Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sada"
Leela Mahal Center (2004)



చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
నటీనటులు: ఆర్యన్ రాజేష్, సదా 
దర్శకత్వం: దేవి ప్రసాద్ 
నిర్మాత: సి. హెచ్. యస్. మోహన్ 
విడుదల తేది: 04.12.2004



Songs List:



బాలమణమ్మో బాలమణమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: శంకర్ మహదేవన్, మాలతి

బాలమణమ్మో బాలమణమ్మో
లీలామహల్ వెనుక నీతో చాలా పనమ్మో



చిట్టీ చిలకమ్మ అమ్మ కొట్టిందా పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: యస్.పి. బాలు 

చిట్టీ చిలకమ్మ అమ్మ కొట్టిందా 
తోటకెల్లావా పండు తెచ్చావా
ఉయ్యాలా జంపాల నిన్నెవరు ఊపాలా



ఆ తుమ్మెద రెక్కలనడుగు పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: E.S. మూర్తి 
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత 

ఆ తుమ్మెద రెక్కలనడుగు
ఈ పువ్వుల మొక్కలనడుగు
నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి...
చలి వెచ్చని కౌగిలినడుగు
నులి వెచ్చని ఆశలనడుగు
ఇంకెన్నల్లో ఈ దూరం అన్నవి...
నీ ఒకే చూపు తాకి, నా ఎదే తెలిపోయి
ఏటో వెళ్ళేనే ప్రియతమా...
ఇటె వచ్చేనా ప్రాణమా

ఆ తుమ్మెద రెక్కలనడుగు
ఈ పువ్వుల మొక్కలనడుగు
నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి....

చరణం: 1
ఏదారుండి ఎదలో నువ్వు ప్రేమ జల్లువై కురిసావు
ఎలా శిలను ప్రేమించావు చెలియా చెప్పవా
గులాబీల ముల్లును చూసి అదేదాని గుణమనుకుంటే
అమృతాలు పంచె మనసు మళ్ళీ దొరుకునా
ఇలా పూల తోటను విడిచీ రాళ్లదారినీ
ఎలా చేరగలవో నడిచీ ప్రేమ గూటిని
ఒకే పిలుపు చాలనులే ప్రాణాలే పోయిన నా మనసే ఆగునా
ప్రాణాలే పోయినా  నా మనసే ఆగునా

ఆ తుమ్మెద రెక్కలనడుగు
ఈ పువ్వుల మొక్కలనడుగు
నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి...

చరణం: 2
మనసులేని కాలం మనకు విధించింది ఈ ఎడబాటు
నవ్వుతూనే చూపించాలి లోకం తీరుని
రమ్మంటేనే పండగ రాదు ప్రతి రాత్రి పున్నమి కాదు
వలె వేసి రప్పించాలి వాసంతాలని
ఒకే మాట ఒకటే గమ్యం ప్రేమ జంటకీ
ప్రపంచాన్ని ఓడించాలి గెలుపు భాదనీ
విధే వచ్చి తలవంచాలి ప్రేమ నిజమనీ.. నీకెదురే లేదని
ప్రేమే నిజమని, నీకెదురే లేదని

ఆ తుమ్మెద రెక్కలనడుగు
ఈ పువ్వుల మొక్కలనడుగు
నా గుండెల సవ్వడి వింటూ ఉన్నవి...
చలి వెచ్చని కౌగిలినడుగు
నులి వెచ్చని ఆశలనడుగు
ఇంకెన్నాల్లో ఈ దూరం అన్నవి....
నీ ఒకే చూపు తాకీ ఎదేతేలిపోయి
ఏటో వెళ్ళేనే ప్రియతమా...
ఇటె వచ్చేనా ప్రాణమా....





ఓ హంపీ బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సాయి శ్రీ హర్ష 
గానం: హరిహరన్, సుజాత 

ఓ హంపీ బొమ్మ ఎల్లోర గుమ్మా కల్లార్పలేనమ్మా



చిట్టీ చిలకమ్మా (Bit) పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: దీపిక 

చిట్టీ చిలకమ్మా (Bit)



సిరిమల్లె పువ్వల్లే నవ్వులే చల్లుతూ పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: కె.యస్.చిత్ర 

సిరిమల్లె పువ్వల్లే నవ్వులే చల్లుతూ
ఆనందం పొంగాలి ఆడుతూ పాడుతూ 




పరమ పావని పాట సాహిత్యం

 
చిత్రం: లీలమహల్ సెంటర్ (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: కల్పన 

పరమ పావని 

Palli Balakrishna Tuesday, August 2, 2022
Aparichithudu (2005)




చిత్రం: అపరిచితుడు (2005)
సంగీతం: హేరిస్ జయరాజ్
నటీనటులు: విక్రమ్, సదా
దర్శకత్వం: శంకర్
నిర్మాత: సుబ్రహ్మణ్యం, రూపేష్
విడుదల తేది: 17.06.2005



Songs List:



ఓ సుకుమారి పాట సాహిత్యం

 
చిత్రం: అపరిచితుడు (2005)
సంగీతం: హేరిస్ జయరాజ్
సాహిత్యం: చంద్రబోస్, భువనచంద్ర
గానం: శంకర్ మహదేవన్, హేరిస్ జయరాజ్, హరిణి

షంజానే తోనే తాని నేనానో
అవతుంబక తానే అంబి లంబానో

ఓ సుకుమారి, ఓ శృంగారీ నా అలంగారిని
ఓ సుకుమారీ... హే లంబా తానే
ఓ సుకుమారి ఓ శృంగారీ యే కుమారీ
యే కుమారి యే కుమారీ యే కుమారీ యే కుమారీ.... 

కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే
కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే
కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే

కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే
కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే
కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే

నే ఓడిపోయాననుకుంటనే 
నా ప్రేమను కాస్త వాయిదా వెస్తినే
రఘుమారి సుకుమారి
నా మనసొక విరినడి విరులలో అలజడి
 
కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే
కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే
కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే

షంజానే తోనే తాని నేనానో
అవతుంబక తానే అంబి లంబానో
షంజానే తోనే తాని నేనానో
అవతుంబక తానే అంబి లంబానో

తొలిప్రేమ అంటే పెను భారమా...
ఇది కానుపు రాని నిండు గర్భామ... ఓఓఓ
ప్రేమ గుట్టు దాస్తే బరువోపలేక
ఊపిరి ఆగదా ఊర్వశి
ప్రేమని తెలిపి కాదని అంటే
ప్రేమే సచ్చిపోద ప్రేయసి

ప్రేమలేఖతో ఆయిన మధిలో ఉన్నది
పూర్తిగ సెప్పలేము కదే
నువు కళ్ళు మూసుకుంటే
ప్రేమను తెలిపే వేరొక మార్గము లేదే

కుమారీ...కుమారీ... ఈ ఈఈ... ఆ ఆ ఆ ఆ

ప్రేమ బాసే రాని మూగ వాడినే...
వాడి పోవుచున్నా గిట్టా చూడవా
దోసిలి నిండా పువ్వులు నిండి
గువ్వల కోసం ఎతికినా
పువ్వలా నొసగి పూజను చేసి
కోరిక అడుగుట మరిసినా

ఆ దేవునికన్నా బలమగు వాడు
వేరొక ఉన్నాడులే
కల్లను చూసి వలపును తెలిపే
ధైర్యం గలవాడు అతడే అతడే

కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే
కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే
కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే

ఏఏఏ  ఆఆ ఆ… ఓ ఓఓ ఏఏ

కుమారా నీ ప్రేమ విక్కి ముక్కి బక్కసిక్కిన
కుమారా నీ గుండే గుప్పి రొప్పి క్రుంగుచున్నద
కుమారా నీ మాటల కడలి మండీ ఎండేనా

నే ఓడిపోయాననుకుంటనే
నా ప్రేమను కాస్త వాయిదా వెస్తినే
రఘుమారి సుకుమారి
నా మనసొక విరినడి విరులలో అలజడి

షంజానే తోనే తాని నేనానో
అవతుంబక తానే అంబి లంబానో




లవ్ ఎలిఫెంట్ లా పాట సాహిత్యం

 
చిత్రం: అపరిచితుడు (2005)
సంగీతం: హేరిస్ జయరాజ్
సాహిత్యం: చంద్రబోస్, భువనచంద్ర
గానం: నకుల్, జి.వి.ప్రకాష్ కుమార్, టిప్పు 

Oleley oley oley oley oley
ఆ oleley oley oley oley oley
Bingo say యో...
మ్యాచో say యో...
He's gonna Rockin
న న న న న న న నా...
చిన్నదైనా పెద్దదైనా..
Watch man more...

పల్లవి:
Love ఎలిఫంట్లా వస్తాడు రెమో
ముద్దు దంతాల్తో కుమ్ముతాడు రెమో
అప్పడం గుండెలు భద్రం రెమో
Ramp walk రెమో

నిద్రను తరిమే dragon రెమో
పువ్వులు పేల్చేటి stun gun రెమో
రంభల hearts లో Ringtone రెమో
Rainbow రెమో

Algebra తన దేహం
Amoeba లా పరిణామం
King cobra తన వేగం
క్వీనులకి ఉబలాటం

ఆ..ఆ...R.E.M.O..రెమో రెమో
Rio de janeiro రోమియో

("Love ఎలిఫంట్ల")

చరణం:1
Ring Master సింహం లా
చుట్టుముట్టి వచ్చే గుమ్మలరుగో
Sweat లేదొయ్ నాకు
Fans ఉన్నారో మనకు
విష్ణుచక్రం వేగమల్లే ఒళ్ళు తుల్లిపోయే స్టెప్పులివిగో
Baby corn నువ్వు నాకు
Teddy bear నేను నీకు

ఆ..ఆ..R.E.M.O రెమో రెమో
యే. హే దిల్ మాంగే మోర్ రెమో రెమో

("Love ఎలిఫంట్ల")

Rap:
ఓ..oley oley oley oley oley
ఆ..oley oley oley oley oley
Come on and take me ఓ..
Won't you take me ఓ.యే..

ఓ.... యే.... ఏ....

You got a get it up
I wanna shake it up
You wanna salsa
Take me to oompha
You like to dance
Open the rap

నీకు బైలా నాకు ఓయ్ లా.
నీకు salsa నాకు జల్సా
You like to dance
Open the rap 

చరణం: 2
హిరోషిమా నీవేనా నాగసకివి నీవేనా
నీ మీదే వేయనా నా ప్రేమ బాంబు
హరప్పవి నీవేనా మోహన్జాదారో నీవేనా
Historian నేనోయ్ ఆరాధిస్తానోయ్

ఆ..ఆ..R.E.M.O రెమో రెమో
యే.. హే ..దిల్ మాంగే మోర్ రెమో రెమో

("Love ఎలిఫంట్ల")

Algebra తన దేహం
Amoeba లా పరిణామం
King cobra తన వేగం
క్వీనులకి ఉబలాటం

ఆ..ఆ..R.E.M.O రెమో రెమో
Rio de janeiro రోమియో

Rap:
You got a get it up
I wanna shake it up
You wanna salsa
Take me to oompha
You like to dance
Open the rap
నీకు బైలా నాకు ఓయ్ లా.
నీకు salsa నాకు జల్సా
You like to dance
Open the rap...




నాకు నీకు నోకియ పాట సాహిత్యం

 
చిత్రం: అపరిచితుడు (2005)
సంగీతం: హేరిస్ జయరాజ్
సాహిత్యం: చంద్రబోస్, భువనచంద్ర
గానం: కునాల్ గంజ్వాలా, వసుందర దాస్

పల్లవి:
నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా
కాప్పచ్చినో కాఫీ  యా సోఫియా 
నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా
Cappuccino coffee యా సోఫియా

ఓహో... Thermocol శిల్పంలా నువ్వే ఉంటే 
నిన్నంటే చిన్ని తెల్ల బంధులే నేనులే
కన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే
లోలోనా దాహాలే తీరులే

ఐవా ఐవా ఐవా ఐవా అందం రావా
ఐవా ఐవా ఐవా ఏకం కావా

నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా
Cappuccino coffee యా సోఫియా

చరణం: 1
ప్రేమలు రోజున పుట్టా కళలను తింటూ పెరిగా
నడిచే మనసును కలిసా ఈనాడే...
ప్రేమకి vote వి నువ్వే 
Hollywood movie వి నువ్వే 
అమెరిక map వి నువ్వే నిను నచ్చాలే

ఇక ప్రేమలో టాప్ టెన్ వరసులలో
ఈ భూమిలో ప్రథమం మనమేలే ఆహ
ఇక ప్రేమలో టాప్ టెన్ వరసులలో
ఈ భూమిలో ప్రథమం మనమేలే ఆహ

ఓహో ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో 
చేయ్యరా నేరమో ఘోరమో
Cool honey cool honey cool honey తాగనా 
తేనెని cool honey

నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా
Cappuccino coffee యా సోఫియా

Nokia సోఫియా Nokia సోఫియా

చరణం: 2
Cyanide cyanide లుక్ తో..గుడ్ డే గుడ్ డే గురితో...
సిగ్గు బిడియం చంపే హంతకుడా..
Apple Laptop కన్నే ఒడిలో పెట్టుకు నిన్నే..
వేళ్లరిగేలా నేనే బతిమాలే

నువ్వు Octopus చేతులతో చుట్టి పడేసావ్
ఒక Atom Bomb ప్రాణంలోకి నెట్టి పడేసావ్
నువ్వు Octopus చేతులతో చుట్టి పడేసావ్
ఒక Atom Bomb ప్రాణంలోకి నెట్టి పడేసావ్

Cool honey cool honey cool honey తాగనా 
తేనెని cool honey...
ఓహో ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో
చేయ్యరా నేరమో ఘోరమో...

నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా
Cappuccino coffee యా సోఫియా
నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా
Cappuccino coffee యా సోఫియా

Thermocol శిల్పం లా నువ్వే ఉంటే
నిన్నంటే చిన్ని తెల్ల బందులే నేనులే
కన్నీటి శిల్పం లా నువ్వే నాలో మునకేస్తే
లోలోనా దాహాలే తీరులే

ఐవా ఐవా ఐవా ఐవా అందం రావా
ఐవా ఐవా ఐవా ఏకం కావా

నాకో నీకో Nokia ఇక రేపో మాపో మాఫియా...
Cappuccino coffee యా సోఫియా...

Nokia సోఫియా Nokia సోఫియా
Nokia సోఫియా Nokia సోఫియా




కొండకాకి పాట సాహిత్యం

 
చిత్రం: అపరిచితుడు (2005)
సంగీతం: హేరిస్ జయరాజ్
సాహిత్యం: చంద్రబోస్, భువనచంద్ర
గానం: జస్సి గిఫ్ట్, కె.కె. సుజాత మోహన్ 

రండక రండక రండక రండక రండక రండక రండక
రండక రండక రండక రండక రండక రండక రండక

ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా
ఏలా ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా
ఓల ఓల ఓల ఓల ఓలమ్మ
ఓల ఓల ఓల ఓల ఓల ఓలమ్మ

కొండకాకి  కొండే దానా
గుండిగ లాంటి గుండె దానా
హయ్యారేటు పల్ల దానా
మట్టగిడస కళ్ళ దానా

పొవ్వుల్తోనే బాణం వేసే 
పూలందేవి నువ్వే జాణ

మాయల మొనగాడే రాతిరి బూచోడే
మంచు గడ్డను ఒక్క లుక్ తో ఆవిరి చేశాడే
చెయ్ చండి జగమొండి జర కొంగును దులపండి
ముద్దులతోనే స్వేదాన్నంత సుబ్రం చేయండి

కొండకాకి  కొండే దానా
గుండిగ లాంటి గుండె దానా
హయ్యారేటు పల్ల దానా
మట్టగిడస కళ్ళ దానా

పొవ్వుల్తోనే బాణం వేసే 
పూలందేవి నేనే దానా

హే  చి  రా అంటూ వాతలు వేస్తావో
హా హుం హే అంటూ కులికించేస్తావో
మిర్చిమసాల నడుముని చూసి
ముడుచుకు పోయానే
తడిపెదవుల్లో సెగ పుట్టించి ఇస్త్రీ చేసెయ్ వే

జగ్గు జగ జంతరు గాడ
పప్పు రుబ్బు భీముని చూడ

నువు చిత్తూరి చోక్లెట్ వి అనుకున్నా
నువు చిత్తూరి చోక్లెట్ వి అనుకున్నా
నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా
నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా

కొండకాకి  కొండే దానా
హే గుండిగ లాంటి గుండె దానా
హే హయ్యారేటు పల్ల దానా
మట్టగిడస కళ్ళ దానా

పొవ్వుల్తోనే బాణం వేసే
పూలందేవి నువ్వే జాణ

ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా
ఏలా ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా
ఓల ఓల ఓల ఓల ఓలమ్మ
ఓల ఓల ఓల ఓల ఓల ఓలమ్మ

వై జా గు వెలగ పండువే నీవు
వన్ టూ త్రీ పాడి కొరికేయ్ నా నిన్ను
పండుతిన్న పిలగా  పళ్ళు కుచ్చుకొనక 
కరుసుకు పోతావా
జంట అరటి పళ్ళుమల్లే వెంటే ఉంటావా

చెట్టోరి కొట్టు పీచు మిఠాయి
పక్కూరు టకి చెకోడి నువ్వోయి

జున్ను పాలంటి దేహం నీదే చిలకా
జున్ను పాలంటి దేహం నీదే చిలకా
కాస్తా రుచి చూడనీవే పొమ్మని అనక
కాస్తా రుచి చూడనీవే పొమ్మని అనక

కొండకాకి  కొండే దానా
గుండిగ లాంటి గుండె దానా
హయ్యారేటు పల్ల దానా
మట్టగిడస కళ్ళ దానా

పొవ్వుల్తోనే బాణం వేసే
పూలందేవి నువ్వే జాణ

మాయల మొనగాడే రాతిరి బూచోడే
మంచు గడ్డను ఒక్క లుక్ తో ఆవిరి చేశాడే
చెయ్ చండి జగమొండి జర కొంగును దులపండి
ముద్దులతోనే స్వేదాన్నంత సుబ్రం చేయండి


ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా
ఏలా ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా
ఓల ఓల ఓల ఓల ఓలమ్మ
ఓల ఓల ఓల ఓల ఓల ఓలమ్మ




జియ్యంగారి పాట సాహిత్యం

 
చిత్రం: అపరిచితుడు (2005)
సంగీతం: హేరిస్ జయరాజ్
సాహిత్యం: చంద్రబోస్, భువనచంద్ర
గానం: కె.జె.యేసుదాస్, హరిణి

జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా...

నీ వంటి తరుణి పుడమిలో లేదే
ఇకపై పుడితే అది మన పాపే
నీ వంటి ఘనుడు జగతిలో లేడే
ఘనుడితో వలపు సులభం కాదే
అజ్ఞానంలో ఉండే ఆ ఆనందమిదే
వలపుల బడిలో బాలకుడే పండితుడే

జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా

మకరందం పొడి సిద్ధం చేసి
దానిలో స్వర్ణగందం కొంచం కొంచం కలిపి
హరివిల్లు లోని వర్ణాలద్ది బ్రహ్మే మలిచాడో
శతకోటి పువ్వులుతెచ్చి జంటపూలుగ మలిచాడో
నీ పెదవుల్లోంచి పల్లవించు వేదం
మన పెదవుల్లోంచి ప్రభవించు జీవం
కౌగిట్లో నే ఇవ్వు ముద్దుకి అనుమతి ఒకపరి

జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా...

