Naa Kanti Meedha Kunuke Song Lyrics in Telugu and English – Ramba Oorvasi Menaka (2026)
'Naa Kanti Meedha Kunuke' song from Ramba Oorvasi Menaka (2026) movie is composed by Chaitan Bharadwaj and sung by Dhanunjay Seepana. Lyrics are written by Bhaskarabhatla Ravi Kumar. Starring Allari Naresh and Surabhi.
Rambha Oorvasi Menaka Title Song Lyrics in Telugu and English – Rambha Oorvasi Menaka (2026)
'Rambha Oorvasi Menaka Title Song' from Rambha Oorvasi Menaka (2026) movie is composed by Chaitan Bharadwaj and sung by Dhanunjay Seepana and Sahithi Chaganti. Lyrics are written by Suresh Banisetti. Starring Allari Naresh, Surabhi, Raashi Singh, and Vishnu Priya Bhimeneni.
హే మా ఊరు ఎక్కడో స్వర్గమండీ
అది ఆకాశం అంచున ఉంటదండి
అరే దిగివచ్చాం పండగే చేసుకోండి
ఆహా తహ తహ తహ తహలాడిపోతారే
హే మీకోసం ఇక్కడే కోట్ల మంది
తెగ పడి చస్తూ ఉంటారే వద్దులెండి
ఆ కళ్లలోనే కటౌట్ కడతారండీ
ఆ జర జర జర జరగాలి జాతరే
స్టార్ మా కోసం ముప్పై ఏళ్ల తర్వాత స్టేజ్ ఎక్కరా స్టార్
ఇక జంపర్ మే బంపర్ ఏస్కో
ఆహా ఈ రంభ ఊర్వశి మేనకా
ఇక స్టెప్ వేస్తే తెల్లార్లు వేడుకా
ఈ భూగోళం బద్దలైపోద్దికా
మరి అవకాశం జారిందో రాదింకా...
ఈ రంభ ఊర్వశి మేనకా
ఇక స్టెప్ వేస్తే తెల్లార్లు వేడుకా
ఈ భూగోళం బద్దలైపోద్దికా
మరి అవకాశం జారిందో రాదింకా
మేం కన్నేస్తే వెలుగుతాయి కాగడాలు
మేం కవ్విస్తే ఊరికే ఊగడాలు
మేం నడిచొస్తే గుండెలే ఆగడాలు
హే ధడ ధడ ధడ ధడలాడి పోద్దిరో
మీకిష్టం బంగారు కంకణాలు
అవి తెచ్చిస్తే జరుగుతాయి అద్భుతాలు
మీ కష్టం తో కరుగుతాయి కొండరాళ్లు
హే ధన ధన ధన ధన దమ్ము లేపరో
మేం చెయ్యేస్తే హా చెయ్యేస్తే
మేం చెయ్యేస్తే హా చెయ్యేస్తే
చచ్చిపోతార్రా...
ఆహా ఈ రంభ ఊర్వశి మేనకా
ఇక స్టెప్ వేస్తే తెల్లార్లు వేడుకా
ఈ భూగోళం బద్దలైపోద్దికా
మరి అవకాశం జారిందో రాదింకా
ఈ రంభ ఊర్వశి మేనకా
ఇక స్టెప్ వేస్తే తెల్లార్లు వేడుకా
ఈ భూగోళం బద్దలైపోద్దికా
మరి అవకాశం జారిందో రాదింకా...
Rambha Oorvasi Menaka Title Song Lyrics in English (Transliteration)
Hey maa ooru ekkado swargamandi
Adhi aakasam anchuna untadandi
Arey dhigivacham pandage chesukondi
Ah thaha thaha thaha thahalaadi pothare
Hey meekosam ikkade kotla mandhi
Thega padi chasthu untare vadhulendi
Aa kallone cut out-u kadatharandi
Aa jara jara jara jaragaali jaathare
Star maakosam muppai enla tarwatha stage ekkara star
Ika jampar mey bumper-ae esko
Aha ee rambha oorvasi menaka
Ika step esthe tellarlu veduka
Ee bhoogolam baddalai poddhika
Mari avakasam jaaridho raadhinka...
