-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Neeli Neeli"



పాట: నీలి నీలి కల్లవాడే
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: మానుకోట ప్రసాద్ 
గానం: బాసని మమత
ఆర్టిస్ట్స్: దేతడి హారిక 
కోరియోగ్రాఫర్: రఘు మాస్టర్ 
ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు
మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్
విడుదల: 13.03.2021



నీలి నీలి కల్లవాడే పాట సాహిత్యం

 
పాట: నీలి నీలి కల్లవాడే
సంగీతం: మదీన్ SK
సాహిత్యం: మానుకోట ప్రసాద్ 
గానం: బాసని మమత


నీలి నీలి కల్లవాడే
వాని మాయన నిలువున దించినాడే
నిండు పున్నమి ఎన్నెల తీరు
వాడు నిండు మనసు అందగాడే

నీలి నీలి కల్లవాడే
వాని మాయన నిలువున దించినాడే
నిండు పున్నమి ఎన్నెల తీరు
వాడు నిండు మనసు అందగాడే

పట్టేసుకుందునా పట్టు జారిపోదునా
కట్నాలు ఇయ్యకుండ కట్టేసుకుందునా
పట్టేసుకుందునా పట్టు జారిపోదునా
కట్నాలు ఇయ్యకుండ కట్టేసుకుందునా

నీలి అరె నీలి… అరె నీలి నీలి కల్లవాడే
వాని మాయన నిలువున దించినాడే
నిండు పున్నమి ఎన్నెల తీరు
వాడు నిండు మనసు అందగాడే

వాని సూపులు సన్నని కత్తుల తీరు
అగొ తియ్యని గాయాలు సేసెను నాకు
వాని మాటలు మాయలు సేసెను సూడు
ఇగ తీరని ఆరాటమయ్యెను నాకు (2)

పట్టేసుకుందునా పట్టు జారిపోదునా
కట్నాలు ఇయ్యకుండ కట్టేసుకుందునా (2)
నీలి అరె నీలి… అరె నీలి నీలి కల్లవాడే
వాని మాయన నిలువున దించినాడే
నిండు పున్నమి ఎన్నెల తీరు
వాడు నిండు మనసు అందగాడే

నిద్దుర పట్టదు ఇదేం రోగం
వాని గురుతులే నాకు నిరంతరం
ఆకలి లేదు దాహం లేదు
నన్నాగం చేసెను పోరాగాడు (2)

పట్టేసుకుందునా పట్టు జారిపోదునా
కట్నాలు ఇయ్యకుండ కట్టేసుకుందునా (2)
నీలి అరె నీలి… అరె నీలి నీలి కల్లవాడే
వాని మాయన నిలువున దించినాడే
నిండు పున్నమి ఎన్నెల తీరు
వాడు నిండు మనసు అందగాడే

సీకటి కమ్మిన సిత్రం సూడు
నాకు పగలే రాత్రై పోయెను సూడు
నిన్నెట్టాగైనా ఏలుకుంటా
ఏడేడు జన్మల బంధం అట (2)

రారా ఓ పిలగా రాలుగాయి పొల్లగా
రంధి లేని రాత నాకు రాసిపోరాదురా (2)
నీలి అరె నీలి… అరె నీలి నీలి కల్లవాడే
వాని మాయన నిలువున దించినాడే
నిండు పున్నమి ఎన్నెల తీరు
వాడు నిండు మనసు అందగాడే

Palli Balakrishna Saturday, May 27, 2023

Most Recent

Default