Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Laxmi Deepak"
Pachani Samsaram (1970)



చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం:  యస్.పి.కొదండపాణి
నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ 
దర్శకత్వం: లక్ష్మి దీపక్
నిర్మాత: బి.నారాయణ
విడుదల తేది: 07.08.1970



Songs List:



అమ్మా నీవులేని తావులేదు పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల 

అమ్మా నీవులేని తావులేదు 



అమ్మా నీవులేని తావులేదు పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల, యస్. జానకి 

అమ్మా నీవులేని తావులేదు 



అనురాగ మాల విరిసింది అణువణువున పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

అనురాగ మాల విరిసింది అణువణువున





పచ్చ పచ్చగా పైరు సాగింది పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: కొసరాజు 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

పచ్చ పచ్చగా పైరు సాగింది 



పాపాయి నవ్వులే మల్లెపూలు పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల 

పాపాయి నవ్వులే మల్లెపూలు 




పాపాయి నవ్వులే మల్లెపూలు (Bit Song) పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల 

పాపాయి నవ్వులే మల్లెపూలు (Bit Song)





పాడమని పాట వినే రాజు ఎవరూ పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని సంసారం (1970)
సంగీతం: యస్.పి.కొదండపాణి
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: పి. సుశీల 

పాడమని పాట వినే రాజు ఎవరూ 


Palli Balakrishna Tuesday, July 5, 2022
Inti Kodalu (1974)



చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: ఎస్. వి. రంగారావు, గుమ్మడి, కృష్ణం రాజు, చంద్రమోహన్, ప్రమీల, యస్. వరలక్ష్మి, పి. ఆర్. వరలక్ష్మి, రోజా రమణి,
మాటలు: ఆరుద్ర
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
నిర్మాత: పి. మల్లికార్జున రావు
విడుదల తేది: 12.09.1974



Songs List:



చలిగాలిలో నులివెచ్చని పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర
గానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం

చలిగాలిలో నులివెచ్చని
బిగికౌగిలి పెనవేసుకో
ఊరించి నవ్వింది సొగసు - అహా
ఉప్పొంగి పోయింది మనసు

తొలికారు మేఘాలు మూశాయి
చిటపట చిటపట చిటపట చినుకులు కురిశాయి
జల్లులో ఒళ్ళంత తడిసింది
గుండెలో ఒక జ్వాల రగిలింది 
తొలి ప్రేమలో పులకింతలై
మేను కరగినది హాయి పెరిగినది
అందాలు చిందేనెలే

తెరచాటు పరువాలు మెరిశాయి
ముసిముసి మిలమిల వలపులు గుసగుస లాడాయి
ఊహలే ఉయ్యాల ఊగేను
మోహమే చలిమంట కాగేను
అనురాగమే అనుబంధమై
పొందు కూర్చినది విందు చేసినది
ఉర్రూత లూపిందిలే





ఊరికే చల్లారునా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం

స్నానాల గదిలోన సన సన్నని జలపాతం 
ఆ జలపాతం జల్లులులో  తడిసే ఓ పారిజాతం 
ఊరికే చల్లారునా
ఒంటిలోన లేచే ఆవిరి
జంటకోసం వేచే ఆ వేడి

మండే నేలను రాలే చినుకులు
మరింత సెగలను రేపుతాయి
రగిలే తనువున కురిసే జల్లులు
పొగలై నీలోనే మూగుతాయి
తడిసిన చీర మేని కంటుకొని
తగని మారాము చేస్తుంది 
నా దగ్గరకే నిను లాగేస్తుంది

పెదవుల దాహం తీరాలంటే 
పెదవుల తేనెలే కావాలి,
కాగే దేహం ఆరాలంటే
కౌగిలి కుంపటే కావాలి 
ఓపలేని ఒంటరి తనమే
నీపై కన్నెర్ర చేస్తుంది , అది
నిలువున నిను కాల్చేస్తుంది




రావా ! ననుచేరలేవా ? పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: బాలసుబ్రహ్మణ్యం

రావా ! ననుచేరలేవా ?
ఎటు చూసినా పడుచు జంటలే
ఎటు చూసినా వలపు పంటలే

ప్మురతి నిమిషం నినుచూసీ 
నీ కోసం చెయిసాచి
విధిలేక లోలోన విలపించుటేనా
ఉన్నాము ఒక యింటిలోన కాని
ఎన్నెన్ని కనరాని పరదాలో 
చేరు కున్నాము ఒక పాన్పు పైన కాని
ఎన్నెన్ని దరిలేని దూరాలో
నువ్వు ఎదటుండి ఎంతెంత విరహం
నేను బతికుండి ఇది వింతమరణం