Ee rambha oorvasi menaka
Ika step esthe tellarlu veduka
Ee bhoogolam baddalai poddhika
Mari avakasam jaaridho raadhinka
Mem kannesthe eluguthai kaagadaalu
Mem kavvisthe oorike oogadaalu
Mem nadichosthe gundele aagadaalu
Hey dhada dhada dhada dhadalaadi poddhiro
Meekistam bangaaru kankanaalu
Avi tecchisthe jaruguthai adbhuthaalu
Mee kastam tho karuguthai kondaraallu
Hey dhana dhana dhana dhana dhammu leparo
Mey cheyyesthe haa cheyyesthe
Mey cheyyesthe haa cheyyesthe
Chacchipottarra...
Aha ee rambha oorvasi menaka
Ika step esthe tellarlu veduka
Ee bhoogolam baddalai poddhika
Mari avakasam jaaridho raadhinka
Ee rambha oorvasi menaka
Ika step esthe tellarlu veduka
Ee bhoogolam baddalai poddhika
Mari avakasam jaaridho raadhinka...
చిత్రం: ఆ ఒక్కటీ అడక్కు (2024)
సంగీతం: గోపీ సుందర్
నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా
దర్శకత్వం: మల్లి అంకం
నిర్మాత: రాజీవ్ చిలక
విడుదల తేది: 03.05.2024
Songs List:
ఓ మేడం పాట సాహిత్యం
చిత్రం: ఆ ఒక్కటీ అడక్కు (2024)
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి
ఓయమ్మా కొంచం ఆగవే
మనసే చెప్పే మాటని పూర్తిగ వినరాదే
నీ బొమ్మా మదిలో ఉన్నదే
ఎన్ని జన్మల జన్మలకైనా చెరగదులే
చూసి చూడగానె కన్ను
కళ్ళకి అద్దుకుంది నిన్ను
కనుకే వెంట తిరుగుతున్నా ఇంతలా
కొంచెం కనికరిస్తె నన్ను
విరిగి మీద పడదు మిన్ను
అరెరె మూతి ముడుచుకోకే అంతలా
ఓ మేడం (ఓ మేడం)
ఐ’మ్ వెయిటింగ్ ఫర్ యూ
(ఐ’మ్ వెయిటింగ్ ఫర్ యూ) ||4||
తగ్గేది కాదే నీమీద ఉన్న ఇష్టము
నువ్ లేని బతుకు ఐపోదా నేలమట్టము
అచ్చంగా నువ్వే నాకున్న దిక్కు
నువ్ దక్కగానే తీరుస్త మొక్కు
ప్రతిక్షణం ప్రదక్షిణం
అందుకే కదా నీ చుట్టూరా
ఓ మేడం (ఓ మేడం)
ఐ’మ్ వెయిటింగ్ ఫర్ యూ
(ఐ’మ్ వెయిటింగ్ ఫర్ యూ) ||4||
కట్టేసుకోవే నీ కొంగుకేసి ప్రాణమూ
పెట్టేసుకోవే నట్టింటిలోన పాదమూ
నా ఊపిరంతా నీపేర రాస్తా
మారాణిలా నూరేళ్ళు చూస్తా
సరే అని అనొచ్చుగా
దారి అంతటా పువ్వులు కోస్తా
ఓ మేడం (ఓ మేడం)
ఐ’మ్ వెయిటింగ్ ఫర్ యూ
(ఐ’మ్ వెయిటింగ్ ఫర్ యూ) ||4||
హమ్మమ్మో పాట సాహిత్యం
చిత్రం: ఆ ఒక్కటీ అడక్కు (2024)
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: యశస్వి కొండేపూడి
ఇష్టాన్ని దాచడమెంతో కష్టం తెలుసునా
కన్నుల్లో కనబడిపోదా ఏదో రోజునా
బయటే పడిపోకు అంటు మదినే ఆపినా
అది నీ మాటల్నే వింటు తలనే ఊపునా
హమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకీ
కన్నులకే చెప్పేస్తుంది ప్రతి సంగతీ
హమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకీ
కన్నులకే చెప్పేస్తుంది ప్రతి సంగతీ
తూరుపోకరంటా పడమరొకరంటా
ఎందాక పయనం ఈ దారిలో
స్నేహమొక వైపు ప్రేమ ఒక వైపు
ఈ చిన్ని మనసు ఎటు తూగునో
ఎంతెంత చిత్రం ఏంటి విచిత్రం
బొమ్మొక్కరై బొరుసొక్కరై
కలిసారు కలవరంటు తెలిసీ
హమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకీ
బదులివ్వను పొమ్మంటుంది ప్రతి...
