-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "1955"



చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, షావుకారు జానకి 
దర్శకత్వం: పి.పుల్లయ్య
నిర్మాత: డి.ఎల్.నారాయణ 
విడుదల తేది: 26.08.1955



Songs List:



సరసుడా దరి చేరరా పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం 
గానం: పి.సుశీల 

సరసుడ దరిజేరరా
సమయమిదె
మన సరసాల కిదివేళ చలమేలరా

వలచినదానర నే చిన్నదానరా
పిలచిన బిగువేలరా నన్నేలరా

చక్కెర విలుకాని బారి వేసారి
మక్కువతో నిన్నె మనసారకోరి
చేరితి నీచెంత దయగనుమావంత
మురిపించి మరపించరారా
జాగేలరా 





బొమ్మల పెళ్లి పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం: పద్మప్రియ 

చేదామురారే కళ్యాణము
చిలకా గోరింక పెళ్లి సింగారము
ఎవరే మీ చిన్నారి పెళ్లికూతురు
ఎవరమ్మ  వయ్యారి! పెళ్ళికూతురు

కన్నులలో దాచేనే కన్నెసిగ్గు దొంతరలు
నవ్వులలో పూచేనే! మల్లెపూల మంజరులు
ఇదిగో! మీ చిన్నారి పెళ్ళికూతురు
ఇదిగో ! మీవయ్యారి పెళ్ళికూతురు

సొగసూ! సోయగమూ! చూచిచూచి మెచ్చాము-కోరికోరి వచ్చాము
నగలెన్నొ చీరలెన్నొ నాణెమైన విచ్చేము-సారెలెన్నో తెచ్చేము
ఈడుజోడు వరుడైతే - చూడ అందగాడైతే
అదేమాకు పదివేలు - ఆదే కోటివరహాలు

మనసిచ్చే మగడైతే ఇస్తారా కానుక ?
సరేసరే
మరువాల మురిపాల మగువే మాకానుక!

సరేసరే ! బలేబలే !
మనసూ వయసూ కలిసే
మంచిమనువు కుదిరెనే॥
చేదామురారే! పెళ్లి విందులు
చూదామురారే ! ఆ పసందులు




నాగుల చవితి పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: బసవరాజు అప్పారావు 
గానం: ఎన్.ఎల్.గాన సరస్వతి 

నాగులచవితికి నాగేంద్రనీ
పొట్టనిండా పాలుపోసేము తండ్రి!
నీ పుట్టదరికి పాపలొచ్చేరు
మా పాపలొచ్చేరు
పాపపుణ్యముల వాసనేలేని
బ్రహ్మస్వరూపులౌ పసికూనలోయి
కోపించి బుస్సలు కొట్టబోకోయి
అటుకొండ ఇటుకొండ
ఆ రెంటినడుమ
నాగులకొండలో నాట్యమాడేటి
దివ్యసుందరనాగ దేహీయన్నాము
కనిపెట్టి మమ్మెపుడు కాపాడవోయి




చిటారు కొమ్మను పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల

పల్లవి:
చిటారు కొమ్మను చిటారు కొమ్మను
మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
హోయ్ చిటారు కొమ్మను

చరణం: 1
పక్కను మెలిగే చక్కని చుక్కకు
చక్కిలిగింత లేదేం గురుడా
కంచు మోతగా కనకం మోగదు
నిదానించరా నరుడా
వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
హోయ్ చిటారు కొమ్మను

చరణం: 2
పండంటి పిల్లకు పసుపు కుంకం
నిండుకున్నవేం గురుడా
దేవుడు చేసిన లోపాన్ని
నీవు దిద్దుకురారా నరుడా
కొద్దిగ హద్దు మీరరా నరుడా
చిటారు కొమ్మను మిఠాయి పొట్లం
చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
హోయ్ చిటారు కొమ్మను

చరణం: 3
విధవలందరికి శుభకార్యాలు
విధిగా చెయమంటావా గురుడ
అవతారం నీదందుకోసమే..ఏ..
వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
హోయ్ చిటారు కొమ్మను




ఆనందం అర్ణవమైతే పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: పి.సుశీల 

పల్లవి: 
ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే
అనురాగపు తంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.

చరణం: 1
నీ కంకణ నిక్వాణం_లో,
నా జీవన నిర్వాణం_లో
నీ మదిలో డోలలు తూగీ,
నా హృదిలో జ్వాలలు రేగీ
నీ తలపున రేకులు పూస్తే,
నా వలపున బాకులు దూస్తే
మరణానికి ప్రాణం పోస్తాం,
స్వర్గానికి నిచ్చెన వేస్తాం

చరణం: 2
హసనానికి రాణివి నీవై
వ్యసనానికి బానిస నేనై
విషమించిన మదీయ ఖేదం
కుసుమించిన త్వదీయ మోదం

విషవాయువులై ప్రసరిస్తే,
విరితేనియలై ప్రవహిస్తే
ప్రపంచమును పరిహాసిస్తాం,
భవిష్యమును పరిపాలిస్తాం

ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే
ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం




పూర్ణమ్మ కథ పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: గురజాడ అప్పారావు 
గానం: ఘంటసాల

పుత్తడిబొమ్మా - పూర్ణమ్మ
మేలిమి బంగరు మెలతల్లారా !

కలవల కన్నుల కన్నెల్లారా!
తల్లులగన్నా పిల్లల్లారా !
విన్నారమ్మా యీ కథను !
కొండలనడుమను కోనొకటుంది
కోనకినడుమా కొలనొకటుంది

కొలనిగట్టున కోవెలలోపల
వెలసెను బంగరు దుర్గమ్మ

పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడిబొమ్మా పూర్ణమ్మ
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజకు పువ్వులు కోసేది
ఏయేవేళల పూసే పువ్వుల
ఆయావేళల అందించి
బంగరు దుర్గను భక్తితో కొలిచెను
పుత్తడిబొమ్మా పూర్ణమ్మ

వచనం : అందాల చందమామలా గుణాలకి రత్నాల రాశిలా, నలుగురి కన్నుల్లో కనుపాపై - నట్టింట దీపమై వెలుగుతున్న పూర్ణమ్మను - అప్పుడేంచేసారయ్యా అంటే

కాసుకులోనై తల్లి దండ్రి
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడిబొమ్మను పూర్ణమ్మను వొక
ముదుసలి మొగుడుకు ముడివేస్ట్రీ
||పుత్తడిబొమ్మ||

ముద్దునగవులూ మురిపెంబు మరి
పెనిమిటిగాంచిన నిమిషమున

బాసెను కన్నియముఖ కమలమ్మును
కన్నుల గ్రమ్మెను కన్నీరు.
ఆటలపాటలతోటి కన్నియలు
మొగుడు తాతయని కేలించ
ఆటలపాటల కలియక పూర్ణమ
దుర్గనుచేరి దుఃఖించె !

వచనం : తల్లిదండ్రులు గట్టిన గుదితాడు విప్పడానికి వశమా ? తప్పడానికి వశమా ? గొల్లుగొల్లున ఏడ్చింది?
గుండె రాయిజేసుకొని ఓర్చింది.
పుత్తడిబొమ్మా - పూర్ణమ్మ

కొన్నాళ్లకు పతి కొనిపోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమను
చీరలు సొమ్ములు చాలగ దెచ్చెను.
పుత్తడిబొమ్మను పూర్ణమను

అపుడేం చేసిందయ్యా అంటే

పెద్దలకప్పుడు మొక్కెను పూర్ణమ్మ 
తల్లి దండ్రి దీవించి
దీవనవింటూ పక్కున నవ్వెను
పుత్తడిబొమ్మా పూర్ణమ్మ

10 చిన్నలనందరి కౌగిట జేర్చుకు
కంటను బెట్టెను కన్నీరు
అన్నల దముల నప్పుడు పలికెను
పుత్తడిబొమ్మా పూర్ణమ్మ



11 అన్నల్లారా! తమ్ముల్లారా
అమ్మను అయ్యను కానండి
బంగరుదుర్గను భక్తితో కొల
వండమ్మలకమ్మా దుర్గమ్మ

12 నలుగురుకూచుని నవ్వేవేళల
నాపేరొకతరి తలవండి
మీ మీ కన్నబిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి

13 బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడిబొమ్మకు పూర్ణమకు
కన్నులు తుడుచుకు కలకలనవ్వెను
పుత్తడిబొమ్మ! పూర్ణమ్మ

14 వగచిరి వదినలు వగచిరి తమ్ములు
తల్లియుకంటను తడిబెటెన్
కాసుకులోనై అల్లుని తలుచుకు
ఆనందించెను అయ్యొకడె!