హా... నింగిని నేలపైకి దించి
చిరు నక్షత్రాల తోరణాలే అమర్చి
సిరి మల్లెపూల పందిరి కింద మాలని వేస్తావా
నీ ముద్దులతోనే నింగీ నేలను ఏకం చేస్తావా
మింటి వానలోస్తే పైరు పెరిగేను
జంట వానలొస్తే శృష్టి జరిగేను
కాలమేనోయ్ ప్రియా 
సొగసులో తప్పులు జరగని

జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి పురుషా
జియ్యంగారి ఇంటి సొగసా

నీ వంటి తరుణి పుడమిలో లేదే
ఇకపై పుడితే అది మన పాపే
నీ వంటి ఘనుడు జగతిలో లేడే
ఘనుడితో వలపు సులభం కాదే
అజ్ఞానంలో ఉండే ఆ ఆనందమిదే
వలపుల బడిలో బాలకుడే పండితుడే

జియ్యంగారి ఇంటి పురుషా
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి పురుషా పురుషా...




Stranger in Black (Theme) పాట సాహిత్యం

 
చిత్రం: అపరిచితుడు (2005)
సంగీతం: హేరిస్ జయరాజ్
సాహిత్యం: చంద్రబోస్, భువనచంద్ర
గానం: సునీత సారధి, చెన్నై చోరెల్

Stranger in Black (Theme)

Palli Balakrishna Wednesday, June 23, 2021
Neevalle Neevalle (2007)









చిత్రం: నీవల్లే నీవల్లే (2007)
సంగీతం: హేరిష్ జయరాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: హరిచరణ్, స్వర్ణలత
నటీనటులు: వినయ్ రాయ్, సదా, తనీషా ముఖర్జీ
దర్శకత్వం: జీవా
నిర్మాత: ఎ.కె.రమణ, పి. విజయ్ కుమార్
సహ నిర్మాత: డి. రమేష్ బాబు
విడుదల తేది: 14.04.2007

వైశాఖ వెన్నెలా వయ్యారి వెన్నెలా
ప్రేమంటే ప్రియా ఒక కలా
నీ వలపంతా మత్తెక్కించే కలా
వళ్లంతా వగలే కళ్ళల్లో సెగలే
వెచ్చంగా ఊగే వయసులో
ఈ అల్లాడుతున్న నేను నిజం

విరహ వ్యధతో కృషించు ఎదలో
నిప్పుల్ని పోసి ఆనందమనకే
నీవంటే ప్రాణం చెలీ ఓహ 
అందవ సాయం సఖి

వైశాఖ వెన్నెలా వయ్యారి వెన్నెలా
ప్రేమంటే ప్రియా ఒక కలా
నీ వలపంతా మత్తెక్కించే కలా

సావాసం చేసి దూరంగా ఉన్నా
తప్పేదో గుండెల్లో నా రొద పెడితే
కన్నా నీ మాటా కదిరించే నన్నూ
కాలం నీ ఆయుధం

ఇదో ఎదలోన విరిసిన కలా ఎరుగవ నన్నే
ఆలా ఎదురేగి అడిగితే ఎలా నిలువగా లేనోయ్
హో కాలం గాలం వేసిందంటే
గంధం పుష్పం చేయ్యా స్నేహం

వైశాఖ వెన్నెలా వయ్యారి వెన్నెలా
ప్రేమంటే ప్రియా ఒక కలా
నీ వలపంతా మత్తెక్కించే కలా

హోయ్ వళ్లంతా నగలే కళ్ళల్లో సెగలే
వెచ్చంగా ఊగే వయసులో
ఈ అల్లాడుతున్న నేను నిజం

ఊరిస్తే ఎలా వెచ్చంగా హలా
పూవంటి నే నీ మీద పడిపోనామ్మా
అవునంటే గోలా అది నీకు మేళా
తేల్చి కవ్వించుకో

సెగే చెలరేగి వయసుల వ్యదై 
అలుగుతూ ఉంటే
మదే శృతి మించి తనువున సెగై 
తరుముతు ఉంటే
ఆహ్ మోహావేశం దాహావేశం 
తీర్థం పొస్తే తగేదేనా

వైశాఖ వెన్నెలా వయ్యారి వెన్నెలా
ప్రేమంటే ప్రియా ఒక కలా
నీ వలపంతా మత్తెక్కించే కలా

హో వళ్లంతా వగలే కళ్ళల్లో సెగలే
వెచ్చంగా ఊగే వయసులో
ఈ అల్లాడుతున్న నేను నిజం

ఓహ విరహవ్యధతో కృషించు ఎదలో
గుబులు రేపి ఆనందం అనకూ
నీవంటే ప్రాణం ప్రియా 
ఓహ్ అందీవ సాయం సఖా
నవంటే ప్రాణం ప్రియా
ఓహ్ అందీవ సాయం సఖా







చిత్రం: నీవల్లే నీవల్లే (2007)
సంగీతం: హరీష్ జయరాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: క్రిష్, కార్తీక్, హరిణి

మృదుమధురంగా మృదుమధురంగా
పెదవుల పైన పరిమళమల్లే
రా లే వా ప్రేమా
ఓహో తళ తళలాడే తళుకుల తారై 
ఇక పదమంటూ ఇదే వరమంటూ
రా లే వా ప్రేమా

నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోనా
నీముందే నీముందే నిలిచానే చినదానా
ఒక చిన్న కల ఉంది
వేదించే వయసుంది
మురిపించే వలపుంది ప్రేమించా
హో ఒకపక్క చనువుంది
నీకోసం తపనుంది
అవమానం భరియించి యాచించా

మృదుమధురంగా మృదుమధురంగా
పెదవుల పైన పరిమళమల్లే
రా లే వా ప్రేమా
ఓహో తళ తళలాడే తళుకుల తారై 
ఇక పదమంటూ ఇదే వరమంటూ
రా లే వా ప్రేమా (2)

ఒక పక్క నీడల్లే ఒక పక్క ఎండల్లే
కనిపించే వయ్యారి నీకోసమే బ్రతికానే
వలపంటే ఎదకింపై నీ బాట పట్టానే..
కడతేర్చ వస్తావో వ్యధపాలు చేస్తావో

