-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sunderlal Nahata"




చిత్రం: వీరాభిమన్యు  (1965)
సంగీతం: కె,వి,మహదేవన్ 
నటీనటులు: యన్.టి.రామారావు, శోభన్ బాబు , కాంచన 
దర్శకత్వం: వి. మధుసూదనరావు
నిర్మాతలు: సుందరలాల్ నహత, డూండీ
విడుదల తేది: 12.05.1965



Songs List:



పరిత్రాణాయ సాధూనాం! శ్లోకం సాహిత్యం

 
చిత్రం: వీరాభిమన్యు  (1965)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: 
గానం: ఘంటసాల

పరిత్రాణాయ సాధూనాం !
వినా దుష్క
ధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే ॥



రంభా ఊర్వశి తలదన్నే పాట సాహిత్యం

 
చిత్రం: వీరాభిమన్యు  (1965)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి.సుశీల 

రంభా ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరీమె?
ఇంద్రుని చంద్రుని అందాలూ ఈతని సొమ్మే కాబోలు
రంభా ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరీమె?
నన్నే వెదకుచు భూమికి దిగిన కన్యక, రతియే కాబోలు
ఇంద్రుని చంద్రుని అందాలూ- ఈతని సొమ్మే కాబోలూ
మౌనముగానే మనసును దోచే- మన్మధుడితడే కాబోలూ
తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమే?
పరవశించీ పడచువానికి వధువుకానీ సొగసేల?
కలికి సరసన పులకరించీ-కరగిపోవని తనువేల?
ఎడము లేక ఎదలు రెండూ ఏకమవనీ బ్రతుకేల?



తాకినచోట ఎంతో చల్లదనం పాట సాహిత్యం

 
చిత్రం: వీరాభిమన్యు  (1965)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: దాశరథి 
గానం: పి.సుశీల 

తాకినచోట ఎంతో చల్లదనం తక్కినచోట ఏదో వింతజ్వరం
పెదవులేల వణికెను. వణికెను హృదయమేల బెదిరెను బెదిరెను
వింతకోరిక మొలచెను, మొలచెను ఎవరో నన్నే తలచీ, పిలిచీ కలచెనూ 

ఏమి సుఖం-ఏమి సుఖం ఏమని చెప్పుదునే
ఈ పులకింత ఈ గిలిగింత ఎన్నడు ఎరుగనులే
చెంపకు చెంప ఆనించీ- ఇంపగు కథలను చెప్పవటే
నీలో నన్నే నింపుకొనీ నేలకు స్వర్గం దింపవే

కన్యల మధ్యన ఈ వలపు కలలో ఇలలో కలగదులే
నీలో ఏదో ఉన్నదిలే నిజం తెలియరాకున్నదిలే....





అదుగో నవలోకం పాట సాహిత్యం

 
చిత్రం: వీరాభిమన్యు  (1965)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి.సుశీల 

అదుగో నవలోకం
వెలిసే మనకోసం
ఆదిగో నవలోకం
వెలిసే మనకోసం
నీలి నీలి మేఘాల లీనమై
ప్రియా! నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోరవలపు సీమలో ఆగుదాం
ఎచట సుఖముందో, ఎచట సుధగలదో
అచటె మనముందామా....
పారిజాత సుమదళాల పానుపూ,
మనకు, పరచినాడు చెఱకు వింటి వేలుపూ,
ఫలించె కోటి మురిపాలూ-ముద్దులూ
మన ప్రణయానికి లేవు సుమా హద్దులు-
ఎచట హృదయాలూ,
ఎపుడు విడిపోవో
అచట మనముందామా



చూచీ వలచీ పాట సాహిత్యం

 
చిత్రం: వీరాభిమన్యు  (1965)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి.సుశీల 

చూచీ వలచీ
చెంతకు పిలిచీ 
నీ సొగసులు లాలనజేపి 
నీ సొంపుల ఏలికనైతి 

చూచీ - వలచీ
చెంతకు చేరీ
సొగసులు కానుకజేసి 
నీ మగసిరి బానిసనైతి

అందాలన్నీ దోచీ
ఆనందపుటంచుల చూచీ
సందిట బందీ చేసినా
బందీ వశమై పోతీ
నూతన వధువై నిలచీ-వరుని
వలపుల మధువై మారీ
సుఖునీ, ఒడిలో సురిగి కోటి
సుఖముల శిఖరము నైతి
వలపుల తేనెల మధురిమ గ్రోలితి
నిదురా, జగమూ, మరచీ....
నీవే జగమై నీలో సగమై
నేటికి నిండుగ పండితి........