15 ఎప్పటియట్టుల సాయంత్రమున
ఏరిన పూవులు సరిగూర్చి
సంతోషంబున దురను కొలువను
ఒంటిగబోయెను పూర్ణమ

16 ఆవులు మొదవులు మందలుజేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటలు చుక్కలు మెరయుచు డమెను
పూర్ణమ యింటికి రాదాయె!

17 కన్నుల కాంతులు కలవల జేరెను
మేలిమిజేరెను మేనిపసల్
హంసలజేరెను నడకల బెడగులు
దుర్గనుజేరెను పూర్ణమా
పుత్తడిబొమా ! పూర్ణమ్మ






ఇల్లు ఇల్లానీవు పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: గురజాడ అప్పారావు 
గానం: ఎన్.ఎల్.గాన సరస్వతి 

ఇల్లు ఇల్లనియేవు - ఇల్లు నాదనియేవు
నీ యిల్లు యెక్కడే - చిలుకా
ఊరికి వుత్తరాన సామాధిపురములో
కట్టెయిల్లన్నదే చిలుకా
ఎన్నాళ్లు బ్రతికినా ఏమిసామ్రాజ్యమే కొన్నాళ్ళకోరామచిలుకా

మూణ్ణాళ్ల బ్రతుకునకు, మురిసేవు త్రుల్లేవు
ముందుగతి కానవే చిలుకా
కఱ్ఱలే చుట్టాలు కట్టెలే బంధువులు
కన్నతల్లెవ్వరే చిలుకా 

మోసేరు నలుగురు! వెంబడిని పదిమంది (నిన్ను)
వెంటనెషరూరారు చిలుకా
కాలిపోయేదాక కావలుందురుగాని
కడకు తొలగొత్తురె చిలుకా 
వెంటనెవరూరారు చిలుకా
రామచిలుక రామచిలుక






కీచక వధ పాట సాహిత్యం

 
చిత్రం: కన్యాశుల్కం (1955)
సంగీతం: ఘంటసాల 
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: మాధవపెద్ది సత్యం,  ఎన్.ఎల్.గాన సరస్వతి 

వచనం: 
ఈ ప్రకారంబుగా సుధేష్ఠాదేవి కొలువులోనున్న ద్రౌపదిని
గాంచి - కీచకుడు మోహింప - తమ్ముని మనస్సును మార్పజాలక మద్యం తెచ్పు నెపంబున, సుధేష్ణ ఆమెను కీచకుని మందిరంబున కనుప ద్రౌపది వెడలుచున్న తెరంగెట్టిదనిన --

సైరంధ్రి వెడలె సైరంధీ సభకూ
మదమరాణిగమన - వెడలే
కాలియందియలు ఘలుఘలుఘల్లన
కనిన చూపరులగుండెలు ఝల్లన
సైరంధ్రి-మద్యము తెమ్మని మహారాణి నన్నంపె
మన్నించి వేవేగ పంపించుమన్నా రాణీ
తాపము తొలగించుమన్నా -
కీచక - తరుణికొ నినుగని తాపము గొనియుంటి
కరుణించి పగదీర్చవే - బయ్యారిభామా !
కౌగిటనను జేర్చవే

సైరంధ్రి.మగనాలిగోరా - మరణమె నీకగురా .
కీచక - ఏమైనాగానీ భామరొ నిను వీడనే
సైరంధ్రి విడరా
శ్రీచక వీడనే

Palli Balakrishna Friday, June 10, 2022



చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: పి. ఆదినారాయణ
మాటలు, పాటలు: సముద్రాల
నటీనటులు:  నాగేశ్వరరావు, కన్నాంబ, సురభి బాలసరస్వతి, హేమలత
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
నిర్మాత: పి. ఆదినారాయణ, అంజలీదేవి 
విడుదల తేది: 28.04.1955



Songs List:



జీవితమే సఫలమ పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం: జిక్కీ 

జీవితమే సఫలమూ - రాగ సుధా భరితమూ
ప్రేమకధా మధురమూ

హాయిగా తీయగా ఆలపించు పాటల
వరాల సోయగాల ప్రియుల వలపుగొలుపు మాటల
అనారు పూలతోటల ఆశ దెలుపు ఆటల

వసంత మధురసీమల ప్రశాంత సాంధ్య వేళల
అంతులేని వింతలు అనంత ప్రేమలీలల
వరించు భాగ్యశాలుల - తరించు ప్రేమజీవుల




రావోయి సఖా ! పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం:  ఏ.ఏమ్. రాజా, జిక్కీ

సిపాయీ! బిరాన రావోయీ!
మన తరాన ప్రేమ పరువు
మాయరాదోయి రావోయి సఖా
రావోయి సఖా ! నీ ప్రియసఖి -- చేరగదోయి
లోకానికి మన ప్రేమ విలువ తెలుపు సిపాయి
పరుప నిలుపు సిపాయి

రారాజునకూ, నీ చెలికీ పడెను లడాయీ
రాజాలవనీ, పొదుషహా - పలికె బడాయీ
రానింతుననీ పంతము నే పలికితినోయీ
లోకానికి మన ప్రేమ విలువ - తెలుపు సహా
పరువు నిలుపు సిపాయీ

మన ప్రేమలు మన బాసలు మరువకుము సఖా!
జన నాధుని జడిపింపుల వెరువకుము సఖా!
పెను గాలివలే పరుగుడి రావోయి సఖా!
లో కానికి మన ప్రేమవిలువ తెలుపు సిపాయీ
పరువు నిలుపు సిపాయీ

కలిగించకు నీ ప్రియతమకూ - పరాభవాలు
కలిగించుము నీ ప్రభువునకు - పరాజయాలు
విస్తుతించును నీ ధీరతనూ ముందుతరాలు
రావోయి సఖా ! రావోయి సఖా !
రావోయి సిపాయీ!- రావోయి సిపాయీ !



నను కనుగొనుమా పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం:  జిక్కీ

ఓ ప్రియతమా !
మరువకుమా ! ప్రేమా  రావో ప్రియతమా !

నను కనుగొనుమా  కొనుమా
మది మరువకుమా ! ప్రేమా !       ||రావో॥

దరిజేర నేరవా - చెరమాపజాలవా
చే జారెనేని నీవు - చెలి జాడ కానలేవు

వెలలేని నాదుసౌరు - వెలపోయ బూనినారు
బ్రతుకాయె నడిబజారు. ఆయే, మది బేజారు 

అందాలు జాలువారే - మురిపాల పూలబాల.
పసదూలి కటికవానీ - పాదాలు పాలుగానా





సోజా, నా మనోహారీ పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం:  

సోజా, నా మనోహారీ సోజా,
సోజా, సుకుమారీ సోజా

జోగే పూవులు తీగలాగ
తూగే తుమ్మెద రాగ లాగ
ఆదమరచి హాయిగా

విరిసే వెన్నెల కోటలోన 
మురిసే కన్నుల కాపులోన
రాకుమారి తీరునా

ఎవరూ నీ దరిజేరలేరు 
మనలా వేరు చేయలేరు
ఆదమరచి హాయిగా



ప్రేమా జగాన పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం:  జిక్కీ

ఓ వరాల సిపాయీ!
కలవోలె మన "ప్రేమ కరిగి పోవునా ! -
మలి చూపులోనే మరిగి మాయమానా!

హా ... ప్రేమా జగాన, వియోగానికేనా!!
ఇల వేల్పు లొసగే వరా లీవిధాల
నులి వేడి కన్నీటి సెలయేటిజాల
హా... ప్రేమాజగాన విషాదాంత మేనా...

ప్రేమాజగాన వియోగాని కేనా
ప్రేమగాధ విషాద ంత మేనా
హా... ప్రేమగాధ విషాదాంత మే నా
కధమారిపోయె, కలలు మాసిపోయె
ఆకాశ సౌధాలు యిలకూలిపోయె
గతిలేని యీ పేద బ్రతుకారిపోయె

ప్రేమాజగా నా వియోగానికేనా
హా ... ప్రేమ గాధ విషాదాంత మేనా
జగమేలు జాలు మహారాజు పెన
పగయేల యీ లీల బాధింప నేల
బలి సేయుదానా ప్రాణాలనై నా
బతికించు షహజాదనూ! ఐ ఖుదా
నీకో సలామో ఖుదా ఐ ఖుదా



ఖులాసాల సరసాల పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం:  జిక్కీ

ఖులాసాల సరసాల కురిపింతురా!
ఖుషీ గా విలాసాల మురిపింతురా !
హమేషా తమాషాల అలరింతురా!
అందచందాలుగనీ ఆదరించు నారాజా !
అందాల ఆనందం అందుకో నారాజా!

