-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Panja Vaisshnav Tej"



చిత్రం: ఆదికేశవ (2023)
సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ 
నటీనటులు: వైష్ణవ్ తేజ్, శ్రీలీల 
దర్శకత్వం: శ్రీకాంత్ N. రెడ్డి 
నిర్మాత: నాగ వంశీ, సాయి సౌజన్య 
విడుదల తేది: 2023



Songs List:



సిత్తరాల సిత్రావతీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆదికేశవ (2023)
సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి 
గానం: రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహ్ర 

సిత్తరాల సిత్రావతీ
ఉన్నపాటున పోయే మతీ
హాయ్ హాయ్ సూపులో పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే సిత్రాపతీ

నిన్ను కోరి కుట్టేస్తి… పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చెయ్యెస్తి చెంపమీన చిటికేస్తి
ఇంకేటి లేటంటూ ఇంటి పేరు కూడా మార్చేస్తి

నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

అరెరెరే పిల్లా నీ అందం అదిరే నవలా
రోజు ఓ కొంచం చదివెయ్ కధలా
పక్కనువ్వుంటే పగలే వెన్నెలా
ప్రేమే మార్చిందా కవిలా నిన్నిలా

నీ పేరు పెట్టుకుని
అందాల తుఫానుని
ముంచెత్తి వెళ్ళమని
డైలీ రప్పిస్తా

కొండంత నీ ప్రేమని
ఏ చోట దాచాలనీ
ప్రపంచ బ్యాంకులనీ
లాకార్లిమ్మని అడిగేస్తా

పొద్దు పొడుపే నువ్వంటూ
నిద్దరంటూ రాదంటూ
కొన్ని కోట్లు కన్నాలే నీ కలలే

దివిలాగ నేనుంటే
అస్తమానం నా చుట్టూ
ఆ వైపు ఈ వైపు
నీ ఆలోచన్ల అలలే

నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

సిత్తరాల సిత్రావతీ
ఉన్నపాటున పోయే మతీ
హాయ్ హాయ్ సూపులో పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే సిత్రాపతీ

నిన్ను కోరి కుట్టేస్తి… పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చెయ్యెస్తి చెంపమీన చిటికేస్తి
ఇంకేటి లేటంటూ ఇంటి పేరు కూడా మార్చేస్తి

నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే




హే బుజ్జి బంగారం పాట సాహిత్యం

 
చిత్రం: ఆదికేశవ (2023)
సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి 
గానం: అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల 

ఆ ఆ ఆ మగసనిస
ఆ ఆ ఆ నిసదానిస

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా

నీ మౌనరాగాలే నాతో ఏమన్నా
ఇష్టాంగా వింటున్నా పరవశమౌతున్నా
ఎటువంటి అదృష్టం ఎవరికి లేదన్నా
నా దారి మారిందే నీ దయ వలనా

మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాగారి
మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాపా

మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాగారి
మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాపాపా

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా

అనగనగా కథలోని
రాజకుమారి నువ్వేలే
కలివిడిగా నను కోరి
దివి దిగి వచ్చావే

కలగనని కన్నులకు
వెలుగుల దీవాళీ నువ్వే
ఎదసడిగా జతచేరి
నా విలువను పెంచావే

ఓ అమ్మాయో నీదేం మాయో
ప్రేమాకాశం అందించావే
ఆ జన్మనా నీ రోమియో
నేనేనేమో అనిపించావే

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా

ఇన్నేళ్ళు ఇంతిదిగా
సందడిగా లేనే
భూమ్మీద ఉంటూనే
మెరుపులు తాకానే

నీ మనసు లోతుల్లో
నా పేరే చూసానే
లవ్ స్టోరీ రాస్తానే
మన కథనే

మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాగారి
మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాపా

మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాగారి
మగస మగస మగస మగస
మగస నిసగాగ గసగామాపాపా

హే బుజ్జి బంగారం
ప్రేమేగా ఇదంతా
హే నువ్వు నా సొంతం
నచ్చావే మరింతా




లీలమ్మో లీలమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: ఆదికేశవ (2023)
సంగీతం: G.V. ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: నకాష్ అజీజ్ 

బావయ్యో బావయ్యో బావయ్యో వస్తావా
బళ్లారి తోవల్లో బొమ్మనాదేస్తావా
సిట్టి నా గుండె మీద గుట్టుగా పాలపిట్టై
సిగ్గు సీమంతం జేస్తావా, వా వా వా

లీలమ్మో లీలమ్మో లవ్లీగా చూత్తావా
చక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావా
రంగులరాట్నంలాగ నీ వొళ్ళో
కూసోపెట్టి సీమంతా తిప్పుకొస్తావా, వా వా వా

లగో లగోరే లగ్గం పెట్టిస్తా
బాసింగాలు కట్టించాకా బంతులాడిస్తా
హే గజ్జల్ పట్టీల్తో హే గడప దాటేస్తా
మున్నెల్లకే మమ కచ్చా మ్యాంగో తినేస్తా

అమ్మి యమ ఉన్నావే కిరాక్కు
సోనామసూరి లాంటి నీ సోకు
రెడ్డి నీ మీసాలే కసక్కు
నేనిచ్చే చాన్సే హే ఇచ్చాయి పాసు