ఈ వెండ్రుకలు పట్టి పాట సాహిత్యం

 
చిత్రం: వీరాభిమన్యు  (1965)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: తిక్కన 
గానం: పి.సుశీల 

ఈ వెండ్రుకలు పట్టి ఈడ్చిన ఆ చేయి తొలుతగాఁ,
పోరిలో దుస్సపేను
తనువింతలింతలు దునియలై చెదరి. రూపరియున్నఁ
గని, యుడుకారుగా క
యలుపాలఁ బోనుపడునట్టి చిచ్చేయిది? పెనుగద
పట్టిన భీమసేను
బాహుబలంబును, పాటించి గాండీవమను
నొక విల్లెప్పుడును వహించు
కట్టి విక్రమంబు, గాల్పనే. యిట్లు
బన్నములు వడిన ధర్మనందనుండు
నేను, రాజరాజు పీనుఁగుఁ గన్నార
గాన ఐడయమైతిమేని, గృష్ణ !




కల్లా కపటం రూపై వచ్చే పాట సాహిత్యం

 
చిత్రం: వీరాభిమన్యు  (1965)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: సముద్రాల 
గానం: యస్.జానకి 

కల్లా కపటం రూపై వచ్చే నల్లనివాడా తా!
చల్లానమ్మే పిల్లల వెతికే అల్లరివాడా రా
ద్వారక వీధి నీరధిలోనా దాగిన ధీరా, రా!
చెరను పుట్టి చెరలో పెరిగిన మాయలమారీ రా
గొట్టెలు, బజ్జెలు మేపేవానికి రాజ్యము ఏలయ్యా?
అవనీ పాలన అతివలతోటీ ఆటలు కాదయ్యా....
అష్టమి పుట్టినవాడా!
ముదిపామును కొట్టినవాడా!
మద్దుల గూల్చినవాడా!
ముసలెద్దును జంపినవాడా!
కొంటెకృష్ణా! గోపీకృష్ణా! అనాధకృష్ణా!
కన్నెదొంగా! వెన్నెల దొంగా!
దారుల దొంగా! చీరెల దొంగా!
కల్లరి కృష్ణా! అల్లరి కృష్ణా!
కల్లా కపటం కానరాని చల్లని స్వామీ రా!
ఎల్లరికీ సుఖముగోరు నల్ల నిస్వామీ రా!
వైరినైన కరుణనేలు పరమాత్మా రా!
సభలో ద్రౌపదినీ దయగనిన ప్రభో రా!
భ్రమతో నిను దూరే
మా కనుల పొరలు తొలగే
విందజేయు నోటితో నె
పొగడజేతు నీ మహిమా .....
రా. రా. రా!




బానిసలంచు పాండవుల (పద్యం) సాహిత్యం

 
చిత్రం: వీరాభిమన్యు  (1965)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: తిక్కన 
గానం: మాధవపెద్ది

బానిసలంచు పాండవుల ప్రాణముతో విడ, సంతసింప కౌ
రా నను భాగ్యమిన్మునెదరా బెదరింతువా? సిగ్గుమాలి యా
-హ్వానము చేసినంతనే సెబాసని నేర్పరివోలె రాయడా
రానికి వచ్చినావె? భలిరా! మతిబోయెనా? నందనందనా!



రాధేయుండును దుస్స సేముడున (పద్యం) సాహిత్యం

 
చిత్రం: వీరాభిమన్యు  (1965)
సంగీతం: కె,వి,మహదేవన్ 
సాహిత్యం: తిక్కన 
గానం: మాధవపెద్ది

రాధేయుండును దుస్స సేముడును పోరంద్రాపుగా పాండవ
క్రోథ జ్వాలణ నాగు ఒండొరు నాకుఁదోడె చాలింక నీ
బాధల్ వ్యర్ధము, వాడి సూది మొన మోపంజాలునంతైన నే
నీ ధాత్రీతలమీను వారలకు పోరే తథ్యమౌ మాథవా !