చిత్రం: 12A రైల్వే కాలనీ (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల
దర్శకత్వం: కాసరగడ్డ నాని
నిర్మాత: చిట్టూరి శ్రీనివాస్
విడుదల తేది: 21.11.2025
Songs List:
కన్నొదిలి కలనొదిలి పాట సాహిత్యం
చిత్రం: 12A రైల్వే కాలనీ (2025)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: దేవ్
గానం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ఏ కన్నోదిలి కలనొదిలి కనుపాపే ఉంటుందా
నిన్నొదిలి నే కదిలి కాసేపైనా ఉంటానా
నువ్వు పిలిచే పిలుపొదిలి ఎవరేమన్నా వింటానా
నిన్ను గెలిచే దారొదిలి అడుగైన వేస్తానా..
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్లా పట్టి తొయ్యకే, బెట్టు నువ్వు సేయ్యకే..
వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే
మూతినట్ట తిప్పకే, ఇట్టా నన్ను సంపకే..
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్లా పట్టి తొయ్యకే, బెట్టు నువ్వు సేయ్యకే..
వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే
మూతినట్ట తిప్పకే, ఇట్టా నన్ను సంపకే..
నిన్నే చూసి చూడగానే నచ్చేసావే
అది చెప్పేలోపే గుండెలోకొచ్చావే
నీ మీద ఉన్న ప్రేమ చెప్పలేక దాచలేక
ఉప్పెనల్లె ఎగిసే పడుతోందే..
నీ కళ్ళ తోటి నన్నే కట్టేసావే
నా కాళ్ళకేమో దారం చుట్టేసావే
నీ చుట్టూ బొంగరంలా తిప్పుకుంటూ
వయ్యారంగా ఊపుకుంటూ వదిలెళ్ళిపోతావే..
పట్టుకోవే పట్టించుకోవే, పట్టనట్టే పోతావే..
చుట్టుకోవే చుట్టేసుకోవే, సూడనట్టే సుత్తావే..
నీ చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్లా పట్టి తొయ్యకే, బెట్టు నువ్వు సేయ్యకే..
వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే
మూతినట్ట తిప్పకే, ఇట్టా నన్ను సంపకే..
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్లా పట్టి తొయ్యకే, బెట్టు నువ్వు సేయ్యకే పిల్లా
వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే
మూతినట్ట తిప్పకే, ఇట్టా నన్ను సంపకే..
ఏ బాధ అంటూ లేని అల్లరోన్నే
ఏ బంధమంటూ లేని ఒంటరోన్నే
నాకంటూ నేను తప్ప ఎవరు లేని గుమ్మంలోకి
చెప్పకుండా ఎప్పుడొచ్చి చేరావే..
నీ ప్రేమలోన మళ్ళి పుట్టేసానే
నీ మీదే నేను ప్రాణం పెట్టేసానే
నువ్వంటూ వచ్చినాకే, నీతో జంట కట్టినాకే
నేను అంటూ నాకే దొరికానే..
ఏడేడు జన్మలనే వెలివేస్తానులే..
నిన్ను కలిసే ఈ నిమిషం చాలని అంటాలే..
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్లా పట్టి తొయ్యకే, బెట్టు నువ్వు సేయ్యకే పిల్లా
వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే
మూతినట్ట తిప్పకే, ఇట్టా నన్ను సంపకే…ఓ
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే
గల్లా పట్టి తొయ్యకే, బెట్టు నువ్వు సేయ్యకే పిల్లా
వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే
మూతినట్ట తిప్పకే, ఇట్టా నన్ను సంపకే..
చిత్రం: బచ్చల మల్లి (2024)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: శ్రీమణి
గానం: గౌర హరి , సిందూరి విశాల్
మా ఊరి జాతరలో
అదే నేను, అసలు లేను పాట సాహిత్యం
చిత్రం: బచ్చల మల్లి (2024)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: ఎస్ పి చరణ్ , రమ్య బెహరా
నిలబడే నిద్ర పడుతుందని
మత్తు ఒకటుందాని తెలిసే…
తెలియదే అన్నీ వ్యసనాలని
మించే వ్యసనం పేరే ప్రేమనీ
తన నీడ నన్నే తాకుతుంటే
మనసు మరిగిన మురికి వదిలెన?
అదే నేను, అసలు లేను
తిరిగి జరిగిన జననమా..!
