Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Rajasree"
Lakshmi Kataksham (1970)



చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ, డా॥ సి.నారాయణరెడ్డి 
నటీనటులు: యన్.టి.రామారావు, కె.ఆర్.విజయ, రాజశ్రీ 
దర్శకత్వం: బి.విఠలాచార్య 
నిర్మాత: పింజల సుబ్బారావు 
విడుదల తేది: 12.03.1970



Songs List:



శుక్లాంబర ధరం విష్ణుమ్ పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: మాధవ పెద్ది, సావిత్రి

శుక్లాంబర ధరం విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్
శుక్లాంబర ధరం విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే



సకల విద్యామయీ పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: ఘంటసాల 

సకల విద్యామయీ ఘన శారదేందు
రమ్య పాండుర రూపిణీ రాజతార్థ 
విద్యలెల్లను నేర్చితి, విమల మార్గ 
దీక్ష నడిపింపుమా, భారతీ నమస్తే




నాదు గురుదేవు కార్యార్ధి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: ఘంటసాల 

నాదు గురుదేవు కార్యార్ధి నౌచు నేడు
వచ్చితిని, ఎట్టి విఘ్నముల్ బడయకుండ
కరుణ దీవింప వేడితి కరము మోడ్చి
విజయమును గూర్పుమా! నమో విఘ్నరాజా ! !




పొన్న చెట్టు మాటున పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.జానకి 

పొన్న చెట్టు మాటున పొద్ధువాలి పోయింది
గున్న మావి గుబురున కోయలమ్మ కూసింది

పల్లవి: 
హేయిరే పైరుగాలి ఆగి ఆగి యిసిరింది.
అరెరె పైట చెంగు ఆగలేక ఎగిరింది.
వయసే వాగులాగ దూకింది.
గుండెలో కొండమల్లె గుబాళించి నవ్వింది

చరణం: 1
గడుసరి సూరీడు పడమట చేరాడు
ఇంపైన సందెపడుచు చెంపలు రెండు గిలాడు
అది తలచుకుంటె వలమాలిన పులకరింత
అది తెలుసుకుంటే చిలిపి సిగుల చిలకరింత

చరణం: 2
నచ్చిన చినవాడు మెచ్చిన జతగాడు
నాపైన మనసుపడి రేపో మాపో రాకపోడు
వాడు వెంటబడితే జంట గూడితే యెన్నెలపంట
వాడి కంటి పాపలో కొంటె సూపునై కాపురముంటా




కిలకిల బుల్లెమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఘంటసాల, యస్.జానకి 

కిలకిల బుల్లెమ్మా ! ఒహెు! ఒహెు
కిలాడి బుల్లెమ్మా
నీ ఒంటిమీద చెయ్ ఎయ్యంగానే వులిక్కి పడతావే

బడాయి మాఁవయ్యో: ఉహు: ఉహు: ఉహు:
ఆడావు డేందయ్యో!
నువు పట్టపగులే నను పట్టుకొందవూ
పరువు పోతదయ్యో

నీ బి త్తర సూపులు సూసీ
నీ నడకల వూపులు సూసీ
నా మనసూ జిల్ జిల్ మంటాదే
సేతులోన సిక్కినావు, బూకరించి పోలేవు
సిగ్గు వొదిలి రావే నాదానా

కన్నెపడుచు కంటబడితే
నమ్మి కాస్త దగ్గరకొస్తే
మొగ వోళ్లూ సైగలు చేస్తారూ
ఒళ్ళుపైన తెలుసు కోరు
యెనక ముందు సూసుకోరు
యెర్రెక్కి పైన బడతారూ

మీ సంగతి తెలుసును లేవే
ముందట్టా చెబుదురులేవే
నేనెరగని వాళ్లా పోవే
ఎగిరి ఎగిరి పడతారు
బిగువు కాస్త సూపుతారు
సల్లంగ దారి కాస్తారూ !
ఎవరూ ?
మీరూ!
అవ్వ !
అవ్వలేదు బువ్వలేదు రా
నవ్వులాట కాదులే పో పో
రా - పో
రా - పో




గత సువిజ్ఞాన పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: ఘంటసాల 

గత సువిజ్ఞాన ప్రకాశమ్ము మరల
కల్గించితివి తల్లీ కారుణ్యవల్లీ
జయ తిమిరి నిర్దూత దరహాస వల్లరీ
జయప్రణవ నాదాత్త ఝంకార బంభరీ
సకల సంపత్కరీ జ్ఞానేశ్వరీ నమో ...