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Friday, August 6, 2021



చిత్రం: గుడిగంటలు (1964)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణకుమారి
మాటలు: ముళ్ళపూడి వెంకట రమణ
దర్శకత్వం: వి.మధుసూధనరావు
నిర్మాతలు: సుందర్లాల్ నహత, డూండి
విడుదల తేది: 14.01.1964



Songs List:



నీలి కనుల పాట సాహిత్యం

 
చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి 
గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల

నీలి కనుల 




నీ కను దోయని పాట సాహిత్యం

 
చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: నర్ల చిరంజీవి 
గానం: ఎస్. జానకి 

నీ కను దోయని 



దూరాన నీలి మేఘాలు పాట సాహిత్యం

 
చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

దూరాన నీలి మేఘాలు 




ఎవరికి వారు పాట సాహిత్యం

 
చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల 

ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలో
ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలో
నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే
నాకమృతం తెచ్చిన జాబిలివే

ధనము కోరి మనసిచ్చే ధరణి మనిషిని కోరి వచ్చావే
నా అనువారే లేరని నేను కన్నీ రొలికే కాలంలో
ఉన్నానని నా కన్న తల్లివలే ఒడిని జేర్చి నన్నోదార్చావే
నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే
నాకమృతం తెచ్చిన జాబిలివే

ప్రేమ కొరకు ప్రేమించే వారే కానరాక గాలించాను
గుండెను తెరచి ఉంచాను గుడిలో దేవుని అడిగాను
గంటలు గణ గణ మ్రోగాయి నా కంటిపాప నువ్వన్నాయి
నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే
నాకమృతం తెచ్చిన జాబిలివే

ఈ అనురాగం ఈ ఆనందం ఎవ్వరెరుగని  ఈ అనుబందం
ఈ అనురాగం ఈ ఆనందం ఎవ్వరెరుగని  ఈ అనుబందం
ఊడలు పాకీ నీడలు పరిచీ ఉండాలి వెయ్యేళ్ళు
చల్లగా ఉండాలి వెయ్యేళ్ళు తియ్యగ పండాలి మన కలలు

ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలో
నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే
నాకమృతం తెచ్చిన జాబిలివే




నీలోన నన్నే పాట సాహిత్యం

 
చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల

పల్లవి:
నీలోన నన్నే నిలిపేవు నేడే
ఏ శిల్పి కల్పనవో ఓ ఏ కవి భావనవో

చరణం: 1
ఎల్లోర గుహలో పిల్ల ఉంది నీలో
నండూరివారి ఎంకి ఉంది నీలో
అల విశ్వనాథ చెలి కిన్నెరుంది
మా బాపిరాజు శశికళ ఉంది...

చరణం: 2
ఖయ్యాము కోలిచే సాకివి నీవే
కవి కాళిదాసు శకుంతల నీవే
ఖయ్యాము కోలిచే సాకివి నీవే
కవి కాళిదాసు శకుంతల నీవే
తొలి ప్రేమదీపం వెలిగించినావే
తొలి పూలబాణం వేసింది నీవే...




జన్మమెత్తితి రా పాట సాహిత్యం

 
చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: అనిశెట్టి 
గానం: ఘంటసాల

జన్మమెత్తితిరా అనుభవించితిరా 
జన్మమెత్తితిరా అనుభవించితిరా 
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
మంది గెలిచి మానవుడుగ మారినానురా..
జన్మమెత్తితిరా అనుభవించితిరా 
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా

స్వార్ధమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా
స్వార్ధమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా
దైవశక్తి మృగస్వభునే సంహరించెరా
దైవశక్తి మృగస్వభునే సంహరించెరా
సమర భూమి నా హృదయం శాంతి పొందెరా

జన్మమెత్తితిరా అనుభవించితిరా 
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా

క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా
బుసలు గొట్టి గుండెలోన విషము గ్రక్కెరా
క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా
బుసలు గొట్టి గుండెలోన విషము గ్రక్కెరా
ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా
ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా
నా మనసే దివ్య మందిరముగా మారిపోయెరా