ఎలా నిన్ను విడిచిపోను
వెలుగు వెనకన నడవన?
గడ్డి పువ్వంటి నా కోసం
గుడి తలుపు తీసావే
ఒక మలుపు తీసె విధిని రాసి
దారేదో చూపించావే… చెరపమాకే
ఇదేనేమో మొదటి ప్రేమ
కలిగె అలజడి సహజమా
తుదే లేక కదిలిపోగా
ఇపుడే మొదలయే పయనమా
చెలియవే కలువవే
బురదకి నువ్ వరానివే
తలను నిమిరే
చెలిమి కొరకే
తిరిగి చూసాలే
కలవర కలలు
నిండిన కనులు
హాయి నిదురే చూసెనే
కలతిక పడకు
ఎందుకు దిగులు
తోడు నీకవనా…
సహనాలు పెరిగే
వీలు దొరికే
నడిపే వేలే నీదిలే…
తెలిసాకే కదిలా
నిన్ను చదివా
గొప్ప నాదేం లేదులే
మొరటతనమే
విడిచి పెడతా
ఉంటే నువ్వే ఇలా…
ఇదేనేమో మొదటి ప్రేమ
కలిగె అలజడి సహజమా
తుదే లేక కదిలిపోగా
ఇపుడే మొదలయే పయనమా…
మరీ అంత కోపం పాట సాహిత్యం
చిత్రం: బచ్చల మల్లి (2024)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: పూర్ణాచారి
గానం: సాయి విగ్నేష్
మరీ అంత కోపం
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి
నటీనటులు: నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషిక రంగనాథ్
దర్శకత్వం: విజయ్ బిన్నీ
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
విడుదల తేది: 14.01.2024
Songs List:
ఎత్తుకెళ్ళి పోతావా పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: రామ్ మిరియాల
ఉల్లి మల్ల సీర గట్టి
కజ్జలు పైకెగగట్టి
ఉల్లి మల్ల సీర గట్టి
కజ్జలు పైకెగగట్టి
ఉన్నవాళ్ళ పిల్లనంటవా గుమ్మా
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందన
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందనా
బీర పువ్వు రైక సుట్టీ
బిల్లంత బొట్టు పెట్టి
బీర పువ్వు రైక సుట్టీ
బిల్లంత బొట్టు పెట్టి
బైటకడుగు పెట్టనంటవ భామా
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందన
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందనా
(ఎత్తుకెళ్ళి పోతావా, పోతావా
ఎత్తుకెళ్ళి పోతావా, పోతావా)
బెల్లం సెరుకు సూపుల దాన
అల్లం మిరప మాటలదాన
బొండుమల్లి నడుము దాన
బండెడు సోకుల ఓ నెరజాన
నువ్వట్ట పోతుంటే ఓ ఓ ఓ
నిన్నిట్ట సూత్తుంటే ఓఓ ఓ ఓ
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
నారెట్టి సుట్టేసి మోపల్లె కట్టేసి
నా నెత్తి మీదెట్టి గోదారి గట్టెంట
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
కడవల్లో నింపేసి కావిల్లో పెట్టేసి
ఇడిసి పెట్టకుండ నిన్నింక కడదాక
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే
నువ్వు నడిచెళ్ళితే నీ కాలి అంచు తాకి
మట్టి బెడ్డలన్ని మువ్వలయ్యాయే
నువ్వు నవ్వుతుంటే ఆ నవ్వు తీపి సోకి
చెట్టు కొమ్మలన్నీ తేనే పట్టులయ్యాయే
ఎంత ఎంత, ఎంత ముద్దుగున్నావంటే
ఒక్క ఒక్క మాటలోన చెప్పాలంటే
చందమామకే పిల్లలు పుడితే
హే, చందమామకే పిల్లలు పుడితే
నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే
(మరి అట్టా ఉంటె ఏం చేస్తాం)
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
నా గుండెకోటలో రాణివి నువ్వంట
నా రెండు కాళ్ల పల్లకిలోనా
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