రంగారు సింగారముల రాసలీల
పొంగారు సంగీతముల రాగమాల
చెంగుచెంగని యాడు నాట్యాలమాల

ఉంగరంగేలిగా లాలింపరా
కొంగుబంగారుగా కులికింపరా
జగన్మోహనాంగ దరిజేరరా




రాజ శేఖరా! పాట సాహిత్యం

 
చిత్రం: అనార్కలి (1955)
సంగీతం: ఆదినారాయణ
సాహిత్యం:: సముద్రాల
గానం: ఘంటసాల , జిక్కీ

మదన మనోహర సుందర నారీ !
మధుర దరస్మిత నయన చకోరీ !
మందగమన జిత రాజమరాళీ
నాట్యమయూరీ ! అనార్ కలీ ! అనార్ కలీ ! ఆనార్ కలీ ! .

రాజ శేఖరా! నీపై మోజు తీరలేదురా
రాజసాన యేలరా!

మనసు నిలువ నీదురా!
మమత మాసిపోనుకా!
మధురమైన బాధరా !
మరపురాదుగా!

కాని దానకానురా !
కనుల నైన కానరా!
జాగు సేయ నేలరా !
వేగ చేరదీయరా!
చేరరార! 
చేరరార!
చేరరార!





కలిసే నెలరాజు పాట సాహిత్యం

 
Song Details




కలవారి హృదయాలు పాట సాహిత్యం

 
Song Details




ఆనందమే అందాలు పాట సాహిత్యం

 
Song Details




మా కథలే పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Tuesday, September 28, 2021





చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
నటీనటులు: నాగేశ్వర రావు , షావుకారు జానకి
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాత: C.V.R.ప్రసాద్
విడుదల తేది: 14.04.1955



Songs List:



ఓలియో ఓలి ఓలియో ఓలి పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల

ఓలియో ఓలి ఓలియో ఓలి




ఇదియే హాయి కలుపుము పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: ఘంటసాల, జిక్కీ

ఇదియే హాయి కలుపుము 



ఏరువాక సాగారో అన్నో చిన్నన్న పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు
గానం:  జిక్కీ

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కల్ల కపటం కానని వాడ
లోకం పోకడం తెలియని వాడ
కల్ల కపటం కానని వాడ లోకం పోకడం తెలియని వాడ
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని
నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని
ముళ్లు గర్రను చేతబట్టుకొని ఇల్లాలునీ వెంటబెట్టుకొని
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పడమట దిక్కున వరద గుడేసె ఉరుముల మెరుపుల వానలు గురిసె
పడమట దిక్కున వరద గుడేసె ఉరుముల మెరుపుల వానలు గురిసె
వాగులు వంకలు ఉరవడి జేసె ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పోటేరును కరి జూచి పన్ను కోయల పటదాపట ఎడ్ల దోల్నుతో
హై హై హై హై.
రాళ్లు తప్పక కొంత వేటుతో విత్తనము విసిరిసిరి జల్లుకో
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పొలాలమ్ముకొని పోయేవారు టౌనులో మేడలు కట్టేవారు
బ్యాంకులో డబ్బును దాచేవారు ఈ చట్టిని గమనించరు వారు
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పల్లెటూళ్లలో చల్లనివాళ్లు
పాలిటిక్కిుస్ తో బతికే వాళ్లు ప్రజాసేవయని అరచేవాళ్లు
ప్రజాసేవయని అరచేవాళ్లు వొళ్లు వంచి చాకిరికి మళ్లరు
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పదవులు తిరమని బ్రమిసే వాళ్లే
కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే
నీవే దిక్కని వత్తురు పదవోయ్
నీవే దిక్కని వత్తురు పదవోయ్ రోజులు మారాయ్
రోజులు మారాయ్ మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న




రండయ్య పోదాము పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: కొసరాజు
గానం:  ఘంటసాల

రండయ్య పోదాము 



మారాజు వినవయ్య పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: ఘంటసాల, జిక్కీ

మారాజు వినవయ్య 



చిరునవ్వులు విరిసే పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: ఘంటసాల, జిక్కీ, కృష్ణ కుమారి 

చిరునవ్వులు విరిసే 




ఎల్లిపోతుంది ఎల్లి పాట సాహిత్యం

 
చిత్రం: రోజులు మారాయి  (1955)
సంగీతం: మాస్టర్ వేణు 
సాహిత్యం: తాపీ ధర్మారావు 
గానం: పిఠాపురం

ఎల్లిపోతుంది ఎల్లి 

Palli Balakrishna Wednesday, March 20, 2019



చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
నటీనటులు: కైకాల సత్యన్నారాయణ, జగ్గయ్య, యస్.వి.రంగారావు 
నిర్మాత & దర్శకత్వం: బి.యన్.రెడ్డి 
విడుదల తేది: 19.03.1955



Songs List:



హరికథ సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: 

హరికథ

సీతాదేవి శ్రీరామచంద్రుని మరీమరీ వేడుకోగా-
మిసమిసలాడే పసిడిలేడికయి
మిథిలానందనవేడ
ఆ మిథిలానందనవేడ
విసవిస నా రఘువీర వరేణ్యుడు
వెడలె లేడిజాడ

అది – వెనుకకొక్క పరిజూచి
తన మునిగాళ్ల పైనిలేచి
అట వేచి తన మెడను సాచి
భయమెదను దోచి
తన యొడలు దాచి
మరి – తారి పొదలలో దూరియడవి బం
గారు లేడి పరు గెత్తె

అంతట 
పారు లేడి గని శ్రీరాముడు తన
బాహువులను విల్లెత్తె
రోసముతో రఘురాముడు బాణము
మోసకారిపై వదలె -
హా సీతా ! హా లక్ష్మణా! యని యా
హరిణము ప్రాణము వదలే -

ఆ యార్త నాదమునిని యదరిపడి జానకీదేవి మరదియయిన లక్ష్మణస్వామితో.

తే॥ గీ॥ 
అన్న పొమ్మయ్య, పొమ్ము, నీ యన్నగారి
ఆర్తనాదము వలెదోచునది యదేమొ
నా మనసుకీడు శంకించునయ్య! క్రూరు.
లైన రాక్షసులుందురీ కానలోన!

ఆ పలుకులు విన్న సౌమిత్రి పక్కున నవ్వి, “అమ్మా !”

తెలియక అందువుగానీ ఆ
దేవదేవునకు భయమేమీ
తులువలైన దైత్యులను దునిమి – ఈ
ఇలనుబ్రోవ జనియించె రాముడని॥ తెలియక ||

అన్న మరది మాటలకు ఆపార్ధంబు కల్పించి ఆ సీతా మహిసాధ్వి అనరాని నిష్ఠురో క్తులాడింది

తే॥ గీ॥ 
అవురవుర మాయదారి! నీ యన్నగారి
మోసకారి రక్కసుల పార్టీని, ఇచట
నేమిచేయ దలంచితో యెరుగవచ్చె
కుటిల బుద్ధులు, నీకు దక్కుదునె నేను

అన్న సీతమ్మ పలుకులు చెవులకు ములుకులై సోకిన లక్ష్మణస్వామి, “హరి హరీ!" యని దుఃఖించి, చేయునదిలేక పర్ణశాల వాకిట.. ఏడుగీటులు గీసి, ఏమి
సంభవించినను, వానిని దాటి అడుగు పెట్టకూడదని వదినగారితో పదేపదే చెప్పి, ఒప్పించి అన్నగారు పోయిన మార్గము ననుసరించి తానునూ బయలుదేరెను.
అంతలో అదనుకై ప్రక్కనే పొంచియున్న రావణాసురుడు వృద్ధభిక్షుక వేషంలో
పర్ణశాల ముంగిట నిలిచి, "భవతి భిక్షాందేహీ” అన్నాడు. ఆ కేక విని జానకి దేవి
బిచ్చంతో బైటికివచ్చి గుమ్మందగ్గిరే నిలబడింది. ఆ తల్లి ఆ గీటుదాటి
రాకపోవడం జూచి, తాను ముందుకు రావడానికి భయపడి, లేని ఆగ్రహం నటిస్తూ
ఆ కపటి - “ ఔరా ! ఈ ముసలి సన్యాసిపై ఇంత తిరస్కారమా: నాలుగడుగులు

ముందుకు రాలేవా ? అభ్యాగతుణ్ణి దైవంలాగ పూజించాలని సాధ్వివి నీకు ఆ మాయావి తెలియదా ? నీ భిక్షం నీ దగ్గరే ఉంచుకో-నే వెళ్లొస్తా” నన్నాడు.
మాటలు విని, మనస్సు కలతపడి అమాయకురాలైన ఆ తల్లి తోందరగా విచ్చంతో ఆ రాక్షసుడి ముందు నిలబడగా,

చటుకున తన పది తలలతోడ
ఆ కుటిల రాక్షసుడు తో చె
వికటముగా పకపకమని నగి
తన వింశతిబాహులు చాచె
అది గని 'హా'యని గుండెలదర
సీతమ్మ నేలపై వ్రాలె

అప్పుడా లంకాధిపతి మూర్ఛపోయిన సీతాదేవిని భూమితోసహా పెల్లగించి ఆకాశమార్గాన్ని ఎత్తుకుని పారిపోయాడు. పాపం ! ఆ మహా సాధ్వి....