జన్మమెత్తితిరా అనుభవించితిరా 
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా

మట్టి యందే మాణిక్యము దాగియుండురా
మనిషియందే మహాత్ముని కాంచగలవురా
మట్టి యందే మాణిక్యము దాగియుండురా
మనిషియందే మహాత్ముని కాంచగలవురా
ప్రతి గుండెలో గుడి గంటలు ప్రతిధ్వనించురా
ప్రతి గుండెలో గుడి గంటలు ప్రతిధ్వనించురా
ఆ దివ్య పదం న్యాయ పధం చూపగలుదురా

జన్మమెత్తితిరా అనుభవించితిరా 
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా

Palli Balakrishna Friday, March 15, 2019



చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, పిఠాపురం,  జిక్కీ, పి.లీల , ఏ.పి.కోమలి , స్వర్ణలత 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన, కృష్ణ కుమారి, దేవిక, కాంతారావు
దర్శకత్వం: సి.ఎస్.రావు
నిర్మాతలు: సుందర్ లాల్ నహత, టి.అశ్వద్నారాయణ
విడుదల తేది: 14.01.1960



Songs List:



రావే రాధ రాణి రావే పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: గంటసాల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి)

రావే రాధ రాణి రావే 
రాధ నీవే కృష్ణుడనేనే రమ్యమైన శారదరాత్రి



చక్కని దాన చిక్కని దాన పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: స్వర్ణలత, పిఠాపురం

చక్కని దాన చిక్కని దాన ఇంకా అలకేనా



కలనైనా నీ వలపే పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం:  పి. లీల

సాకీ: 
తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన
ఈ కలువ నిరీక్షణ...నీ కొరకే.. రాజా...  వెన్నెల రాజా....

పల్లవి:
కలనైనా నీ వలపే
కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే

చరణం: 1 
కలువ మిఠారపు కమ్మని కలలు
కలువ మిఠారపు కమ్మని కలలు

కళలూ కాంతులూ నీ కొరకేలే
కళలూ కాంతులూ నీ కొరకేలే

చెలియారాధన సాధన నీవే
జిలిబిలి రాజా జాలి తలచరా

కలనైనా నీ వలపే
కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే

చరణం: 2 
కనుల మనోరధ మాధురి గాంచి...ఆ ..ఆ..ఆ...
కనుల మనోరధ మాధురి గాంచి

కానుక చేసే వేళకు కాచి
కానుక చేసే వేళకు కాచి

వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై వేచి నిలచెరా

కలనైనా నీ వలపే
కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే





రాగాలా సరాగాలా పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం:  ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
ఆ ఆ ఆ ఆ..
రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా
సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం

రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా
సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం

చరణం: 1 
పతిపద సేవయె యోగముగా నాతికి పతియే దైవముగా
పతిపద సేవయె యోగముగా నాతికి పతియే దైవముగా
సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా
సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా

రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా
సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం

చరణం: 2 
మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా
మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా
జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా
జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా

రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా
సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం
హా య్.. సుఖజీవన సారం




సెలయేటి గాలిలాగ పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: పి.లీల , ఏ.పి.కోమలి 

సెలయేటి గాలిలాగ చిందేసే లేడిలాగా 
సరదాగా గాలిలోన తేలిపోదామా మనము తేలిపోదామా



శ్రీ రఘురాం పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: పి.బి. శ్రీనివాస్, సుశీల  
 
పల్లవి:
శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః
సమస్త కళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహచంచరీకః...
నిరంతరం మంగళ మాతనోతు

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

శ్రీ రఘురాం జయరఘురాం సీతామనోభిరాం...
శ్రీ రఘురాం జయరఘురాం 

చరణం: 1 
అన్నదమ్ముల ఆదర్శమైనా ఆలూమగల అన్యోన్యమైనా
అన్నదమ్ముల ఆదర్శమైనా ఆలూమగల అన్యోన్యమైనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తండ్రిమాటను నిలుపుటకైనా ధరలో మీరే దశరథరాం 