జో జో లాలి లాలి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: పి.సుశీల 

జో జో 
లాలి లాలి లాలీ
చిన్నారి పాపాయి లాలీ
ఎన్నెన్ని జన్మాల
పుణ్యాల ఫలమో
ఈ తల్లి ఒడిలోన
వెలిశావు తండ్రీ

నా కంటి పాపా
నిదురింప వోయీ
నా పాల యెదలోని
దీపాని వోయీ
హాయీ హాయీ హాయీ!



అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి: 
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే
గుట్టు తెలిసిందిలే
నీ రూపులోన నీ చూపులోన
ఏ రాచ కళలో మెరిసేననీ
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే
గుట్టు తెలిసిందిలే ఆద్యుడేద
ఏ కొంటె ఎరుడో
గంధర్వ వీరుడో
నా కళ లోన నవ్వేననీ

చరణం: 1
కులికే వయసే పులకించిపోగా
కొంగు ఆగుతుందా ఎదలో కదలే
పొంగు ఆగుతుందా
పువ్వల్లే మారిపోయి - ముద్దుల్లో తేలిపోయి
కవ్విస్తే కన్నె మనసు ఆగుతుందా

చరణం: 2
వలచే జాబిలి యిలపైన రాగా
కలువ దాగుతుందా విరిసే మురిసే తలపు దాగుతుందా
తీగల్లే అల్లుకుంటే - ఓ ఓ
గుండెలో ఝలుషంటే ఆమె: ఓ ఓ
దాచినా దోరవలపు దాగుతుందా




రా వెన్నెల దొరా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఆహా హ అహ హ
అహ హ ఓహో ఓ ఓ
ఆహ హ హా
రా వెన్నెల దొరా కన్నియను చేరా
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ
రా వెన్నెల దొరా కన్నియను చేరా
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ

ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోనా
ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోనా
ఉన్నానులేవే ప్రియతమా ఆ ఆ
నీ మగసిరి నగవులు చాలునులే
నీ సొగసరి నటనలు చాలునులే
నీ మనసైన తారను నే కానులే
రా వెన్నెల దొరా వింత కనవేరా
రా చిలకవౌరా అలిగినదిలే రా ఆ ఆ ఆ

ఈ మబ్బు తెరచాటేలా ఈ నింగి పయణాలేలా
ఈ మబ్బు తెరచాటేలా ఈ నింగి పయణాలేలా
ఎద నిండిపోరా చందమా ఆ ఆ
నీ పగడపు పెదవుల జిగి నేనే
నీ చెదరని కౌగిలి బిగి నేనే
నా ఎద నిండ నీవే నిలిచేవులే
రా వెన్నెల దొరా కన్నియను చేరా
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ

రా వెన్నెల దొరా వింత కనవేరా
రా చిలకవౌరా అలిగినదిలే రా ఆ ఆ ఆ





నా వయసు సుమగంధం పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ 
గానం: పి.సుశీల, విజయలక్ష్మి 

నా వయసు సుమగంధం
నా మనసు మకరందం
కొని పోవోయి వలపుల నా రాజా
అందగాడా జలకాలాడే
సుందరి నీకె వేచిందీ.
సిగు సింగారాల బిగువూ చూచె లేవే
సిగ్గు నిండారంగ నిన్నే కోరి చేరె

అయ్యొ, యింతేన మరియే మొ
అనుకున్నానూ
వేడి రగిలే విరహం సాగె
చెంతకు రాడేమె చెలికాడు
ప్రేమ బాణం నీపై
గురిపెట్టాడే భామ
అయ్యొ యేమౌతావో, చక్కని చెక్కెర బొమ్మ
ఏమె యీ బాధ పడలేనెయీ వేళా



స్వాగతం స్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ 
గానం: పి.లీల, యస్.జానకి & కోరస్ 

స్వాగతం స్వాగతం
శాత్రవ జన జైత్ర స్వాగతం
సుకృతావతార దయ సేయుమురా
రతనాల బాట పయనింపుమురా
రతి రాజ సార

రణరంగధీర
వర శుభ గుణ సువదన భూరి భూరమణ
పూజ తాబ చరణా

పూబాల వికసించె నీ నవ్వులో
భూమాత పులకించె నీ దారిలో
పున్నెము పురివిచ్చె
వన్నెల సిరి హెచ్చె
అందాలె నిను మెచ్చె
ఈవు యేజనని నోముపంట వవురా
శ్రీ దేవి నెలకొన యీ మందిరం
రారాజ వరులైన రాదుర్లభం
రమ్మిటు జయశీల
రంజిత జనపాల