బ్రతుకు స్వప్నముకాదు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి. సుశీల

బ్రతుకు స్వప్నముకాదు పండుపున్నమికాదు
అంతులేని వసంతమస లెక్కడాలేదు.

ఈసెగల ఈ పొగల నీబ్రతుకు ముగిసెనే
నీ కలలు మాసెనే - అయ్యో -

ఈదీన పసికూన కేదారి చూపేవు
ఏరాతి మనసు నీ పాపకై కరుగునో

ఆమంటలంతలో ఆరిపోవునుగాని
నీ మనసులో మంట నిలిచి రగిలేను

తానెవరో నీవెవరో ఏనాటి బంధమో
దైవమే నీ గుండె దయతోడ నింపెనా!




తాధిమి తకధిమి తోల్బొమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: మాధవపెద్ది సత్యం 

లుళ లుళ లుళా.... ఆయీ.... ఆయి
తాధిమి తకధిమి తోల్ బొమ్మా
దీని తమాష చూడవె కీల్బోమ్మా

తాధిమి తకధిమి తోల్బొమ్మా
దీని తమాష చూడవె కీల్ బొమ్మా
దీని తమాష చూడవే మాయబొమ్మా
ఆటమ్మా పాటమ్మా జగ
మంతా బొమ్మాలాటమ్మా....
తలాంగు తకధిమి తోలొ బొమ్మా తోం
తకతై తకతై మాయబొమ్మా

లుళ లుళ లుళా.... ఆయీ... ఆయి
ఆయి - ఆయీ
ఆపదలు కాయీ.... ఆపదలు కాయీ....
ఆయి - ఆయీ
ఆపదలు కాయీ.....

తకతై - తకతై మాయబొమ్మా
నాలుగు దిక్కుల నడిమి సంతలో
తూలే తుళ్లే తోల్బొమ్మా
తూలే తుళ్లే కీల్బొమ్మా
ఎవరికెవ్వరో ఏమౌతారో
ఇవరము తెలుసా ? - కీల్ బొమ్మా
ఈ-ఇవరము తెలుసా ? - మాయబొమ్మా

తలాంగు తకధిమి తోల్ బొమ్మా - తోం
తకతై - తకతై - మాయబొమ్మా

కోపము తాపము క్రూర కర్మలూ
కూడని పనులే తోలొమ్మా
పాపపు రొంపిని పడబోకే పర
మాత్ముని నమ్మవె కీల్బొమ్మా
ఆటన్నా - పాటన్నా పర
మాత్ముని బొమ్మా లాటన్నా
ఆటన్నా - పాటన్నా.........





కన్నదేవకి వంతు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: 

కన్నదేవకి వంతు కన్నీరే కాని
కన్నార నీలీల కాంచలేదాయె, కృష్ణా....
ఏకొర నోములు - ఏవి నోచెనో
శన్నదేవకికి - కన్నీరాయె

నీ మురిపెములూ - నీ చిరుసొగసులు
పేద యశోదా - పెన్నిధులాయె
వ్రేపల్లియలో - వెలసిన కృష్ణా
వెన్నమీగడల చిన్నారికృష్ణా ! పొన్నారి కృష్ణా!
కృష్ణా ! గోవర్ధన గిరిధారీ కృష్ణా !
గోపీ హృదయ విహారీ కృష్ణా !
బృందావన సంచారీ కృష్ణా !
సుందర మురళీ ధారీ కృష్ణా !
అగణిత గుణ పరమాత్మా,
అగణిత గుణ పరమాత్మా, కృష్ణా !
జగముల వెలిగే స్వామి కృష్ణా, స్వామి కృష్ణా !
నీ లీలల మే మెరుగము, కృష్ణా !
నీలమోహనా ! బాలా కృష్ణా !
బాలా కృష్ణా ! బాలా కృష్ణా !



వెడలె ఈ రాజకుమారుడు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: ఎ.యం.రాజా, పి.సుశీల

వెడలె ఈ రాజకుమారుడు బంగారు తేరుపైన
రంగైన రాణితోడ వెడలె ఈ రాజకుమారుడు

మోజైన నాట్యాలాడ జైజై గీతాలు పాడ
బాజా బాకాల తోడ తాదీం తక తకతక తకతై
కస్తూరి రంగయ్య కావేటి రంగయ్య
ఎచటికి పయనము ఎరుగము వైనము
ఒయ్యారి భామాతోడ ఊరేగే రంగయ్య
ఒయ్యారి దేవీతోడ ఊరేగే రంగయ్య
కస్తూరి రంగయ్య కావేటి రంగయ్య
మాఊరికావల తామరపూవుల కోనేటికీవల
కొలువుండ పొయ్యేము రంగయ్య రంగయ్య
రావయ్య రంగయ్య కస్తూరి రంగయ్య

కోరమీసపు చిన్నావాడ
ఓరచూపుల పిల్లాతోడ
కులుకుతు బెళుకుతు జాతరకెళ్లేవ్ రయ్యో చిన్నోడ
నీవు గోటుగ నీటుగ జాతరకెళ్లేవ్ రయ్యో చిన్నోడ
ఓరయ్యో చిన్నోడు....
అయ్యో చిన్నోడ
ఓ లమ్మీ చిన్నమ్మీ !
గలగల మువ్వల సవ్వడితో తలలూ పుచు లేగల తో
అదే అదే ఆలమందా ఆ పుంతలోన
రెక్కలుసాచి చుక్కలదారి రివురివ్వున గూళ్లకు చేరే
అదే అదే పిట్టల బారు ఆకాశ వీధి....
ఆరేవు కాడ ఆతోపు నీడ
సన్ను సూసి సిన్నది నవ్వి ఊరు కున్నది
నన్ను చూసి చిన్నది నవ్వి ఊరు కున్నది

మిన్నేటి జాడ మేఘాల ఓడ
వెండి తెర చాపతో కొండ దాటి పోదువా
వెడలె ఈ రాజకుమారుడు బంగారు తేరుపైన
పొంగారు ఠీవి తోడ వెడలె మా రాజకుమారుడు



వెన్నెలపందిరిలోన పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: ఎ.యం.రాజా, పి.సుశీల

ఈ వెన్నెల.... మల్లి విరిపందిరిలోనా
చిరునవ్వుల హారతి శేఖరుతీనా
వెన్నెలపందిరిలోన - చిరునవ్వుల హారతులీనా
పండువెన్నెలా - మనసునిండా వెన్నెలా
కొండపైనా కోనపైనా కురిసేవెన్నెలా! విరిసేవెన్నెలా!
మబ్బులదారీ, ఓ బాటసారీ !
నీ ఒంటరి పయనముకాదా.
నీ జంటగ నీ సఖిలేదా.....
నాకై వేచే - నవ్వులు పూచే
నా చెలి కన్నులకాసే వెన్నెలా
పైనా వెన్నెలా - మనసులోనా వెన్నెలా
పైనాలోనా చందమామ పరచేవెన్నెలా! పాలా వెన్నెలా!
చల్లనిరేయి - మెలమెల్లని గాలి
అలనల్లన మమతలు మూగే
తియతీయని తలపులు రేగే
తీయని తలపులు తెచ్చేదెవరో
నాకై పరుగున వచ్చేదెవరో

పండువెన్నెలా - మనసునిండా వెన్నెలా
కొండపైనా కోనపైనా కురిసేవెన్నెలా ! విరిసేవెన్నెలా !





యౌవన మధువనిలో పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: ఎ.యం.రాజా, పి.సుశీల

ఉయ్యాల పాట

యౌవన మధువనిలో - వన్నెలపూవుల ఉయ్యాలా
ఉయ్యాల జంపాలా - ఉయ్యాల జంపాలా
జీవన మధువనిలో - పచ్చనితీగల ఊయాలా
ఉయ్యాల జంపాలా -
ఉయ్యాల జంపాలా
బ్రతుకే యెలమావితోట - మదిలో మకరందపుతేట
అడుగడుగున పూవులబాట అనిచాటే కోయిల పాట
ఉయ్యాల జంపాలా - ఉయ్యాల జంపాల
అలనల్లన నామదిలోనా - పలికేబంగారు వీణ
ఏమెత్తని అంగుళి ఆనీ - ఈ తీగెలు మీటెనొగానీ
ఉయ్యాల జంపాల - ఉయ్యాల జంపాల
పచ్చని మధువనిలో - వలపులు విచ్చిన ఊయాలా
పచ్చని మధువనిలో వలపులు....





ఘలుఘల్లున గజ్జెలుమోగ పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: 

బిచ్చగాళ్ల నాట్యం

ఘలుఘల్లున గజ్జెలుమోగ
తకతై తైతైతై ఆడవే

బులబుల్ జిల్లాలల్ ఆడవే
ఘలుఘల్లున గజ్జెలుమోగ ॥
వారే బుల్ బుల్!
చుక్కాలకోకగట్టి
అద్దాలారెయికా తొడిగి
కులుకుతూ నీవు ఆడ
రాలాలీ పైసా జోరుగ
రావాలీ పైసా జోరుగ
ఘలుఘల్లున గజ్జెలుమోగ
గలగలగల పైసా రాలునే




వెన్నెలవేళలు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి.సుశీల

వెన్నెలవేళలు పోయినా
ఏమున్నది నాకిక బ్రతుకునా
అనురాగ మెరుగలేని జగతిని
జీవితమంతా చీకటిరేయేనా
సుఖమంతా పోయెనా ॥
కలిమిలేనిదానా - ఏకులములేనిదీనా
అందరాని ఆచందమామకై
ఆశపడితినేలా బేలనై
జీవితమంతా చీకటిరేయేనా
సుఖమంతా పోయెనా

ఏరికొరకు ఈ వాకిట నిలబడి
ఎదురుచూచి వేచేనో
చేరి ఎవరునను “పాపా”యని ఇక
చెంతనిలిచి పిలిచేరో




కనుల కొకసారయిన కనబడని పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి.సుశీల

పాప పాట

కనుల కొకసారయిన కనబడని నాతల్లి
సెలవిమ్మ నీకన్న పాపకు
ఈ చోటికేనాడు ఇంక రాలేనమ్మా
ఒకసారి ఒడిలోన ఒరిగి సెలవడగనా
సెలవిమ్మ నీకన్నపాపకు -
కలలెన్నో బేలనై కనిమురిసినా నమ్మ
కడలేని వేదనే కడకు మిగిలేనమ్మా
కలనేని ఏనాడు కనరాని నాతల్లి
నీ పాప బ్రతుకింక నేలపాలేనా ?

Palli Balakrishna Tuesday, March 19, 2019




చిత్రం: సంతోషం (1955)
సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి
నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీదేవి, జమున, జగ్గయ్య, రాజసులోచన, రేలంగి
దర్శకత్వం: సి.పి. దీక్షిత్
నిర్మాత: ఎం. సోమసుందరం
విడుదల తేది: 24.12.1955



Songs List:



నవ్వవోయి రాజా పాట సాహిత్యం

 
చిత్రం: సంతోషం (1955)
సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి
సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల
గానం: పి. సుశీల

సరస డ్యాన్సుపాట !

నవ్వవోయి రాజా  రాజా !
నవయౌవ్వనము ఓ నాటి రాజా !
పకపకలాడే బతుకే సఫలమోయి రాజా !

విర పూసే పూవుల వోలె
విందులయే వెన్నెల వోలె
హోరు మనె నీరథి తేలె
తరగలపై నురుగుల వోలె
పకపకలాడే బతుకే సఫలమోయి రాజా!

ఏలరా యీతీరుగా కన్నీరుగా కూలగనేలా?
చిమ్మని యే చీకటి లోన
కమ్మని లే వెన్నెలలోన
సంబరము వాఠవోయు
అంబరాల తార వోలె
పకపకలాడే బతుకే సఫలమోయి రాజా !



నిలుపరా మదిలోన హరిని పాట సాహిత్యం

 
చిత్రం: సంతోషం (1955)
సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి
సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల
గానం: వెంకటేష్

సాకి !
రారా జీవా శ్రీహరి దరిచేరరా, వగ వీడరా
ఆలించి పాలించే లోక నాధుని శరణు వేడరా

పల్లవి:
నిలుపరా మదిలోన హరిని
నిరామయుని, దయాపరుని

చరణం: 
పిలచిన పలికేదేవుని మఠచీ దేవుళ్ళాడే వేరా..!
తరించేవురా మూఢజీవా వరదుని దాపుచేర....
ఓ జీవా వరదుని దాపుచేరా!
చీకటిలోన చిందులు మాని వెలుగు చూడనేరా...!

ఇహలోకపు బంధాలను తెంచే ఈశుడు ఈ ప్రభువేరా....!
మదిలోపలి వెతలు తీర, కోరికలు నెరవేర
ఏకాలానికి తరుణోపాయం రామనామ స్మరణేరా..



ఎటులా బ్రతికేనో పాట సాహిత్యం

 
చిత్రం: సంతోషం (1955)
సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి
సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల
గానం: ఘంటసాల

ఎటులా బ్రతికేనో - నేను
జాలే లేని భువిలోన

ధనముల తూగే శీలవిహునులు
దీనుల రాచీ, సిరిదోచీ - తమ
బానిస చేసీ మురిసేరే,
సిరిగల వారి సేవలకన్నా
నరకమే పేదకు సుఖమేమో....

దీనులపాలిటి దిక్కనుచు
దేవుని నమ్మి కొలిచాను
పస్తుపడి నా జీవితమె
పూజలకై వెలపోశాను

కాటిని కట్టెలు కొట్టాను
మూటల నెన్నో మోశాను
గుండియలు పగిలేలాగున - పెను
బండలు బద్దలు కొట్టాను
పస్తుపడి హరి పూజలకు
బతుకే వ్యర్థము చేశాను




యమునా వాటికి పాట సాహిత్యం

 
చిత్రం: సంతోషం (1955)
సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి
సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల
గానం: కె. రాణి

రాధ:
యమునా వాటికి నీటికి చన
ఏమోమో నను చేసెనే చెలీ....!
గోపాలుడు, బాలగోపాలుడు
గోపాలుడు, నందగోపాలుడు

గోపికలు:
యమునా వాటికి నీటికి చన
యేమేమీ నిను చేసెనే చెలీ....?
గోపాలుడు, బాలగోపాలుడు
గోపాలుడు, నందగోపాలుడు

రాధ:
వాటము చూసి, నా చెయి లాగేనే
పయ్యెద జారే, బానా తూగే
కన్నుల కసరుచు ''ఊఁ హుఁ” అంటే
నాదెస చూసి నవ్వెనె కొంటె

తొలగి పోరా, నాదారి, తుంటరి ఆంటినే

గోపికలు: కులుకులాడి గనినా వాడేల విడునే...
రాధ: గోపాలా! నీ వేషాలు నాతోకాదు సొమ్మంటే
గోపికలు:  కోణంగి గున్నడే నీమాట లెన్నడే....
రాధ: చిలిపి నవ్వుల నల్లనివాడు, నిలువరించేనా జడలాగే....

రాధ:
పిచికారి సించెనే చీరెచెరగు తడిపెనే
విజయమ్ము నీదెలే, నన్ను విడువ మంటినే.....
చెలికాడా? నీ వాడను కానా....? అని జాణా
చేరీ నన్ను గోమూ సేయ, మైమరచి పోయితిని
- నేనో చెలియా....

గోపికలు :
హెయ్ ! జీవితమె ధన్యమైపోయే చెలియా.....!



