చిత్రం: చిరంజీవ (2025) సంగీతం: అచ్చు రాజమణి నటీనటులు: రాజ్ తరుణ్, కుషిత కల్లపు దర్శకత్వం: అభినయ కృష్ణ నిర్మాతలు: రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ విడుదల తేది: 07.09.2025
Chiranjeeva (2025)
Palli Balakrishna
Saturday, May 2, 2026
-->
చిత్రం: చిరంజీవ (2025) సంగీతం: అచ్చు రాజమణి నటీనటులు: రాజ్ తరుణ్, కుషిత కల్లపు దర్శకత్వం: అభినయ కృష్ణ నిర్మాతలు: రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ విడుదల తేది: 07.09.2025
చిత్రం: మంత్ ఆఫ్ మధు (2023) సంగీతం: అచ్చు రాజమణి నటీనటులు: నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయా నవిలే దర్శకత్వం: శ్రీకాంత్ నగోటి నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల విడుదల తేది: 2023
Songs List:
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022) సంగీతం: అచ్చు రాజమణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అనూప్ రూబెన్స్ నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ దర్శకత్వం: రాకేష్ శశి నిర్మాత: బన్నీ వాసు విడుదల తేది: 04.11.2022
Songs List:
ధీంతనన ధీంతనన పాట సాహిత్యం
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: పూర్ణాచారి గానం: సిద్ శ్రీరాం అనగా అనగనగ కనులే కలగనగా నిజమయ్యే మెరుపల్లే వాలెగా నా ఊపిరి నడక తన ఊపిరి జతగ కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా అరెరే అరెరె మనసే అదిరే నీవల్ల నాలోన ఈ అల్లరే ఎవరే ఎవరే కుదురే చెదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మెహమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నను నేను దాస్తున్నానెందుకో..! ధీంతనన ధీంతనన నీచూపుల దాడి చేసిందే చేసిందే ఈ గారడి ధీంతనన ధీంతనన నన్నే నే వీడి నీతో కలిసే (2) నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింట ఓ స్పర్శకే పొంగి పోతానట కాలం కలిపింది ఈ జోడి బాగుందని ప్రాణం అడిగింది నీతోడు సాగాలని దూరం దూరం అయ్యే దారే చూపిస్తుంది ఒకటవ్వనే, ఓ ఓ ఓ ఓ ధీంతనన ధీంతనన నీచూపుల దాడి చేసిందే చేసిందే ఈ గారడి ధీంతనన ధీంతనన నన్నే నే వీడి నీతో కలిసే ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళతాళాలుగా రాయబారాలు పంపాను నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ఈ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ ధీంతనన ధీంతనన నీచూపుల దాడి చేసిందే చేసిందే ఈ గారడి ధీంతనన ధీంతనన నన్నే నే వీడి నీతో కలిసే
మాయారే ఈ అమ్మయిలంతా పాట సాహిత్యం
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: రాహుల్ సిప్లిగంజ్ పోరిల ఎంట పోకు ఫ్రెండు ఆడుకుంటరు నిన్నో రౌండు ఎందుకలా వై వై ఎందూకలా పడిపోకురా ఇస్తే స్మైలు బతుకైతది గూడ్స్ రైలు ఎందుకలా వై వై ఎందూకలా చేసేదంతా చేసేసి జారుకుంటదమ్మాయి దిక్కు మొక్కు ఏం లేక బారుకాడ అబ్బాయి మాయారే ఈ అమ్మాయిలంతా మాయారే గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే మాయారే ఈ అమ్మయిలంతా మాయారే మాయ మాయ మాయ మాయ జిందగీ గయా గయా మాయ మాయ మాయ మాయ బతుకే గయా గయా ఏ ఆకలుండదు నిద్దరుండదు వీళ్ళ వల్ల మైండే దొబ్బి లైఫే ఉండదు ఫ్రెండు అంటరు లవ్వు అంటరు డైలీ వాట్సాప్ స్టాటస్ లాగ మారిపోతారు మంటల కలిసి పోయేది మనం మనల్నే తిడతారు ఎర్రి జనం పబ్జీ లాగ ఆడేస్తు బుజ్జికన్న అంటారు బ్రిడ్జిలాగా మనముంటే రైలే ఎక్కి పోతారు మాయారే ఈ అమ్మయిలంతా మాయారే గాయలే ఈళ్ళతోటి పెట్టుకుంటే గాయలే మాయారే ఈ అమ్మయిలంతా మాయారే మాయ మాయ మాయ మాయ జిందగీ గయా గయా మాయ మాయ మాయ మాయ బతుకే గయా గయా పోరిల ఎంట పోకు ఫ్రెండు ఆడుకుంటరు నిన్నో రౌండు ఎందుకలా వై వై ఎందూకలా పడిపోకురా ఇస్తే స్మైలు బతుకైతది గూడ్స్ రైలు ఎందుకలా వై వై ఎందూకలా ఎందూకలా ఎందూకలా ఎందూకలా వద్దుర పోరిల జోలికి పోరి దూల తీర్చి పోతది ఫుల్ టార్చరు పెడ్తది మెంటల్లీ ఇగ రాడ్డేరా జిందగి టోటల్లీ వీళ్ళ ఫోన్లు బ్లాకైపోను వీళ్ళ అకౌంట్లు హ్యాకైపోను షాపింగ్ మాల్లు లాకైపోను పబ్బుల్లో పోరిల్ని చెయ్యాలి బ్యాను మేకప్ కిట్లు కాకెత్క పోను బ్యూటీ పార్లర్లు బందైపోను కురాళ్ళ ఉసురు వీళ్లకి తగిలి ఉన్న జుట్టు ఊడిపోను అమ్మాయిలందరు వచ్చే జన్మల అబ్బాయిలుగ మారిపోను మారిపోను పోను పోను పోను పోను
కలిసుంటే నువ్వు నేనిలా పాట సాహిత్యం
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: కృష్ణకాంత్ గానం: అర్మాన్ మాలిక్ కలిసుంటే నువ్వు నేనిలా కలలాగే ఉంది నమ్మవా ఎప్పటికి నా మనసే ఇక నీకే ఓ ఓ ప్రతి రోజు కొత్త జన్మలా అల్లావే అన్ని వైపులా నిను చూసే ప్రతిసారి పడతానే ఓ ఓ చెలివే చెలివే సరిపోదే గుప్పెడు గుండె చెలివే చెలివే మరు హృదయం అప్పడిగానే నను తాకే ఊపిరి ఓ ఓఓ అలవాటే అయినది నదిలో అలలా కలిసేపోనీ స స సస స ని ని స కవిత్వాలు నేర్పే సొగసా సస స సస ని ని స ని ని స మాటే మూగబోయెను తెలుసా స సస ని ని స కొంచెం తెలుగునడిగే చూసా సస స సస ని ని స ని ని స సరిపోదులే పొగడగా ఓ భాష వెతికే నన్నే నన్నే కదిలే అద్ధంలోనే సగమే సగమే దొరికావ్ మసకుంది ఇన్నాల్లే బతికే ఇన్నాళ్లు నే కరిగే ఊహల్లోనే మరిచా మరిచా గతమే వెలుగొచ్చే నీవల్లే ఓ ఓ సొంతం అని అనుకుంటూనే పంతానికి పోతుంటావే కొంచెం కొంచెం చనువే పెంచి నువ్వుండి పోవే సంతోషమే ఇకపై నాదే సందేహమే నాకిక లేదే సమానమై పోదాం రావే నువ్వుండి పోవే స స సస స ని ని స కవిత్వాలు నేర్పే సొగసా సస స సస ని ని స ని ని స మాటే మూగబోయెను తెలుసా స సస ని ని స కొంచెం తెలుగునడిగే చూసా సస స సస ని ని స ని ని స సరిపోదులే పొగడగా ఓ భాష
సీతాకోక చిలుక పాట సాహిత్యం
చిత్రం: ఊర్వశివో రాక్షసివో (2022) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: శ్రీమణి గానం: శ్రీకృష్ణ సీతాకోక చిలుక
చిత్రం: జానకి రామ్ (2022) సంగీతం: అచ్చు రాజమణి నటినటులు: విజయ్ నవీన్ కృష్ణ , కీర్తి సురేష్ దర్శకత్వం: రాంప్రసాద్ రగుతు నిర్మాత: తమటం కుమార్ రెడ్డి విడుదల తేది: 2022
Songs List:
ఒక్కసారి నిన్నే నిన్నే పాట సాహిత్యం
చిత్రం: జానకి రామ్ (2022) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అచ్చు రాజమణి ఒక్కసారి నిన్నే నిన్నే చూడాలని వచ్చానే జానకి
నేను పైటేసిన ఫస్టు రోజే పాట సాహిత్యం
చిత్రం: జానకి రామ్ (2022) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: అవధాని గానం:వైకోమ్ విజయలక్ష్మి నేను పైటేసిన ఫస్టు రోజే మా ఇంటికి పెద్ద నేమొచ్చింది నేను బజారులో నడుస్తుంటే నా ఒంటికి ఫేమొచ్చింది మా అమ్మకు పవరున్న పెద్దసార్లే ఫోనొచ్చింది ఆ బెంజ్ కార్లో బ్లాంక్ చెక్కు ఇంటికొచ్చింది కరెన్సీలూ కార్లు అక్కర్లేదు ఆస్థులు అంతస్థులు అసలొద్దు (మరి ఏటి కావాలేటి నీకు) ఎట్టా చెప్పనయ్యో వయసే వచ్చింది పదిహేడు ఇంకా నచ్చలేదే నాకు ఇట్టాంటి కుర్రాడు ఎట్టా చెప్పనయ్యో వయసే వచ్చింది పదిహేడు ఇంకా నచ్చలేదే నాకు ఇట్టాంటి కుర్రాడు కంటి నిండా కునుకు లేదు ఒంటికేమో అంటు లేడు నిద్దరైనా పడతలేదు ఒంటి పానం ఉంటలేదు (సరె సరే ఎలాంటోడు కావాలేటి నీకు) అద్ధంలాంటి… దగదగ అద్ధంలాంటి నిగనిగ అద్ధంలాంటి అందం నాది బద్దలుకొట్టే వాడు మొగోడే నా అందం చందం బద్దలుకొట్టే వాడు మొగోడే నిద్దర రాని సంపద నాది బద్దలుకొట్టే వాడు మొగోడే నా లెఫ్ట్ రైటు చూపు చూసే వాడు కుర్రోడే నా ఫ్రంట్ బ్యాక్ చూపు చూసే వాడు చిన్నోడే (అబ్బా దీనికి ఈడున్నోడు ఎవడూ సరిపోయేటట్టు లేడురోయ్) ఆదివారం నాడు వత్తనె పిల్ల నీకు అద్ధం బరినెలు తెత్తనె పిల్లా సోమవరం నాడు వత్తనె పిల్ల నీకు చీర జాకెట్టు తెత్తనె పిల్లా మగళవారం నాడు వత్తానే పిల్ల నీకు మువ్వల పట్టీలు తెత్తనె పిల్లా బుధవారం నాడు వత్తనే పిల్ల నీకు బంగారు గొలుసులు తెత్తనె పిల్లా ఒయ్, గురువరం నాడు వత్తనే పిల్ల నీ సేతికి గాజులు తెత్తనె పిల్లా శుక్రరాం నాడు వత్తనే పిల్ల నీ చెవులకు దుద్దులు తెత్తనె పిల్లా శనివారం నాడు వత్తనె పిల్ల నిన్ను సినిమాకే తీసుకెల్తనె పిల్లా, ఒయ్ వాడు టచ్ చేస్తే… (ఆహా టచ్ చేస్తే) వాడు టచ్ చేస్తే… (ఏంటి టచ్ చేస్తే) వాడు టచ్ చేస్తే… చీర కొంగులు జారిపోవాలి వాడి రాపిడికి… రైక ముడులు ఊడిపోవాలి హొయ్, ఆదివారం వాడు రావాలి ఆ, ఆత్రంగా నా వంక చూడాలి సోమవారం వాడు రావాలి నా చీర చెంగును లాగాలి మగళవారం వాడు రావాలి ముగ్గులోకి నన్ను దించాలి బుధవారం వాడు రావాలి నా బుగ్గని గిల్లి పోవాలి గురువారం వాడు రావాలి నా గుండెని మీటి పోవాలి శుక్రవారం వాడు రావాలి నా ఒంటికి చెమటలు జారాలి
