Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "K.S. Ravikumar"
Raakumarudu (1998)




చిత్రం: రాకుమారుడు (1998)
సంగీతం: M.M. కీరవాణి
నటీనటులు: అర్జున్, సిమ్రాన్, రాశి
దర్శకత్వం: కె. ఎస్. రవికుమార్
నిర్మాతలు: పి. సాంబశివ రెడ్డి, కె. జయరాం
విడుదల తేది: 06.02.1998



Songs List:



అమ్మ నీకు లేదని పాట సాహిత్యం

 
చిత్రం: రాకుమారుడు (1998)
సంగీతం: M.M. కీరవాణి
సాహిత్యం: భువన చంద్ర 
గానం: M.M. కీరవాణి

అమ్మ నీకు లేదని



ఉన్నావులే నా పాట సాహిత్యం

 
చిత్రం: రాకుమారుడు (1998)
సంగీతం: M.M. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి బాలు, చిత్ర  & కోరస్

ఉన్నావులే నా 




కొత్తపెళ్లి కూతురా పాట సాహిత్యం

 
చిత్రం: రాకుమారుడు (1998)
సంగీతం: M.M. కీరవాణి
సాహిత్యం: వెన్నలకంటి
గానం: M.M. కీరవాణి, మనో , సుజాత మోహన్, చిత్ర

కొత్తపెళ్లి కూతురా




ఓ చెలియా నీ కలయిక పాట సాహిత్యం

 
చిత్రం: రాకుమారుడు (1998)
సంగీతం: M.M. కీరవాణి
సాహిత్యం: భువన చంద్ర 
గానం: యస్.పి బాలు, సుజాత మోహన్

ఓ చెలియా నీ కలయిక 




పెట్టెయ్ మంచి పేరు పాట సాహిత్యం

 
చిత్రం: రాకుమారుడు (1998)
సంగీతం: M.M. కీరవాణి
సాహిత్యం: భువన చంద్ర 
గానం: M.M. కీరవాణి, మనో , సుజాత మోహన్, సంగీత

పెట్టెయ్ మంచి పేరు 



పూల రధంలా పాట సాహిత్యం

 
చిత్రం: రాకుమారుడు (1998)
సంగీతం: M.M. కీరవాణి
సాహిత్యం: భువన చంద్ర 
గానం: యస్.పి బాలు, సుజాత మోహన్ 

పూల రధంలా



ఉన్నావులే నా (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: రాకుమారుడు (1998)
సంగీతం: M.M. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: చిత్ర, M.M. కీరవాణి

ఉన్నావులే నా  (Sad Version)

Palli Balakrishna Wednesday, July 7, 2021
Ruler (2019)



చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
నటీనటులు: బాలకృష్ణ , వేదిక, చొనాల్ చౌహాన్
దర్శకత్వం: కె.యస్.రవికుమార్
నిర్మాతలు: సి.కళ్యాణ్
విడుదల తేది: 20.12.2019



Songs List:



అడుగడుగో యాక్షన్ హీరో పాట సాహిత్యం

 
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాయిచరణ్ భాస్కరుని

అడుగడుగో యాక్షన్ హీరో  
అరె దేకొయారో అడుగడుగు తనదేమ్ పేరో 
మరి తనదేమ్ ఊరో
అడుగులలో అది ఏమ్ ఫైరో 
ఛలో సెల్యూట్ చేయ్ రో

జై కొడుతూ సీటీ మారో సెల్ఫీ లే యారో
కింగ్ ఆఫ్ ది జంగిల్ లా యాంగ్రీ అవెంజర్ లా
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లా వచ్చాడు రా
చూపుల్లోనే వీడు క్లాసు 
మనసే బిసి సెంటర్ మాసు 
పక్కా వైట్ కాలర్ కార్పొరేటు లీడరు రా

మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు 
మళ్లీ వస్తాడు మళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే శృష్టిస్తాడు

లోకాలే తిరిగినా ఏ ఎత్తుల్లోకి ఎదిగినా
తను పుట్టిన మట్టిని వదలడు ఈ నేలబాలుడు
ఏ రాజ్యలేలినా ఏ శిఖరాలే శాసించినా
జన్మిచ్చిన తల్లికి ఎప్పుడు ఓ చంటి పాపడు

ఒకమాటలో గుణవంతుడు 
తన బాటలో తలవంచడు
ప్రతి ఆటలో ప్రతి వేటలో
అప్పర్ హ్యాండ్ వీడిదే
సక్సెస్ సౌండ్ వీడిదే...

మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు
మళ్లీ వస్తాడు మళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే శృష్టిస్తాడు

అరెరే ఆ గ్లామరు అది హ్యాండ్సమ్నెస్ కె గ్రామరు
జర చూపించాడో టీజరు ఇక చూపు తిప్పరు
అమ్మాయి లెవ్వరు వీడు కంపెని ఇస్తే వదలరు
మరి తప్పదు కద ఈ డేంజరు మార్చాలి నంబరు

సరదాలకే సరదా వీడు 
సరదా అంటే అసలాగడు
సరసాలలో శృతి మించడు 
ఫన్ టైము క్రిష్ణుడు ఫుల్ టైము రాముడు

మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు 
మళ్లీ వస్తాడు మళ్లీ మళ్లీ ఒస్తాడు 
సరికొత్త చరితలనే శృష్టిస్తాడు

మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు
మళ్లీ వస్తాడుమళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే  శృష్టిస్తాడు





పుడతాడు తాడుతాడు పాట సాహిత్యం

 
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: సింహా, చాందిని విజయ్ కుమార్ షా

ఎర ఎర్ర ఎర ఎర్ర నా పెదవుల్ని ముద్దాడుకోరా
హ హ హా...
గిర గిర్ర గిర గిర్రా తిరిగేస్తుంటే నను చూడవేరా
హ హ హా...