నిను నిన్నుగా నేను వలచాను నా
మనసంతా నీ చేత నిలిపాను 
ఆ మూగమనసే విసిరేసినావు
అనురాగ బంధం తెగగోసినావు
ఇంకా కసితీర లేదా
ఎన్నాళ్ళు యి నరక బాధ





చిన్నారి పొన్నారి బుల్లెమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: కొసరాజు
గానం: జిక్కి - జానకి

చిన్నారి పొన్నారి బుల్లెమ్మా
వన్నె వాసీ కలిగి వర్థిల్ల వమ్మా
పరికిణీకట్టే బాలప్రాయము దాటి
పడుచు తనమూ వచ్చేనమ్మా
బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా

చక్కిలిగింతల పులకించే దోరవయసూ
ఉక్కిరి బిక్కిరి చేసేనమ్మా
చక్కని బంగారు పెళ్ళికొడుకూ
సరసన సయ్యాట లాడాలమ్మా
చిలకా గోరింకల్లా మెలగాలమ్మా
బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా

బిడ్డా పాపలేని సంసారం
అడవిని గాచిన వెన్నెల యౌనమ్మా
నిత్యము నీ యిల్లు కలకలలాడగ
సంతానవతి వౌచు మనవమ్మా
అలా అని బుజ్జిమ్మా ! గంపెడు పిల్లలకంటావా ఏమొ
వద్దమ్మా బుజ్జమ్మా
వద్దమ్మా - వద్దమ్మా
ఒకరిద్దరై తేనె సుఖమమ్మా

Palli Balakrishna Tuesday, April 5, 2022
Maha Purushudu (1981)





చిత్రం: మహా పురుషుడు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: యన్. టి. రామరావు, జయసుధ, సుజాత
స్క్రీన్ ప్లే: జంధ్యాల
దర్శకత్వం: పి.లక్ష్మీ దీపక్
నిర్మాత: వి. రోషిని
విడుదల తేది: 21.11.1981



Songs List:



శ్రీ కృష్ణ పాట సాహిత్యం

 
చిత్రం: మహా పురుషుడు
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల

శ్రీ కృష్ణ




మంగమ్మత్త కూతురా పాట సాహిత్యం

 
చిత్రం: మహా పురుషుడు
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు,  పి. సుశీల

మంగమ్మత్త కూతురా



తొలిసారి పాట సాహిత్యం

 
చిత్రం: మహా పురుషుడు
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు,  పి. సుశీల

తొలిసారి




కోవెలలో దీపంలా పాట సాహిత్యం

 
చిత్రం: మహా పురుషుడు
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు

కోవెలలో దీపంలా



బోణీ కొట్టు బేరం పాట సాహిత్యం

 
చిత్రం: మహా పురుషుడు
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు,  పి. సుశీల

బోణీ కొట్టు బేరం



చిలకలూరిపేట చిన్నదాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: మహా పురుషుడు
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి. బాలు,  జానకి

చిలకలూరిపేట చిన్నదాన్ని




ప్రతి వసంత వేళలో పాట సాహిత్యం

 
చిత్రం: మహా పురుషుడు
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: జి. ఆనంద్, పి. సుశీల

ప్రతి వసంత వేళలో

Palli Balakrishna Thursday, August 5, 2021
Pandanti Kapuram (1972)





చిత్రం: పండంటి కాపురం (1972)
సంగీతం: కోదండపాణి
నటీనటులు: కృష్ణ , విజయ నిర్మల,  జయసుధ, బి. సరోజా దేవి
దర్శకత్వం: పి.లక్ష్మీ దీపక్
నిర్మాత: జి. హనుమంతరావు
విడుదల తేది: 21.07.1972



Songs List:



మనసా...కవ్వించకే పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి కాపురం (1972)
సంగీతం: కోదండపాణి
సాహిత్యం:  మైలవరపు గోపి
గానం: పి సుశీల

మనసా... కవ్వించకే నన్నిలా
ఎదురీదలేక కుమిలేను నేను
సుడిగాలిలో చిక్కిన నావను
మనసా... కవ్వించకే నన్నిలా!

ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలోనా
ఈనాడు చీకటి లాగ మిగిలాను చీకటిలోనా
నేనోడిపోయి గెలుపొందినాను
నేనోడిపోయి గెలిపొందినాను
గెలిచానని నవ్వనా... ఏడ్వనా...
మనసా... కవ్వించకే నన్నిలా!

మోముపై ముంగురులేమో వసివాడి మల్లియలాయే
గుండెలో కోరికలన్నీ కన్నీటి చారికలాయే
ఏ తీవెకైనా కావాలి తోడు
ఏ తీవెకైనా కావాలి తోడు
నా జీవితం శాపమా పాపమా
మనసా... కవ్వించకే నన్నిలా!




బాబూ వినరా పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి కాపురం (1972)
సంగీతం: కోదండపాణి
సాహిత్యం:  దాశరథి
గానం: ఘంటసాల

బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ
కలతలు లేనీ నలుగురు కలిసీ సాగించారు పండంటి కాపురం
బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ

ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు
ఒక్క బాటపై కలసి నడిచారు వారు
ఆఆ ఆఆ ఆఆ... ఓ ఓ ఓ ఓ ఓ ఓ...
ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు
ఒక్క బాటపై కలసి నడిచారు వారు
అన్నంటే తమ్ములకు అనురాగమే...
అన్నకు తమ్ములంటే అనుబంధమే...

బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ

చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ.
చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ.
పిల్లలకూ పెద్దలకూ తల్లివంటిదీ ఆ ఇల్లు ఆమెతో స్వర్గమైనదీ

బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ

అన్న మనసులో వున్నది ఎన్నో కోరికలూ
తమ్ములకు జరగాలి పెళ్ళీ పేరంటాలు
పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలీ
కలకాలం ఈలాగే కలసివుండాలీ
బాబూ.వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ
కలతలు లేనీ నలుగురు కలిసీ సాగించారు పండంటి కాపురం.
ఆఆ... ఆఆ... ఓఓఓ... ఓఓఓ.




ఏమమ్మ జగడాల పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి కాపురం (1972)
సంగీతం: కోదండపాణి
సాహిత్యం:  దాశరథి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

ఏమమ్మా జగడాల వదినమ్మో
ఎగిరెగిరి పడతావు ఏందమ్మో
చిన్నారి పాపలూ అందాల బొమ్మలూ
వాళ్ళంటే కోపమేల హెయ్ హెయ్ హెయ్య

ఏమమ్మా జగడాల వదినమ్మో
ఎగిరెగిరి పడతావు ఏందమ్మో

చిన్నవాళ్ళు కాకుండానే పెద్ద వాళ్ళు అవుతారా
అల్లరేమి చెయ్యకుండా నోరు మూసుకుంటారా
చిన్నవాళ్ళు కాకుండానే పెద్ద వాళ్ళు అవుతారా
అల్లరేమి చెయ్యకుండా నోరు మూసుకుంటారా
ఎవరినేమి అన్నారూ ఎవరిసొమ్ము తిన్నారూ
చెయ్యి చేసుకుంటావా ఆపవమ్మా నీ బుసబుసలూ
ఆ.ఆ.ఆ.

ఏమమ్మా జగడాల వదినమ్మో 
ఎగిరెగిరి పడతావు ఏందమ్మో

చదువుంటే చాలదూ సంస్కారం వుండాలి
మనుషుల్లో తిరిగేటప్పుడూ మంచి మనసు కావాలి
చదువుంటే చాలదూ సంస్కారం వుండాలీ
మనుషుల్లో తిరిగేటప్పుడూ మంచి మనసుకావాలి
గర్వాన్ని వదలాలీ కలసిమెలిసి ఉండాలి
పుట్టింటికి మెట్టినింటికీ వన్నెవాసి తేవాలి
ఓ.ఓ.ఓ.

ఏమమ్మా జగడాల శోభమ్మో
ఎగిరెగిరి పడతావు ఏందమ్మో
తల్లిని మరిపించే తల్లీ పినతల్లని అంటారే
పిల్లలు ఏ తప్పు చేసినా సరిదిద్దాలంటారే
తల్లిని మరిపించే తల్లీ పినతల్లని అంటారే
పిల్లలు ఏ తప్పు చేసినా సరిదిద్దాలంటారే
నీవే ఇట్లుంటేనూలోకులు ఇది వింటేనూ
అయ్యయ్యో ఉన్న గౌరవం గంగలోన కలిసేనూ

ఊ.ఊ.ఏమమ్మాజగడాల వదినమ్మో 
ఎగిరెగిరి పడతావు ఏందమ్మో
ఏమమ్మా జగడాల శోభమ్మో
ఎగిరెగిరి పడతావు ఏందమ్మో



ఈనాడు కట్టుకున్న పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి కాపురం (1972)
సంగీతం: కోదండపాణి
సాహిత్యం:  మైలవరపు గోపి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు ఊ
కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు ఊ
ఊ ఊ ఓ ఓహోహో ఆహహా
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు ఊ
కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు
ఆశలే తీవెలుగా
ఉహూ
ఊసులే పూవులుగా
ఉహూ
వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు
ఆ ఆ ఆ
ఆశలే తీవెలుగా
ఉహూ
ఊసులే పూవులుగా
ఉహూ
వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు
పగలైనా రేయైనా ఏ ఋతువులోనైనా
పగలైనా రేయైనా ఏ ఋతువులోనైనా
కురిపించును తేనెజల్లు పరువాల ఆ పొదరిల్లు
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు ఊ
కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు

కళ్ళలో కళ్ళుంచీ
ఉహూ
కాలమే కరిగించే
ఉహూ
అనురాగం పండించే ఆ బ్రతుకే హరివిల్లు
ఆ ఆ ఆ
కళ్ళలో కళ్ళుంచీ
ఉహూ
కాలమే కరిగించే
ఉహూ
అనురాగం పండించే ఆ బ్రతుకే హరివిల్లు
నా దేవివి నీవైతే నీ స్వామిని నేనైతే
నా దేవివి నీవైతే నీ స్వామిని నేనైతే
పచ్చని మన కాపురమే పరిమళాలు వెదజల్లు
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు ఊ
కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు
ఊఁహూఁహూఁ ఊఁహూఁహూఁ
ఊఁహూఁహూఁ ఊఁహూఁహూఁ
ఊఁహూఁహూఁ ఊఁహూఁహూఁ



ఆడే పాడే కాలంలోన పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి కాపురం (1972)
సంగీతం: కోదండపాణి
సాహిత్యం:  మైలవరపు గోపి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల


ఆడే పాడే కాలంలోన



ఇదిగో దేవుడు చేసిన బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి కాపురం (1972)
సంగీతం: కోదండపాణి
సాహిత్యం:  మైలవరపు గోపి
గానం: పి. సుశీల

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

నదిలో నావ ఈ బ్రతుకు దైవం నడుపును తన బ్రతుకు ఊఉ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నదిలో నావ ఈ బ్రతుకు దైవం నడుపును తన బ్రతుకు
అనుబంధాలు ఆనందాలు తప్పవులేరా కడవరకు
తప్పవులేరా కడవరకు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

Palli Balakrishna Monday, July 26, 2021
Karthika Deepam (1979)



చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: శోభన్ బాబు, శ్రీదేవి, శారద, గీత
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
నిర్మాతలు: జి.రాధాదేవి గుప్తా, ఎ. కృష్ణయ్య
విడుదల తేది: 04.05.1979



Songs List:



ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం పాట సాహిత్యం

 
చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.జానకి, పి.సుశీల

ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం..
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం
ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం..
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం
ఇదేసుమా నా కుంకుమ తిలకం 
ఇదే సుమా నా మంగళ సూత్రం

ఇంటిలోన నా పాప రూపునా గోరంత దీపం..
కంటి కెదురుగా కనబడు వేళల కొండంత దీపం
నా మనస్సున వెలిగే దీపం నా మనుగడ నడిపే దీపం..

ఆకాశానా ఆమణిదీపాలేముత్తైదువులుంచారో
ఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారు..
ఏమైనా ఏదైనా కోవెలలో కొలువై ఉండే దేవికి పట్టిన హారతులే..

ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం..
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం
చేరనీ నీ పాద పీఠం నా ప్రాణ దీపం

నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం 
నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశా దీపం
నా నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం 
నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశా దీపం
ఎటనైనా ఎపుడైనా నే కొలచే కళ్యాణ దీపం నేవలచే నా ప్రాణ దీపం..

ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం..
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం
చేరనీ నీ పాద పీఠం నా ప్రాణ దీపం



చిలకమ్మ పలికిందీ పాట సాహిత్యం

 
చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు , జానకి

చిలకమ్మ పలికిందీ..చిగురాకు కులికిందీ (2)
చిరునవ్వు చిలికించవే నీ లేత సింగారమొలికించవే..
నీ లేత సింగార మొలికించవే..
గోరొంక కూసింది..గోరింట పూసిందీ..
ముత్యాల మనసీయ రా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా... 
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా...

పాల బుగ్గ కందితే తెలిసిందీ పూల సిగ్గు పూచిందనీ...
ఆ ఆహాహహాఆహ
పైట కొంగు జారితే తెలిసిందీ పిల్ల గాలి వీచిందనీ..
ఈ సిగ్గు బరువు నేనోపలేను (2)
నీ కంటి పాపలో దాచుకో నన్నూ.. దాచుకో నన్నూ..

కోయిలమ్మ పాడితే తెలిసిందీ కొత్త ఋతువు వచ్చిందనీ...
ఆ ఆహాహహాఆహ
కొండ వాగుదూకితే తెలిసిందీ.. కోడె వయసు పోగిందనీ.. 
ఈ వయసు హోరు నేనాపలేను (2)
నీ కౌగిలింతలో దోచుకో నన్నూ...దోచుకో నన్నూ..




చూడ చక్కని దానా పాట సాహిత్యం

 
చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చూడ చక్కని దానా
చూపు బిత్తరిదానా
నీ మిస మిసలు
ఈ రుస రుసలు
చూస్తేనే మనసౌతోంది

చూడ చక్కనివాడా
చూపు క తెరవాడా
నీ రెప రెపలు
ఈ తహ తహలు
చూస్తుంటే మతిపోతోంది

నీ సొగసులకు నా
చూపులను నే కావలి పెడతానే
నీ పెదవులపై నా పెదవులకు
పెత్తన మిస్తానే
చిలిపి వయసు కలికి మనసు
పంచుకుంటానే
నీవు కావాలన్నా అందీ అందక ఆరడిచేస్తాను
నను కాదంటున్నా కలలో కలసి అల్లరి పెడతాను
నిమిషమైన వదలలేని గారడి చేస్తాను




మువ్వలేమో నేడేమో పాట సాహిత్యం

 
చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

మువ్వలేమో నేడేమో నా లోలోన
మ్రోగించేను మోహనగీతం ॥మువ్వ|

కదలే కన్నులలో
చదవని కధలెన్నో ...
పలికే అడుగులలో
కలవని శ్రుతులెన్నో....
తెలిసిన వారికే.... ఆఁ ఆఁ...
నా వయసే నజరానా

ముసుగును తీయకనే
మోమును గమనించి
విసురుగ చూడకనే
రసికత చూపించి
వలచిన వానికే
నా వలపే నజరానా



నీ కౌగిలి లో తల దాచి పాట సాహిత్యం

 
చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, సుశీల

నీ కౌగిలి లో తల దాచి..నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మ కూ జత గా మసలే వరమే నన్నూ పొందనీ..

చల్లగ కాసే పాలవెన్నెల నా మనసేదో వివరించూ..
అల్లరి చేసే ఓ చిరుగాలి నా కోరికలే వినిపించూ..
నా కోవెలలో స్వామివి నీవై వలపే దివ్వెగ వెలిగించు. 

నింగి సాక్షీ..నేల సాక్షీ.. నిను వలచిన నా మనసే సాక్షీ...
మనసులోనా మనుగడ లోనా నాలో నీవే సగ పాలూ..
వేడుకలోనూ వేదన లోనూ పాలూ తేనెగ ఉందామూ..



ఓ మాట.. అహ తెలుసూ.. పాట సాహిత్యం

 
చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు , పి.సుశీల

ఓ మాట.. అహ తెలుసూ.. అదికాదు.. ఇంకేమిటీ..
చెబితే చాలదూ..కోరిక తీరదూ...ఇది విన్నదే.. రోజూ ఉన్నదే..(2)

పగలంత నా మాట వింటావటా పడకిల్లు చేరంగ దయ రాదటా
మావిళ్ల లో నీకు ఇల్లాలి నీ.. ఈ ఝాము నీపైన అధికారినీ...

అలకుంటె ఒక సారి నను దోచుకో కౌగిట బంధించి ముద్దాడుకో..
ఎన్నైన చెబుతావు ఈ ఘడియలో చాలన్నదే లేదు నీ భాషలో..

Palli Balakrishna Friday, December 1, 2017

Most Recent

Default