-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Boyapati Srinu"



చిత్రం: అఖండ 2  (2025)
సంగీతం: ఎస్. థమన్
నటీనటులు: బాలకృష్ణ , సంయుక్త మీనన్ , ఆది పినిశెట్టి 
దర్శకత్వం: బోయపాటి శ్రీను 
నిర్మాతలు: రాము ఆచంట, గోపి ఆచంట 
విడుదల తేది: 12.12.2025



Songs List:



అఖండా తాండవం పాట సాహిత్యం

 
చిత్రం: అఖండ 2  (2025)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం:  శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, దీపక్ బ్లూ

అఖండా తాండవం
అఖండా తాండవం

అఖండా తాండవం
అఖండా తాండవం

హే ఖండ ఖండ ఖండితా
దండయోగ మండితా 
చండ బాహు రుండ మాల చండితా
హే ధర్మలోక రక్షితా
సుప్రభాత వీక్షితా 
భూనభోంతరాల సర్వ రక్షితా

రంగ రంగ శంభులింగ ఈశ్వరా
అంతరంగ హే భుజంగ శంకరా 
హే నీలకంఠ నిర్మలాంగ ఈశ్వరా
కుంభమేళ సంభవ శుభంకరా

రంగ రంగ శంభులింగ ఈశ్వరా
అంతరంగ హే భుజంగ శంకరా 
హే నీలకంఠ నిర్మలాంగ ఈశ్వరా
కుంభమేళ సంభవ శుభంకరా

హే ఢమక ఢమక ఢమక నాద ఓంకారా
ఢమక ఢమక ఢమక కోటి సంహారా
హే ఢమక ఢమక ఢమక నాద ఓంకారా 
ధూమ ధామ ధూషితాంగ సంహారా 
హే నాగ నాగ నాయకా నాగ రూప దాయకా 
దేవ దేవ శంకర శివా 
హే రామ నామ తారకా రామ నామ పాలకా 
నారసింహ ధర్మ రక్షకా 
మహా పంచ భూత సంచకా

అఖండా తాండవం
అఖండా తాండవం
అఖండా తాండవం
హర హర మహాదేవ్ 
అఖండా తాండవం
ఓం నమఃశివాయ

శంకరా శంకరా శూలపాణి శేఖరా 
సర్వదా శుభంకరా భో శంభో 
సాదు సంగ రక్షకా సత్య భంగ శిక్షకా 
అంతరంగ వీక్షకా భో శంభో 
కింకరా శుభంకరా ద్రోహినా లయంకరా
సర్వదా జయంకరా హే శంభో 
నిర్వికల్ప దాయకా నిత్య సత్య సాయకా 
నిర్గుణాబ్ది నాయకా హే శంభో

అఖండా తాండవం
హర హర మహాదేవ్ 
అఖండా తాండవం
హర హర మహాదేవ్

హే చండ చండ చండితా చండయోగ మండితా 
చండ వీర తాండవాల రంజితా
హే వేద వేద వందితా వేదమూల వర్దితా 
జండ జండ జాండవాల గర్జితా 
లింగ లింగ శంభులింగ ఈశ్వరా 
గంగ లీల రంగరించు శంకరా 
హే కాల కాల కాల కాంత ఈశ్వరా 
కాశి నాథ హే శివ శుభంకరా 
హే ఢమక ఢమక ఢమక నాద ఓంకారా
ఢమక ఢమక ఢమక కోటి సంహారా
హే ఢమక ఢమక ఢమక నాద ఓంకారా 
ధూమ ధామ ధూషితాంగ సంహారా 
హే నాగ నాగ నాయకా నాగ రూప దాయకా 
దేవ దేవ శంకర శివా 
హే ఘోర ఘోర నాశకా ఘోర పాప చూశకా
హిందు సింధు ధార వాహకా 
మహా పంచ భూత సంచకా

అఖండా తాండవం
హర హర మహాదేవ్ 
అఖండా తాండవం
మహాదేవ్ మహాదేవ్ 
అఖండా తాండవం
పరమేశ్వరా 
అఖండా తాండవం
ఓం నమఃశివాయ

హే దుష్ట శిక్షకా శిష్ట రక్షకా ధర్మ భిక్షుకా 
హే పంచ సూచకా భష్మ శాయకా భద్ర భాశుకా
హే ధర్మ వాహకా కాల కేలికా సూత్ర నాయకా 
హే ఉగ్ర సూచకా నిగ్ర పోషకా దివ్య నర్తకా

అఖండా తాండవం




జాజికాయ పాట సాహిత్యం

 
చిత్రం: అఖండ 2  (2025)
సంగీతం: ఎస్. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యాం 
గానం:  బ్రిజేష్ శాండిల్య , శ్రేయ ఘోషల్ 

జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ

జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
నాటుకోడి నాట్యమయ అబ్బరో ఏమి మాయ

నందమూరి బాలుడాయ అందమే చారేడాయ
వందమంది కొక్కడాయ అల్లరే బోలేడాయ
దొమ్మలేమో అదిరిపాయ

దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దుంకితే దేవరాయ

దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
తుమ్మితే కృష్ణరాయ

హే హే జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమా...


Palli Balakrishna Sunday, April 5, 2026



చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల 
దర్శకత్వం: బోయపాటి శ్రీను 
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి 
విడుదల తేది: 15.09.2023



Songs List:



నీ చుట్టూ చుట్టూ పాట సాహిత్యం

 
చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
సాహిత్యం: రఘురాం
గానం: సిద్ శ్రీరాం, సంజనా కల్మాన్జి

నీ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగిన
నా చిట్టి చిట్టి
చిట్టి చిట్టి గుండెనడిగినా

నా దిమ్మ తిరిగే
బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా

ఓహ్ దమ్ము లాగి గుమ్మతో
రిదమ్ము కలిపి ఆడమందిగా

ప్రాణమే పతంగి లాగ
ఎగురుతోందిగా
ఇంతలో తతంగామంత
మారుతోందిగా

క్షణాలలో ఇదేమిటో
గల్లంతు చేసే
ముంత కల్లు లాంటి
కళ్ళలోన తెల్లగా

మరింత ప్రేమ పుట్టుకొచ్చి
మత్తులోకి దించుతోందిగా

నీ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగిన
నా చిట్టి చిట్టి
చిట్టి చిట్టి గుండెనడిగినా

నా దిమ్మ తిరిగే
బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా

మీసాలనే తిప్పమాకు బాబో
వేషాలతో కొట్టమాకు డాబు
నువ్వెంత పొగుడుతూనే
నేను పాడనే పడనుగా

చటుకునొచ్చే ప్రేమ
నమ్మలేను సడెనుగా

కంగారుగా కలాగేనయ్యో కైపు
నేనస్సలు కాదు నీ టైపు
ఇలాంటివెన్ని చూడలేదు
కాళ్ళ ముందర

నువ్వెంత గింజుకున్నా
నన్ను గుంజలేవురా

ఏమిటో అయోమయంగా ఉంది
నా గతి
ముంచినా భలేగా ఉంది
ఈ పరిస్థితి

ఇదో రకం అరాచకం
కరెంటు షాక్ లాంటి
వైబ్ నీది అంటే
డౌట్ లేదు గా

ఖల్లాస్ చేసి పోయినావు
ఒరా చూపు గుచ్చి నేరుగా

నీ చుట్టూ చుట్టూ
చుట్టూ తిరిగిన
నా చిట్టి చిట్టి
గుండెనడిగినా

నా దిమ్మ తిరిగే
బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా

ఓహ్ దమ్ము లాగి గుమ్మతో
రిదమ్ము కలిపి ఆడమందిగా



కల్ట్ మామ పాట సాహిత్యం

 
చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: హేమచంద్ర, రమ్యా బెహరా, మహా 

బిట్టు బిట్టు బాడీ మొత్తం
రెడ్డు చిల్లీ సాల్టు
ఏయ్, చుట్టు చుట్టూ కమ్మేసుంది
పొగరే డిఫాల్టు
ఏయ్, పెట్టుకుంటే ఓడిపోద్ది
ప్రతి నట్టు బోల్టు
ఏయ్, కొట్టి సూడు ఎట్టుంటాదో
కండల్లో రివోల్టు

ఓయ్ లాక్కొడితే లాక్కొడితే లైఫులకే జోల్టు
హే, వేటపులి దూకుతంటే ఊపిరికే హాల్టు
హే, ఉక్కునరం ఉగ్గడితే కిక్కు ట్రిపుల్ మాల్టు
అరె ఎయ్ దరువెయ్ ఎయ్ దరువెయ్
స్టెప్పులిక ఫుల్టూ

ఎయ్ మామ ఎయ్ మామ
ఎయ్ మామ ఎయ్ మామ
ఎయ్ మామమామమామమామ
మామ మామ మామ మామ

ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కన్ను కొడితే అంతే మామ
కన్నెల గుండెలు మెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కాలు దువ్వితే అంతే మామ
కత్తులకైనా గిల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీకెదురుపడితే వణికిపోద్ది
నడుముకున్న బెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీ కడుపు కోస్తే
బయటపడే కంటెంటే డైటే

