-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Nandamuri Taraka Ratna"
చిత్రం: రాజా చెయ్యి వేస్తే (2016)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: నారారోహిత్, తారక రత్న, ఇషా తల్వార్
దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 29.04.2016

Palli Balakrishna Sunday, February 28, 2021


చిత్రం: తారక్  (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:
గానం:
నటీనటులు: నందమూరి తారకరత్న , కృష్ణ
దర్శకత్వం: బాలశేఖరన్
నిర్మాత: యన్.వి.ప్రసాద్
విడుదల తేది: 03.04.2003

మెల్లంగ రావో చిన్ని కృఇష్ణుడా వళ్ళు వళ్ళంతా అల్లుకో కొంటె కృఇష్ణుడా
మెల్లంగ రావో చిన్ని కృఇష్ణుడా వళ్ళు వళ్ళంతా అల్లుకో కొంటె కృఇష్ణుడా
జల్లు జల్లంటు జల్లు జల్లంటు
జల్లు జల్లంటు గిల్లు వాన జల్లు లాగా
లేత గుండెల్లొ దూరు ఈత ముల్లు లాగా
చిన్నంగ నే వస్తా సుందరాంగి పండు వెన్నెల్లో దొంగలా వంగి వంగి
చిన్నంగ నే వస్తా సుందరాంగి పండు వెన్నెల్లో దొంగలా వంగి వంగి

జున్ను జున్నంతా జున్ను జున్నంత
జున్ను జున్నంత జుర్రుకుంట సత్యభామ
కన్నె వెన్నెంతా దోచుకుంటా వప్పుకొమ్మా
జున్ను జున్నంత జుర్రుకుంట సత్యభామ
కన్నె వెన్నెంతా దోచుకుంటా వప్పుకొమ్మా

ముప్పూట వండి ఉల్లిపాయ కోసి మెట్ట చేలో కొస్తే
ముద్దుల్ని గోరు ముద్దల్ని నోటి కందిచమన్న బాలుడులే
ఏటి నీళ్ళళ్ళో ఆడే తారకలే
అల్లరల్లారిపిల్ల గిల్లి కజ్జాలాడి కల్లోకొచ్చిందంటా
అచ్చట్లు తీపి ముచ్చట్లు ఊసులాడే వయ్యరి రాధికలా
గోము చేసే అందాల గోపికలా
నాయనో నాయనో ప్రేమ పుట్టిందిలే నాయనొ
నాయనో నాయనో ఈడు గిచ్చిందిలే నాయనో

మెల్లంగ రావోయ్ బాల కృఇష్ణుడా
మెల్ల మెల్లంగ రావోయ్ బాల కృఇష్ణుడా
కొత్త కొత్తాగుంది మెత్త మెత్తాగుంది మత్తెక్కిపోతుంది
వత్తిళ్ళు వేడి ఆవిర్లు ఓర్చుకోలేని తాపం ఈవేళ
తీర్చిపోతావా దాహం గోపాల
మొన్న ఏమి లేదు నిన్నా కూడ లేదు ఇవ్వాళే పుట్టిందా
ప్రేమంటే తీపి బాధంటలేదు పిల్లా దీనికే మందు
ఓపికుంటే ఇచ్చుకో ఆ విందు
కోయిలా కోయిలా కోతకొచ్చానులే కోయిలా
రా ఇలా రా ఇలా కౌగిలిస్తానులే రా ఇలా

Palli Balakrishna Friday, December 8, 2017


చిత్రం: యువరత్న (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నందమూరి తారకరత్న, జివిదా శర్మ
దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణ రావు
నిర్మాత: నందమూరి రామకృష్ణ
విడుదల తేది: 29.11.2002

అమ్మగారి నాన్నగారి తాతగారి బామ్మగారి
చాటునున్న చంటిపాపరో
కళ్ళజోడు బాపుగారి రాఘవేంద్రరావు గారి
ఫిల్ములోని పడుచుపాపరో
సీతారామయ్యగారి మనవరాలురో
బెల్లంతో కలుపుకుంటే మరమరాలురో
నో అంటే ఎస్సనిలే  పొమ్మంటే రమ్మనిలే
ఛీ అంటు కసురుకుంటే  టోటల్ గ ఓకేరో

అమ్మగారి నాన్నగారి తాతగారి బామ్మగారి
చాటునున్న చంటిపాపరో
కళ్ళజోడు బాపుగారి రాఘవేంద్రరావు గారి
ఫిల్ములోని పడుచుపాపరో
సీతారామయ్యగారి మనవరాలురో
బెల్లంతో కలుపుకుంటే మరమరాలురో
నో అంటే ఎస్సనిలే  పొమ్మంటే రమ్మనిలే
ఛీ అంటు కసురుకుంటే  టోటల్ గ ఓకేరో

చరణం: 1
ఉత్తరాన్ని చించిందంటే నీపై చిత్తశుద్ధి ఉన్నట్టే
గిఫ్టు తిప్పి పంపిందంటే నిన్ను గాడుగిఫ్టు అనుకున్నట్టే
బండబూతు తిట్టిందంటే నీపై బండెడంత ప్రేమున్నట్టే
చెప్పు చేత పట్టిందంటే నీ చెప్పు చేతల్లొ ఉంటుందన్నట్టే
కస్సంటే కిస్సనిరో  బుస్సంటే కస్సనిరో
ఆడాళ్ళ మాటలకు అర్థాలు రివర్సురో

అమ్మగారి నాన్నగారి తాతగారి బామ్మగారి
చాటునున్న చంటిపాపరో
కళ్ళజోడు బాపుగారి రాఘవేంద్రరావు గారి
ఫిల్ములోని పడుచుపాపరో

చరణం: 2
పైట కాస్త సర్దిందంటే నిన్ను సైటు కొట్టమన్నట్టే
వెనక తిరిగి చూసిందంటే నీ పై ముందు చూపులున్నట్టే
పళ్ళు కాస్త కొరికిందంటే నీకు పచ్చ జండ చూపినట్టే
అన్నతోటి చెప్పిందంటే నిన్ను అల్లుడిగ ఇంట్లోకి రమ్మన్నట్టే
తప్పంటే తప్పదనిరో  ఉ ఊ అంటే ఉన్నదనిరో
ఆడాళ్ళ మాటలకు కొత్త డిక్షనరి కావాల్రో

అమ్మగారి నాన్నగారి తాతగారి బామ్మగారి
చాటునున్న చంటిపాపరో
కళ్ళజోడు బాపుగారి రాఘవేంద్రరావు గారి
ఫిల్ములోని పడుచుపాపరో
సీతారామయ్యగారి మనవరాలురో
బెల్లంతో కలుపుకుంటే మరమరాలురో
నో అంటే ఎస్సనిలే  పొమ్మంటే రమ్మనిలే
ఛీ అంటు కసురుకుంటే  టోటల్ గ ఓకేరో


********   *********   *********


చిత్రం: యువరత్న (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: సాధనా సర్గం , కళ్యాణి మాలిక్

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
నీ చిరు చిరు నగవుల కిల కిల సడితో
వలపుల పాటలు పాడవా..
వలపుల తెలుగుల తొలి పిలుపులలో
చెలిమికి నా మది చూపవా...

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
నీ చిరు చిరు నగవుల కిల కిల సడితో
వలపుల పాటలు పాడవా..
వలపుల తెలుగుల తొలి పిలుపులలో
చెలిమికి నా మది చూపవా...

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...

చరణం: 1
ఏతోటలో ఏ కొమ్మకో తారల్లె విరిసిన పువ్వా...
నాలో కోరిక వినవా తన సిగలో జాబిలి కావా
వేసంగిలో వెన్నెల్లలో గువ్వల్లె మెరిసిన పువ్వా...
నాలా నువ్వై పోవా తన ఒడిలో పాపవు కావా
పసి పసి మనసుల మొరలను వినవా
మధురిమ మంత్రం వేయవా
మా పరుగుల ఉరుకుల ప్రేమల త్రోవ
పరిమళ భరితం చేయవా

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...

చరణం: 2
ముత్యానికే ముస్తాబులా తెల్లంగ పూచిన పువ్వా
నాతో ఏకం కావా తన పదముల పూజకు రావా
గోదారికే పైటంచులా స్వచ్చంగ విచ్చిన పువ్వా
నాలో సిగ్గులు కనవా నా తేనెలు తనకందీవా
ఇటు అటు తెలియని వయసుల గొడవా
ఇదియని నువ్వే తేల్చవా
మా ఇరువురి నడుమన వారధి కావా
ఈ ఒక సాయం చేయవా

సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...
సన్న జాజి పువ్వా సన్న జాజి పువ్వా...
చిరు చిరు నవ్వే నవ్వవా...


********   *********   *********


చిత్రం: యువరత్న (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: షాన్

నీది 98480...  నాది 98490...
నెంబరు మాత్రం బంపరు గుంది ఇంతకి నీదేం పేరో
నీది 98480... నాది 98490...
స్ట్రక్చరు మొత్తం సూపరు గుంది ఈ ఊరో పొరుగూరో
మనకిక లేదు టుమారో  కనుకే దుమ్ము దుమారో
చూడరు బారో గీరో  కొడదాం జిన్నో బీరో
రోము నగరమే తగలడుతున్నా ఫిడేలు మీటెను నీరో
పాపం పుణ్యం పక్కన పెట్టి సుఖపడి పోదాం యారో

నీది 98481... నాది 98491...
వన్ను వన్ను ఒకటే ఐతే ఉన్నది ఎంతో ఫన్నూ
నీది 98481... నాది 98491...
వెన్ను వెన్ను కలిసాయంటే మైకం కలుగును టన్నూ
నాకో మారుతి జెన్ను ఉందోయ్ ఇంతకు మున్ను
మొన్నే చూశా నిన్ను  నీకై అమ్మేశాను
కోతి నుంచి మనిషొచ్హాడంటూ చెప్పెనురా డార్విన్నూ
కోతి పనులనే చెయ్యకపోతే తోచదు దారి తెన్నూ

నీది 98482... నాది 98492...
ఆఖరి అంకెలు టూలే ఐతే ఇంకా ఎందుకు లేటూ
నీది 98482... నాది 98492...
నోకియ సెల్లును చేతిలో ఉంటే సఖియా మనకేం లోటు
నాకో మెసేజ్ కొట్టు  చీకటి మూర్తం పెట్టు
కొంచెం భయమే పుట్టు బోలెడు సుఖమే గిట్టు
మొబైల్ ఫోను కనిపెట్టిన వాడికి రోజు సలాము కొట్టు
ఫోను బిల్లు కట్టాల్సిన రోజు నాకే గుడ్ బై కొట్టు

నీది 98483...  నాది 98493...
ఈ త్రీ ఆ త్రీ రెండు కలిపెను నీకు నాకు మైత్రీ
నీది 98483...  నాది 98493...
మైత్రే కలిసిన గుర్తుగ మనము గడిపేద్దాం ఓ రాత్రి
నేనే మన్మధ శాస్త్రి  ఇస్తా ముద్దు భజంత్రి
ఇస్తే ఒంపుల పత్రి చేస్తా ఇంపుగ ఇస్త్రి
ఆట పాటలు అయిపోయాయి టాటానోయ్ అభినేత్రి
అదిగో అదిగో వచ్చేస్తోంది నావైపే ఇంకో స్త్రీ

Palli Balakrishna Saturday, August 12, 2017



చిత్రం: ఒకటో నెంబరు కుర్రాడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నందమూరి తారకరత్న , రేఖ
దర్శకత్వం: ఏ. కోదండరామిరెడ్డి
నిర్మాత: కె.రాఘవేంద్రరావు
విడుదల తేది: 18.09.2002



Songs List:



ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా పాట సాహిత్యం

 
చిత్రం: ఒకటో నెంబరు కుర్రాడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బి.చరణ్ , చిత్ర

ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ ఐ లవ్ యూ రా... హే
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ్ అదంతేరా

ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ ఐ లవ్ యూ రా...
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ్ అదంతేరా

అరరె చురుకు నీకు ఉందిరా
అసలు కొత్త స్టైలు నీదిరా
అందుకే... ఐ లవ్ యూ రా
ఆడపిల్ల ఒరేయ్ అందంటే ప్రేమలోని పడ్డట్టేరా
నీ రొట్టె విరిగి ఎంచక్కా నేతిలోన పడిపోయేరా

ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ ఐ లవ్ యూ రా

చరణం: 1
ఏంట్రా గూట్లే... ఆహాహా ఎంత ప్రేమగా పిలిచిందో చూడరా
ఏంట్రా గూట్లే టెలిఫోన్ పోలల్లే ఎదిగావురా
పోరా డోంగ్రి ఐస్ఫ్రూట్ పుల్లల్లే అదిరావురా
ఎంట్రా టుమ్రీ తొక్కలోది నీ డ్రస్సే బాగుందిరా
పోరా పుస్కీ దిక్కుమాలిన నీ ఫేసే సూపర్బ్ రా
ఏరా లఫంగి నువ్వేరా
ఏరా పుడింగి నీ పేరా
బే అన్న బేవర్సన్నా
బచ్చా అన్నా బడవా అన్నా
ప్రతిమాట పరమార్థం ప్రేమేరా

ఆహా మీ తిట్లే వింటుంటే ప్రేమ ముదిరినట్టుందిరా
ఓహో మీరు మాకు హ్యాపీగా బీరు పార్టీ ఇచ్చుకొండిరా...

ఒరేయ్... ఒరేయ్... ఒరేయ్ చిలక రూటుకొచ్చిందిరా
ఒరేయ్ ఇక వెళ్లండిరా
ఒరేయ్ చిలిపి చిలిపి పనులున్నాయ్ రా
ఒరేయ్ కళ్లు మూయండిరా

చరణం: 2
ఏంట్రా మెంటల్... ఓహొహో ఏం ముద్దుగా పిలిచావ్ పిల్లోయ్
ఏంట్రా మెంటల్ చల్లనైన నీ మనసే ఎయిర్ కూలర్ రా
పోరా కిండల్ దూకుతున్న నీ వయసే టూవీలర్ రా
రారా ఉల్ఫా కాల్చుతున్న చూపే సిగరెట్లైటర్ రా
పోరా పిస్తా చిక్కుకున్న నడుమే సెంటీమీటర్ రా
నా దేశముదురు నువ్వేరా
నా చేదు షుగరు ఇలా రా
ఇడియట్ అన్నా స్టుపిడ్ అన్నా
ట్యూబ్లైట్ అన్నా ఎల్బోర్డ్ అన్న
ప్రతి తిట్టు ప్రేమలోన దీవెనేరా
డౌట్ లేదు వీళ్లు మనకు లేనట్టేరా

ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ ఐ లవ్ యూ రా
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ్ అదంతేరా

అరరె చురుకు నీకు ఉందిరా
అసలు కొత్త స్టైలు నీదిరా
అందుకే... ఐ లవ్ యూ రా





అగ్గిపుల్ల గీయగానే పాట సాహిత్యం

 
చిత్రం: ఒకటో నెంబరు కుర్రాడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు , కల్పన

అగ్గిపుల్ల గీయగానే భగ్గు మంటు మండినట్టు
ఆడ పిల్ల చేతి స్పర్శ తగిలెనయ్యహో...
అయ్యహో అయ్యహో మంటలోన నెయ్యనువ్వు పొయ్యహో
అయ్యహో అయ్యహో ఒంటిపైన ముద్దులెన్నో వెయ్యహో
అమ్మతోడు అందగత్తె హస్తవాసి హాయిగుంది అయ్యహో అయ్యహో
కత్తితోటి కొయ్యగానే  కస్సుమంటు జారినట్టు
కుర్రవాడి వాడి చూపు గుచ్చెనయ్యహో...
అయ్యహో అయ్యహో జంటకొచ్చి ప్రేమబండి తొయ్యహో
అయ్యహో అయ్యహో ఇంటికొచ్చి ప్రేమతిండి మెయ్యహో
అయ్యతోడు అందగాడి నెయ్యమెత్తగుయ్యా గుంది అయ్యహో అయ్యహో...

ఒంపులోన తిష్ట నేను వెయ్యహో తిష్ట నేను వెయ్యహో
దిండుతోటి దిష్టి నీకు తియ్యహో దిష్టి నీకు తియ్యహో
పోలికంత దానమల్లే చెయ్యహో... కౌగిలింత చీర నువ్వు నెయ్యహో...
గాలునేను దువ్వుతుంటే చూడహో నీకాలు నీకు చెప్పకుండా జారహో
ఒక్కసారి పుట్టునంట ప్రేమహో గుత్త జ్ఞాపకాలు పట్టునంట ప్రేమహో
అమ్మతోడు తుమ్మతోడు గుమ్మతోడు గుత్తగుంది అయ్యహో అయ్యహో

అగ్గిపుల్ల గీయగానే...
అగ్గిపుల్ల గీయగానే భగ్గు మంటు మండినట్టు
ఆడ పిల్ల చేతి స్పర్శ తగిలెనయ్యహో...
అయ్యహో ...

ఓ... సిగ్గుపైన మూత నువ్వు తియ్యహో  మూత నువ్వు తియ్యహో 
చిత్రమైన కూత నేను కుయ్యహో  కూత నేను కుయ్యహో
నోటి తోటి నోరు నువ్వు ముయ్యహో...
మాటరాని తేనే బొమ్మ గియ్యహో...
చంప పైన గోటితోటి గిచ్చహో అది గుండెలోని మాసిపోని మచ్చహో
పట్టలేక నువ్వు నేను రెచ్చహో ఉడుకు పుట్టలేక విరహమంత చిచ్చహో
అమ్మతోడు అబ్బతోడు వీడితోడు వేడిగుంది అయ్యహో అయ్యహో

కత్తితోటి కొయ్యగానే కస్సుమంటు జారినట్టు
కుర్రవాడి వాడి చూపు గుచ్చెనయ్యహో...
అయ్యహో అయ్యహో జంటకొచ్చి ప్రేమబండి తొయ్యహో
అయ్యహో అయ్యహో ఒంటిపైన ముద్దులెన్నో వెయ్యహో
అయ్యతోడు అందగాడి నెయ్యమెత్తగుయ్యా గుంది అయ్యహో అయ్యహో...
అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో  అయ్యహో




నువ్వు చూడు చూడకపో పాట సాహిత్యం

 
చిత్రం: ఒకటో నెంబరు కుర్రాడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి , గంగ

నువ్వు చూడు చూడకపో
నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా
ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా
నా ప్రాణం నా ధ్యానం నువ్వే లెమ్మంట
నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా

నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా
నువ్వు కొట్టినా నా చెంప మీద నీ గురుతొకటుందని సంతోషిస్తా
మనసు పువ్వును అందించాను కొప్పులో నిలుపుకుంటావో కాలి కింద నలిపేస్తావో
వలపు గువ్వను పంపించాను బొట్టు పెట్టి రమ్మంటావో గొంతు పట్టి గెంటేస్తావో
ఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా
నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా

పూజించటం పూజారి వంతు వరమివ్వడమన్నది దేవత ఇస్టం
ప్రేమించటం ప్రేమికుడి వంతు కరుణించడమన్నది ప్రేయసి ఇస్టం
ఎందువల్ల నిను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదు గా నిన్ను మరవడం జరగదు గా
ఎందువల్ల నువు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా ఎదురు చూపులే ఆపనుగా
ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా

నిను చూడలని ఉన్నా
నిను చూడలని ఉన్నా నే చూడలేకున్నా
మాటాడాలని ఉన్నా మాటాడలేకున్నా
ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా
లోలోనా నాలోనా కన్నీరవుతున్నా





ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని పాట సాహిత్యం

 
చిత్రం: ఒకటో నెంబరు కుర్రాడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని అందంగా పెరగాలని
చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని
పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలనీ
ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ

ఎన్ని జన్మలెత్తిన మగవాడై పుట్టాలని మీసాలే పెంచాలని
పొట్టి లాగు వయసు దాటి ప్యాంటు నేను తొడగాలని
పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
అన్నీ అన్నీ అన్నీ అన్నీ పుచ్చుకోవలనీ
ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ చచ్చే ఆశ

నిన్నంటు చూశాక మాటాడే ఆశ మాటల్నే కలిపాక మనసిచ్చే ఆశ
ఇద్దరికీ ప్రేమన్నది కలగాలని ఆశ పెద్దలకి మనసంగతి తెలియాలని ఆశ
పెద్దలకి తెలిశాక పెళ్లంటూ కుదిరాక
తాళంటు బిగిశాక గోలంతా ముగిశాక
ఫలహారం తిన్నాక పడకింటికి చేరాక
తలుపుల్ని మూశాక తలగడని సర్దాక
బెడ్ లైటే ఆర్పాక వడ్డాణం విప్పాక
దగ్గరగా జరిగాక బిగ్గరగా...
చెప్పూ... ఆశ ఆశ ఆశ దోశ దోచే ఆశ

గోడలకి మన గొడవలు తెలియొద్దని ఆశ 
మంచం మన ముచ్చట్లను చూడొద్దని ఆశ
పడకింట్లో పెనవేతలు ఆపాలని ఆశ
డాబాపై దోబూచులు ఆడాలని ఆశ
డాబా పైకెక్కాక దాహలే పెరిగాక
వెన్నెల్లో తడిశాక వెచ్చంగా మరిగాక
ముద్దుల్లో మునిగాక మునుముందుకు వెళ్ళాక
గుణకారం చేశాక ఘనకార్యం జరిగాక
అదికాస్త తెలిశాక ఆనందం ఎగిసాక
మరికాస్త అడిగాక అడిగాకా...
చెప్పూ... ఆశ ఆశ జిగి జిగి జిగి జిగి జిగి జిగి
ఆశ దోశ జిగి జిగి జిగి జిగి జిగి జిగి తీర్చే ఆశ

ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని
మగవాడై పుట్టాలని 
చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని
ప్యాంటు నేను తొడగాలని
పెళ్లంటూ చేసుకుంటే...
నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలనీ
ఆశ ఆశ ఆశ ఆశ  పిచ్చి ఆశ పిచ్చి ఆశ చచ్చే ఆశ
ఆశ ఆశ ఆశ ఆశ




తొడకొట్టి చెబుతున్నా తొలిమాట పాట సాహిత్యం

 
చిత్రం: ఒకటో నెంబరు కుర్రాడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, గాడ్విన్

తొడకొట్టి చెబుతున్నా తొలిమాట 
జబ్బ చరిచి చెబుతున్నా భలే మాట
రొమ్ము విరిచి చెబుతున్నా కాలు దువ్వి చెబుతున్నా 
బల్ల గుద్ది చెబుతున్నా బంపరు మాట
ప్రేమన్నది ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్కు
ప్రేమన్నది ప్రతి ఒక్కరు తీర్చాల్సిన మొక్కు
ప్రేమన్నది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం

ఆడ రెండక్షరాలు, మగ రెండే అక్షరాలు
ఆడ మగ మధ్య పుట్టు ప్రేమే రెండక్షరాలు
తప్పు రెండక్షరాలు, ఒప్పు రెండు అక్షరాలు
తప్పొప్పులు చేయించు ప్రేమే రెండక్షరాలు
బాధ రెండక్షరాలు, హాయి రెండక్షరాలు
ఈ రెంటిని కలిగించు ప్రేమే రెండక్షరాలు
ప్రేమన్నది ఫలిఇస్తే పెళ్ళి రెండక్షరాలు
ప్రేమన్నది వికటిస్తే పిచ్చికూడా రెండక్షరాలే
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం

ప్రేమన్నది ఒక గ్రామం, ప్రేమికులకు స్వగ్రామం
ఎదిరించిన వాళ్ళతోటి చెస్తుందోయ్ సంగ్రామం
ప్రేమన్నది పదో గ్రహం, అందించును అనుగ్రహం
అనుగ్రహమే పొందుటకు కావాలోయ్ నిగ్రహం
ప్రేమన్నది ఒక దారం, అన్నిటికది ఆధారం
ప్రేమించిన హృదయాల్లో పూస్తుందోయ్ మందారం
ప్రేముంటె సౌభాగ్యం, లేకుంటే దౌర్భాగ్యం
లవ్వాడుట ఆరోగ్యం ఆడకుంటే అదో అనారోగ్యం
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం




నెమలి కన్నోడ పాట సాహిత్యం

 
చిత్రం: ఒకటో నెంబరు కుర్రాడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్ , చిత్ర

నెమలి కన్నోడ నమిలే చూపొడ కమిలిపోకుండా తాకాలయ్యో...
అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వద్దున పడ్డ చాపై పోతా
చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో...
అహా రెక్కల పువ్వై రివ్వున రావే చుక్కలతోనే ముద్దాడిస్తా

నెమలి కన్నోడ డా డా డా డా
చిలకా నీ మొగ్గ దా దా దా దా

ఏ పూలతో కొలవాలయ్యో ఆరడుగుల వజ్రం నువ్వే
కన్నె ముద్ర అద్దావంటే వెన్న ముద్దై పోదా వజ్రం
నీ ఛాతి విఖ్యాతి అహా తెలుసులే లేలేత నా బుగ్గలో మొటిమకు
నీ నడుము హరివిల్లు గవనలు అని ఆకాశం దిగివచ్చి పలికిందిలే
చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే
చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే పచ్చడి ఆకై విచ్చుకు పోతా

తననా నానాన నెమలి కన్నోడ
నననా నానాన నమిలే చూపొడ
నెమలి కన్నోడ నమిలే చూపొడ కమిలిపోకుండా తాకాలయ్యో...

తనన నన్నా తనన నన్నా తననననా
తనన నన్నా తనన నన్నా తనననన తనననా

ఎండా కన్నే తగలకుండా దాచుకున్నా జాబిలి ఇవ్వు
ఎంగిలికాని తీర్ధం తెచ్చి నాపై చల్లి ఎత్తుకుపోరా
బంగారం పరుగెత్తి వచ్చిందిలే నీ మేని చమటయ్యి కరిగేందుకు
నీ రెప్ప చిరుగాలి విసిరిందిలే నా మనసు లో తేమ ఆరేందుకు
అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే 
అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే తీపి గుండెలో ఆశ పుట్టిందే

తననా నానాన చిలకా నీ మొగ్గ
తననా నానాన నలిపే పోతాగా
చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో హై
అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వద్దున పడ్డ చాపై పోతా
డా డా డా డా
దా దా దా దా
డా డా డా డా
దా దా దా దా


Palli Balakrishna Saturday, July 29, 2017

Most Recent

Default