మన ప్రేమకు పూసిన చిన్నారి పొన్నారి
పిల్లల్ని నువ్వు సంకనెత్తుకునేదాక
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే
నా సామిరంగా పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్
మా జోలికొస్తే మాకడ్డువస్తే
మామూలుగా ఉండదు
నా సామిరంగా, (నా సామిరంగా)
ఈ గీత తొక్కితే, మా సేత సిక్కితే
మామూలుగా ఉండదు
నా సామిరంగా, (నా సామిరంగా)
ఒక్కడు అంటే ఊరందరు
మా ఊరంటే ఒక్కొక్కడు
ఒక్కరు అంటే… ఊరందరు
మా ఊరంటే… ఒక్కొక్కడు
మాతోటి, మాతోటి
మాతోటి పేచీ పడితే
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
ఈ గాలిలో పౌరుషముంది
ఈ మట్టిలో పంథం ఉంది
ఈ నీటిలో ప్రేమా ఉంది
ఈ నీటిని తాగి, మట్టిని తాకి
గాలిని పీల్చి, ఎదిగిన ఈ దేహంలో
శ్వాస ఉన్నంత వరకు
విశ్వాసం ఉంటాది
ప్రాణమున్నంత వరకు
అభిమానం ఉంటాది
మాతోటి, మాతోటి
మాతోటి పేచీ పడితే
సామిరంగా… నా సామిరంగా
అరె సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
సామిరంగా… నా సామిరంగా
దేవుడే తన చేతితో పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: యం.యం.కీరవాణి
గానం: శాండిల్య పీసపాటి
దేవుడే తన చేతితో
రాసిన ఒక కావ్యం
అంజిది, కిష్టయ్యది
విడదియ్యని ఒక బంధం
చిరునవ్వులు పూసే స్నేహం
చిరుగాలికి ఈల నా పాఠం
కడతేరని ఆనందంలో
కడదాకా సాగే పయనం
దేవుడే తన చేతితో
రాసిన ఒక కావ్యం
ఏరా, ఒరే అనేటి ప్రాణమిత్రులు
పరాచకాలతోటి ఆటపాటలు
అన్నయ్య ఉంటే చాలుగా
ప్రాణాలు పంచే తీరుగా
కలిసింది పాలు తేనెలా
కలిపింది కాలం ప్రేమ పొంగేలా
దేవుడే తన చేతితో
రాసిన కమ్మని ఒక కావ్యం
అంజిది, కిష్టయ్యది
విడదియ్యని ఒక అనుబంధం
దుమ్ము దుకాణం పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: సాహితి చాగంటి, కరిముల్ల, సాయి చరణ్, లోకేష్, అరుణ్ కౌండిన్య, హైమత్
ఆ కుర్చీలోన అమ్మాయి
ఈ కుర్చీలోన అబ్బాయి
ఆ కుర్చీలోన అమ్మాయి
ఈ కుర్చీలోన అబ్బాయి
వీళ్ళ ఇద్దరి ప్రేమకు మద్దతు ఇవ్వగా
ముందుకు వచ్చిన వాళ్ళు
బంధుమిత్రులు అన్నదమ్ములు
పిల్లాపాపలు కుర్రమూకలు పెద్దొళ్ళు చిన్నోళ్ళు
ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసిన సందడి పేరే
దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ
దుమ్ము దుకాణం
దుం దుం దుం దుకాణం
అరె దుముకు దుముకు దుం
దుం దుం దుం దుకాణం
ఈలలు వేస్తారు
కొందరు గోలలు చేస్తారు
కేకలు పెడతారు
కొందరు అరుపులు అరిచేరు
ఈ అరుపులకన్నా కేకలకన్నా
అల్లరికన్నా గడబిడకన్నా
అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే
ప్రేమ తబలా ఢోలకులే
అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే
ప్రేమ తబలా ఢోలకు మోతలే
దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ
దుమ్ము దుకాణం
దుం దుం దుం దుకాణం
అరె దుముకు దుముకు దుం
దుం దుం దుం దుకాణం
పనిస గరిగమగమపమగరిగమప
నిరినిస నిదమగరి గనిసమమగరి
మమగరి మమగరినిస
మమప నిసగమపనిస
చెట్టూ ఊగింది, ఆటకు చేనూ ఊగింది
పిట్టా ఊగింది, కోడిపెట్టా ఊగింది
ఆ చెట్టూ పిట్టా ఇల్లు గడప
తలుపు కిటికీ అన్నీ ఊగి…..