హే సర సర సర్రా తెగ నచ్చేసావు కుర్ర
హే జర్ర జర్ర జర్రా నా నడుమే జీలకర్ర
కర్చీఫె యేస్కో జల్ది జల్దీగా

పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడువాడు వాడు ఎవడైనా

అల్లావుద్దీన్ కే నేను అందని దీపాన్ని
నీ కోసం వచ్చేసా లుక్కేసుకో
ఐజాక్ న్యూటన్కే దొరకని ఆపిల్ని
దర్జాగ దొరకేశ పట్టేసుకో

నువ్వు కెలికితే కెలికితే ఇట్టా
నా ఉడుకుని దుడుకుని చూపిస్తా
సరసపు సరకుల బుట్ట
నీ బరువుని సులువుగ మోసేస్తా

మిసమిస మెరుపుల పిట్ట
నీ తహ తహ తలుపులు మూసేస్తా
సొగసరి గడసరి చుట్ట
నీ సెగలను పొగలను ఊదేస్తా

సోదా చేస్కో గల్లా ముల్లీగా

పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడువాడు వాడు ఎవడైనా

ఛాంపెను బాటిల్లో సొంపుల్ని అందిస్తే
దిక్కుల్ని చూస్తావే ఎత్తేసుకో
డైరక్టు అందాన్ని వాటెయడం కన్నా
అర్జెంటు పనులేంటి ఆపేసుకో

నీ ఇక ఇక పక పక వల్ల
నే రక రకములు చూపిస్తా
ఎగరకు ఎగరకు పిల్లా
నా ఎదిగిన వయసును పంపిస్తా

నిగ నిగ నవరస గుల్లా
నిను కొరకను కొరకను మింగేస్తా
కిట కిట కిటుకులు అన్ని 
నే టక టక లాగేస్తా

రాస్కో పూస్కో ఉండకు ఖాళీగా...

ఎర ఎర్ర ఎర ఎర్ర నా పెదవుల్ని ముద్దాడుకోరా
గిర గిర్ర గిర గిర్రా తిరిగేస్తుంటే నను చూడవేరా

హే సర్ర సర సర్రా తెగ నచ్చేసావు కుర్ర
హే జర్ర జర్ర జర్రా నా నడుమే జీలకర్ర
కర్చీఫె యేస్కో రాస్కో పూస్కో
సోదాలన్నీ చేస్కో గల్లా ముల్లీగా

పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడువాడు వాడు ఎవడైనా




సంక్రాంతి పాట సాహిత్యం

 
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: స్వరాగ్ కీర్తన్, రమ్యా బెహ్రా 

సంక్రాంతి 




యాల యాల పాట సాహిత్యం

 
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అనురాగ్ కులకర్ణి , అనుషా మణి

యాల యాల 

Palli Balakrishna Sunday, January 12, 2020
Bava Nachadu (2001)



చిత్రం: బావనచ్చాడు (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: నాగార్జున
దర్శకత్వం: కె.యస్.రవికుమార్
నిర్మాత: యమ్.అర్జున్ రాజు
విడుదల తేది: 07.06.2001



Songs List:



అనురాగం అనురాగంలో పాట సాహిత్యం

 
చిత్రం: బావనచ్చాడు (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్ , సుజాత

అనురాగం అనురాగంలో 
ఎన్నొ సరిగమలు 
అనుభందం అనుభందంలో 
ఏవో గుసగుసలు 

ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందం 
ఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం 

అనురాగం అనురాగంలో 
ఎన్నొ సరిగమలు 
అనుభందం అనుభందంలో 
ఏవో గుసగుసలు 

ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందం 
ఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం 

అనురాగం అనురాగంలో 
ఎన్నొ సరిగమలు 
అనుభందం అనుభందంలో 
ఏవో గుసగుసలు 

జడలొ సుమాల మాలికనై నేనె నిలవాలీ 
ఒడిలొ వయ్యరి బాలికనై నేనె వొదగాలీ 
పరవసమే మనవసమై నివ్వెరపోవాలీ 
జీవనమె విరివనమయి నవ్వులు పుయలీ 
పడుచు దారుల్లొని చూపె చుక్కనీ 
గడుసు సరసం లోని శ్వసె సంబ్రానీ 

అనురాగం అనురాగంలో 
ఎన్నొ సరిగమలు 
అనుభందం అనుభందంలో 
ఏవో గుసగుసలు 

తొనికే పెదాల తేనెల్లొ నేనె తడవాలీ 
బిగిసే సుఖాల కౌగిలిలో నేనె కరగాలి 
ప్రతి రేయి తొలిరేయి శొభనమవ్వలీ 
జతపడగా శత కోటి జన్మలు కావాలై 
చిలిపి సంసారంలో అలకలు రావాలీ 
అలకలన్ని ఎగిరె చిలకలు కావాలీ 

అనురాగం అనురాగంలో 
ఎన్నొ సరిగమలు 
అనుభందం అనుభందంలో 
ఏవో గుసగుసలు 

ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందం 
ఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం 

అనురాగం అనురాగంలో 
ఎన్నొ సరిగమలు 
అనుభందం అనుభందంలో 
ఏవో గుసగుసలు




చందమామ చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: బావనచ్చాడు (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్ , కె.యస్.చిత్ర, హరిణి