ప్రాణమా ప్రాణమా నే మారిపోయానే
సెల్యమై సెల్యమై సంచారి నయినానే

మృదుమధురంగా మృదుమధురంగా
పెదవుల పైన పరిమళమల్లే
రా లే వా ప్రేమా
ఓహో తళ తళలాడే తళుకుల తారై 
ఇక పదమంటూ ఇదే వరమంటూ
రా లే వా ప్రేమా (2)

నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోనా
నీముందే నీముందే నిలిచానే చినదానా

నీ వెంబడి వచ్చాక 
నా నన్నిక పోయాక
మదినేదో పరితాపం
కుదిపెనే తొలిమోహం

తప్పేదో తెలియదు లే
ఒప్పేదో తెలియదు లే
ఏ పక్కన ఉన్నానో 
అది కూడా తెలియదు లే

అనుక్షణం అనుక్షణం రగిలిందే ఆ గాయం
ఏ క్షణం పోవునో ఎదలోని ఈ మౌనం

నీవల్లే నీవల్లే ఉన్నానే చెలికాడా
నీముందే నీముందే మెల్లంగా నిలిచాగా

ఒక చిన్న కల ఉంది
వేదించే వయసుంది
మురిపించే వలపుంది ప్రేమించా
ఒక పక్క చనువుంది
ఉబికొచ్చే తపనుంది
అభిమానం పదమంటే యాచించా







చిత్రం: నీవల్లే నీవల్లే (2007)
సంగీతం: హరీష్ జయరాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: క్రిష్, అరుణ్

జూన్ పోతే జూలై గాలీ
కమ్మంగా ఒళ్ళో వాలే
పువ్వుల్లో తేనుందమ్మ
ప్రేమల్లో బాధుందమ్మా

ఇన్నాళ్లు తోచలేదే
ఏమైందో తెలియలేదో
నవ్వున్నా లవ్వులేదు
లవ్వున్నా నవ్వు రాదే

నిన్న ఏమిటో తలవద్దంటా
నెక్స్ట్ ఏమిటో మనకేలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండ్
దోస్తు ముందరున్నదే నీదంటారా
పుణ్య భూమిలో తోడుంటా రారా - ప్రేమా (2)

జూన్ పోతే జూలై గాలీ
కమ్మంగా ఒళ్ళో వాలే
పువ్వుల్లో తేనుందమ్మ
ప్రేమల్లో బాధుందమ్మా

అలరించే పరిమళమా
వినలేవా కలవరమా
కింద భూమి అంది
ఆటే ఆడమంది

నింగే నీకు హద్దు
సందేహాలు వద్దు
ఇదే తరుణం తలపుకి సెలవిచ్చేయ్
అను నిమిషం మనసుని మురిపించేయ్
ఏ పువ్వుల్లోనూ కన్నీళ్ళనీ చూడలేదే

జూన్ పోతే జూలై గాలీ
కమ్మంగా ఒళ్ళో వాలే
పువ్వుల్లో తేనుందమ్మ
ప్రేమల్లో బాధుందమ్మా

ఇన్నాళ్లు తోచలేదే
ఏమైందో తెలియలేదో
నవ్వున్నా లవ్వులేదు
లవ్వున్నా నవ్వు రాదే

సాగిపోమ్మా పసి మనసా
తూలిపోమ్మా పూల ఒడిలో
శిల్పి చిరతత్వం శిల చెక్కడమే
మగువల తీరు తప్పులెంచడమే
గొప్ప వాళ్లలో ఉన్న ప్రేమ తొంగి చూద్దాం
వలపన్నదే వచ్చి వచ్చి పోయే దాహం
ఈ లోకంలోన ఉన్నోడెవడూ 
రాముడు కాడోయ్ ఓహ్

జూన్ పోతే జూలై గాలీ
కమ్మంగా ఒళ్ళో వాలే
పువ్వుల్లో తేనుందమ్మ
ప్రేమల్లో బాధుందమ్మా

ఇన్నాళ్లు తోచలేదే
ఏమైందో తెలియలేదో
నవ్వున్నా లవ్వులేదు
లవ్వున్నా నవ్వు రాదే

నిన్న ఏమిటో తలవద్దంటా
నెక్స్ట్ ఏమిటో మనకేలంట
నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండ్
దోస్తు ముందరున్నదే నీదంటారా
పుణ్య భూమిలో తోడుంటా రారా - ప్రేమా (2)







చిత్రం: నీవల్లే నీవల్లే (2007)
సంగీతం: హరీష్ జయరాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: నరేష్ అయ్యర్ షాలిని సింగ్

మొదలీనాడు చెలియా చూడూ
మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం
నా గుండె పాడుతున్నది ఏదేదో నేర్చుకున్నదీ
అయ్యయ్యో వద్దన్నా వినదోయమ్మా
ఏదేదో అవుతున్నా ఎట్టాగమ్మా హో జావేజా

మొదలీనాడు చెలియా చూడూ
మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం

నలు దశల అల్లుకున్న ప్రేమా
తనువంతా చుట్టుకుంటే మామ
ఏమి వింతో కొత్తగుందీ అనుభవం
మొదలైతే ముత్యమంత ప్రేమా
మనసుల్నే ముంచుతుందే భామా
పట్టుకుంటే వదలదులే అది నిజం
వాహువో హో వాహువో
ప్రేమ సంద్రం కీ దగ్గరాయే ప్రేమ చేరనివ్వలేదే

మొదలీనాడు సఖుడా చూడూ
మెల్లంగ నను మార్చడం తెలిసింది నీకీ క్షణం

హృదయంలో ప్రేమ చలి చూడూ
లేకుంటే నువవ్వుతావు బీడూ
దూరమైతే మోడవదోయ్ జీవితం హో ఓహ్ ఓహో
పెదవులతో ప్రేమ అను మాటా
ఎత్తితేనే వచ్చునంట తంటా
జీవితాంతం నిదరుండదు అది నిజం
ఆహ హాహా వాహువో
వ్యధలెన్నో ఉన్నా లవ్ లో అదియు సుఖమేగా

మొదలీనాడు చెలియా చూడూ
మెల్లంగ నిను మార్చడం తెలిసింది నాకీ క్షణం
ఉప్పుని వజ్రం అనిపించే కనికట్టు ప్రేమే చేస్తుంది
అది ఇచ్చే సుఖాలు కొంచం కొంచం
వెంటాడు కష్టాలు భద్రం భద్రం ఓహో ఘోరీయే

ఓసన సోనా
ఓసన సోనా
ఓసన సోనా






Palli Balakrishna Thursday, February 4, 2021
Donga Dongadi (2004)



చిత్రం: దొంగ దొంగది (2004)
సంగీతం: దిన పతాక్
నటీనటులు: మంచు మనోజ్, సదా
దర్శకత్వం: సుబ్రమణ్యం శివ
నిర్మాతలు: యన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్
విడుదల తేది: 06.08.2004



Songs List:



అందంగుంటారు పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగది (2004)
సంగీతం: దిన పతాక్
సాహిత్యం: భువనచంద్ర
గానం: టిప్పు 

అందంగుంటారు




వాన వాన పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగది (2004)
సంగీతం: దిన పతాక్
సాహిత్యం: కులశేఖర్
గానం: చిత్ర

వయసేమో పదహారు పరుగెత్తే సెలయేరు
పరువాల చిత్రాలు పడుచోళ్ళ ఆత్రాలు
నిదరోయే నేత్రాలు నిలువెల్లా గాత్రాలు
మతిపోయే అందాలు శతకోటి దండాలు

వాన వాన వల్లప్ప తిరుగుదామిలా
నింగినేల హరివిల్లై కలుపుదామిలా
మబ్బుల్లో హంసలాగ మల్లెల్లో మంచులాగ
కన్నుల్లో సిగ్గులాగ వెన్నెల్లో ముగ్గులాగ
దోసిట్లో చినుకులాగ వాకిట్లో తులసిలాగ
వరిచేను గువ్వలాగ పెదవుల్లో నవ్వులాగ

మనమంతా గంతులాడదాం
సిరిమువ్వై చిందులాడుదాం
సరదాగా ఆటలాడుదాం
పరువాల పాట పాడుదాం

వాన వాన వల్లప్ప తిరుగుదామిలా
నింగినేల హరివిల్లై కలుపుదామిలా

ఓహోహో తయ్యర  తయ్య తయ్యారె తయ్యారె
తయ్యర  తయ్య తయ్యారె తయ్యారె

అహ తుళ్ళిపడే ఈడులో తుమ్మచెట్టు నీడలో
చెమ్మచెక్క ఆటలాడుదాం
పొద్దుపొడుపు వేళలో అత్తమడుగు వాగులో
ఆదమరిచి ఈదు లాడుదాం
పక్కింటిలోన కుర్రాడ్ని కడుపుదామా
ఆహ ఆహ ఆహ  హా
పక్కింటిలోన కుర్రాడ్ని కడుపుదామా
మాటలతో మాయచేసి కథకాలి చేయిద్దామ
గుండ్రంగా తిప్పిద్దామా గుంజీలే తీయిద్దామా
గుండ్రంగా తిప్పిద్దామా గుంజీలే తీయిద్దామా

వాన వాన వల్లప్ప తిరుగుదామిలా
నింగినేల హరివిల్లై కలుపుదామిలా

గడ్డివాము చాటుగా లంకచుట్ట ఘాటుగా
గుప్పు గుప్పుమంటు లాగుదాం
ఊరు పెద్ద గుట్టుగా రంగితోటి పచ్చిగా
కులుకుతున్న మాట చాటుదాం
కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా
డింకి టకరి డింక హే డింకి టక అ ఆ
కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా
వీధుల్లో చేరి మనం వసంతాలు ఆడేద్దామా
వయ్యారం వలికిద్దామా సంగీతం పలికిద్దామా
వయ్యారం వలికిద్దామా సంగీతం పలికిద్దామా

వాన వాన వల్లప్ప తిరుగుదామిలా
నింగినేల హరివిల్లై కలుపుదామిలా
ఓహోహొ 
మబ్బుల్లో హంసలాగ మల్లెల్లో మంచులాగ
కన్నుల్లో సిగ్గులాగ వెన్నెల్లో ముగ్గులాగ
దోసిట్లో చినుకులాగ వాకిట్లో తులసిలాగ
వరిచేను గువ్వలాగ పెదవుల్లో నవ్వులాగ

మనమంతా గంతులాడదాం
సిరిమువ్వై చిందులాడుదాం
సరదాగా ఆటలాడుదాం
పరువాల పాట పాడుదాం

లాల లాల లాలలా లాల లాల ల
లాల లాల లాలలా లాల లాల ల




భాగ్యనగర్ బంపర్ పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగది (2004)
సంగీతం: దిన పతాక్
సాహిత్యం: కందికొండ 
గానం: ఉదిత్ నారాయణ్, రాధిక 

భాగ్యనగర్ బంపర్ 





సొట్ట బుగ్గ పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగది (2004)
సంగీతం: దిన పతాక్
సాహిత్యం: కందికొండ 
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత 

సొట్ట బుగ్గ 




నిన్ను చూసినప్పుడు పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగది (2004)
సంగీతం: దిన పతాక్
సాహిత్యం: కులశేఖర్ 
గానం: కార్తీక్ 

నిన్ను చూసినప్పుడు



మన్మధరాజా పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ దొంగది (2004)
సంగీతం: దిన పతాక్
సాహిత్యం: వేటూరి
గానం: మాలతి, శంకర్ మహదేవన్

రాజా రాజా నా మన్మధరాజా
నీకై వేచిన రోజా వడిలో చేర్చుకో రాజా

మన్మధరాజా మన్మధరాజా 
కన్నె మనసే గిల్లోద్దు
దోపిడి చేసే చూపులతోటి
చుట్టు కొలతే చూడొద్దు
నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో
గిచ్చు గిచ్చు ముద్దు పెట్టొద్దు
నా కొత్త వయస్సుని మత్తు సరస్సుగా
చేసి చేసి ఈత కొట్టొద్దు

మన్మధరాజా నా మన్మధరాజా 
హేయ్ మన్మధరాజా మన్మధరాజా 
పొగరుమీద ఉన్నాడే
వన్నెలు చూసి కన్నులు వేసి
పిచ్చి ముదిరి వచ్చాడే
నీ పచ్చి నరాలపై కచ్చి పెదాలతో
గిచ్చు గిచ్చు ముద్దు పెడతాడే
నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా
చేసి చేసి ఈత కొడతాడే

మన్మధరాజా   మన్మధరాజా 

హే జిల హే జిల హే జిలకచిక జిల
హే జిల హే జిల హే జిలకచిక జిల

నన్నే పిల్లాడ్ని చేసి ప్రేమ పిచ్చోడ్ని చేసి 
పాప నీ వెంట తిప్పావే తిప్పావే తిప్పావే
రక్తం చల్లారబెట్టి రాత్రి తెల్లార్లు బట్టి
బాబు నా గుట్టు దోచావే దోచావే దోచావే
నీ నోరంటుకుంటే మిద్దులకిష్టం
నీ చీరంటుకుంటే సిగ్గులకష్టం
హే నాచాప కింద నీరైనావు
నన్ను ఆ నీటి చేపై ముద్దాడావు

