేసే వేళకు కాచి
కానుక చేసే వేళకు కాచి

వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై వేచి నిలచెరా

కలనైనా నీ వలపే
కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే





రాగాలా సరాగాలా పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం:  ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
ఆ ఆ ఆ ఆ..
రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా
సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం

రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా
సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం

చరణం: 1 
పతిపద సేవయె యోగముగా నాతికి పతియే దైవముగా
పతిపద సేవయె యోగముగా నాతికి పతియే దైవముగా
సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా
సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా

రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా
సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం

చరణం: 2 
మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా
మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా
జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా
జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా

రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా
సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం
హా య్.. సుఖజీవన సారం




సెలయేటి గాలిలాగ పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: పి.లీల , ఏ.పి.కోమలి 

సెలయేటి గాలిలాగ చిందేసే లేడిలాగా 
సరదాగా గాలిలోన తేలిపోదామా మనము తేలిపోదామా



శ్రీ రఘురాం పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: పి.బి. శ్రీనివాస్, సుశీల  
 
పల్లవి:
శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః
సమస్త కళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహచంచరీకః...
నిరంతరం మంగళ మాతనోతు

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

శ్రీ రఘురాం జయరఘురాం సీతామనోభిరాం...
శ్రీ రఘురాం జయరఘురాం 

చరణం: 1 
అన్నదమ్ముల ఆదర్శమైనా ఆలూమగల అన్యోన్యమైనా
అన్నదమ్ముల ఆదర్శమైనా ఆలూమగల అన్యోన్యమైనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తండ్రిమాటను నిలుపుటకైనా ధరలో మీరే దశరథరాం 

శ్రీ రఘురాం జయరఘురాం సీతామనోభిరాం...
శ్రీ రఘురాం జయరఘురాం 

చరణం: 2 
వెలయునే ఎడ నీ దివ్యమూర్తీ వెలిగేనా ఎడ ఆనందజ్యోతీ
వెలయునే ఎడ నీ దివ్యమూర్తీ వెలిగేనా ఎడ ఆనందజ్యోతీ
వెలసి మాగృహం శాంతినివాసం సలుపవె శుభగుణ శోభితరాం

శ్రీ రఘురాం జయరఘురాం సీతామనోభిరాం...
శ్రీ రఘురాం జయరఘురాం
శ్రీ రఘురాం జయరఘురాం
శ్రీ రఘురాం జయరఘురాం






ఆశలు తీర్చవే ఓ జనని పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి)

ఆశలు తీర్చవే ఓ జనని 
ఆదరముంచవే జాలిగొని 





కం కం కంగారు నీకేలనే పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: ఘంటసాల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి)

కం కం కంగారు నీకేలనే 
నావంక రావేలనే చెలి నీకింక

Palli Balakrishna Thursday, March 14, 2019



చిత్రం: శాంతినివాసం (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: జేసుదాసు, రాజ్ సీతారాం, యస్.పి.శైలజా, రమణ, ఎన్.సునంద 
నటీనటులు: కృష్ణ , రాధిక, సుహాసిని
మాటలు: సత్యానంద్
దర్శకత్వం: జి.రామ్మోహనరావు
నిర్మాత: అంగర సత్యం
విడుదల తేది: 04.12.1986



Songs List:



పువ్వులా జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: జేసుదాసు, రాజ్ సీతారాం, యస్.పి.శైలజా, రమణ, ఎన్.సునంద 

పువ్వులా జీవితం నవ్వనీ ఈ క్షణం 



గుజ్జన గుళ్ళో గుండెకు కల్లో పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: జేసుదాసు, రాజ్ సీతారాం, యస్.పి.శైలజా, రమణ, ఎన్.సునంద 

గుజ్జన గూళ్ళో గుండెకు కల్లో వంటికి వళ్ళో ఇచ్చారే



తొలినాటి రాతిరి పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: జేసుదాసు, యస్.పి.శైలజా

తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళా
గుడిలోన నా చెలి సోగాసారబోసే వేళా
గిలిగింత గీతాలెన్నో అలలు కలిపినవి అందాలెన్నో 

తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళా
శ్రీవారి అల్లరి శృతి మించిపోయే వేళ
పులకింత రాగాలెన్నో పురులు విరిసినవి కౌగిళ్ళలో

తొలినాటి రాతిరి
చలి తీరిపోయే వేళ

సోగకనులే మూగ కలలై లేత గుసగుసలాడెయ్యగా
మేను వణికి తేనె పెదవి తీపి వలపులు తోడెయ్యగా
వయసుతో పరిచయం జరిగిన తొలకరి పరిమళం
సోకుతున్న వేళ నీలో ఎన్ని అందాలో
గాడమైన కౌగిలింత ఎన్ని బంధాలో
అలుపు ఎరుగనిది ఈ లాహిరి

తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళా
ఒడిలోని నా చెలి సొగసారబోసే వేళా

వాలుజడలో పూల గొడవ వెన్ను తడిమి వేధించగా
పాల మెడలో లేత ఎడద ప్రేమ జతులే పండించగా
జరగని ప్రతిదినం జరగక తప్పని లాంచనం
రేగుతున్న ఈడు గిల్లి జోలపాడాలో

ముందుగానె జోలలింక నేర్చుకోవాలో
చాలు సరసమిక సందిళ్ళలో...

తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళా
శ్రీవారి అల్లరి శృతి మించిపోయే వేళా
గిలిగింత గీతాలెన్నో
అలలు కదిపినవి అందాలలో
తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళా
ఒడిలోని నా చెలి సొగసారబోసే వేళా





తుమ్మెదా వాలరా పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎన్.సునంద  & బృంధం

తుమ్మెదా వాలరా వంటిమీద వన్నెపువ్వు విచ్చుకుంది చిన్నోడా 
తేనే విందులో తేలించనా లాలీ విందులో లలించనా



చిలకమ్మా సీమంతం పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.శైలజా, రమణ

చిలకమ్మా సీమంతం గోరింక ఆనందం 
చిరకాలం వర్ధిల్లు శాంతినివాసం 

Palli Balakrishna Wednesday, March 13, 2019

Most Recent

Default