చందమామ చందమామ చంపగిల్లి పోరా
సొంత బావ సొంత బావ సొంపులల్లుకోరా
ముగ్గురుముంటె మరో జగం
సర్దుకు పోదాం చెరో సగం
తియ్యర తియ్యర తియ్యర తియ్యర తియ్యని మన్మధ బాణాలు
చెయ్యర చెయ్యర చెయ్యర చెయ్యర చక్కెర ముద్దుల స్నానాలు

చందమామ చందమామ చంపగిల్లుకుంటే
నీ సొంత బావ సొంత బావ సొంపులల్లుకుంటే
కథలో యేదొ అయోమయం...కలిగిందమ్మ అదో భయం
తియ్యర తియ్యర తియ్యర తియ్యర తియ్యని మన్మధ బాణాలు
చెయ్యర చెయ్యర చెయ్యర చెయ్యర చక్కెర ముద్దుల స్నానాలు

వెన్నెలలో సిరి వెన్నెలలో కుడి కన్నుని గీటాలీ
మల్లెలలో మరు మల్లెలలో మది వెన్నను తగాలీ
యెదురుగ నిలిచిన వనితల పిలుపులు వేయి తరహాలూ
యెవరిని కసరను యెవరికి కొసరను హాయి సరసాలూ
అందరమొకటై క్షణం క్షణం
సంబరపడదాం మనం మనం
తియ్యర తియ్యర తియ్యర తియ్యర తియ్యని మన్మధ బాణాలు
చెయ్యర చెయ్యర చెయ్యర చెయ్యర చక్కెర ముద్దుల స్నానాలు

చందమామ చందమామ చంపగిల్లి పోరా
సొంత బావ సొంత బావ సొంపులల్లుకోరా
అరె బాప్రే...
తియ్యర తియ్యర తియ్యర తియ్యర తియ్యని మన్మధ బాణాలు
చెయ్యర చెయ్యర చెయ్యర చెయ్యర చక్కెర ముద్దుల స్నానాలు

మంచులలో పొగ మంచులలో నువు ముంచుకు రవాలీ
అంచులతో పెదవంచులతో తగు లాంచనమివ్వాలీ
ప్రియ సఖి అడిగిన ముచ్చట తీర్చుట పాత ఆచారం
ఇరు వురి నడుమున పురుషుడు నలుగుట కొత్త వ్యెవహారం
నెచ్చెలి మాటె శుభం శుభం
మరదలి మాటె సుఖం సుఖం
తియ్యర తియ్యర తియ్యర తియ్యర తియ్యని మన్మధ బాణాలు
చెయ్యర చెయ్యర చెయ్యర చెయ్యర చక్కెర ముద్దుల స్నానాలు

చందమామ చందమామ చంపగిల్లుకుంటే
నీ సొంత బావ సొంత బావ సొంపులల్లుకుంటే
కథలో యేదొ అయోమయం...కలిగిందమ్మ అదో భయం
తియ్యర తియ్యర తియ్యర తియ్యర తియ్యని మన్మధ బాణాలు
చెయ్యర చెయ్యర చెయ్యర చెయ్యర చక్కెర ముద్దుల స్నానాలు




మాటోటుంది మగాడా పాట సాహిత్యం

 
చిత్రం: బావనచ్చాడు (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: శంకర్ మహదేవన్, అనురాధ శ్రీరామ్

మాటోటుంది మగాడా




అక్క బావ నచ్చడా పాట సాహిత్యం

 
చిత్రం: బావనచ్చాడు (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి 
గానం: హరిణి

అక్క బావ నచ్చడా
అంతా తడిమి చుశాడా
పాల పొంగు పైటెక్కి పోయె
పక్క దిండు తైతక్కలాడె
కొపదీసి కొరుక్కు తెంటున్నడా

అక్క బావ నచ్చడా
అంతా తడిమి చుశాడా
పాల పొంగు పైటెక్కి పోయె
పక్క దిండు తైతక్కలాడె
కొపదీసి కొరుక్కు తెంటున్నడా

అక్క బావ నచ్చడా

కోవలడ్డు కొబారి సున్నుండలు కొత్త బావలు పడవంటా
చక్కనైన మా అక్కగారి చెక్కిల కోసమే గొడవంటా

చెయ్యి పట్టీ లాగుతుంటె బిడియం...చెలికే సహజం
అందువల్ల ఆపకోయ్ సరసం...బావ నీ తకజం
కట్టు ఒట్టు జారుతున్న కదనం...కదనం మధురం
బెట్టు తీసి గట్టు మీద పెడితే...అక్క అది స్వర్గం
కొయ్యి కొయ్యి ముర్రోల్ల కొక్కి మంచం
గుచ్చి గుచ్చి అడిగింది లంచం
వెర్రి వెర్రి వెషాల వేడి కొంచం
తెయ్యమంది నీ చేను మంచం
పొద్దె పోయె కసి ముద్దే మాయే తొలి రేయిలో

అక్క బావ నచ్చడా
అంతా తడిమి చుశాడా

మత్తు మత్తు మల్లె పూలు అడిగే మధనం మధురం
ఒత్తు ఒత్తు ఒల్లు ఒల్లు కలిపే ఒరిపిడిలో మైకం
హత్తుకున్న మత్తు మత్తు సెగలో కరిగే తిలకం
ఒద్దు ఒద్దు అన్నకొద్ది పెరిగే చమటల్లో జలకం
ఇప్పుడా దచేది పదిలంగా
సిగ్గునే చుట్టేయి లుంగా
నేరమే కదోయి గ్రంద సాంగా
తీరని మా అక్క బెంగా
పొద్దె పోయె కసి ముద్దే మాయే తొలి రేయిలో