గాలివలెతేలి పాట సాహిత్యం

 
చిత్రం: సంతోషం (1955)
సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి
సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల
గానం: 

సరస:
గాలివలెతేలి విరిబాలవలె పోలి
ఈలీల పరుగేల ఓ బేలమనసా
తామె. దయచేయువారు, దయచూడలేర....
దరిచేర రార, తమీ వెలాగ
నయగారాలతో, నీదుకోరిక దీర
నిను మురిపించర? ఓరిమి వహించనే
దూరదేశాల చదివి చసుదేరు ఘనులే
కనలేద జాలి, చెలి విరాళీ
నిండు నెలరేనిలో మర్రి మాకుల నీడ  ఇక
మనియేములే పావురాల జోడుగా




రూపాయి కాసులోనే పాట సాహిత్యం

 
చిత్రం: సంతోషం (1955)
సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి
సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల
గానం: పి. సుశీల

రూపాయి కాసులోనే వున్నది తమాషా
ఈ పూట వున్నచోట, వుండదు హమే షా...
పాపిష్టి డబ్బులున్న బాధ చెప్పరాదు
బతుకులోన హాయిలేదు, లేదు, లేదు...

ఔనన్నా..! ఔనన్నా..! ఔనన్నా....!
ఔనన్నా... ఔనన్నా... ఔనన్నా..!

రూపాయలున్నవారి రూపు, చూపేవేరన్నా..
కోపాలు పెంతురన్న జాలి చూపలేరన్నా...
దోపిడివారి తీరన్నా.....
పైసావున్న భీతి, నీతి, పాపం బండినున్న
పస్తున్న పేదవారి బతుకే హాయన్నా....!

ఉండదు కంటికి నిద్దుర  రవంతయు
గుండియలోన నిండు - ఆశాంతియే....
స్థిరము కాని, గుణములేని డబ్బే వోజబ్బు, ఉబ్బొద్దు సిరులకు!

పైసావున్న భీతి, నీతి, పాపం బండి సున్నా...!
పస్తున్న పేదవారి బతుకే హాయన్నా .. |



ధనమూలముగా జగము పాట సాహిత్యం

 
చిత్రం: సంతోషం (1955)
సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి
సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల
గానం: ఘంటసాల, పిఠాపురం నాగేశ్వరరావు

సాకి :
ధనమూలముగా జగము, థనమే జయసాధనమురా...
థనమే నీ గౌరవము కొలిచే కొలమానమురా....
పైసా కలవాడే ధరలో పరబ్రహ్మరా...
థనములేని మానవుడు తోలు బొమ్మరా...

చరణం :
నీ పాకెట్ లో రూకుంటే పరువు నీదేరా
ఈలోకంలో నీకెదురు ఎవరు లేరురా...!

సాకి:
డబ్బులేనివాడు దుబ్బుకి కొరగాడురా భాయీ అబ్బాయి....
ఆ డబ్బే అన్ని జబ్బులకు అబ్బురమైన మందురా...

చరణం :
బంగారుగల గాడిదకే కలదు ఘరానా....
నిరుపేదెన రాజునకు లేదు ఠికానా....

సాకీ :
ఒకనాడు లైలా నాన్నతో అన్నాడు మజ్నూ జాలిగా....
వలచాను “మా‌‌వాఁ" నేను లైలాను మనసారగా
ఆమాట వినగానే లైలా నాన్నకు వచ్చింది ఏమిటి..?
చెప్పాడు కోపంగా మీసం దువ్వి..!

చరణం:
చేత కాసుంటే లైలాను పెళ్ళిచేసుకో
కాసు లేకుంటే ఆశమాని నోరుమూసుకో..!



తీయనీ ఈనాటి రేయి పాట సాహిత్యం

 
చిత్రం: సంతోషం (1955)
సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి
సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల
గానం: పి. సుశీల, వెంకటేష్

తీయనీ ఈనాటి రేయి హాయిని కొలిపేనే...
మాయని అందాలు చిందే మాధురి తెలిపేవే...!
వెన్నెలబయలా, వెలిగే నదిగో వన్నెలతారా భామా....!
కిలకల రాగాలేమో, ఆకులుకు నిగారాలేమో...!

అమృ: వలపించు చెలుని, కనినా చాన
పులకించు నా విధాన,

మూర్తి అండ్ అమ్ళు:
కదలించి విరుల, కౌగిలింత
పొదివేను చిరుగాలి

అమృతం : పూవులలోన తేనెలసోన
నవీన శోభ వరించె, ఆనందమావరించె....!
మూర్తి : లేమావినున్న కోయిల కన్నె
ప్రేమకథా వినుపించె
అమృకం : నా మనసు పాలించ రాజా..!
నా మాట ఆలించే...




చిన్నారి దానరా...! పాట సాహిత్యం

 
చిత్రం: సంతోషం (1955)
సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి
సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల
గానం: జిక్కీ 

చిన్నారి దానరా...! నిన్నేలు జాణరా...!
కన్నార చూడరా...

నాకన్న సుందరి లోకాన లేదురా
చేరనీయరా ఓ...బోగాల యేలికా..!

సరసాలకు ఇది సరివేళ రా
రారా తపోధన నన్నేలరా..
నీ వేసము, నా కోసమే.
నీ వాసించే బహ్మానందం

నేనే రాజా....!
రారా నా రాజా..!
చేకోరా రాజా....!



ఉన్నారున్నారు పాట సాహిత్యం

 
చిత్రం: సంతోషం (1955)
సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి
సాహిత్యం: Sr. సముద్రాల, Jr. సముద్రాల
గానం: జిక్కీ 

ఉన్నారున్నారు, నరులున్నారు..! . యీ లోకంలో . .
తరతరాలుగా, రకరకాలుగా తమదారీ, తీరే వేరుగా

పరువుకలుగు పేదవారు, గుణములేని గొప్పలవారు
కలిమి లేమీ, సుళ్లు తిరిగే వాగులో గరికల్లాగా

వాకిలి కాచీ, మెచ్చులు పలికే కాకా రాయలు కొందరు
వేషాల్ వేసి, లోకుల మోసం చేసేవారు కొందరు
పరపీడన కోసం వెంపరలాడే వీరులు, మపనీయులు

మాయామార్మం నేరని చినదానిని,
మంచిగ చేరదీసి, చేతిలో చేయివేసి,
ఆ మాటే మరిచావా ఎడబాటే మరిచావా
ఇటు జాలీమాలీ పంచన చేసే
ఈ సరి మగధీరులు

Palli Balakrishna Monday, March 4, 2019



చిత్రం: రేచుక్క (1955)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
నటీనటులు:  యన్. టి. రామారావు, అంజలీ దేవి
కథ: ఘంటసాల బలరామయ్య
దర్శకత్వం: పి.పుల్లయ్య
నిర్మాత: ఘంటసాల కృష్ణమూర్తి
విడుదల తేది: 25.03.1955



Songs List:



ఆ మనసేమో ఆ సొగసేమో పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: జిక్కీ (పి. జి. కృష్ణవేణి)

ఆ మనసేమో ఆ సొగసేమో 
ఆ మనసేమో 
గారామో అది మారామో 
ఆ తీరే...వేరేమో
మనసేమో సొగసేమో

లాలనగా రారా రమ్మని
లాలనగా రారా రమ్మని
మాలిమైన జవరాలిపైన
మాలిమైన జవరాలిపైన
జాలి లేదో...జాలి లేదో మరీ మరీ 
బ్రతి మాలించుకోవాలో
బ్రతిమాలించుకోవాలో

ఆ మనసేమో ఆ సొగసేమో 
గారామో అది మారామో 
ఆ తీరే...వేరేమో
మనసేమో సొగసేమో

నీరనితనమా నెరజాణ తనమా
నీరనితనమా నెరజాణ తనమా
సరసాల వేళలో చెరసాలె సుఖమేమో
సరసాల వేళలో చెరసాలె సుఖమేమో

మనసేమో ఆ సొగసేమో 
గారామో అది మారామో 
ఆ తీరే... వేరేమో
మనసేమో సొగసేమో




అయ్ సంబరమే పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: పి. లీల

అయ్ సంబరమే
అయ్ సంబరమే ఆయ్ పండగలే
చినదాన వన్నెదాన
నిను రమ్మనెనే ఇది నమ్మకమే
మనసైనవాడె ఆ రాణా

అయ్ సంబరమే

మరోసారి వాదులాడ
వేడుకైనదో ఏమో ఆ జాణకు
సరేకాని ఇంకోపాటా పాడించనా
దరిజేరి ఇంకో ఆట ఆడించనా

కంటికి బందం వేసి బలేపిల్ల గీర
కంటికి బందం వేసి బలేపిల్ల గీర
ఎటు మారిపోవునో ఏమో

అయ్ సంబరమే ఆయ్ పండగలే
చినదాన వన్నెదాన
నిను రమ్మనెనే ఇది నమ్మకమే
మనసైనవాడె ఆ రాణా
అయ్ సంబరమే

తనో అందగాడేలే చిందులాడి చిన్నదాని
ఒక చూపులోనే మెచ్చి తలక్రిందులాయెలే
తనో అందగాడేలే చిందులాడి చిన్నదాని
ఒక చూపులోనే మెచ్చి తలక్రిందులాయెలే

దారికి రానే రానీ దారికి రానే రానీ 
సరాగాల బాణి 
ఎటుమారిపోయెనా కానీ

అయ్ సంబరమే ఆయ్ పండగలే
చినదాన వన్నెదాన
నిను రమ్మనెనే ఇది నమ్మకమే
మనసైనవాడె ఆ రాణా
అయ్ సంబరమే




అయ్యో బంగారు సామి పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1955)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: మల్లాడి రామక్రిష్ణ శాస్త్రి 
గానం: పి.లీల 

అయ్యోవ్ బంగారు సామీ! 
ఓ రబ్బి బంగారు సామీ!
ఓరయ్యో బంగారు సామీ!
గువ్వలాటిదాన్ని - మల్లెపువ్వు లాటి చిన్నదాన్ని
రవ్వలేం జేసుకోనురో - రాయడా 
రవ్వలొదురా దొర నవ్వు నవ్వరా

ముంతమీద ముంతపెట్టి - రాజా
ముల్లెదీసి మూటగట్టి
ఉట్టిమీద దాచపెట్టి - ఇట్టే తొంగుండగానే
ముంగిలాంటి గండుపిల్లి మూట దాటిసెరో
మూటలో ఏం పోయె - చింతకాయ్ 

తంటాలమారి గువ్వ చేరువకు రాకపోతే
దొరికాయ్ తెన్ను కాయ్ - కాయ్ రాజా కాయ్ ! 
నీడచూసి జాడచూసి నీనీటే వాటమేసి
పట్టుకో - చెట్టబట్టుకో !

దప్పికంటే ఒప్పుకోకు – దూరంగా తప్పుకోకు
చిక్కురా రేచుక్కరా!
గువ్వ దక్కాలంటే - గూడుకట్ట మక్కువుంటే 
కాటమ రాయుడా కంటా కట్టెయ్యరో !




భలే భళా పరువమా పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1955)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: మల్లాడి రామక్రిష్ణ శాస్త్రి 
గానం: ఘంటసాల 

భలే భళా పరువమా
గడనూ పావురమా !
ఎగరాలీ సరదా తిరగ పావురమా 

మబ్బులకు సరాసరి ఎగరాలి హాంసలా
చిక్కాలి నీకూ చక్కని చుక్కలూ
ఆకసమంతా నిరాజ్యమే
ఓ పల్టి వేయించగ బల్ మొనగాడూ
మనకన్నా ఘనుడూ ఏనాడులేడు
బల్ గడుసరి లేడు 

ప్రతిపూటా పంతాలే రోజూ పందెములే
అయితేనేలే హాయీ - ఈ రవ్వలకు
కాలికి తోడా జోడించుకో
కనుచూపు మేరలు అందాలన్నీ చేదుకో
మనసైనా దినుసు ఏ జాడనైనా
అందిన మరీ బాగూ 



ఎక్కడిదీ అందం పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: జిక్కీ (పి. జి. కృష్ణవేణి)

ఎక్కడిదీ...
ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం
ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం
వెలిగే ఆనందం చెలరేగే ఆనందం
ఎక్కడిదీ ఆనందం

లోకంలో కన్నెలకూ లోపాలెన్నే చిన్నది
లోకంలో కన్నెలకూ లోపాలెన్నే చిన్నది
మారుని జవరాలికైనా వంకలు దిద్దే వన్నెది
మారుని జవరాలికైనా వంకలు దిద్దే వన్నెది

వెన్నెల దీపల్లె  మెరుపూతీవల్లె
వెన్నెల దీపల్లె  మెరుపూతీవల్లె
ఏడుమల్లె పూవులెత్తు
తూగే బంగారుపాప ఎవరో
ఏలేవేరెవరో కలలేలేవారెవరో

ఎన్నెన్నో ఊహలు కొసరే కోరికవేళ
ఎన్నెన్నో ఊహలు కొసరే కోరికవేళ
మేల్ మేల్ నెయ్యములు మిడిసే వేడుక వేళ
మేల్ మేల్ నెయ్యములు మిడిసే వేడుక వేళ

చిక్కని మక్కువల చక్కలి గింతలవేళ
చిక్కని మక్కువల చక్కలి గింతలవేళ
ఊహల ఉయ్యాలలో ఊగే బంగారు పాప ఎవరో

ఏలేవారెవరో  కలలేలేవారెవరో
ఏలేవారెవరో




ఎటు చూసినా బూటకాలే పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: పి. లీల

ఎటు చూసినా బూటకాలే
ఎవరాడినా నాటకాలే
ఎటు చూసినా బూటకాలే
ఎవరాడినా నాటకాలే
ఎటు చూసినా బూటకాలే

తలక్రిందుల మారి కలికాలంలో
చెడిపోలేనివారూ చేతకానివారే
తలక్రిందుల మారి కలికాలంలో
చెడిపోలేనివారూ చేతకానివారే
అంటుంది నానా నమ్మమంటుంది నానా
అంటుంది నానా

రూకల సంచీ రొండిన గ్రుచ్చితే
రొమ్ము విరుపొచ్చిందా మొనగాడా
కరుకుందా కాళ్ళకు కదనుందా
ఒరతీయని చురకత్తికి పదునుందా
మనలో కదనుందా పదునుందా

పాగా చుట్టావ్ పగడీ పెట్టావ్
వేషం కట్టావ్ మీసం మెలేశావ్ దొర కొడుకా
పాగా చుట్టావ్ పగడీ పెట్టావ్
వేషం కట్టావ్ మీసం మెలేశావ్ దొర కొడుకా

అడవుల్లో పులికి ఆకలేసి
నీ మీదికి ఒక దుముకు దుమికితే
నిలబడి కలబడతావా?
లాలించి లంచం పెడతావా హోయ్
నిలబడి కలబడతావా?
లాలించి లంచం పెడతావా

ఆ... లేక లేక ఓపిక చేసుకు
రాక రాక రానే వచ్చావ్ గాని ఏం లాభం
లేక లేక ఓపిక చేసుకు
రాక రాక రానే వచ్చావ్ గాని
ఆ... లేక లేక ఓపిక చేసుకు
రాక రాక రానే వచ్చావ్ గాని ఏం లాభం

మీ జగం కాదు ఈ యుగం వేరు తాతా
తరాల్ మారి సంబరాల్ మీరినయ్ తాతా
మీ జగం కాదు ఈ యుగం వేరు తాతా
తరాల్ మారి సంబరాల్ మీరినయ్ తాతా
ఓ తాతా

ఎటు చూసినా బూటకాలే
ఎవరాడినా నాటకాలే
ఎటు చూసినా బూటకాలే




నీ సరి నీవేనమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1955)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: మల్లాడి రామక్రిష్ణ శాస్త్రి 
గానం: పి.లీల 

నీ సరి నీవేనమ్మా వయారీ! 
పుట్టిననాడే భూమికి పండుగ
నువ్వు పుట్టిననాడే భూమి పండుగ 
చేపట్టేవారి జన్మ - పండుగ

చూపులతోనే లోకాలేలే సురతాణి అందాల రాణి!
చందమామ కన్న ఎంతో చక్కనీ దానవమ్మా !
చక్కని దానవమ్మా - చక్కానీ దానవమ్మ..
రవ్వల నవ్వుల పువుబోణి- మహా రాజుకు నీవే సంపదవమ్మ
పరువంలో గరువంలో మా కన్నెకులానికి దీవెనవమ్మా 





ఒంటరొంటరిగ పాట సాహిత్యం

 
చిత్రం: రేచుక్క (1954)
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల

ఒంటరొంటరిగ పోయెదానా
ఒకమాట వినిపో ఒకమాట వినిపొ
ఒంటరొంటరిగ పోయెదానా
ఒకమాట వినిపో ఒకమాట వినిపొ

ఆడేపాడే ఆడేపాడే ఈడున 
తోడుండాలి సైదోడుండాలి నానా ఓ నానా
అదిగదిగో చిట్టడవి అల్లదిగో నట్టడవి
సింహాలుంటాయ్ సివంగులుంటే
రేసులుంటాయ్ దోబూచులుంటాయ్
నాన్న రేసులుంటాయ్ దోబూచులుంటాయ్
ఉసుకోమంటే....ఉసుకోమంటే
ఉలిక్కిపడతావ్ నానా ఓ నానా