నీ మ్రోల రసలీల
మువ్వలే పలికె
దివ్వెలే కులి కెరా




ధన్యోస్మి ధన్యోస్మి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ 
గానం: ఘంటసాల 

ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్యమాతా
శ్రీమన్మహా సర్వలోక ప్రవృత్తి ప్రకాశావకాశ ప్రభాకారిణీ!
పావనీ ! నిత్యసౌభాగ్య సంపన్న సంవర్దినీ, శ్రీమహాలక్ష్మి
మాణిక్య సౌవర్ల హేరాళ హారావళీ రంజితా మేయ
చాంపేయ గాత్రీ పయోరాశిపుత్రీ ! నమోవిష్ణు పత్నీ
నమస్తే, నమస్తే, నమస్తే, నమం




శుక్రవారపు పొద్దు పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ 
గానం: యస్.జానకి 

శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు
దివ్వె నూదగవద్దు బువ్వ నెట్టద్దు 
తోబుట్టువుల మనసు కష్ట పెట్టద్దు 
తొలి సంజ మలిసంజ నిదుర పోవద్దు
మాతల్లి వరలక్ష్మి నిను వేడదపుడు
ఇల్లాలు కంట తడి పెట్టనీ యింట
కల్లలాడని యింట గోమాత వెంట
ముంగిళ ముగ్గులో పసుపు గడపల్లో
పూలలో పాలల్లో ధాన్య రాసుల్లో
మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు




అందాల బొమ్మను నేను చెలికాడ పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: విశ్వప్రసాద్ 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

అందాల బొమ్మను నేను చెలికాడ
మందార వల్లిని నేను విలుకాడ
ముద్దు ముద్దుగా హాయి హాయిగా చేరరారా..
చేరిపోరా మోహన రాజా మన్మధ రాజా

నీలో కదిలే కోరిక లేవో
నీలో మెదిలే లాలసలేవో
మారాము చేసెను లేరా
గారాలు ముగించి రారా
తనువంతా తీయని తాపమురా
తనువంతా తీయని తాపమురా
నాలో మెరిసే అందము నీదే
నాలో కురిసే చందము నీదే
జాగేలా వేగిర లేరా-కౌగిట్లో బిగించ రారా
నిను కోరి చేరిన భామనురా




జయ జయ మహాలక్ష్మి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి 
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ 
గానం: యస్.జానకి 

జయ జయ మహాలక్ష్మి
జయ మహాలక్ష్మి
ఈ దివ్య కథ చూడ యేతెంచినట్టి
అందరికి అలరారు అఖిల భోగాలు
సకల సౌక్యమ్ములు సర్వ సంపదలు
పిల్లల పాపలు కొలంగ సిరులు
కలుగంగ దీవించి
తరుణించవమ్మా
కరుణించవమ్మా
ఓ మహాలక్ష్మి
శ్రీ మహాలక్ష్మి
జయ మహాలక్ష్మి

Palli Balakrishna Wednesday, December 6, 2023
Prema Jeevulu (1971)



చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
నటీనటులు: కృష్ణ , రాజశ్రీ 
దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్ 
నిర్మాతలు: జి.రామం, చంద్రశేఖర్
విడుదల తేది: 05.03.1971



Songs List:



అబలని ఎందుకని పుట్టించావని పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

అబలని ఎందుకని పుట్టించావని 




ఇది ఎన్నడు వీడని కౌగిలి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

ఇది ఎన్నడు వీడని కౌగిలి 



కొట్టాడయ్య ఛాన్స్ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జె.వి.రాఘవులు 

కొట్టాడయ్య ఛాన్స్ కొట్టాడయ్య మొనగాడయ్య 




చిగురు వేసెనే చిలిపి కోరిక పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

చిగురు వేసెనే చిలిపి కోరిక 



దయచూడు యేసు ప్రభూ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: దాశరథి 
గానం: విజయలక్ష్మి కన్నారావు 

దయచూడు యేసు ప్రభూ 



పిల్లా ఓ పిల్లా నీకు ఒళ్లంతా సిగ్గే సిగ్గు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

పిల్లా ఓ పిల్లా నీకు ఒళ్లంతా సిగ్గే సిగ్గు 





మీద కొబ్బరి చెట్టు కింద చెరువు గట్టు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ జీవులు (1971)
సంగీతం: విజయా కృష్ణమూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, విజయలక్ష్మి కన్నారావు

మీద కొబ్బరి చెట్టు కింద చెరువు గట్టు 


Palli Balakrishna Wednesday, August 17, 2022
Bangaru Kutumbam (1971)