పక్కూరు పై ఊరు పొరుగూరు ఇరుగూరు
జిల్లాలో పాతికూల్ల పైదాక
పక్కూరు పై ఊరు పొరుగూరు ఇరుగూరు
జిల్లాలో పాతికూల్ల పైదాక
పాకింది చూడు, పాకింది చూడు
పాకింది చూడు
దుమ్ము దుకాణం, దుమ్మారె దుమ్మ
దుమ్ము దుకాణం
దుం దుం దుం దుకాణం
అరె దుముకు దుముకు దుం
దుం దుం దుం దుకాణం
ఇంకా ఇంకా పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: యం.యం.కీరవాణి
గానం: సత్యయమిని, మమన్ కుమార్
ఇంకా ఇంకా దూరమే మాయమౌతుంటే
ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే
తెలియని భావమేదో మనసులో
తొంగిచూసి మౌనమే చెరిపివేస్తుంటే
మాటలై పలకరిస్తుంటే
నిన్ను చూసి… నన్ను చూసి
చెప్పాలని, చెప్పాలని
అనిపిస్తుందే… ఏమని?
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇపుడే ఇపుడే నీకు నేననీ
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీ
ఇంకా ఇంకా దూరమే మాయమౌతుంటే
ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే
తెలియని భావమేదో మనసులో
తొంగిచూసి మౌనమే చెరిపివేస్తుంటే
మాటలై పలకరిస్తుంటే
నిన్ను చూసి… నన్ను చూసి
చెప్పాలని, చెప్పాలని
అనిపిస్తుందే… ఏమని?
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇపుడే ఇపుడే నీకు నేననీ
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీ
సీసా మూత ఇప్పు పాట సాహిత్యం
చిత్రం: నా సామిరంగా (2024)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: రేవంత్, మల్లికార్జున్, సచిన్, లోకేష్, హైమత్, అరుణ్ కౌండిన్య
పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటే
ప్రేమ బండి చలో అంటే
రైస్ మిల్లు నెల జీతం
రై రైమని పెరిగిందంటే
ఫెవరేట్ హీరో బొమ్మ
హౌస్ ఫుల్లు పడిందంటే
ఇండియా కప్పు కొట్టుకొస్తే
ఇల్లాలే రాజీకొస్తే
పక్కింటోడికి లాసొస్తే
హ హ ఆడ్ని ఓదార్చే ఛాన్సే వస్తే
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు
బోరు కొడితే బీరు కొట్టు
బాధ పడితే బ్రాందీ కొట్టు
ఇసుకు పుడితే ఇస్కీ కొట్టు
మూడంతా పాడైపోతే
పై మూడు కలిపి కొట్టు
కట్టుకుందాన్తో కల్లే కొట్టు
అన్నదమ్ముల్తో జిన్నే కొట్టు
సోదర సోదర అన్నోల్తో
సోడా కలిపి కొట్టు
రా రా పోరా అన్నోల్తో
రా గానే కొట్టు
మనకన్నా పెద్దోల్లొస్తే
మస్కా కొట్టు… సాటుగ మందే కొట్టు
మొదటి పెగ్గు ఎయ్యగానే
మత్తు కమ్ముకొస్తాది
రెండో పెగ్గు పడగానే ఒళ్ళు తేలిపోతాది
మూడు నాలుగైదు పెగ్గులు
గొంతులోకి దిగగానే…
నా సామిరంగ…
సిత్రాలే సిత్రాలు
నా సామిరంగ…
పెరటిలోని పిల్లి కూన బౌ బౌ అంటాది
నూతిలోని సేపపిల్ల సుట్ట కాల్చుతాది
సేతిలోని ఇసనకర్ర
సికెను ముక్కై పోతాది
మూలకున్న ఇసుర్రాయి
ఎండి కంచమే అది
తొంబై రూపాయల నోటు
జేబులోంచి జారుతాది
తొడుక్కున్న గల్ల లుంగీ
సొక్కా అయిపోతది
ఆ ముంగటేడు పోయిన
మా ముసలి తాత ఎదరకొచ్చి
ఏరా అబ్బీ..! తినలేదా, ఏమి తాగట్లేదా
బక్క సిక్కి పోయావు..! ఏందిరా ఇదీ?
అని పలకరిస్తాడు,
ప్రేమగ హెచ్చరిస్తాడు…
ఈ మందుని కనిపెట్టినోడు యాడున్నాడో
అరెరెరె మందుని కనిపెట్టినోడు యాడున్నాడో
ఆడి కంటికి ముక్కుకి సెవులకి
కాళ్ళకి మూతికి సేతులకి
దండాలెట్టి, అరెరెరె దండాలెట్టి
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు
ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు