Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ranga Ranga Vaibhavanga (2022)




చిత్రం: రంగ రంగ వైభవంగా (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్ , కేతికా శర్మ 
దర్శకత్వం: గిరిశాయ
నిర్మాత: బి.వి.యస్.యన్.ప్రసాద్
విడుదల తేది: 2022



Songs List:



తెలుసా తెలుసా పాట సాహిత్యం

 
చిత్రం: రంగ రంగ వైభవంగా (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: శంకర్ మహదేవన్ 

తెలుసా తెలుసా
ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి అవుతారో

తెలుసా తెలుసా
ఈ హృదయాలకు యే కదా రాసుంధో
ఎవ్వరు చదవని కధనం ఏముందో
ఆడే పాడే వయసులో
ముడే పడే ఓ రెండు మనసులు
పాలు నీళ్ళు వీళ్లపొలికలు
వేరే చేసి చూసే వెళ్ళేంధంటారు

తెలుసా తెలుసా
ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి అవుతారో

కలిసే ఉన్న కలవని కన్నుల్లా
కనిపిస్తూ వున్న కలలే ఒకటంట
పగలు రాత్రిలా పక్కనే ఉంటున్నా
వెళ్ళీ కలిసుండే రోజే రాదంటా

తెలుసా ఆ ఒప్పు నిప్పులకంట
చిటపటలాడే కోపాలే వెళ్ళేనంట
ఒకరిని ఒకరు మక్కువగా ఠక్కువగా చూసే
పోటీ పెట్టాలో మరి వీళ్లకు సాటి ఎవరు రారంట

తెలుసా తెలుసా
ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి అవుతారో

చుట్టు తారల్లా చుట్టాలంటున్నా
భూమి చంద్రుళ్ళ వెల్లే వేరంట
ముచ్చపు హారంలో రాయి రత్నం లా
ఎందరిలోవున్నా అస్సలు కలవారుగా

యెదురెదురుంటే ఆ తూర్పు పదమరలిన
ఏదో రోజు ఒకటయ్యే వీలుందంట
పక్కానే వున్నా కలిసే దారొకటే ఐనా
కానీ ఏ నిమిషం ఒక్కటిగా పడని అడుగులు వీళ్లంటా

తెలుసా తెలుసా
ఎవ్వరికోసం ఎవ్వరు పుడతారో
ఎవరికీ ఎవరేమి అవుతారో

తెలుసా తెలుసా
ఈ హృదయాలకు యే కదా రాసుంధో
ఎవ్వరు చదవని కధనం ఏముందో




కొత్తగా లేదేంటి..? పాట సాహిత్యం

 
చిత్రం: రంగ రంగ వైభవంగా (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్, హరిప్రియ 

కొత్తగా లేదేంటి… కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్నా నువ్వు నేను
కొత్తగా లేదేంటి..?

ఎందుకుంటాదేంటి..?
ఎందుకుంటాదేంటి..?
ఎంత దూరమైనా నువ్వు నేను
ఒక్కటే కాబట్టి

మనిషినెక్కడో ఉన్నా… మనసు నీ దగ్గరే
నిదురలో నేనున్నా… కలవనీవద్దకే
ఒకరికొకరై కలిసిలేమా… ఇద్దరం ఒకరై, ఒకరై

కొత్తగా లేదేంటి… కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్న నువ్వు నేను
కొత్తగా లేదేంటి..?

ఎందుకుంటాదేంటి..?
ఎందుకుంటాదేంటి..?
ఎంత దూరమైనా నువ్వు నేను
ఒక్కటే కాబట్టి

గుండెసడి తోటి… ముద్దుసడి పోటి
హద్దు దాటిందే
అయినా కొత్తగా లేదేంటి..?

సెకనుకో కోటి… కలలు కనలేదేంటి
దానితో పోల్చీ చూస్తే… ఇందులో గొప్పేంటి
ఎంత ఏకాంతమో… మన సొంతమే
అయినా కొత్తగా లేదేంటి..?

ఎంత పెద్ద లోకమో… మన మద్యలో
అయిన ఎప్పుడడ్డుగుదేంటి..?

కొత్తగా లేదేంటి, ఆ హా
కొత్తగా లేదేంటి, మ్ హూ
ఇంత దగ్గరున్న నువ్వు నేను
కొత్తగా లేదేంటి..?