చిత్రం: బంగారు కుటుంబం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: కృష్ణ, విజయనిర్మల, రామకృష్ణ, రాజశ్రీ, అంజలీదేవి, గుమ్మడి, ఛాయాదేవి, రాజబాబు, విజయభాను, అల్లు రామలింగయ్య, ప్రభాకర్ రెడ్డి, కిస్ మిస్ (మలేషియా రాణి)
మాటలు: B.నారాయణరెడ్డి (ఒక పాట కూడా రాశారు)
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
నిర్మాత: కె.దశరధరామానాయుడు, కె.ప్రభాకర నాయుడు 
విడుదల తేది: 13.08.1971



Songs List:



లక్ష్మి మహీతదనురూప పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు కుటుంబం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: శ్లోకం
గానం: సుమిత్ర

లక్ష్మి మహీతదనురూప 



పిల్లగాలి ఊయలలో పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు కుటుంబం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

పిల్లగాలి ఊయలలో 



జీవితాన వరమే బంగారుకుటుంబం పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు కుటుంబం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వీటూరి
గానం: ఘంటసాల

జీవితాన వరమే బంగారుకుటుంబం 




యవ్వనం చక్కని పువ్వురా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు కుటుంబం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఎస్.జానకి, బి.వసంత

యవ్వనం చక్కని పువ్వురా 



చెలి దోసిట పోసిన మల్లియల పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు కుటుంబం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎస్.జానకి

చెలి దోసిట పోసిన మల్లియలు 




మీట్ మి ఎలోన్ ఓ స్వీట్ మై డార్లింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు కుటుంబం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: B. నారాయణరెడ్డి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

మీట్ మి ఎలోన్ ఓ స్వీట్ మై డార్లింగ్ 

Palli Balakrishna Friday, August 12, 2022
Anuradha (1971)



చిత్రం: అనురాధ  (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ, ఆరుద్ర, డా॥ సి. నారాయణరెడ్డి, అప్పలా చార్య 
గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, స్వర్ణలత, యస్.పి. బాలు, పిఠాపురం నాగేశ్వరరావు 
నటీనటులు: కృష్ణ, కృష్ణం రాజు, చంద్రమోహన్, విజయనిర్మల, రాజశ్రీ, విజయలలిత 
రచన: ఆచార్య ఆత్రేయ
దర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డి
నిర్మాత: యస్. వి. ప్రభాకర్ రెడ్డి
విడుదల తేది: 23.07.1971



Songs List:



ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో పాట సాహిత్యం

 
చిత్రం: అనురాధ  (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి. బాలు

ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో



చెబుతా చెబుతా పాట సాహిత్యం

 
చిత్రం: అనురాధ  (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

చెబుతా చెబుతా 



కూరకని రా రా కొంటె కుర్రాడ పాట సాహిత్యం

 
చిత్రం: అనురాధ  (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: స్వర్ణలత

కూరకని రా రా కొంటె కుర్రాడ




యాదయ్యా యాదయ్యా జాజిరి పాట సాహిత్యం

 
చిత్రం: అనురాధ  (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: అప్పలా చార్య 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత 

(రాజబాబు, రమాప్రభ పైన ఈ పాటను చిత్రీరించారు)

యాదయ్యా యాదయ్యా జాజిరి 



పొంగే మధువు ఏమంటుందో పాట సాహిత్యం

 
చిత్రం: అనురాధ  (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం:  యస్.పి. బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి 

పొంగే మధువు ఏమంటుందో 



కోడె వయసు కుర్రాడ పాట సాహిత్యం

 
చిత్రం: అనురాధ  (1971)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

కోడె వయసు కుర్రాడ

Palli Balakrishna Tuesday, August 2, 2022
Madanakamaraja Katha (1962)



చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: కాంతారావు,కృష్ణకుమారి, హరనాథ్, రాజశ్రీ
నిర్మాత, దర్శకత్వం: బి.విఠలాచార్య
విడుదల తేది: 09.11.1962



Songs List:



జనని బద్రకరాల కాళి పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

జనని బద్రకరాల కాళి



నా కోటి స్వప్నాలు పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్

నా కోటి స్వప్నాలు 



చిక్కును విప్పవే చినదానా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: జిక్కీ , నాగేంద్ర 

చిక్కును విప్పవే చినదానా




ప్రేమతో సరి అయినది భూమిలో ఏమున్నది పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ప్రేమతో సరి అయినది భూమిలో ఏమున్నది 



ఓ ప్రియతమా రావా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ఓ ప్రియతమా రావా 



నీలి మేఘ మాలవో... నీలాల తారవో (Male) పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్,

నీలి మేఘ మాలవో... నీలాల తారవో





నీలి మేఘ మాలవో... నీలాల తారవో (Duet) పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

పల్లవి:
నీలి మేఘ మాలవో... నీలాల తారవో
నీ సోయగాలతో...మదినీ దోచిపోదువో..ఓ ఓ ఓ..
నీలి మేఘ మాలనో...నీలాల తారనో
నా సోయగాలతో...మదినీ ఈ ఈ దోచిపోతినో..ఓ ఓ ఓ..