శ్రీ రఘురాం జయరఘురాం సీతామనోభిరాం...
శ్రీ రఘురాం జయరఘురాం 

చరణం: 2 
వెలయునే ఎడ నీ దివ్యమూర్తీ వెలిగేనా ఎడ ఆనందజ్యోతీ
వెలయునే ఎడ నీ దివ్యమూర్తీ వెలిగేనా ఎడ ఆనందజ్యోతీ
వెలసి మాగృహం శాంతినివాసం సలుపవె శుభగుణ శోభితరాం

శ్రీ రఘురాం జయరఘురాం సీతామనోభిరాం...
శ్రీ రఘురాం జయరఘురాం
శ్రీ రఘురాం జయరఘురాం
శ్రీ రఘురాం జయరఘురాం






ఆశలు తీర్చవే ఓ జనని పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి)

ఆశలు తీర్చవే ఓ జనని 
ఆదరముంచవే జాలిగొని 





కం కం కంగారు నీకేలనే పాట సాహిత్యం

 
చిత్రం: శాంతినివాసం (1960)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజాచార్యా
గానం: ఘంటసాల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి)

కం కం కంగారు నీకేలనే 
నావంక రావేలనే చెలి నీకింక

Palli Balakrishna Thursday, March 14, 2019



చిత్రం: గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, జయలలిత, గీతాంజలి
దర్శకత్వం: ఎమ్.మల్లికార్జునరావు
నిర్మాత: సుందర్ లాల్ నహత
విడుదల తేది: 11.08.1966



Songs List:



ఓహో వాలు చూపుల వన్నెలాడి పాట సాహిత్యం

 
చిత్రం:  గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల

పల్లవి:
ఓహో వాలు చూపుల వన్నెలాడి
నిన్ను చూస్తేనే చాలు ఒక్కసారి

డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ

చెంప మీదా చిటికేస్తే సొంపులన్నీ శోధిస్తే
ఊహలెన్నో ఊరిస్తే కోరి వస్తే
హహహహ ఉహూ..

డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ

చరణం: 1
అందమైన దానివీ...  ఆశ పెట్టే దానివీ
పాడు సిగ్గూ దేనికీ...  వలచి వస్తే
హహహహ ఉహ్హూ..

డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ

చరణం: 2
చిలిపి చూపుల కన్నులూ
మొలక నవ్వుల పెదవులూ
పలకరించే వన్నెలూ.. పులకరిస్తే
హహహహ ఉహ్హూ..

డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ

చరణం: 3
నిన్న సంగతి మరచిపో
నేటి సుఖమే తలచుకో
రేపు ఉండేదెక్కడో ఇపుడు మాత్రం
హహహహ ఉహ్హూ..

డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ...  డీరిడిరిడిరి డీరిడీ




మనసు తీరా నవ్వులే పాట సాహిత్యం

 
చిత్రం: గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
యా యా...యా..యా ...యా యా
యా యా...యా ..యా ...యా యా..యా యా ..
యా యా ..యా యా