బావ అక్క నచ్చిందా
బాగ ఉడుపులిచ్చిందా




బేంగ్ బేంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: బావనచ్చాడు (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: శంకర్ మహదేవన్, సునీతా రావు 

బేంగ్ బేంగ్



వెరీ సెక్సీ పాట సాహిత్యం

 
చిత్రం: బావనచ్చాడు (2001)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: శంకర్ మహదేవన్, గంగ 

వెరీ సెక్సీ

Palli Balakrishna Monday, January 8, 2018
Jai Simha (2017)



చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
నటీనటులు: బాలకృష్ణ , నయనతార, హరిప్రియ, నటాషా దోషి , జగపతిబాబు
దర్శకత్వం: కె.యస్.రవికుమార్
నిర్మాత: సి.కళ్యాణ్
విడుదల తేది: 12.01.2017



Songs List:



అనగనగా అనగనగా పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: శ్రీమణి
గానం: విజయ్ యేసుదాస్

అనగనగా అనగనగా



ప్రియం జగమే పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రేవంత్ రమ్యా బెహ్రా

ప్రియం జగమే




అమ్మకుట్టి అమ్మకుట్టి పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జస్ప్రీత్ జీస్జ్, గీతా మాధురి

అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే 
అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే 
అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే 
అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే 
నీ నవ్వు దండ గురుతైన రాదు ఎండ 
నీకూ నాకూ ఊగింది జెండా 

చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 

ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే 
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే 
ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే 
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే 
నూవ్ ప్రేమ దందా నేనేమొ రజినిగందా 
నిన్నూ నన్నూ ఆపేది ఉందా 

చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 

చరణం: 1
అయ్యో చలిగా ఉందే .. కౌగిళ్ళా దుప్పటిలా కాపాడనా 
అయ్యో సెగలా ఉందే .. ఆరారా ముద్దులతో తడిపేయనా 
పద్దతిగ ఉండుటెలా తిమ్మిరినీ తట్టుకొనీ 
అందుకనే ఉండకలా చేతులనే కట్టుకునీ 
ఐతే అలాగైతే మీదా చెయ్యేసే చేసెయ్యి కరెంటునే సరఫరా 

అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే 
అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే 

ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే 
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే 
నీ నవ్వు దండ గురుతైన రాదు ఎండ 
నీకూ నాకూ ఊగింది జెండా 

చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 

చరణం: 2
బాబోయ్ భయమేస్తుందే 
ఉండొద్దు ఒంటరిగా దగ్గరకొచ్చేయ్ 
బాబోయ్ సిగ్గేస్తుందే 
కాసేపే ఉంటదిలే కళ్ళే మూసేయ్ 
ఎప్పుడిలా లేదు కదా ఇప్పుడిలా ఎందుకనీ 
ఎంతకనీ ఊంటదిలే వయసు తలే దించుకునీ 
ఔనా ఔనౌనా పదా ఈరోజే తీర్చేద్దాం వయస్సులో గరగరా 

అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే 
అగ్గిపెట్టి గుగ్గీపెట్టి ఆటలోకి దింపకే 

ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటి చూపు దించకే 
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే 

నీ నవ్వు దండ గురుతైన రాదు ఎండ 
నీకూ నాకూ ఊగింది జెండా 

చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా 
చలో జజ్జనకా మమా మామమమా





ఏవేవో ఏవేవో పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రేయఘోషల్, రేవంత్

పల్లవి:
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
నిదురించే నీ కలలో రావలనిపిస్తుంది
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
ఓ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

చరణం: 1
తూగే తూగే పాదం నీ వల్లే ఆగింది
నువ్వే వచ్చి చెయ్యందిస్తే పరుగే తీసిందే
ఆగే ఆగే ప్రాణం నీ వల్లే ఆడింది
తీర్చాలని నేననుకున్నా నీ ఋణమే తీరనిది
జీవితాన మల్లెల వాన ఇపుడే కురిసింది

తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

కోరస్:
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్

చరణం: 2
హో ఎవ్వరైనా చూపగలరా తమలో ప్రాణాన్ని
నే చూపిస్తా ఇదిగో నువ్వు అని
ఒక్కరైనా చూడగలరా తడిమే ఉప్పెనని
నా ఊపిరికే రూపం ఇస్తే అచ్చం నువ్వనని
అపురూపంగా దాచనా నువ్విచ్చిన బహుమతిని

తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుంది
తొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుంది

తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్
తూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ (3)




జై సింహా థీమ్ పాట సాహిత్యం

 
చిత్రం: జై సింహా (2017)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: నోయల్ సేన్
గానం:  వివేక్ హరిహరన్,  నోయల్ సేన్, ఆదిత్య అయ్యంగార్

జై సింహా థీమ్

Palli Balakrishna Tuesday, December 26, 2017
Manmadha Banam (2010)


చిత్రం: మన్మధ బాణం (2010)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కమల్ హాసన్, ప్రియా హమేష్
నటీనటులు: కమల్ హాసన్, త్రిషా కృష్ణన్, ఆర్. మాధవన్
దర్శకత్వం: కె.యస్.రవికుమార్
నిర్మాత: ఉదయనిధి స్టాలిన్
విడుదల తేది: 23.12.2010

పల్లవి :
నీలాకాశం... నీ నాకోసం...
జోలలే పాడగా వేడుకే వేడుక
అందమే విల్లుగా బాణమే వేయగా
ప్రేమనే మాయగా తేలెనే ఊహలు
ఇక నువ్వంటు నేనంటు
గిరిగీతలే లేవులే
నీలాకాశం... నీ నాకోసం...

చరణం: 1
నీలోనే నా ఊపిరి నేనంటూ లేనే మరి
నీ పేరు నా పేరునే జోడిస్తే ప్రేమే అది
తీసే శ్వాసే ప్రేమించడం
నీ కోసమే నే జీవించడం
నీది నాది జన్మ బంధం
గుండె గుండె మార్చుకున్నాం
కోరేందుకే మాట మిగిలిందిక
నీ తోడు దొరికిందిగా...
నీలాకాశం... నీ నాకోసం
శ్రీరస్తు శుభమస్తు చిరశాంతి సుఖమస్తు
అందాల బంధానికి

చరణం: 2
ఆరారు కాలాలకు
ఆనందం నీ స్నేహ మే
మండేటి గాయాలను
మాన్పించే మంత్రం నువ్వే
స్వర్గం అంటే ఏవిఁటంటే
నీవున్న చోటే అంటా చెలీ
నిత్యం నన్ను వెన్ను తట్టి
నడిపించు మార్గము నువ్వే మరి
చిరుగాలి పొర కూడా చొరలేదులే
నిను నన్ను విడదీయగా
నీలాకాశం... నీ నాకోసం...

Palli Balakrishna Wednesday, August 16, 2017
Dasavathaaram (2008)


చిత్రం: దశావతారం  (2008)
సంగీతం: హిమేష్ రేష్మియ
(Background Music: దేవి శ్రీ ప్రసాద్)
సాహిత్యం: వేటూరి
గానం: సాధనసర్గమ్
నటీనటులు: కమల్ హాసన్, ఆసీన్, మల్లికా శరావత్, జయప్రద,
దర్శకత్వం: కె.యస్. రవికుమార్
నిర్మాత: వేణు రవిచంద్రన్
విడుదల తేది: 13.06.2008

ముకుందా ముకుందా
కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా
ముకుందా ముకుందా
కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా
వెన్నదొంగవైనా మన్నుతింటివా
కన్నెగుండె ప్రేమ లయలా మృదంగానివా

ముకుందా ముకుందా
కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

జీవకోటి నీచేతి తోలుబొమ్మలే
నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే

ముకుందా ముకుందా
కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

జైజైరాం.. జైజైరాం.. జైజైరాం.. జైజైరాం..
సీతారాం..జైజైరాం.. జైజైరాం.. జైజైరాం..

నీలాల నింగికింద తేలియాడు భూమి
తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
పడగవిప్పి మడుగునలేచే..సర్ప శీర్షమే ఎక్కి
నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు
నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమేగా
అఙ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగ
అట అర్జునుడొందెను..నీ దయవల్ల గీతోపదేశం
జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసుదేవుడే
రేపల్లె రాగం తానం రాజీవమే

హే ముకుందా ముకుందా
కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా

మత్స్యమల్లే నీటిని తేలి వేదములను కాచి
కూర్మరూపధారివి నీవై భువినిమోసినావే
వామనుడై పాదమునెత్తి నింగికొలిచినావే
నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావూ
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు
ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం నేనే
నీ ఒరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
మదిలోని ప్రేమ నీదే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడరా

ముకుందా ముకుందా
కృష్ణా ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా


*********   ********   ********


చిత్రం: దశావతారం  (2008)
సంగీతం: హిమేష్ రేష్మియ
సాహిత్యం: వెన్నలకంటి
గానం: హరిహరన్

పల్లవి:
ఓం... నమో నారాయణాయ

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

హరిని తలచు నా హృదయం నేడు
హరుని తలచుట జరగదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే
వంకర కన్నుల మీరు శంకర కింకరులు
వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు

చరణం: 1
నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే
నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే
నిలువునా నువు చీల్చుతున్నా మాట మార్చనులే
వీర శైవుల  బెదిరింపులకు పరమ వైష్ణవం ఆగదులే
ప్రభువు ఆనతికి జడిసేనాడు పడమట సూర్యుడు పొడవడులే
రాజ్యలక్ష్మి నాథుడు శ్రీనివాసుడే
శ్రీనివాసుడి వారసుడీ విష్ణుదాసుడే
దేశాన్నేలే వారంతా రాజ్య దాసులే
రాజులకు రాజు ఈ రంగరాజనే

చరణం: 2
నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
దివ్వెలనార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేనా
శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట
దైవం కోసం పోరే సమయం లేదంట

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు


*********  ********  ********


చిత్రం: దశావతారం  (2008)
సంగీతం: హిమేష్ రేష్మియ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మహాలక్ష్మి అయ్యర్, షాన్

సాకీ:
పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం
ప్రాణం భూమికే పంచుదాం
పాటై భూమినే దాటుదాం

పల్లవి :
ఓ ఓ సనమ్... ఓ ఓ సనమ్... ఓ ఓ... (2)

చెట్టును కదిల్చే తాళమే గాలి
చెవులను కదిల్చే తాళమే పాట
పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం
పాటలే చెవులలో తేనె వర్షం
పాటలే కనులలో నీటి సంద్రం
ప్రాణం భూమికే పంచుదాం
పాటై భూమినే దాటుదాం
చెట్టును కదిల్చే తాళమే గాలి
చెవులను కదిల్చే తాళమే పాట

ఓ ఓ సనమ్... ఓ ఓ సనమ్... ఓ ఓ... (2)

చరణం: 1
నీ దారిలో ముళ్లున్నా నా దారిలో రాళ్లున్నా ఏరెయ్యవా పాటలే
ఏ గుండెలో మృగమున్నా ఏ చూపులో విషమున్నా మార్చేయవా పాటలే
మాటలాడు ఆ ధైవమే మాతృభాష సంగీతమే
మట్టిలో జీవితం కొంతకాలం పాటతో జ్ఞాపకం ఏంతో కాలం
ఇది తెలుసుకో సోదరా ఎద గళముతో పాడరా

ఓ ఓ సనమ్... ఓ ఓ సనమ్... ఓ ఓ... (2)

చరణం: 2
ఆ పువ్వుకి ఆయుష్షు మూన్నాల్లో ముగిసేను అందించదా తేనెలే
ఈ జన్మకి ఇది చాలు నీ బాటలో నడిచొస్తూ నే పాడనా లాలిని
లయలో శ్రుతి కలుపుదాం బ్రతుకును బ్రతికించుదాం
కాలమే గొంతుని మూసేస్తుంది గాలిలో గీతమే మోగిస్తుంది
నీ గానమే అద్భుతం నీ మౌనమే అమృతం

ఓ ఓ సనమ్... ఓ ఓ సనమ్... ఓ ఓ... (7)

Palli Balakrishna Saturday, July 29, 2017
Narasimha (1999)



చిత్రం: నరసింహా (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ
దర్శకత్వం: కె.యస్. రవికుమార్
నిర్మాత: ఏ. యమ్. రత్నం
విడుదల తేది: 10.04.1999



Songs List:



నా పేరు నరసింహ పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహా (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
రచన: ఏ.యమ్.రత్నం , శివగణేష్
గానం: యస్.పి.బాలు 

సింగమల్లే నువ్వు శిఖరము చేరు
శిఖరము చేరి నింగిని కోరు

నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
రూపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహ
నరసింహ నరసింహ నరసింహ నరసింహ

మనసు ఉన్న మనిషినయ్యా
నేను మీసమున్న బాలుడయ్యా
నేను మేలు చేయు వాడ్నయ
మేలు మర్చిపోనయ్యా
ఈ జన్మ ఎత్తింది దెస సేవకేనయ్యా

సింగమల్లే నువ్వు శిఖరము చేరు
నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
రూపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహ
మనసు ఉన్న మనిషినయ్యా
నేను మీసమున్న బాలుడయ్యా

కోట్ల కోట్ల విలువ చేసే ఆస్తి పాస్తులొద్దు
బిరుదులెన్నో తెచ్చిపెట్టే
పదవులు వద్దు
దండలు వేయొద్దు
మని మకుటాలసలొద్దు
నా జన్మ భూమి ప్రేమ చాలు లే
నా గోరంత చమటకు
కొండంత సిరులిచ్చి పెంచినది ప్రజలే కదా
నా తనువును ధనమును
ప్రజలకు ప్రగతికి పంచుట
పాడి కదా

సింగమల్లే నువ్వు శిఖరము చేరు
నా పేరు నరసింహ
ఇంటిపేరు రణసింహ
నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన
చూపు ఉగ్ర నరసింహ
రూపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహ
నరసింహ నరసింహ నరసింహ

మనసు ఉన్న మనిషినయ్యా
నేను మీసమున్న బాలుడయ్యా

నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు
చరితగా మారే స్థాయికి ఎదుగు
నీలో శక్తి ఉన్నది
దాన్ని పదును పెడితే ఫలితమున్నది
మంచి రోజు రేపే ఆరంభించావా

అరేయ్ ఎవరి గుణం ఏవిటో
ఎవరి బలం ఏవిటో
చూసింది ఎవరంటాయా
అరేయ్ విత్తనము చిన్నదంట మర్రి చెట్టు పెద్దదంట
కొంత కాలం ఆగమంట

సింగమల్లే నువ్వు శిఖరము చేరు
శిఖరము చేరి నింగిని కోరు

నా పేరు నరసింహ
ఇంటిపేరు రాణసింహ
నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన
నరసింహ నరసింహ నరసింహ నరసింహ
చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ
యుద్దమంటూ వచ్చిందంటే పంజా విప్పే నరసింహ
నరసింహ నరసింహ నరసింహ నరసింహ

మనసు ఉన్న మణిశివయ్య
నేను మీసమున్న బాలుడయ్యా
నేను మేలు చేయు వాడ్నయ
మేలు మర్చిపోనయ్యా
ఈ జన్మ ఎత్తింది దెస సేవకేనయ్యా

సింగమల్లే నువ్వు
శిఖరము చేరు
శిఖరము చేరి
నింగిని కోరు హోయ్




మెరిసేటి పువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహా (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
రచన: ఏ.యమ్.రత్నం , శివగణేష్
గానం: శ్రీనివాస్, నిత్యశ్రీ, శ్రీరామ్

తకధిమి తకఝుణు తకధిమి తకఝుణు
తకధిమి తకఝుణు తకధిమి తకఝుణు
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడురావా నా ఆశ భాష వినవా
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడురావా నా ఆశ భాష వినవా
రేయిలో నీ గుండెపై నను పవళించనీవా
హాయిగా నీ చూపుతో నను చలికాయనీవా..
సఖియా సఖియా సఖియా...
నా ముద్దులో సద్దుల్లో హద్దుల్లో ఉండవ

శృంగారవీర... 
శృంగారవీర రణధీర 
నా ఆజ్ఞ తోటి నావెంటరార నా ఆశ ఘోష వినరా
రాలెడు సిగపూలకై నువు ఒడి పట్టుకోరా
వెచ్చని నా శ్వాసలో నువు చలికాచుకోరా...
మదనా మదనా మదనా...
నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా శృంగారవీరా...

సఖీ..ఈఈ..ఏఏ...

మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా
నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా
సా రిర్రీరి సస్సాస నిన్నీని
రిర్రీరి తత్తాత తక తకిట నిస్సారి నిస్సారి
మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా
గా.. రి స్సా నీ ద
నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా
సా నీ స దామగనిస
నా పైట కొంగును మోయా
నా కురుల చిక్కులుతియ్యా నీకొక అవకాశమే
నే తాగ మిగిలిన పాలు
నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకె కదా
నింగే వంగి నిలచినదే.. వేడగరా...ఆఆ....

మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడురావా నా ఆశ భాష వినవా

వీరా..ఆఆఆ... వీరా..ఆఆఆఅ... 
చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పమొకటి చూసా
తన చూపున అమృతం కాదు విషమును చూసా
తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా..ఆ.ఆ
వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే
వలలోనా చేప చిక్కినా నీరు ఎన్నడు చిక్కదులే
రా అంటే నే వస్తానా పో అంటే నే పోతానా
ఇది నువ్వు నేనన్న పోటి కాదు
నీ ఆజ్ఞలన్ని తలను దాల్చ పురుషులెవరు పువులు కాదు

శృంగారవీర రణధీరా నా ఆజ్ఞ తోటి
నా వెంటరార నా ఆశ ఘోష వినరా

తోంత తకిట తక్కిటతక తద్ధిన్నా
తధీంకిటక తోంగ తధీంకిటక తోంగ తధీకిటక
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
తాత్తకిట తాత్తకిట తోం ధీం తకిట ధీం తకిట తోం
ఆ.ఆ..ఆ.ఆ..ఆ..
తోంత తకిట తతక తకిట తతక తకిట తతక తకిట
తక్కిట తోంగ్ త క్కి ట తోంగ్ తా క్కి ట
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
తకధిద్ది త్తత్తోం తరికిటధిద్దితత్తోం తకధిద్దిత్తత్తోం
తకధీం..తరికిటధీం కిరకిటధీం
తకధిద్ది త్తత్తోం తరికిటధిద్దితత్తోం తకధిద్దిత్తత్తోం
తకధీం తరికిటధీం కిరకిటధీం
తకధీం తరికిటధీం కిరికిటధీం
తకధీం తరికిటధీం కిరికిటధీం
తకధీం తరికిటధీం కిరికిటధీం
తరికిటధీం తరికిటధీం తరికిటధీం
తోంత తకిట తరికిడతక తరికిడతక
తోంత తకిట తరికిడతక తరికిడతక
తోంత తకిట తరికిడతక తరికిడతక
తాకిటతక తరికిడతక తాకిటతక తరికిడతక
తాకిటతక తరికిడతక తాకిటతక తరికిడతక
తరికిటతక తోంగ తరికిటతక తోంగ
తరికిటతక తోంగ తరికిటతక తోంగ
తరికిడతక తరికిడతక తోంత
తరికిడతక తరికిడతక తోంత

శృంగారవీరా..ఆఆఆ..ఆఆ...
తరికిడతక తరికిడతక తోంత
తరికిడతక తరికిడతక తోంత
తోంగిడతక తరికిడతక తోంగిడతక తరికిడతక
శృంగారవీరా..ఆఆఆ..ఆఆ...
తోంగిడతక తరికిడతక  తోంగిడతక తరికిడతక
తొంగిట తరికిడతోం తొంగిట తరికిడతోం
తొంగిట తరికిడతోం తొంగిట తరికిడతోం..త..

శృంగారవీరా..ఆఆఆ..ఆఆ...
తోంగిట తరికిట తోంగిట తరికిడతోం
తోంగిట తరికిట తోంగిట తరికిడతోం
తోంగిట తరికిట తోంగిట తరికిడ తోంగిట తరికిడతోం



చుట్టూ చుట్టి పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహా (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
రచన: ఏ.యమ్.రత్నం , శివగణేష్
గానం:  యస్.పి.బాలు, హరిణి, సవితా రెడ్డి 

చుట్టూ చుట్టి వచ్చావా చూపుడువేలితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
కళ్ళతో ఏదో చూసావా కాయా పండా అడిగావా
నాలోని ప్రాయం రేగిపోగా
చుట్టూ చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు నను తొందర పెట్టగ చూసారు
నీవే నను కొంగున కట్టావు

సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
సుందర వదనా తీయని వేదన సాగా
విరి పాన్పు గుర్తుతో ప్రేమ ఎన్నికలో గెలిచి నువ్వు వర్ధిల్లు

చుట్టూ చుట్టి వచ్చావా చూపుడువేలితో పేల్చావా
అయ్యో నా సిగ్గే పారిపోగా
చుట్టూ చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా

నా చెవిని కొరుకు చెవిని కొరుకు పంటిని
గాయపరుచు గాయ పరుచు గాజుకి
యదను తాకు యదను తాకు కాలికి ముద్దులివానా
నా సొగసు తాను సొగసు తాను పెదవికి
మనసు లాగు మనసు లాగు కంటికి
బుగ్గ గిల్లు బుగ్గ గిల్లు గోటికి ముద్దులివ్వనా

అరె తుమ్ము వచ్చిన చీమ కుట్టినా విడిపోవద్దు
తమ తపన తీరగా ముసుగు కప్పుకొని పడుకోవద్దు
నా కనులు సోలినా చేతులూరుకోవుగా
మన పెళ్ళికి ముందుగా ఉయ్యాలలూపించకు

చుట్టూ చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు నను తొందర పెట్టగ చూసారు
నీవే నను కొంగున కట్టవు
సుందరి సొగసు ఉక్కిరి బిక్కిరి కాగా
పురుషుడు చేసే అల్లరి విల్లరి సాగా
వీరి పాన్పు గుర్తులో ప్రేమ ఎన్నికలో గెలిచి నువ్వు వర్ధిల్లు