తేరతేరగా దొరికిందంటూ
దొర మనసూ దోచుకుపోతావ్
తేరగా దోచుకుపోతవ్

తేరతేరగా దొరికిందంటూ
దొర మనసూ దోచుకుపోతావ్
తేరగా దోచుకుపోతవ్ 

నిన్నంటే కన్నెత్తనంటావ్
పలుకరిస్తే పన్నెత్తనంటావ్
ఓ మైనా... ఈ పైన 
ఓ మైనా... ఈ పైన 
చీటికి మాటికి కోపాలైతే
చిరాకు పెడితే చిక్కున పడతావ్ 

నానా ఓ నానా
ఓ నానా ఓ నానా


Palli Balakrishna Sunday, March 3, 2019





చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
నటీనటులు: నాగేశ్వరరావు, సావిత్రి
దర్శకత్వం: పి. పుల్లయ్య
నిర్మాతలు: శాంతకుమారి, పి. పుల్లయ్య
విడుదల తేది: 26.01.1955



Songs List:



ఇంటికి దీపం ఇల్లాలే పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం:  ఆకుల నరసింహా రావు 

ఇంటికి దీపం ఇల్లాలే 






ఎక్కడమ్మా చంద్రుడూ? పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి)

ఎక్కడమ్మా చంద్రుడూ? 
ఎక్కడమ్మా చంద్రుడూ?
చక్కనైన చంద్రుడు
చుక్కలారా, అక్కలారా
నిక్కి నిక్కి చూతురేల 

ఎక్కడమ్మా చంద్రుడూ…?

చక్కనైన చంద్రుడు 
ఎక్కడమ్మా కానరాడు
మబ్బు వెనక దాగినాడో 
మనసులేక ఆగినాడో

ఎక్కడమ్మా చంద్రుడూ…?

పెరుగునాడు తరుగునాడు
ప్రేమ మారని సామి, నేడు
పదము పాడి బ్రతిమలాడి 
పలుకరించిన పలుకడేమి!

చక్కనైన చంద్రుడు 
ఎక్కడమ్మా కానరాడు
ఏలనో కానరాదు 
ఎక్కడమ్మా చంద్రుడు
చక్కనైన చంద్రుడు 
ఎక్కడమ్మా చంద్రుడూ..!



పెళ్లి ముహూర్తం కుదిరిందా పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: పి.లీల, జిక్కి, బృందం   

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా 
పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా 

భలే మొగుణ్ణి పట్టావు
భలే మొగుణ్ణి పట్టావు
ముసళ్ళ పండగ ముందేలే.. ఏ.. ఏ.. 
ముసళ్ళ పండగ ముందేలే
అసలు వడ్డీ యివ్వాల్లే
పిల్లా నీ పొగరణిగిందా

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా 

మహరాజింటి మనువంటె
మజాక అనుకున్నావంటే!
మహరాజింటి మనువంటె
మజాక అనుకున్నావంటే!

బంగరు నగలు రంగులరాళ్ళు
బంగరు నగలు రంగులరాళ్ళు
బారీ కోకలు పట్టు రైకలు
గంగిరెద్దులా సింగారించి
గాడిద బరువూ మోయాలోయ్‌ పిల్లా
గాడిద బరువూ మోయాలోయ్‌
పిల్లా నీ పొగరణిగిందా పొగరణిగిందా 

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా 
   
పెత్తన మొస్తుందనుకోకు
నెత్తికి కళ్ళు రానీకు
పెత్తన మొస్తుందనుకోకు
నెత్తికి కళ్ళు రానీకు
అత్తా మామా ఉన్నారూ
అత్తా మామా ఉన్నారూ
నీ సత్తా ఏమో చూస్తారు
పిల్లా నీ పొగరణిగిందా

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా 

పరదా లోపల మురగాలి 
తిరిగే కాలు నిలవాలి
పరదా లోపల మురగాలి 
తిరిగే కాలు నిలవాలి
పలుకూ తీరూ మారాలి
పలుకూ తీరూ మారాలి 
నీ తల బిరుసంతా తగ్గాలి 
పిల్లా నీ పొగరణిగిందా.. 

పెళ్లి ముహూర్తం కుదిరిందా
పిల్లా నీ పొగరణిగిందా 
పొగరణిగిందా పొగరణిగిందా  





ఏడ్చే వాళ్ళని ఏడ్వని పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: పి,లీల 

ఏడ్చే వాళ్ళని  ఏడ్వని



రాధను రమ్మన్నాడు పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం:  ఆకుల నరసింహా రావు 

రాధను రమ్మన్నాడు
రాసక్రీడకు మాధవదేవుడు
రాధను రమ్మన్నాడు
నల్లనివాడు అల్లరివాడు
నమ్మినవారికి చల్లనివాడు
ముల్లోకాలను పిల్లన గ్రోవితో
మురిపించే మోహనకృష్ణుడు

గోపాలుడు మా పాలిటి దేవుడు
రేపల్లెకు తానెపుడూ పాపడు
చల్లను తెచ్చే గొల్లపిల్లతో
సరసలాడుచు ఉన్నాడు
యమునా తటిలో ఉన్నాడు
ఇది అనువౌ సమయం అన్నాడు
యశోదమ్మకీ విషయాలేవీ
తెలుపవద్దనీ బ్రతిమాలాడూ



రాక రాక వచ్చావు పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి)

రాక రాక వచ్చావు చందమామ
లేక లేక నవ్వింది కలువ భామ

మబ్బులన్ని పోయినవి మధుమాసం వచ్చినది
మరులు కొన్న విరికన్నె విరియ బూసి మురిసింది

లేక లేక నవ్వింది కలువభామ

రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెతకినది
ఆకసాన నిను జూచి ఆనందం పొంగినది
ఆకసాన నిను జూచి ఆనందం పొంగినది

లేక లేక నవ్వింది కలువభామ

తీరని కోరికలే తీయని తేనియలై
తీరని కోరికలే తియ తీయని తేనియలై
వెన్నెల కన్నులలో వెల్లివిరిసి మెరిసినవి…
దొంగలాగ దూరాన తొంగి చూతువేల
రావోయి రాగమంత నీదోయి ఈ రేయి

రాక రాక వచ్చావు చందమామ
లేక లేక నవ్వింది కలువ భామ




వద్దురా కన్నయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి)

పల్లవి :
వద్దురా కన్నయ్యా వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇల్లు వదిలి పోవద్దురా అయ్యా...

చరణం: 1
పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ
పసిపాలను బూచి పట్టుకెళ్లే వేళ 

చరణం: 2
పట్టు పీతాంబరము మట్టిపడి మాసేనూ
పాలుగారే మోము గాలికే వాడేను
వద్దురా... వద్దురా కన్నయ్యా

చరణం: 3
గొల్లపిల్లలు చాలా అల్లరి వారురా
గోలచేసి నీపై కొండెములు చెప్పేరు
ఆడుకోవలెనన్న పాడుకోవలెనన్న
ఆడటను నేనున్న
అన్నిటను నీదాస

వద్దురా... వద్దురా... వద్దురా...
వద్దురా కన్నయ్యా... కన్నయ్యా




తరలిరావా పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: ఘంటసాల 

తరలిరావా




సిగ్గేస్తదోయ్ బావ సిగ్గేస్తదీ పాట సాహిత్యం

 
చిత్రం: అర్ధాంగి (1955)
సంగీతం: బి.నరసింహారావు    
సాహిత్యం: ఆత్రేయ  
గానం: పి.లీల

సిగ్గేస్తదోయ్ బావ సిగ్గేస్తదీ
మొగ్గలేను ఒగ్గలేను
మొగమెత్తి చూడలేను

పచ్చికా బయలులోన
మచ్చికగా మనముంటే
సిగ్గులేని చందమామ
చాటుగుండి చూస్తాడు

రెప్పలార్పకుండా 
నిన్నెప్పుడైనా చూస్తినా
టక్కులాడి చుక్కలన్ని
ఫక్కుమని నవ్వుతాయి

గుట్టుగా చెట్టుకింద
గుసగుసలు చెప్పుకుంటే
చెట్టుమీది పిట్టలన్ని
చెవులు నిక్కబెడతాయి

ఎందుకో అందరికి
ఇంత ఈసుమనమంటే
ఎవ్వరూ చూడలేని
ఏడకైన ఎళదాము


Palli Balakrishna Saturday, March 2, 2019

Most Recent

Default