ఎందుకుంటాదేంటి..?
ఎందుకుంటాదేంటి..?
ఎంత దూరమైనా నువ్వు నేను
ఒక్కటే కాబట్టి

కొత్తగుంటుంది ప్రేమ అంటారే
పక్కనుండి ప్రేమే అయినా
కొత్తగా లేదేంటి..?

మొదటి అడుగేసే, హే ఏఏ ఏఏ
పాపవా నువ్వు, ఊఊ ఊ ఊ
ఇంత నడిచాక, ఆఆ
నడకలో తడబాటుంటాదేంటి

ఎన్నినాళ్ళ వీక్షణం ఈ క్షణం
అయినా కొత్తగా లేదేంటి..?
ఎందుకంటే ఈ క్షణం విడిపోం
అని నమ్మకం కాబట్టి

కొత్తగా లేదేంటి… కొత్తగా లేదేంటి
ఇంత దగ్గరున్న నువ్వు నేను
కొత్తగా లేదేంటి..?

ఎందుకుంటాదేంటి..?
ఎందుకుంటాదేంటి..?
ఎంత దూరమైనా నువ్వు నేను
ఒక్కటే కాబట్టి




సిరి సిరి సిరి మువ్వల్లోనే పాట సాహిత్యం

 
చిత్రం: రంగ రంగ వైభవంగా (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జేవేద్ ఆలీ, శ్రేయా ఘోషాల్

సిరి సిరి సిరి మువ్వల్లోనే
దాగుండే చప్పుళ్లన్నీ
నా గుప్పెడు గుండెల్లోనే
వినిపించాయే

నడి రాతిరి జాబిలి లోనే
కొలువుండే వెన్నెలలన్నీ
నా కళ్ళకు పట్టపగలే
కనిపించాయి టెన్ టు ఫైవ్

గిరీటీలే తిరిగిందే
మబ్బుల్లో గాలిపటం
సరిగా నువ్వు చూశావో
అది నా హృదయం

ఆకాశం తాకిందే
సంద్రంలో ఓ కెరటం
సరిగా గమనించావో
అది నాలో పొంగే ప్రాణం

సిరి సిరి సిరి మువ్వల్లోనే
దాగుండే చప్పుళ్లన్నీ
నా గుప్పెడు గుండెల్లోనే
వినిపించాయే

నడి రాతిరి జాబిలి లోనే
కొలువుండే వెన్నెలలన్నీ
నా కళ్ళకు పట్టపగలే
కనిపించాయి

పుస్తకమే తెరిచాక
నవ్వెనులే నెమలీక
మన ప్రేమకు తొలి లేఖ
తానే గనుకా టెన్ టు ఫైవ్

నువ్వున్నది నాకోసం
నేనున్నది నీకోసం
దూరానికి అవకాశం
ఇవ్వను ఇంకా

ఊహలెన్ని వింటుందో
రంగులెన్ని తింటుందో
కుంచె మంచి బొమ్మేదో
గీయడానికి టెన్ టు ఫైవ్

ఎన్ని పాట్లు పడుతుందో
ఎన్ని నిన్నలౌతుందో
ప్రేమ రెండు మనసుల్నే
ఏకం చేసే సరికి

సిరి సిరి సిరి మువ్వల్లోనే
దాగుండే చప్పుళ్లన్నీ
నా గుప్పెడు గుండెల్లోనే
వినిపించాయే

నడి రాతిరి జాబిలి లోనే
కొలువుండే వెన్నెలలన్నీ
నా కళ్ళకు పట్టపగలే
కనిపించాయి టెన్ టు ఫైవ్

కలగన్నది కళ్లెదుటే
నిజమయ్యి కనబడితే
పెదవంచున్న ప్రతి మాట
పాటై పోయే టెన్ టు ఫైవ్

నీ అల్లరి అంకెలకే
కోరికలే రావేమో
మన ఇద్ధరిని కలిపి
ఒకటంటాయే

దేవదాసు లాంటోన్ని
కాళిదాసు చేసావే
కాలమేదో మన పైనే
రాయడానికా

కుదురుగుండె నా చున్నీ
పోగుచేసి చుక్కల్ని
ఎగరుతోంది నీవల్లే
సీత కోక లాగా

సిరి సిరి సిరి మువ్వల్లోనే
దాగుండే చప్పుళ్లన్నీ
నా గుప్పెడు గుండెల్లోనే
వినిపించాయే

నడి రాతిరి జాబిలిలోనే
కొలువుండే వెన్నెలలన్నీ
నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి


No comments

Most Recent

Default