తొలి తొలిగా పాట సాహిత్యం
చిత్రం: జానకి రామ్ (2022) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: వశిష్ట శర్మ గానం: రాహుల్ నంబియర్ ఓఓ ఓ ఓ ఓ ఓ హో ఓఓ ఓ ఓ ఆ ఆ హా తొలి తొలిగా మొదలైనదే మొదలైనదే కనులు ఇలా నిన్నే చూసిన మనసే నమ్మదే నా ఊపిరంత నన్ను వీడి పోతు ఉన్నది నీ నీడలాగా నిన్ను చేరి నీతో ఉన్నదే కన్నుల్లోనా వెన్నెల్లోనా గుండెల్లోనా నువ్వే నిందావే దిర ధీంతనాన ధీంతనాన దిరన ధీంతనాన ధీంతనాన దిరన ధీంతనాన ధీంతనాన ధీంత ధీంతనా ఇప్పుడే ఇక్కడే కొత్తగా ఉన్నదే ప్రపంచాన్ని మార్చేసిందే అది నీమాయేలే ఎందుకో ఇప్పుడే గుండెలో చప్పుడే హటాత్తుగా పెరిగిందేంటో అంతా నీవల్లే కాలం నీవైపే నేడుతు ఉందే నీ అడుగుల్లో అడుగేయమందే క్షణమైన ఆగని తొందర నీతో మొదలైందే చూపులే నన్నిలా నేరుగా తాకగా మరో జన్మల పుట్టిందే మనసే ఇవ్వాలె చిన్నగా నువ్విలా నవ్వితే చాలుగా ఆ నవ్వులో తేలిందే నా ప్రాణం నీవల్లే నా ఊహలు నువ్వే… నా ఊపిరి నువ్వే ఆశలు పంచె నిజమయ్యావే నాకోసమే నువ్వంటూ పరిచయమయ్యావే
చిత్రం: రారా... కృష్ణయ్య (2014) సంగీతం: అచ్చు రాజమణి నటీనటులు: సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, జగపతి బాబు, కళ్యాణి దర్శకత్వం: మహేష్. పి నిర్మాతలు: వంశీ కృష్ణ, శ్రీనివాస్ విడుదల తేది: 04.07.2014
Songs List:
హీరో హీరో పాట సాహిత్యం
చిత్రం: రారా... కృష్ణయ్య (2014) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: కార్తీక్ , అచ్చు రాజమణి హీరో హీరో
రా రా కృష్ణయ్య పాట సాహిత్యం
చిత్రం: రారా... కృష్ణయ్య (2014) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అచ్చు రాజమణి, శ్రేయా ఘోషల్ , యాజిన్ నిజార్ రా రా కృష్ణయ్య
ఓనం ఓనం పాట సాహిత్యం
చిత్రం: రారా... కృష్ణయ్య (2014) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: శ్రీ మణి గానం: అచ్చు రాజమణి, చిన్మయి ఓనం ఓనం
వడరేయ్ మచాన్ పాట సాహిత్యం
చిత్రం: రారా... కృష్ణయ్య (2014) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: శ్రీ మణి గానం: సుచిత్ర, అచ్చు రాజమణి వడరేయ్ మచాన్
Come on Baby పాట సాహిత్యం
చిత్రం: రారా... కృష్ణయ్య (2014) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: భాస్కరభట్ల గానం: సౌమ్య, శ్రీ చిత్ర, సూరజ్ సంతోష్ Come on Baby
సీతా కల్యాణం పాట సాహిత్యం
చిత్రం: రారా... కృష్ణయ్య (2014) సంగీతం: అచ్చు రాజమణి సాహిత్యం: Treditional గానం: మహతి సీతా కల్యాణం