పొద్దు పొద్దున్నే ముద్దు ఫలహారం
మధ్యాహ్నంకే మడత నడుం నీకే గుడారం
ఏ సందే దూకిందా సైగా అలారం
కోక పుంజు కూసేదాక దుమ్ము ధుమారం

అమ్మీ నీ కులుకేమో గోకాకు
దొమ్మీ అయిపోద్దే నువ్ నవ్వాకు
రెడ్డి నువ్ సెయ్యస్తే పటాకు
హే వడ్డి ఇస్తా లెక్కే తెల్సాకు

లీలమ్మో లీలమ్మో లవ్లీగా చూస్తావా
చక్రాల కళ్ళతో దిల్లునే కోస్తావా
రంగులరాట్నంలాగ నీ వొళ్ళో
కూసోపెట్టి సీమంతా తిప్పుకొస్తావా, వా వా వా

Palli Balakrishna Friday, October 27, 2023



చిత్రం: రంగ రంగ వైభవంగా (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్ , కేతికా శర్మ 
దర్శకత్వం: గిరిశాయ
నిర్మాత: బి.వి.యస్.యన్.ప్రసాద్
విడుదల తేది: 2022



Songs List:



తెలుసా తెలుసా పాట సాహిత్యం

 
చిత్రం: రంగ రంగ వైభవంగా (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: శంకర్ మహదేవన్ 

తెలుసా తెలుసా
ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి అవుతారో

తెలుసా తెలుసా
ఈ హృదయాలకు యే కదా రాసుంధో
ఎవ్వరు చదవని కధనం ఏముందో
ఆడే పాడే వయసులో
ముడే పడే ఓ రెండు మనసులు
పాలు నీళ్ళు వీళ్లపొలికలు
వేరే చేసి చూసే వెళ్ళేంధంటారు

తెలుసా తెలుసా
ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి అవుతారో

కలిసే ఉన్న కలవని కన్నుల్లా
కనిపిస్తూ వున్న కలలే ఒకటంట
పగలు రాత్రిలా పక్కనే ఉంటున్నా
వెళ్ళీ కలిసుండే రోజే రాదంటా

తెలుసా ఆ ఒప్పు నిప్పులకంట
చిటపటలాడే కోపాలే వెళ్ళేనంట
ఒకరిని ఒకరు మక్కువగా ఠక్కువగా చూసే
పోటీ పెట్టాలో మరి వీళ్లకు సాటి ఎవరు రారంట

తెలుసా తెలుసా
ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి అవుతారో

చుట్టు తారల్లా చుట్టాలంటున్నా
భూమి చంద్రుళ్ళ వెల్లే వేరంట
ముచ్చపు హారంలో రాయి రత్నం లా
ఎందరిలోవున్నా అస్సలు కలవారుగా

యెదురెదురుంటే ఆ తూర్పు పదమరలిన
ఏదో రోజు ఒకటయ్యే వీలుందంట
పక్కానే వున్నా కలిసే దారొకటే ఐనా
కానీ ఏ నిమిషం ఒక్కటిగా పడని అడుగులు వీళ్లంటా

తెలుసా తెలుసా
ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి అవుతారో

తెలుసా తెలుసా
ఈ హృదయాలకు యే కదా రాసుంధో
ఎవ్వరు చదవని కధనం ఏముందో




కొత్తగా లేదేంటి..? పాట సాహిత్యం

 
చిత్రం: రంగ రంగ వైభవంగా (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్, హరిప్రియ 

కొత్తగా లేదేంటి… కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్నా నువ్వు నేను
కొత్తగా లేదేంటి..?

ఎందుకుంటాదేంటి..?
ఎందుకుంటాదేంటి..?
ఎంత దూరమైనా నువ్వు నేను
ఒక్కటే కాబట్టి

మనిషినెక్కడో ఉన్నా… మనసు నీ దగ్గరే
నిదురలో నేనున్నా… కలవనీవద్దకే
ఒకరికొకరై కలిసిలేమా… ఇద్దరం ఒకరై, ఒకరై

కొత్తగా లేదేంటి… కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్న నువ్వు నేను
కొత్తగా లేదేంటి..?

ఎందుకుంటాదేంటి..?
ఎందుకుంటాదేంటి..?
ఎంత దూరమైనా నువ్వు నేను
ఒక్కటే కాబట్టి

గుండెసడి తోటి… ముద్దుసడి పోటి
హద్దు దాటిందే
అయినా కొత్తగా లేదేంటి..?

సెకనుకో కోటి… కలలు కనలేదేంటి
దానితో పోల్చీ చూస్తే… ఇందులో గొప్పేంటి
ఎంత ఏకాంతమో… మన సొంతమే
అయినా కొత్తగా లేదేంటి..?

ఎంత పెద్ద లోకమో… మన మద్యలో
అయిన ఎప్పుడడ్డుగుదేంటి..?

కొత్తగా లేదేంటి, ఆ హా
కొత్తగా లేదేంటి, మ్ హూ
ఇంత దగ్గరున్న నువ్వు నేను
కొత్తగా లేదేంటి..?

ఎందుకుంటాదేంటి..?
ఎందుకుంటాదేంటి..?
ఎంత దూరమైనా నువ్వు నేను
ఒక్కటే కాబట్టి

కొత్తగుంటుంది ప్రేమ అంటారే
పక్కనుండి ప్రేమే అయినా
కొత్తగా లేదేంటి..?