మనసు తీరా నవ్వులే
నవ్వులే నవ్వులే నవ్వాలి
మనము రోజు పండుగే
పండుగే పండుగే చేయాలి

మనసు తీరా నవ్వులే
నవ్వులే నవ్వులే నవ్వాలి
మనము రోజు పండుగే
పండుగే పండుగే చేయాలి

లా ల ల లా... లాల లాల లా ...
లాల లాల లా ... లాల లాల లా

చరణం: 1
చేయి కలుపు సిగ్గు పడకు
చేయి కలుపు సిగ్గు పడకు
అందుకోవోయి నా పిలుపు

తారారం...తారారం...తారారం...తారారం
తారారం...తారారం...తారారం...తారారం

అవును నేడే ఆటవిడుపు
అవును నేడే ఆట విడుపు
ఆట పాటల కలగలుపు

యా యా...యా..యా ...యా యా
యా యా...యా ..యా ...యా యా..యా యా ..
యా యా ..యా యా

మనసు తీరా నవ్వులే
నవ్వులే నవ్వులే నవ్వాలి
మనము రోజు పండుగే
పండుగే పండుగే చేయాలి

లా ల ల లా... లాల లాల లా ...
లాల లాల లా ... లాల లాల లాటెల్

చరణం: 2
పువ్వులాగ పులకరించు
పువ్వు లాగా పులకరించు
దాచకోయి కోరికలు

తారారం...తారారం...తారారం...తారారం
తారారం...తారారం...తారారం...తారారం

ఆశలుంటే అనుభవించు
ఆశలుంటే అనుభవించు
అనుభవాలే సంపదలు

యా యా...యా..యా ...యా యా
యా యా...యా ..యా ...యా యా..యా యా ..
యా యా ..యా యా.. యా యా ..యా యా




నీతో ఏదో పనుంది పాట సాహిత్యం

 
చిత్రం: గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల 

నీతో ఏదో పనుంది



నువ్వునా ముందుంటే.. పాట సాహిత్యం

 
చిత్రం: గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ

నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ

చరణం: 1
ముద్దబంతిలా వున్నావూ..ముద్దులొలికిపోతున్నావూ
ముద్దబంతిలా వున్నావూ..ముద్దులొలికిపోతున్నావూ
జింకపిల్లలా ..చెంగుచెంగుమని.. చిలిపి సైగలే చేసేవూ...

నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ

చరణం: 2
చల్లచల్లగా రగిలించేవూ..మెల్లమెల్లగా పెనవేసేవూ
చల్లచల్లగా రగిలించేవూ..మెల్లమెల్లగా పెనవేసేవూ
బుగ్గపైన ..కొనగోటమీటి.. సిగ్గుదొంతరలు దోచేవూ ...

నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ

చరణం: 3
లేతలేతగా నవ్వేవూ..లేని కోరికలు రువ్వేవూ
లేతలేతగా నవ్వేవూ..లేని కోరికలు రువ్వేవూ
మాటలల్లి ..మరుమందుచల్లి.. నను మత్తులోన పడవేసేవూ

నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ



పడిలేచే కెరటం చూడు... పాట సాహిత్యం

 
చిత్రం: గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల 

పల్లవి:
పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల  బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు

పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల  బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు

చరణం: 1
వెన్నెల విరిసే వేళా... వన్నెలు మెరిసే వేళా
చందమామ పరుగులు చూడు... చల్లగాలి ఆరడి చూడు
చందమామ పరుగులు చూడు... చల్లగాలి ఆరడి చూడు
మిసమిసలా చిన్నలు చూడు... ఉసిగొలిపే హృదయం చూడు

పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల  బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు
పడిలేచే కెరటం చూడు...

చరణం: 2
పరులెవరూలేని చోటా... పరువాలు పూచే చోటా
తరుగుతున్న కాలం చూడు... పెరుగుతున్న ఆశలు చూడు
తరుగుతున్న కాలం చూడు... పెరుగుతున్న ఆశలు చూడు
మరుగులేని మమతలు చూడూ... మనసుంటే నన్నే కూడు

పడిలేచే కెరటం చూడు... పడుచుపిల్ల  బింకం చూడు
తొంగి చూచు సిగ్గులు చూడు... పొంగుతున్న అందం చూడు
పడిలేచే కెరటం చూడు...




ఎర్రా బుగ్గల మీద మనసైతే...పాట సాహిత్యం

 
చిత్రం:  గూఢచారి 116 (1966)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా
ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా

ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది
ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది

చరణం: 1
మొక్కజొన్న తోటలోన కలుసుకుంటవా
మక్కువంత ఒక్కసారి తెలుసుకుంటవా
మొక్కజొన్న... తోటలోన...
మొక్కజొన్న... తోటలోన...
మొక్కజొన్న తోటలోన కలుసుకుంటవా
మక్కువంత ఒక్కసారి తెలుసుకుంటవా

మొక్కజొన్న తోటలోన మక్కువంత తెలుసుకుంటే
నక్కి ఉన్న నక్కలన్నీ నవ్వుకుంటయే

ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా

ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది

చరణం: 2
కాకినాడ రేవుకాడ కలుసుకుంటవా
నా కళ్లలోని బాసలన్నీ తెలపమంటవా
కాకినాడ... రేవు కాడ...
కాకినాడ... రేవు కాడ...