నీలి మేఘ మాలనో...

చరణం: 1
నీ రాక కోసమే చెలి... నే వేచియుంటినే...
ఆరాటమేలనో ప్రియా... నే చెంత నుంటినే...
ఆనంద మధుర గీతములా.. ఆలపింతమా ఆ ఆ ఆ ...
నీలి మేఘ మాలనో....

చరణం: 2
చివురించు వలపు తీవెల... విరి పూలు పూయగా...
చిరునవ్వు విరుపు లోపల... హరివిల్లు విరియదా...
నెలవంక నావలోన మనము కలసిపోదమా ఆ ఆ ఆ ...

నీలి మేఘ మాలవో...

చరణం: 3
మనలోని కలత మాయమై... మన ఆశ తీరెగా...
అనురాగ రాగమే ఇక...మన రాగమాయెగా....
మనసార ప్రేమ మాధురుల సాగి పోదమా ఆ ఆ ఆ ...
నీలి మేఘ మాలనో... నీలాల తారనో...
నీ సోయగాలతో... మదినీ దోచి పోదువో...





తేలిపోదామా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

తేలిపోదామా 

Palli Balakrishna Sunday, July 17, 2022
Aggi Veerudu (1969)



చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
నటీనటులు: యన్.టి.రామారావు, రాజశ్రీ 
దర్శకత్వం: బి.వి.శ్రీనివాస్ 
నిర్మాత: బి.విఠలాచార్య 
విడుదల తేది: 17.10.1969



Songs List:



లేడి కన్నులు పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

లేడి కన్నులు రమ్మంటే 
లేత వలపులు జుమ్మం 
ఓలమ్మీ .... ఓలమ్మీ సై.... 

కన్నె మనసే నీదైతే 
కలికి వెన్నెల తోడైతే 
ఓరబ్బీ .....ఓరబ్బీ పై

వాగులా గలగల ఉరికీ
తీగలా మెలికలు తిరిగి
గుండెలో అల్లుకుపోతే 
గువ్వలా గుసగుస పెడితే...
ఓలమ్మీ పై .... ఓలమ్మీ పై ...

వాలుగా చూపులు చూసే 
పూల బాసలు చేసి
ముదుగా ఉందామంటే
ఇద్దరం ఒక టేనంటే 
ఓరబ్బీ .... ఓరబ్బీ పై .....




సరి సరి మగసిరి పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: కొసరాజు 
గానం: గాయనీ గాయకులు బృందం 

సరిసరి మగసిరి నీ అందము 
మరిమరి మనసుకు ఆనందము 
చక ఝణత తక ధిమిత 
రా రా రతిరాజా !

చిలకల కులుకులు చూడు
జిల్ జిల్ జిల్ సొగవే జోడు
వినరా హే సుకుమారా ధీరా 
కౌగిట చేరగ రా ! రా! 
లల్లలా జురా....జుం....జుం ....

ముసిముసి నవ్వుల తీరు 
విసిరే చూపుల జోరు
భళిరా రాజకుమారా రా రా
చల్లని వేళయిదేరా





అలాంటి దాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల 

అలాంటిదాన్ని గౌనుః యిలాంటిదాన్ని గాను 
ఎలాంటిదాన్నో నేను నీకిపుడె తెలిసిపోను 
లబ్జలకిడి లబ్జలకిడి చక్కని చకెర చక్కని చక్కెరకేళి॥ 

ఒయ్యారం ఒలక చూసే చిన్నదానినోయ్
చూపులతో గాలమేయు సుందరాంగినోయ్ 
ఎవరనుకున్నావు నన్నెరుగవులే నీవు
అబ్జలకిడి.....

కమ్మంగా పాటపాడి కవ్విస్తానోయ్ 
గజ్జెకట్టి ఆటలాడి నవ్విస్తానో య్ 
ఎవరనుకున్నావు నన్నెరగవులే నీవు
అబ్జలకిడి.....




పిలిచింది అందాల పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల 

హాయ్ లల్లలా.... లల్లలా 
లల్లలా.... లల్లలా.. యే యిదిగో నిన్నే... 
నిన్నే నిన్నే ...