ఓయ్ మీసమిలా మీసమిలా
మెలిపెడితే కల్టు
నీ కాలరిలా కాలరిలా
ఎగరేస్తే కల్టు
అరె బాడీలిలా బాడీలిలా
తిరగేస్తే కల్టు
ఏయ్, వీధుల్లో వెంటపడి
ఇరగేస్తే కల్టు

మెడకి కర్చిఫ్, తలకి రిబ్బను
కట్టేసి నించున్న కటౌట్ కల్టు
సైలెన్సరు పీకేసి ఆక్సిలేటర్ని
రయ్యంటు తిప్పేసి కట్టింగ్ కల్టు

దందా కోసం పెట్టే సిట్టింగు కల్టు
వంద మందితోనే బెట్టింగు కల్టు
మిడ్ నైట్ మోగించే డీజే బీట్ కల్టు
ఫ్లడ్ లైట్ వెలుతుర్లో
పట్టే కుస్తీ కల్టు

స్కెచ్చు గీస్తే కల్టు
రచ్చ చేస్తే కల్టు
ఇస్మైల్ కల్టు, ఇస్మైల్ కల్టు
ఇస్టయిల్ కల్టు, ఇస్కూలు కల్టు
కల్టు కల్టు కల్టు కల్టు కల్టు

ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కన్ను కొడితే అంతే మామ
కన్నెల గుండెలు మెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కాలు దువ్వితే అంతే మామ
కత్తులకైనా గిల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీకెదురుపడితే వణికిపోద్ది
నడుముకున్న బెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీ కడుపు కోస్తే
బయటపడే కంటెంటే డైటే



డుమ్మారే డుమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: అర్మాన్ మాలిక్, అయ్యన్ ప్రణతి 

తెల్లగా తెల్లవారిందే
హే సరాసరా
వెచ్చగా వేకువ వచ్చిందే
హే సురాసురా

కోలమ్మ కోలో కొమ్మ గుమ్మల్లో
గువ్వా గువ్వా
కొండ కోనమ్మ జళ్ళో
వాగమ్మ పాటే మువ్వా మువ్వా

ఏలమ్మ ఏలో
ఏరమ్మ ఒళ్ళో గవ్వా గవ్వా
ఆహ ఏ రంగు లేని
సారంగమంటే నువ్వా నువ్వా

ఇంత అందం చందం గంధంలాగ
గంతే వేసే పల్లెటూరు సాటేది రాదే
మచ్చుకైనా మచ్చేది లేదే

కొత్త పాత అంటు తేడా లేనే లేదు
ప్రేమ ప్రతిక్షణం
రారా అని పోదామని
కలగలిపే పిలుపు ఇది

డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే

డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే

తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే

తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే

తెల్లగా తెల్లవారిందే
హే సరాసరా
వెచ్చగా వేకువ వచ్చిందే
హే సురాసురా

చెక్కర లేని పాలల్లో
చెక్కిన మీగడ తీపల్లే
కారంగా ఉన్న
ఊరించే ఆవకాయల్లే

హే, చుక్కలు లేని గీతల్లో
చక్కగ గీసిన ముగ్గల్లే
కోరంగి దాటె
కోనసీమ నావల నీడల్లే

తన ఒళ్ళే తుళ్ళి మళ్ళీ మళ్ళీ
జల్లే చల్లే మేఘంలాగ
కోనంగి కళ్ళే పంపెనే
చూపుల కౌగిళ్లే

అవి ఎల్లకిల్లా అల్లీ గిల్లి
అల్లో మల్లో ఆకాశంలో
అల్లాడెనే తెల్లారులు
కలవరపడి కల వదిలే

డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే

తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే




గండర బాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: హర్ష. డి

హేయ్, గండర గండర
హేయ్, గండరబాయ్

ఓసి వంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తులు చల్లాలి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే

గంట కొట్టి సెప్పుకో
గంట కొట్టి సెప్పుకో
గంటలోనే వస్తనే
గండర గండర బాయ్

గజ్జె కట్టి సెప్పుకో
గాజులెట్టి సెప్పుకో
గాలివాన తెస్తనే
గండర గండరబాయ్

ఏయ్, విన్నారోయ్ విన్నారోయ్
తయ్యారయ్యే ఉన్నారోయ్
విస్తారే విస్తారే విందే వడ్డించేస్తారో
ఇష్టంగా ఇస్తానోయ్
నువ్వే నువ్వే విస్తారోయ్
నా గల్లా పెట్టె
గళ్ళుమంటున్నాదిరోయ్

గండర బాయ్ గండర బాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్

గండరబాయ్ గండరబాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్

ఓసి వంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తులు చల్లాలి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే

గంట కొట్టి సెప్పుకో
గంట కొట్టి సెప్పుకో
గంటలోనే వస్తనే
గండర గండర బాయ్
గజ్జె కట్టి సెప్పుకో
గాజులెట్టి సెప్పుకో
గాలివాన తెస్తనే
గండర గండర బాయ్

గల్లా లుంగి ఏసుకో, గడ్డివాము సూసుకో
గట్టిగానే ఉంటాదోయ్ సయ్యాటియ్యాల
గడ్డపార తీసుకో, గట్టునింక తవ్వుకో
సిగ్గునంత లోతుగా పాతి పెట్టలా

నీ తట్ట బుట్ట సర్దేసుకో సోదాపి
నా చెట్టాపట్టా పట్టేసుకో సోల్లాపి
ఆ ముద్దుల్తోనే చల్లేస్తావే కళ్ళాపి
ఓ ముగ్గులెడుతూ కూకుంటే
నీకెట్టా పనౌద్దీ

హే, వత్తాసే వత్తాసే
నువ్వేమన్నా వత్తాసే
నీ కట్టా మిట్టా పట్టే
పట్టెయ్యాలిరోయ్

గండర బాయ్ గండర బాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్

గండర బాయ్ గండర బాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్

ఓసి వంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తులు చల్లాలి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే

Palli Balakrishna Thursday, August 3, 2023



చిత్రం: అఖండ  (2021)
సంగీతం: యస్.యస్.థమన్
నటీనటులు: బాలకృష్ణ, ప్రాగ్యజైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్ 
దర్శకత్వం: బోయపాటి శ్రీను 
నిర్మాత: మిరియాల రవీంద్ర రెడ్డి
విడుదల తేది: 02.12.2021



Songs List:



అడిగా… అడిగా… పాట సాహిత్యం

 
చిత్రం: అఖండ  (2021)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి 
గానం: యస్.పి.బి.చరణ్ , యమ్.యల్.శ్రుతి

అడిగా…  అడిగా… పంచ ప్రాణాలు నీ రాణి గా
జతగా… జతగా… పంచు నీ ప్రేమ పారాణిగా

చిన్న నవ్వే రువ్వి మార్చేసావే… నా తీరు నీ పేరుగా
చూపు నాకే చుట్టే కట్టేసావే… నన్నేమో సన్నాయిగా

కదిలే కలలే కాళ్లవాకిళ్ళలో కొత్తగా
కౌగిలి ఓ సగం పొలమారిందిలే వింతగా
అడిగా… అడిగా… పంచ ప్రాణాలు నీ రాణి గా
జతగా… జతగా… పంచు నీ ప్రేమ పారాణిగా

సరిలేని సమారాలు సరిపోని సమయాలు తొలిసారి చూసాను నీతో
విడిపోని విరహాలు వీడలేని కలహాలు తెలిపాయి నీ ప్రేమ నాతో
ఎల్ల లెవీ లేని ప్రేమ నీకే ఇచ్చానులే నేస్తమా
వేళ్ళ లేనే నేనే నిన్నే ధాటి నూరేళ్ళ నా సొంతమా

కననీ విననీ సుప్రభాతాల సావాసమా
సెలవే కోరని సిగ్గులోగిళ్ల శ్రీమంతమా

అడిగా… అడిగా… పంచ ప్రాణాలు నీ వాని గా
జతగా… జతగా… పంచు నీ ప్రేమ పారాణిగా

సింధూర వర్ణాల చిరునవ్వు హారాలు కలబోసి కదిలాయి నాతో
మనిషేమో సెలయేరు మనసేమో బంగారు సరిపోవు నూరేళ్లు నీతో

ఇన్ని నాళ్లూ లేనే లేదే నాలో నాకింత సంతోషమే
మల్లె జన్మే ఉంటె కావా లంట నీచెంత ఏకాంతమే

కదిలే కలలే కాళ్లవాకిళ్ళలో కొత్తగా
కౌగిలి ఓ సగం పొలమారిందిలే వింతగా

అడిగా… అడిగా… పంచ ప్రాణాలు నీ రాణి గా
జతగా… జతగా… పంచు నీ ప్రేమ పారాణిగా




అఖండ పాట సాహిత్యం

 
చిత్రం: అఖండ  (2021)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: శంకర్ మహదేవన్, సిద్దార్థ్ మహదేవన్, శివం మహదేవన్

భో శంభో... శివ శంభో...
ఖం ఖం కంగుమంది శంఖం
కడగమంది పంకం చావుకైన జంకం
ధం ధం ధర్మభేరి శబ్ధం
చెయ్యమంది యుద్ధం దేనికైన సిద్ధం
హే.. భయంకర లోకం నీ త్రయంబకం
రా.. మయస్కర నీ సరికే పురాంతకం
రా.. హరొంహర జటాధర 
జయించరా పరాత్పరా