నీ సోగసంత చాపల్లె పరిచేస్తాలే
నీ వయసంత వాటేసి మురిపిస్తాలే
కొత్త అందాల మత్తుల్లో కులుకేస్తాలే

హే రాజా రాజా రాజా మన్మధరాజా
చేసేయ్ చేసేయ్ చేసేయ్ మల్లెల పూజా (2)

హే తన హే నన హే నన నన ననన
తన హే తనన హే తన నన నన ననననన

నా మనసే అడగవచ్చి 
నీ వయసే ముడుపులిచ్చి
నా వంటి గంట కొట్టావే కొట్టావే కొట్టావే
నా పైట జారనిచ్చి చూసావే గుచ్చి గుచ్చి
సొగసుల్లో చిచ్చు పెట్టావే  పెట్టావే పెట్టావే
పచ్చి పాలల్లే నేను విరిగానమ్మో
పాల పొంగటి నిన్ను మరిగానమ్మో
జిన్ను ముక్కంటి బుగ్గే జుర్రేశావు
చమ్మచక్కాడి నన్నే చంపేసావు
హే నాకోసం రాతిరి రాసిచ్చావు
తొలి కూతేసే కోడిని కోసేసావు
ఆ రంగేలి రంభల్లే రంకేశావు

హే రాజా రాజా రాజా మన్మధరాజా
చేసేయ్ చేసేయ్ చేసేయ్ మల్లెల పూజా
రాజా రాజా రాజా మన్మధరాజా
చేసేయ్ చేసేయ్ చేసేయ్ మల్లెల పూజా

హే మన్మధరాజా మన్మధరాజా 
కన్నె మనసు గిల్లోద్దు
వన్నెలు చూసి కన్నులు వేసి
పిచ్చి ముదిరి వచ్చానే
నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో
గిచ్చు గిచ్చు ముద్దు పెట్టొద్దు
నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా
చేసి చేసి ఈత కొడతానే

మన్మధరాజా - నీ మన్మధరాజా 
మన్మధరాజా నా మన్మధరాజా 
కన్నె మనసే గిల్లోద్దు
దోపిడి చేసే చూపులతోటి
నన్ను గిచ్చి చెంపేయ్ రా...


Palli Balakrishna Tuesday, February 19, 2019
Takkari (2007)



చిత్రం: టక్కరి (2007)
సంగీతం: చక్రి
నటీనటులు: నితిన్ , సదా
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాత: పరుచూరి శివరాం ప్రసాద్
విడుదల తేది: 25.11.2007



Songs List:



అమ్మి అమ్మి అమ్మి చుమ్మా దేదె పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి , సాయి శివాని

అమ్మి అమ్మి అమ్మి చుమ్మా దేదె తూ మీ
గిమ్మి గిమ్మి దిల్ ఇచ్చుకోమి
అమ్మి అమ్మి అమ్మి గుండేల్ పిండి పిండి
చంపేస్తున్నావమ్మి ఎందుకమ్మి
కాదల్ ఇష్క్ ప్రేమల నువ్వై ఇచ్చావే కిక్
నక్క తోక తొక్కేనేమో దక్కిందే లక్కు
కన్నోళ్ల కాళ్ళు మొక్కి నువ్ పెగ్ పార్టీ ఇచ్చి
బిర్యాని రోజు మెక్కి బ్లెస్సింగ్ పొందుతానే

ఓలమ్మి ఓలమ్మి ఓలమ్మి లమ్మి
ఓలమ్మె ఓలమ్మె ఓలమ్మి లమ్మి

అమ్మి అమ్మి అమ్మి చుమ్మా దేదె తూ మీ
గిమ్మి గిమ్మి దిల్ గిచ్చుతోంది

గజిని నవాబ్ లాగ అసలే వినవో
అపుడే నీ ప్రేమ మెచ్చి దిగినా లవ్ లో
ఉడుమై నా హార్ట్ చుట్టి విడనే విడవో
అపుడే నే పట్టుతప్పి పడినా ఒడిలో
సంజీవినల్లే చేరి మరు జన్మనిచ్చినావే
ఎగ్జామ్ నువ్వె పెట్టి ఆన్సర్లా అందినావే
అమ్మీ... చిన నాడు బూస్ట్ ముద్దే
నినమొన్న స్వీట్ ముద్దే 
,ఈనాడు నువ్వు ముద్దే
పోరి తిట్టుకూడ ముద్దే
నీ మాటలన్ని నచ్చి ప్రేమించినాను నమ్మీ
నట్టేట ముంచుతావో నను ఒడ్డు చేర్చుతావో

ఓరబ్బీ ఓరబ్బీ ఓరబ్బీ రబ్బీ
ఓలమ్మె ఓలమ్మె ఓలమ్మి లమ్మి

అమ్మి అమ్మి అమ్మి చుమ్మా దేదె తూ మీ
గిమ్మి గిమ్మి దిల్ ఇచ్చుకోమి

ఎపుడూ అనుకోనెలేదు అసలే మదిలో
వలపై కలలేసినావు తొలిగా ఎదలో
పొగరే తెగ ఉంది నీకు ఏం చేస్తావో
గొడవే పడతావు నన్ను వదిలేస్తావో
ఓ మోనికాబేడీ లాగ నిన్నొదిలి వెళ్లిపోనే
దావూద్ నేను కానే ప్రేమున్నవాణ్ణి నేనే
అమ్మే నన్నెంచి కోరి వస్తే ఎదురిచ్చుకుంట నీకే
నా ఏటియమ్ నువ్వే నా అష్టలక్ష్మి నువ్వే
అట్టాగె ఉంటె బెస్ట్ వేషాలు వెయ్యవొద్దు
అడ్వాన్స్ ముందు కొట్టు ఓ చిన్ని ముద్దు పెట్టు

ఓరబ్బీ ఓరబ్బీ ఓరబ్బీ రబ్బీ
ఓలమ్మె ఓలమ్మె ఓలమ్మి లమ్మి

అమ్మి అమ్మి అమ్మి చుమ్మా దేదె తూ మీ
గిమ్మి గిమ్మి దిల్ ఇచ్చుకోమి
అమ్మి అమ్మి అమ్మి గుండేల్ పిండి పిండి
చంపేస్తున్నావమ్మి ఎందుకమ్మి