కాకినాడ రేవుకాడ కలుసుకుంటవా
నా కళ్లలోని బాసలన్నీ తెలపమంటవా
కాకినాడ రేవు కాడ కళ్లు కళ్లు కలుపుకుంటే
ఓడలోని నీటుగాళ్లు ఊరకుంటరా

ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా
ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది

చరణం: 3
గండిపేట చెరువుకాడ కలుసుకుంటవా
కలుసుకొని గుండె లోతు తెలుసుకుంటవా
గండిపేట... చెరువు కాడ...
గండిపేట... చెరువు కాడ...
గండిపేట చెరువుకాడ కలుసుకుంటవా
కలుసుకొని గుండె లోతు తెలుసుకుంటవా

గండిపేట చెరువు కాడ గుండెలోతు తెలుసుకుంటే
గండు పులులు పొంచి పొంచి గాండ్రుమంటయే

ఎర్రా బుగ్గల మీద మనసైతే...  నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా
ఎర్రా బుగ్గల మీద మనసుంది...  కాని ఇందరిలో ఏం బాగుంటుంది

Palli Balakrishna Wednesday, February 13, 2019


చిత్రం:  రహస్య గూఢాచారి (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి, ఆరుద్ర
గానం:  యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , జయప్రద
మాటలు ( డైలాగ్స్ ): జంధ్యాల
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్
నిర్మాతలు: సుందర్ లాల్ నహత, శ్రీకాంత్ నహత
సినిమాటోగ్రఫీ: యస్.వి.శ్రీకాంత్
ఎడిటర్: డి.వెంకటరత్నం
బ్యానర్: శ్రీకాంత్ పిక్చర్స్
విడుదల తేది: 1981

పల్లవి:
చినుకులలో... వణికి వణికి వణికి వణికి
వణుకులలో... వలచి వలచి వలచి వలచి
వలపులలో..కలిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ.. జడివానా
ఆ..హా..ఆ

చినుకులలో... వణికి వణికి వణికి వణికి
వణుకులలో... వలచి వలచి వలచి వలచి
వలపులలో... కురిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ... జడివానా
ఆ..హా..ఆ

చరణం: 1
మబ్బులు ముసిరే మనసులలో... మెరుపై మెరిసే సొగసులలో
వలపే తెలిపే పిలుపులలో... ఉరుమై ఉరిమే వయసులలో

కాముడి గుప్పిటిలోనా... కౌగిలి దుప్పటిలోనా
ఈ ముడి ఎప్పటికైనా... తప్పదు ఎవ్వరికైనా

కాముడి గుప్పిటిలోనా..ఆ
కౌగిలి దుప్పటిలోనా..ఆ
ఈ ముడి ఎప్పటికైనా..ఆ
తప్పదు ఎవ్వరికైనా..ఆ
చినుకు వణుకు చిచ్చులు రేపే .. వెచ్చటి ముచ్చటలోనా..ఆ

చినుకులలో... వణికి వణికి వణికి వణికి
వణుకులలో... వలచి వలచి వలచి వలచి
వలపులలో... కురిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ... జడివానా
ఆ..హా..ఆ

చరణం: 2
ఎదలో రగిలే ఎండలలో... మెదిలే వేసవి తపనలు
ఎదలే వెలిగే కన్నులలో... మెరిసే కాటుక కవితలలో

ఇద్దరి ముద్దులలోనా... తొలకరి వలపుల వానా
ఎందరు ఏమను కొన్నా..ఆ.. తప్పదులే..దేవుడికైనా

ఇద్దరి ముద్దులలోనా... తొలకరి వలపుల వానా
ఎందరు ఏమను కొన్నా..ఆ తప్పదులే..దేవుడికైనా
చిటుకు చిటుకు తాళాలేసే... చిత్తడి జల్లులలో

చినుకులలో... వణికి వణికి వణికి వణికి
వణుకులలో... వలచి వలచి వలచి వలచి
వలపులలో... కురిసి కలిసి మెలిసి పిలిచి
కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ... జడివానా
ఆ..హా..ఆ


Palli Balakrishna Saturday, January 20, 2018

Most Recent

Default