భమ్ అఖండ భమ్ భమ్ అఖండా
లోక నాయకో  పాతరా
భూమిపై రాతి జెండా 

భమ్ అఖండ భమ్ భమ్ అఖండా
రాగ జ్వాలమై పాతరా
దీనులా కళ్ళ నిండా

భో శంభో... శివ శంభో...
భో శంభో... హర హర స్వయంభో (2)

వీడెవడో హరోం హర
వాడెవడో హరోం హర
ఈ తలది ఆ తలది 
నరుకురా నరుకురా
వేళ్ళు విరిచే శివోమ్ హర
కాళ్ళు విరిచే శివోమ్ హర
కీళ్లు విరిచే తోలు విరిచే
నరుకురా నరుకురా

భమ్ అఖండ  భమ్ అఖండా
లోక నాయకో  పాతరా
భూమిపై రాతి జెండా 

భమ్ అఖండ భమ్ అఖండా
రాగ జ్వాలమై పాతరా
దీనులా కళ్ళ నిండా

రం రం పాలనేత్ర ద్వారం
తెరుచుకుంటే ఘోరం
తాలదింక తిమిరం
జం జం తాండవాల తజ్యం
మోగుతుంటే తధ్యం
బ్రోవులింక దగ్ధం
ఈ ధరాతలం గుండెల్లో హలా హలం
రా దహించగా నీవే మహాలయం
రా త్రిశులివై కపాలివై
యుగానివై అఘోరివై

భమ్ అఖండ భమ్ అఖండా
లోక నాయకో  పాతరా
భూమిపై రాతి జెండా

భమ్ అఖండ భమ్ అఖండా
రాగ జ్వాలమై పాతరా
దీనులా కళ్ళ నిండా



జై బాలయ్య పాట సాహిత్యం

 
చిత్రం: అఖండ  (2021)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: గీతామాధురి, సాహితీ చాగంటి, సత్యయామిని, అదితి భావరాజు

కియ్యా కియ్యా జాదూ కియ్యా
దియ్యా దియ్యా దిల్ దే దియ్యా
మయ్యా మయ్యా మామ మియ్యా
అయ్యా బాలయ్యా..!!

తియ్య తియ్య కారలయ్య
రయ్యా రయ్యా మారాలయ్యా
తయ్యా తయ్యా తయ్యారయ్యా
అయ్యా బాలయ్యా..!!

కియ్యా కియ్యా జాదూ కియ్యా
దియ్యా దియ్యా దిల్ దే దియ్యా
మయ్యా మయ్యా మామ మియ్యా
అయ్యా బాలయ్యా..!!

తియ్య తియ్య కారలయ్య
రయ్యా రయ్యా మారాలయ్యా
తయ్యా తయ్యా తయ్యారయ్యా
అయ్యా బాలయ్యా..!!

హొయ్యారే హోయా… ముద్దుల మావయ్యా
కొబ్బరికాయ కొట్టనా బావయ్యా
హొయ్యారే హోయా… ముద్దుల మావయ్యా
కొబ్బరికాయ కొట్టనా బావయ్యా

కత్తులే దూసే కృష్ణదేవరాయ
కళ్ళతో సేసేయ్ కృష్ణుడంటి మాయ
మత్తుగా సూత్తే పోయినాది సోయ
మొత్తంగా నీకే నేను పడిపోయా

ఎయ్, కాళ్ళాగజ్జా కంకాలయ్యా
ఏగుసుక్కై ఎలగాలయ్యా
కాళ్ళు కలిపి స్టెప్పెయ్ అబ్బాయా

యా యా యా యా… జై బాలయ్య
యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
యా యా యా యా… జై బాలయ్య
ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా

యా యా యా యా… జై బాలయ్య
యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా
యా యా యా యా… జై బాలయ్య
ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా
(బాలయ్య బాలయ్య బాలయ్య)




అమ్మే లేని జన్మే నీది పాట సాహిత్యం

 
చిత్రం: అఖండ  (2021)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: మోహన భోగరాజు 

జయ శంకర అభయంకర కాశీపుర శంభో
లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో
అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో
శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో

అమ్మే లేని జన్మే నీది, ఈషా
అమ్మే లేని జన్మే నీది, ఈషా
ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష
ఓ, ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష

పొత్తీ పేగే కత్తిరించే వేళా
ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా
ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా

జయ శంకర అభయంకర కాశీపుర శంభో
లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో
అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో
శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో

నటరాజ విరాజమాన
కాల సర్ప భూషణ
పినాక పాణి పల్లవా
ప్రచండ చండ ధారినాం
రాతి వాతి కాపురాధి నాధ ఫాలలోచనాం
పటారూప కంఠలుంఠ విశ్వనాధ పాహిమాం

ఇచ్చావయ్యా జంట నోముల పంటా
కంటి ముందే కాలరాస్తానంటే ఎట్టా
ధర్మం కోసం దూరం అయితే ఒకడూ
దైవం అంటూ దారే మారేనొకడూ

అమ్మా అంటూ పిలిచే వాడే లేకా
ఎందుకంటా సామీ జన్మ సావు రాకా

ఓం హరహరా రా నరవరా రా
పతుతరా పలకరా పరాత్పరా

ఓం నటదొరా రా జఠాధర రా
జితకరా పరాచకాలు ఆపరా
ఓం శరవరా రా వరధరా రా
లయకరా చరాచరా చలించరా

ఓం పురహరా రా ఇహపరా రా
కృతకరా కటాక్షభిక్షనీయరా

Palli Balakrishna Thursday, December 2, 2021




చిత్రం: వినయ విధేయ రామ (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రాంచరణ్, కియార అద్వానీ
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: డి. వి. వి.దానయ్య
విడుదల తేది: 10.01.2019



Songs List:



తందానే తందానే పాట సాహిత్యం

 
చిత్రం: వినయ విధేయ రామ (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: MLR కార్తికేయన్

తందానే తందానే తందానే తందానే
చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే

ఏ తియ్యదనం మనసుపై రాసిందో
ఎంతో అందంగా ఈ తల రాతలనే
ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో
తనకే రూపంగా ఈ బొమ్మలనే

తందానే తందానే తందానే తందానే
చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే

ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే
ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే
ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో
ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా
ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో
ఒక వాకిట ఒకటై ఉన్నారుగా

తందానే తందానే తందానే తందానే
చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే

ఈ ఇంట్లిలోన ఇరుకుండదే
ప్రతి మనసులోన చోటుందిలే
ఈ నడకకెపుడు అలుపుండదే
గెలిపించు అడుగే తోడుందిలే

విడి విడిగా వీళ్ళు పదాలే
ఒకటయ్యిన వాక్యమల్లే
ఒక తియ్యటి అర్థం చెప్పారుగా

విడివిడిగా వీళ్ళు స్వరాలే
కలగలిపిన రాగమల్లే
ఒక కమ్మని పాటై నిలిచారుగా

తందానే తందానే తందానే తందానే
చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని
తందానే తందానే తందానే తందానే
బంధాల గ్రంధాలయమే ఉందీ ఇంట్లోనే

ఒకటే కలగంటాయంట వీళ్ళందరి కళ్ళు
అద్దాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు
గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు
వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు




తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా పాట సాహిత్యం

 
చిత్రం: వినయ విధేయ రామ (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్ప్రీత్ జాజ్, ఎమ్. ఎమ్. మానసి

సున్ మేరే మాహియా వే మాహియా వే  హో మాహియా వే 
తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే

ఓ య్యా..ఓ య్యా..ఓ య్యా

రోమీయో జూలియెట్ మళ్లీ పుట్టినట్టు
ఉంటాదంటా మన జట్టు
వాళ్ల కథలో క్లైమ్యాక్స్ పాసిటివ్ గా రాసినట్టు
మన లవ్ స్టోరీ హిట్టు
షా జహాన్ ముంతాజ్ రీబార్న్ అయ్యినట్టు
ఉంటామంతా మనం ఒట్టు
రీ-ప్లాన్ చేసి నువ్వు ఈ సారైనా
తాజ్ మహల్ ముందే కట్టు

యూ ఆర్ మై గర్ల్ యూ ఆర్ మై గర్ల్!
మోనాలిసా నవ్వు సన్నజాజి పువ్వు ఒకటైతే నువ్వు

యూ ఆర్ మై వర్ల్డ్! యూ ఆర్ మై వర్ల్డ్!
వేడి వేడి లావా స్వీట్ పాల కోవ ఒకటైతే నువ్వు

తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా

సున్ మేరే మాహియా వే మాహియా వే  హో మాహియా వే 
తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే

డోనట్ లాంటి కళ్ళు తిప్పి
చాక్లేట్ లిప్స్ రెండు విప్పి
ఐస్ ఫ్రూట్ మాటలేవో చెప్పి
నను పిచ్చెకించినావే

రెడ్ బుల్ లాంటి నవ్వు తొట్టి
డమ్‌బెల్ లాంటి కండ చూపి
లవ్ సింబల్ లా గుండె లోకి
నువు ఎంట్రీ ఇచ్చినావే