పిలిచింది అందాల బాల నిను
వలచింది మందార మాల
హాయ్ రాజ రాజ ఠారా! అందాలే అందుకోరా!!

జాబిలిలేని కలువను నేను
కౌగిలిలేని పరువము నేను 
కలలో నిన్నే కనుగొన్నాను 
హాయ్ రాజ... రాజ...

వేచెను నీకె ఈ మధుమాసం 
పూచెను వీకై నాదరహాసం
దాచితి నీకై ఈ అవకాశం
హాయ్ రాజ... రాజ...





ఎవరో నీవెవరో పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఓ ప్రియతమా.. రావేలా... చెలిని చేరగ ఈ వేళ!
ఎవరో... నీవెవరో ఎదలో పిలిచీ
ఎదురుగ నిలిచీ
తీయని ఊహల ఊయల లూపేవు 

చొక్కపు బంగరుమేను: పొగరెక్కిన 
సింగపు నడుము చుక్కల రాయని సోయగమ్ము నెక 
సక్కెములాడే మోము ::
ఏ గంధర్వ లోకాల ఉన్నావో ఏ 
నీలాల గగనాలు దిగినావో
శత వసంతముల ప్రతినిధివీవు 
ప్రతిలేని రతిరాజు ప్రతిరూపమే నీవు

చంద్ర ఖండములు చెక్కిళ్లు
ఇంద్ర నీలములు ముంగురులు 
అ పాలకడలి కెరటాల కరణి 
నాలోన పొంగినవి మరులు
నీ అధరాన చిరునవ్వు విరిసింది 
నా హృదయాన విరిజల్లు కురిసింది.
వనమయూరీవోలె తనువూగినది
ఒక చింత గిలిగింత ఉయ్యాలలూపింది 




రవ్వల నవ్వుల పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

రవ్వల నవ్వుల రాజకుమారీ 
నా నవజీవన నాట్యమయూరీః
అందెలు పలుకగ రావే: 
గంధము చిలుకగ రావే!

ఈ వేళలో! ఏమున్నదో 
పలెకెనులోన కల్యాణ వీణ
ఆ రాగ మంజరిలోనా అనురాగ మాధురి లేదా
రవ్వల నవ్వుల రాజకుమారా 
రాజకుమారీ మానసచోరా
నా అణువణువున నీవే: 
నా ప్రాణములన్నీ నీవే.....

నయనాలలో నడిరేలలో 
విరబూసె నాలో నీరూపమాల
ఆ రూప మాలిక నీకై
అందిచు కానుక కాదా ....




కాకి ముక్కుకు దొండపండు పాట సాహిత్యం

 
చిత్రం: అగ్గి వీరుడు  (1969)
సంగీతం: విజయ కృష్ణ మూర్తి
సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల 

అత్తరులో మునిగివున్న నవాబూ...ప్యారే నవాబ్ :.
మత్తుగా తూలుతున్న జనాబూ....హాయ్ జనాబ్ :
కలికి వలపే పూలచెండు: మగువ సొగసే దొండపండు।

కాకిముక్కుకు దొండపండు దండగః దండగః
అది రామచిలకకు దొరికితేనే పండగః పండగః
వరహాల మూటలకన్న వజ్రాల కోటలకన్న 
ఖరీదైనది ప్రేమించే దిల్ 
అది వుంటేనే అందుతుంది బుల్ బుల్ 
కడకన్నులతో వేటాడేవా... కను బొమ్మలతో ఆటాడేవా 
చిరునవ్వుల పువ్వుల దోసిలితో వెంటాడేవాః

కన్నెపిల్ల కనబడితే... 
గాజుల గలగల వినబడితే 
అంతలోనే మైమరిచేరు కడకు
అడియాసల పాలౌతారు:

దొరబాబుల తీరు అంతేలే 
నవ్వాబుల జోరు ఇంతేలే..... 
ఆ నాటికి నేటికి మిగిలింది ఈ వింతేలే...

