చిత్రం: కన్యాశుల్కం (1955) సంగీతం: ఘంటసాల నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, షావుకారు జానకి దర్శకత్వం: పి.పుల్లయ్య నిర్మాత: డి.ఎల్.నారాయణ విడుదల తేది: 26.08.1955
Songs List:
సరసుడా దరి చేరరా పాట సాహిత్యం
చిత్రం: కన్యాశుల్కం (1955) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం గానం: పి.సుశీల సరసుడా దరి చేరరా
బొమ్మల పెళ్లి పాట సాహిత్యం
చిత్రం: కన్యాశుల్కం (1955) సంగీతం: ఘంటసాల సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: పద్మప్రియ బొమ్మల పెళ్లి
నాగుల చవితి పాట సాహిత్యం
చిత్రం: కన్యాశుల్కం (1955) సంగీతం: ఘంటసాల సాహిత్యం: బసవరాజు అప్పారావు గానం: ఎన్.ఎల్.గాన సరస్వతి నాగుల చవితి
చిటారు కొమ్మను పాట సాహిత్యం
చిత్రం: కన్యాశుల్కం (1955) సంగీతం: ఘంటసాల సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి గానం: ఘంటసాల పల్లవి: చిటారు కొమ్మను చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడ హోయ్ చిటారు కొమ్మను చరణం: 1 పక్కను మెలిగే చక్కని చుక్కకు చక్కిలిగింత లేదేం గురుడా కంచు మోతగా కనకం మోగదు నిదానించరా నరుడా వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడ హోయ్ చిటారు కొమ్మను చరణం: 2 పండంటి పిల్లకు పసుపు కుంకం నిండుకున్నవేం గురుడా దేవుడు చేసిన లోపాన్ని నీవు దిద్దుకురారా నరుడా కొద్దిగ హద్దు మీరరా నరుడా చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడ హోయ్ చిటారు కొమ్మను చరణం: 3 విధవలందరికి శుభకార్యాలు విధిగా చెయమంటావా గురుడ అవతారం నీదందుకోసమే..ఏ.. వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడ హోయ్ చిటారు కొమ్మను
ఆనందం అర్ణవమైతే పాట సాహిత్యం
చిత్రం: కన్యాశుల్కం (1955) సంగీతం: ఘంటసాల సాహిత్యం: శ్రీ శ్రీ గానం: పి.సుశీల పల్లవి: ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు తంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం. చరణం: 1 నీ కంకణ నిక్వాణం_లో, నా జీవన నిర్వాణం_లో నీ మదిలో డోలలు తూగీ, నా హృదిలో జ్వాలలు రేగీ నీ తలపున రేకులు పూస్తే, నా వలపున బాకులు దూస్తే మరణానికి ప్రాణం పోస్తాం, స్వర్గానికి నిచ్చెన వేస్తాం చరణం: 2 హసనానికి రాణివి నీవై వ్యసనానికి బానిస నేనై విషమించిన మదీయ ఖేదం కుసుమించిన త్వదీయ మోదం విషవాయువులై ప్రసరిస్తే, విరితేనియలై ప్రవహిస్తే ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం
పూర్ణమ్మ కథ పాట సాహిత్యం
చిత్రం: కన్యాశుల్కం (1955) సంగీతం: ఘంటసాల సాహిత్యం: గురజాడ అప్పారావు గానం: ఘంటసాల పూర్ణమ్మ కథ
ఇల్లు ఇల్లానీవు పాట సాహిత్యం
చిత్రం: కన్యాశుల్కం (1955) సంగీతం: ఘంటసాల సాహిత్యం: గురజాడ అప్పారావు గానం: ఎన్.ఎల్.గాన సరస్వతి ఇల్లు ఇల్లానీవు
కీచక వధ పాట సాహిత్యం
చిత్రం: కన్యాశుల్కం (1955) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: మాధవపెద్ది సత్యం, ఎన్.ఎల్.గాన సరస్వతి కీచక వధ
No comments
Post a Comment