క్రీమ్ ఏ నువ్వు స్టోనెయ్ నేను
ఒకటై పోదాం క్రీమ్ స్టోన్ లా
బ్రెడ్ ఏ నువ్వు జాం ఏ నేను
మిక్స్ అయ్యీ పోదాం బ్రెడ్ జాం లా

తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా

చందమామ మీద కాలు పెట్టి
ఆర్మ్‌స్ట్రాంగ్ పొంగిపోయినట్టు
నీ బుగ్గ మీద ఒక్క ముద్దు పెట్టి
నేను కూడా పొంగిపోనా

న్యూటన్ మైండ్ నే లాగి
ఆ ఆపిల్ మురిసిపోయినట్టు
నా హగ్గు లోకి నిన్నే లాగి
నేను కూడా మురిసిపోనా

వైరల్ అయిన వీడియో లా వెలిగిపోదా
నువ్వుంటే నా చిట్టి జిందగీ
ట్రెండ్ సెట్ చేసిన టీజర్ అంటూ పేరు రాదా
మన వందేళ్ళ ఇష్క్ బొమ్మ కి

తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా

సున్ మేరే మాహియా వే మాహియా వే  హో మాహియా వే 
తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే
సున్ మేరే మాహియా వే మాహియా వే  హో మాహియా వే 
తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే




ఏక్ బార్ ఏక్ బార్ పాట సాహిత్యం

 
చిత్రం: వినయ విధేయ రామ (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం:  దేవి శ్రీ ప్రసాద్, రానైన రెడ్డి

ఓ బేబీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్
నువ్ ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్
నీ కళ్ళల్లోనే ఉంది ముంతకల్లు కల్లు
నీ వొళ్లే వెయ్యి ఒంపులున్న  విల్లు విల్లు

ఓ బేబీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్
నువ్ ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్
నీ కళ్ళల్లోనే ఉంది ముంతకల్లు కల్లు
నీ వొళ్లే వెయ్యి ఒంపులున్న  విల్లు విల్లు

హేయ్ రావే నా అలీషా
చూపిస్తా తమాషా
ఉంటది నాలో నిషా హమేశ
నాలోని కళాకర్ నీలోని అలంకర్
మిక్స్ ఐతే డిస్కొ బార్ ఫుల్ హుషార్
ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్

ఏక్ బార్ ఏక్ బార్
ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్
ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్

ఓ బేబీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్
నువ్ ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్
నీ కళ్ళల్లోనే ఉంది ముంతకల్లు కల్లు
నీ వొళ్లే వెయ్యి ఒంపులున్న  విల్లు విల్లు

ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్

ఓ ఫ్లైట్ లాగా తాకే ఆఫ్
ఏ రయ్య్ మందిలే
నీ నడక చూసి
నా బుల్లి హార్ట్

హై టార్చ్ కైట్ అల్లే ఎగురుతుందిలే
నీ రాకతోటి నా హార్ట్ బీట్

ఓ మినీ ఓ మినీ నా సోకులా సొగామిణి
తినిపిస్తా బిరియానీ

చూపిస్తా నా దునియాని

ఓ హనీ ఓ హనీ
ఇక నువ్వే నా కహాని
నా వయ్యరాల గని
నువ్ ఏం చేస్తావో గాని

ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్

ఓ బేబీ యూ ఆర్ సో బ్యూటిఫుల్ ఫుల్
నువ్ ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్ చిల్
నీ కళ్ళల్లోనే ఉంది ముంతకల్లు కల్లు
నీ వొళ్లే వెయ్యి ఒంపులున్న  విల్లు విల్లు

హేయ్ సున్నా కున్నా విలువేన్టో
తెలిసినాదిలే
నీ సన్నాయంటి
నడుము చూసినాక

హేయ్ రెంట్ లేని కరెంట్ అంటే
తెలిసినాదిలే

నీ కొంటె చూపు షాక్ కొట్టినాక
రాణి ఓ రాణి
నన్ను నీతో పాటే రాణి
నీ సోలో సొగసులన్నీ

ఫ్లో లో ఎత్తుకుపోనీ
ఆజ రాజా జానీ
నీ జానూ నేనే పోనీ
ఈ సూపర్ సౌండ్ కి బాణీ
అరె సూపర్ హిట్ ఐపోనీ

ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్

ఏక్ బార్ ఏక్ బార్
డప్పేసి స్టెప్ మార్
ఏక్ బార్ ఏక్ బార్
ధంచెయ్రో డ్యాన్స్ ఫ్లోర్





రామ లవ్స్ సీత పాట సాహిత్యం

 
చిత్రం: వినయ విధేయ రామ (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం:  సింహా, ప్రియ హిమేష్ 

హేయ్ రబ్ నే బనా ది జోడీ
అన్నది నిన్నే చూశాక నా దిల్లే
ర్యాపర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి
ఇచ్చెయ్ నీ మనసు ఇవ్వాలే
గ్రూప్ లు కట్టేసి మీటింగ్ పెట్టేసి
లోకం అనాలి లే
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ

దిల్ మే పతంగ్
మదిలో మృదంగ్
మెదిలే తతంగమదిరిందే
కులికే గులాబీ
పలికే హనీ బీ
జోడీ భలేగా కుదిరిందే
మనలో ప్యార్ అంతా
ఊరు వాడంతా
కోడై కూసిందిలె

సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత

రామ లవ్స్ సీత లవ్స్
సీత లవ్స్ రామ లవ్స్
రామ లవ్స్ సీత లవ్స్ రామ
సీత లవ్స్ రామ లవ్స్
రామ లవ్స్ సీత లవ్స్
సీత లవ్స్ రామ లవ్స్ సీత

నువ్వు నేను జంటై కలిసి
చేసే లంచ్ డిన్నర్ చూసి
నేబర్హుడ్ ఏ ఫుడ్ వదిలేసి
ఏమందో తెలుసా

నువ్వు నేను టికెట్ తీసి
చూసే సినిమా ఆరా తీసి
దునియ మొత్తం ఫీలై జెలసీ
ఏమందో తెలుసా

బ్రేకింగ్ న్యూస్ ఏ లేక
న్యూస్ చ్యానెల్స్ ఏ మన యెనక
హాట్ టాపిక్ ఏ లేక
ఈ స్టేట్ ఏ ఊసుపోక
ఏమందో తెలుసా

రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ

ఎవెరీ మార్నింగ్ నిద్దుర లేచి
నువ్వే పంపిన సెల్ఫి చూసి
నా బుగ్గల్లో సిగ్గే మెరిసి
ఏమందో తెలుసా

నువ్వే నాకై ఆర్డర్ చేసిన
రెడ్ వెల్వెట్ కేక్ ఏ చూసి
లిట్ల్ హార్ట్ బీట్ ఏ వేసి
ఏమందో తెలుసా

హో జోశ్యం చెప్పే చిలక
మన ఇద్దరిని చూశాక
ఆలస్యం దేనికింకా
అని ఢోల్ ఏ కొట్టి ఢంకా
ఏమందో తెలుసా

రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ




అమ్మా నాన్న లేని పసివాళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: వినయ విధేయ రామ (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం:  కాల భైరవ 

అమ్మా నాన్న లేని పసివాళ్ళు
ఐనా అన్నీ ఉన్నోళ్ళు
నింగి నేల వీరి నేస్తాలు
కొమ్మా రెమ్మా చుట్టాలు

ఈ ఆడి పాడే పాండవులు
కలతే లేని మహారాజులు
ఏ బంధం లేని బంధువులు
కలిసుంటారంతా ఎనలేని రోజులు

లాలి జో లాలి జో
లాలి జో లాలి జో

కదిలే దేహాలే ఐదైనా
ప్రాణం మాత్రం ఒకటేగా
వేరు మూలాలన్ని వేరైనా
వెళ్లే మార్గం ఒకటేగా

ఒక రక్తం కానే కాకున్నా
అంత కన్నా మిన్నై కలిసారుగా
ఈ బంధం పేరే వివరంగా
వివరించే మాటే జన్మించలేదుగా

లాలి జో లాలి జో
లాలి జో లాలి జో

Palli Balakrishna Friday, December 28, 2018



చిత్రం: సింహా (2010)
సంగీతం: చక్రి
నటీనటులు: బాలక్రిష్ణ , నయనతార, స్నేహా ఉల్లాల్
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: పరుచూరి కిరీటి
విడుదల తేది: 30.04.2010



Songs List:



జానకీ జానకీ జానకీ పాట సాహిత్యం

 
చిత్రం: సింహ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గాత్రం: కునాల్ గంజ్ వాల, టీనా

జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ 
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ 
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?
ఎహ్ వచ్చెయ్ వచ్చెయ్ గట్టు చాటుకి 
చమటెక్కిస్తా తెల్ల చీరకి 
సర్లే అంటె ఒక్క పుటకి కావలంట మాటి మాటికీ 
అరేయ్ అందాలే దాచోద్దె హైసలకడి దాటికి

జానకీ... జానకీ...
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ 
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?