Palli Balakrishna Monday, January 31, 2022
Ma Manchi Akkayya (1970)



చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
నటీనటులు: కృష్ణ, రాజశ్రీ, శోభన్ బాబు
దర్శకత్వం: వి. రామచంద్ర రావు
నిర్మాత: కె.ఆనంద మోహన్
విడుదల తేది: 15.05.1970



Songs List:



ఆహా కలా వైపరీత్యమా పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: బొల్లిముంత శివరామకృష్ణ
గానం: యస్.పి.బాలు, ధూళిపాళ 

వచనం :
ఆహా. కాల వైపరీత్యమన నిట్టిదే
కాబోలు గయుని జంపెదనని నేను
శపధం బొనర్ప, నర్జనుండు శరణు
మిచ్చుటయా నాకై నేను కబురంపిన
గూడా కాదని త్రోసి పుచ్చుటయా?
చెలినై, చుట్టమునై కాండవ దహ
నాద్యనేక విజయంబులకు కారణమైన
నాతో - అకారణమూ, అనూహ్యమూ
నైన కయ్యంబునకు కాలు ద్రువ్వుటయా
అర్జునా! నీవు కృతఘ్నుడవు....
నా శత్రువు గయుడు కాదు.... నీవు.... నీవు

పద్యం:
విలయం బైన, విరుదమైన, ధరణీ విద్వంశ మేయైన, ను
జ్వలుడౌ భానుడు చల్లనైనను, చతుస్సంద్రంబు లొక్కుమ్మడిన్
జల శూన్యం బయినన్, కిరీటితో సహా సర్వోర్వియే దాకినన్
కలనన్, యీ గయునొంతు, దుృంతును, ప్రతిజ్ఞ దీక్ష చెల్లింతునే



మనసే చల్లని జాబిలిగా పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి :
మనసే చల్లని జాబిలిగా - మన వలపే పున్నమి వెన్నెలగా
జీవిత మంతా వెలగాలి - ఈ లోకమే స్వర్గము కావాలి
మరదలు పిల్ల ఇల్లాలై - నా మదిలో మల్లెలు చల్లెనులే
కోరిన చిన్నది పలికే పలుకే
తీయని పాటె కోరికేదో ఊరించేలే
కలతలు లేనీ సంసారం - నా నోముల పంటై విరిచెనులే 
ప్రతి రోజూ ఒక పండుగలాగా
బ్రతికే మనకూ లేని భాగ్యం ఏముందిలే
చిన్నారి పొన్నారి పాపాయిలూ
చిరునవ్వు రవ్వలు చిందించగా
మైమరచి ఉయ్యాల లూపేములే
జత గలిపి జోలల్లు పాడేములే



చెల్లీ ఓ చెల్లీ పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల

పల్లవి:
చేతికందే పంట చేయి జారిపోయింది.
నీడ నొసగేకొమ్మ వీడి పడి పోయింది
చెల్లీ  ఓ చెల్లీ - చెల్లీ  ఓ చెల్లీ
విలపించకు చల్లని తల్లీ ఇది ఎవరు చేసిన పాపం
విధి కెందుకు ఇంతటి కోపం

చరణం : 1
సుగుణాల కల్ప వల్లీ దిగులేల నీకు చెల్లీ
నీ పెళ్ళి జరిగి తిరాలి . నీ నోము లన్ని పండాలి॥

చరణం : 2
తన కాళ్ళపై నడచిన వాడు - తన వారిని నడిపించిన వాడు
కుంటి బ్రతుకుతో కుమిలెను నేడు
కుంపటి ఎదపై రగిలెను చూడు।





ఏమో ఏమో అడగాలనుకున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: అప్పలాచార్య కొడకండ్ల 
గానం: ఘంటసాల, పిఠాపురం నాగేశ్వరరావు , ఎల్.ఆర్.ఈశ్వరి, యస్. జానకి 

ఏమో ఏమో అడగాలను కున్నావు
ఏమీ రానీ పసి పాప వైనావు
ఏదో ఏదో చేయాలనుకున్నావు - మాటేరాని పసివాడవై నావు
నిగ నిగ లాడే బుగ్గలలో - కెంపుల నీడలు కులికినవీ
ఊహలు ముందుకు సాగినవీ - అడుగులు తడబడి ఆగినవీ
నల్లని నీ జడలో మల్లెలు నవ్వినవీ
చక్కిలి గింతలు కలిగినవీ -

జాబులు పనిచేస్తున్నయ్
జంటను కలిపేస్తున్నయ్
కళ్ళారా చూశాను
విరహంతో నిలిచాను
అయితే ఇంకేం అయినై పోదాం దొరకదు ఛాన్సు
తొలకరి నవ్వుల సవ్వడిలో - తీయని వీణలు పలికినవీ
సొగసులు చూసిన మైకంలో కనులే కావ్యము రాసినవీ
వెచ్చని కౌగిలిలో వొంపులు కందినవీ
నను నీ సొంతం చేసినవీ 