నే పాలవోలె పాలవోలె పొంగుగా
పెరుగు వోలె పెరుగు వోలె మారగా
తాడు మీద తాడు వేసి అయ్యో చిలికేవా
నే మత్తు మత్తు మత్తు మత్తుగా సోలాగా
మత్తు వదలి మత్తు వదలి లేవగా
చిత్తగించి కొత్త వలపు అయ్యో ఒలికేవా
మండుటెండలో ఐస్ ఫ్రూప్ట్లా కరిగే పోకు
చలి వేండ్రామా దాహ మన్నచో తోసెయ్యకు

హద్దు దాటెయ్యకు నన్ను కాటెయ్యకు
నా ఆదరాన్ని కదరాన్ని అందించిన అడ్డేయాకు

చుట్టూ చుట్టి వచ్చావా చూపుతో నన్ను కాల్చావా
ముద్దాడే ఆశ ముదిరిపోగా
ఎందరో పడుచులు వచ్చారు నను తొందర పెట్టగ చూసారు
నీవే నను కొంగున కట్టావు





ఎక్కు తొలిమెట్టు (జీవితమంటే పోరాటం) పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహా (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
రచన: ఏ.యమ్.రత్నం , శివగణేష్
గానం: శ్రీరామ్

జీవితమంటే పోరాటం
పోరాటంతో ఉంది జయం (2)

ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు

ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీకొట్టు
గట్టిగా పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు

నువు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు
బండలు రెండుగ పగిలేట్టు తలబడు నరసింహా

పట్టుపురుగల్లే ఉండక వెంటాడే పులివై
టక్కరి శత్రువు తల తుంచి
సాగర నరసింహా

పిక్క బలముంది యువకుల పక్క బలముంది
అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహా
పిక్క బలముంది యువకుల పక్క బలముంది
అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహా

 జీవితమంటే పోరాటం
పోరాటంతో ఉంది జయం (2)

మరు ప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేరా
మరు ప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేరా
మరు ప్రాణి ప్రాణం తీసి నవ్వేది అసురుడురా
కీడే చేయని వాడే మనిషి మేలునే కోరే వాడే మహర్షి
కీడే చేయని వాడే మనిషి మేలునే కోరే వాడే మహర్షి
నిన్నటి వరకు మనిషివయా
నేటి మొదలు నువు ఋషివయ్యా




ఓ కిక్ ఎక్కేలే పాట సాహిత్యం

 
చిత్రం: నరసింహా (1999)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
రచన: ఏ.యమ్.రత్నం , శివగణేష్
గానం: మనో, ఫెబి మణి

ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే
ఓ ఓ ఓ సిగ్గు పోయేలే
ఉన్నట్టుండి గ్యానమ్ పెరిగేలే
ఉన్న నిజం చెప్పా తోచేలే

వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే
అరేయ్ బెంజ్ కార్ ఎక్కినోడు మట్టిలోనే
ఈ జీవితం కోసం
మనం పుట్టగానే మనతోపాటు
తెచ్చిందేంటి తీసుకెళ్ల

ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే
ఓ ఓ ఓ సిగ్గు పోయేలే
ఉన్నట్టుండి గ్యానమ్ పెరిగేలే
ఉన్న నిజం చెప్పా తోచేలే

వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే
అరేయ్ బెంజ్ కార్ ఎక్కినోడు మట్టిలోనే
ఈ జీవితం కోసం
మనం పుట్టగానే మనతోపాటు
తెచ్చిందేంటి తీసుకెళ్ల

బంగారం దాచిపెట్టావ్
వజ్రాలే దాచిపెట్టావ్
ప్రాణాలే దాచ ఏది తాళం
శిశువులు గ్యానులు ఇద్దరు తప్ప ఇక్కడ
సుఖముగా ఉన్నదెవరో చెప్పు
జీవం ఉన్నవరకు జీవితం ఉంది మనకు
ఇదియే వేమన వేదం
జీవం ఉన్నవరకు జీవితం ఉంది మనకు
ఇదియే వేమన వేదం

ఈ భూమి మనదేలే
మన వీధిలో జాతి కోసం
మతం కోసం గొడవెందుకు

ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే
ఓ ఓ ఓ సిగ్గు పోయేలే
ఉన్నట్టుండి గ్యానమ్ పెరిగేలే
ఉన్న నిజం చెప్పా తోచేలే

తల్లిని ఎంచుకునే
తండ్రిని ఎంచుకునే
హక్కే నీకు లేనేలేదు
రూపం ఎంచుకునే
రంగుని ఎంచుకునే
హక్కే నీకు లేనేలేదు

పుట్టుక నెంచుకునే మరణము నెంచుకునే
హక్కే నీకు లేనే లేదు లేదు
పరిశోధించి చూస్తే
నీ జీవితమొకటే నీ చేతుల్లో
ఉంది లేరా సాధించేయరా

ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే
ఓ ఓ ఓ సిగ్గు పోయేలే
ఉన్నట్టుండి గ్యానమ్ పెరిగేలే
ఉన్న నిజం చెప్పా తోచేలే

వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే
అరేయ్ బెంజ్ కార్ ఎక్కినోడు మట్టిలోనే

ఈ జీవితం కోసం
మనం పుట్టగానే మనతోపాటు
తెచ్చిందేంటి తీసుకెళ్ల
మనతోపాటు తెచ్చిందేంటి తీసుకెళ్ల
మనతోపాటు తెచ్చిందేంటి తీసుకెళ్ల
తీసుకెళ్ల

Palli Balakrishna Monday, July 24, 2017

Most Recent

Default