సోయగాల సంపదే హైలైటు 
ఎలా పెంచినావొ చెప్పవె సెక్రేటు 
కౌగిలింత ఒక్కటె టాబ్లెట్
నిన్ను పట్టుకున్న ఫీవరే హంఫట్టూ 
వరెవా నువ్వు ఇంత తేరగా ఇస్తుంటే 
తిమ్మిరే తిర్చేసుకొనా 
ఇస్ లా మన్నిస్త నిస్ గా లాగిస్తే 
వయసునే వడ్డించుకోనా 
ఎ బరిలొ నాదేలే గెలుపు 
హే త్వరగ ముసేయి తలుపు 
చలో నా రాణి నువ్వే లే మల్లెపుల్ల కొటకీ

జానకీ...జానకీ...
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ 
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?

లిప్పు తోటి లిప్పుకే లింకెట్టు
ఇక మొగుతాయ్ యవ్వనాల ట్రంపెట్టు 
మాయదారి సిగ్గులే కప్పెట్టు
జరా ఒంటిలోన ఎక్కడో తీపెట్టు 
జోరుగా నే పైట జారగా ఈ పుటా 
జాతరే నా గుండెలోనా 
ఎహ్ ఆగలేనంటుంటే ఆపుగా చూస్తుంటే 
ఆకలే తీర్చేసిపోనా 
హేయ్ అదిరే నీ ఒంటి మెరుపు
ఆ పరువాలే పట్టు పరుపు 
మరి లేటైతే బాగోదే లేటు నైటు ఆటకి

జానకీ...జానకీ...
come on Baby...come on...
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ 
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?? 
దేనికీ?? 





అచ్చా హై పాట సాహిత్యం

 
చిత్రం: సింహా (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గాత్రం: ఉదిత్ నారాయణ్, అంజనా సౌమ్యా

అచ్చా హై



ఓరబ్బా పాట సాహిత్యం

 
చిత్రం: సింహా (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గాత్రం: సింహా, ఆదర్శిని

ఓరబ్బా





బంగారు కొండ పాట సాహిత్యం

 
చిత్రం: సింహా (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గాత్రం: హరిహరన్, కౌసల్య

బంగారు కొండ మరుమల్లె దండ 
మనసైన అండ నువ్వేరా 
బంగారు కొండ మరుమల్లె దండ 
మనసైన అండ నువ్వేరా 
కనుపాప నిండా నీరూపు నిండా 
నా బ్రతుకు పండ రావేరా 
శ్వాశించలేను నిను చూడకుండా 
జీవించలేను నిను చేరకుండా 
ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు 
ప్రేమంతరాగాలు పలికించు ప్రియుడ 
గోరంత విరహాలు కొండంత మురిపాలు 
జల్లంత జలసాలు జరిపించు ఘనుడ 
నీ అడుగు జాడ అది నాకు మేడ

బంగారు కొండ మరుమల్లె దండ 
మనసైన అండ నువ్వేరా 
కనుపాప నిండా నీరూపు నిండా 
నా బ్రతుకు పండ రావేరా 

ఈ మహారాజు చిరునవ్వునే 
నా మణిహార మనుకొందున 
ఈ వనరాణి కొనచూపునే 
నా ధన దాన్యమనిపించనా
నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం 
ఒడిలో గుడిలో వల్లించనా 
నువ్వై నావే గాయత్రి మంత్రం 
పగలు రేయి జపియించనా 
నీ కరుణ కిరణాలు హృదయాన ఉదయాలు 
నీవెంటే నామనుగడ నీగుండె నా తలగడ 

బంగారు కొండ మరుమల్లె దండ 
మనసైన అండ నువ్వేరా 
కనుపాప నిండా నీరూపు నిండా 
నా బ్రతుకు పండ రావేరా 

నీ మీసాల గిలిగింతకే 
ఆ మోసాలు మొదలాయేనా 
నీ మునివేళ్ళ తగిలింతకే 
ఆ మునిమాపు కదలాయేనా 
నీకే నీకే సోగసాభిషేకం 
నిముషం నిముషం చేయించనా 
నీతో తనువు మనసు మమేకం 
మనదోలోకం అనిపించనా 
సంసార కావ్యాలు సంస్కార కార్యాలు 
కలగలుపు గుణవంతుడ 
కలియుగపు భగవంతుడా 

బంగారు కొండ మరుమల్లె దండ 
మనసైన అండ నువ్వేరా 
కనుపాప నిండా నీరూపు నిండా 
నా బ్రతుకు పండ రావేరా 




కనులార చూద్దాము పాట సాహిత్యం

 
చిత్రం: సింహా (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: వేటూరి 
గాత్రం: చక్రి, మాళవిక 

అసుర గణమున ఉసురు నణచగా
ఇలకు దిగు నరసింహమ
కలదు కలదని అసుర శిశువుకు
శరణు నొసగిన దైవమా
ప్రణయ నరసింహా
విజయ నరసింహా
హింస నణచినా ఉగ్ర సింహ
పరమ హంస భావన
సిరుల రాణి ధీరుల నవ్వే
వరములే నారాయణ

కనులార చూద్దాము కదిలి రారమ్మ
పసుపు కుంకుమ జంట కట్టి పెళ్లి నెడమ్మా

లక్ష్మి నరసింహ కళ్యాణం
భువికి దిగివచ్చే దివ్య వైభోగం
గగనమంతా పందిరయి
భువనమే సుమ వెదికాయి
కళ్యాణం జరిగేనమ్మా కనుల పండువుగా

ఈ జగాన జరగనట్టి దేవతార్చనగా
ఏ యుగాలు ఎరగనట్టి మంత్ర పుష్పముగా

కనులార చూద్దాము కదిలి రారమ్మ
పసుపు కుంకుమ జంట కట్టి పెళ్లి నెడమ్మా

పోగలతో మంత్రాల గోషా రగులుతుంటే ముచ్చట
వగలతో శ్రీవారి పైన విసురు చూపే ముచ్చట

సిరికి హరియే సరి అనేటి సరసమింక ముచ్చట
జగమునేలే జవ్వనాలకు మూడు జగములు మొక్కగా
శుభములన్ని చుట్టములుగా కలలని వరకట్నములతో
ధర్మపురిగా యాదగిరిగా మంగళార్చన షికారిగా
సింహగిరి కల్యాణ వేదిక విరిసే కన్నులు పండుగ

కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ
కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ

తరాలన్నీ తలంబ్రాలే తలకు చేరే ముచ్చట
నింగి నెలలు మృదంగలై మెలమయ్యే నిచట

తెరల చాటున చొరవ చేసే బాలకృష్ణుడి లీలాట
తాళి కట్టే వేళా సిరి మీద అల్లిబిల్లిగా గిల్లుట
అల్లుడైన గిల్లుడైన పెళ్లికొడుకే హరి అట
వేదగిరిగా అంతర్వేదిగా అహోబిళగిరి షికారిగా
సింహగిరి కల్యాణ వేదిక విరిసే కన్నులు పండుగ

కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ
కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ

కనులార చూద్దాము కదిలి రారమ్మ
పసుపు కుంకుమ జంట కట్టి పెళ్లి నెడమ్మా




హే సింహమంటి పాట సాహిత్యం

 
చిత్రం: సింహా (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గాత్రం: మనో, శ్రావణ భార్గవి 

హే సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే
సింహ సింహ సింహ గురిచూసేస్తాడే సింహ
అడవిలాంటి అందాలే ఆక్రమించాడే
సింహ సింహ సింహ సిరి దోచేస్తాడే సింహ
సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే
అడవిలాంటి అందాలే ఆక్రమించాడే

అహ్హ్ అక్కడేదో పట్టి ఎహ్ ఇక్కడేదో ముట్టి
ఉహ్ ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే
హే ఎక్కడైనా గీచి ఓ ఒక్కటేదో ఇచ్చి
హ్మ్మ్ అథారేదో ఇచ్చి ఆడిస్తుంటానే

రామ రామ రామ రామ
రామ రామ రే
ఆది సోమా లేనే లేని ప్రేమ ప్రేమ రే
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ రే
ఉష్ణోగ్రత పెంచేస్తానే శానా శానా రే

సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే
అడవిలాంటి అందాలే ఆక్రమించాడే

ఫీజిక్ లో ఫిజిక్స్ నే చదివేస్తున్నాడే
కసక్ లో కెమిస్ట్రీ నే కలిపేస్తున్నాడే

సోకుల్లోని సైకాలజీ చదివేస్తా చూడే
చీకట్లోనే టెక్నాలజీ చూపిస్తా నేడే

లవాలోజి జివ్వలోజి మొత్తం నేర్చాడే
చాపలోజి టెక్నాలజీ నేర్పిస్తా నేడే
ఒకళోజి కేకలోజి
పెట్టించేందుకు పట్టా పొందనే

అయ్యయ్యయో
రామ రామ రామ రామ
రామ రామ రే
ఆది సోమా లేనే లేని ప్రేమ ప్రేమ రే
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ రే
ఉష్ణోగ్రత పెంచేస్తానే శానా శానా రే

సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే
అడవిలాంటి అందాలే ఆక్రమించాడే

హాయ్ హాయ్ ఆటోగ్రఫేహ్ చేస్తానంటాడే
రేయి రేయి బియోగ్రఫీహ్ రాస్తానంటాడే

తీపి తీపి ఫొటోగ్రఫీ తీస్తా ఉంటానే
గ్యాప్ ఎహ్ లేక బ్యూటీగ్రాఫేహ్ గీస్త ఉంటానే
పిచ్చి రాచి పేరాగ్రాఫేహ్ సరిపోదంటాడే
కచ్చిగాచి కోరియోగ్రఫీహ్ కావాలంటాడే
కేజీ కేజీ సుమాటోగ్రఫేహ్
పట్టించేందుకు పుట్టి పెరిగానే

హబ్బబ్బా
రామ రామ రామ రామ
రామ రామ రే
ఆది సోమా లేనే లేని ప్రేమ ప్రేమ రే
రామ రామ రామ రామ
రామ రామ రే
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ రే


Palli Balakrishna Sunday, August 20, 2017
Legend (2014) Telugu Songs Lyrics Album Cover

Legend (2014) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Legend (2014)
Director : Boyapati Srinu
Supporting Cast : Jagapathi Babu
Release Date : 28 March 2014

Legend Song Lyrics in Telugu – Legend (2014)

'Legend' song from Legend (2014) movie is composed by Devi Sri Prasad and sung by M. L. R. Karthikeyan.

SONG INFORMATION
Movie : Legend (2014)
చిత్రం: లెజెండ్ (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: MLR. కార్తీకేయన్ సూర్యుడు, చందుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిశారంటే వీడు హే మాటలు వాడడు మౌనమె ప్రేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు జనమే లేరు నేనే జనమంటాడు రక్తం రంగే రక్షాగుణమంటాడు ఊపిరి మొత్తం ఉద్యమరంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు హీ ఈజ్ ద లెజెండ్ (8) ధర్మ నిబద్ధుడు, సర్వ సమర్ధుడు చీకటి చీల్చె చెగువేరా వీడు శక్తి సముద్రుడు, శత్రు ధుర్బేద్యుడు గన్నై పేలే కాంతి తత్వం వీడు కదిలే చట్టం, నడిచే న్యాయం వీడు వెలుతురు కన్నా వేగంగా వస్తాడు నాయకుడైనా సేవకుడై వీడు కష్టం తుడిచే చూపుడువేలై చరితను రాస్తాడు హీ ఈజ్ ద లెజెండ్ (8)

Nee Kanti Choopullo Song Lyrics in Telugu – Legend (2014)

'Nee Kanti Choopullo' song from Legend (2014) movie is composed by Devi Sri Prasad and sung by Vijay Yesudas and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Legend (2014)
చిత్రం: లెజెండ్ (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: విజయ్ యేసుదాసు, చిత్ర నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏం మాయ చేసావే నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేసావే సమయమే ఇక తెలియనంతగా మనసునటుఇటు కమ్మేసావే పలు యుగాలకు తనివి తీరని కలల తలుపులు తెరిచినావే నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏం మాయ చేసావే నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేసావే ఓ ఓ దీన దీన తనినత్తనా దీన దీన తనినత్తనా దీన దీన తనినత్తనా దీన దీన నా (2) చూసేకొద్ది చూడాలంటూ చూపు నీవైపూ పోనీకుండా పట్టేసావే ఇచ్చేకొద్దీ ఇవ్వాలంటూ నాకై నేనే నువ్వయిపోయేలా చుట్టేసావే ఒంటరైన లోకం నిండిపోయె నీవుగా ఇప్పుడున్న కాలం ఎప్పుడైనా లేదుగా ఊపిరల్లో చిరునవ్వుల్లే నీకోసం నేనే ఉన్నా నా ప్రేమదేశం నీకు రాసిచ్చుకున్నా నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏం మాయ చేసావే నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేసావే ఓ ఓ ఏదో ఉంది ఎంతో ఉంది సూటి బాణాలు గుప్పించేటి నీరూపులో నాదేముంది అంతా నీది మెరుగు పెట్టావే అందాన్నిల్లా నీచూపుతో చిచ్చు పెట్టినావే వెచ్చనైన శ్వాసలో గూడు కట్టినావే గుప్పెండంత ఆశలో తెల్లారే ఉదయాలన్నీ నీతోనే మొదలైపోనీ నీ జన్మ హక్కైపోనీ నా రోజులన్నీ నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏం మాయ చేసావే నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేసావే దీన దీన తనినత్తనా దీన దీన తనినత్తనా దీన దీన తనినత్తనా దీన దీన నా దీన దీన తనినత్తనా దీన దీన తనినత్తనా

Tanjavuru Song Lyrics in Telugu – Legend (2014)

'Tanjavuru' song from Legend (2014) movie is composed by Devi Sri Prasad and sung by Sooraj Santhosh and Harini.

SONG INFORMATION
Movie : Legend (2014)
చిత్రం: లెజెండ్ (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సూరజ్ సంతోష్, హరిణి సీతారాముల జంటల్లే రాధాకృష్ణుల ప్రేమల్లే గౌరీశంకరులల్లే మీరు ఒకటవ్వాలి నింగి నీలం రంగల్లే వెలుగు దీపానికిమల్లే పాలుతేనే ఆలుమగలై కలిసుండాలి హోయ్ పట్టుచీర బాగుందే కట్టుబొట్టు బాగుందే చుట్టూ ముట్టే తెలుగందంలో అయస్కాంతం దాగిందే హోయ్ పైట చెంగు బాగుందే పిట్టా నడుము బాగుందే కుచ్చిళ్ళలో కులుకే చూసి నాగుండే ఆగిందే హో నీకోసంగా పుట్టిన అందం నీదే కావాలి నీ చూపుల్తో ఎదిగిన చందం నీకే ఇవ్వాలి ఇందా అంటు నువ్విస్తుంటే ఇంకేంకావాలి నీ ఇంగువ సొగసుల ఘుమ ఘుమ చూసి వచ్చా నోరూరి తంజావూరు బొమ్మల్లే భలే ముద్దొస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేశావే ఏయ్ అత్తాపూరు అత్తరు నాపై జల్లేస్తున్నావే వయసే విరబూసే వడగాలై వచ్చేశావే నీటిలో కాగితం పడవలా దూసుకొస్తుందే అశే నీవైపే నడుమొంపులో ఒదిగే కడవలా వాలిపోయావే పిలిచే లోపే హోయ్ గుండెసడి గుఱ్ఱం లాగా దూకిందే నీపైకే కళ్ళెమొదిలేశా నేనే కావాలనే ఓయ్ కట్టు తెగి తూఫానయ్యే కడలంటి నువ్వేలే అదుపు దాటి ఆక్రమించు అస్సలు ఆపను నిన్ను తంజావూరు బొమ్మల్లే భలే ముద్దొస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేశావే ఏయ్ అత్తాపూరు అత్తరు నాపై జల్లేస్తున్నావే వయసే విరబూసే వడగాలై వచ్చేశావే ఎండలో నట్ట నడి ఎండలో కాలుమోపొద్దే కందిపోయేలా నీడలో నన్ను నీ నీడలో దాచుకున్నాగా నాకు భయమేలా అరే రాతిరికి గంతలు కట్టి నలుపంత దోచేసి కాటుకలు దిద్దేస్తానే నీ కళ్ళకి హేయ్ సూర్యుడికి ముసుగే వేసి దూరంగ గిరవాటేసి కాలమంత గడుపుకుంటా నీ వెలుగులో పడకేసి తంజావూరు బొమ్మల్లే భలే ముద్దొస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేశావే ఏయ్ అత్తాపూరు అత్తరు నాపై జల్లేస్తున్నావే వయసే విరబూసే వడగాలై వచ్చేశావే

Time Bomb Song Lyrics in Telugu – Legend (2014)

'Time Bomb' song from Legend (2014) movie is composed by Devi Sri Prasad and sung by Narendra and Rita.

SONG INFORMATION
Movie : Legend (2014)
Singers : Narendra, Rita
చిత్రం: లెజెండ్ (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: నరేంద్ర, రీటా హే రెక్సోనా సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపకే శాక్సాఫోన్ ఒంపులన్ని ముందరెట్టి మిక్సీలో నన్ను రుబ్బకే దీని బాడీ సోం పాపిడీ చీమల్లే నేను నీ వెంటే హేయ్ లేడీ నీలోవేడి నాపైకి దాడిచేస్తుంటే టైం బాంబ్ పేలిందే పిల్లా నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్లా సైక్లోన్ వచ్చిందే పిల్లా నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్లా రాంబోలా స్టెన్ను గన్ను కన్ను కొట్టి తూటాలే దించినావురో రైన్ బోలా లెప్టు రైటు చుట్టుముట్టి రంగుల్లో ముంచినావురో హెడ్లైట్ వేసావ్ పిల్లోడా నా చూపుల్లో హెడ్ లైట్ వేసావ్ పిల్లోడా బెడ్ లైట్ ఆపెయ్ బుల్లోడా నా నిద్దర్లో బెడ్ లైట్ ఆపెయ్ బుల్లోడా పాష్ డిస్కోలోని మాసు ఐటం నువ్వే నీలో అందాల కోణాలు సోమెనీ గుచ్చుకుంటే పోని ఇష్క్ బాణం నువ్వే నీతో చేసుకోనా జాలీ జర్నీ సెంటు బాటిల్లాంటి గోళీసోడా నువ్వే కిస్సు కిస్సంటూ నీ సరుకే పేలనీ స్పీడోమీటర్ లేని కిలోమీరట్ నువ్వే నాలో మేటరంత నీదై పోనీ మోకాల్పైకి నిక్కర్లో మోజేపెంచే లెక్కల్లో చూపుల్తోనే పిల్లా నన్ను తాగేస్తంటే లారీ గుద్దిందే పిల్లా నా గుండెల్ని లారీ గుద్దిందే పిల్లా మ్యారీ చేస్కో పిల్లోడా నా సోకుల్ని మ్యారీ చేస్కో పిల్లోడా యమా యాపిల్ పిల్లో కొరికే చూసే పన్లో మేరామైండంతా ట్రాఫిక్కు జామైందిలే నేన్నీ కాటన్ పిల్లో నలిగిపోయే కల్లో చలో గ్రీను సిగ్నల్ ఇచ్చేస్తాలే హల్లో చమ్మక్ చల్లో నువ్వేం క్రిక్కెట్ బాలో బల్లే నా హార్టు విక్కెట్టు తీసావులే మల్లె మైదానంలో మత్తు జాగారంలో ప్రతీ బంతి సిక్సరు కొట్టిస్తాలే ఎగాదిగా నిన్నిట్టా ధగా ధగా చూసేసి భగా భగా మగా ఈడు మంటెడతాంటే రైన్ డేన్స్ మొదలైందే పిల్లా నా గుండెల్లో రైన్ డేన్స్ మొదలైందే పిల్లా గరం చాయ్ ఇస్తా పిల్లోడా నా చేతుల్తో గరం చాయ్ ఇస్తా పిల్లోడా