మొదటి అడుగేసే, హే ఏఏ ఏఏ
పాపవా నువ్వు, ఊఊ ఊ ఊ
ఇంత నడిచాక, ఆఆ
నడకలో తడబాటుంటాదేంటి

ఎన్నినాళ్ళ వీక్షణం ఈ క్షణం
అయినా కొత్తగా లేదేంటి..?
ఎందుకంటే ఈ క్షణం విడిపోం
అని నమ్మకం కాబట్టి

కొత్తగా లేదేంటి… కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్న నువ్వు నేను
కొత్తగా లేదేంటి..?

ఎందుకుంటాదేంటి..?
ఎందుకుంటాదేంటి..?
ఎంత దూరమైనా నువ్వు నేను
ఒక్కటే కాబట్టి




సిరి సిరి సిరి మువ్వల్లోనే పాట సాహిత్యం

 
చిత్రం: రంగ రంగ వైభవంగా (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జేవేద్ ఆలీ, శ్రేయా ఘోషాల్

సిరి సిరి సిరి మువ్వల్లోనే
దాగుండే చప్పుళ్లన్నీ
నా గుప్పెడు గుండెల్లోనే
వినిపించాయే

నడి రాతిరి జాబిలి లోనే
కొలువుండే వెన్నెలలన్నీ
నా కళ్ళకు పట్టపగలే
కనిపించాయి టెన్ టు ఫైవ్

గిరీటీలే తిరిగిందే
మబ్బుల్లో గాలిపటం
సరిగా నువ్వు చూశావో
అది నా హృదయం

ఆకాశం తాకిందే
సంద్రంలో ఓ కెరటం
సరిగా గమనించావో
అది నాలో పొంగే ప్రాణం

సిరి సిరి సిరి మువ్వల్లోనే
దాగుండే చప్పుళ్లన్నీ
నా గుప్పెడు గుండెల్లోనే
వినిపించాయే

నడి రాతిరి జాబిలి లోనే
కొలువుండే వెన్నెలలన్నీ
నా కళ్ళకు పట్టపగలే
కనిపించాయి

పుస్తకమే తెరిచాక
నవ్వెనులే నెమలీక
మన ప్రేమకు తొలి లేఖ
తానే గనుకా టెన్ టు ఫైవ్

నువ్వున్నది నాకోసం
నేనున్నది నీకోసం
దూరానికి అవకాశం
ఇవ్వను ఇంకా

ఊహలెన్ని వింటుందో
రంగులెన్ని తింటుందో
కుంచె మంచి బొమ్మేదో
గీయడానికి టెన్ టు ఫైవ్

ఎన్ని పాట్లు పడుతుందో
ఎన్ని నిన్నలౌతుందో
ప్రేమ రెండు మనసుల్నే
ఏకం చేసే సరికి

సిరి సిరి సిరి మువ్వల్లోనే
దాగుండే చప్పుళ్లన్నీ
నా గుప్పెడు గుండెల్లోనే
వినిపించాయే

నడి రాతిరి జాబిలి లోనే
కొలువుండే వెన్నెలలన్నీ
నా కళ్ళకు పట్టపగలే
కనిపించాయి టెన్ టు ఫైవ్

కలగన్నది కళ్లెదుటే
నిజమయ్యి కనబడితే
పెదవంచున్న ప్రతి మాట
పాటై పోయే టెన్ టు ఫైవ్

నీ అల్లరి అంకెలకే
కోరికలే రావేమో
మన ఇద్ధరిని కలిపి
ఒకటంటాయే

దేవదాసు లాంటోన్ని
కాళిదాసు చేసావే
కాలమేదో మన పైనే
రాయడానికా

కుదురుగుండె నా చున్నీ
పోగుచేసి చుక్కల్ని
ఎగరుతోంది నీవల్లే
సీత కోక లాగా

సిరి సిరి సిరి మువ్వల్లోనే
దాగుండే చప్పుళ్లన్నీ
నా గుప్పెడు గుండెల్లోనే
వినిపించాయే

నడి రాతిరి జాబిలిలోనే
కొలువుండే వెన్నెలలన్నీ
నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి


Palli Balakrishna Saturday, May 7, 2022



చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: క్రిష్ జాగర్ల మూడి
నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జె.సాయి బాబు
విడుదల తేది:08.10. 2021



Songs List:



ఓబులమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: సత్య యామిని, PVNS రోహిత్

పల్లవి
గింజ గింజ మీద 
బుసక బుసక బుసక తీసి 
తీయంగా బత్తెమయ్యి పోయే 
బొట్టే కట్టి చేత బట్టిన
చేతి లోకి చేరలేని గుండుజళ్ళ ఆరాట పడిపోయే 

ఓ… ఓ… ఓబులమ్మా బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ 

కపర కపర వేకువ లోన
కాలమంతా లెక్కలు గట్టి 
గుండెలోన నీ పేరు జపమాయె.. 
యిదివరకెపుడు తెలియని ఎరగని 
తురుపే మైమరిపిస్తూ ఉంటె 
కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే 

చరణం

కన్నులు కన్నులు వింటున్న
చూపులు చూపులు చెబుతున్న 
మాటలు మాటలు చూస్తున్న 

మగతలలో..
ఎవ్వరికెవ్వరు సావాసం  
ఎక్కడికక్కడ ప్రయాణం 
ఎప్పటికప్పుడు ఎదురయ్యే 
మలుపులలో…
చదివేసాడేమో నా కలలు  
ఉంటాడే నీడై రేపవలు 
తిష్టేసినాడే గోంతరాలు
పొమ్మంటే పోడే  ఈడిగలు..