కొబ్బరి కొబ్బరి పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి , కౌసల్య

కొబ్బరి కొబ్బరి



ఏలే ఏలే పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: జుబీన్ గర్గ్, చక్రి , రేవతి

ఏలే ఏలే




నాచో నాచో పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: జుబీన్ గర్గ్, చక్రి , రేవతి

నాచో నాచో



అ అ ఆ పాట సాహిత్యం

 
చిత్రం: టక్కరి (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: నవీన్, కౌసల్య

అ అ ఆ



Palli Balakrishna Tuesday, March 6, 2018
Veerabhadra (2006)



చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలకృష్ణ , తనుశ్రీదత్తా, సదా
మాటలు ( డైలాగ్స్ ): మధురూరి రాజా
కథ, స్క్రీన్ ప్లే, ఆంజనేయ పుస్పానంద్
దర్శకత్వం: ఎ. యస్.రవికుమార్ చౌదరి
నిర్మాతలు: అంబిక కృష్ణ , అంబిక రామాంజనేయులు
సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్
ఎడిటర్: గౌతంరాజు
బ్యానర్: అంబికా ప్రొడక్షన్స్
విడుదల తేది: 29.04.2006



Songs List:



జనం కోసం పాట సాహిత్యం

 
చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాషా శ్రీ 
గానం: శంకర్ మహదేవన్ 

జనం కోసం 



అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే పాట సాహిత్యం

 
చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే
అమ్మమ్మా మధన జపమే మొదలాయే
వడదెబ్బ కొట్టిందే మోనాలిసా నీ కోక జారినాకా
గొడవెట్టి చంపిందే నాలో నిషా నీ చేయి తాకినాకా
ఊ కొట్టే ఉద్యోగం నీదేగా
జో కొట్టే చొరవుంది నీకేగా

అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే
అమ్మమ్మా మధన జపమే మొదలాయే

చరణం: 1
నీ ఒంటి వంపుల్లో ఏమిటుందో
నాకంటి చూపులతొ కొలిచా ఓ..
నీ కొంటి ఊహల్లో చేరుకుంటూ
పడకింటి తలుపుల్ని తెరిచా ఓ..
బాగున్నదే మరి మన్మధ మాసం వడ్డించుకో వడిగా
గుచ్చేయదా తమ అల్లరి మీసం నా బుగ్గపై అలా ఇలా..

అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే
అమ్మమ్మా మధన జపమే మొదలాయే

చరణం: 2
కొంగేమొ కంగారుపడుతోంది
ఎన్నాళ్ళు దాచేది విరహం ఓ..
ఓయబ్బో నా గుండె లాగుతోంది
నీ పొంగాలు బంగారు పరువం ఓ..
నాయుడు బావో నా ఉబలాటం తగ్గించవా త్వరగా
మరదలు పిల్లా నా సహకారం అందించుతా పరా పరా..

అబ్బబ్బా పెదవి పూజకు వేళాయే
అమ్మమ్మా మధన జపమే మొదలాయే
వడదెబ్బ కొట్టిందే మోనాలిసా నీ కోక జారినాకా హ హ హ
గొడవెట్టి చంపిందే నాలో నిషా నీ చేయి తాకినాకా
ఊ కొట్టే ఉద్యోగం నీదేగా
జో కొట్టే చొరవుంది నీకేగా

అబ్బబ్బా పెదవి పూజకు హ హ హా..
అమ్మమ్మా మధన జపమే మొదలాయే




ఆ ఏడుకొండలు పాట సాహిత్యం

 
చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: టిప్పు. లెనిన చౌదరి 

ఆ ఏడుకొండలు




జుజుబి లల్లో పాట సాహిత్యం

 
చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: కె.కె, మహలక్ష్మి అయ్యర్ 

జుజుబి లల్లో



సిరిమల్లి పాట సాహిత్యం

 
చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాయి హర్ష 
గానం: మల్లికార్జున్, శ్రివర్ధిని  

సిరిమల్లి 




బొప్పాయ్ బొప్పాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: వీరభద్ర (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: కార్తీక్, సుజాత 

బొప్పాయ్ బొప్పాయ్

Palli Balakrishna Wednesday, January 24, 2018
A Aa E Ee (2009)


చిత్రం: అ ఆ ఇ ఈ (2009)
సంగీతం: యమ్.యమ్.శ్రీలేఖ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్, యమ్.యమ్.శ్రీలేఖ
నటీనటులు: శ్రీకాంత్ , సదా, మీరా జాస్మిన్
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాతలు: బొద్దం అశోక్ యాదవ్
విడుదల తేది: 06.11.2009

పల్లవి:
అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పటా
చీకటైతే చాలట చీర చాటు గోలట
రాజుకుంటే ఈడట దానిపేరె మూడట
ఊరుకోరాదట ఊసులాడాలట
ఊయలూపాలటా ట ట ట ట ట ట

అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పట

చరణం: 1
మొట్టమొదట నుదుటిమీద చెమట
వెల్లువై నదిలా మారింది
చుట్టుకొలత చూడగానే చిలక
భగ్గుమని వయసే రగిలిందే
ఎగుడు దిగుడు వెతికే దారుల్లో
జడతో జగడం జరిగేవేళల్లో
కన్నె కనకాంబరం సోకు చీనాంబరం
అరె తిరగ మరగ నలగలంటా ట ట ట ట ట ట

అచ్చట ముచ్చట
అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పటా

చరణం: 2
పట్టి మంచం కిర్రుమంటు గొడవ
యవ్వనం ఈలలు వేస్తుంటే
ఇంత మైకం ఇందులోన కలదా
నరనరం మెళికలు పడుతుంటే
ఒకటి ఒకటి కలిసే చప్పట్లో
అలుపు సొలుపు రాదే ఇప్పట్లో
నేనే గుడిగోపురం నీవే నా పావురం
నా ఎదపై నువ్వే వాలాలంటా ట ట ట ట ట ట

అచ్చట ముచ్చట
అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
హా... ఎచ్చట ఎచ్చట ఏవైనట సంగతే చెప్పటా
చీకటైతే చాలట చీర చాటు గోలట
రాజుకుంటే ఈడట దానిపేరె మూడట
ఊరుకోరాదట ఊసులాడాలట
ఊయలూపాలటా హ హ హ హ హ హ

అచ్చట ముచ్చట హు హు హు ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట హు హు సంగతే హు హు హు

Palli Balakrishna Thursday, November 30, 2017

Most Recent

Default