Om Sarvani Song Lyrics in Telugu – Legend (2014)

'Om Sarvani' song from Legend (2014) movie is composed by Devi Sri Prasad and sung by M. M. Manasi.

SONG INFORMATION
Movie : Legend (2014)
Singers : M. M. Manasi
చిత్రం: లెజెండ్ (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: ఎం. ఎం. మానసి ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కల్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణీ వందనం ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కల్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణీ వందనం పావనీ జీవతరణి పాపసంతాప హరణీ నీ కృపా చైత్ర సుధని మాపైన వర్షించనీ శాంభవీ లోక జననీ త్రిభువనానందకారిణి చింత రవ్వంత కనని చిరశాంతి విలసిల్లనీ శ్రీ చక్రాన అమ్మవై ఉన్న ఆదినారాయణీ నీ వాత్సల్య మాస్వాదించనీ మనసుని ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కల్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణీ వందనం సజ్జన రంజని దుర్జన భంజని ధర్మశిరోమణి హైమవతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసిజహాసిని శంభుసతి విశ్వవినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి ఆత్మ విలాసిని ఆర్త పరాయణి అమృతవర్షిణి వేదవతి శూలధారిణి శైలవిహారిణి మాంపాహి దేవీ చిదానంద రూపిణీ ఓం శార్వణీ ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కల్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణీ వందనం భగవతి భార్గవి భైరవి భ్రామరి మారి మనోహరి మూకాంబే భక్తవ శంకరి భవనాశంకరి పరమశివంకరి దుర్గాంబే ఓంకారేశ్వరి వర బీజాక్షరి మాహిమహేశ్వరి జగదంబే శ్రీ పరమేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భ్రమరాంబే రౌద్రకాళీ యోగమరాళీ మాంపాహి గౌరీ శివానందలహరీ ఓం కారునాక్షి ఓం హరినాక్షి ఓం నళినాక్షి వందనం ఓం కామాక్షి ఓం కమలాక్షి వీరి మీనాక్షి వందనం

Lasku Tapa Song Lyrics in Telugu – Legend (2014)

'Lasku Tapa' song from Legend (2014) movie is composed by Devi Sri Prasad and sung by Sagar and Malathi Lakshman.

SONG INFORMATION
Movie : Legend (2014)
చిత్రం: లెజెండ్ (2014) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సాగర్, మాలతి లక్ష్మన్ లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా హే చెరుకు ముక్క నేను అరె కొరికి చూడు మావా నీ దిమ్మదిరిగి బొమ్మడిపోద్ది లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా గంజాయి మొక్క నేను ఎంజొయ్ చేయి మామ నీ నరం నరం మెలికడిపోద్ది లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా హే జరమొస్తే ఇస్తారు ఇంజీషను నేనేమో జరమిచ్చే ఇంజీషను సెల్లు నంబరడిగేస్తే ఇచ్చేస్తాను ఒక్క మిస్సుడు కాలు నొక్కేస్తే వచ్చేస్తాను మా ఊరు గుంటూరు నా సరుకు చూస్తె పావు శేరు ఉడుకు చూస్తె నూట ఆరు లస్కులపా నా పేరు లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా కల్లుముంత వేస్టు నీ కళ్ళు చూస్తె చాలు తైతక్కలాడే కిక్కొస్తాదే లస్కుటపా లస్కుటపా లస్కుటపా పాపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా హే రమ్ము జిన్ను వేస్టు నీ రంగు పెదవి చాలు రంగుల్ రాట్నం ఎక్కిస్తాదే లస్కుటపా లస్కుటపా లస్కుటపా పాపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా నన్ను భంగుతో చేశాడు భగవంతుడు నా కళ్లలో దాచాడు కత్తులు రెండు చెంపల్లో పొదిగాడు చెర్రీ పండు నడుం మెలికలో పెట్టాడు వెల్కం బోర్డు ఓలమ్మీ మీ మమ్మీ మరుమల్లెపూలు కప్పుకున్న మందుపాతరంటి నిన్ను మాకోసం కన్నాదే లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా నేనే లస్కుటపా లస్కుటపా లస్కుటపా నే తీపి ముద్దులిస్తే నీ షుగరు పెరిగిపోతే ఆ తప్పు నాది కానే కాదు లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా నే ఘాటు కౌగలిస్తే నీ బీపీ పెరిగిపోతే నా పూచీ లేనే లేదు లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా హే ఓసినీ వొంపు సొంపు డేంజర్ లైటు నువ్వున్న చోట పవరుకట్టు ఉంటే ఒట్టు అయినా గానీ పెరుగుతాంది హీటో హీటు ఓ చూపు చూసి నా ఒంటికి ఏసీపెట్టు ఆరేసి ప ప పారేసి నా బ్యూటీ మొత్తం ఊటీ చేసి ఇచ్చుకోన చిల్డు ఖుషీ పైటచెంగు ఎగరేసి లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా మావా లస్కుటపా లస్కుటపా లస్కుటపా లస్కుటపా...

Palli Balakrishna Wednesday, August 16, 2017




చిత్రం : జయ జానకి నాయక (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, రకూల్ ప్రీత్ సింగ్, ప్రాగ్యా జైస్వాల్
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: యమ్.రవీందర్ రెడ్డి
విడుదల తేది: 11.08.2017



Songs List:



అందమైన సీతాకోక చిలుక పాట సాహిత్యం

 
చిత్రం : జయ జానకి నాయక (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సూరజ్ సంతోష్

అందమైన సీతాకోక చిలుక



Let's Party All Night పాట సాహిత్యం

 
చిత్రం : జయ జానకి నాయక (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: పృద్వి చంద్ర, ఎం. ఎం. మానసి

Let's Party All Night



రంగు రంగు కల్లజోడు పాట సాహిత్యం

 
చిత్రం : జయ జానకి నాయక (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: హేమ చంద్ర, శ్రావణ భార్గవి

రంగు రంగు కల్లజోడు
పెట్టుకొని చూస్తునట్టు అదిరిందె లోకం
కగడాలు భంగడాలు
మస్త్ గ సందడి చేసెయ్ సూపర్ సాయంత్రం

హేయ్ దోలు కొట్టి దుమ్ము రేపుదాం
హేయ్ గోల కొట్టి పంబ రేపుదాం
చిన్న వాళ్ళు పెద్ద వళ్ళాని
తేడ లన్ని చెరిపేద్దం

సౌండ్ కొంచెం పెంచు బయ్యొ
దంచుదాం సంగీతె
ఊరుమొత్తం ఊగిపోవాలయ్యొ ఆజురాత్

ఇంట్లొ అద్దం ముందర ఉంటె
నేనొ ప్రభుదేవానండి
అందరి ముందరకొచ్చనంటె
చిందర వందర సిగ్గండి

ఇందరు ఉండగ నిన్ను నన్ను
ఎవ్వడు చూస్తాడండి
గుంపులొ ఇంక ఫ్రీడం ఎక్కువ
ఫుల్లుగ కుమ్మెయండి

హేయ్ ఈ క్షణాన్నె ఫ్రేం కట్టిఈ
కుండలోనె పెట్టి తలమేసేద్దం
పోసులన్నీ మేలవించీ
లైఫె కొక్క స్వీటు సెల్ఫి తీద్దం

సౌండ్ కొంచెం పెంచు బయ్యొ
దంచుదాం సంగీతె
ఊరుమొత్తం ఊగిపోవాలయ్యొ ఆజురాత్

వేసిన నెక్లెస్ చుడట్లేదని
వైఫ్ ఫీలవుతుంది
మెరిసె నవ్వుల నిగ నిగలుండగ
నగలతొ పని ఏముంది
ఒక్కడు నన్ను టచ్ చెయ్డెండని
లిక్కర్ లుక్కేస్తుంది
మందుని మించిన విందుని
పంచె బంధువులెంతో మంది

ఆ ఇన్ని నాళ్ళు ఒంటరల్లె
ఉన్న ఇల్లె నేడె బొమ్మరిల్లాయె
అంబరాల సంబరాల
అందరిల లాగ ఫుల్ల్ అయె పోయె

సౌండ్ కొంచెం పెంచు బయ్యొ
దంచుదాం సంగీతె
ఊరుమొత్తం ఊగిపోవాలయ్యొ ఆజురాత్




నువ్వేలే నువ్వేలే పాట సాహిత్యం

 
చిత్రం : జయ జానకి నాయక (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్వేతా మోహన్

నువ్వేలే  నువ్వేలే 
నా ప్రాణం నువ్వేలే 
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన 
నేస్తం నువ్వేలే 

నువ్వేలే నువ్వేలే 
నా లోకం నువ్వేలే 
చీకట్లకు రంగులు పూసిన 
స్నేహం నువ్వేలే 

నడవలేని చోటులోన 
పూల బాట నువ్వేలే
నేదురలేని జీవితాన 
జోల పాట నువ్వేలే 

నువ్వేలే  నువ్వేలే 
నా ప్రాణం నువ్వేలే 
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన 
నేస్తం నువ్వేలే 

నువ్వేలే నువ్వేలే 
నా లోకం నువ్వేలే 
చీకట్లకు రంగులు పూసిన 
స్నేహం నువ్వేలే 

మేఘలేన్నున్నా ఆకాశం నువ్వేలే 
రాగాలేన్నున్నా అనురాగం నువ్వేలే 
బంధాలేన్నున్నా ఆనందం నువ్వేలే 
కష్టలేన్నున్నా అదృష్టం అంటే నువ్వేలే 

అలసి ఉన్న గోతులోన 
మనసు మాట నువ్వేలే 
అడవిలాంటి గుండెలోన 
తులసికోట నువ్వేలే

నువ్వేలే  నువ్వేలే 
నా ప్రాణం నువ్వేలే 
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన 
నేస్తం నువ్వేలే 

నువ్వేలే నువ్వేలే 
నా లోకం నువ్వేలే 
చీకట్లకు రంగులు పూసిన 
స్నేహం నువ్వేలే 

ధైవలేన్నున్నా నా ధైర్యం నువ్వేలే 
స్వర్గాలేన్నున్నా నా సొంతం నువ్వేలే 
దీపలేన్నున్నా నా కిరణం నువ్వేలే 
ఆభరణాలేన్నున్నా నా తిలకం మాత్రం నువ్వేలే 

మధురమైనG భాషలోన
మొదటి ప్రేమ నువ్యూజ్Kఈవేలే 
మారమైన ఆశలోన 
మరొక జన్మ నువ్వేలే 

నువ్వేలే  నువ్వేలే 
నా ప్రాణం నువ్వేలే 
కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన 
నేస్తం నువ్వేలే 

నువ్వేలే నువ్వేలే 
నా లోకం నువ్వేలే 
చీకట్లకు రంగులు పూసిన 
స్నేహం నువ్వేలే 




Just Chill Boss పాట సాహిత్యం

 
చిత్రం : జయ జానకి నాయక (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఎం. ఎం. మానసి, దీపక్


Just Chill Boss



వీడే వీడే పాట సాహిత్యం

 
చిత్రం : జయ జానకి నాయక (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కైలాష్ కెహర్

విల విల విల వాలే పొద్దుకి 
రంగులు మళ్ళీ ఉదయించేలా 
భగ భగ భగ సూర్యుడి హేలా
జల జల జల జారే కన్నుల 
గంగా జలముల పరుగాగేలా 
ధగ ధగ ధగ వీరుడి ఊళా

అగ్గి శిఖలలోన చిక్కిన మల్లె మొగ్గ కోసం 
మంచు కెరటమై దూసుకు వచ్చిన సైనికుడు
సైనికుడు 
కత్తి కొనలలోన చిక్కిన పావురాయి కోసం 
ప్రాణకవచమై రణముకు వచ్చిన రక్షకుడు
రక్షకుడు 
గుండె లోతులో తెగిన గాయమై 
తగువు న్యాయమై వచ్చాడు 
కంచు కోటలో రాకుమారి 
పెదవంచులపై చిరునవ్వవుతాడు 

వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే 
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే 
వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే 
వీడే వీడే నీ బలము బలగం వీడే 

ఆరేసావో పాతేశావో 
నీ ధైర్యం వెతికిచ్చే వాడు 
ఆర్చేసావో కాల్చేసావో 
నీ కలలన్నీ బ్రతికించే వాడు 
నువ్వు మరచిన నిన్ను మరవని 
జ్ఞాపకంగ తిరిగొచ్చాడు 
నిన్ను వలచిన పడమరంచు కొన 
అంచున మొలచిన తూరుపు వీడు 

వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే 
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే 
వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే 
వీడే వీడే నీ బలము బలగం వీడే 

ఓ విల విల విల వాలే పొద్దుకి 
రంగులు మళ్ళీ ఉదయించేలా 
భగ భగ భగ సూర్యుడి హేలా
జల జల జల జారే కన్నుల 
గంగా జలముల పరుగాగేలా 
ధగ ధగ ధగ వీరుడి ఊళా

ఓ అమ్మ ఒడై ప్రేమందించి 
నీ హృదయం లాలించే వాడు 
ఓ బ్రహ్మ ముడై నీ సంకెలని 
నీ శత్రువుని చేధించే వాడు 
ముగిసి పోయిన నుదుటి రాతనే 
మలుపు తిప్పు మొదలవుతాడు 
సగము వెన్నెల సగము జ్వాలగా 
రగిలే ప్రేమ వికిరణం వీడు 

వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే 
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే 
వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే 
వీడే వీడే నీ బలము బలగం వీడే




A For Apple పాట సాహిత్యం

 
చిత్రం: జయ జానకి నాయక (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: మమతా శర్మ, సాగర్

A ఫర్ యాపిలు B ఫర్ బజ్జులు
C ఫర్ సిలకలు D ఫర్ డింపులు
A to Z ఇట్టాంటివి ఎన్నేనో పేరులు
ఇచ్చారు నా వంటికి ఏవేవో బిరుదులు

హాయ్ మెస్సేజ్ లు థాయ్ మస్సాజ్లు
హార్ట్ లీకై వత్తారు రెడ్డులు రాజులు
ఫ్యూజ్ ఎగిరే అందానికి ఎన్నెన్నో ఫీజులు
వద్దన్నా ఇస్తారు డైమండ్ గాజులు

హే ఫోన్ ఎవడిదైనా నా ఫోటో ఉంటదంటా
ఆధార్ కార్డ్ లాగా ఎంట ఉంటా
ఏ వయసు వాడినైనా నే వరస కలుపుకుంటా
నా సొగసు లెక్క తేల్చలేనిదంట

బాంబో చికెన్ ఉంది జంబో సోకుంది
మీలో ఎవడంట రాంబో
అందం బాంబ్ ఉంది ఐటమ్ సాంగ్ ఉంది
మీలో ఎవడునాకు కాంబో

ఏ రాజమండ్రి జాంగిరి అని 
కాకినాడ కాజా అని
జిలేబి లాంటిదని గులాబీ అని
నా పెదవికెన్ని ముద్దు పేర్లు రో

సైజ్ జీరో సింబల్ అని 
బంగారు బేంగిల్ అని
సన్నాయి కన్నా సన్నదని సన్నజాజిని
నా నడుముకెన్ని నిక్ నేమ్స్ రో

ఖారా కిల్లి కన్నా ఘాటె నీ మాటే సోనా
మాంగో చిల్లీ కన్నా పిచ్చ స్వీటే నీ ముద్దు పేర్లే చిన్నదాన

బాంబో చికెనుంది  జంబో సోకుంది 
మిలో ఎవడంటా రాంబో
అందం బాంబ్ ఉంది ఐటమ్ సాంగ్ ఉంది
మిలో ఎవడునాకు కాంబో

నా బుల్లి బుగ్గ బులి బులి బెలూన్
నే నడిచి వెళ్లే బ్యూటీ సెలూన్
నే ఉన్న చోట కుర్రాళ్లకు ఏక్సిడెంట్ జోన్
అని నా పైన ఎన్ని కవితలో

నా కన్నెసోకు వాటర్మీలాన్
నా కొంటేచూపు మల్లెల తూఫాన్
నా బుగ్గలోన సిగ్గు పొలం
దున్నే కిసాన్ మరి ఎవడంటూ ఎన్ని ప్రశ్నలో

గ్లామర్ గ్రెనేడునే మా గుండెలో పేల్చేశావే
బ్యూటీ పేటెంటునే మాకే పట్టుమంటూ రాసినావే

బాంబో చికెనుంది  జంబో సోకుంది
మిలో ఎవడంటా రాంబో
అందం బాంబ్ ఉంది ఐటమ్ సాంగ్ ఉంది
మిలో ఎవడునాకు కాంబో



Palli Balakrishna Tuesday, August 15, 2017

Most Recent

Default