-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




సాంగ్: సిటీకేస్తే పోయేటి ప్రాణానికి
సంగీతం: మదీన్ SK
రచన: గను
సింగర్: హన్మంత్ యాదవ్ 
ప్రొడ్యూసర్: బైరా దేవ్ యాదవ్ 



సిటీకేస్తే పోయేటి ప్రాణానికి పాట సాహిత్యం

 
సాంగ్ : సిటీకేస్తే పోయేటి ప్రాణానికి
సంగీతం: మదీన్ SK
రచన: గను
సింగర్: హన్మంత్ యాదవ్ 
ప్రొడ్యూసర్: బైరా దేవ్ యాదవ్ 

వేములవాడ రాజన్న దేవుని
అడుగే నీ మీదున్న ఇష్టం 
కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే 
నీకు రావద్దు కష్టం 
సిటీకేస్తే పోయేటి ప్రాణానికి
ప్రేమ సీక్కులు పెటీనవేందే
బండ తీరు ఉండేటీ నా గుండెకు
ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే 

ఆ దేవుని మీద మన్ను వోయా
నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే
నీ మీదే పానమయే
పిల్ల నీ తోడు లేక పోయే
నాకు సావన్న రాకపాయే 

వేములవాడ రాజన్న దేవుని అడుగే
నీ మీదున్న ఇష్టం 
కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే 
నీకు రావద్దు కష్టం 

ఎందుకే పిల్ల నామీద కోపం 
గుండె కోసి చూడు నీ రూపం
ఎందుకే పిల్ల నామీద కోపం
నువ్వే కదానే నా లోకం
ఎందుకే పిల్ల నామీద కోపం 
ఏ జన్మలో చేసిన పాపం 
నా గుండెల్లో దాగున్న ఈ బాధని
నేను ఎవరితో చెప్పుకోనే 


ఆ దేవుని మీద మన్ను వోయా
నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే
నీ మిదే పానమయే
పిల్ల నీ తోడు లేకపాయే
నాకూ సావన్నా రాకపాయే

వేములవాడ రాజన్న దేవుని అడుగే
నీ మీదున్న ఇష్టం
కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే 
నీకు రావద్దు కష్టం

నువ్వు ఎట్లా ఉన్నావు ఇంటికాడ
నేను రాలేను నిన్ను చూడ 2
నేను ఉన్నది బార్డర్ కాడ
చచ్చిపోయిన తేలువది జాడ

నా ప్రాణం పోతున్నది
ఇంట్లో చీకటి అయితె ఉన్నది
నువ్వు నాతోవ చూడ బోకు
నా అడుగులో నువ్వు రాకు
కంట కన్నీరు పెట్టబోకు
ఇంట్లొ దుఃఖాల పాలుగాకు

సిటీకేస్తే పోయేటి ప్రాణానికి
ప్రేమ సీక్కులు పెటీనవేందే
బండ తీరు ఉండేటీ నా గుండె ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే
ఆ దేవుని మీద మన్ను వోయా
నీ ప్రేమకు బాకీ లేవేందే
బువ్వ తింటే పొతలేదే
నీ మీదే పానమయే పిల్ల నీ తోడు లేకపాయే
నాకు సావన్నా రాకపాయే

No comments

Most Recent

Default