ఓ.... ఓ… ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోనా పూలకొమ్మ 

కపర కపర రేతిరి లోన
కాలమంతా లెక్కలు తప్పి
గుండెలోన నీ పేరు జపమాయె.. 
యిదివరకెపుడు తెలియని ఎరగని 
తలపే మైమరిపిస్తూ ఉంటె 
కంటికేమో కునుకు దూరపు చుట్టమాయే

ఓ… ఓ… ఓబులమ్మా బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ 
ఓ… ఓ… ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోనా పూలకొమ్మ 




తల ఎత్తు పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యమ్.యమ్.కీరవాణి, హారిక నారాయణ్ , శ్రీ సౌమ్య వారణాసి 

గిర గిర గిర గిర గిర గిర గిర గిర
సుడిగుండం లాగేస్తూ ఉంటే
బితుకు బితుకుమను ఊపిరికి
బతుకు బతుకు అని ఓపిక పోస్తూ
ఉక్కును ముంచే ఉప్పెనవై

ఎత్తు తల ఎత్తు… ఎత్తు తల ఎత్తు
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్ రయ్ రయ్యా రయ్


తలవంచుకు చూసేదేమిటి
నిను కడ తేర్చే మన్ను
తల ఎత్తితె కనబడుతుంది
తన దాకా రమ్మను నిన్ను

పడదోసే సంద్రపు నీలం
ఎగదోసే గగనపు నీలం
అలిసిందా ఎగసిందా… అల
అల లాంటిదే కాదా… నీ తల
అలలాంటిదే కాదా… నీ తల
అలలాంటిదే కాదా… నీ తల

ఎత్తు తలఎత్తు… ఎత్తు తల ఎత్తు
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్

పడవైన అంతఃపురమైన
ఉనికి కొరకు పోరాటం తప్పదు
నువు చెయ్యాల్సిన పని చేసేయ్
ఏం జరిగినా పర్వా నై

ఎవరేమైనా అనుకోని
నీలో నిన్నే నువ్వే చూస్తూ
బిత్తరపడి గర్వపడేలా
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్ రయ్ రయ్యా రయ్



ధంధం ధం పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్, దామిని భట్ల 

పచ్చపచ్చ సెట్టు సేమ… పట్టు సీరెలంటా
నల్ల నల్ల ముళ్ళ కంప… నల్ల పూసలంటా
కిచ కిచలాడే ఉడుత పిచ్చుక… లాలి పాటంటా
గలగల పారే సేలలో నీళ్లు సనుబాలంట, ఆ ఆ

అడవితల్లి ఇంటికొచ్చిన… దగ్గరి సుట్టాలం
వనలచ్చిమి ఒడిలో… కట్టాలన్నీ గట్టెక్కిచ్చేద్దాం
అడవితల్లి ఇంటికొచ్చిన… దగ్గరి సుట్టాలం
వనలచ్చిమి ఒడిలో… కట్టాలన్నీ గట్టెక్కిచ్చేద్దాం

ధంధం ధం తిరిగేద్దాం
ధంధం ధం దొర్లేద్దాం
ధంధం ధం తిరిగేద్దాం
ధంధం ధం దొర్లేద్దాం
ధం ధం ధం… తిరిగేద్దాం
ధం ధం ధం… దొర్లేద్దాం

ధం ధం ధం ధం దయ చూపలని
అడవిని అడిగేద్దాం
మన పాణాలన్నీ నిలిపే తల్లికి
సాగిల పడిపోదాం, ఆ ఆఆ

పొగమంచేమో సామ్రానేసి
ప్రేమగ తలనే నిమిరేనంట
సేతికి తగిలే పేడు బెరడు
తాయెత్తల్లే తడిమెనంట

మద్దే టేకు ఆకులు మనకు
విసన కర్రలు విసిరేనంట, హ హ హ
గడ్డి గరిక పచ్చిక మనకు
పరుపే పరిసి పిలిసేనంటా, హో

ధంధం ధం సూసేద్ధాం
ధంధం ధం సుట్టేద్దాం
ధంధం ధం అడవే మనకు
కోవెల అనుకుందాం
కోరక ముందే వరాలనిచ్చే
తల్లిని కొలిసేద్ధాం, ఆ ఆఆ

సుక్క సుక్కా దాచలంటూ
తేనేటీగే తెలిపేనంటా
సురుకుంటేనే బతుకుందంటూ
దుప్పి కడితీ సెప్పేనంటా

పెద్దపులితో తలపడు ధైర్యం
అడవి పందే నేర్పేనంటా
కలిసే ఉంటే బలముందంటూ
రేసు కుక్కలు సాటేనంట
పొట్టకూటికి ఏటాడేటి జీవులు సెప్పే పాటం ఒకటే
తిన్న ఇంటిని ధ్వంసం సేసే
పాపానికి ఒడికట్టొద్దంతే, ఏ ఏఏ

ధంధం ధం సదివేద్దాం
ధంధం ధం నేర్సేద్దాం
ధంధం ధం ఈ పాఠాలను
బతుకున పాటిద్దాం
అడవిని మించిన బడి లేదంటూ
అడుగులు కదిపేద్దాం, ఆఆ ఆఆ ఆ





కథలు కథలుగా పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: కైలాష్ కెహర్, యామిని గంటసాల

కథలు కథలుగా… కలలు కలలు మిగిలేనా
తుదలు లేని ఆ కథల గతులు అడవేనా
కాదని చెప్పవే… కారణం అడగకే మనసా
ఆశని భిక్షగా అడిగా ఇవ్వవే

ఓ, కథలు కథలుగా… కలలు కలలు మిగిలేనా
తుదలు లేని ఆ కథల గతులు అడవేనా

పరిచయం అయిన గాలి… నా ఊపిరై చెలిస్తే
తన వశం అయిన ప్రాణం… తనువంతా దహిస్తే
తెగ ఎదురు చూసి తడిసింది కంటిపాపే
సెగ రగులుతున్న ఎద కోరే ఊరడింపే

కథలు కథలుగా… కలలు కలలు మిగిలేనా
చితికి చితికి ఆ కథల బతుకు చితికేనా

అడిగితే నిన్ను నువ్వే… నా దారే ఎటంటూ
బదులుగా నీకు నువ్వే… చెబుతావో రహస్యం
ఏ ధూళిలోన కలిసిందో నీ ప్రపంచం
ఆ అణువు అణువు… వెతకాలి నీ వికాసం

చేరనీ గమ్యమే… చేరువై ఓ క్షణం


చెప్పదా ఈ నిజం, ఓ ఓఓ

నమ్మడం జీవితం
నమ్మడం జీవితం… నిను నువ్వే
నమ్మడం జీవితం
నమ్మడం జీవితం
నమ్మడం జీవితం… నిను నువ్వే



దారులు దారులు పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నల 
గానం: యమ్.యమ్.కీరవాణి, హారిక నారాయణ్ 

రయ్ రయ్ రయ్యా రయ్… రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్య రయ్ రయ్ రయ్ రయ్ రయ్య రయ్

దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు, ఊ హు హు
సాగక తప్పని దారులు
ఏ జాడని చెప్పని తీరులు

మెతుకుని వెతికే ఆశల మూరలు
బతుకుని కొరికే ఆకలి కోరలు
చావో రేవో తేలేవరకు
ఆగకన్న పొలిమెరలు

దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు

మెతుకును వేతికే ఏ ఏ… ఆశగ పోరలు
బతుకును కొరికే ఏ ఏ… ఆకలి కోరలు

దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు..

ఓ ఓ, బద్ధెం మూపున కట్టుకుని
ప్యాణం పిడికిట పట్టుకుని
కరువుతొ కయ్యం పెట్టుకుని
గాయం గాయం తట్టుకొని
పంటపొలం నీడై పోగా
గుండెబలం నీరై పోగా

కొండపొలం చేయట్టుకుని, ఈ ఈ
చావో రేవో తేలేవరకు
ఆగకన్న పొలిమెరలు
చావో రేవో, ఓ ఓ తేలెవరకు
చావో రేవో తేలెవరకు ఆగకన్న పొలిమెరలు

దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
సాగక తప్పని దారాలు
ఏ జాడను చెప్పని తీరులు

రయ్ రయ్ రయ్యా రయ్… రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్…  రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్… రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్… రయ్ రయ్ రయ్యా రయ్



శ్వాసలో పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: యామిని గంటసాల, PVNS రోహిత్

నీలో నాలో… నీలో నాలో
నీలో నాలో… నీలో నాలో

శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ
(నీలో నాలో… నీలో నాలో)
ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోసా
(నీలో నాలో… నీలో నాలో)

గుండె లోయల్లో… పొంగు వాగుల్లో
ప్రేమ సాగుల్లో… బాగు వోగుల్లో
మేను మరిచెలా… పైన పడుతున్నా
కూన డేగల్లో తేనెటీగల్లో, ఓఓ

శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ
నీలో నాలో… నీలో నాలో
పరువములో అణువు అణువు… పరవశముండగా
(నీలో నాలో… నీలో నాలో)
పరవశమే అలలు అలలై… అలజడి రేపగా
(నీలో నాలో… నీలో నాలో)
ఏటితో ఆటలే… తేట తెల్లమై
రం రా రం రమే

శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ
ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోసా

గుండె లోయల్లో… పొంగు వాగుల్లో
ప్రేమ సాగుల్లో… బాగు వోగుల్లో
మేను మరిచెలా… పైన పడుతున్నా
కూన డేగల్లో తేనెటీగల్లో, ఓఓ
శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ




రాయే రాయే రాంసిలకో పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కాలభైరవ, శ్రేయా గోషల్

రాయే రాయే రాంసిలకో
రంజు భలే జత ఇదిగో
రాయే రాయే రాంసిలకో
రంగు భలే సెకలివిగో

సురుకైన సిన్నదంట
సరుకున్న సిన్నోడంట
కుదిరింది ఈ జంట
ఒయ్ హొయ్ ఒయ్ హొయ్
ఓ ఓహో ఓ హో హొయ్
ఒయ్ హొయ్ ఒయ్ హొయ్
హోయి హోయి హోయి హొయ్

చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ
లొట్టెసి జుర్రుకుంటావా..?
బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా
నచ్చింది చుట్టుకుంటావా..?

చుక్కల్లో చీరను నేసి, నేసి
వెన్నెల్లో పానుపు వేసి, వేసి
కన్నుల్లో చూపే దీపం చేసి
వేచాను ఎదురే చూసి

చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ
లొట్టెసి జుర్రుకుంటావా..?
బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా
నచ్చింది చుట్టుకుంటావా..?

హొయ్, చెరిసగమైపోయే వేలల్లోన లీలల్లోన
కలవరమే నాలో చూసేవా
పరవశమై పోయే దారుల్లోన తీరుల్లోన
పరుగులనే నాతో తీసేవా

కీచురాళ్ళ కూతలన్నీ ఇనుకోక
కోడికూత కూసిందేమో కనబోక
కూర్చొనీక నుంచోనీక
కౌగిట్లోనే బజ్జుంటాగా

అట్టా ఇట్టా తెల్లవారిపోయేనే
తానాలాడే తావుల్లో ఉంటావా
వందేళ్లు తప్పదీ సేవ
టెన్ టు ఫైవ్

చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ
లొట్టెసి జుర్రుకుంటావా..?
బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా
నచ్చింది చుట్టుకుంటావా..?

మ్మ్ మ్, చుక్కల్లో చీరను నేసి, నేసి
వెన్నెల్లో పానుపు వేసి, వేసి
కన్నుల్లో చూపే దీపం చేసి
వేచాను ఎదురే చూసి

చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ
లొట్టెసి జుర్రుకుంటావా..?
హో, బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా
నచ్చింది చుట్టుకుంటావా..?

ఒయ్ హొయ్ ఒయ్ హొయ్
ఓ ఓహో ఓ హో హొయ్
ఒయ్ హొయ్ ఒయ్ హొయ్
హోయి హోయి హోయి హొయ్

Palli Balakrishna Saturday, October 16, 2021
Uppena (2021) Telugu Songs Lyrics Album Cover

Uppena (2021) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Uppena (2021)
Music : Devi Sri Prasad
Director : Buchi Babu Sana
Producers : Naveen Yerneni, Yalamanchili Ravi Shankar
Actors : Panja Vaisshnav Tej, Vijay Sethupathi
Actresses : Krithi Shetty
Release Date : 12 February 2021

Nee Kannu Neeli Samudram Song Lyrics in Telugu – Uppena (2021)

'Nee Kannu Neeli Samudram' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Javed Ali and Sreekanth Chandra.

SONG INFORMATION
Movie : Uppena (2021)
Music : Devi Sri Prasad
Lyricist : Sri Mani, Raqueeb Alam
Singers : Javed Ali, Sreekanth Chandra
చిత్రం: ఉప్పెన (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి , రకీబ్ అలమ్ గానం: జావేద్ అలీ, శ్రీకాంత్ చంద్ర ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా ఇష్క్ పర్దే మే కిసి కీ ఆంఖో మే లబ్రేజ్ హై ఇష్క్ షిఫాయా మెహబూబ్ క సాయా ఇష్క్ మల్ మల్ మే యః లిప్త హువా తెబ్రేజ్ హై ఇష్క్ హై పీర్ పాయంబార్ అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్ ఇష్క్, హై పీర్ పాయంబార్ అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్ ఇష్క్, కబీ ఖత్రా హై అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్ ఇష్క్ కబీ ఖత్రా హై అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్ నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నల్లనైన ముంగురులే - ముంగురులే అల్లరేదో రేపాయిలే - రేపాయిలే నువ్వుతప్ప నాకింకొ లోకాన్ని లేకుండా కప్పాయిలే ఘల్లుమంటే నీ గాజులే - నీ గాజులే ఝల్లుమంది నా ప్రాణమే - నా ప్రాణమే అల్లుకుంది వానజల్లులా ప్రేమే... నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కోరస్: నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం కోరస్: నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం చరణం: 1 చిన్ని ఇసుకగూడు కట్టినా... నీ పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా... ఆ గోరువంక పక్కన...రామ చిలుక ఎంత చక్కన అంతకంటే చక్కనంట నువ్వుంటే నాపక్కనా..... అప్పు అడిగానే... కొత్త కొత్త మాటలనీ తప్పుకున్నాయే...భూమి పైన భాషలన్నీ... చెప్ప..లే..మ..న్నా..యే అక్షరాల్లో ప్రేమనీ... నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం కోరస్: నీ కన్ను నీలిసముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం కోరస్: నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం చరణం: 2 నీ అందమంత ఉప్పెన... నన్ను ముంచినాది చప్పున ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా.. చుట్టూ ఎంత చప్పుడొచ్చినా....నీ సవ్వడేదో చెప్పనా ఎంతదాచేసినా నిన్ను జల్లడేసి పట్టనా... నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని... నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని... నీ ప్రే..మా వలలో చిక్కుకున్న చేపనీ.... ఇష్క్ హై పీర్ పాయంబార్ అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్ ఇష్క్ హై పీర్ పాయంబార్ అర్రే ఇష్క్, అలీ దమ్ మస్త్ కలందర్ ఇష్క్, కబీ ఖత్రా హై అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్ ఇష్క్ కబీ ఖత్రా హై అర్రే ఇష్క్, కబీ హై ఏక్ సమందర్ ఇష్క్ షిఫాయా ఇష్క్ షిఫాయా ఇష్క్ పర్దే మే కిసి కీ ఆంఖో మే లబ్రేజ్ హై ఇష్క్ షిఫాయా మెహబూబ్ క సాయా ఇష్క్ మల్ మల్ మే యః లిప్త హువా తెబ్రేజ్ హై

Dhak Dhak Dhak Song Lyrics in Telugu – Uppena (2021)

'Dhak Dhak Dhak' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Sarath Santhosh and Hari Priya.

SONG INFORMATION
Movie : Uppena (2021)
Music : Devi Sri Prasad
Lyricist : Chandrabose
Singers : Sarath Santhosh, Hari Priya
చిత్రం: ఉప్పెన (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శరత్ సంతోష్, హరిప్రియ నువ్వు నేను ఎదురైతే ధక్.. ధక్.. ధక్.. మనసు మనసు దగ్గరయితే ధక్.. ధక్.. ధక్ ఆశలు అలలై పొంగుతుంటే ధక్.. ధక్.. ధక్ ఆకలి నిద్దుర మింగుతుంటే ధక్.. ధక్.. ధక్ ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్..ధక్..ధక్..ధక్..ధక్ చూపుల పిలుపులు మోగుతుంటే ధక్.. ధక్.. ధక్ మాటలు గొంతులో ఆగుతుంటే ధక్.. ధక్.. ధక్ గుండెకు చెమటలు పడుతుంటే ధక్.. ధక్.. ధక్ ముందుకు వెనుకకు నెడుతుంటే ధక్.. ధక్.. ధక్ ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్..ధక్..ధక్..ధక్..ధక్ చీటికి మాటికి గురుతోస్తే... మిగతావన్నీ మరుపోస్తే... కాలానికి ఇక పరుగోస్తే.... ఆలోచనలకు బరువస్తే... ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్..ధక్..ధక్..ధక్..ధక్

Ranguladdhukunna Song Lyrics in Telugu – Uppena (2021)

'Ranguladdhukunna' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Yazin Nizar and Hari Priya.

SONG INFORMATION
Movie : Uppena (2021)
Music : Devi Sri Prasad
Lyricist : Sri Mani
Singers : Yazin Nizar, Hari Priya
చిత్రం: ఉప్పెన (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: యాజిన్ నిజార్, హరిప్రియ రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం ఆకు చాటుకున్నా పచ్చి పిందెలౌదాం మట్టి లోపలున్నా జంట వేరులౌదాం ఎవ్వరీ కంటి చూపు చేరలేని ఎక్కడా మన జంట ఊసురాని చోటున పద నువ్వు నేనుందాం రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం తేనె పట్టులోన తీపి గుట్టు ఉందిలే మన జట్టులోన ప్రేమ గుట్టుగుందిలే వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందాం లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో కొత్త పాఠాలు నేర్చుకుందాం అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం ఎవ్వరూ లేని చోట ఒక్క రౌదాం ఏక్షణం విడివిడిగా లేమందాం రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం మన ఊసుమోసే గాలిని మూట కడదాం మన జాడ తెలిపే నేలనుపాతి పెడదాం చూస్తున్న సూర్యుని తెచ్చి లాంతర్లో దీపాన్ని చేసి చూరుకేలాడదీద్దాం సాక్ష్యంగా సంద్రాలు ఉంటే దిగుడు బావిలో దాచి మూత పెడదాం నేనిలా నీతో ఉండడం కోసం చేయని ఈ చిన్నపాటి మోసం నేరమేంకాదే ఇది మన కోసం రాయిలోన శిల్పం దాగి ఉండునంటా శిల్పి ఎదురైతే బయటపడునంటా అద్దమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా నీలో ఉన్న నేనే బయటపడిపోతా పాలలో ఉన్న నీటి బొట్టులాగా నీళ్లలో దాగి ఉన్న మెట్టులాగా నీనిలా నీ లోపల దాక్కుంటా హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్

Jala Jala Jalapaatham Nuvvu Song Lyrics in Telugu – Uppena (2021)

'Jala Jala Jalapaatham Nuvvu' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Shreya Ghoshal and Jaspreet Jasz.

SONG INFORMATION
Movie : Uppena (2021)
Music : Devi Sri Prasad
Lyricist : Sri Mani
Singers : Shreya Ghoshal, Jaspreet Jasz
చిత్రం: ఉప్పెన (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: శ్రేయా ఘోషల్, జస్ప్రీత్ జస్ జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సలసల నువు తాకితే నన్ను పొంగే వరదై పోతాను చలి చలి చలిగాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వళ్ళితే నన్ను ఎగసే కెరటాన్నౌతాను హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే హే ఇటు చూడకంటు మబ్బు రెమ్మ దాన్ని మూసెనే ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే హా... జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సలసల నువు తాకితే నన్ను పొంగే వరదై పోతాను చలి చలి చలిగాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వళ్ళితే నన్ను ఎగసే కెరటాన్నౌతాను సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపలా ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఇలాగ బయట పడుతోంది ఈ వేళ హా నడి ఎడారిలాంటి ప్రాణం తడి మేఘానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను, తెంచలేదు లోకం జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సలసల నువు తాకితే నన్ను పొంగే వరదై పోతాను ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఎప్పుడూ లేనిదీ ఏకాంతం ఎక్కడా లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సలసల నువు తాకితే నన్ను పొంగే వరదై పోతాను చలి చలి చలిగాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వళ్ళితే నన్ను ఎగసే కెరటాన్నౌతాను

Eswara Song Lyrics in Telugu – Uppena (2021)

'Eswara' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.

SONG INFORMATION
Movie : Uppena (2021)
Music : Devi Sri Prasad
Lyricist : Chandrabose
Singers : Devi Sri Prasad
చిత్రం: ఉప్పెన (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: దేవి శ్రీ ప్రసాద్ ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడనీ వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా దారి ఏదో, తీరమేదో గమనమేదో, గమ్యమేదో లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా చీకటేదో, వెలుతురేదో మంచు ఏదో, మంట ఏదో లోకమెరుగని ప్రేమకథని లోని కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏమార్చుతుంటే నేల పైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా మసకబారిన కంటిపాపకి ముసుగు తీసే వెలుగులాగ కాలమడిగిన కఠిన ప్రశ్నకి బదులువై ఎదురవ్వరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా

Sandram Lone Neerantha Song Lyrics in Telugu – Uppena (2021)

'Sandram Lone Neerantha' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Sean Roldan.

SONG INFORMATION
Movie : Uppena (2021)
Music : Devi Sri Prasad
Lyricist : Devi Sri Prasad
Singers : Sean Roldan
చిత్రం: ఉప్పెన (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్ గానం: సీన్ రోల్డెన్ సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మోగేనే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మోగేనే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే గాలిలో నీ మాటే అలలపై నీ పాటే ఎంత గాలిస్తున్న నువ్వు లేవే అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే ప్రేమ కోరే ఆకలున్న నువ్వు రావే ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని దాచుంచానే వాటికేమీ చెప్పేది ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని మళ్ళి నేనే ఎపుడు చూసేది నిజమే చెప్పాలి అని నాకు చెప్పే నువ్వే ఎన్నడు నాతో ఉంటానని అబద్దం చెప్పావే సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మోగేనే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే హే... ఏలే ఏలే ఏలే లే లే... ఏలే ఏలే లే

Ninne Naa Ninne Song Lyrics in Telugu – Uppena (2021)

'Ninne Naa Ninne' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Sameera Bharadwaj.

SONG INFORMATION
Movie : Uppena (2021)
Music : Devi Sri Prasad
Lyricist : Chandrabose
Singers : Sameera Bharadwaj
చిత్రం: ఉప్పెన (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: సమీరా భరద్వాజ్ నిన్నే నా నిన్నే వెతికినే నా కన్నే నన్నే నీ నన్నే మరిచావే నాతోనే వస్తూ పొతున్నాడు ప్రతిరోజు సూరీడు నిన్నే తెస్తాడని చూస్తున్నా వినిపించే ప్రతి మాటా సడి చేసే ప్రతి పాటా నీ ఊసేమోనని వింటున్నా నిన్నే నా నిన్నే వెతికిందే నా కన్నే నన్నే నీ నన్నే మరిచావే నాతోనే

Silaka Silaka Song Lyrics in Telugu – Uppena (2021)

'Silaka Silaka' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Kailash Kher.

SONG INFORMATION
Movie : Uppena (2021)
Music : Devi Sri Prasad
Lyricist : Sri Mani
Singers : Kailash Kher
చిత్రం: ఉప్పెన (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: కైలాష్ ఖేర్ యే సిలక సిలక గోరింకా ఎగిరే ఎగిరే ఎందాక దారి లేని నీ ఉరక ఈ దరికా మరి ఆ దరికా హే సినుకా సినుకా జారింక మేఘం నీదే కాదింకా సొంత రెక్కలు కట్టాకా నీదారో ఎదో నీదింకా సెలయేరుందో సుడిగాలుందో వెళ్ళే దారిలో చిరు జల్లుందో జడివానుందో ఈ మలుపులో ఇచ్చే పూలో గుచ్చే ముల్లో వాలే వాకిట్లో ఏం దాగుందో ఏమో ప్రేమ నీ గుప్పిట్లో హే సిలక సిలక గోరింకా నీలాకాశం నీదింకా రెక్క విప్పి ఎగురింకా నిన్నే ఆపేదేవరింకా యే సినుకా సినుకా జారింక వాగు వంక నీదింకా అలుపు సొలుపు లేదింకా దొరికిందిగా దారింకా సెలయేరల్లె పొంగి పొర్లే ప్రేమే సంతోషం దాని అట్టే పెట్టు నీ గుండెల్లోనే కలకాలం పొలిమేరలే లేనేలేని ప్రేమే నీ సొంతం ఇక నిన్నే వీడి పోనే పోదు ఈ వసంతం యే సిలక సిలక గోరింకా నీలాకాశం నీదింకా రెక్కే విప్పి ఎగురింకా నిన్నే ఆపేదేవరింకా హే సినుకా సినుకా జారింక వాగు వంక నీదింకా అలుపు సొలుపు లేదింకా దొరికిందిగా దారింకా యేలే లమ్మయే హా

Palli Balakrishna Sunday, November 1, 2020

Most Recent

Default