చూపులు కలిసిననాడే పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

చూపులు కలసిననాడే నీ రూపం మిసమిస లాడే
మనువులు కలసిన నేడే| మన - మమతలు గుసగుస లాడే:
మరుమల్లె తెల్లనిది - చిరునవ్వె చల్లనిది
నీలో మరి నాలో: విరబూసిన వలపే తెల్లనిది చల్లనిది

తొలి రోజు పూచినది - మలి రోజు వేచినది
నాలో మరి నీలో అది నాడు నేడు మాయినది తీయనిది
సూర్యం : విరి పానుపు చూచినది - నను తొందర చేసినది
ఎదలో పయ్యెదలో పులకింతల పున్నమి విరిసినది: మెరిసినది
అనురాగం ఆరనిది మన బంధం తీరనిది |
కలగా కోయిలగా కలకాలం కమ్మగ నిలిచేది పిలిచేది




చిట్టిపాప చిన్నారి పాప పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: కౌసల్య,  పి.సుశీల 

చిట్టి పాపా చిన్నారిపాపా - మీ అమ్మగానీ
మా అమ్మగానీ - లోకాన అందరికితొలి దైవమే
పసిపాప పలికేటి మొదటి మాట
అదే అమ్మా! అమ్మా! అన్న తెలుగు మాట
అనురాగ క్షీరాలు అందించు తల్లీ 
కనిపించు దైవమే కన్నతల్లీ 

ప్రతిచోట దేవుడే కనిపించలేక - అమ్మనే సృష్టించి పంపినాడు
ఏ వేళ మీ యమ్మ నీ వెంట ఉంది
కను పాపలా నిన్ను కాపాడు తుంది





ఓ బుల్లెమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: అప్పలాచార్య కొడకండ్ల  
గానం: బసవేశ్వర రావు, కౌసల్య

బుల్లెమ్మ, బుల్లెమ్మ, బుల్లెమ్మ, బుల్లెమ్మ
జలసా బుల్లెమ్మా  చిట్టిమ్మ, చిట్టిమ్మ, చిట్టిమ్మ, చిట్టిమ్మ
సినిమా చిట్టిమ్మా - స్టీమరువలె! రివ్వునభలే, దూసుకురావమ్మా

ఓ .... బుల్లోడా  బుల్లోడ, బుల్లోడ, బుల్లోడ, బుల్లోడ
దసరా బుల్లోడా!  పిల్లోడ పిల్లోడ, పిల్లోడ, పిల్లోడ
సినిమా పిల్లోడా 
బాణము వలే ప్రాణము ఇలా తీయకు పోవయ్యా
వలపులు పులకలు - మెలికలు తిరిగెను
పిల్లా రక్షించూ 
పెనిమిటి ఇతడని పెద్దలు పలికిన రాత్రికి కనిపించూ
అయ్యో చెలీ  చచ్చె చలీ 
తొందర పడి చావకు మరీ నీదేలే రా వెచ్చని నా కౌగిలి

మిస మిస జిలుగులు ముసి ముసి నగవులు
ప్రేమతో చిలికించా
అడయార్ చెట్టును - మోర్ మార్కెట్టును
నేనూ చూపించా
సినిమాలలో చేర్పించవా?
తప్పదుకదా - పోదాం పద
తారల మైతే ఎంతో జాలీలే 




ఎవరన్నారురా ఇది లోకమని పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

చరణం: 
కొలచిన దేవం వెలి వేసినా కోవెల తలుపులు మూసెనా
యుగయుగాలుగా అబలబ్రతుకున మిగిలిన శాపం ఇదేనా?

పల్లవి: 
ఎవరన్నారు. ఇది లోకమని
కానేకాదు, రుజువై పోయెను నరక మని 

చరణం : 
తన ప్రాణముగా తలచిన అన్నయ్య
నిను కులటాయని నిందించె - పుడమిని తడిపే చలువమబ్బులే
పిడుగు లెందుకో కురిపించె




ప్రణయ పర్యంకమున పాట సాహిత్యం

 
చిత్రం: మా మంచి అక్కయ్య (1970)
సంగీతం: యస్.పి కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

గేయం : 
ప్రణయ పర్యంకమున పవళించు పరువాన
పంచభూతాలలో లీనమైనావా
పూల పల్లకిలోన పులకించువేళ మే
ఘాల పల్లకి పైన వెళ్ళిపోయినావా !

పల్లవి: 
వెళ్ళి రావమ్మాః చెల్లీ వెళ్ళిరావమ్మా
మళ్ళీ జన్మకు ఈ అన్నయ్యకు చెల్లాయిగ జన్మింతువుగానీ

Palli Balakrishna Thursday, December 23, 2021

Most Recent

Default